వికీపీడియా:రచ్చబండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడ్డదారి:
WP:VP
రచ్చబండ
వార్తలు | పాలసీలు | ప్రతిపాదనలు | సాంకేతికము | ఆలోచనలు | పత్రికా సంబంధాలు | ఇతరత్రా.."మరియు" వడపోత విషయంలో ఒక గమనిక[మార్చు]

ఈ రోజు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనే పేజీని అనువాద పరికరం నుండి ప్రచురించే క్రమంలో నేను చేసిన పరిశీలన ఇది:

 1. అనువాదం ముగించి "ప్రచురించు" నొక్కాను.
 2. నీ పేజీలో "మరియు" ఉంది కాబట్టి వడపోత దాన్ని అడ్డుకుంది, లాంటిదేదో చెప్పి ప్రచురించలేదు.
 3. ఫైండ్ అండ్ రీప్లేస్ వాడి పేజీ అంతా వెతికాను. "మరియు" అనే ముక్క ఒక్కటి కూడా లేదు.
 4. సరే.. మళ్ళీ "ప్రచురించు" నొక్కాను. మళ్ళీ అదే ముక్క చెప్పి ప్రచురణను నిరాకరించింది.
 5. వడపోతలో ఏమైనా తప్పుగా రాసానేమోనని భావించి, దాన్ని అచేతనం చేసేసాను. పేజీని ప్రచురించాను.
 6. సందేహం మిగిలే పోయింది. అంచేత, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పేజీని సోర్సు మోడులో తెరిచి "మరియు" కోసం వెతికాను. "నాసా"కు ఇచ్చిన పైపు లింకులో "మరియు" అనే మాట ఉంది. వడపోత ఎందుకు అడ్డం పడిందో అపుడర్థమైంది. తప్పు ఎక్కడ జరిగిందో తెలిసిపోయింది కాబట్టి, వెంటనే వడపోతను చేతనం చేసేసాను. విషయమేంటంటే..
  • అనువాద పరికరం విజువల్ ఎడిటరు మోడ్‌లో పనిచేస్తుంది. అందులోని ఫైండ్ రీప్లేస్ అంశం, "పైపు లింకు" లక్ష్యంలో వెతకదు.
  • వడపోత మాత్రం "పైపు లింకు" లక్ష్యంలో కూడా వెతుకుతుంది (అది వికీటెక్స్టులో వెతుకుతుందన్న మాట)

కాబట్టి, అనువాదాన్ని ప్రచురించేటపుడు, పైపు లింకుల్లో కూడా "మరియు" లేకుండా చూసుకోవాలి. నాబోటి మందమతులు ఇంకా ఎవరైనా ఉంటే వారి దృష్టికి తెస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 14:30, 3 మార్చి 2020 (UTC)

"ప్రబోధానంద యోగీశ్వరులు" అను ఈ పేజీ ని వికీపీడియా నుండి తొలగించగలరు.[మార్చు]

ప్రబోధానంద యోగీశ్వరులు గురువు గారి గురించి కేవలం ఆన్ లైన్ ఎడిషన్ లేదా వార్తా పత్రికలలో వచ్చిన సమాచారం ను ఆధారం చేసుకుని వికీపీడియా లో రాస్తున్నారు. అనేక అవాస్తవాలు ఈ పేజీ లో చేరుస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఉదాహరణ కు ఈ పేజీ లో కొన్ని అవాస్తవాలు

 1. యోగీశ్వరులవారి మతము " ఇందు" అని రాశారు. ఇది తప్పు.
 2. యోగీశ్వరులవారు వివాదాస్పద రచయిత అని వ్రాశారు. ఇది తప్పు.
 3. ఆయుర్వేదం పై పుస్తకాలు రాశారు అన్నది తప్పు.
 4. "రాముడు భగవంతుడు కాదు అని గ్రంధాలలో రాశారు" అని వికీ పెడియా పేజీ లో చేర్చారు. గ్రంధాలలో ఎక్కడా ఆ విధంగా రాయలేధు, చెప్పలేదు.
 5. విరాళాలు సేకరిస్తారు అని రాశారు. ఇధి తప్పు.
 6. దైవ విషయాలపై భగవద్గీత బైబిల్ ఖురాన్ గ్రంధాల ఆధారంగా చెప్తుంటే, "వీరికి తమవైన వ్యాఖ్యానాలు ఉన్నాయి " అని రాశారు. ఇది తప్పు.
 7. "తెలుగు భాష వల్లనే ఆత్మ జ్ఞానం చెప్పేందుకు వీలుంది. రానున్న భవిష్యత్తులో అంధరూ తెలుగు నేర్చుకుంటారు." అని చెప్పని విషయాలను యోగీశ్వరుల వారు చెప్పినట్లుగా రాశారు.
 8. "వినాయక చవితి పండుగ తమ ఆచారాల కు విరుద్ధం అంటూ భక్తులు దాడి ప్రారంభించారు." అని అవాస్తవాన్ని రాశారు.
 9. "ముస్లీములు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు." అని అవాస్తవాన్ని రాశారు.
 10. "వాహనాలకు భక్తులు నిప్పు పెట్టారు. " అని అబద్దం రాశారు.

