వికీపీడియా:మీకు తెలుసా? భండారము/పాత విశేషాలు 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2012 లో ప్రచురితమైన వాక్యాలు[మార్చు]

 • భారతదేశంలో రెండవదిగా మరియు, ఆంధ్ర ప్రదేశ్‌ లో మొట్టమొదటిదిగా ప్రారంభమైన పంచాయతీ మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్‌నగర్ లేదా ఫరూక్ నగర్ అనీ! ఇది దేశంలోనే రెండవ పంచాయతీ సమితి. (మొదటి సమితిని రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించారు).
 • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవుదినాల కేలండర్ మరియు భారతదేశ ప్రభుత్వ సెలవు దినాల కేలండర్ చూడండి.
 • జాతీయ సేవా పథకం 1969లో ప్రారంభం అయిందని..
 • తెలుగునాట ప్రఖ్యాతి చెందిన పద్యనాటకాలలో చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన గయోపాఖ్యానం నాటకం ఒకటి.
 • కదులుతున్న కారు నుండి ఎగిరిదిగటం ఎలా, మృత సముద్రంలో మనం ఎందుకు మునిగిపోలేము లాంటి ఆసక్తిగల విషయాలున్న పుస్తకం నిత్యజీవితంలో భౌతికశాస్త్రం
 • స్వస్తిక్ అంటే శుభం జరగటం. విశేష సమయాల్లో స్వస్తిక్‌ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం వుంది.
 • జాస్తి చలమేశ్వర్ ఆంధ్రప్రదేశ్ నుండి భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు న్యాయముర్తిగా నియంచబడ్డారు.
 • కేంద్రకామ్లాలు జన్యు పదార్థాలుగా వ్యవహరించే జీవ రసాయనాలు. వీనిలో డి.ఎన్.ఎ. మరియు ఆర్.ఎన్.ఎ. లు ముఖ్యమైనది.
 • ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకం లోనిది.
 • ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు జయదేవ్ ప్రకారం ఫ్రాన్స్ లోని లాస్కూ గుహల్లో ఆదిమానవులు గుహల గోడల మీద వేలకొలది వ్యంగ్య చిత్రాలు చిత్రించారు.
 • మానవుని శరీరంలో శారీరకంగా మానసికంగా అత్యధిక వేగంగా అనేక మార్పులు సంభవించే ఈ కాలాన్ని టీనేజ్ అంటారు. చూడండి యవ్వనం
 • శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు (CSIR, 1942) అనునది 39 పరొశోధనాశాలలు, 50 క్షేత్ర స్థానాలు మరియు విస్తరణా కేంద్రాలతో కూడిన భారతదేశపు అతిపెద్ద పరిశోధన సంస్థ.
 • తల్లి సౌభాగ్యాన్ని మరియు పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసే వేడుక సీమంతం.
 • ఇందిరా పార్క్, హైదరాబాదులోని చక్కటి ఉద్యానవనాలలో ఒకటి.
 • తంగి సత్యనారాయణ (1931 - 2009) సుప్రసిద్ధ శాసనసభ్యుడు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు.
 • ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా నివసించడం అని అర్ధం.
 • గంధమహోత్సవం అనగా గంధపుచెక్కల నుండి తయారుచేసిన గంధపు లేపన్నాన్ని పంచే ఉత్సవం.
 • రక్తపుగడ్డ అనగా రక్తము ఒక అవయవములో గాని లేదా ఒక ప్రాంతములో గాని గూడుకట్టుకొనుట.
 • నీలగిరి కొండలలో పెరిగే నీలగిరి లేదా యూకలిప్టస్ చెట్టు నుంచి లభించే ఔషధ తైలాన్ని నీలగిరి తైలం అంటారు.
 • ఖతి అనేది భాష యొక్క రాత రూపాన్ని నిర్మించే విధానం.
 • ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రహదారి ప్రమాదాలను నివారించే రహదారి నియమాలు పాటించండి.
 • భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ భారతీయ కళలు మరియు సంస్కృతులను పరిరక్షించడానికి నిరంతరం శ్రమిస్తున్నదని.
 • విశ్వనాథ్ సూరి ప్రముఖ తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు మరియు రాజకీయనేత.
