వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 66

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 65 | పాత చర్చ 66 | పాత చర్చ 67

alt text=2019 మే 3 - 2019 మే 23 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2019 మే 3 - 2019 మే 23

ఆంధ్ర ప్రదేశ్ గ్రామాల సమాచారపెట్టె మెరుగు ప్రాజెక్టు[మార్చు]

వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/సమాచారపెట్టె మెరుగు పేజీ చూసి స్పందించండి. --అర్జున (చర్చ) 05:16, 29 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మరింత విశ్లేషించిన మీదట, వికీడేటాలో కావలసిన వివరాలు సమగ్రంగా చేసినతరువాతే ఈ ప్రాజెక్టు చేపట్టగలమని తెలింది. కావున ఆసక్తిగలవారు వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/సమాచారపెట్టె మెరుగు/వికీడేటా ప్రాజెక్టులో పేరు చేర్చి, సందేహాలు, సలహాలకై సంప్రదించండి. --అర్జున (చర్చ) 05:23, 3 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వికీడేటా వాడి ఒకేఒక వరుస మూసతో సమాచారపెట్టె చేర్చబడినది ఉదాహరణగా వేటపాలెం చూడండి. --అర్జున (చర్చ) 10:33, 5 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పైలట్ ప్రాజెక్టు[మార్చు]

వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు/ప్రకాశం_జిల్లా_మండల_కేంద్రాలు లో మండల కేంద్రాలు నొక్కి చూడండి. దీని అనుభవాల ఫలితంగా సూచనలు చర్చించాల్సినవి, ప్రాజెక్టు పేజీలో తాజాపరచబడింది. వికీడేటా_పని_పూర్తికాకుండా_బాట్_తో_సమాచారపెట్టెను_మార్చటం పై చర్చాపేజీలో స్పందనలు కోరుతున్నాను.అర్జున (చర్చ) 03:54, 24 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఉపకరణంతో సులభంగా చేసే వీలున్నందున చర్చని విరమించాను. అర్జున (చర్చ) 12:10, 30 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Hangout invitation[మార్చు]

I have created a hangout to improve collaboration and coordination among editors of various wiki projects. I would like to invite you as well. Please share your email to pankajjainmr@gmail.com to join. Thanks Capankajsmilyo (చర్చ) 16:39, 29 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మే 3న ఆంధ్ర లొయోలా కళాశాలతో భాగస్వామ్య చర్చ[మార్చు]

విజయవాడలోని ఆంధ్ర లొయోలా కళాశాలలో సీఐఎస్-ఎ2కె గతంలో భాగస్వామ్యం వహించి కార్యక్రమాలు (ప్రధానంగా 2014-2017 సంవత్సరాల్లో) నిర్వహించిన సంగతి సముదాయ సభ్యులు కొందరికి తెలిసిందే. కళాశాల నిర్వహణ విషయంలో జరుగుతున్న కొన్ని మార్పులను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో ఏయే కార్యక్రమాలు నిర్వహించవచ్చన్నది చర్చించడానికి మే 3న కళాశాలలో సమావేశం జరుగనుంది. దీనిలో కళాశాల ప్రతినిధులు, సీఐఎస్-ఎ2కె ప్రతినిధులు, తెలుగు వికీపీడియన్ రహ్మానుద్దీన్ పాల్గొంటారు. తెలుగు వికీపీడియా, సోదర ప్రాజెక్టుల మెరుగుదల కోణంలో వచ్చే ప్రతిపాదనలను సముదాయంతో ఈ పోస్టు కింద పంచుకుంటాము. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 06:15, 2 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఏ సమయంలో ఎంతసేపు జరుగుతుందో కూడా పొందుపరచండి. JVRKPRASAD (చర్చ) 08:06, 2 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
కేవలం రేపు అనగా ఈ రోజున మెసేజ్ పెట్టడంలో అనేక అనుమానాలుగా ఉంది. ఇది ఎవరికోసం పెట్టిన మెసేజ్ అనేది చెప్పగలరు.JVRKPRASAD (చర్చ) 12:07, 2 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
లొయోల కళాశాల లో 2018-19 సంవత్సరంలో ఏం ప్రణాళిక చేసారు, పవన్ సంతోష్ తెలపాలి. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:03, 2 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ తెలుగు భాషా ప్రతినిధిగా, తెలుగు వికీపీడియన్ గా కాదు, చేసిన కార్యక్రమాల వివరాల గురించి[మార్చు]