యోగీశ్వరులవారు చెప్పే విషయాలు అర్థం కావాలంటే వారు రచించిన గ్రంధాలు శ్రద్ధగా చదవాలి, అర్థం చేసుకోవాలి. అంతేకానీ వార్తా పత్రికలలో వచ్చిన విషయాల ఆధారం గా యోగీశ్వరుల వారి గురించి అంచనావేయవద్దు. కావున వికీపెడియా నుండి ఈ పేజీ "ప్రబోధానంద యోగీశ్వరులు" ని తొలగించగలరు.05:33, 5 March 2020Time963 talk contribs

వికీపీడియాలో రాసే సమాచారమంతా పరిశోధనా పత్రాలు, పుస్తకాలు, పేరొందిన వార్తా పత్రికలు ద్వారా ప్రచురించిన వ్యాసాల ఆధారంగానే సాగుతుంది. సభ్యులు వ్యక్తిగత అభిప్రాయాలు రాయకూడదు. వికీ సభ్యులు తమ సొంత అభిప్రాయాలు కాకుండా ఇదివరకే ప్రచురితమైన సమాచారాన్ని ఆధారంగా రాసింది కాబట్టి ఈ వ్యాసాన్ని తొలగించడం కుదరదు. రవిచంద్ర (చర్చ) 08:11, 5 మార్చి 2020 (UTC)
రవిచంద్ర గారి అభిప్రాయాన్ని సమర్ధిస్తున్నాను. Time963 గారూ,
 1. మీరు చాలా "తప్పు"లను ఎత్తి చూపారు. కానీ వ్యాసంలో ఆ "తప్పు"లకు మూలాలను చూపించారు. కాబట్టి మీరు తప్పు అన్నంత మాత్రాన చెల్లదు. ఎందుకు తప్పో ఆధారాలతో చూపాలి, ఏది ఒప్పో ఆధారాలతో చూపాలి.
 2. వార్తా పత్రికల ఆధారంగా రాస్తున్నారు అని అన్నారు.. వార్తాపత్రికలను వీకీఫీడియా విస్వసనీయ మూలాలు గానే పరిగణిస్తుంది. కాబట్టి దానిపట్ల మీ అభ్యంతరం చెల్లదు.
ఇకపోతే, మీరు చెప్పేవాటికి సరైన మూలాలను చూపిస్తూ చర్చ పేజీలో రాయండి. ఇతర వాడుకరులు కూడా పరిశీలించాక, మీరు చెప్పినవే సరైనవని తేలిన వాటిని మార్చవచ్చు. లేదంటే ఉంచెయ్యవచ్చు. పేజీని తొలగించాల్సిన అవసరం లేదు. __చదువరి (చర్చరచనలు) 15:01, 5 మార్చి 2020 (UTC)
Time963 గారూ, తెలుగు వికీపీడియాకు మీరు ఇంకా బేబీలాంటివారు.ఎందుకన్నానంటే ఆ మాట మీరు వికీపీడియాలో రిజిష్టరై (2020 జనవరి 18) పూర్తిగా మూడు నెలలు కాలేదు.మీరు, నేను, వికీపీడియా మార్గదర్శకాలు,నియమాలు తెలుసుకోవలసినవి చాలా ఉన్నవి.మీకు అవి పూర్తిగా తెసుసుకోనందున అంత ఆవేశంగా ఉన్నారు.దయచేసి నిదానంగా ఆలోచంచండి.ఏ వ్యాసం ఉండాలో, ఏ వ్యాసం ఉండకూడదో వికీపీడియా మార్గదర్శకాలకు, నియమాలకు, సముదాయం నిర్ణయాల మేరకు లోబడి ఉంటుంది.ఏ వాడుకరికి వికీపీడియాలోని వ్యాసాలపై అతి అభిమానం, ద్వేషం ఉండకూడదు.అతి అభిమానం ఎందుకన్నానంటే ఈ లింకు గమనించండి. సమాచారపెట్టెలో పేరు ముందు మూడు శ్రీ లు తగిలించారు.ఆ ఎడిటును రద్దు చేయగా మరలా నెట్ ఐడి తో మూడు శ్రీ లు తగిలించారు.ఆ లింకు చూడండి.అది మీ తప్పు కాదు.వికీపీడియా నియమాలు మార్గదర్శకాలు తెలుసుకోనందువలన అలా చేసి ఉంటారనుకుంటున్నాను.వికీపీడియా:శైలి ఒకసారి చదవండి.రవిచంద్ర గారి, చదువరి గారి అభిప్రాయాలుతో నేను ఏకీభవిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 16:55, 5 మార్చి 2020 (UTC)