 • సచిన్ టెండుల్కర్ (కుడి పక్క చిత్రంలో) 2012, మార్చి 16న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో (వన్డేలు, టెస్టులు కలిపి) ఎవరూ సాధించని 100వ సెంచరీతో కొత్తరికార్డు సృష్టించాడు.
 • మార్క్ ఎలియట్ జూకర్ బర్గ్ ప్రపంచప్రసిద్ధిగాంచిన సోషల్ నెట్వర్కింగ్ జాలస్థలమైన ఫేస్‌బుక్ సృష్టికర్త.
 • ప్రసిద్ధిచెందిన త్ర్యంబక మహా మంత్రం అవసాన సమయాల్లొ జపిస్తే పరమశివుడు రక్షిస్తాడని నమ్మకం.
 • శారదా లిపిని క్రీ.శ. 8వ శతాబ్దంలో సంస్కృత, కాశ్మీరీ భాషలు వ్రాయడానికి ఉపయోగించేవారు.
 • శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 24 గంటలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారంచేసే ఒక టెలివిజన్ ఛానల్.
 • శరత్ చంద్ర చటోపాధ్యాయ్ తెలుగు పాఠకులకు సుపరిచుతులైన ఇరవయ్యవ శతాబ్ధపు ప్రముఖ బెంగాలీ నవలా మరియు కథా రచయిత.
 • పుష్కరిణి లేక కోనేరు అనేది దేవాలయ అవసరముల నిమిత్తము ఏర్పరచుకున్న దిగుడు బావి.
 • గుజరాత్ రాష్ట్రంలో పఠాన్ జిల్లాలో ఉన్న బిందుసరోవం మాతృగయగా పిలువబడుతుంది. భారతదేశంలో హిందూ ధర్మం అనుసరించి తల్లికి శ్రాద్దకర్మలు నిర్వహించే ఏకైక క్షేత్రమిదే.
 • పుట్టగొడుగుల పెంపకం - ఒక ఆహారసంబంధమైన కుటీర పరిశ్రమ.
 • బృందావన్ గార్డెన్స్ కర్నాటక రాష్ట్రంలో మైసూరు పట్టణానికి దగ్గరలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఉద్యానవనం.
 • న్యూట్రాన్ తార సూపర్నోవా పేలుళ్ళ తర్వాత మిగిలిన అవశేష తారలు.
 • అంతర్జాలంలోగల తెలుగు నిఘంటువులలో ప్రముఖమైనది ఆంధ్రభారతి.
 • పొన్న చెట్టు రూపంలో తయారు చేయబడిన పొన్నమాను వాహనంపై శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహంను ఉంచి జరుపుకునే ఉత్సవాన్ని పొన్నమాను సేవ అంటారు.
 • నూనెగింజల నుండి నూనెను తీయు పరిశ్రమలవారు మొదట నూనెగింజలను సేకరించునప్పుడు తమ పరిశ్రమలో వున్న క్వాలిటి కంట్రోల్ లాబోరెటరిలో సేకరించు విత్తనాల నమూనాలనునూనె గింజలను పరీక్షించు పద్ధతులు వాడి దాని ఫలితాలపై కొనుగోలు చేస్తారు.
 • అగ్ని భద్రత అనేది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు చేయగల అగ్నిప్రమాదాలు ఏర్పడగల సంభావ్యతని తగ్గీంచడం లేదా పూర్తిగా నివారించడం కోసం, ఏదేని భవనం అనియంత్రిత అగ్ని ప్రమాదకాలంలో ఉన్నపుడూ అందలి వ్యక్తులను హెచ్చరించడానికీ, కాపాడడానికీ, ప్రాణ నష్ట తీవ్రతని తగ్గించడానికీ సంబంధించినది.
 • తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి.
 • వికీపీడియాలో వుపయోగించే ఉపకరణం (Gadget) హాట్‌కేట్. దీనిని ఉపయోగించి వర్గీకరణలో మార్పులను సునాయాసంగా చేయవచ్చు.
 • ఆవశ్యక నూనెలు అనేవి మొక్కల నుండి, చెట్లనుండి ఉత్పత్తిచేయు కొవ్వుఆమ్లాలు లేని నూనెలు.
