వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2016

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2016 సంవత్సరంలో వివిధ వారాలలో "మీకు తెలుసా!" వాక్యాలు

01 • 02 • 03 • 04 • 05 • 06 • 07 • 08 • 09 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 • 18 • 19 • 20 • 21 • 22 • 23 • 24 • 25 • 26
27 • 28 • 29 • 30 • 31 • 32 • 33 • 34 • 35 • 36 • 37 • 38 • 39 • 40 • 41 • 42 • 43 • 44 • 45 • 46 • 47 • 48 • 49 • 50 • 51 • 52

01 వ వారం[మార్చు]

Raja Ravi Varma, Vasanthasena (Oleographic print).jpg
 • ...తెలుగులో "వసంతసేన" పేరుతో నిర్మించిన సినిమా మృచ్ఛకటికమ్‌ అనే సంస్కృత నాటక ఆధారమనీ!(చిత్రంలో "వసంతసేన")
 • ...బెంగాలీలోనికి అనువదింపబడిన తొలి తెలుగు చిత్రం "పాండవ వనవాసం" నకు డబ్బింగ్ చేసిన వారు పి.సాంబశివరావు అనీ!
 • ...నాలుగు దశాబ్దాలపాటు సినిమా పోస్టర్ రూపకల్పనలో అద్భుతాలు సృష్టించిన డిజైనర్ ఈశ్వర్ అనీ!
 • ...ప్రతిఫలాన్ని ఆశించకుండా సంగీతాన్ని విద్యార్థులకు చేరవేయుట కొరకు సారణి సంగీతవిద్యాసంస్థ నడుపుతున్న సంగీతకారుడు నల్లాన్ చక్రవర్తుల పార్థసారథి అనీ!
 • ... 323 బంతుల్లో 1,009 పరుగులు చేసి రికార్డ్ సృష్టించిన ముంబై క్రికెట్ క్రీడాకారుడు ప్రణవ్ ధనవాడే అనీ!

02 వ వారం[మార్చు]

SriPada Sri vallabha.jpg
 • ...శ్రీపాద శ్రీ వల్లభ కురుపురం లో తన జీవితంలో చాలా కాలం బస చెసారనీ!(చిత్రంలో శ్రీపాద వల్లభ)
 • ...గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన మొదటి సినిమా "అదృష్టదీపుడు" లో కథానాయకుడు రామశర్మ అనీ!
 • ...సింహాచల క్షేత్రంలోని ప్రధాన అర్చామూర్తియైన వరాహలక్ష్మీనారసింహస్వామి నిజరూప విగ్రహం త్రిభంగ భంగిమలోనే ఉంటుందనీ!
 • ...పోస్టర్ డిసైనింగ్ విజ్ఞాన సర్వస్వం గా పేరుపొందిన ఈశ్వర్ రచించిన పుస్తకం సినిమా పోస్టర్ అనీ!
 • ...సూర్యుడు ప్రత్యక్ష దైవమని నమ్మి సూర్యశతకము ను రచించిన ప్రఖ్యాత సంస్కృత వాజ్మయ కవి మయూరుడు అనీ!

03 వ వారం[మార్చు]

Gita Press, Gorakhpur.gif
 • ...మనదేశంలో ఆధ్యాత్మిక ప్రచురణ రంగంలో అగ్రగామి సంస్థ గీతా ప్రెస్ అనీ!
 • ...తెలుగులో ఆలిండియా రేడియోలో మొట్టమొదటి వ్యాఖ్యానకర్త రేడియో తాతయ్య అనీ!
 • ...సూర్యుని వల్ల వచ్చిన వరం అయిన శమంతకమణి కారణంగానే సత్రాజిత్తు మరణించాడనీ!
 • ...కేశనాళిక ఫీడ్ ఫౌంటెన్ పెన్ యొక్క ఆవిష్కర్త లూయిస్ ఎడ్సన్ వాటర్‌మన్ అనీ!
 • ... నెహ్రూ "నా మీద కూడా నువ్వు కార్టూన్లు ప్రతీ సంచికలోను గీసి నా లోపాలను ఎత్తి చూపాలి సుమా" అని శంకర్ పిళ్ళై ని కోరారనీ!

