వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2020

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2020 సంవత్సరంలో వివిధ వారాలలో "మీకు తెలుసా!" వాక్యాలు

01 • 02 • 03 • 04 • 05 • 06 • 07 • 08 • 09 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 • 18 • 19 • 20 • 21 • 22 • 23 • 24 • 25 • 26
27 • 28 • 29 • 30 • 31 • 32 • 33 • 34 • 35 • 36 • 37 • 38 • 39 • 40 • 41 • 42 • 43 • 44 • 45 • 46 • 47 • 48 • 49 • 50 • 51 • 52

2020 సంవత్సరం లోని వాక్యాలు[మార్చు]

01 వ వారం[మార్చు]

  • ... బుద్ధుడు 200 సంవత్సరాల క్రితం జ్ఞానోదయానికి చేరుకున్న ప్రదేశంలో వజ్రాసన స్థాపించబడినదనీ!
  • ... గంభీరావుపేట లోని సీతారామ దేవాలయం లో అఖండ జ్యోతి నిరంతరాయంగా వెలుగుతూ ఉంటుందనీ!
  • ... మహాభారతం ఆధారంగా జరాసంధుడు, శిశుపాలుడు చేది రాజ్యాన్ని పరిపాలించారనీ!
  • ... కళింగ ప్రాంతం మహానది, గోదావరి నదుల మధ్య తూర్పు తీర ప్రాంతమనీ!
  • ... అయోధ్యరాజు దశరధుడు ముగ్గురు రాణులలో ఒకరైన కైకేయి కేకయరాజ్యానికి యువరాణి అనీ!

02 వ వారం[మార్చు]

  • ...శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల ఆవిర్భావానికి దారితీసిన పరిణామ ప్రక్రియ మానవ పరిణామం అనీ!
  • ...కురురాజు పాండురాజు రెండవభార్య మాద్రి మద్రరాజ్యానికి చెందినదనీ!
  • ... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పద్నాలుగో గవర్నర్ ఐ.జి. పటేల్ అనీ!
  • ...ఏడిస్ ఈజిైప్టె అనే జాతి దోమకాటు వల్ల మానవులకు డెంగ్యూ జ్వరం వస్తుందనీ!

03 వ వారం[మార్చు]

  • ...సింధు రాజ్యాన్ని శిబి కుమారులలో ఒకరైన వృషదర్భ స్థాపించాడని విశ్వసిస్తారనీ!
  • ... ఆధునిక మానవుల కంటే ముందు ఉద్భవించిన హోమో రకాలన్నిటినీ కలిపి పురాతన మానవులని అంటారనీ!
  • ... వంగరాజ్యం భారత ఉపఖండంలోని గంగా డెల్టాలో ఒక పురాతన రాజ్యమనీ!
  • ... చాళుక్య రాజవంశం మొదటి సార్వభౌమ పాలకుడు మొదటి పులకేశి అనీ!

04 వ వారం[మార్చు]

  • భూవైజ్ఞానిక కాలమానంలో ప్రస్తుత ఇపోక్ ఐన హోలోసీన్ లోని ప్రస్తుత భాగాన్ని మేఘాలయ రాష్ట్రం పేరున మేఘాలయన్ అంటారనీ, దానికొక కారణం కూడా ఉందనీ..
  • పిల్ట్‌డౌన్ మనిషి పేరుతో ఒక మనిషి పుర్రెకు చింపాంజీ దవడను చేర్చి ఇంగ్లాండులో ఒక పురాజీవ మోసం చెయ్యబోయారనీ, ఆధునిక మాంవుడు ఇంగ్లీషు వాడేనని నమ్మింప జూసారనీ..

05 వ వారం[మార్చు]

  • ... పురాతనకాలంలో పౌండ్రవర్ధన ఉత్తర బెంగాలు ప్రాంతంలో ఉండేదనీ!
  • ...పశ్చిమ భారతదేశంలో యదువంశ రాజులు పాలించిన రాజ్యాలలో హయహయ రాజ్యం ఒకటనీ!
  • ...చంద్రవంక నది ఒడ్డున పలనాటి బ్రహ్మనాయుడు ఒక గ్రామాన్ని నిర్మించాడనీ!
  • ...మరాఠా పేష్వా మొదటి బాజీరావు రెండవ భార్య మస్తాని అనీ!