 • వికీపీడియాలో తెలుగు టైపు తెలియని వారు కూడా చేయగలిగే శుద్ధి పనులున్నాయి
 • భారతదేశంలోని అత్యంత సంపన్న దేవాలయం తిరువనంత పురంలోని అనంత పద్మ నాభ స్వామి వారి దేవాలయం
 • భారతీయ రూపాయి చిహ్నము రూపొందించింది ఐఐటి, ముంబై కి చెందిన డి.ఉదయ్ కుమార్ .
 • శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ల పేరుతో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానముగా ప్రసిద్ది చెందినది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో ఉన్నది.- ‌వ్యాసం ప్రారంభించినవారు :YVSREDDY
 • ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర చరిత్ర-సంస్కృతి రూపొందిస్తున్నఆంధ్ర ప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 1976 లో స్వచ్ఛందసంస్థగా నమోదయ్యింది. -వ్యాసం ప్రారంభించినవారు:Arjunaraoc
 • బిద్రీ కళ అనేది ఒక లోహ కళ. ఇది నల్లని వస్తువులపై బంగారు, వెండి తీగల అల్లిక ద్వారా చేసే కళ.- ‌వ్యాసం ప్రారంభించినవారు :విశ్వనాధ్.బి.కె.
 • రాజేష్ ఖన్నా 163 చిత్రాలలో నటించాడు .- ‌వ్యాసం ప్రారంభించినవారు :Veera.sj
 • స్టుడియో అనేది ఒక చిత్రకారుడు లేదా అతని వద్దనుండే ఉద్యోగులు పనిచేసుకొనే గది.

- ‌వ్యాసం ప్రారంభించినవారు :Rajasekhar1961

- ‌వ్యాసం ప్రారంభించినవారు :Nrahamathulla

 • గ్రీకు పురాణం ప్రకారం హెరాకిల్స్ (లేదా హెర్క్యులెస్) సాహసాల్లో సాటిలేని వీరుడు. ఇతడు హెరాకిల్స్ దేవలోకానికి అధిపతి అయిన జూస్ కు, మానవ స్త్రీ అయిన అల్కమెనెకు జన్మించాడు. ఇతడు పన్నెండు అత్యంత కష్టతరమైన సాహసాలను ఛేదించిన ధీరుడు.- ‌వ్యాసం ప్రారంభించినవారు:Redaloes
 • విద్యుత్తు ప్రవహిస్తున్నపుడు విద్యుత్ ప్రవహిస్తున్న యానకంను శరీరం తగిలి ఆ శరీరం గుండా విద్యుత్ ప్రవహించినపుడు శరీరానికి కలిగే ఘాతంను విద్యుద్ఘాతము అంటారు. విద్యుద్ఘాతంను ఆంగ్లంలో ఎలక్ట్రిక్ షాక్ అంటారు. విద్యుద్ఘాతము యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విద్యుత్ ఘాతంను తట్టుకోలేని జీవులకు మరణం సైతం సంభవిస్తుంది. మానవుని శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించినపుడు విద్యుత్ ప్రవహిస్తున్న మానవుడు దిగ్భ్రాంతికి లోనవుతాడు, విద్యుత్ ప్రవాహం యొక్క తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు గాయాలపాలవుతాడు. వ్యాసం ప్రారంభించినవారు: YVSREDDY
 • జాషువా రచించిన పారశీక కవి పిరదౌసి యొక్క యధార్ధజీవిత, వ్యధార్ధ వెతల కథ ఫిరదౌసి కావ్యం ఆంధ్ర విశ్వ కళాశాల గ్రంధ నిర్ణాయక సభ వారిచే 1940 వరకు ఇంటర్మీడియట్ విద్యార్ధులకు పాఠ్యాంశంగా నిర్ణయింపబడినది. -వ్యాసం ప్రారంభించినవారు: Palagiri
 • ప్రతి పేకముక్క నలుపు రంగు వైపున 365 చుక్కలు ఉంటాయి. ఈ చుక్కలు సంవత్సరానికి ఉండే 365 రోజులను గుర్తు చేస్తాయి. - వ్యాసాన్ని ప్రారంభించినవారు: YVSREDDY