04 వ వారం[మార్చు]

Gombak Selangor Batu-Caves-01.jpg

05 వ వారం[మార్చు]

Yamini Krishnamurthy.JPG
 • ..."ఏ ప్యాషన్‌ ఫర్‌ డాన్స్‌" పేరిట ఆత్మకథను వ్రాసింది ప్రముఖ నాట్యకళాకారిణి యామినీ కృష్ణమూర్తి అనీ!(చిత్రంలో)
 • ...ఆలిండియా రేడియోలో ప్రసారం కాబడిన "కార్మికుల కార్యక్రమం" లో "చిన్నక్క" గా సుప్రసిద్ధులు వి.రతన్ ప్రసాద్ అనీ!
 • ...రాజకీయాలకూ, సామాజికులకూ చురుక్కుమనిపించే విధంగా గీతోపదేశం చేసిన కార్టూనిస్టు గీతా సుబ్బారావు అనీ!
 • ...రాసిన తొలినవల "ఏది పాపం?" నకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయిత చివుకుల పురుషోత్తం అని!
 • ...భారత్-పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగిన బీకర పోరులో అమరుడైన సైనికుడు సంతోష్ మహాదిక్ అనీ!

06 వ వారం[మార్చు]

Sri Lakshmi Narayana Swamy Temple at Avanigadda.jpg

07 వ వారం[మార్చు]

Vyzarsu balasubrahmanyam.png
 • ..."భైరవి సంగీత అకాడమీ" అనే సంస్థను స్థాపించి అనేక మందికి సంగీత జ్ఞానాన్ని అందుస్తున్న ప్రముఖ సంగీతకారుడు వైజర్స్‌ బాలసుబ్రహ్మణ్యం అనీ! (చిత్రంలో)
 • ...ఇస్రో వారు రూపొందించిన 29వ దృవియ ఉపగ్రహ ప్రయోగనౌక పిఎస్‌ఎల్‌వి-సీ27 అనీ!
 • ...తన గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం 57 సంవత్సరాల పాటు శ్రమించి 7 కొండలను తవ్వి 40 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని నిర్మించిన గురువు రాజారాం బాప్కర్ అనీ!
 • ...ప్రపంచంలో పూర్తిగా (100%) చందన తైలంతో తయారుచేయడిన ఏకైక సబ్బు మైసూరు సాండల్ సబ్బు అనీ!
 • ...హైదరాబాదులోని "లాల్ బహదూర్ స్టేడియం"(ఫతే మైదాన్)ను నిర్మించింది సేఠ్ రామ్‌గోపాల్‌జీ మలానీ అనీ!

08 వ వారం[మార్చు]

09 వ వారం[మార్చు]

Zika EM CDC 280116.tiff

10 వ వారం[మార్చు]

Edgar Mitchell cropped.jpg
 • ...చంద్ర గ్రహంపై అడుగుపెట్టిన ఆరో వ్యక్తి ఎడ్గర్ మిచెల్ అనీ!
 • ...'నో, ప్రైమ్‌ మినిస్టర్‌' పేరుతో మన్మోహన్‌సింగ్‌పై వేసిన కార్టూన్లన్నింటినీ ఒక పుస్తక రూపంలో ప్రచురించిన ప్రసిద్ధ కార్టూనిస్టు సుధీర్‌ తైలంగ్‌ అనీ!
 • ...వాల్మీకి మహర్షి చేత రచింపబడిన ఒక గ్రంథము యోగ వాశిష్టం అనీ!
 • ...భారత అత్యున్నత పురస్కారం అశోకచక్ర పొందిన తొలి భారతీయ మహిళ నీరజా భానోట్ అనీ!
 • ... స్నేహ శాంతుల కోసం అత్యున్నత సేవలనందించిన భారతీయులకు ప్రదానం చేయబడుతున్న పురస్కారం సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు అనీ!

11 వ వారం[మార్చు]

Channapatna-toys.jpg
 • ... స్కూల్ బవాస్ మియాన్ ని చెన్నపట్న బొమ్మల పితామహునిగా భావిస్తారనీ!
 • ...13 గంటలపాటు నిర్విరామంగా ప్రసంగించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్న రచయిత ననుమాస స్వామి అనీ!
 • ...కాళ్లనే చేతులుగా మలచుకుని అక్షర సేద్యం చేస్తున్న వికలాంగ కవయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి అనీ!
 • ...మూడువందల సం.ల క్రితం తాళపత్రాలపై రాసిన రామానుజాచార్యుల జీవిత చరిత్రను పుస్తక రూపంలోనికి తెచ్చిన రచయిత్రి వింజమూరి రాగసుధ అనీ!
 • ...మూత్రపిండాలరాళ్ళలో 80% కాల్సియం ఆక్సాలేట్ ఉంటుందనీ!