."ప్రబోధానంద యోగీశ్వరులు" అను ఈ పేజీ కి సంబందించిన నిర్వాహకులు ఎవరు , వారి ఫోన్ నంబర్లను ఇవ్వగలరు[మార్చు]

."ప్రబోధానంద యోగీశ్వరులు" అను ఈ పేజీ కి సంబందించిన9491040963. వికీపీడియా నిర్వాహకులు ఎవరు , వారి ఫోన్ నంబర్లను ఇవ్వగలరు . నా పేరు తిరుమలేశ 9491040963 కు కాల్ చేయగలరు. 2020-03-05T21:48:56(IST) Time963

వికీపీడియా లో ఏ పేజీకి నిర్వాహకులు అంటూ ఉండరు. ఏ వ్యాసమైనా సమిష్టిగా రాస్తారు. ఇకపోతే ఫోను నంబరు ఇవ్వరు. ఎందుకంటే వికీలో వ్యాసాలకు సంబంధించిన చర్చ వికీలో మాత్రమే రాతపూర్వకంగా జరగాలి. వ్యక్తిగతం మాట్లాడ్డం వల్ల సమస్య పరిష్కారం కాదు. రవిచంద్ర (చర్చ) 17:28, 5 మార్చి 2020 (UTC)

కర్ణాటక సంగీతంలో రాగానికి నొటేషన్ తెలుగులొ ఎలా రాయాలి.[మార్చు]

సంగీతంలో ఏడు స్వరాలు, పన్నెండు స్వరస్థానాలు ఉంటాయి. 'స' మరియు 'ప' స్వరాలకి ఎటువంటి వైవిధ్యాలు ఉండవు, అందుకే వాటిని ప్రకృతి స్వరాలు అంటారు. మిగితా స్వరాలు అంటే 'రి', 'గ', 'మ', 'ద', 'ని' కి వైవిధ్యాలు ఉంటాయి. ఈ వైవిధ్యాలను చూపించడానికి ఉపలిపి (సబ్స్క్రిట్) వాడతారు. ఈ స్వరాలని సూచించడానికి లాటిన్ అక్షరాలు 'S', 'R', 'G', 'M', 'P', 'D', 'N' కూడా వాడతారు. స్వరాలలో వైవిధ్యాలను చూపించడానికి రెండు మార్గాలు ఉన్నాయి.

మోదటి మార్గము: S, R1, R2, R3, G1, G2, G3, M1, M2, P, D1, D2, D3, N1, N2, N3 రెండొ మార్గము: స, రా, రి, రు, గా, గి, గు, మ, మా, ప, దా, ది, దు, నా, ని, ను

మొదటి వ్యవస్థ లాటిన్ అక్షరమాలను ఉపయోగిస్తున్నప్పటికీ అర్థం చేసుకోవడం చాలా సులభం. అందుకే రాగాల గురించి వికిపిడియాలొ వ్యాసాలు రాసినప్పుడు మోదటి పద్ధతి వాడడం ఉచితం అని భావిస్తున్నాను.