 • తెలుగు మరియు కన్నడ భాషల్లో నవలలు వ్రాయడంలో సుప్రసిద్ధుడైన సూర్యదేవర రామమోహనరావు,1985 నుండి సుమారు 95 నవలలు వ్రాశాడు . - వ్యాస విషయకర్త: Redaloes
 • పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. -వ్యాస విషయకర్త:YVSREDDY
 • మురారిరావుగా పేరొందిన మురారిరావు ఘోర్పాడే మరాఠా సర్దారు, సందూరు సంస్థానపు రాజు, గుత్తి దుర్గాధిపతి. 18వ శతాబ్దపు దక్కన్ చరిత్రలో ప్రముఖ చారిత్రక వ్యక్తి. - వ్యాస విషయకర్త: వైజాసత్య
 • శ్రీకాకుళానికి చెందిన శ్రీ వేదుల ప్రభాకర శ్రీనివాస్ 'మిమిక్రీ శ్రీనివాస్' గా సుపరిచితులు. మిమిక్రీ, వెంట్రిలాక్విజం ప్రదర్శనలలో తనదైన గుర్తింపును స్వంతం చేసుకున్నాడు. - వ్యాస విషయకర్త: Kvr.lohith
 • శ్రీకాకుళానికి చెందిన శ్రీ లోకనాథం నందికేశ్వరరావు గారు ప్రముఖ మిమిక్రీ మరియు వెంట్రిలాక్విజం కళాకారుడు. ఈయన మిమిక్రీ శ్రీనివాస్ యొక్క గురువు గారు. - వ్యాస విషయకర్త: Kvr.lohith
 • కవిశ్రీ ఆకురాతి గోపాలకృష్ణ ప్రఖ్యాత రచయిత, హేతువాది.1931 లో అమ్మనబ్రోలు లో ఆకురాతి వెంకటకృష్ణయ్య, రత్నమ్మలకు జన్మించారు. పొదలకూరు, రేవూరు, కోవూరు, ఏ.యస్.పేట, కలిగిరి లలో ఉద్యోగబాధ్యతలు నిర్వహించారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో తెలుగు పద్యములను వ్రాసిన గొప్ప రచయిత. ఈయన పద్యములు సమాజంలో గల సమస్యలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి.... - వ్యాస విషయకర్త: Nrahamthulla
 • దాశరథి కృష్ణమాచార్య చేసిన తెలుగు అనువాదం గాలిబ్ గీతాలు మిర్జా అసదుల్లాఖాన్ యొక్క గాలిబ్ ఉర్దూ గజళ్లకు మొట్టమొదటి తెలుగు అనువాద పుస్తకము. - వ్యాస విషయకర్త: Palagiri
 • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినాలు-2013, భారతదేశ ప్రభుత్వ సెలవు దినాలు-2013, - వ్యాస విషయకర్త: అర్జున

2012 లో మీకు తెలుసా లో ప్రచురితమైన చిత్రాలు[మార్చు]


2011[మార్చు]

 • ... వేపనూనెగింజనుండినూనెను తీయుదురు.యిదిశాకతైలం(vegetable oil).వంటనూనెకాదు.పారీశ్రామికంగా వినియోగిస్తారు.(వేపనూనె వ్యాసం)
 • ... హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ పుస్తకం విడుదలైన మొదటి రోజునే తొమ్మిది మిలియన్ల ప్రతులు అమ్ముడైందనీ! (హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ వ్యాసం)
 • ... వైర్‌లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్ ద్వారామొబైల్ ఫోన్లలో మరియు పీడిఏ లలో వెబ్ ను సందర్శించవచ్చుననీ! (వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్ వ్యాసం)
 • ... నోబెల్ పతకాన్నిముందుగా 18 క్యారట్ల బంగారంతో తయారు చేసి దానికి 23 క్యారట్ల బంగారంతో పూత వేస్తారనీ! (బంగారు పతకం వ్యాసం)
 • ...లలిత్ మోడీ అమెరికాలో డ్యూక్ విశ్వవిద్యాలయంలో చదివేటపుడు మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడ్డాడనీ!( లలిత్ మోడీ వ్యాసం)