12 వ వారం[మార్చు]

Nature Bazar presents Dastkar Design Fair 2015.png
 • ... మొఘలుల సామ్రాజ్య కాలంలో చందేరి వస్త్రం వ్యాపారము శిఖరాలు అందుకున్నదనీ!
 • ...ప్రపంచంలోనే ఎక్కువ వాడే ప్రాస్ధెటిక్ ఫుట్‌గా పేరు పొందినది జైపూర్ కాలు అనీ!
 • ...భారతదేశంలోనే మేకప్, కాస్ట్యూమ్స్ అంశాలపై పి.హె.డి చేసిన మొదటి వ్యక్తి హరిశ్చంద్ర రాయల అనీ!
 • ...ప్యారిస్ లోని అసోసియేట్ ఆఫ్ ద గ్రాండ్ సాలోన్ పురస్కారానికి ఎంపికైన ఆసియాకు చెందిన ఏకైక వ్యక్తి అమృతా షేర్-గిల్ అనీ!
 • ...పబ్లిక్ ఈతకొలనులను పారిశుధ్యం చేయుటకు ఉపయోగించే రసాయనం కాల్సియం హైపోక్లోరైట్ అనీ!

13 వ వారం[మార్చు]

Brass articles.JPG
 • ...ఇత్తడి వస్తువులకు పేరొంది భౌగోళిక గుర్తింపు పొందిన హస్తకళ బుడితి కంచు, ఇత్తడి పని అనీ!
 • ... భారతదేశంలో బి.టి. పట్టా పుచ్చుకున్న తొలి మహిళగా గుర్తింపు పొందిన వ్యక్తి ఇస్మత్ చుగ్తాయ్ అనీ!
 • ...మూడు యుగాల నుండి హోమగుండం నిరంతరం వెలుగుతూనే ఉందని భావించే ఆలయం త్రియుగీ నారాయణ్ ఆలయం అనీ!
 • ... మలేరియాకు విరుగుడుగా ఆర్టెమైసినిన్‌ అనే ఔషధాన్ని కనుగొన్న నోబెల్ పురస్కార విజేత అయిన మహిళ తు యుయు అనీ!
 • ...నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు పొందిన "వాయిసెస్ ఆఫ్ చెర్నోబిల్" గ్రంథ రచయిత్రి స్వెత్లానా అలెక్సీవిచ్‌ అనీ!

14 వ వారం[మార్చు]

Ray Tomlinson.jpg

15 వ వారం[మార్చు]

16 వ వారం[మార్చు]

"Amba vadi", a term in Marathi denotes this foodstuff made up of mango juice.jpg
 • ...మామిడి పండు రసం తయారుచేయబడిన అత్యంత మదురంగా ఉండే మిఠాయి మామిడి తాండ్ర అనీ!
 • ...1940ల వరకూ అంతగా తెలియని శివరంజని రాగం సినిమా, లలిత సంగీతాల వల్లనే ప్రాచుర్యం పొందిందనీ!
 • ... శాస్త్ర, విజ్ఞాన రంగాలకు చెందిన పరిశోధనలను ప్రోత్సహించుటకు "విశ్వవిజ్ఞాన ప్రతిష్ఠానం" అనే సంస్థను స్థాపించిన వారు మధుర కృష్ణమూర్తిశాస్త్రి అనీ!
 • ... చంద్రగుప్త మౌర్యుడు రాజ్యం చేపట్టాకా జరిగిన రాజకీయపు ఎత్తుగడలను, పరిణామాలను తెలియజేసే నాటకం ముద్రారాక్షసం అనీ!

17 వ వారం[మార్చు]

Harmonium 20151009 (23914086965).jpg
 • ...ఖవ్వాలీ పాటల్లో కూడా ఇది ముఖ్యమైన వాయిద్యం హార్మోనియం అనీ!
 • ...చందనం దొంగ వీరప్పన్, అతని అనుచరుల్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆరంభించిన ఆపరేషన్ ఆపరేషన్ కుకూన్ అనీ!
 • ...కావ్యంలో ధ్వని ప్రాధాన్యతను ప్రతిపాదించే విశేషత కలిగిన అలంకారిత గ్రంథం ధ్వన్యాలోకం అనీ!
 • ... మారిషస్ జాతిపిత గా గుర్తింపబడుతున్న మానవతావాది శివసాగర్ రాంగులామ్ అనీ!
 • ...పూసపాటి రాజుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారు అనీ!

18 వ వారం[మార్చు]

New Gandhi statue Patna 01.JPG
 • ...ప్రపంచంలో మహాత్మాగాంధీకి చెందిన విగ్రహాలలో అత్యంత పొడవైన కాంస్య విగ్రహం పాట్నాలోని మహాత్మా గాంధీ విగ్రహం అనీ!
 • ...భారత సొంత నావిగేషన్ వ్యవస్థ నావిక్ అనీ!
 • రాజీవ్ గాంధీ హత్య కేసు విచారించిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) 500 వీడియో క్యాసెట్లు, లక్ష ఫోటోగ్రాఫులను, 1044 మంది సాక్షులు ఇచ్చిన 10వేల పేజీల వాంగ్మూలాలు, 1477 వస్తువులు, సాక్షులను కోర్టు ముందుంచి నివేదిక సమర్పించిందనీ!
 • ...బొబన్-మోలీ బొమ్మల పుస్తకాన్ని రూపొందించి చిన్నారుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న కార్టూనిస్టు వి.టి.థామస్ అనీ!

