వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యాంత్రికానువాదాల ద్వారా త్వరగా, తక్కువ శ్రమతో కొత్త పేజీలను సృష్టించవచ్చు. దీన్ని ఉపయోగించే వాడుకరులు మెళకువతో వ్యవహరించి, యంత్రం చేసిన అనువాదాలకు తగు సవరణలు చేసి ప్రచురిస్తే ఈ వ్యాసాల నాణ్యత ఉత్తమంగా, వికీ విధానాలకు, శైలికీ అనుగుణంగా ఉంటుంది. దీని పట్ల వాడుకరులు తగినంత శ్రద్ధ వహించక పోతే, ఈ వ్యాసాల్లోని భాషలో నాణ్యత లోపించి పాఠకులకు అవి అంతగా ఉపయోగపడకుండా పోతాయి. దీనిని నివారించే మార్గాల్లో ఒకటి వాడుకరులలో చైతన్యం కలిగించడంతో పాటు, దీని పట్ల ఒక విధానం రూపొందించుకోవడం కూడా ముఖ్యం. ఈ విధానాన్ని రూపొందించే ప్రయత్నంలో భాగమే ఈ విధాన నిర్ణాయక చర్చ.

గమనిక: ఈ విధానం అక్షర దోషాల గురించి కాదు.

సమస్య

[మార్చు]

ఈ చర్చకు మూలమైన సమస్య, యాంత్రికానువాదాల్లో ఉంటున్న దోషభూయిష్టమైన భాష. ఈ భాష వ్యాకరణ రహితంగా, కృతకంగా ఉంటుంది. వ్యాసం అందజేయాల్సిన భావాన్ని పాఠకులకు అందజేయదు. వాసం చదివాక పాఠకులకు సంతృప్తికర అనుభూతి కలిగించదు. పైగా వికీ పట్ల దురభిప్రాయం కలిగే అవకాశమూ ఉంది. దోషాలు/కృతకాల్లో కొన్ని:

 1. కర్మణి ప్రయోగం: కర్తరి వాక్యం (యాక్టివ్ వాయిస్) తెలుగు భాషకు సహజం. కర్మణి వాక్యం (పాసివ్ వాయిస్) కాదు. అసలే రాయకూడదని కాదు గానీ, అరుదుగా రాస్తాం. ఇంగ్లీషులో కర్మణి ప్రయోగం సహజం. ఇంగ్లీషు నుండి అనువదించేటపుడు యంత్రం కర్మణి వాక్యాలను కర్మణి వాక్యాలు గానే అనువదిస్తుంది.
  • ఉదా: "నటనతో తన మొదటి విచారణలో, రోటిమి గాత్ర పరీక్ష చేయబడ్డాడు మరియు తరువాత బాస్ లో మాదకద్రవ్యాల వ్యాపారి డారియస్ మోరిసన్ పాత్రలో తన మొదటి నటనను పొందాడు": గాత్ర పరీక్ష చేబడ్డాడు అనే అనువాదం యంత్రం మాత్రమే చెయ్యగలిగినది.
 2. "మరియు" వంటి పదాలు తెలుగు సహజమైనవి కావు. ఇంగ్లీషులో అండ్ ఉన్న ప్రతీ చోటా మరియు అని యంత్రం అనువదిస్తుంది. ఇది కృతకంగా ఉంటుంది.
 3. సందర్భ శుద్ధి లేమి: ఒకే పదానికి వేరువేరు సందర్భాల్లో వేరువేరు అర్థాలు ఉండవచ్చు. అలాంటి వాటిని సందర్భానుసారం అనువదించాలి. కానీ, అనువాదంలో యంత్రం సందర్భ శుద్ధి చూపదు.
  • ఉదా: "ఐదు యూరోల నోటు యొక్క సగటు జీవితం ధరించడం వల్ల భర్తీ చేయడానికి ఒక సంవత్సరం కన్నా తక్కువ అని అంచనాలు సూచిస్తున్నాయి." - wear అనే ఇంగ్లీషు మాటకు ధరించడం, అరిగిపోవడం అనే అర్థాలు ఉన్నాయి. ఇక్కడ అరిగిపోవడానికి సంబంధించిన నలిగి పోవడం/కృశించి పోవడం వంటి పదాలు వాడాలి. కానీ ధరించడం అని యంత్రం అనువదించింది. వాడుకరి కూడా వ్యాసాన్ని అలాగే ప్రచురించారు.
 4. సంక్లిష్ట, సంశ్లిష్ట వాక్యాలు: ఇంగ్లీషులో ఉన్న సంక్లిష్ట, సంశ్లిష్ట వాక్యాలను యంత్రం అలాగే అనువదిస్తుంది. ఆ వాక్యాలు అర్థం లేకుండా తయారౌతాయి. వాటిని సరిగా అనువదించాలి. చిన్న చిన్న వాక్యాలుగా విడగొట్టి రాస్తే అనువాదం సులువుగా ఉంటుంది. చదవను వీలుగానూ ఉంటుంది.
  • ఉదా: "దాని ప్రారంభ రోజున, కిక్ 260 చుట్టూ సంపాదించారు మిలియన్, ఇది ధూమ్ 3 వెనుక రెండవ అత్యధిక సెలవుదినం కాని ఓపెనింగ్ వసూలు చేసింది."
 5. అస్సలు కించిత్తు కూడా అర్థాన్ని ఇవ్వని వాక్యాలు: కొన్ని అనువాదాలు వాక్యాన్ని మొత్తంగా అనువదించినట్లు ఉండవు. ఒక్కో పదాన్ని విడివిడిగా అనువదించి ఒక వాక్యంగా పేర్చినట్టు ఉంటాయి.
  • ఉదా: "ఈ భావనలు ఒక ఇవ్వడం జరిగింది ప్రమాణ లో గణిత రూపంగా సంభావ్యత సిద్ధాంతం వంటి విరివిగా ఉపయోగించే, అధ్యయనం యొక్క ప్రాంతాల్లో వంటి గణిత, గణాంకాలు, ఫైనాన్స్, జూదం, సైన్స్ (ముఖ్యంగా భౌతిక ), కృత్రిమ మేధస్సు / యంత్ర అభ్యాస, కంప్యూటర్ సైన్స్, గేమ్ థియరీ, మరియు తత్వశాస్త్రం, ఉదాహరణకు, సంఘటనల frequency హించిన పౌన frequency పున్యం గురించి అనుమానాలను గీయండి." - ఇలాంటి వాక్యాల గురించి చెప్పడానికేమీ లేదు.
 6. పదాలు ఉన్నవి ఉన్నట్లుగా: (ఇది అంత పెద్ద సమస్యేమీ కాదు) ఇంగ్లీషు పదాలను ఉన్నవి ఉన్నట్లుగా అనువదిస్తుంది. కొత్త సాంకేతిక పదాలు, తెలుగులో అసలే లేని పదాల విషయంలో అది తప్పదు, అలాగే చెయ్యాలి. కొన్ని సందర్భాల్లో దాన్ని నివారించవచ్చు.