 • ...అమెరికా అధ్యక్ష భవనం నిర్వహణకు ఏటా సుమారు 600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందనీ!(శ్వేత సౌధం వ్యాసం)
 • ... వెబ్ ఛాట్ అనగా అంతర్జాలంలో ఒకరు ఇంకొక సమూహంతో పాల్గొనే చర్చావేదిక. ఈ సౌలభ్యాన్ని గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాంటి వివిధ అంతర్జాల స్థలాలు, సాంప్రదాయక ఇంటర్నెట్ రిలే ఛాట్ నడుపువారుఅందచేస్తున్నారు (వెబ్ ఛాట్ వ్యాసం)

2010 అంతకు ముందు[మార్చు]

మే 20 2010 నుంచి మే 19 2010 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
 • ... ఆది మానవులు గుండు సూదులను జంతువుల ఎముకలతో తయారు చేసుకునే వారనీ! (గుండుసూది వ్యాసం )
 • ... 2006 లో జరిపిన ఒక సర్వే ప్రకారం ప్రపంచం మొత్తం మీద సుమారు 125 మిలియన్ల కవలలు నివసిస్తున్నారనీ! ( కవలలు వ్యాసం)
 • ... హైదరాబాద్ లో ప్రతి యేటా జరిగే పుస్తక ప్రదర్శన మొదటి సారిగా అశోక్ నగర్ లోని సిటీ కేంద్ర గ్రంథాలయంలో జరిగిందనీ! (హైదరాబాదు పుస్తక ప్రదర్శన వ్యాసం)
 • ...హిందూ మతం, బౌద్ధ మతం, జైనమతం, సిక్కుమతం భారతదేశంలోనే ఉద్భవించాయనీ! ( భారతదేశ సంస్కృతివ్యాసం)
 • ... ఇంటర్నెట్ ను మొదట్లో ARPANET (అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్‌వర్క్) అని వ్యవహరించే వారనీ! (ఇంటర్నెట్ చరిత్రవ్యాసం)
మార్చి 16 2010 నుంచి మే 19 2010 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
 • ... ప్రముఖ యువ సినీనటుడు రాజా సినిమాల్లోకి రాకముందు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ లో పనిచేశాడనీ! ( రాజా వ్యాసం)
 • ... పెన్సిల్ పంచభుజి, అష్టభుజి రూపాల్లోనే ఉంటుందనీ! ( పెన్సిల్ వ్యాసం)
 • ... ప్రపంచంలో మొత్తం చీమలను కలిపితే వాటి బరువు, మనుషుల బరువు కన్నా ఎక్కువ ఉంటుందనీ! ( చీమ వ్యాసం )
 • ... క్రీ.పూ 1000 సంవత్సరం నుంచి భారతదేశంలో నాణేలు చెలామణిలో ఉన్నాయనీ! ( నాణెం వ్యాసం)
 • ... రెండు రాగి నాణెముల మధ్య ఒక నిజమైన రుద్రాక్షనుంచితే అది సవ్య దిశలో తిరుగుతుందనీ! ( రుద్రాక్ష వ్యాసం)
డిసెంబర్ 21 2009 నుంచి మార్చి 15 2010 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
 • ... జాతక కథలు బుద్ధుని పూర్వ జన్మల గురించిన కథల సమాహారమనీ! (జాతక కథలు వ్యాసం)
 • .. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ చిన్న వయసులేనే సంగీతంలో అనుపమాన ప్రతిభ కనబరిచాడనీ! ( బాలమేధావి వ్యాసం)
 • ... నాయనార్లు అనగా తమిళనాడులో నివసించిన గొప్ప శివభక్తులనీ! (నాయనార్లు వ్యాసం)
 • ... కలరిపయట్టు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన యుద్ధక్రీడ గా అభివర్ణించబడుతుందనీ! (కలరిపయట్టు వ్యాసం)
 • ... సగటు భారతీయుల్లో దాదాపు సగం మందికిపైగా టీ సేవిస్తున్నారనీ! (తేనీరు వ్యాసం)
సెప్టెంబర్ 3, 2009 నుంచి డిసెంబర్ 21 2009 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