19 వ వారం[మార్చు]

Sulphuric acid 96 percent extra pure.jpg
 • ... రసాయనాల రారాజు సల్ఫ్యూరిక్ ఆమ్లం అనీ!(చిత్రంలో)
 • ...స్వంత నావెగెసన్ వ్యవస్థ కోసం భారతదేశం పంపిన ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ అనీ!
 • ...అమృత్‌సర్ లోని స్వర్ణ దేవాలయంలో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ కు ప్రతీకారంగా ఇందిరా గాంధీ హత్య జరిగిందనీ!
 • ...మహాత్మాగాంధీ అభిమాన పత్రిక "త్రివేణి" కి సుదీర్ఘకాలం సంపాదకత్వం వహించిన విద్యావేత్త ఐ.వి.చలపతిరావు అనీ!
 • ... మిథునం కథ చూసి ముచ్చటపడిన బాపు స్వీయదస్తూరిలో ఆ కథను రాసి శ్రీరమణకు పంపారనీ!

20 వ వారం[మార్చు]

Naina Devi Temple, Himachal.jpg
 • ...2008 నైనాదేవి దేవాలయ తొక్కిసలాట లో 50 మందిని రక్షించినందుకు సాహసబాలల అవార్డు పొందినవారు "గౌరవ్ సింగ్ సైనీ" అనీ!(ఆలయ చిత్రం)
 • ... 500 ఏళ్లుగా చిత్తశుద్ధితో తెలుగు భాష ఖ్యాతిని, సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెపుతున్న కళ భాగవత మేళా అనీ!
 • ... వందల యేళ్ళుగా మద్యం, మాంసం పై నిషేధం ఉన్న గ్రామం అడిగుప్ప అనీ!
 • ...పాలరాతి విగ్రహాలలు ఉపరితలంపైపూతగా ఆక్సాలిక్ ఆమ్లాన్ని లేపనం చేస్తారనీ!
 • ...వర్కారీ సాంప్రదాయంలో ప్రముఖ వాగ్గేయకారుడు నామదేవుడు అనీ!

21 వ వారం[మార్చు]

Smoke detector.jpg
 • ... పొగ మరియు అగ్నిని శోధించే పరికరం స్మోక్ డిటెక్టర్ అనీ! (చిత్రంలో)
 • ...ఆ ప్రాంత రైతులు వ్యవసాయం చేయడానికి ఋణాన్ని అందించే గ్రామ దేవత మారెమ్మవ్వ అనీ!
 • ... స్మగ్లర్ వీరప్పన్ వద్ద 108 రోజులు బందీగా ఉన్న కన్నడ సినిమా నటుడు రాజ్‌కుమార్ అనీ!
 • ...పద్మశాలీ కులానికి చెందిన మూలపురుషుడు భావనాఋషి అనీ!
 • ... "యవనిక" అని ఒక ధియేటర్ మాస పత్రికని నడిపిన నాటక రంగ ప్రముఖులు పెద్ది రామారావు అనీ!

22 వ వారం[మార్చు]

 • ...దళిత, బహుజనుల కోసం ఫోరాటం చేసిన తెలంగాణ కు చెందిన ఉద్యమనాయకుడు మారొజు వీరన్న అనీ!
 • ...రజనీకాంత్, చిరంజీవి మొదలగు అనేకమందిని సినిమా రంగ నటులుగా శిక్షణనిచ్చినవారు లక్ష్మీదేవి కనకాల అనీ!
 • ...ఏ కోర్టులోనూ న్యాయమూర్తిగా పనిచేయకుండా నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తి లావు నాగేశ్వరరావు అనీ!
 • ...20వ శతాబ్దిలోకెల్లా అత్యుత్తమ హిందుస్తానీ సంగీత గురువుగా పేరుగాంచిన వారు అల్లావుద్దీన్ ఖాన్ అనీ!