పవన్ సంతోష్ సీఐఎస్-ఏటుకె కార్యక్రమం ద్వారా సాధారణ వికీపీడియన్ గా కాకుండా ప్రత్యేకంగా చేసిన పనుల గురించిన నివేదిక చేర్చాలని మనవి. ఒక ఔత్సాహికుడిగా చేసిన పనులను, ఒక వికీపీడియా ద్వారా పరోక్షంగా జీతం తీసుకుంటున్న వ్యక్తిగా చేస్తున్న కార్యక్రమాలను అనుకున్న ప్రణాళిక ప్రకారం నివేదించమని మనవి. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:09, 2 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా, త్వరలోనే నివేదిక అందిస్తాను. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 02:26, 3 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

టైటిల్ సాంగ్[మార్చు]

టైటిల్ సాంగ్ గురించిన వ్యాసం రాద్దామని అనుకొంటున్నాను. సరైన పేరు ప్రతిపాదించమని సభ్యులను కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 12:35, 3 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారూ, ఆసక్తికరమైన విషయాన్ని ఎంచుకున్నారు. పేరు కోసం ఆలోచించాను గానీ, ఏమీ తోచలేదు. టైటిల్ సాంగ్ అనేదే వాడుకలో ఉంది. మకుట గీతం, శీర్ష గీతం లాంటివి తలపుకు వచ్చాయి గానీ, కృతకంగా అనిపించాయి. ప్రస్తుతానికి "టైటిల్ సాంగ్" అనే పేరుతోటే పేజీ మొదలు పెట్టి రాయొచ్చని నా ఉద్దేశం. మంచి పేరును ఎవరైనా సూచిస్తే ఆ పేరుకు పేజీని తరలించవచ్చును. వ్యాసం రాస్తూ ఉండగా మంచి పేరు ఏదైనా స్ఫురించవచ్చు. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 16:38, 3 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారు, "టైటిల్ సాంగ్" అనేది సినిమా (నామము) కు సంబంధించినది కనుక నామపాట అని పేరు పెడితే సరిపోతుందని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 00:58, 4 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు అనువాదాలు లేని పేర్లకు ఇంగ్లీషు నుంచి తెచ్చుకున్న పదాన్నే పెట్టమని, తెలుగు లిపిలో ఉంటే చాలని వికీపీడియా:నామకరణ పద్ధతులు పాలసీ చెప్తున్నది. కాబట్టి టైటిల్ సాంగ్ అన్నదే పెట్టండి. ప్రత్యేకించి కొత్తగా ఓ అనువాద పదాన్ని ఏర్పరిచి చలామణిలోకి తెచ్చే పని మనకొద్దు. --పవన్ సంతోష్ (చర్చ) 13:16, 4 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ[మార్చు]

ఈ చర్చ పైనున్న #ప్రముఖుల వర్గాలు అనే విభాగంలోని చర్చకు కొనసాగింపు. AWB ద్వారా చెయ్యాల్సిన వర్గాల మార్పులు అయిపోయాయి. ఇక ఒక్కొక్క వ్యాసాన్ని తీసుకుని వర్గాలను మార్చాలి. వర్గం:తెలుగు ప్రముఖులు, వర్గం:తెలుగు వ్యక్తులు, వర్గం:తెలుగు ప్రముఖులు లాంటి స్థూల వర్గాల్లోని ఒక్కో వ్యాసాన్ని తీసుకుని సముచితమైన సూక్ష్మ వర్గంలోకి చేర్చాలి. అ సూక్ష్మ వర్గాన్ని దాని పైనున్న వర్గం లోకి, దాన్ని మరింత పై వర్గంలోకి.. ఇలా చేర్చుకుంటూ పోవాలి. పెద్ద పనే.. కానీ చెయ్యాల్సిన పని. ఆవశ్యయకమైన చర్చను లేవనెత్తిన Rajasekhar1961 గారికి అభినందనలు. ఆయనే ఈ పనికి నాయకత్వం వహించి ముందుకు తీసుకు పోవాలని కోరుతున్నాను. రాజశేఖర్ గారూ, దీన్ని ఒక ప్రాజెక్టుగా రూపొందించండి. నేనూ పాల్గొంటాను.__చదువరి (చర్చరచనలు) 02:14, 6 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