 • ... ప్రాచీన భారతీయ రాజు పురుషోత్తముడు ప్రపంచ విజేతయైన అలెగ్జాండర్ నే మెప్పించాడనీ! (అలెగ్జాండర్ వ్యాసం)
 • ... విజయవాడ పట్టణములో గల ఇంద్రకీలాద్రి పర్వతముపై అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడనీ! (ఇంద్రకీలాద్రి పర్వతం వ్యాసం)
 • ... అటకామా ఎడారి ప్రాంతంలో వర్షపాతం దాదాపు శూన్యమనీ! (అటకామా ఎడారి వ్యాసం)
 • ... చీమలు కందిరీగల నుంచి పుట్టుకొచ్చాయనీ! (చీమ వ్యాసం)
 • ... సబితా ఇంద్రారెడ్డి భారతదేశంలోనే హోంశాఖా మంత్రియైన తొలి మహిళ అనీ! (సబితా ఇంద్రారెడ్డి వ్యాసం)
జూన్ 17, 2009 నుంచి సెప్టెంబర్ 3 2009 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
 • ... ఫ్రెడరిక్ బాంటింగ్ ఇన్సులిన్ సహ ఆవిష్కర్తలలో ఒకరనీ! (ఫ్రెడరిక్ బాంటింగ్ వ్యాసం)
 • ... ఏథెన్స్ నగరాన్ని ప్రజాస్వామ్యానికి పుట్టిన స్థలంగా భావిస్తారనీ! ( ఏథెన్స్ వ్యాసం )
 • ... మార్టిన్ లూథర్ కింగ్ అతి పిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన వాడిగా ఖ్యాతి గాంచాడనీ! (మార్టిన్ లూథర్ కింగ్ వ్యాసం)
 • ... ఆస్వాల్డ్ కూల్డ్రే ను ఆధునిక ఆంధ్ర చిత్రకారులకు ఆది గురువుగా భావిస్తారనీ! ( ఆస్వాల్డ్ కూల్డ్రే వ్యాసం)
 • ... ప్రముఖ తమిళ కథానాయకుడు విక్రమ్ పరమకుడి గ్రామం నుంచి నాలుగో జాతీయ ఉత్తమ నటుడనీ! (విక్రమ్ వ్యాసం)
ఏప్రిల్ 21, 2009 నుంచి జూన్ 17 2009 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
 • ... హొగెనక్కల్ జలపాతాన్ని భారతీయ నయాగరా జలపాతంగా భావిస్తారనీ! ( (కుడివైపున బొమ్మ చూపబడినది) )
 • ... అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు యూరీ గగారిన్ అనీ! ( యూరీ గగారిన్ వ్యాసం )
 • ... డా. సి. నారాయణ రెడ్డి రచించిన విశ్వంభర అనే కావ్యానికి 1988లో భారతదేశంలో సాహిత్య అత్యున్నత పురస్కారం, జ్ఞానపీఠ్ అవార్డు బహుకరించబడినదనీ! ( విశ్వంభర వ్యాసం )
 • ... రమణ మహర్షి తన మౌనం ద్వారా సందేశాన్ని పొందలేని వారికి మత్రమే బోధనల ద్వారా ఉపదేశించేవాడనీ! ( రమణ మహర్షి వ్యాసం )
 • ... ఇటీవల పరమపదించిన హాస్యనటుడు నగేష్ ను దక్షిణాది చార్లీ చాప్లిన్ గా అభివర్ణిస్తారనీ! ( నగేష్ వ్యాసం )


మార్చి 6, 2009 నుంచి ఏప్రిల్ 21 2009 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
 • ... యూరప్ కు చెందిన ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో ఎత్తైన పర్వత శిఖరం మాంట్ బ్లాంక్ అనీ! (ఆల్ఫ్స్ పర్వతాలు వ్యాసం) (కుడివైపున బొమ్మ చూపబడినది)
 • ... షాంఘై నగరం చైనాలో అతిపెద్ద నగరమనీ! ( షాంఘై వ్యాసం )
 • ... సూయజ్ కాలువ యూరప్ మరియు ఆసియా ఖండాల మధ్య జల రవాణా కొరకు ఆఫ్రికా ఖండాన్ని మొత్తం చుట్టిరాకుండా దగ్గర మార్గంగా 1869 లో ఏర్పాటు చేయబడిందనీ! ( సూయజ్ కాలువ వ్యాసం )