23 వ వారం[మార్చు]

Lincoln-Warren-1865-03-06.jpeg
 • ...అంతర్యుద్ధంలో ఓటమి పాలైన కాన్ఫిడరేట్ ను పున:స్థాపించే కుట్రలో భాగంగా తాను అభిమానించే నటుని చేతిలోనే అబ్రహాం లింకన్ హత్య జరిగిందనీ!(చిత్రంలో లింకన్)
 • ...భారత ప్రభుత్వం అణు పితామహుడిగా పేరుగాంచిన హోమీ భాభా పేరుమీదుగా భాభా అణు పరిశోధనా కేంద్రం స్థాపించిందనీ!
 • ...ప్రముఖ నటుడు శివ బాలాజీ ఇరవయ్యేళ్ళకే స్వంతంగా వ్యాపారం ప్రారంభించాడనీ!
 • ...యెమ్మిగనూరు అభివృద్ధికి నాంది వేసిన చేనేత సహాకార పితామహుడు మాచాని సోమప్ప అనీ!
 • ...భారతీయ భాషాశబ్దశాస్త్ర రహస్యాల్ని అయన తన జీవితాంతం విశ్లేషించిన పరిశోధకుడు మర్రీ బీ. ఎమెనో అనీ!

24 వ వారం[మార్చు]

Open Hand Monument in Chandigarh.jpg
 • ...శాంతి, శ్రేయస్సు మరియ మానవజాతి యొక్క ఐక్యతకోసం నిర్మించిన నిర్మాణం ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్అనీ!(చిత్రంలో)
 • ...సింధూలోయ నాగరికతకు చెందిన సింధూ లిపిని పురాతత్వ శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఛేదించలేకపోయారనీ!
 • ... చనిపోయిన కళేబరం లేదా ఎముకను బట్టి జీవి వయస్సును గణించే పద్దతి రేడియోకార్బన్ డేటింగ్ అనీ!
 • ... ప్రభుత్వ అసమగ్ర విధానాలకు సామాజిక అంతరాలు తోడు కావడంవల్లే లక్ష్మీపేట ఘటన జరిగినదనీ!
 • ... వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన ప్రజల మనిషి (నవల) తెలంగాణా తొలి నవల అన్న గుర్తింపు పొందిందనీ!

25 వ వారం[మార్చు]

26 వ వారం[మార్చు]

Baker California Nov03.jpg

27 వ వారం[మార్చు]

Mimicrysrinivos.jpg
 • ...మనుషుల్ని అంటరానివాళ్ళుగా చేసి ఆవుల్ని దేవతలుగా పూజించే హిందూ సంస్కృతిని తాత్త్వికంగా ఎండగట్టిన రచయిత నాగప్పగారి సుందర్రాజు అనీ!
 • ...భారతదేశంలో మొదటి ధ్వని ఇంద్రజాలికుడు మిమిక్రీ శ్రీనివాస్ అనీ!
 • ... బెంగళూరులో వరుసగా రెండేళ్లు ఒకే థియేటర్‌లో ప్రదర్శింపబడిన కన్నడ సినిమా బంగారద మనుష్య అనీ!
 • ... హిందూ పవిత్ర గ్రంథాలైన అష్టాదశ (పద్దెనిమిది) పురాణాలలో ఒకటి అయిన పద్మ పురాణంలో 55,000 శ్లోకాలు ఉన్నాయి అనీ!
 • ... ప్రపంచంలో అత్యంత ప్రాచీన హోటల్ జపాన్ లోని నిషియమా ఆన్‌సెన్‌ కియున్‌కన్‌ అనీ, దీనిని 1311 సంవత్సరాల క్రితం ప్రారంభించారనీ!

28 వ వారం[మార్చు]

 • ...గుంటూరు నగరంలోని మహాత్మా గాంధీ వీధిలో ఉన్న చారిత్రాత్మక కట్టడం జిన్నా టవర్ అనీ!(చిత్రంలో)
 • ...రధోత్సవం సమయంలో భక్తులు రథంపై దవణం., పండ్లు, ముఖ్యంగా మిరియాలు చల్లేది అనంతపురం జిల్లా కదిరిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయంలో అనీ!
 • ...'కామిక్‌ స్ట్రిప్‌' పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరు పొందిన వారు బుజ్జాయి అనీ!
 • ...దూరదర్శన్ కెరీర్ లో ఆమె వివిధ నాట్యరీతుల అభివృద్ధి మరియు వాటిని భద్రపరచుటపై కృషిచేసిన వారు సీత రత్నాకర్ అనీ!
 • ...ఆసియాలో రెండవ అతిపెద్ద అయుధాగారం పల్గాం లోని కేంద్ర ఆయుధాగారం అనీ!

29 వ వారం[మార్చు]

庐山东林寺大雄宝殿.JPG
 • ...ప్రపంచంలో ఎత్తయిన బుద్దుని కంచు విగ్రహం "అమితాభ బుద్ధ" అనీ అది చైనాలోగల డాంగ్లిన్ దేవాలయం సమీపంలో ఉంది అనీ!(చిత్రంలో)
 • ...1893 ప్రపంచ మత సమ్మేళనంలో హిందూ మతం పరపున స్వామీ వివేకానంద చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుందనీ!
 • ...1923లో బందిపోట్లకు సహకరిస్తున్నారన్న తప్పుడు ఆరోపణపై లెవీ(పన్ను) చెల్లించమంటే పటేల్ నాయకత్వంలో తిరస్కరించి బోర్సాడ్ సత్యాగ్రహం చేశారనీ!
 • ...అమెరికాలో అంజలి సెంటర్ ఫర్ పెర్మార్మింగ్ ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి అనేకమందికి నాట్యంలో శిక్షణనిచ్చినవారు రత్నపాప అనీ!