06 వ వారం[మార్చు]

  • ...కేరళ ట్రావెన్‌కోర్ పాలించిన రాజులు స్త్రీల రొమ్ములపై పన్ను విధించేవారనీ. ఈ విధానాన్ని నంగేలి వ్యతిరేకించిందనీ!
  • ...గుజరాత్ లోని భావ్‌నగర్ సమీపంలోని సముద్రం లోపల నిష్కలంక్ మహాదేవ్ ఆలయం ఉన్నదనీ!
  • ... భారత పార్లమెంటు 2019 అక్టోబర్ 31 లడఖ్ కేంద్ర పరిపాలనా ప్రాంతంగా ప్రకటించిందనీ!
  • ...GAFAM సంస్థలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాలంపై ప్రభావం చూపుతాయనీ!

07 వ వారం[మార్చు]

  • ... షాద్ పేరుతో అద్భుతమైన ఉర్దూ కవిత్వాన్ని రాసిన కవి కాళోజీ రామేశ్వరరావు అనీ!
  • ... తెలుగు సాహిత్యంలో 'రెక్కలు' అను నూతన కవితా ప్రక్రియను ప్రారంభించి రచయిత ఎం. కె. సుగంబాబు అనీ!
  • ... సాధారణంగా టెర్రాఫార్మింగ్ చేసేందుకు అనువైన గ్రహంగా అంగారకుడిని పరిగణిస్తూంటారనీ!
  • ... అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తవాంగ్, వెస్ట్ కామెంగ్ జిల్లాల మధ్య సెలా కనుమ ఉన్నదనీ!

08 వ వారం[మార్చు]

09 వ వారం[మార్చు]

10 వ వారం[మార్చు]

  • ... కర్ణాటక రాష్ట్రంలో జరిగే వార్షిక ఎద్దుల పోటీ కంబళ అనీ!
  • ...కోట హరినారాయణ తేజస్ యుద్ధ విమానం తయారీ ప్రాజెక్టుకు డైరెక్టరనీ!
  • ...ఐరోపాలో 6 వ అత్యంత జనసాంద్రత కలిగిన దేశం బెల్జియం అనీ!
  • ...భారతదేశంలో కుమార సుబ్రమణ్యేశ్వర స్వామి వారి విగ్రహములు రెండుచోట్ల మాత్రమే వుంటే అందులో మొదటిది దక్షిణ దేశములో 'ఫలణి'లోను రెండవది గోలింగేశ్వర స్వామి ఆలయం లో ఉందనీ!

11 వ వారం[మార్చు]

12 వ వారం[మార్చు]

13 వ వారం[మార్చు]

  • ...శబ్ద కాలుష్యం కేవలం చిరాకు తెప్పించడం మాత్రమే కాదు, తీవ్రమైన మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుందనీ!
  • ... భారత రిజర్వు బ్యాంకు తన కస్టమర్ల, డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా యస్ బ్యాంక్ బోర్డును నిలిపివేసిందనీ!
  • ...వినికిడి సంరక్షణకు తగిన సమాచారం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ప్రపంచ వినికిడి దినోత్సవం జరుపుకుంటారనీ!
  • ...అత్రి మహర్షి గౌరవార్థం ఋగ్వేదంలోని ఐదవ మండలంను అత్రి మండలం అని పిలుస్తారనీ!

14 వ వారం[మార్చు]

  • ... శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే కరోనా వైరస్‌ ను 1960లో తొలిసారిగా కనుగొన్నారనీ!
  • ...చౌరి చౌరా సంఘటన ఫలితంగా గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని 1922 ఫిబ్రవరి 12 న నిలిపేశారనీ!
  • ... నండూరి రామమోహనరావు తెలుగులో గ్రంథస్తం చేసిన ఖగోళ శాస్త్ర విశేషాల సంపుటి విశ్వరూపం అనీ!
  • ... కానరీ ద్వీపాలు స్పెయిన్ దక్షిణప్రాంత స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతం అనీ!

15 వ వారం[మార్చు]

  • ... మలేరియా పారసైట్ జీవితచక్రానికి చెందిన పరిశోధనకు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్అనీ.(చిత్రంలో)
  • ...ఆంధ్రజాలరి గా సుపరిచితమైన నృత్య కళాకారుడు డి. వై. సంపత్ కుమార్ అనీ.
  • ... ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ విభాగం స్థాపించినది కూర్మా వేణు గోపాలస్వామి అనీ.
  • ...ఒక కళాకారుడు త్రిపాత్రాభినయంతో నటించిన మొదటి హిందీ చిత్రం మధుమతి అనీ.