 • ... అత్యంత ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజు 2008 సంవత్సరానికి గాను భారతీయ రచయిత అరవింద్ అడిగ ఎన్నికయ్యాడనీ! ( బుకర్ బహుమతి వ్యాసం )
 • ... మహాకావ్యం కిరాతార్జునీయం ను రచించినది భారవి అనీ! ( భారవి వ్యాసం )
ఫిబ్రవరి 5, 2009 నుంచి మార్చి 6 2009 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
 • ... దాదాపు శరీరం మొత్తం సహకరించకపోయినా భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అనీ! (కుడివైపున బొమ్మ చూపబడినది)
 • ... సిమెంటు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నదనీ! (సిమెంటు వ్యాసం)
 • ... ప్రపంచంలో మొట్టమొదటి ఉపగ్రహం పేరు స్పుత్నిక్ అనీ! (స్పుత్నిక్ వ్యాసం )
 • ... తెలుగు సాహితీ ప్రపంచంలో దిగంబర కవులు గా ప్రసిద్ధిగాంచిన ఆరుగురిలో వీరవెల్లి రాఘవాచార్య ఒకరనీ! ( జ్వాలాముఖి వ్యాసం)
 • ... 2007 లో అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ షిండ్లర్స్ లిస్ట్ చిత్రాన్ని సినీ చరిత్రలో అత్యున్నత 100 చిత్రాలో ఎనిమిదవ చిత్రంగా ఎన్నుకున్నదనీ ( షిండ్లర్స్ లిస్ట్ వ్యాసం )
జనవరి 5, 2009 నుంచి ఫిబ్రవరి 4 2009 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
 • ... ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో సోమనాథ్ మొదటిది అనీ! (సోమనాథ్ వ్యాసం)(కుడివైపున బొమ్మ చూపబడినది)
 • ... ప్రహ్లాదుని తండ్రి మరియు రాక్షస రాజైన హిరణ్యకశిపుడు శాపగ్రస్తుడైన వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయుల్లో ఒకడనీ! ( హిరణ్యకశిపుడు వ్యాసం)
 • ... తమిళ సాహిత్యానికి మకుటంలా భావించే తిరుక్కురల్ ను రచించింది తిరువళ్ళువర్ అనీ! (తిరువళ్ళువర్ వ్యాసం)
 • ... గడ్డం రాంరెడ్డిని భారత దేశంలో దూర విద్యా పితామహునిగా భావిస్తారనీ! (గడ్డం రాంరెడ్డి వ్యాసం)
 • ... మొఘల్ ఎ అజం అనే సినిమా నిర్మాణానికి తొమ్మిదేళ్ళు పట్టిందని. (మొఘల్ ఎ అజం వ్యాసం)
 • ... కిరణ జన్య సంయోగ క్రియ అనగా జీవరాశుల మనుగడకు నిత్యావసరమైన పిండిపదార్థం తయారయ్యే ఒక కీలకమైన ప్రక్రియ అనీ! (కిరణజన్య సంయోగక్రియ వ్యాసం)
డిసెంబర్ 3, 2008 నుంచి జనవరి 5 2009 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
 • ... ఇరాన్ రాజధానియైన టెహరాన్ మద్య ప్రాచ్యంలో అత్యంత పెద్దదైన మరియు అత్యధిక జనాభా గల నగరమనీ! (టెహరాన్ వ్యాసం)(కుడివైపున బొమ్మ చూపబడినది)
 • ... తమిళనాడులోని కోయంబత్తూర్ దక్షిణ భారత మాంచెస్టర్ గా పిలవబడుతుందనీ! (కోయంబత్తూర్ వ్యాసం)
 • ... భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ మోటారును తయారు చేసింది గోపాలస్వామి దొరస్వామి నాయుడు అనీ! (గోపాలస్వామి దొరస్వామి నాయుడు వ్యాసం)
 • ... పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 175 ఏళ్ళ తర్వాత సజీవ సమాధి చెందాడనీ! (బ్రహ్మంగారి కాలజ్ఞానం వ్యాసం).