30 వ వారం[మార్చు]

Abdul Sattar Edhi.jpg
 • ... పాక్‌లో అతిపెద్ద సంక్షేమ సంస్థ ‘ఈది ఫౌండేషన్‌’ స్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈది అనీ!
 • ...భూకబ్జా చేసిన రాంవృక్ష్‌యాదవ్ అనుచరులకు మరియు పోలీసులకు మధ్య మధురలో ఘర్షణ జరిగినదనీ!
 • ...ఆంధ్రజాతి అభ్యున్నతికి ప్రత్యేక రాష్ట్ర అవసరమని పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు వింజమూరి భవనాచార్యులు అనీ!
 • ...భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సరిహద్దులను పున:సమీక్షించడంలో సలహా ఇచ్చేందుకు ఏర్పరిచినది రాష్ట్రాల పునర్విభజన కమీషనన్ అనీ!
 • ... భారత స్వాతంత్ర్యానంతరము మిస్టర్ యూనివర్స్ లో గెలుపొందిన మొదటి భారతీయుడు మనోహర్ ఐచ్ అనీ!

31 వ వారం[మార్చు]

Aswan low dam2.JPG

32 వ వారం[మార్చు]

Wadi Al-Salam.jpg
 • ...పంజాబ్ లో పేరెన్నిక కన్న నృత్యం భాంగ్రా అనీ!
 • ...ఒళ్ళంతా బుల్లెట్లు ఉన్నా 48 మంది పాకిస్థాన్ సైనికులను మట్టుపెట్టి కార్గిల్ విజయాన్నందిన సైనికుడు డిజేంద్ర కుమార్ అనీ!
 • ...ముస్లిం జీవనవిధానాలను, పేదరికాన్ని ప్రతిబింబించిన కథలున్న పుస్తకం జుమ్మాఁ అనీ!
 • ...దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంకు తొలి మహిళా ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య అనీ!
 • ... ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానం ఇరాక్ లోని నజాఫ్ నగరంలో గల వాదీ అల్ సలాం అనీ! ఇది దాదాపు 1500 ఎకరాలలో విస్తరించిఉన్నదనీ!

33 వ వారం[మార్చు]

Kashmir region 2004.jpg

34 వ వారం[మార్చు]

35 వ వారం[మార్చు]

 • ...బరోడా విశ్వవిద్యాలయంలో పురాతత్వ విభాగాన్ని నూతనంగా నెలకొల్పిన ఘనుడు బెండపూడి సుబ్బారావు అనీ!
 • ...18వ శతాబ్ది తొలి అర్థభాగంలో సిక్ఖులు ఎదుర్కొన్న తీవ్రమైన అణచివేతను నవాబ్ కపూర్ సింగ్ సిక్ఖు నాయకునిగా అద్భుతంగా ఎదుర్కొన్నారనీ!
 • ...దక్షిణభారతదేశంలో హోయసల స్వతంత్ర సామ్రాజ్యానికి పునాదులు వేసినవాడు విష్ణువర్ధనుడు అనీ!
 • ...భారతదేశంలో ఆధునిక విద్యా విధానాల్ని ప్రవేశ పెట్టిన కళాశాలల్లో దక్కను కళాశాల ఒకటనీ!
 • ...అక్బర్ చక్రవర్తి పైనే తిరుగుబాటు చేసిన దుల్లా భట్టి ని పంజాబ్ రాబిన్ హుడ్ అని పిలుస్తారనీ!

36 వ వారం[మార్చు]

 • ...బేతంచర్ల, బిల్లసర్గం గుహల్లో శిలాయుగ మానవ ఆవాసాలను గుర్తించి గొప్ప పరిశోధక వ్యాసాలు ప్రచురించిన చరిత్రకారుడు మల్లాది లీలా కృష్ణమూర్తి అనీ!
 • ...ఈస్టిండియా కంపెనీ చివరగా బ్రిటీష్ ఇండియాలో కలుపుకున్న ఆఖరి పెద్ద సామ్రాజ్యం సిక్ఖు సామ్రాజ్యం అనీ!
 • ...ఐదు వేర్వేరు విభాగాల్లో నంది అవార్డు పొందిన గాయకుడు రఘు కుంచే అనీ!
 • ...ప్రవాసాంధ్రుడు హరి కొండబోలు అమెరికాలో స్టాండప్ కమెడియన్ గా రాణిస్తున్నాడనీ!
 • ...జాన్ గ్రీషమ్ అనే అమెరికన్ రచయిత నవలలు 42 ప్రపంచ భాషల్లోకి తర్జుమా అవుతున్నాయనీ!