16 వ వారం[మార్చు]

17 వ వారం[మార్చు]

  • ...చేతులు కడుక్కోవడం వల్ల కలిగే వైద్య ప్రయోజనాలను కనుగొన్న మొట్టమొదటి వ్యక్తి ఇగ్నాజ్ సెమ్మెల్‌వెయిస్ అనీ!
  • ... కాశ్మీరును కాపాడిన 19 యేండ్ల యువకుడు మఖ్బూల్ షేర్వాణీ అనీ!
  • ...కంప్యూటరులో క‌ట్‌, కాపీ, పేస్ట్‌ లాంటి క‌మాండ్లును రూపొందించిన శాస్త్రవేత్త లారీ టెస్లర్ అనీ!
  • ...ఆకాశంలో వలస పక్షుల గుంపు వాటి ప్రవాహ ఘర్షణను తగ్గించుకోవడానికి V ఆకారంలో ఎగురుతాయనీ!

18 వ వారం[మార్చు]

19 వ వారం[మార్చు]

  • ...స్కైలాబ్ అనే ఉపగ్రహం కాలం చెల్లి, నియంత్రణ కోల్పోయి గతి తప్పడం వలన భూమిపై 1979 జూలై 11న పడిపోయిందనీ!
  • ...భారత్-చైనా యుద్ధంలో ఒక్కడే 72 గంటలపాటు చైనా సేనలను నిలువరించి 150 మంది సైనికులను మట్టుబెట్టిన వీర జవాను జశ్వంత్‌సింగ్‌ రావత్ అనీ!
  • ... తెలంగాణ రాబిన్‌హుడ్ గా సుపరిచితుడు పండుగ సాయన్న అనీ!
  • ...భారత స్వాతంత్ర్య సమరయోధుడు కారుకొండ సుబ్బారెడ్డిని బ్రిటిష్ వారు బుట్టాయగూడెంలో ఉరి తీసారనీ!

20 వ వారం[మార్చు]

  • ... మీనల్ దఖావే భోసలే బిడ్డకు జన్మనివ్వటానికి కేవలం కొద్ది గంటల ముందు, దేశీయంగా కరోనావైరస్ టెస్టింగ్ కిట్ ను రూపొందించిందనీ!
  • ... భారతదేశంలో సరస్వతీ నది ఉనికిని కనుగొన్న పురాతత్వ శాస్త్రవేత్త విష్ణు శ్రీధర్ వాకణ్కర్ అనీ!
  • ... ఆర్గానోబ్రోమైడ్ సమ్మేళనాలను అగ్ని నిరోధకంగా ఉపయోగపడతాయనీ!
  • ... ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురి చేసే రీతిలో తన టేబుల్‌పైనే న్యూక్లియర్ వెపన్ బటన్ ఉంచుతాడనీ!

21 వ వారం[మార్చు]

22 వ వారం[మార్చు]

23 వ వారం[మార్చు]

24 వ వారం[మార్చు]

25 వ వారం[మార్చు]

26 వ వారం[మార్చు]

  • ...ఆహారం నిల్వఉండే పాత్రలు, కార్పెట్ బ్యాకింగ్ కు వాడే ప్లాస్టిక్, రబ్బర్ లను తయారుచేసేందుకు స్టైరీన్ అవసరమనీ!
  • ...1998 ఆటా నాటక పోటీలలో ప్రథమ బహుమతి పొందిన దృశ్యకావ్యం పడమటి గాలి అనీ!
  • ...1793 నుండి 1798 వరకు సిలోన్ ద్వీపం మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేదనీ!
  • ... క్రిప్స్ రాయబారం రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహకారాన్ని పొందడానికి బ్రిటిషుప్రభుత్వం చేసిన విఫల ప్రయత్నమనీ!

