వికీపీడియా:ప్రైవేటు బడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రోత్ ప్రాజెక్టుకూ ఈ ప్రైవేటు బడికీ తేడా ఏమిటి?[మార్చు]

గ్రోత్ ప్రాజెక్టులో కూడా ప్రశ్నలడిగే సౌకర్యం ఉంది కదా.., మరి దీనికి దానికీ తేడా ఏమిటి? __NewChaduvari1 (చర్చ) 04:58, 20 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఔను, గ్రోత్ ప్రాజెక్టులో కూడా ప్రశ్నలడిగే సౌకర్యం ఉంది. దానికీ దీనికీ తేడా ఏంటంటే..
  1. గ్రోత్ ప్రాజెక్టు ఇప్పుడే వాడుకరిగా నమోదై, ఇంకా ఒక్క దిద్దుబాటు కూడా చెయ్యనివారి కోసం. ఇక్కడ దిద్దుబాటుకు సంబంధించిన ప్రశ్నలు కొత్తవారు, అనుభవజ్ఞులు.. ఎవరైనా అడగవచ్చు.
  2. గ్రోత్ ప్రాజెక్టులో అడిగే ప్రశ్నలు సాధారణంగా ప్రాథమిక స్థాయిలో ఉంటాయి. ఇక్కడి ప్రశ్నలు ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకూ ఏ స్థాయికి చెందినవైనా ఉండవచ్చు
  3. గ్రోత్ ప్రాజెక్టులో అడిగే ప్రశ్నలు ఇద్దరి మధ్య సాగే సంభాషణ లాంటిది (అది గోప్యమైనదేమీ కాదు, అందరికీ కనిపిస్తుంది. కానీ అందులో మామూలుగా వేరెవరూ కలగజేసుకోరు). ఇక్కడి ప్రశ్నలు సమాధానాల్లో ఎవరైనా రాయవచ్చు.
  4. గ్రోత్ ప్రాజెక్టు ద్వారా వాడుకరుల సంభాషణ (గురు శిష్యుల సంభాషణ) కొంత కాలానికే పరిమితంగా ఉంటుంది. కొన్నాళ్ళపాటు జరిగి ఆగిపోతుంది. ఇక్కడ నిరంతరంగా ప్రశ్నలు సమాధానాలు వస్తూంటాయి
__ చదువరి (చర్చరచనలు) 05:09, 20 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సహాయ కేంద్రానికీ ఈ ప్రైవేటు బడికీ తేడా ఏమిటి?[మార్చు]

వికీపీడియా:సహాయ కేంద్రంలో కూడా సందేహాలడిగే సౌకర్యం ఉంది కదా.. దీనికీ దానికీ తేడా ఏమిటి? __NewChaduvari1 (చర్చ) 05:15, 20 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వికీపీడియా:సహాయ కేంద్రంలో వికీపీడియాను వాడుకోవడం, ఇక్కడ రచనలు చేయడం - ఈ రెంటి గురించీ ప్రశ్నలు అడగవచ్చు, అడుగుతూంటారు. ప్రైవేటు బడిలో మాత్రం దిద్దుబాట్లకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలి. ఇప్పుడిప్పుడే వికీలో దిద్దుబాట్లు చేస్తూ అనేక సందేహాలు ఎదుర్కొంటున్న వారికి, సహాయం చెయ్యడం ఈ పేజీ ఉద్దేశం. వారికి సహాయం కేంద్రం, అయోమయంగా ఉండక పోవచ్చేమో గానీ, కొంత గజిబిజిగా ఉండే అవకాశం మాత్రం ఉంది. ఇక్కడ వేరే సందేహాలు అడగరు కాబట్టి, ఇతర ప్రశ్నలు కూడా సంబంధించినవే ఉంటాయి కాబట్టీ ప్రైవేటు బడి కొత్త వాడుకరులకు మరింత వీలుగా ఉంటుంది. వారి సౌకర్యం కోసమే ఈ బడి. __ చదువరి (చర్చరచనలు) 05:22, 20 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అనువదించే వ్యాసాలకు ఇంకొంత విషయాన్ని జోడించవచ్చా?[మార్చు]

నేను ప్లగారిజం అను వ్యాసాన్ని ఆంగ్లం నుండి అనువదిస్తున్నాను. అనువదించే వ్యాసాలకు ఇంకొంత విషయాన్ని జోడించవచ్చా? --VJS (చర్చ) 06:45, 22 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వాడుకరి:Vjsuseela గారూ, ఆంగ్ల వికీ నుంచి అనువాదమే కాదు. విజ్ఞానభరితమైన సమాచారాన్ని సరైన మూలాలు చూపించి మీ స్వంతంగా కూడా వ్యాసంలో రాయవచ్చు. అనువాద వ్యాసాలకు కూడా అలా చేయవచ్చు. రవిచంద్ర (చర్చ) 07:11, 22 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు రవిచంద్ర గారు. --VJS (చర్చ) 11:10, 22 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]