సమస్యకు కారణాలు

[మార్చు]
 1. భాష నాణ్యతపై వాడుకరులు శ్రద్ధ పెట్టకపోవడం అత్యంత ప్రధాన కారణం. పోటీల్లో పాల్గొని త్వరత్వరగా వ్యాసాలను ప్రచురించాలనే ఆతురత, పెద్ద శ్రమపెట్టే అలోచన లేకపోవడం, శ్రమ పెట్టాల్సిన అవసరం కనబడకపోవడం దీనికి మూలం.
 2. చిన్నచిన్న కారణాలు
  1. యాంత్రికానువాదం ఎంత తప్పుల తడకగా ఉంటుందో వాడుకరులకు అంతగా అవగాహన లేకపోవడం
  2. భాష విషయంలో కొందరు వాడుకరులకు అసలు పరిజ్ఞానమే తక్కువగా ఉండడం
  3. ప్రచురించే ముందు వ్యాసం కనీసం ఒకసారైనా పూర్తిగా చదివి పరిశీలించక పోవటం

పరిష్కార మార్గాలు

[మార్చు]

వాడుకరులు తగినంత శ్రద్ధ వహించి దోషాలను సవరించిన తరువాతనే ప్రచురించడం ఏకైక పరిష్కారం. యంత్రాన్ని మెరుగుపరచడం సరైన పరిష్కారమే అయినప్పటికీ, అది సముదాయం చెయ్యగలిగే పని కాదు. నాణ్యత ఆవశ్యకత విషయమై వాడుకరులకు అవగాహన కలిగించడం, నాణ్యతను తప్పనిసరి చెయ్యడం వంటివి సముదాయం చేపట్టాలి.

నాణ్యతపై అవగాహన

[మార్చు]

పెద్దలైనా పిన్నలైనా, కొత్తవారైనా పాతవారైనా మనందరికీ భాష నాణ్యత పట్ల అవగాహన ఉండాలి. వాడుకరులంతా తమ నైపుణాన్ని, ఎరుకను, ఆలోచనలను ఇతరులకు పంచాలి. ఏది తప్పో ఏది ఒప్పో తెలియజెప్పాలి, తెలుసుకోవాలి. ఇందుకు ఏం చెయ్యాలో ఆలోచించాలి.

