Jump to content

వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు

వికీపీడియా నుండి

ఏదైనా పేజీని తొలగించాలని భావించినపుడు నిర్వాహకులు కూడా వికీపీడియా:తొలగింపు ప్రతిపాదన, వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు, వికీపీడియా:ఇతరత్రా తొలగింపు పేజీలను వాడాలి. దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఇవి వికీపీడియా:త్వరిత తొలగింపు పేజీలో ఉన్నాయి. ప్రతీ నిర్వాహకుడు వికీపీడియా:తొలగింపు విధానం చదివి అర్థం చేసుకోవాలి.

తొలగించాలనో లేదా వద్దనో నిర్ణయం తీసుకున్నాక, వికీపీడియా:తొలగింపు పద్ధతి లో వివరించినట్లు ఆ నిర్ణయాన్ని అక్షరబద్ధం చెయ్యండి.

తొలగించాలో లేదో నిర్ణయించడం

[మార్చు]
  1. స్థూల విస్తృతాభిప్రాయం (కింద చూడండి) ద్వారా విస్తృతాభిప్రాయాన్ని సాధించారా లేదా
  2. ఇంగితాన్ని వాడండి. ఇతర సభ్యుల అభిప్రాయాలు, వివేచనను గౌరవించండి.
  3. మీరు కూడా తొలగింపు చర్చలో పాల్గొన్న పేజీల విషయంలో చర్చను మీరు ముగించవద్దు. ఇతరులను చెయ్యనివ్వండి.
  4. సందేహంగా ఉంటే, తొలగించవద్దు.

స్థూల విస్తృతాభిప్రాయం

[మార్చు]

స్థూలంగా ఒక విస్తృతాభిప్రాయం ఏర్పడిందనే విషయం నిర్ధారించేందుకు నిర్వాహకులు తమ వివేచనను, నిష్పాక్షికతను ఉపయోగించాలి. ఉదాహరణకు, సదుద్దేశంతో రాసినట్లుగా అనిపించని అభిప్రాయాలను, వ్యాఖ్యలను నిర్వాహకులు పక్కన పెట్టవచ్చు. సాక్ పప్పెట్ల ద్వారా వ్యక్తపరచే అభిప్రాయాలు, అజ్ఞాత వ్యక్తుల అభిప్రాయాలు, ఈ పేజీలో మార్పుచేర్పులు చేసేందుకు మాత్రమే నమోదు చేసుకున్నట్లున్న ఖాతా ద్వారా చేసే మార్పులు ఈ కోవలోకి వస్తాయి. అసలీ తొలగింపు ప్రతిపాదనే దురాలోచనతో చేసారన్న విస్తృతాభిప్రాయం ఏర్పడితే పేజీని త్వరితంగా స్థాపించవచ్చు.

విస్తృతాభిప్రాయం తల లెక్కింపుపై ఆధారపడి నిర్ణయించేది కాదు, వాదనలోని పటుత్వాన్ని బట్టి, దానికి ఆధారభూతమైన విధానాన్ని బట్టి దాన్ని నిర్ణయించాలి. విధాన విరుద్ధంగా ఉన్న వాదనలు, వాస్తవాలపై కాక అభిప్రాయంపై ఆధారపడినవి, తార్కికంగా లేనివి అయిన వాదనలను పక్కన పెడతారు. ఉదాహరణకు, ఒక పేజీ యావత్తూ కాపీహక్కుల ఉల్లంఘనే అని ఎవరైనా గుర్తిస్తే, ఆ పేజీని తొలగిస్తారు. కానీ పేజీలో మూలాలు చూపించలేదనే వాదన తరువాత ఎవరైనా సభ్యుడు మూలాలను చేర్చారనుకోండి.. ఆపై సదరు వాదన సంబద్ధం కాబోదు.

వికీపీడియా సమాచారం నిర్ధారత్వం కలిగి ఉండాలి, మౌలిక పరిశోధన అయి ఉండరాదు, కాపీహక్కులను ఉల్లంఘించరాదు, తటస్థ దృక్కోణంతో ఉండాలి అనే వికీపీడియా విధానాల విషయంలో సర్దుబాట్లకు తావులేదు. ఏ ఇతర మార్గదర్శకాలు, సభ్యుల విస్తృతాభిప్రాయాలు కూడా వీటిని పూర్వపక్షం చేయజాలవు. ఏ వ్యాసమైనా విధానాన్ని అతిక్రమిస్తోందా అనే విషయాన్ని, అసలు విధానాన్ని అతిక్రమించకుండా ఆ విషయంపై వ్యాసం ఉండే వీలే లేని పక్షంలో, చర్చను ముగించే నిర్వాహకుడు వ్యక్తుల అభిప్రాయాల కంటే వ్యాసానికే ప్రాముఖ్యత ఇవ్వాలి.