సంగీతం నొటేషన్ రాసే పద్ధతి[మార్చు]

పైన సూచించిన పద్ధతి లో లాటిన్ అక్షరమాలలో రాస్తే ఎక్కువ మందికి అర్ధమయ్యే విధంగా ఉంటుందని భావిస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలియజేయండి టి పతంజలి (చర్చ) 07:40, 18 మార్చి 2020 (UTC)

సాముదాయిక కృషి అంటే ఏంటి[మార్చు]

ఈ మధ్య వాడుకరి:యర్రా రామారావు గారు నిర్వహణ పనుల్లో భాగంగా అనువాదం కాని వ్యాసాలను వెతికి వాటిని సృష్టించిన వాడుకరులకు చూపి, అనువదించమని కోరారు. చాలామంది అనుకూలంగా స్పందించారు, కొన్ని అనువాదాలు చేసారు. రామారావు గారికీ, స్పందించిన వారందరికీ వందనాలు. అసలు స్పందించనివారు ఉన్నారు. నెగటివుగా స్పందించినవారూ కనిపించారు. అలాంటివారికి కనువిప్పు కలిగే సంఘటన ఒకటి నేను ఇవ్వాళ చూసాను. రామారావు గారు సూచించిన పేజీల జాబితాపై వెంకటరమణ గారు స్పందించిన తీరు (దానివలన వికీపీడియా ఎంత మెరుగు పడిందో మనం చూడొచ్చు) మనందరికీ మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. సీనియారిటీని చేతల్లో చూపించాలి గానీ, బడాయి కబుర్లు చెప్పడంలో కాదని వెంకటరమణ గారి చర్యలో నేను గ్రహించిన సత్యం. నమస్కారం వెంకటరమణ గారూ! __చదువరి (చర్చరచనలు) 12:46, 20 మార్చి 2020 (UTC)

అవును... వ్యాసాల జాబితా తయారుచేసిన వాడుకరి:యర్రా రామారావు గారికి, వాటిని పూర్తిచేసిన వెంకటరమణ గారికి ధన్యవాదాలు. కొత్త వ్యాసాలను రాయడమేకాదు, పాత వ్యాసాలను పూర్తి చేయడమనేది కూడా ముఖ్యమని తెవికీ సభ్యులు గుర్తించాలి. అరకొర వ్యాసం రాసి, మూలాలు కూడా చేర్చని వ్యాసాలు చాలానే ఉన్నాయి. ఆయా వ్యాసాలను రాసిన వాడుకరులు వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 15:18, 20 మార్చి 2020 (UTC)
అరకొర వ్యాసాల విషయంలో Pranayraj Vangari గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. మొలకల మీద సముదాయం పెట్టిన శ్రద్ధ కారణంగా గానీ, వాటి పట్ల మెరుగైన అవగాహన కలగడం వలన గానీ, మరేదైనా కారణం వలన గానీ.., ఇప్పుడు మొలకల సృష్టి తగ్గినట్టుగా తోస్తోంది (కొత్తగా చేరుతున్నవారు మాత్రం ఇంకా మొలకలు సృష్టిస్తున్నారు). పాతవారు ఇప్పుడు, పైన ప్రణయ్ రాజ్ గారు చెప్పినట్టు గతంలో తాము రాసిన అరకొర వ్యాసాలపై (మొలకల స్థాయి దాటితే దాటి ఉండొచ్చు గాక, కానీ వ్యాసం చిన్నదిగానే ఉంటుంది) దృష్టి పెట్టి మరింత సమాచారాన్ని, తగు మూలాలనూ, ఇతర హంగులనూ చేర్చి విస్తరించడం మీద దృష్టి పెడితే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 17:01, 20 మార్చి 2020 (UTC)
వెంకటరమణ గారు సృష్టించిన వ్యాసాలు అనువదించటమే కాకుండా, స్పందించని ఇతర వాడుకరులు సృష్టించిన వ్యాసాలలో ముఖ్యమైన మంచి వ్యాసాలు తొలగింపుకు గురికాకూడదు అనే దృక్పదంతో ఇప్పటికి సుమారు 10 వ్యాసాలకు పైగా అనువదించారు.ఇది చాలా అభినందించతగ్గ విషయం.ఇది మనందరికీ స్పూర్తిదాయకం.--యర్రా రామారావు (చర్చ) 02:54, 24 మార్చి 2020 (UTC)

కరోనావైరస్ సంబంధిత వ్యాసాలకు ప్రాజెక్టు, ప్రత్యేక కృషికి ఆహ్వానం[మార్చు]

తోటి వికీపీడియన్ మిత్రులకు,

నమస్తే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా గుర్తించిన కరోనావైరస్ వ్యాధి వ్యాప్తి గురించి, భారతదేశంపై దాని ప్రత్యక్ష ప్రభావం గురించి అందరికీ తెలిసేవుంటుందని భావిస్తున్నాను. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది మరణించడం, రెండులక్షలకు పైచిలుకు జనాభా దాని బారిన పడడం జరిగింది. భారతదేశంలో 200 పైచిలుకు రోగులు కరోనావైరస్ 2019 కారణంగా వచ్చే కోవిడ్-19 వ్యాధి నిర్ధారణ అయినవారు ఉన్నారు.