నాణ్యత తప్పనిసరి చెయ్యడం

[మార్చు]

అనువాద పరికరంలో తగు నియంత్రణలు పెట్టాలి. ఈ విషయమై రచ్చబండలో ఇంప్రూవింగ్ ది ట్రాన్స్‌లేషన్ సపోర్ట్ ఫర్ తెలుగు అనే చర్చ జరిగింది. ఈ చర్చలో వచ్చిన ఆలోచనలు:

 1. అనువాద వ్యాసాన్ని ప్రచురించే ముందు దాన్ని పరిశీలించి అవాంఛిత పదాలు, వాడుకలు (ఉదా: "మరియు") ఉంటే దాన్ని నిరోధించేందుకు ఒక వడపోతను సృష్టించడం. (దుశ్చర్యలను నివారించేందుకు వికీపీడియాలో ఉన్న "ప్రత్యేక:" అంశం) దీనిపై సముదాయం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మనమే అమలు చేసుకోవచ్చు. ఏయే పదాలు, పద బంధాలు, వాక్యాలు ఉండకూడదో వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ/వడపోత పదాలు అనే పేజీలో రాసుకుందాం.
 2. అనువాద పరికరంలో ఈసరికే ఒక నిబంధన ఉంది. యాంత్రికానువాదం 85% కంటే ఎక్కువ ఉంటే ఆ వ్యాసాన్ని ప్రచురించదు. ఈ నిబంధనను కఠినతరం చెయ్యవచ్చు. ఉదాహరణకు యాంత్రిక అనువాదం 55% కంటే ఎక్కువ ఉంటే దాన్ని ప్రచురించరాదు. ఈ విషయంపై సముదాయం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆ పరికరం నిర్వాహకులకు పంపి అమలు చేయించవచ్చు. అనువాదాల్లోని యాంత్రిక, మానవిక శాతాలను చూసేందుకు ఈ పరికరాన్ని వాడవచ్చు. వాడుకరులు తాము, ఇతరులూ ఇటీవల అనువాదం చేసిన వ్యాసాలను పరిశీలించవలసినది.
 3. అనువాదం కోసం అనువాద పరికరంలో ఉన్న ఇతర యంత్రాలను వాడడం. అనువాద పరికరంలో గూగుల్ కాకుండా యాండ్రిక్స్ అనే యంత్రం ఇంకోటి ఉంది. కానీ అది నాసిరకమైనది. గూగుల్ దాని కంటే మెరుగు అనిపిస్తోంది. వాడుకరులు దాన్ని పరిశీలించవలసినది. ఏది నయమైతే దాన్నే వాడుకోవచ్చు.

వోటింగు, చర్చ

[మార్చు]

అభిప్రాయాలు, సూచనలు రాయవచ్చు.

వడపోత సృష్టి

[మార్చు]

వడపోత ఉండాలా వద్దా, ఉంటే హెచ్చరిక చేసి ప్రచురణను అంగీకరించాలా, లేక ప్రచురించేందుకు అనుమతి నిరాకరించాలా, లేదా కొన్ని పదాలకు హెచ్చరించడంతో సరిపెట్టి, కొన్నింటి విషయంలో ప్రచురణ నిరాకరించేలా వేరువేరుగా వడపోతలు రాసుకోవాలా అనే విషయాన్ని చర్చిద్దాం. ఏయే పదాలను వడపోయాలో వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ/వడపోత పదాలు పేజీలో రాద్దాం.

 1. వడపోత ఉండాలి. "మరియు" వంటి పదాలుంటే, ఆ వ్యాస ప్రచురణను తిరస్కరించాలి. వేరే పదాల కోసం, హెచ్చరిక వడపోత మరొకదాన్ని సృష్టించుకోవచ్చు. __చదువరి (చర్చరచనలు) 05:20, 2 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
 2. మరియు అనేదాన్ని మునుపు విరివిగా ఉపయోగించేవాళ్ళం కదా.. ఇపుడు మరియు అనే పదాన్ని వడాబోయు ప్రయత్నంలో పాత వ్యాసాలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? B.K.Viswanadh (చర్చ) 07:37, 4 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యాంత్రికానువాద శాత నియంత్రణ

[మార్చు]

కనీసం ఎంత శాతం మానవిక అనువాదం ఉండాలో రాయాలి. దానికి హేతువు ఏంటో కూడా రాయవచ్చు.