స్వంత పేజీల సృష్టి[మార్చు]

ఈ మధ్య స్వంత పేజీల సృష్టి పెరిగిందేమో నని నాకు అనుమానంగా ఉంది. గత రెండు రోజుల్లో నేను రెండు పేజీలను తొలగించాను. కొందరు వ్యక్తులు తమను తాము గొప్పవారిగా భావించుకోవడం, వికీపీడియాలో తమకు ఒక పేజీ ఉండకపోవడం లోపంగా భావించడం జరుగుతూండవచ్చు. అందుచేత ఒక కొత్త ఖాతాను సృష్టించుకుని వెంటనే తమ పేజీని రాసేసుకుంటున్నారు. (గతంలో అజ్ఞాతంగా- ఐపీ అడ్రసు నుండి - ఈ పని చేసేవారు; ఇప్పుడు కాస్త పురోగతి సాధించి ఉండవచ్చు). అలాంటి రెండు పేజీలను గత రెండు రోజుల్లో నేను తొలగించాను. అయితే సముదాయం దృష్టికి తెచ్చి, దీన్ని ఒక మార్గదర్శకంగా ఏర్పరచాలని భావించాను.

కొన్ని సందర్భాల్లో సదరు వ్యక్తులు నిజంగానే వికీపేజీకి అర్హులై ఉండవచ్చు కూడా. వారికి పేజీ తయారు చెయ్యకపోవడం లోపమే కావచ్చు. అంత మాత్రాన ఎవరి పేజీని వాళ్ళు తయారు చేసుకోవడం సరి అయిపోదు అని నా ఉద్దేశం. అలాంటి పేజీలను కూడా తొలగించాలని నా అభిప్రాయం.

తోటి వాడుకరుల అభిప్రాయాలు కోరుతున్నాను__చదువరి (చర్చరచనలు) 02:28, 6 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, అవును వికీపీడియా గురించి కొంతమంది ప్రముఖులకో, రచయితలకో తెలియగానే ఖాతా సృష్టించుకుని వాళ్ళే స్వయంగా తమ గురించి వ్యాసం రాసేసుకోవడం నేను కూడా గమనించాను. వీటిలో కొన్ని వికీలో ఉండదగిన వ్యాసాలే కాకపోతే వారికి మొదట్లో పాలసీల మీద అంతగా అవగాహన ఉండదు కాబట్టి మూలాలు చేర్చడం, పొగడ్తలు లాంటివి లేకుండా కేవలం విజ్ఞానదాయకంగా ఉండేలా చూడటం మన బాధ్యత. అలాగే ప్రాముఖ్యత లేనివి నేను కూడా తొలగిస్తున్నాను.రవిచంద్ర (చర్చ) 04:58, 6 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
నేను కూడా స్వంత పేజీల సృష్టిలను గమనించాను. అయితే, వాళ్ళు వికీకి వచ్చి రాయడం అనేది ఆహ్వానించదగినది కాబట్టి, వచ్చిరాగానే వారిని భయపెట్టకూదనే ఉద్దేశ్యంతో నేను ఆయా పేజీలపై చర్చ తీసుకోలేదు. మొదట్లో నాకు తెలియక నా గురించి నేనే ఒక పేజీ రాసుకున్నాను. రాజశేఖర్ గారు దాన్ని వాడుకరి పేజీగా మార్చారు. అలా మనం కూడా చేయొచ్చు. కాబట్టి, స్వంత పేజీల సృష్టి అనేది వికీకి మంచిది కాదని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 10:17, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సాక్ పప్పెట్లు[మార్చు]

ఈ మధ్య Bonadea అనే ఎన్వికీ్ వాడుకరిని వేధిస్తూ ఉన్న అనేక ఖాతాలను స్టీవార్డులకు నివేదించగా, అవన్నీ సాక్ పప్పెట్లేనని తేలింది. అంటే అవన్నీఒక దురాలోచనతో బహుశా ఒకే వ్యక్తి సృష్టించినవన్నమాట.వాళ్ళు ఆ ఖాతాలను పరిశోధించి, లాక్ చేసారు.