దీని గురించి సరైన సమాచారం కన్నా తప్పుడు సమాచారం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు, సంస్థలు ఈ వ్యాధితో పాటుగా తప్పుడు సమాచారం మీద కూడా సమాంతరంగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ స్వేచ్ఛగా విజ్ఞానాన్ని తెలుగులో అందించే లక్ష్యంతో పనిచేస్తున్న మనకి దీని విషయంలో పవిత్రమైన కర్తవ్యం ఉందని నా నమ్మిక. మనం ఉన్నది కొందరమే కావచ్చు, మన చేతిలో ఉన్న సమయం, శక్తి పరిమితమే కావచ్చు- కానీ కలిసి ప్రాధాన్యతలు నిర్ణయించుకుని మనం పనిచేస్తే గోరంత దీపంలా కొద్ది వ్యాసాలనైనా తయారుచేయడం, తాజాగా ఉంచడం చేయగలమనీ, తద్వారా ఈ పోరాటంలో మనదైన బాధ్యత నెరవేర్చిన సంతృప్తి దక్కుతుందని భావిస్తున్నాను.

ఇందుకోసం, వికీప్రాజెక్టు కోవిడ్-19 ప్రారంభించాను. దీనిలో నాకు తోచిన విధంగా ఓ ప్రాధాన్యతా క్రమాన్ని, చేయగల పనులను సూచించాను. ఇప్పటికే నేను, మహేశ్వరరాజు గారితో కలిసి వీటిలో కొన్ని పనులను చేస్తూ ఉన్నాం. ఐతే, ఈ పనిలో అందరం సమిష్టిగా కృషిచేస్తే మరింత ముందుకుపోగలం అన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం.

దయచేసి పేజీని సందర్శించి మీకు ప్రయత్నం నచ్చితే పని ప్రారంభించగలరు: వికీపీడియా:వికీప్రాజెక్టు/కోవిడ్-19

ధన్యవాదాలతో, --పవన్ సంతోష్ (చర్చ) 11:27, 21 మార్చి 2020 (UTC)

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పేజీ[మార్చు]

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పేజీకి గత 30 రోజుల్లో వచ్చిన పేజీవ్యూలు: 15,405. వాటిలో, గత రెండు రోజుల్లో వచ్చినవి: 7,430 - దాదాపు సగం. కరోనావైరస్ నేపథ్యంలో వాట్సాప్, ఫేసుబుక్కు, ట్విట్టర్లాంటి సామాజిక మాధ్యమాల చలవ ఇది. దీన్ని సముదాయం దృష్టికి తెస్తున్నది, కాలక్షేపం కోసం మాత్రమే. __చదువరి (చర్చరచనలు) 15:44, 21 మార్చి 2020 (UTC)

ఖాళీ వర్గాలు[మార్చు]

ప్రత్యేక:వాడనివర్గములు వర్గంలో దాదాపు 1000 వర్గాలున్నాయి. పేజీలు గానీ, ఉపవర్గాలు గానీ ఏమీ లేని ఖాళీ వర్గాలు ఇవి. వీటిని AWB ఉపయోగించి తొలగిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 15:58, 23 మార్చి 2020 (UTC)

అలాగేనండి. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:02, 23 మార్చి 2020 (UTC)
చదువరి గారూ తెవికీలో మీ ప్రక్షాళన కార్యక్రమానికి ధన్యవాదాలు. --యర్రా రామారావు (చర్చ) 17:48, 23 మార్చి 2020 (UTC)

కొత్త వ్యాసాల సృష్టింపు ఆపి, పాత వ్యాసాల అభివృద్ధిపై కొంతకాలం దృష్టిపెడదాం[మార్చు]