27 వ వారం[మార్చు]

  • ...పోలియోకు నోటి ద్వారా వేసే టీకాను కనుగొన్న ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్, దాని ధరను తక్కువగా ఉంచేందుకు గాను, తన టీకాకు పేటెంటు తీసుకోలేదనీ!
  • ... ఏదైనా సూక్ష్మక్రిములను 30 సెకన్లలోపు నాశనం చేసే క్రిమి సంహారక రసాయన ద్రావణం శానిటైజర్ అనీ!
  • ...విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌ ప్రమాదం వల్ల సమీప గ్రామాలు ప్రభావితమైనాయనీ!
  • ... 1909 లో మోర్లే-మింటో సంస్కరణలకు సురేంద్రనాథ్ బెనర్జీ మద్దతు ఇచ్చాడానీ!
  • ... ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలకు నేరుగా డబ్బులు చేరవేసి వారి కొనుగోలు శక్తిని పెంచడం హెలీకాప్టర్ మనీ వెనుకున్న ముఖ్య ఉద్దేశమనీ!

28 వ వారం[మార్చు]

29 వ వారం[మార్చు]

30 వ వారం[మార్చు]

31 వ వారం[మార్చు]

  • ... ఏడిదము సత్యవతి ఆత్మకథ రాసుకున్న తొలి తెలుగుమహిళ అనీ!
  • ... డోక్లాం ప్రాంతంలో చైనా రహదారిని నిర్మించడాన్ని భూటాన్ తీవ్రంగా వ్యతిరేకించిందనీ!
  • ... 1896 లో న్యాపతి సుబ్బారావు పంతులు నిర్వహించిన పోటీలో బహుమతి పొందిన నవల హేమలత (నవల) అనీ!
  • ... వేపా రామేశం 1920 నుంచి 1935 దాకా మదరాసు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడనీ!

32 వ వారం[మార్చు]

  • ... ఫిరోజ్ గాంధీ తన మామ జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు చేసాడనీ!(చిత్రంలో)
  • ... థేరవాదం బౌద్ధమతంలో అతి పురాతమైన శాఖల్లో ఒకటనీ!
  • ... "పండిత", "సరస్వతి" బిరుదులు పొందిన మొదటి మహిళ, భారతీయ సంఘసంస్కర్త పండిత రమాబాయి అనీ!
  • ... తెలుగు సినిమా నటి వేదవల్లి కుమార్తె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత అనీ!

33 వ వారం[మార్చు]

  • ... భారత క్రికెట్ క్రీడాకారుడు దళిత కులానికి చెందినవాడు అయినందున పాల్వంకర్ బాలూ కులవివక్షను ఎదుర్కొన్నాడనీ!
  • ... 20 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉండి నివసించేందుకు కనీసం ఒక పూరిల్లునూ సంపాదించుకోని నిస్వార్థ రాజకీయనాయకుడు పాటూరు రామయ్య అనీ!
  • ...రెండో యాదగిరిగుట్టగా పేరు సంపాదించుకున్న దేవాలయం వెల్చల్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అనీ!
  • ...కొర్రమట్ట ను తెలంగాణ రాష్ట్ర చేపగా ఎంచుకున్నారనీ!

34 వ వారం[మార్చు]

  • ...కాళ్ళకూరి సదాశివరావు జానపద చిత్ర నిర్మాణం ప్రారంభించిన మొదటి వ్యక్తి అనీ!
  • ... జీనో సోక్రటిస్ పూర్వ కాలానికి చెందిన ఒక ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త అనీ!
  • ... కాగితం గుజ్జును వాడి విత్తనాలను మొలకెత్తించేందుకు మొలకెత్తే కాగితం వాడుతారనీ!
  • ... గట్టెం వెంకటేష్ న్యూయార్క్ నగరంలో ఉన్న ‘ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్’ని టూత్ పిక్ పై చెక్కి రికార్డు సృష్టించాడనీ!

35 వ వారం[మార్చు]

36 వ వారం[మార్చు]

37 వ వారం[మార్చు]

38 వ వారం[మార్చు]

  • ... న్యుమోనియా సాధారణంగా వైరస్‌లు, బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుందనీ!
  • ...సోడియం హైపోక్లోరైట్ సాయంతో ఒక్క నిమిషంలో కరోనావైరస్ ఉన్న ఈ ఉపరితలాలను క్రిమిరహితం చేయవచ్చనీ!
  • ...సర్‌ రుడాల్ఫ్ వేరుసెనగ నూనెను ఇంధనంగా ఉపయోగించి ఐరన్ సిలిండరును పని చేయించినందున గుర్తుగా ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం జరుపుకుంటారనీ!
  • ... "చూసి చూడంగానే" సినిమాతో తెలుగు సినిమారంగంలోకి వర్ష బొల్లమ్మ నటిగా రంగప్రవేశం చేసిందనీ!