ఈ విషయంపై నిర్వాహకుల నోటీసు బోర్డులో జరిగిన చర్చ చూడవచ్చు. అక్కడ ఈ పప్పెట్లు చేసిన హడావుడి కూడా చూడొచ్చు. రవిచంద్ర గారు, Pranayraj Vangari గారు, నేను ఈ పనిలో పాల్గొన్నాం. అయితే ఇక ముందు ఈ పప్పెట్ల ఆగడాలు కొనసాగే అవకాశం, పెచ్చు మీరే అవకాశమూ లేకపోలేదు. మన మందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వీటి ప్రస్తుత ప్రవర్తన ఇలా ఉంది:

  • ఖాతా తెరవడం తెరవడమే Bonadea పై విషం చిమ్మడం మొదలుపెట్టాయి. అయితే భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాయన్న రూలేమీ లేదు.
  • ఈ పప్పెట్లలో కొన్ని Bonadea ను వ్యతిరేకించగా కొన్ని సమర్ధిస్తున్నట్లుగా మాట్టాడాయి. వాడుకరులను పక్కదోవ పట్టించే ప్రయత్నం అది.
  • స్వీడన్ నుండి రాస్తున్నాం అన్నట్లు కొన్ని మాట్టాడాయి.
  • వికీపీడియా విధానాలు స్పష్టంగా తెలుసునన్నట్టు మాట్టాడాయి.
  • అప్పుడే ఖాతా సృష్టించుకున్న ఒక పప్పెట్టైతే 9 నెలలుగా తెవికీలో ఉన్నట్టు రాసుకుంది.

వాడుకరులు గమనించవలసినదిగా మనవి. __చదువరి (చర్చరచనలు) 02:51, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఓమ్‌నమశ్శివాయ అనే ఒక కొత్త ఖాతా పుట్టుకొచ్చింది ఇవ్వాళ. పుట్టీ పుట్టగానే, పప్పెట్లు చేసిన పనినే కొనసాగించడం మొదలెట్టింది. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 03:35, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ సాక్ పప్పెట్ వాడుకరి ప్రధాన పేరుబరిలో వ్యాసాలు ఏమీ చేయడం లేదుగానీ చర్చా పేజీల్లాంటి ఇతర పేరు బరుల్లో ఒకేరకమైన చెత్తను ఎక్కిస్తున్నాడు. నాకు దొరికినంతమేరకు తొలగిస్తున్నాను. అలాగే కొత్త వాడుకరులు సృష్టించినపుడు నిరోధిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 05:16, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
సాక్ పప్పెట్లను గుర్తించేందుకు మనమే ఇక్కడ చెక్ యూజర్ వ్యవస్థ ఏర్పాటుచేసుకోవచ్చు. గతంలో ముసునూరి నాయకులు వ్యాసం మీద, కులాల వ్యాసాల మీద సాక్ పప్పెట్ల తరహా దాడి జరిగినప్పుడు సందేహంతో నేను ప్రారంభించిన చర్చలో ఆ అంశాన్ని తెరమీదికి తెచ్చాను. ఇక్కడ ఓసారి చదివి చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 06:33, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ చదివాను.ఇలాంటి పరిస్థితులలో మున్ముందు అవసరం కూడా అని నేను భావిస్తున్నాను. సముదాయ సభ్యులు ఆలోచించి చెక్‌యూజర్‌ హోదా అనుభవజ్ఞులైన సీనియర్ నిర్వాహకులును ఇద్దరిని నియమించి, వ్యవస్థ ఏర్పరుచుకుని మనమే పరిశీలించవచ్చు గదా అని నాఅభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 06:50, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు చెప్పిన చెక్‌యూజర్‌ హోదా బాగుంది. దాన్ని అమలు చేద్దాం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 10:22, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాల డేటాను చేర్చుటలో యర్రా రామారావు గమనించిన విషయాలు, జరిగిన పనులు, స్పందనలు[మార్చు]

నేను ఈ ప్రాజెక్టుపనిలో 2017 అక్టోబర్ మాసంలో ప్రవేశించాను.అప్పటి నుండి రోజుకు 12 గం.కు పైగా నిర్విరామకృషితో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామవ్యాసాల మార్పుల, చేర్పుల సవరణలు చేపట్టాను. గ్రామ వ్యాసాల పేజీలనందు డేటాను చేర్చుటలో నేను గమనించిన విషయాలు, జరిగిన పనులు, నాస్పందనలు పై మంచీ చెడూ స్పందించగలరు--యర్రా రామారావు (చర్చ) 17:48, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Wikimedia Education SAARC conference application is now open[మార్చు]

Apologies for writing in English, please consider translating

Greetings from CIS-A2K,

The Wikimedia Education SAARC conference will take place on 20-22 June 2019. Wikimedians from Indian, Sri Lanka, Bhutan, Nepal, Bangladesh and Afghanistan can apply for the scholarship. This event will take place at Christ University, Bangalore.

Who should apply?

  • Any active contributor to a Wikimedia project, or Wikimedia volunteer in any other capacity, from the South Asian subcontinent is eligible to apply
  • An editor must have 1000+ edits before 1 May 2019.
  • Anyone who has the interest to conduct offline/real-life Wikimedia Education events.
  • Activity within the Wikimedia movement will be the main criteria for evaluation. Participation in non-Wikimedia free knowledge, free software, collaborative or educational initiatives, working with institutions is a plus.

Please know more about this program and apply to participate or encourage the deserving candidates from your community to do so. Regards.Ananth (CIS-A2K) using MediaWiki message delivery (చర్చ) 13:54, 11 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యక్తుల వర్గాల్లో లింగ వివరణ ఉండాలా?[మార్చు]

వ్యక్తుల పేజీలను వివిధ వర్గాల్లోకి చేర్చేటపుడు వారి లింగాన్ని బట్టి వర్గీకరించాలా అనే సందేహం వచ్చింది, నాకు. అంటే గుంటూరు జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు అనే వర్గం లోకి ఆడ మగ అందరినీ చేర్చవచ్చా, లేక స్త్రీలకు ప్రత్యేకంగా గుంటూరు జిల్లా స్వాతంత్ర్య సమర యోధురాళ్ళు /గుంటూరు జిల్లా మహిళా స్వాతంత్ర్య సమర యోధులు అని వేరే వర్గం ఉండాలా? రచయితలు/రచయిత్రులు, నటులు/మహిళా నటులు, ఉపాధ్యాయులు/ఉపాధ్యాయురాళ్ళు (మహిళా ఉపాధ్యాయులు) - ఇలా లింగ విచక్షణ (వివక్ష కాదు) చూపించాలా? అలా విడివిడిగా వర్గాలు ఈసరికే ఉన్నాయి. అయినా నాకో సందేహం వాడుకరుల స్పందన కోసం చూస్తాను. __చదువరి (చర్చరచనలు) 07:22, 17 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గాల పేర్లలో లింగ విచక్షణ అవసరం లేదు అని నా అభిప్రాయం. కానీ మనం ఇదివరకే ఇలాంటి వర్గాలు సృష్టించేసి ఉన్నాము. కాబట్టి దానినే అనుసరిస్తే మంచిదేమో. లేకపోతే ఉన్న వర్గాలన్నీ దారి మళ్ళించాలి. దీనికి సమయం వెచ్చించాల్సి ఉంటుంది. రవిచంద్ర (చర్చ) 11:18, 17 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గాలు ఉన్నవి వర్గీకరించడానికి కదా. స్వాతంత్ర్య సమరయోధులు, గుంటూరు జిల్లా వారు అన్నవి రెండూ ఎలాగైతే గుర్తింపులో, మహిళలు అన్నదీ అలానే మరో ముఖ్యమైన గుర్తింపు కాబట్టి ఉండాలని నా ఉద్దేశం. ఐతే ప్రత్యేకించి గుంటూరు జిల్లా మహిళా స్వాతంత్ర్య సమరయోధులు అన్న వర్గీకరణ కాకుండా గుంటూరు జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు అన్న వర్గమూ, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మహిళా స్వాతంత్ర్య సమర యోధులన్న పెద్ద వర్గమూ రెంటినీ కలిపి వారి వారి పేజీల్లో పెడితే బావుంటుంది. దీనికి నేను ఉదాహరణ ఆంగ్ల వికీ నుంచి తీసుకున్నాను. మణిబెన్ పటేల్ ఆంగ్ల వికీ వ్యాసంలో en:Category:Women Indian independence activists. en:Category:Indian independence activists from Gujarat అన్న రెండు వర్గాలూ ఉండడం ఒక ఉదాహరణ. --పవన్ సంతోష్ (చర్చ) 12:20, 17 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గాల పేర్లలో లింగ విచక్షణ అవసరం లేదు అనే అబిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 02:42, 19 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఆయా రంగాల ఉన్న మహిళల వ్యాసాలను గుర్తించడానికి వర్గాల్లో లింగ వివరణ ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:41, 19 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ చర్చను వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ పేజీలో కొనసాగించాలని కోరుతున్నాను.__చదువరి (చర్చరచనలు) 04:40, 28 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణలోని పూర్వపు ప్రతి మండల వ్యాసాలలోని సకలజనుల సమ్మె విభాగం గురించి[మార్చు]