37 వ వారం[మార్చు]

Mohenjo-daro-2010.jpg

38 వ వారం[మార్చు]

 • ...మహబూబ్‌నగర్ పట్టణంలో రాంమందిర్ చౌరస్తాలో జాతీయ జెండాను ఎగుర వేసి నిజాం ప్రభువుకు సవాల్ విసిరిన యోధుడు గంగాపురం బాలకిషన్‌రావు అనీ!
 • ...కలికాల సర్వజ్ఞ అనే బిరుదు పొందిన వాడు హేమచంద్ర అనే జైన సన్యాసి అనీ!
 • ...శ్రీకృష్ణుని తండ్రియైన వసుదేవుడు కశ్యప మహర్షి అంశతో జన్మించాడనీ!
 • ... భారతదేశంలో అతి పెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన టీవీఎస్ గ్రూప్ సంస్థ స్థాపకుడు టి.వి. సుందరం అయ్యంగార్ అనీ!
 • ... ప్లాసీ యుద్ధం ఆంగ్లేయులు భారతదేశంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు దోహదపడ్డదనీ!

39 వ వారం[మార్చు]

Thure de Thulstrup - Battle of Antietam.jpg

40 వ వారం[మార్చు]

Vancouver aerial view.jpg
 • ... బ్రిటిష్ కొలంబియాలో అత్యధిక జనసాంద్రత కలిగిన నగరం వాంకోవర్ అనీ!
 • ... భారత దేశపు ఆఖరి ముగ్గురు వైశ్రాయ్ లకు రాజ్యాంగ సలహాదారుగా సేవలంచినవారు వి. పి. మెనన్ అనీ!
 • ... మాండొలిన్ శ్రీనివాస్ గా పేరు గాంచిన ఉప్పలపు శ్రీనివాస్ పద్నాలుగేళ్ళ వయసులోనే ప్రతిష్టాత్మక రాజలక్ష్మీ పురస్కారం అందుకున్నాడనీ!
 • ... బైకల్ సరస్సు ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటనీ!

41 వ వారం[మార్చు]

 • ...తెలంగాణా ప్రజల విముక్తి కోసం ఉద్యమించి రజాకార్ల చేతిలో హతులైన పోరాట యోధుడు చింతలపురి రాంరెడ్డి అనీ!
 • ...అబ్దుల్ కలాం పేరుతో సేవా సంస్థను ఏర్పాటు చేసి అందుకు కోటి రూపాయల విరాళం ఇచ్చిన వ్యక్తి రాఘవ లారెన్స్ అనీ!
 • ...న్యూజీలాండ్ కు చెందిన జీన్ బాటన్ ఎక్కువ సార్లు ఒంటరిగా విమానయానం చేసి ప్రపంచ రికార్డు సృష్టించిందనీ!
 • ...సిద్ధాంతవ్యాసాన్ని సమర్పించి డాక్టరేట్ సంపాదించిన ఏకైక భారతీయ నటి జయమాల అనీ!
 • ...తెలుగు వాడైన రేమాల రావు మైక్రోసాఫ్ట్ లో చేరిన మొట్టమొదటి భారతీయ ఉద్యోగి అనీ!

42 వ వారం[మార్చు]

Mahalaxmi of Kolhapur.jpg
 • ... ప్రతీ సంవత్సరం మార్చి, సెప్టెంబరు నెలలలో మూడుసార్లు మహాలక్ష్మీ ఆలయ విగ్రహంపై సూర్యాస్తమయం వేళ సూర్యకిరణాలుపడతాయనీ!(చిత్రంలో)
 • ... రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్న యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి అనీ!
 • ... బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో కంగనా రనౌత్ ఒకరనీ!
 • ... ఒక్కో మంగోలు సైనికుడు నాలుగేసి గుర్రాలతో యుద్ధాలకు వెళ్ళి ఒకటి అలసిపోతే మరోదానిపై స్వారీ చేసేవారని!
 • ... బాపు తొలిచిత్రం "సాక్షి" లో ఎస్.వి.జగ్గారావు ప్రధాన ప్రతినాయునిగా నటించారనీ!