 • ... పాశ్చరైజేషన్ అనగా ద్రవాలను వేడి చేసి బాక్టీరియా, ప్రోటోజోవా, శిలీంద్రాలు మొదలైన్ వ్యాధికారక క్రిములను నిర్మూలించే ఒక ప్రక్రియ అనీ! ( పాశ్చరైజేషన్ వ్యాసం)
నవంబర్ 7, 2008 నుంచి డిసెంబర్ 3 2008 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
 • ... ఐన్‌స్టీన్ మెదడును పరిశోధనల నిమిత్తం ప్రయోగ శాలలో భద్రపరచారనీ! (ఐన్‌స్టీన్ వ్యాసం)
 • ... జ్యోతి నృత్యం అనేది కర్నూలు జిల్లాలో చేనేత కులాలు వారు ప్రముఖంగా జరుపుకునే ఉత్సవం అనీ! (జ్యోతి నృత్యము వ్యాసం)
 • ... బెల్జియం దేశం యూరోపియన్ యూనియన్ వ్యవస్థాపక దేశం అనీ! (బెల్జియం వ్యాసం)
 • ... శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ అనేది కళలు, విజ్ఞానం, సాహిత్యం, వైద్యం, పత్రికలు, మరియు ఇతర మేధోకృషులను గుర్తించి ఆయా రంగాలలో ఉన్నత సాధన జరిపినవారిని సన్మానించడానికి వెలకొల్పబడిన ఒక సంస్థ అనీ! (శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వ్యాసం)
 • ... ప్రతి రెండు సంవత్సరాలకొకసారి వరల్డ్ సోలార్ చాలెంజ్ పేరుతో ఆస్ట్రేలియా లో సూర్యరశ్మితో నడిచే కార్ల రేస్ నిర్వహించబడుతుందనీ! (సౌర విద్యుత్తు వ్యాసం)
 • ... ఇప్పటిదాకా వ్యోమగాములు 382 కిలోల చంద్ర శిలల్ని భూమి మీదకు తీసుకువచ్చారనీ! (చంద్రుడు వ్యాసం)
అక్టోబర్ 2, 2008 నుంచి నవంబర్ 6 2008 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
సెప్టెంబర్ 17, 2008 నుంచి అక్టోబర్ 2 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
 • ... కేరళ రాష్ట్రపు సంప్రదాయిక నృత్యమైన కథాకళి లో కళాకారులు కథను కేవలం సంజ్ఞల ద్వారా మాత్రమే ప్రదర్శిస్తారు అనీ! (కథాకళి వ్యాసం)(కుడివైపున బొమ్మ చూపబడినది)
 • ... భారతదేశములో దేవభాషగా పేరుపొందిన భాష సంస్కృత భాష అనీ! (సంస్కృతం వ్యాసం)
 • ... బీహార్ దు:ఖదాయినీగా పేరుగాంచిన నది కోసి నదీ అనీ! (కోసీ నది వ్యాసం)
 • ... అంతర్జాతీయ వన్డే క్రికెట్ పోటీలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని అనీ! (మహేంద్రసింగ్ ధోని వ్యాసం)
 • ... దీర్ఘకాలంలో ఒక వ్యక్తి దృష్ట్యా ప్రయోజనకరమైన పొదుపు మొత్తం ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా శ్రేయస్కరం కాదు అనీ! (పొదుపు వ్యాసం)
 • ... సిరివెన్నెల పాటలకు వేణుగాన సహకారం అందించిన ప్రముఖ విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా అనీ! (సిరివెన్నెల వ్యాసం)
 • ... కలరా వ్యాధి కారకమైన విబ్రియో కలరాను తొలిసారిగా గుర్తించినది రాబర్ట్ కోచ్ అనీ! (రాబర్ట్ కోచ్ వ్యాసం)
ఆగష్టు 15, 2008 నుంచి సెప్టెంబర్ 16 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
జూలై 13, 2008 నుంచి ఆగష్టు 15 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
Kuppam assembly constituency.png
జూన్ 29, 2008 నుంచి జూలై 13 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
Maneksa Leadership cover.gif
జూన్ 22, 2008 నుంచి జూన్ 29 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
నాగభైరవ కోటేశ్వరరావు
జూన్ 8, 2008 నుంచి జూన్ 22 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
ఇండియా గేట్
జూన్ 1, 2008 నుంచి జూన్ 8 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
బౌద్ధ స్తూపాలు
మే 25, 2008 నుంచి జూన్ 1 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు: