వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 63

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 62 | పాత చర్చ 63 | పాత చర్చ 64

alt text=2018 డిసెంబరు 6 - 2019 జనవరి 27 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2018 డిసెంబరు 6 - 2019 జనవరి 27

ప్రదర్శిత వ్యాసాల్లో సమస్యలు - సమిష్టి కృషికి ప్రతిపాదన[మార్చు]

మనం గత పదేళ్ళుగా మొదటి పేజీల్లో ప్రదర్శించుకున్న వ్యాసాలను వికీపీడియా:చదవదగ్గ వ్యాసాల జాబితాగా ఓ జాబితా వేశాం. ప్రదర్శించే వ్యాసాలను కొన్ని పరామితులు విధించుకుని ఎంపిక చేస్తున్నాం కానీ మరీ గట్టి నిబంధనలు (ఆంగ్ల వికీపీడియా శైలిలో), సమీక్షలు చేసి ఎంపిక చేయట్లేదు. కాబట్టి ఈ వ్యాసాలు ఒక మేరకు మన నాణ్యతను ప్రతిబింబిస్తాయి. వీటిని విశ్లేషించడం, వీటిపై పనిచేయడం, వీటిపై ఇప్పటివరకూ ఎక్కువ పనిచేసినవారిని గుర్తించడం వంటివి మన నాణ్యత పెంపుకు పనికివస్తాయని ఆశిస్తున్నాను. ఆ మేరకు మొదట ప్రదర్శిత వ్యాసాల్లో ఇప్పటికే గుర్తించిన నాణ్యతా సమస్యలు ఉన్నవాటిని వెతికి పట్టుకున్నాను. వికీపీడియా:చదవదగ్గ వ్యాసాల జాబితా/నిర్వహణ సమస్యలున్న వ్యాసాలు అన్న జాబితా వేశాను. వీటిని అందులో నిర్వహణా పరమైన మూసలు, వర్గాల ఆధారంగా విశ్లేషించానే తప్ప ప్రత్యేకించి సమీక్షించలేదని గుర్తించాలి. కాబట్టి ఇది మొదటి మెట్టు. మొత్తం 560 ప్రదర్శిత వ్యాసాలు తీసుకుంటే వాటిలో 93 వ్యాసాల్లో నిర్వహణ మూసలు ఉన్నాయి. వాటిలో 47 తెగిపోయిన ఫైలు లింకులున్నవి. (ఎప్పటికప్పుడు కామన్స్ డీలింకర్ పనిచేస్తున్నా ఇవి ఉండడానికి కారణం, ఫైలు పేర్లను ఎవరో తప్పుగా దిద్దడం, స్థానికంగా ఎక్కించిన దస్త్రాలను తొలగించిన నిర్వాహకులు డీలింక్ చేయకపోవడం) బయటి లింకులు డెడ్ లింకులుగా ఉన్నవి మరో 3. మూలాల సమస్యలు ఉన్న వ్యాసాలు 16 కాగా, వికీకరించాల్సినవి, మౌలిక పరిశోధన ఉన్నవి చెరో 5. ఇక గూగుల్ అనువాద వ్యాసాలు 14 వ్యాసాలను (ఇటీవలి కాలంలో మెరుగుపరిచినవి తీసేయగా) మొదటి పేజీలో ప్రదర్శించామన్నది అనూహ్యమైన సంగతి. వీటిపై మనకు సమిష్టి బాధ్యత ఉంది కనుక వీటిని మెరుగుపరచడానికి సమిష్టి కృషి చేద్దామని ప్రతిపాదిస్తున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 06:17, 6 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సమిష్టికృషి అనేది ప్రస్తుత ట్రెండ్ కాదు, కారణం అందరికీ తెలుసు, ఎవరైనా వ్యాసం మొదలెడితే ఇంకెవరైనా దిద్దుబాట్లు చేస్తే వారికి నచ్చకపోవడం లాంటివి ఇప్పటి ట్రెండ్. దీనికి ప్రోత్సాహం కూడా మనద్వారా బాగానే లభించడం వలన వికీలో స్ఠబ్ధత పెరుగుతూపోతున్నది. ఆసక్తి సన్నగిల్లడం కూడా ఉంది. వ్యక్తిగత గుర్తింపు కాస్త పక్కన పెడితే బాగానేవుంటుంది. కాని దాన్ని అధిగమించడం సాధ్యమౌతుందా ?... ఒకవేళ భాద్యతగా ఒకరిద్దరు మొదలెట్టినా మిగతా వాళ్ళు అది తమపని కాదని అనుకుంటారు...దీనికీ మన ప్రోత్సాహమే కారణం అనుకుంటాను..అయినా మార్పు అవసరం కనుక .. ప్రయత్నం చేయాలి...ఇలాంటి సమిష్టి పనుల్లో నేనెపుడూ ఒక చేయి వేయడానికి సిద్దం...బెస్టాప్ లక్...B.K.Viswanadh (చర్చ)
ఈ వారం వ్యాసాలుగా ప్రచురించినవన్నీ నాణ్యత ఉన్నవని నేను అనుకోవడం లేదు. వారం వారం మార్చాలి కాబట్టి ఉన్న వ్యాసాల్లోనే కొంతలో కొంత మంచి వ్యాసాల్ని ఏరి ప్రచురించాల్సి వస్తుంది. దీనికి అసలు సమస్య అనుకున్నంత నాణ్యతా ప్రమాణాలు కలిగిన వ్యాసాలు మనం క్రమం తప్పకుండా రాయలేకపోవడం. వినడానికి కష్టంగా ఉన్నా అందరూ అంగీకరించాల్సిన విషయం ఇది. సమిష్టి కృషికి నేను కూడా సిద్ధమే. రవిచంద్ర (చర్చ) 17:01, 6 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాథ్ గారూ ఎక్కువ ఎడిట్లు చేస్తే గొప్ప అన్న స్థాయి నుంచి ఎక్కువ వ్యాసాల మీద పనిచేస్తే లేక తయారుచేస్తే గొప్ప అన్నదాకా వచ్చాం. ఇదొక ముందడుగు. ఇప్పుడు నాణ్యత వైపుకు, సమిష్టి కృషి వైపుకు అడుగులు వేద్దాం. ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు ట్రెండ్ సృష్టిద్దాం. :-) ఏమంటారు. రవిచంద్ర గారూ ఈ వారం వ్యాసాల నాణ్యతా స్థాయి మన ప్రాజెక్టు నాణ్యత స్థాయిని ప్రతిబింబిస్తున్నందన్నది నిజం. మీరన్నట్టుగా దీన్ని మనందరం కలిసి మారుద్దాం. మెరుగుదల తెద్దాం. దయచేసి పేజీలో సంతకం చేయండి, మీకు నచ్చిన విభాగం తీసుకుని పని మొదలుపెట్టండి. ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపేమున్నది, అందరమొకటై చేయికలిపితే ఎదురేమున్నది. :) --పవన్ సంతోష్ (చర్చ) 05:03, 7 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

New Wikimedia password policy and requirements[మార్చు]

ఈ సందేశాన్ని తెలుగులోకి అనువదించాను, గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 07:14, 25 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

CKoerner (WMF) (talk) 20:03, 6 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగు వికీపీడియా[మార్చు]

నేను గణాంకాలు పరిశీలించినపుడు డిసెంబరు 10 న తెలుగు వికీపీడియా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదనే విషయం తెలిసింది. 2018 ఆగష్టు లో అత్యధికంగా 51.33 లక్షల పేజీ వీక్షణలు నమోదయ్యాయి. అదే నెలలో 10 లక్షల పరికరాల ద్వారా వికీపీడియాని సందర్శిస్తున్నారు. ఇప్పటికి దాదాపు 1200పైగా సభ్యులు (10 లేక అంతకంటే మార్పులు చేసినవారు) ఈ అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. వారందరికి మరియు వికీపీడియా వీక్షకులందరకు నా తరపున, తెలుగువికీ తరపున కృతజ్ఞతలు.--అర్జున (చర్చ) 06:41, 23 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అందరికీ అభినందనలు. --పవన్ సంతోష్ (చర్చ) 07:16, 25 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అందరికీ అభినందనలు... తెలియకుండా సంవత్సరాలు జరిగిపోయాయి.. అంత స్థబ్దంగా ఉందా ? వికీ అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది..ఒడియా, పంజాబీ, తమిళ్ లాంటి ఇతర వికీల్లో ప్రతి చిన్న విషయానికి అందరూ కలవడం, గొప్పగా సెలబ్రెట్ చేసుకోవడం చూస్తే తెలుగు వికీసభ్యుల ఆశక్తి చాలా తక్కువ అని అనిపిస్తున్నది.. చాలా కాలంగా ఉన్న స్థబ్దత ప్రణయ్ కృషి వలన రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమం ద్వారా కొద్దిగా కదిలింది. రెండురోజుల ఆ కార్యక్రమంలో అందరూ కలిసినా,దాన్ని వికీమిత్రులు సద్వినియోగం చేసుకోలేకపోయారు అనుకోవచ్చు. అందరూ కలిసి కూర్చుని వికీ ప్రయాణ అవలోకనం, ప్రస్తుత స్థితి మెరుగు వంటి అంశాలపై కొంత సమయం చర్చించుకుని ఉంటే బావుండేది. అందరి సలహాలు సూచనలు ప్రణాళికలు పరిగణనలోకి రచించిఉంటే కొంత చైతన్యం ఉండేదని నా ఆలోచన.ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఎవరినీ నొప్పించే ఉద్దేశ్యంతో కాదు..B.K.Viswanadh (చర్చ)
పవన్ సంతోష్, B.K.Viswanadh గార్ల స్పందనలకు ధన్యవాదాలు. ముఖ్యంగా విశ్వనాథ్ గారు మంచి విషయం ప్రస్తావించారు. వికీ పని ఆన్లైన్ కాబట్టి, ఆ దిశగా విశ్వనాథ్ మరియు సహసభ్యులు ఆన్లైన్ లో చర్చ ప్రారంభిస్తే బాగుంటుంది. అవసరమైతే ఐఆర్సి లేక గూగుల్ హేంగౌట్ ద్వారా చర్చ కొనసాగించవచ్చు. ఉదాహరణకు గతంలో ప్రణాళికలకొరకు వర్గం:వికీపీడియా లక్ష్యాలు లో వ్యాసాలను చూడవచ్చు.--అర్జున (చర్చ) 10:19, 26 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
మీ అభిప్రాయం సరైనదే B.K.Viswanadh గారు. రవీంద్రభారతిలో అక్టోబర్ లో జరిగిన కార్యక్రమంకు వచ్చిన తెవికీ మిత్రులు కూడా ఈ విషయమై ప్రస్తావన తెచ్చారు. గతంలో తెలుగు వికీపీడియా దశ-దిశ కాన్ఫరెన్సు ప్రతిపాదనపై జరిగిన చర్చ గురించి వారికి చెప్పాను. త్వరలోనే ఆ కార్యక్రమంను నిర్వహించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 12:12, 26 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

క్షమించాలి, విశ్వనాధ్ గారూ, వికీ స్తబ్దంగా లేదు, మీరే మాపై పరాకున ఉన్నారని మేలమాడుతున్నందుకు. పైన ఇప్పటికే ప్రణయ్ రాజ్ గారు చెప్పినట్టు మనం తెలుగు వికీపీడియా దశ-దిశ కాన్ఫరెన్సు ప్రతిపాదించుకున్నాం. ఇక గతంలో జరిగిన భారీ స్థాయి ఆఫ్ లైన్ కార్యక్రమాల విషయంలో మనవాళ్ళు "ఏం సాధించాం" అన్న ప్రశ్న లేవనెత్తారు. కాబట్టి భారీ కార్యక్రమాలు చేయకుండా పెద్ద ఎత్తున ఫలితాలు సాధించలేమా అని ప్రశ్నించుకున్నాను. ఆ దిశగా ప్రయత్నించి విజయం సాధించాం.

 • పదుల సంఖ్యల్లో పార్టిసిపెంట్లు పాల్గొన్న కార్యశాలలకు మించి చిరు వ్యక్తిగత శిక్షణలతోనూ, ఆసక్తిని గుర్తించి పనిచేయడంతోనూ వాడుకరి:Katta Srinivasa Rao, వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:Yasshu28, అజయ్ బండి, ఆదిత్య పకిడె (వికీమీడియా కామన్సు), గుంటుపల్లి రామేశ్వరం (తెలుగు వికీసోర్సు) వంటి సభ్యులను చురుకైన సభ్యులుగా మలుచుకోగలిగాం. తదుపరి దశగా వచ్చే నెలల్లో వీరి నాయకత్వంలో మరింతమంది కొత్త చురుకైన (కేవలం కొత్త వాడుకరులు రావడం మన లక్ష్యం కాదిప్పుడు) వాడుకరులను తీసుకువచ్చే ప్రయత్నాలకు శ్రీకారం చుడుతున్నాం. అదీ భారీ కార్యక్రమాల ద్వారా కాదు, గట్టి ప్రయత్నాల ద్వారా. వీరిలో కొందరు తెలుగు వికీపీడియాను ఆశ్చర్యకరమైన పురోగతివైపుకు నడిపగా, మరికొందరు ఆ క్రమంలో అడుగులు (పెద్దవే) వేస్తున్నారు. ఈ ప్రయత్నం వేగవంతం కావడానికి వికీపీడియా:కొత్తవారికి సహాయం ప్రయత్నం రూపొందించాం, పరిశీలించగలరు.
 • పైన చెప్పుకున్న పెద్ద పెద్ద కార్యక్రమాల్లో మనం నిర్దేశించుకున్న సామూహిక లక్ష్యాల్లో నాణ్యత ఒకటి కదా. నాణ్యతాపరంగా అత్యంత పెద్ద సమస్యగా మనం గ్రామాల వ్యాసాలను గుర్తించాం కదా. వాడుకరి:Chaduvari గారితో మేం సహనిర్వాహకత్వం వహించి, వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:Bhaskaranaidu, మరికొందరు ఇతర సభ్యుల సహకారంతో వాటిని మెరుగుపరిచే ప్రయత్నాలు చేశాం. దీనిలో మొదటి దశ గత రెండు నెలల క్రితమే విజయవంతంగా పూర్తైంది. 25 వేల పైచిలుకు వ్యాసాలు చక్కని దశకు వచ్చాయి. మరింత మెరుగుపరచాల్సి ఉంది. తర్వాతి దశలో ఈ ప్రాజెక్టు నాయకత్వాన్ని రామారావు గారు చేపట్టగా, మేం సహకరించనున్నాం. వాడుకరి:Ajaybanbi దీనిలో పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తపరిచారు. మీరు ప్రస్తావించిన తెలంగాణ కాన్ఫరెన్సులోనే రామారావు గారు సవినయంగానూ, కాస్త సగర్వంగానూ దీన్ని వివరించడం వినే ఉంటారు. దీని విషయంలో భారీ కార్యక్రమాలేమీ జరగలేదు. పని అంతా ఆన్-వికీ జరిగింది. నాణ్యతాపరంగా ఇదొక ఘన విజయం.
 • నాణ్యతాపరంగా చూస్తే: దిద్దుబాట్లు లెక్కించుకునే స్థాయి నుంచి తయారుచేసిన వ్యాసాలు లెక్కపెట్టుకునే మెట్టుకు చేరాం. దీనికి ప్రధానమైన కారణం వాడుకరి:Pranayraj1985 చేస్తున్న వెయ్యి వ్యాసాల యాగం. ఇదేమంత నిశ్శబ్దంగా జరగలేదు, అలా జరిగే వీలూ లేదు. కానీ మనలో వచ్చిన ఈ మార్పు నిశ్శబ్దంగానే జరిగింది. అంతేనా భారీ కార్యక్రమాల నిర్వహణ అవసరం లేకుండానే ఇదీ సాధ్యపడింది. ఇక ఈ దశ నుంచి మనమూ మంచి వ్యాసం ప్రమాణాలు రూపొందించుకుని, మన వ్యాసాల మంచిని కొలబద్ద మీద లెక్కబెట్టుకునే సత్సంప్రదాయం ప్రారంభిస్తున్నాం. ఇలా చేయడానికి ముందు కావాల్సింది - ఒక కొలబద్ద. అందుకు వికీపీడియా:శైలి సహా పలు అంశాలు రూపొందించాం. అంతేగాక కొలబద్ద మీద లెక్కించేందుకు మంచి వ్యాసాలూ ఉండాలిగా. అవీ రూపొందిస్తున్నాం. భవిష్యత్తులో మనం ఘనంగా చెప్పుకునేలా మంచి వ్యాసాలను తయారుచేస్తాం. భవిష్యత్తులో ఒక తెలుగు వికీపీడియన్ నేను ఇన్ని మంచి వ్యాసాలు రూపొందించి, ఇన్ని మంచి వ్యాసాలు రివ్యూ చేశానని చెప్పుకుంటారే కానీ ఇన్ని లక్షల దిద్దుబాట్లు చేశామని చెప్పుకోరు. ఆ రోజు తీసుకురావాలనే మా ప్రయత్నం.

ఇవన్నీ ఏ హడావుడి లేకుండా సాధించినవి. ఇందుకు కారణం విజ్ఞులైన వికీపీడియన్లు పెద్ద ఎత్తున సంబరాల బదులు మంచి ప్రయత్నాలను మాత్రమే హర్షిస్తూ ఉండడం, అందుకు అనుగుణంగా పలు వ్యాఖ్యలు చేయడం. తాజాగా ప్రణయ్ ఇచ్చిన దశ-దిశ కాన్ఫరెన్సు ప్రతిపాదనలో అర్జున గారి ప్రతిపాదన దాన్నే సూచిస్తోంది. ఏం? మనం సాధించిన విజయాలను, మనం సాధించాల్సిన మైలురాళ్ళను ప్రస్తావిస్తూ ఓ కార్యక్రమం చేసుకోకూడదా? అంటే చేసుకోవచ్చనే, చేసుకోవాలనే అంటాను. (అందుకే కదా ఆ కాన్ఫరెన్సు ప్రతిపాదించాను) కానీ, తెవికీ స్తబ్దమైపోయిందంటే అంగీకరించలేను. మనం సాధిస్తున్న ఫలితాలే మన చైతన్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. సుదీర్ఘమైన వ్యాఖ్య విసుగెత్తిస్తే క్షంతవ్యుణ్ణి, ఆలోచింపజేస్తే సంతోషం. --పవన్ సంతోష్ (చర్చ) 17:09, 26 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పైన రాసిన వాటిలో వాడుకరి:Arjunaraoc గారి నాయకత్వంలో వాడుకరి:రవిచంద్ర గారు, తదితరులు కలిసి ఇంటర్నెట్ ఆర్కైవులో 17 వేల పైచిలుకు తెలుగు పుస్తకాలకు మెటాడేటా మెరుగుపరచడం వంటివి మిస్సయ్యాయి. ఈరోజు మనం గూగుల్లో వెతికితే చాలా పుస్తకాలు దొరుకుతున్నాయంటే వీరు చేసిన ప్రయత్నం కారణం. దీనివల్ల ఇప్పటికే తెలుగు వికీపీడియా వ్యాసాల నాణ్యత పెరగసాగింది. ఇదీ మౌనంగా సాధించిన విజయమే. --పవన్ సంతోష్ (చర్చ) 05:10, 27 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాల మార్గదర్శకాల ప్రతిపాదన[మార్చు]

తెలుగు వికీపీడియాలో తెలంగాణ గ్రామాల మీద విస్తారంగా పనిచేసి దాదాపు వ్యాసాలన్నిటినీ పునర్విభజన చట్టం ప్రకారమూ, 2011 జనగణన ప్రకారమూ అభివృద్ధి చేసిన వ్యక్తి వాడుకరి:యర్రా రామారావు. ఆయన ప్రస్తుతం తెలుగు వికీపీడియా గ్రామాల వ్యాసాలకు మార్గదర్శకాలు ప్రతిపాదించారు. దయచేసి సముదాయ సభ్యులు తమ సూచనలు తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 07:35, 25 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మార్గదర్శకాలు సరియైనచోటకి తరలించి పై వ్యాఖ్యలో లింకు సవరించాను. గమనించండి. --అర్జున (చర్చ) 10:24, 26 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మరియెకసారి అభ్యర్ధన[మార్చు]

 • గ్రామ వ్యాసాలకు మార్గదర్శకాలు రూపొందించి 2018 డిశెంబరు 25న పవన్ సంతోష్ గారి ద్వారా రచ్చబండలో గ్రామ వ్యాసాల మార్గదర్సకాలు మన వికీపీడియన్లు పరిశీలన, చర్చ కొరకు తీసుకు రాబడింది.దీని మీద B.K.Viswanadh గారు మాత్రమే స్పందించారు. పనుల వత్తిడివలనగానీ, ఇతరత్రా కారణాల వలనగానీ మిగిలినవారు ఎప్వరూ స్పందించలేకపోయారు.లోగడ మండల వ్యాసాలకు ప్రత్యేక వ్యాసం పేజీలు చాలా మండలాలుకు లేవు. ప్రస్తుతం మన వికీపీడియన్లులో కొంతమంది ఆపనిలో నిమగ్నమై ఉన్నారు.మార్గ దర్శకాల ప్రకారం గ్రామ,మండల వ్యాసాలు కాలయాపన లేకుండా ఒకేసారి సవరింపు చేయుటకు, 2019 జనవరి 20 లోపు మన వికీపీడియన్లు పరిశీలించి వారి అభిప్రాయాలు తెలుపవలసినదిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 09:41, 11 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Invitation from Wiki Loves Love 2019[మార్చు]

Please help translate to your language

WLL Subtitled Logo (transparent).svg

Love is an important subject for humanity and it is expressed in different cultures and regions in different ways across the world through different gestures, ceremonies, festivals and to document expression of this rich and beautiful emotion, we need your help so we can share and spread the depth of cultures that each region has, the best of how people of that region, celebrate love.

Wiki Loves Love (WLL) is an international photography competition of Wikimedia Commons with the subject love testimonials happening in the month of February.

The primary goal of the competition is to document love testimonials through human cultural diversity such as monuments, ceremonies, snapshot of tender gesture, and miscellaneous objects used as symbol of love; to illustrate articles in the worldwide free encyclopedia Wikipedia, and other Wikimedia Foundation (WMF) projects.

The theme of 2019 iteration is Celebrations, Festivals, Ceremonies and rituals of love.

Sign up your affiliate or individually at Participants page.

To know more about the contest, check out our Commons Page and FAQs

There are several prizes to grab. Hope to see you spreading love this February with Wiki Loves Love!

Kind regards,

Wiki Loves Love Team

Imagine... the sum of all love!

--MediaWiki message delivery (చర్చ) 10:13, 27 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ పీడియాలో పెద్దల సాహిత్యం[మార్చు]

తెలుగు వికీ పీడియాలో పెద్దల అశ్లీల సాహిత్యం రాయవచ్చా? తెలుపగలరు.--- రాముడు

వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. దీనిలో ఏ విధమైన సృజనాత్మక సాహిత్యం రాయకూడదు. అశ్లీలమైనవైనా, అపురూపమైనవైనా కథలూ, నవలలు, కవిత్వం ఇందులో రాయకూడదు. ఇక రచ్చబండ ఇలాంటి మౌలిక ప్రశ్నల కోసం కాదు. దయచేసి వికీపీడియా:సహాయ కేంద్రం చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 14:12, 27 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీ చలనచిత్రోత్సవం[మార్చు]

నా పేరు యశ్వంత్. నేను ఈమధ్య తెలుగు వికీపీడియాలో చేరి తెలుగు సినిమాల గురించి వ్యాసాలు మెరుగుపరుస్తున్నాను. పవన్ సంతోష్‌ గారు నన్ను తెలుగు వికీపీడియాలో వ్రాయమని ఆహ్వానించి, ఎలా వ్రాయాలన్నది నేర్పుతున్నారు. ఈమధ్య మా ఇద్దరి మధ్య జరిగిన చర్చలో తెలుగు వికీ చలనచిత్రోత్సవం పేరుతో జనవరి 2019లో సినిమా వ్యాసాలను మెరుగుపరిస్తే బావుంటుందన్న ఆలోచన వచ్చింది. దానిని నేను అమలుచేయాలని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం వల్ల తెలుగు వికీపీడియాలో ఉన్న సినిమా వ్యాసాలు కొన్ని మెరుగుపడడమే కాకుండా సినిమాల గురించి రాస్తున్న తోటి తెలుగు వారు కొందరిని తెలుగు వికీపీడియాలో రాయించాలని కూడా ఆశిస్తున్నాం. దీనికి మిగిలిన వికీపీడియన్ల సహకారం ఉంటుదని ఆశిస్తున్నాను. -Yasshu28 (చర్చ) 11:59, 29 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

రావడం రావడమే ఉత్సాహంగా వచ్చారు, ఇప్పుడు మంచి కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు. అన్ని విధాలా సహకరిస్తానండీ. వ్యాసాలు, కొత్త వాడుకరులతో పాటు గతంలో ప్రయత్నించి వదిలేసిన ఫోటోల సంగతి కూడా మళ్ళీ ట్రై చేద్దాం. సంక్రాంతి అల్లుళ్ళు, పిండివంటలు, భోగిమంటలు, కోడిపందాలు మాత్రమే కాదు, తెలుగు సినిమాల పండుగ కూడా. ఈ పండుగ సందర్భంగా సినీ వినీలాకాశాన్ని తెలుగు వికీపీడియాలోకి తెచ్చేద్దాం. మరి ఆ విధంగా ముందుకుపోదాం. :) --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 10:02, 30 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఆసక్తి గల సభ్యులు వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ చలనచిత్రోత్సవం ఎడిటథాన్ వద్ద నమోదుచేసుకోగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 12:38, 31 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి కార్యక్రమం. తప్పకుండా మంచి వ్యాసాలుగా కొన్ని తెలుగు సినిమా వ్యాసాలను మెరుగుపరుద్దాము. శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 05:03, 2 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాలకు,మండల వ్యాసాలకు వర్గాలు ఉండవలసిన సరియైన పద్దతి[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు,మండలాలు,గ్రామాలు నందు పునర్య్వస్థీకరణ ప్రకారం మార్పులు,చేర్పులు చేసేటప్పుడు అలాగే భారత జనగణన డేటా నింపేటప్పుడు వర్గాల విషయంలో కొన్ని గ్రామ వ్యాసాలకు,కొన్ని మండల వ్యాసాలకు ఇవ్వవలసిన వర్గాలు ఇవ్వకపోవటం,అవసరంలేని కొన్ని వర్గాలు ఇవ్వటం గమనించాను. నాకు తెలిసినంతవరకు నేను కొన్ని సవరించుట జరిగింది.నాకున్న అవగాహన ప్రకారం గ్రామ వ్యాసాలకు,మండల వ్యాసాలకు వర్గాలు ఉండవలసిన సరియైన పద్దతితో కూడిన విడివిడిగా చానల్స్ (Proper way Tree) తయారుచేసి పరిశీలన నిమిత్తం గ్రామ వ్యాసాలకు,మండల వ్యాసాలకు వర్గాలు ఉండవలసిన సరియైన పద్దతి విభాగంలో మీ ముందుంచటమైంది. దయచేసి సముదాయ సభ్యులు తమ సూచనలు తెలియచేయగలరు. కొన్ని వర్గాలు ఇందులో చూపిన ప్రకారం అమలు జరుగుచున్నాయి. వర్గాలు సృష్టింపు కొత్తగా చేయవలసిన అవసరం లేదు.--యర్రా రామారావు (చర్చ) 06:41, 7 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]


గ్రామాలకు పేజీలను తయారు చేసేటపుడు, మండలాలకు ప్రత్యేకంగా పేజీలు తయారు చెయ్యలేదు. మండల కేంద్రం పేజీయే మండల పేజీగా తయారుచేసాం. వీటికి ప్రత్యేకంగా పేజిలు ఉండాలనేది గ్రామాల ప్రాజెక్టులో ఒక భాగం. ఇప్పుడు ఈ పని జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో సుమారు 680 మండలాలకు గాను 200 మండలాలకు ప్రత్యేకంగా పేజీలు తయారయ్యాయి. మిగతా మండలాలకు పేజూలు తయారు చెయ్యాలి. ఈ పనికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వాడుకరులు ఈ పనిలో పాలు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. __చదువరి (చర్చరచనలు) 05:09, 5 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు నేను ఆంగ్లంలో కొన్ని మండలాల వ్యాసాలను రచించాను, వాటిలోని మూలాలు, గణాంకాలు ఈ గ్రామాల ప్రాజెక్టులో పాలు పంచుకునే వారికి ఉపయోగపడవచ్చు. మీరు వాటిని ఇక్కడ చూడవచ్చు.--IM3847 (చర్చ) 13:29, 13 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Call for bids to host Train-the-Trainer 2019[మార్చు]

Apologies for writing in English, please consider translating the message

Hello everyone,

This year CIS-A2K is seeking expressions of interest from interested communities in India for hosting the Train-the-Trainer 2019.

Train-the-Trainer or TTT is a residential training program which attempts to groom leadership skills among the Indian Wikimedia community (including English) members. Earlier TTT has been conducted in 2013, 2015, 2016, 2017 and 2018.

If you're interested in hosting the program, Following are the per-requests to propose a bid:

 • Active local community which is willing to support conducting the event
  • At least 4 Community members should come together and propose the city. Women Wikimedians in organizing team is highly recommended.
 • The city should have at least an International airport.
 • Venue and accommodations should be available for the event dates.
  • Participants size of TTT is generally between 20-25.
  • Venue should have good Internet connectivity and conference space for the above-mentioned size of participants.
 • Discussion in the local community.

Please learn more about the Train-the-Trainer program and to submit your proposal please visit this page. Feel free to reach to me for more information or email tito@cis-india.org

Best!

Pavan Santhosh ( MediaWiki message delivery (చర్చ) 05:52, 6 జనవరి 2019 (UTC) )[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియాలో నిర్వాహకులు కొరత ఉన్నది[మార్చు]

ఆంగ్ల వికీపీడియాలోని 5,500,000 వ్యాసాలకు గాను 1,190 మంది నిర్వహకులు ఉన్నారు, కానీ తెలుగు వికీపీడియాలోని 70,000 వ్యాసాలకు గాను 14 మంది ఉన్నారు. గణాంకాలను చూస్తే మనకంటే తక్కువ వ్యాసాలు ఉన్న బెంగాలీలో 16, మలయాలంలో 21 మంది ఉన్నారు. కానీ ఆంగ్ల వికీని ఆధారంగా తీసుకుంటే కనీసం 16 మంది, ఇతర భారతీయ భాషలను ఆధారంగా తీసుకుంటే 20 మంది ఉండాలి. తెలుగు వికీపీడియాలో ఉన్న 14 మందిలోనూ ఇరువురు 2018లో 50 కన్నా తక్కువ రచనలు చేశారు, కావున వారిని "INACTIVE ADMIN" గా భావిస్తారు. ఇంకొకరు విడ్డూరంగా వాడుకరి:దురుపయోగాల జల్లెడ. ఇలా చూసుకుంటే 11 మంది ఉన్నట్లు.

కావున అందరూ దీని గురించి బాగా ఆలోచించి అనుభవం ఉన్న వారికి (కనీసం 5 మందికి) నిర్వహణ బాధ్యతలు ఇస్తే బాగుంటుంది. "BYTESIZE"ను, "EDIT COUNT"ను ఆధారంగా తీసుకుంటే, తెలుగు వికీపీడియా ప్రాజెక్టులలో 20,000కు పైగా రచనలు చేసినవారు ఎంతో మంది ఉన్నారు. కనీసం నిర్వహకుల సంఖ్య ప్రమాణ స్థాయిలో ఉంటే తెలుగు రాష్ట్రాలలో వికీపీడియాను అభివృద్ధి చేయడ్డానికి వీలుగా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనదిగా అందరూ భావించాలి.

తెలుగు వికీపీడియా సభ్యులు తమ ఉపాయాలను క్రింద వ్రాయగలరు.—IM3847 (చర్చ) 15:38, 13 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అడ్మిన్ ఇన్ని రచనలు చేయాలి అని లేదా అడ్మిన్‌గా కొనసాగకూడదని అనుకోకూడదు. అలాగే దిద్దుబాట్లబట్టి అడ్మిన్‌గా భాద్యతలు అందిచాలన్నా కూడా దానికి కొన్ని ఇబ్బందులున్నాయి. తెలుగువికీలో నిర్వహకులైనా వాడూకరులైనా ఎక్కువమంది ఏక్టివ్‌గా ఉండటానికి తగిన వాతావరణం కల్పించవలసిన అవస్యకత మాత్రం ఉంది..B.K.Viswanadh (చర్చ)
విశ్వనాధన్ గారు, మీరు అన్నది సబబు గానే ఉన్నది. కానీ నా ఉద్ధేశం వారిని తొలగించాలని కాదు. తెవికీలో అనుభవగ్యులైన కొంతమందిని నిర్వహకులుగా చేస్తే బాగుంటుందని.—IM3847 (చర్చ) 03:28, 17 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
IM3847 గారూ, ఇన్నేళ్ళుగా నాతో చాలామంది ఇందరు యాక్టివ్ సభ్యులకు, ఇంతమంది అడ్మిన్ లు ఉన్నారన్న లెక్క చూపి తెలుగు వికీపీడియాలో నిర్వాహకుల నిష్పత్తి సాధారణం కన్నా ఎక్కువ అన్నారు. కానీ, 70 వేల వ్యాసాలను నిర్వహించడానికి 12-14 మంది మాత్రమే నిర్వాహకులు ఉన్నారనీ, ఆంగ్లంలో 55 లక్షల వ్యాసాలకు దాదాపు 12 వందల మంది అనుకుంటే తెలుగు నిష్పత్తి బాగా తక్కువనీ చెప్పడం కొత్తగా ఉంది. మీరన్నది సరైనదనే తోచింది. పాలసీల మీద అవగాహన, గౌరవం, అవసరమైతే పాలసీల రూపకల్పనలో అనుభవం ఉన్న మరికొందరిని నిర్వాహకులను చేయడం, ఉన్నవారి మరింత సచేతనం కావడం దీనికి మార్గాలని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 04:05, 17 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ముందుగా, ఈ చర్చను లేవదీసినందుకు IM3847 గారికి ధన్యవాదాలు. ఇది చాలా అవసరమైన చర్చ. నా అభిప్రాయాలివి:
 1. మనకు సంఖ్యకు నిర్వాహకులు చాలామంది ఉన్నప్పటికీ (సంఖ్య తక్కువని నేను భావించడం లేదు. ఎంవికీతో నిష్పత్తి పరంగా చూస్తే నలుగురే త్క్కువ), చురుగ్గా నిర్వాహకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్న నిర్వహకుల కొరత చాలానే ఉంది.
 2. చురుగ్గా లేని నిర్వాహకులు తప్పుకోవాలి, లేదా సముదాయం వారిని ఉపసంహరించాలి. అందుకు తగ్గ నియమ, నిబంధనలను సముదాయం రూపొందించుకోవాలి. (ఇతర వికీపీడియాల్లో అలాంటి నిబంధనలు ఉన్నాయి.).
 3. ఓం ప్రథమంగా ప్రస్తుతం ఉన్న నిర్వాహకులందరి పనులనూ సముదాయం సమీక్షించాలి. సరైన వారినే ఉంచి, మిగతా వారి నిర్వాహకత్వాన్ని ఉపసంహరించేందుకు సముదాయం ప్రతిపాదించవచ్చు.
 4. కొత్తగా నిర్వాహకత్వం పొందేవారికి ఒక నిర్ణీత కాలానికి (ఉదాహరణకు - ఆరు నెలలు) మాత్రమే నిర్వాహకత్వం ఇవ్వాలి. ఆ సమయంలో వారి పనితీరును గమనించాక, సముదాయం వారి నిర్వాహకత్వాన్ని పొడిగించవచ్చు. రెండు మూడు పొడిగింపుల తరువాత దాన్ని నిరవధికం చెయ్యనూ వచ్చు.
__చదువరి (చర్చరచనలు) 08:50, 17 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరిగారు మీరు చెప్పిన నియమాలు బాగున్నవి. కానీ యాక్టివ్ యూజర్స్, అడ్మిన్ల నిష్పత్తిలో ఒక లొసగు ఉన్నది: సాధారణంగా వికీపీడియాలో ఆక్టివ్ యూజర్సే కాకుండా ఐ.పి. ఎడిటర్లు కూడా రచనలు చేస్తారు. యాక్టివ్ యూజర్స్, అడ్మిన్ల నిష్పత్తిలో వీరిని పరిగణంలోకి తీసుకోరు, కానీ వ్యాసాల సంఖ్య ఆధారంగా తీసుకుంటే వీరిని పరిగణంలోకి తీసుకోవచ్చు..... అంతే కాకుండా ఆంగ్ల వికీపీడియాలో వివిధ వికీప్రాజెక్టులు ఉంటాయి, తెవికీలోకూడా అవి ఉన్నవి, ఉదా: వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ; ఇంతే కాకుండా వికీప్రాజెక్టు హిందూమతం, పత్రికలు, సాహిత్యం వంటి పెద్ద ప్రాజెక్టులూ ఉన్నవి. అందరు నిర్వహకులు అన్ని వ్యాసాలను గమనిస్తూ ఉండరు, కావున: తెవికీలోని వ్యాసాల సంఖ్య, Content ద్వారా వివిధ విభగాలుగా విభజించి వాటిపై నైపుణ్యం ఉన్న వారిని గుర్తించి మీరు చిప్పిన విదానంలో Temporary Adminship ఇచ్చి చూడవచ్చు. ఇలా చేయడం వలన మరుగున పడిపోయిన వ్యాసాలను కూడా అభివృద్ధి చేయడం కుదురుతుంది.—IM3847 (చర్చ) 09:50, 17 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియాకు కావలసినది నిర్వహకుల సంఖ్య కాదు. క్రియాశీలకమైన నిర్వహణ. అది కొరవడుతుంది. నిర్వాహకులెంతమంది ఉన్నా నిర్వాహణ పనులపై దృష్టి పెట్టకపోతే ఆ హోదాలు ఎందుకు? క్రియాశీలకంగా నిర్వాహక పనులను చేసేవారినే ఆ హోదాలో కొనసాగించాలి. చురుగ్గా లేని నిర్వాహకులు తప్పుకోవాలి, లేదా సముదాయం వారిని ఉపసంహరించాలి. చురుగ్గా ఉన్న వారికి, నిర్వాహక పనులపై ఆశక్తి ఉన్నవారికి మాత్రమే నిర్వాహకత్వం యివ్వాలి. నిర్వాహక హోదా వచ్చిన తరువాత చదువరిగారు చెప్పినట్లు 6 నెలల కాలపరిమితికి మాత్రమే నిర్వాహక హోదాను యిచ్చి, వారి నిర్వాహక పనులను పర్యవేక్షించి, నిర్వాహకత్వ పనులు చేయనిచో వారికి పొడిగించరాదు. --కె.వెంకటరమణచర్చ 02:44, 19 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారు, తెవికీలో ఆసక్తి కనబరుస్తున్న వారిలో అనుభవఘ్నుల్ని గుర్తించి ఇస్తే బాగుంటుంది. అదే సమయంలో తెవికీ సభ్యులు చర్చించుకుని వ్యాసాలను సంఖ్య, ముఖ్యత ఆధారంగా విభజించి, ఆసక్తి ఉన్నవారికి వికీప్రాజెక్టులను దత్తతుగా ఇచ్చి చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇలా ఇస్తే విభనించినట్లయినా వ్యాసాలని వ్యక్తిగతంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాని ఎటువంటి విభెదాలు రాకుండా చూసుకోవాలి. తెవికీని తెలుగు రాష్ట్రాలో ఆంగ్లవికీ లాగా అభివృద్ధి చేయడానికి ఒకసారి ఈ విధంగా ప్రయత్నించి చూడవచ్చు. —IM3847 (చర్చ) 10:45, 19 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారు మీరు చెప్పినది బావుంది. నిర్వహణ విషయాల్లో, రచనల్లో, ఎడిట్లలో చురుగ్గా లేని వారు నిర్వాహకులుగా ఉన్నా అనవసరమే. వీట్లో క్రియాశీలకంగా ఎవరు ఉన్నారో గుర్తించి వారిని మాత్రమె కొనసాగించడం సమంజసంగా ఉంటుంది. దీనిలో నాతొ సహా మనలో ఎవరిని తొలగించినా వ్యక్తిగత అభిమానాలకు తావివ్వకుండా మనం అంతా సహకరించుకొని దీనిపై ఆంగ్ల వికీలో ఉన్నట్టు మక్కికి మక్కి కాక తెలుగులో ఉన్న వాడుకరుల కొరతను దృష్టిలో పెట్టుకొని కొన్ని పాలసీలను తయారు చేసుకోవలాసిన అవసరం ఉందని నా అభిప్రాయం.. B.K.Viswanadh (చర్చ)

FileExporter beta feature[మార్చు]

Johanna Strodt (WMDE) 09:41, 14 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారి నిర్వాహకత్వ ప్రతిపాదన[మార్చు]

తెలుగు వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్/తెలంగాణ గ్రామవ్యాసాల అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్న యర్రా రామారావు గారికి నిర్వాహకత్వ హోదా కొరకు వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/యర్రా రామారావు పుటలో ప్రతిపాదించడమైనది. మీ అభిప్రాయాన్ని ఆ పుటలో తెలియజేయగలరు.--కె.వెంకటరమణచర్చ 14:41, 16 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారి నిర్వాహకత్వ ప్రతిపాదన[మార్చు]

తెవికీలో అనేక హిందూమత, రైల్వే వ్యాసాలలో విశేష కృషి చేస్తున్న జె.వి.ఆర్.కె.ప్రసాద్ నిర్వాహకత్వ హొదా కోరకు స్వీయ ప్రతిపాదనను వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD-3 పుటలో చేసిఉన్నారు. సభ్యులు తమ అభిప్రాయాలను ఆ పుటలో తెలియజేయగలరు.--కె.వెంకటరమణచర్చ 15:35, 16 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

No editing for 30 minutes on 17 January[మార్చు]

You will not be able to edit the wikis for up to 30 minutes on 17 January 07:00 UTC. This is because of a database problem that has to be fixed immediately. You can still read the wikis. Some wikis are not affected. They don't get this message. You can see which wikis are not affected on this page. Most wikis are affected. The time you can not edit might be shorter than 30 minutes. /Johan (WMF)

18:55, 16 జనవరి 2019 (UTC)

మండలాల పేరుతో కొత్తవ్యాసాలు[మార్చు]

ఇటీవల తెలికీలో మండలాల పేరుతో కొత్త వ్యాసాలు సృష్టిస్తున్నారు. ఉదాహరణకు కలకడ మరియు కలకడ మండలం లలో దాదాపు ఒకేవిధమైన సమాచారము ఉన్నది. ఇలా ప్రతి మండలానికి ప్రత్యేక వ్యాసం అవసరమా? అదే గ్రామం వ్యాసంలో మండల సమాచారాన్ని చేరిస్తే సరిపోతుంది కదా. సభ్యులు తమ అభిప్రాయాలను తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:56, 18 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మండలానికి వేరే సమాచారం ఉంటుంది. కాబట్టే వేరే వ్యాసం అవసరం. ఇది జిల్లా వ్యాసానికి, జిల్లా కేంద్రానికి వేరే వ్యాసాలు ఎందుకు ఉండాలి అన్నలాంటి ప్రశ్న. పలుమార్లు మండల వ్యాసాలను మండల కేంద్రం నుంచి విడదీయాలని భావించిన వికీపీడియన్లు అది చాలా భారీ పని కాబట్టే విడిచిపెట్టారు. ఇలా ఏ అంశం పరిశీలించినా వేరే వ్యాసాలు ఉండాలనే నా ఉద్దేశం. --పవన్ సంతోష్ (చర్చ) 13:58, 18 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
మండలానికి ప్రత్యేక వ్యాసం వుండాలని, తదుపరి అనేక మండల వ్యాసాలను తయారు చేసి, ఈ విషయంలో వాడుకరులను కూడ సహకరించ వలసినది గతంలో (రచ్చబండలోనే పైన చూడండి)కోరి యున్నందున నేను చాల జిల్లాలలోని మండలాలకు అదే మూసలో కొత్త పేజీలు తయారు చేసి వున్నాను. నిజానికి ఆ కొత్తవ్యాసాలలోని విషయము కొత్తది కాదు. అదంతా ఆ యా గ్రామాల వ్యాసాలలో వున్నదే. కాక పోతే మండలానికి సంబందించిన విషయమే అందులో వుంటుంది. కొన్ని గ్రామ వ్యాసాల లోని విషయము కేవలము మండల కేంద్రమైన ఆ గ్రామానికి మాత్రమే సంబందించినది వున్నది. కలకడ మండలము వ్యాసము అటు వంటిదే. ఇలాంటివి ఇంకా చాలనే వున్నవి. ఆయా గ్రామ వ్యాసాలను విస్తరించ వలసి వున్నది.

పవన్ గారు చెప్పినట్లు మండలానికి కూడ ప్రత్యేక వ్యాసం వుండాలనేదే నాఅభిమతం. అదే విధంగా ........... అన్ని జిల్లాల కు ఒక వ్యాసం, అ పట్టణానికి మరొక వ్యాసం వుండాలన్నది కూడ సమంజసమే. ఉదాహరణకు....... చిత్తూరు జిల్లా కు ఒక వ్యాసం, చిత్తూరు పట్టణం అన్నదానికి మరొక వ్యాసం వుండడమే సమంజసం. ఇటు వంటి రెండు వ్యాసాలలోను కొంత సమాచారము పునర్యుక్తమయి వుండొచ్చు అదేం తప్పు కాదని నాఅభి ప్రాయం. Bhaskaranaidu (చర్చ) 14:32, 18 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మండలాలకు ప్రత్యేక వ్యాసాలు సృష్టింపు ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టిందేమికాదు.లోగడ ఆచరణలో పెట్టి వీకీపీడియన్స్ కొరతగా వల్లగానీ, లేదా ఒక ప్రాజెక్టు వర్కుగా చేపట్టక పోవుటవల్లనైతేనేమి అన్ని మండలాలకు ప్రత్యేక వ్యాసం పేజీలు సృష్టించే పని అర్ధంతరంగా ఆగినట్లు సృష్టంగా తెలుస్తుంది. దానికి తార్కాణంగా తెలంగాణలోని జిల్లాలలో లోగడ కొన్ని మండలాలకు ప్రత్యేక వ్యాసాలు ఉన్న విషయమై ఇక్కడ పరిశీలించవచ్చు. పూర్తిగా ప్రాజెక్టు వర్కు కాకుండా ఒకే రకమైన సమాచారం ఉంది అనుకోవటం సమంజసంకాదు.ఎందుకంటే లోగడ మండల వ్యాసంగా ఉన్న గ్రామ వ్యాసం పేజీలలో సమాచారం మార్పు చేయవలసి ఉంది.ఇది కొద్ది రోజులలో కొద్ది మంది వికీపీడియన్స్ తో అయ్యో పనికాదు. ఆ పనిచేసే వాళ్లు ఆ పనిమీద చురుకుగా చేస్తున్నారు.అందువలన కొంతకాలం పడుతుంది. ఇక ప్రత్యేక వ్యాసం అవసరమా అనే దానికి వస్తే తప్పని సరిగా అవసరం అని నాఅభిప్రాయం.మండల డేటా వేరు.గ్రామ డేటా వేరు. పట్టణం వేరు.జిల్లా వేరు.పురపాలక సంఘంవేరు,నగరపాలక సంస్థ వేరు.పైన పవన్ సంతోష్ గారు, ,బాస్కరనాయుడు గారు చెప్పిన కోణంలో ఆలోచిస్తే తప్పనిసరిగా అవసరమేనని భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 16:59, 18 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
మండలాలకు, గ్రామాలకు ప్రత్యేక వ్యాసాలు అవసరమే. జిల్లాకు, అదే పేరుతో ఉన్న పట్టణానికి ప్రత్యేక వ్యాసాలు అవసరమే. కానీ రెండింటిలో ఒకే విషయం ఎలా ఉంటుంది? సుల్తాన్ ఖాదర్ గారు తెలియ జేసినట్లు కలకడ మరియు కలకడ మండలం వ్యాసాలలో ఒకే విషయం ఉంది. మండల వ్యాసంలో మండలంలో గ్రామాలు, మండల గణాంకాలు, మండలంలోని దర్శనీయ స్థలాలు, ప్రాముఖ్యత గల అంశాలను చేర్చవచ్చు. గ్రామ వ్యాసంలో ఆ గ్రామ విశేషాలు, గణాంకాలు, వనరులు, గ్రామంలో ప్రముఖులు, ప్రాముఖ్యత గల అంశాలను చేర్చాలి. కనుక కలకడ మరియు కలకడ మండలం వంటి ఒకే విషయం ఉన్న వ్యాసాలను తగురీతిగా వికీకరణ చేయాలి.--కె.వెంకటరమణచర్చ 02:37, 19 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
మండలానికి, మండల కేంద్రానికి విడివిడిగా పేజీలుండాలి. కలకడ, కలకడ మండలం పేజీల్లో ఉన్నట్టు ఒకే పాఠ్యం ఉండకూడదు, సవరించాలి.__చదువరి (చర్చరచనలు) 07:46, 19 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
కలకడ మండలం పేరుతో రెండు వ్యాసాలున్నాయి. ఇదొక చిన్న పొరబాటు. ఈ పొరబాటే పై చర్చకు కారణమైనది. అయినా ఒక మంచి నిర్ణయమే దొరికింది. అందులో ఒక వ్యాసాన్ని తొలిగించ వచ్చు. కలకడ గ్రామ వ్యాసం విడిగా వున్నది. Bhaskaranaidu (చర్చ) 17:12, 19 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
బాస్కరనాయుడుగారూ ఏమి పొరపాటు జరగలేదు.మండల వ్యాసం ఒకటి గ్రామ వ్యాసం ఒకటి మాత్రమే ఉన్నాయి.అసలు సమస్య మండల వ్యాసం సృష్టించినప్పుడు గ్రామ వ్యాసంలో మండల డేటా తొలగించనందున సుల్తాన్ ఖాదర్ గారు అలా భావించుకున్నారు.అది ఒకేసారి చేస్తే ఆలా భావించటానికి అవకాశం లేదు.కొత్త మండల వ్యాసానికి జిల్లాలోని మండలాల మూసకు లంకె కలపనందున గ్రామ వ్యాసం క్లిక్ చేసినప్పుడు అలా రెండు వ్యాసాలు ఉన్నట్లు అనిపిస్తుంది.మీకు చెప్పగలిగే అంతటివాడినికాదు.తప్పుగా భావించవద్దు.--యర్రా రామారావు (చర్చ) 17:54, 19 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

విశాఖపట్నంలో టి. టి. టి. నిర్వహించేందుకు VVIT WikiConnect వారి ప్రతిపాదన[మార్చు]

అభినందనలు, CIS-A2K వారు ఈ సంవత్సరం టి. టి. టి. 2019ని నిర్వహించటానికి వివిధ కమ్యూనిటీసుని ఆహ్వానిస్తున్నారన్న విషయం అందరికి తెలిసిన విషయం. మేము వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ లోని వికీమీడియన్లు, VVIT WikiConnect విశాఖపట్నంలో టి. టి. టి. నిర్వహించేందుకు ప్రతిపాదించుదాం అనుకుంటున్నాం. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకించి విశాఖపట్నంలో పెద్దగా వికీపీడియా కార్యక్రమాలు జాతీయస్థాయిలో ఏమి జరగలేదు. కావున ఇది అందుకు ఇది మంచి అవకాశము అని భావిస్తున్నాము. గత సంవత్సరం మరియు ఆపై కొన్ని నెలలుగా, 2017, మేము గుంటూరు మరియు విజయవాడ ప్రాంతాలలో పలు కార్యక్రమాలు నిర్వహించాము (వాటికీ సంబంధించిన పేజీలు m:VVIT WikiConnect/Activities/2017-2018 మరియు m:VVIT WikiConnect/Activities/2018-2019). ఇవన్నీ ఆ పేజీలలో చూడవచ్చు. మేము విశాఖపట్నంలో ఎందుకు చేయాలో ఇక్కడ కొంచెం చర్చ జరిపాము. CIS-A2K కి ప్రతిపాదించే ముందు తెలుగు వికీమీడియన్లకు చెప్పటం మర్యాదపూర్వకం అని భావించి ఈ సందేశాన్ని రాస్తున్నాం. మీకు కనుక మా ప్రతిపాదన సమ్మతమే అనిపిస్తే పైన లింకు ఇచ్చిన “Endorsements” సెక్క్షను కింద మీ మద్దతును తెలపండి. గౌరవంతో, MNavya (చర్చ) 11:55, 18 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

MNavya గారు మీ అభిప్రాయం బావుంది. విశాఖలో వికీపీడియా యొక్క అవగాహన తక్కువ. తెలుగు గూర్చి కొంతవరకూ పవన్ సంతోష్ కృషిచేసినట్టున్నారు. ఆయనద్వారా కొందరు తెలుగువికీలో సభ్యులుగా చేరడం జరిగింది. అలాంటి వారికి ఈ ప్రోగ్రాం మరింత అవగాహన ఆసక్తులు కల్పించగలదు. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మరింతకొంత మంది వాడుకరులను తయారు చేసుకోడానికి ఏవైనా అవకాశాలు ఉండే కొన్ని ప్రణాళికలను సిద్దం చేసుకోగలిగితే ఇంకా బావుంటుందని నా అభిప్రాయం..B.K.Viswanadh (చర్చ) 07:02, 20 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@B.K.Viswanadh: గారు, మీ అభిప్రాయం బావుంది. ఒకవేళ CIS-A2K వారు విశాఖపట్నంలో కార్యక్రమం నిర్వహిస్తే, 1-2 స్థానిక వికీపీడియన్లకు అదనముగా పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది అని ఇక్కడ తెలియచేసారు. కావున ఈ కార్యక్రమం ద్వారా అలాంటి వారికీ ప్రోత్సాహం లభిస్తుంది అని భావిస్తున్నాను. MNavya (చర్చ) 14:46, 20 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పాత చర్చ 62 | పాత చర్చ 63 | పాత చర్చ 64

నిర్వాహకుల జాబితాలో కొత్త వాడుకరి[మార్చు]

నిర్వాహకుల జాబితాలో వాడుకరి:దురుపయోగాల జల్లెడ అనే కొత్త వాడుకరి వచ్చి చేరారు. ఇదెలాజరిగిందో తెలియట్లేదు. పరిశీలించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 14:02, 18 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సాఫ్ట్వేర్ తాజాకరణతో AbuseFilter extension స్థాపనతో చేరింది. మరింత సమాచారం--అర్జున (చర్చ) 11:21, 21 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సి.ఆర్.రెడ్డి కళాశాలలో వికీ అవగాహన, శిక్షణ కార్యక్రమం[మార్చు]

ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాల వారు వారి విద్యార్ధులకు తెలుగు వికీ అవగాహన మరియు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించమని కోరడం జరిగింది. వారికి కంప్యూటర్ లాబ్ సౌకర్యాలు ఉన్నాయి. ఈ అవకాశం ఉపయోగించుకొని కొందరిని వికీపీడియన్లుగా మార్చగలగొచ్చు. దీనిపై పవన్ సంతోష్, మరియు ఏలూరు పరిశర ప్రాంత వికీ మిత్రుల స్పందన కోరుతున్నాను.B.K.Viswanadh (చర్చ) 07:02, 20 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

B.K.Viswanadh గారూ, తప్పకుండా. ఈ అంశంపై మరింత చర్చ రానున్న వారంలో చేద్దామండి. --పవన్ సంతోష్ (చర్చ) 14:06, 21 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా వికీ సమావేశం, హైదరాబాదులో[మార్చు]

వికీమిత్రులకు విజ్ఞప్తి, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెవికీ సమావేశం హైదరాబాదులో, మరిన్ని వివరాలకు ఇక్కడ చూడగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 07:08, 25 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

రహ్మానుద్దీన్ గారికీ, ఇతర వికీపీడియన్లకు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకూ కొనసాగే ప్రణాళిక ఉన్నందున భోజన ఏర్పాట్ల విషయమై సహకారం అవసరమైతే తెలియజేయగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 04:55, 5 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వ నియమ నిబంధనలు[మార్చు]

నిర్వాహకత్వ బాధ్యతలను ఇవ్వడం, ఉపసంహరించడం మొదలైన వాటిపై ఇక్కడ చర్చ జరిగింది. ఈ చర్చను ముందుకు తీసుకువెళ్తూ ఒక విధానాన్ని రూపొందించుకునేందుకు గాను, రెండు విధానాలను ప్రతిపాదించదలచుకున్నాను. 1. నిర్వాహకత్వ బాధ్యతలను ఇవ్వడం, 2. నిర్వాహకత్వ బాధ్యతలను ఉపసంహరించడం. వీటిలో మొదటి నియమం కోసం పేజీని ఇంకా తయారు చెయ్యాలి. రెండవదాని విషయమై ఒక విధాన పేజీని తయారు చేసే పనిని మొదలుపెట్టాను. ఈ ప్రతిపాదన పేజీని మొదలుపెట్టాను. పేజీలో ఇంకా కొంత పాఠ్యం చేర్చాల్సి ఉంది. అయితే నియమాలను ప్రతిపాదించడం పూర్తైంది. ఈ ప్రతిపాదనను అక్కడి చర్చాపేజీలో చర్చించి, విధానాన్ని ఒక రూపుకు తీసుకువెళ్ళాలని వాడుకరులందరికీ వినతి. __చదువరి (చర్చరచనలు) 16:42, 27 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]