పేజీలను తొలగించడం గురించి

[మార్చు]

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు, వికీపీడియా:ఇతరత్రా తొలగింపులు లో చేర్చిన పేజీలను పరిశీలించాక, ఓ పేజీని తొలగించాలా లేదా అనే విషయమై కొన్ని మార్గదర్శకాలను ఇక్కడ ఇస్తున్నాం.

  1. పేజీని తొలగించేటపుడు సంబంధిత చర్చా పేజీని, ఉప పేజీలను తొలగించవచ్చు, తొలగించకపోనూ వచ్చు. చర్చా పేజీని తొలగించని పక్షంలో తొలగింపు చర్చ యొక్క లింకును ఆ చర్చాపేజీలో పెట్టండి.
  2. ఓ పేజీని తొలగించినంత మాత్రాన, దాని చర్చాపేజీని (ఉప పేజీలను) ఆటోమాటిగ్గా తొలగించినట్లు కాదు. వీటిని కూడా తొలగించాలని మీరు భావిస్తే, ముందు వీటిని తొలగించి, తరువాత అసలు పేజీని తొలగించండి.
  3. తొలగింపు పద్ధతిని అనుసరించి చర్చను దాచడానికి మూసేసినట్లుగా గుర్తించండి.
  4. కాపీహక్కుల ఉల్లంఘన సందర్భంలో తొలగింపు విధానం కోసం, వికీపీడియా:కాపీహక్కులు చూడండి. మరింత విస్తృత దృక్కోణం కోసం m:Wikipedia and copyright issues, m:Avoid Copyright Paranoia లను చూడండి.
  5. "తొలగింపుకు కారణం" రాసేటపుడు, కిందివి చేర్చకుండా జాగ్రత్తపడండి:
    • కాపీహక్కులను ఉల్లంఘించే పాఠ్యం
    • వ్యక్తిగత సమాచారం, ఉదా..పాఠ్యం ఇది: '{{delete}} ఫలానావాడి దగ్గర గబ్బు కొడుతూ ఉంటుంది. వాడి ఫోను నంబరు (123) 456-7890
  6. తొలగింపును రద్దు చెయ్యడం ఎలాగో తెలియనపుడు, తొలగించకండి! వికీపీడియా:తొలగించిన పేజీలను చూడడం, పునస్థాపించడం, వికీపీడియా:తొలగింపు సమీక్ష లను చూడండి.
  7. తొలగించిన పేజీలకు ఉండే దారిమార్పులను తొలగించాలి, లేదా వేరే పేజీకి గురి మార్చాలి.
  8. ఫలానా పేరుతో వ్యాసం ఎప్పటికీ ఉండకూడదని మీరు భావిస్తే, దానికి ఉన్న అన్ని లింకులనూ తీసేసి, దాన్ని అనాథను చెయ్యండి.
  9. ఫలానా పేరుతో వ్యాసం తప్పక ఉండాలి, కానీ ఇప్పటి వ్యాసం పనికిమాలినదని మీరు భావిస్తే ఆ వ్యాసం పేరును వికీపీడియా:కోరిన వ్యాసాలు పేజీలో పెట్టండి.
  10. ఒక వ్యాసం పేరును తొలగించాలి, కానీ అందులోని కొంత పాఠ్యాన్ని మాత్రం వేరే వ్యాసంలో వాడదలచారు. అప్పుడు వ్యాసాన్ని ప్రస్తుతపు శీర్షిక నుండి మెరుగైన శీర్షికకు తరలించండి.
  11. వ్యాసాన్ని తొలగించరాదని నిర్ణయిస్తే, ఆ విషయాన్ని వ్యాసపు చర్చాపేజీలో రాస్తూ, తొలగింపు చర్చ యొక్క లింకును పెట్టండి.

వర్గం తొలగింపు

[మార్చు]

వర్గాన్ని తొలగించాలో లేదో నిర్ణయించేటపుడూ పాటించవలసిన మార్గదర్శకాలు:

  1. సదరు వర్గానికి సరైన ట్యాగు తగిలించి వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు పేజీలో చేర్చారని నిర్ధారించుకోండి.
  2. తొలగింపు పద్ధతి ననుసరించి చర్చను ముగించి, భద్రపరచండి.
  3. తొలగింపును రద్దు చెయ్యడం ఎలాగో తెలిస్తే తప్ప వర్గాలను తొలగించవద్దు! వికీపీడియా:తొలగించిన పేజీలను చూడడం, పునస్థాపించడం, వికీపీడియా:తొలగింపు సమీక్ష చూడండి.
  4. వర్గాని అనుబంధంగా చర్చాపేజీ ఉంటే, ముందు దాన్ని తొలగించండి. వర్గం పేరు మారుస్తుంటే, చర్చాపేజీని కొత్త పేజీ చర్చాపేజీకి తరలించి, దారిమార్పును తొలగించండి. మెలికెల స్దారిమార్పులు లేకుండా చూసుకోండి.
  5. విలీనం, పేరుమార్పులు చేస్తూ ఉంటే, వర్గాన్ని తొలగించే ముందు, "ఇక్కడికి లింకున్న పేజీలు" ఓసారి చూడండి. వ్యాసలు, సంబంధిత చర్చాపేజీలు కొత్త వర్గానికి గురి పెట్టేలా చూడండి.
  6. వ్యాసాలూ, ఉప వర్గాలను తరలించాక, వర్గాన్ని తొలగించండి.
  7. కొన్నిసార్లు వర్గాన్ని దారిమార్పుగా మార్చి ఉంచమని అభ్యర్ధన చేసి ఉండవచ్చు. మామూలు దారిమార్పులు వర్గాల విషయంలో పనిచెయ్యవు. దాని బదులు {{వర్గదారిమార్పు}} ను వాడండి.
  8. వర్గాన్ని తొలగించేముందు, విలీనం చేసే ముందు ఇక్కడికి లింకున్న పేజీలు తప్పక చూడండి. వ్యాసాలు, వర్గ విహరిణులు మొదలైన చోట్ల ఉన్న వర్గ లింకులను కొత్త వర్గానికి మార్చండి.

వర్గాల పేరు మార్చడం ఎలా

[మార్చు]

ఐదంగల్లో:

  1. ప్రస్తుతపు వర్గం పేజీలోని పాఠ్యాన్ని కాపీ చేసుకోండి. (చర్చ కొరకు వర్గం కాకుండా)
  2. దీన్ని కొత్త వర్గం పేజీలోక అతికించండి.
  3. చర్చాపేజీ ఉంటే దాన్ని తరలించండి. (దారిమార్పును తొలగించండి)
  4. Template:category redirect సహాయంతో ప్రస్తుత వర్గాన్ని మార్చండి. ఇది ఉపవర్గాలను, వ్యాసాలను కొత్త వర్గం లోకి తరలిస్తుంది. (వర్గంలో వ్యాసాలు పెద్దగా లేకుంటే స్వయంగా మీరే తరలించండి.)
  5. వర్గం ఖాళీగా ఉంటే, తొలగింపు సారాంశంలో వర్గ చర్చను ఉదహరిస్తూ, వర్గం పేజీని తొలగించండి.

కష్టమేం కాదుగానీ కాస్త సమయం పడుతుంది. వర్గం తొలగింపు మరింత కష్టం.. ఎందుకంటే ఒక్కో పేజీని సదరు వర్గం నుండి మనమే తొలగించాలి. (లేదా Pearle లేదా Whobot లాంటి బాట్ ల సహాయం తీసుకోవాలి)

కూర్పు తొలగింపు

[మార్చు]

నిర్వాహకులు వ్యాసపు కొన్ని కూర్పులను మాత్రమే తొలగించవచ్చు కూడా. మిగిలిన కూర్పులు అలాగే ఉంటాయి. దీనివల్ల తొలగించిన కూర్పులు పేజీ చరితంలో కనబడవు గానీ, నిర్వాహకులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సాంకేతికంగా ఇది, వ్యాసం మొత్తాన్ని తొలగించి, కొన్ని కూర్పుల తొలగింపును మాతరం రద్దుపరచినట్లు. (దీనితో కొన్ని నష్టాలున్నాయి. మరింత మెరుగైన పరిష్కారం కోసం వికీపీడియా:ప్రత్యేకించిన తొలగింపు చూడండి).

GFDL అంశాల కారణంగా ప్రత్యేకించిన తొలగింపును కొన్ని తీవ్రమైన సందర్భాలలోనే వాడాలి. కొన్ని కూర్పుల్లోనే జరిగిన కాపీహక్కుల ఉల్లంఘన, వ్యక్తులను ఉదహరించిన కూర్పుల విషయంలోను ఈ పద్ధతిని అనుసరించాలి..

తొలగించిన పేజీలను సంరక్షించడం

[మార్చు]

తొలగించిన పేజీలను విధానానికి వ్యతిరేకంగా పదే పదే సృష్టించడాన్ని నివారించేందుకు, ఆ పేజీని సంరక్షించవచ్చు. దీన్ని తాళం వెయ్యడం అని అంటారు. దీన్ని ఇలా చెయ్యవచ్చు:

  • మరో వ్యాసానికి దారిమార్పుగా చేసి దాన్ని సంరక్షించడం; లేదా
  • వ్యాసాన్ని క్యాస్కేడింగు సంరక్షణ ఉన్న మరో పేజీలోకి ట్రాన్స్క్లూడు చెయ్యడం.

ఇవి కూడా చూడండి

[మార్చు]