43 వ వారం[మార్చు]

Danteswari Temple 0034.jpg

44 వ వారం[మార్చు]

Le temple de Karni Mata (Deshnoke) (8423353617).jpg

45 వ వారం[మార్చు]

Naina Devi Temple, Himachal.jpg

46 వ వారం[మార్చు]

Devichowk2.jpg
 • ...కిరాయి ఇవ్వకపోయినా పర్వాలేదు రాజమండ్రి దేవీచౌక్ లో చాన్స్ వస్తే చాలు అనుకున్న కళాకారులు ఎందరో ఉన్నారనీ!(చిత్రంలో)
 • ...చందమామ కథలు సినిమా 2014 లో ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్నదనీ!
 • ...నవదుర్గల్లో రెండో అవతారం బ్రహ్మచారిణీ దుర్గా అనీ!
 • ...పతంజలి ఆయుర్వేద్ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ అనీ!
 • ...ప్రముఖ పారిశ్రామికవేత్త ఎ. వి. ఎస్. రాజు రాసిన సత్యసాయిబాబా జీవిత కథ అతిపెద్ద పుస్తకంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిందనీ!

47 వ వారం[మార్చు]

Siduhe Bridge-4.jpg
 • ...ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనగా పేరు గాంచినది సిదు రివర్ బ్రిడ్జ్ అనీ!(చిత్రంలో)
 • ...ప్రముఖ సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు 30 మంది నూతన దర్శకులతో పనిచేశాడనీ!
 • ...ప్రముఖ తబలా విద్వాంసుడు జాకిర్ హుసేన్ వరల్డ్ మ్యూజిక్ లో గ్రామీ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి అనీ!
 • ...బంగ్లాదేశ్ మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి ఖాలిదా జియా అనీ!
 • ...సెర్బియా దేశపు రాజధాని నగరమైన బెల్‌గ్రేడ్ ను వైట్ సిటీ అని పిలుస్తారనీ!

48 వ వారం[మార్చు]

MurrayBridgeMurrayRiver.JPG
 • ... ఆస్ట్రేలియాలో అతి పెద్ద నది ముర్రే నది అనీ!
 • ...శ్రీలంక దేశానికి రాష్ట్రపతిగా పని చేసిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించినవారు చంద్రికా కుమరతుంగా అనీ!
 • ...చాలా ఎక్కువగా ఎయిడ్స్ వ్యాధి గూర్చి అవగాహన కల్పించినందుకు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డు పొందిన వైద్యులు కూటికుప్పల సూర్యారావు అనీ!
 • ...2002లో కామన్వెత్ క్రీడల్లో మూడు పసిడి పతకాలు సాధించిన వెయిట్ లిప్టర్ పూజారి శైలజ అనీ!
 • ...రైతాంగ ఉద్యమ పోరాటం ద్వారా కోట్లాది శ్రమ జీవుల బాగుకోసం ఉద్యమించిన కార్యదీక్షాపరుడు మార్పు పద్మనాభం అనీ!

49 వ వారం[మార్చు]

Westernmound.jpg
 • ...సింధు లోయ నాగరికతలో కలిబంగాన్ ఒక పెద్ద ప్రాంతానికి రాజధానిగా ఉండేదనీ!
 • ...తన సాధారణ తుపాకీతో మూడు ట్యాంకులను పేల్చి ధైర్యసాహసాలను ప్రదర్శించిన కార్గిల్ వీరుడు అబ్దుల్ హమీద్(PVC) అనీ!
 • ...భారత రష్యాల సంయుక్త ప్రాజెక్టు అయిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణికి పిళ్ళైను పితగా భావిస్తారనీ!
 • ...అవంతి ప్రాచీన భారతదేశపు మహా జనపదాల్లో ఒకటనీ!
 • ...బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ ముజిబుర్ రహ్మాన్ ను బంగబంధు అని వ్యవహరిస్తారనీ!

50 వ వారం[మార్చు]

Bet Dwarka Okha Gujarat Map.jpg
 • ...బెట్ ద్వారకను మహాభారతం, స్కాందపురాణాల్లో చెప్పిన ద్వారకా నగరంలోని భాగంగా భావిస్తారనీ!
 • ...ఇస్రో వారి వాహకనౌకల, ఉపగ్రహాల కార్యక్రమాలను విజయవంతం చెయ్యడంలో బ్రహ్మ ప్రకాష్ కీలక పాత్ర పోషించాడనీ!
 • ...మెహబూబా ముఫ్తీ జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అనీ!
 • ...అశోకుని కుమార్తెయైన సంఘమిత్ర శ్రీలంకలో బౌద్ధ మత ప్రచారం చేసిందనీ!
 • ...అప్పడాల తయారీ భారతీయ మహిళల ఉపాధి మార్గాల్లో ఒకటనీ!

51 వ వారం[మార్చు]

A scaled down model of Brahmos-II at Aero India 2013.jpg

52 వ వారం[మార్చు]