39 వ వారం[మార్చు]

  • ...కోటి వేంకనార్యుడు "ఆంధ్రభాషార్ణవము" అనే అచ్చ తెలుగు నిఘంటువును పద్య రూపంలో రాసాడనీ!
  • ... రైల్వే సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ లో శిక్షణ ఇచ్చే భారతీయ రైల్వే ప్రధాన కేంద్రీకృత శిక్షణా సంస్థ రైల్ నిలయం లో ఉన్నదనీ!
  • ...భారతదేశం భూటాన్‌లో 1,416 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే మూడు జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్వహిస్తోందనీ!
  • ...సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2019- 20 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయిలో 7వ స్థానంలో నిలిచిందనీ!

40 వ వారం[మార్చు]

  • ...అబుదాబి ద్వీపం ఐదు లేన్ల మోటారువే వంతెన ద్వారా సాదియాట్ ద్వీపానికి అనుసంధానించబడి ఉందనీ!
  • ... క్వాల్కమ్ సంస్థ మేధో సంపత్తి, సెమీకండక్టర్స్, సాఫ్ట్‌వేర్ వైర్‌లెస్ టెక్నాలజీకి సంబంధించిన సేవలను సృష్టిస్తుందనీ!
  • ... టాల్‌స్టాయి కథలు లను తెలుగులోకి అనువదించినది భమిడిపాటి కామేశ్వరరావు అనీ!
  • ... ప్రపంచ కొబ్బరి దినోత్సవం మొదటిసారిగా ఇండోనేషియాలో ప్రారంభమైందనీ!

41 వ వారం[మార్చు]

  • ... రాజగోపాల కృష్ణ యాచేంద్ర వెంకటగిరి సంస్థానానికి 28వ మహారాజు అనీ!
  • ... గిరిజ శ్రీ భగవాన్ గా పేరుపొందిన డిటెక్టివ్ రచయిత అసలు పేరు తాడంకి వెంకటలక్ష్మీనరసింహారావు అనీ!
  • ... మూలా వెంకటరంగయ్య బొమ్మిరెడ్డి నరసింహారెడ్డితో కలిసి వాహినీ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించాడనీ!
  • ... ప్రపంచమంతటా ప్రజాదరణ పొందిన జమీల్యా (నవల) మొదటగా రష్యన్ భాషలో వెలువడిందనీ!

42 వ వారం[మార్చు]

  • ...సెవెన్ సీస్ ఎక్స్‌ప్లోరర్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన క్రూయిజ్ నౌక అనీ!
  • ... ప్రీతం ముండే భారత పార్లమెంటు ఎన్నికల్లో 6,96,321 ఓట్ల ఆధిక్యం సాధించి, లోక్‌సభ ఎన్నికల్లో సరికొత్త రికార్డును నమోదు చేసిందనీ!
  • ...అండమాన్ నికోబార్ దీవులలోని సౌత్ బటన్ నేషనల్ పార్క్ భారతదేశంలో అతిచిన్న జాతీయ ఉద్యానవనం అనీ!
  • ...సాహిల్ దోషి తన 14వ యేట కార్బన్ డై ఆక్సైడ్ తో విద్యుత్ తయారుచేసే పరికరాన్ని ఆవిష్కరించాడనీ!

43 వ వారం[మార్చు]

44 వ వారం[మార్చు]

  • ... పాపం పసివాడు దక్షిణాఫ్రికా చలనచిత్రమైన లాస్ట్ ఇన్ ది డెసెర్ట్ అనే చిత్రం ఆధారంగా నిర్మితమైందనీ!
  • ... కారకోరం ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వత శ్రేణి అనీ!(చిత్రంలో)
  • ...తెలుగు సినిమా నటుడు చక్రవర్తుల నాగభూషణం రక్తకన్నీరు నాటకం ప్రదర్శనద్వారా గుర్తింపు పొంది "రక్తకన్నీరు" నాగభూషణంగా ప్రసిద్ధి పొందాడనీ!
  • ...తమిళనాడులోని తెలుగువారిలో క్షీణిస్తున్న తెలుగుకు స్వంత ఖర్చులతో ఉద్యమాన్ని నడిపిన భాషాభిమాని సాధు వరదరాజం పంతులు అనీ!
  • ...వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు మధ్య చేపల మార్కెట్లు వారధిగా ఉంటాయనీ!