ప్రణయరాజ్ గారూ, చదువరి గారూ అభిప్రాయాలుతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.నాకు అందరిలాగనే వ్యాసాలు సృష్టింపు చేయాలనే అభిలాష ఉన్నా, నిర్వాహకుని బాధ్యతలలో భాగంగా ఎక్కువ సమయం నేను పరిశీలించాటానికి సరిపోతుంది.దాని ప్రకారం తగిన సవరణలు చేయుట జరుగుతుంది. అందులో భాగంగా నేను కొన్ని వర్గాలలోని అన్ని వ్యాసాలను, ప్రతి వ్యాసం పరిశీలించగా నాకు కొన్ని లోటుపాట్లు సృష్టంగా తెలిసినవి. విషయసంగ్రహం ఎక్కువుగా రాయాల్సిన చాలా వ్యాసాలు రెండు లేక మూడు వాక్యాలతో అరకొర సమాచారంతో చాలా కాలం నుండి ఎటువంటి అభివృద్ధికినోచుకోకుండా అలానే ఉన్నవి.ఇంకా గమనించిన కొన్ని లోటుపాట్లు ఉన్ననూ ఎత్తిచూపుట సమంజసంకాదనిపిస్తుంది.తెవికీ నాణ్యతలో భాగంగా 2020 ఏప్రియల్ 1 నుండి ఎవరికివారు స్వచ్చంధంగా వ్యాసాలు సృష్టింపుఆపి, 15 రోజులపాటు పాత వ్యాసాల అభివృద్ధిపై దృష్టిపెట్టగలందులకు కోరుచున్నాను. మీరు సృష్టించిన వ్యాసాలలో 30 వ్యాసాలను ఎంపిక చేసుకొని రోజుకు రెండు చొప్పున విస్తరించవచ్చును.జాబితా తయారుచేసి ఏప్రియల్ 28లోపు సముదాయంలో ప్రవేశపెట్టవలసిందిగా కోరడమైనది.అలాంటి వ్యాసాలు లేని వాడుకరులు వారికినచ్చిన ముఖ్యమైన వ్యాసాలు ఎంపిక చేసుకొనవచ్చును.దీని మీద గౌరవ వికీపీడియన్లు స్పందించగలరు.

ఇక్కడ ఈ వ్యాసం మీద జరిగిన చర్చ, గమనించండి. వ్యాసం సృష్టించింది 2012 మే, అభివృద్ధి జరిగింది నిన్న, మొన్న. అభివృద్ది ఎలా జరిగిందో గమనించగలరు. సృష్టించిందొకరు. తొలగింపు మూస పెట్టినది ఒకరు.అభివృద్ది చేసింది ఒకరు. తిరిగి తొలగింపు మూస పెట్టిన వాడుకరిచే మూలాలు కూర్పు.--యర్రా రామారావు (చర్చ) 19:13, 24 మార్చి 2020 (UTC)

(ఈ ప్రతిపాదనను ప్రత్యేక విభాగం లోకి మార్చాను)__చదువరి (చర్చరచనలు) 02:04, 25 మార్చి 2020 (UTC)

స్పందనలు, అభిప్రాయాలు[మార్చు]

రామారావు గారూ, కేంద్రం ప్రకటించిన మరో 21 రోజుల లాక్‌డౌన్‌ను గట్టిగా వాడుకోవాలని సంకల్పించినట్టున్నారు, భేష్! ప్రతిపాదన నాకు నచ్చింది సార్. ఈ వ్యాసాల అభివృద్ధి కార్యక్రమంలో నేను పాల్గొంటాను. ఇటీవల తొలగించిన యాంత్రికానువాద వ్యాసాల్లో, మార్చి 31 లోపు ఇరవయ్యింటిని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ నెలంతా ఆ పనితో బిజీ. ఏప్రిల్ 1 నుండి కొత్త వ్యాసాల సృష్టి ఆపేసి, మీరు ఇస్తున్న పనిలో పాల్గొంటాను. ఈ 15 రోజుల్లో నేను 8 వ్యాసాలను అభివృద్ధి చెయ్యాలని అనుకుంటున్నాను. రెండు రోజుల్లో వ్యాసాలను ఎంచుకుని జాబితాను ఇక్కడ పెడతాను. కొన్ని సూచనలు:

 1. ఈ ప్రతిపాదనను ఒక వికీప్రాజెక్టుగా చేపడితే బాగుంటుంది. "వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2020 ఏప్రిల్" లాంటి పేరుతో కొత్త పేజీని తెరవండి సార్. అక్కడి నుండే పని చేద్దాం.
 2. ఈ అభివృద్ధి కార్యక్రమం నెల రోజుల పాటు చేస్తే బాగుంటుంది.
 3. కార్యక్రమంలో భాగంగా ఒక పేజీపై ఒకరి కంటే ఎక్కువ మంది పాల్గొనవచ్చు.
 4. పాల్గొనాలి కూడా! నాబోటి కేవల-అనువాద-వీరులకు వ్యాసాలన్నీ పాఠ్యం, బొమ్మలు, మూలాలు, సమాచారపెట్టెలు.. వగైరాలతో వడ్డించిన విస్తరి లాగా ఉంటాయి కాబట్టి వాటి కోసం వెతుక్కోనక్కర్లేదు. అనువదించెయ్యడమే! దించెయ్యడమే!! కానీ నేరుగా అభివృద్ధి చేసే వ్యాసాల్లో అన్నిటినీ వెతుక్కోవాలి. అటువంటి వాటిపై అనేకమంది పనిచేస్తే తప్ప పని తెమలదు. (పదిమంది పనిచేసినపుడు కొన్ని సందర్భాల్లో వ్యాసం అతుకుల బొంతలా తయారౌతుంది. ఇది వికీ వ్యాసాల్లో చాలా సహజం. అసలు వికీ పద్ధతే అంత. అలా వ్యాసం అభివృద్ధి చెందాక, పాఠ్యం మొత్తాన్నీ ఒక పద్ధతిలో తిరగ రాసుకుంటే, వ్యాసం చదవడానికి మరింత వీలుగా ఉంటుంది.) కాబట్టి అలాంటి వ్యాసాలపై పనిచేసేవారు ఒక బృందం లాగా, పరస్పర సమన్వయంతో పని చేస్తే బాగుంటుంది -ప్రస్తుతం కోవిడ్-19 వ్యాసాలపై అలా పనిచేస్తున్నట్టున్నారు.
 5. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే బాగుంటుంది. కనీసం పది మంది పాల్గొంటే, నెల రోజుల పాటు పనిచేస్తే, ఒక్కొక్కరూ సగటున పది వ్యాసాలను మెరుగు పరిస్తే మొత్తం వంద వ్యాసాలు మెరుగౌతాయి. పరిశీలించండి. యర్రా రామారావు, సుజాత, వెంకటరమణ, ప్రణయ్ రాజ్, స్వరలాసిక, రవిచంద్ర, మహేశ్వరరాజు, వైవియెస్ రెడ్డి, పవన్ సంతోష్, .. లాంటి చురుగ్గా రాసేవాళ్లంతా ముందుకొచ్చి ఇందులో పాల్గొంటే.. వంద ఒక లెక్క లోది కాదని నా ఉద్దేశం.

పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 03:13, 25 మార్చి 2020 (UTC)

ఒక బృందం లాగా, పరస్పర సమన్వయంతో పని చేస్తే బాగుంటుంది అనే చదువరి గారి అభిప్రాయం నేనూ ఏకీభవిస్తున్నాను.వారి సూచన ప్రకారం ప్రాజెక్టు పేజీ తయారుచేస్తున్నాను.సాయంత్రంలోగా సముదాయంలో ప్రవేశపెట్టగలను.--యర్రా రామారావు (చర్చ) 07:36, 25 మార్చి 2020 (UTC)

ప్రాజెక్టుపేజీ సముదాయం దృష్టికి ప్రవేశం[మార్చు]