 1. అనువాద పరికరం ద్వారా నేను అనువదించిన వ్యాసాలు 15 వరకూ విశ్లేషించి చూసాను. వాటిలో యాంత్రిక అనువాదాలు 50% లోపే ఉన్నాయి. దీన్నిబట్టి మానవిక అనువాదాలు 50% వరకూ ఉండాలని నేణు భావిస్తున్నప్పటికీ, ముందు దీన్ని 40% గా పెట్టుకుని ఆ తరువాత వాడుకరుల అనుభవాలను తీసుకుని ఆ తరువాత అవసరమైన విధంగా సవరించాలని అభిప్రాయపడుతున్నాను. __చదువరి (చర్చరచనలు)
 2. యాంత్రిక అనువాదం 40 శాతం ఉండి, మానవప్రయత్నం అరవై శాతం ఉండాలనుకుంటాను..B.K.Viswanadh (చర్చ)
  1. B.K.Viswanadh గారూ, మానవిక అనువాదాల శాతం అంత ఎక్కువగా పెడితే, అనువాద పరికరాన్ని వాడే ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది. 40% కంటే కూడా తగ్గించాలేమోనని అనిపిస్తోంది. కారణం, నేను విశ్లేషించిన వ్యాసాలు దాదాపుగా అన్నీ (సుమారు 15) సైన్సు వ్యాసాలే. వాటిలో మానవిక అనువాదాలు చెయ్యాల్సిన అవసరం ఇతర వ్యాసాల కంటే ఎక్కువగా ఉంటుందని నా అనుభవం. మానవిక అనువాదాలను 35% పెట్టుకుని, మన అనుభవాలను బట్టి పెంచుకోడమో తగ్గించుకోడమో చేద్దామని నా ఉద్దేశం. __చదువరి (చర్చరచనలు) 03:13, 7 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నేరుగా చేసే రచనల్లో కూడా వడపోతలను అమలు చేద్దామా

[మార్చు]

వడపోతలను యాంత్రిక అనువాదాలకే కాకుండా నేరుగా చేసే రచనలకు (పేజీలు సృష్టించేటపుడు మాత్రమే) కూడా అమలు చేద్దామా?

 1. నేరుగా చేసే రచనల్లో కూడా వడపోతలను అమలు చెయ్యాలి. __చదువరి (చర్చరచనలు) 05:20, 2 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
 2. వడబోత అవసరం లేదనుకుంటాను.. వీటిని సులభంగా సవరించగలం అని నా అభిప్రాయం B.K.Viswanadh (చర్చ) 07:39, 4 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  • దీన్ని అవకాశంగా తీసుకుని అనువాద పరికరం నుండి నేరుగా ప్రచురించకుండా, కాపీ చేసి పేజీలో పేస్టు చేసి కొత్త పేజీలను సృష్టించకుండా చూసుకోవాలి. మనం దీన్ని గమనిస్తూ ఉండాలి. అలా జరిగితే తగు చర్యలు తీసుకోవాలి. __చదువరి (చర్చరచనలు) 04:01, 9 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయం

[మార్చు]

ఈ అంశంపై చర్చకు గానీ, వోటింగుకు గానీ వాడుకరులు ఆసక్తి చూపలేదు. పాల్గొన్న B.K.Viswanadh గారు, 60% మానవిక అనువాదాలు ఉండాలని చెప్పారు. "మరియు" కోసం తిరస్కరణ వడపోతకు అనుకూలమేనని నేరుగా చెప్పకపోయినా, అనుకూలంగా ధ్వనించారు. నేరుగా చేసే రచనలకు వడపోతలు అవసరం లేదని భావించారు. వోటింగులో వాడుకరులు పెద్దగా పాల్గొనకపోతే సముదాయం ఆ ప్రతిపాదనను అనుకూలంగా లేనట్లుగానే భావించాలి. కానీ

 1. ఇక్కడ పాల్గొన్న ఇద్దరూ ప్రతిపాదనను సమర్ధించడాన్ని బట్టి,
 2. ఈ పేజీలో చూపిన కారణాల వల్లనే 1770 వ్యాసాల తొలగింపు ప్రతిపాదనను పెద్దయెత్తున సమర్ధించారు కాబట్టీ,
 3. యాంత్రిక అనువాదపు నిష్పత్తి ఎక్కువగా ఉండడం వలన ఇప్పటికీ అనర్థాలు జరుగుతూ ఉండడం, సముదాయం వాటిని గమనిస్తూ, ఆయా వ్యాసాలను తొలగిస్తూ ఉండడం జరుగుతూనే ఉంది కాబట్టీ

కింది నిర్ణయాలను తీసుకుంటున్నాను.

 1. అనువాద పరికరంలో మానవిక అనువాదాలు కనీసం 40% ఉండాలి.
 2. అనువాద పరికరం ద్వారా అనువదించిన వ్యాసంలో "మరియు" అనే పదం ఉంటే ఆ వ్యాసాన్ని ప్రచురించనీయ రాదు. ఆ విధంగా ఒక వడపోతను సృష్టించాలి.
 3. పై వడపోత, నేరుగా సృష్టించే పేజీలను పట్టించుకోరాదు.
__చదువరి (చర్చరచనలు) 04:01, 9 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఇవీ చూడండి

[మార్చు]