45 వ వారం[మార్చు]

  • ...గోవా, కొంకణ్ ప్రాంతాలలో ప్రజలు గజలక్ష్మిని తమ సంరక్షక దేవతగా పూజిస్తారనీ!
  • ... తండ్రి ఆజ్ఞపై పరశురాముడు ఖండించిన తన తల్లి తల మాదిగవాడలో పడినందున వారు ఆమెను ఎల్లమ్మ గా కొలుస్తారనీ!
  • ...తూర్పు జావా ప్రావిన్స్‌లోని అత్యంత పేద ప్రాంతాలలో మదురా ద్వీపం ఒకటి అనీ!
  • ... సెర్గీ బుబ్కా 6.0 మీటర్లు, 6.10 మీటర్ల ఎత్తును దూకిన మొట్టమొదటి పోల్ వాల్ట్ క్రీడాకారుడు అనీ!
  • ... ఆయుర్వేద వైద్య గ్రంధాలలో మొట్టమొదటిది కశ్యప సంహిత అనీ!

46 వ వారం[మార్చు]

  • ...రష్యన్ స్పేస్ షటిల్ కార్యక్రమంలో భాగంగా తయారు చేసిన తొలి, ఏకైక నౌక బురాన్ అంతరిక్ష నౌక అని!
  • ...50 పైగా నిఘంటువుల నిర్మాణానికి కృషి చేసిన సాంకేతిక పరిజ్ఞాన శిక్షణకారుడు పెద్ది సాంబశివరావు అనీ!
  • ...5,065 మీటర్లు ఎత్తున ఉన్న దౌలత్ బేగ్ ఓల్డీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎయిర్‌స్ట్రిప్ లలో ఒకటనీ!
  • ... 1947-1956ల మద్య భారతదేశంలో ఉనికిలో ఉన్న ఉన్నత పదవి రాజ్ ప్రముఖ్ అనీ!
  • ...భారత సైన్యం సబ్-సెక్టర్ నార్త్ (ఎస్ఎస్ఎన్) అని పిలిచే ప్రాంతంలో డెప్సాంగ్ మైదానం ఒక భాగమనీ!

47 వ వారం[మార్చు]

  • ...పాక్షికంగా మరల మరల వినియోగించదగిన అంతరిక్ష నౌకా వ్యవస్థ స్పేస్ షటిల్ అనీ!
  • ...తారిమ్ బేసిన్‌లోని యార్కండ్ ల మధ్య పురాతన బిడారు మార్గంలో కారకోరం అత్యంత ఎత్తైన కనుమ అనీ!
  • ...కారకోరం పర్వత శ్రేణిలో ఉన్న కనుమ దారి ఖుంజేరబ్ కనుమ అనీ!
  • ...16 వ జైన తీర్ధంకరుడైన శాంతినాధుని దిగంబర విగ్రహం 30 అడుగుల ఎత్తులో అగ్గలయ్య గుట్టపై ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుందనీ!
  • ...స్విట్జర్లండ్ ప్రెసిడెంటు పదవీ కాలం ఒకే సంవత్సరమనీ, విదేశాల్లో అధికారిక పర్యటనలు అస్సలు చెయ్యరనీ

48 వ వారం[మార్చు]

  • ... ప్రపంచంలో అత్యంత పురాతనమైన జంతు ప్రదర్శనశాల ఆస్ట్రియాలోని వియన్నాలో ఉందనీ!
  • ... హైపోథైరాయిడిజం వ్యాధికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ తక్కువ అవడం వల్ల అనీ!
  • ... డయానా హేడెన్ భారతదేశం నుంచి మిస్ వరల్డ్ గా ఎన్నికైన మూడవ మహిళ అనీ!
  • ... లౌలాన్ బ్యూటీ సా.పూ. 1800 కాలం నుంచీ ముఖ కవళికలతో సహా చెక్కు చెదరకుండా ఉన్న మమ్మీ అనీ!
  • ...భారతదేశం లోని లడఖ్ కేంద్రపాలిత ప్రాంతపు రాజధాని లేహ్ అనీ!