ఈ కార్యక్రమానికి ప్రాజెక్టుపేజీ నొకదానిని తయారుచేసి సముదాయం దృష్టికి ప్రవేశపెట్టటమైనది. సుజాత, వెంకటరమణ, ప్రణయ్ రాజ్, స్వరలాసిక, రవిచంద్ర, మహేశ్వరరాజు, వైవియెస్ రెడ్డి, పవన్ సంతోష్, చదువరి, Kasyap, Tpathanjali, Vmakumar, Naidugari Jayanna ... గారలు లాంటి చురుకైన వాడుకరులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచూ, సందేహాలు, సూచనలు, అభిప్రాయాలు, స్పందనలు ప్రాజెక్టుపేజీలో తెలుపవలసిందిగా కోరుచున్నాను. --యర్రా రామారావు (చర్చ) 15:58, 25 మార్చి 2020 (UTC)
చాలా మంచి ఆలోచన , చాలా సాంకేతిక వ్యాసాలు లో మార్పులు చేయాలి, నేనూ మీతోనే Kasyap (చర్చ) 06:53, 25 మార్చి 2020 (UTC)
చాలా మంచి ఆలోచన. అనేక సంవత్సరాల నుండి మొలక స్థాయి దాటని వ్యాసాలు అనేకం ఉన్నాయి. 2009లో ఈ మొలక వ్యాసాల అభివృద్ధి కోసం బాటుతో వికీపీడియా:మొలకల జాబితా/1.5 తయారుచేయడం జరిగింది. అందులో కొన్ని వ్యాసాలు మాత్రమే మొలక స్థాయి దాటినా అనేక వ్యాసాలు అలానే ఉన్నాయి. తరువాత ఏప్రిల్ 2013, జూన్ 2013, సెప్టెంబరు 2014,జూన్ 2014, జనవరి 2016 వంటి కొన్ని నెలవారీ పేజీలు సృష్టించబడిన మొలకల జాబితాలను తయారుచేసి, ఆయా వాడుకరులు అభివృద్ధి చేయాలని నిర్వాహకులు కోరినా ఎటువంటి ఫలితం కనబడలేదు. అప్పటి నుండి మొలకలు పెంచుకుంటూనే పోతున్నారు. మొలక పేజీల నియంత్రణ విధానం వచ్చిన తర్వాన కూడా మొలకల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అటువంటి మొలక వ్యాసాల సృష్టి తక్కువగానే ఉంది. చాలా కాలం క్రితం క్రియాశీలకంగా ఉన్న వాడుకరులు మొలకలు సృష్టించిననూ, ప్రస్తుతం వారు క్రియాశీలకంగా లేనందున వారినే అభివృద్ధి చెయమనడం సరికాదు. ఈ మొలక వ్యాసాల విస్తరణ కృషి సమిష్టిగానే జరగాలి. అందరూ సమిష్టి కృషితోనే జరగాలి. దీని కోసం కొత్త వ్యాసాల సృష్టి ఆపవలసిన పనిలేదు. అవి ఆశక్తి ఉన్నవారు రాసుకొంటూ కూడా మొలకల విస్తరణపై కృషి చేయవచ్చు. కనుక మొలక వ్యాసాల జాబితాను తయారుచేస్తే వాటిని 2 కె.బి వ్యాసాలుగా, విస్తరిత వ్యాసాలుగా మార్చవచ్చు. ఈ ప్రాజెక్టులో నేను కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను.--కె.వెంకటరమణచర్చ 16:51, 25 మార్చి 2020 (UTC)
కె.వెంకటరమణ గారూ ఇది స్వచ్ఛందంగా పాల్గొనే కార్యక్రమం. వ్యాసాల సృష్టింపు నిలుపుదల అనే మాట ప్రాజెక్టుపని ముందుకు సాగటానికి మాత్రమే ఉపయోగించబడింది.ఎవరైనా వాడుకరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ, వ్యాసాలు సృష్టింపుచేస్తూ ఉన్ననూ అభ్యంతరం ఏమీలేదు.ఏ విధంగా చేసినా మొలక వ్యాసాలు, అరకొర వ్యాసాలు అవసరమున్నంతవరకు పూర్తి సమాచారంతో అభివృద్ధి చేయాలనే గదా మనందరి సంకల్పం.వాటిమీద దృష్టిపెట్టకపోతే ఆ విధంగా రాసుకుంటూపోతూ ఉంటే వికీపీడియాలో కొన్నాళ్లకు అరకొర సమాచారం మాత్రమే ఉంటుందనే అభిప్రాయం రాకూడదని నా అభిప్రాయం.ఇప్పటికీ అలాంటి వ్యాసాలు సృష్టింపు జరుగుచున్నమాట వాస్తవం.మొలక వ్యాసాలమీద ఎంతమంది స్పందించి పనిజరుగుతుందో మనం గమనిస్తూనేఉన్నాం.--యర్రా రామారావు (చర్చ) 13:51, 26 మార్చి 2020 (UTC)
చాలా మంచి ఆలోచన. నేను కూడా ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:21, 28 మార్చి 2020 (UTC)
ఉపయుక్తకరమైన ఆలోచన..నేను కూడా ఈ ప్రాజెక్టులో పాల్గొంటాను.--Ajaybanbi (చర్చ) 17:04, 28 మార్చి 2020 (UTC)