49 వ వారం[మార్చు]

  • ...రోహ్‌తాంగ్ కనుమ దక్షిణ భాగంలో, బియాస్ నది భూగర్భం నుండి ఉద్భవించి దక్షిణ దిశగా ప్రవహిస్తుందనీ!
  • ...సామాన్య ప్రజలకు సాంప్రదాయ సంస్కృతిని చూపించడం శిల్పారామం ప్రధాన ఉద్దేశ్యం అనీ!
  • ...చైనాతో వాణిజ్యం కోసం ప్రారంభించిన మొదటి భారత సరిహద్దు పోస్టు లిపులేఖ్ కనుమ అనీ!
  • ... భారత రాష్ట్రపతి, అబ్దుల్ కలాం సియాచెన్‌ ను సందర్శించిన మొదటి దేశాధినేత అనీ!
  • ... జోజి లా సొరంగం ప్రాజెక్టును 2018 జనవరిలో భారత ప్రభుత్వం ఆమోదించిందనీ!

50 వ వారం[మార్చు]

  • ... మనిషి వయస్సు పెరిగేకొద్దీ దగ్గర చూపు మందగించడాన్ని చత్వారము అంటారనీ!
  • ... కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా భారతదేశంలో వ్యాపార సంస్థల మధ్య పోటీని నియంత్రించే కేంద్రప్రభుత్వ సంస్థ అనీ!
  • ... కార్ నికోబార్ దీవులను సముద్ర ప్రయాణీకులు "నగ్న ఉత్తర భూమి" అని పిలుస్తారనీ!
  • ... బార్పేట చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అనేక వైష్ణవ సత్రాలు ఉన్నందువల్ల దీనిని సత్ర నగరి అని పిలుస్తారనీ!

51 వ వారం[మార్చు]

  • ...మొహాలీ, పంచకుల రెండూ చండీగఢ్ కు ఉపగ్రహ నగరాలనీ!
  • ... నల్బరిలో కమ్రుపి రాజుల రాగి పలక శాసనాలకు సంబంధించిన వివిధ ఆవిష్కరణలు ఉన్నాయనీ!
  • ...మథుర జిల్లా వైష్ణవ మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన బృందావన్‌కు కూడా ప్రసిద్ది చెందిందనీ!
  • ... నేపాల్ లోని జానక్‌పూర్‌ లో వివాహ పంచమి వేడుక చాలా ముఖ్యమైనదనీ!
  • ... పగడాలదీవి అనే పేరు ఉన్న పట్టణం కవరట్టి అనీ!

52 వ వారం[మార్చు]

  • ...బుందేల్‌ఖండ్ ముఖ ద్వారం అని ఝాన్సీ నగరాన్ని పిలుస్తారనీ!
  • ...పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులను సందర్శించడానికి ప్రవేశ కేంద్రంగా పనిచేస్తోందనీ!
  • ...మొరాదాబాద్ ను ఇత్తడి నగరం (పీతల్ నగరి) అని పిలుస్తారనీ!
  • ... వింధ్య పర్వత శ్రేణికి, కైమూర్ శ్రేణికీ మధ్య ఉన్న రాబర్ట్స్‌గంజ్ ప్రాంతంలో ఆదిమానవులు ఊండేవారనీ!
  • ... అరాజకం అంటే సాంప్రదాయ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాజకీయ విధానమనీ!

53 వ వారం[మార్చు]

  • ...బోగీబీల్ వంతెన భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెన అనీ!
  • ...1985లో కోల్‌కతా నుండి సిల్చార్‌కు నడిచిన ఎయిర్ ఇండియా విమానం ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా సిబ్బంది విమానంగా గుర్తింపు పొందిందనీ!
  • ...2014 సెప్టెంబరు నాటి వరద సమయంలో, రియాసి జిల్లాలోని సద్దాల్ గ్రామం గణనీయమైన వినాశనాన్ని ఎదుర్కొందనీ!
  • ...దుబ్రి ప్రాంతాన్ని నదుల భూమి అని పిలుస్తారనీ!
  • ... ముత్యాల గర్భం అంటే కేవలం మగ క్రోమోజోములతో మాత్రమే ఏర్పడే ఒక అసాధారణ గర్భమనీ!