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు జరిగిన ఉద్యమంలో 42 రోజులపాటు తెలంగాణకు చెందిన సకలుజనుల సమ్మె జరిగిన సంగతి మనందరికి తెలుసు.ఇది ముఖ్యమైన సంఘటన అని అందరం ఒప్పుకోవలసినమాట, యదార్థం.ఇది ఏ ఒక్క జిల్లాకు, మండలానికి సంభందించిన విషయం కాదు.తెలంగాణ రాష్ట్రానికి సంభందించిన విషయం. తెలంగాణలోని మండలాలకు ప్రత్యేక వ్యాసం సృష్టించకముందు గ్రామ వ్యాసానికి మండల వ్యాసానికి ఒకే వ్యాసం పేజి ఉంది.ఆ వ్యాసాలలో పరిశీలించగా ప్రతి మండల వ్యాసంలో......

“ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.”

అని కూర్పు చేయబడింది.మన గౌరవ వికీపీడియన్స్ ఎవరు కూర్పుచేసారో ప్రస్తుతం అప్రస్తుతం.అయినా నాకు తెలియదు,అంతలోతుకుకూడా పోదల్చుకోలేదు. వాస్తవానికి ఇది తెలంగాణ ఉద్యమానికి సంభందించిన విషయం.పోనీ ఈ విషయం తెలంగాణ ఉద్యమం వ్యాసంలో ఉందా లేదా అని నేను పరిశీలించగా, లేకపోతే అక్కడ "సకలజనుల సమ్మె" అని విభాగం పెట్టి తగిన మార్పులుతో సవరించాను.పెద్ద మనసుతో ఆలోచిస్తే ప్రతి మండల వ్యాసంలో ఉండవలసిన ఆవశ్యకతలేదని నేను భావిస్తున్నాను.ఇక్కడ మీకు ఒక విషయం ఉదాహరణగా వివరిస్తాను.స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన సంగతి గురించి మనందరకు తెలిసిందే.ఇది దేశానికి,మనందరకు సంభందించిన విషయం.1942 ఆగస్టు నెలలో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలంలోని పెంటపాడు గ్రామంలో పోస్టాఫీసు మీద, టెలిగ్రాఫ్ శాఖకు చెందిన ఆస్తులపై ఆంగ్లేయుల పాలనకు నిరసనగా దాడిచేసి, స్థానిక స్వాతంత్ర సమర యోధులు జాతీయ స్థాయి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.గాంధీజీ అరెస్టు వార్త తెలుసుకుని ఆగస్టు 15 నుంచి ఎస్‌టివిఎన్ హిందూ పాఠశాల విద్యార్థులు క్లాసులు బహిష్కరించారు. కొద్దిరోజుల్లోనే సమీపంలోని భీమవరంలో ఉద్యమకారులపై కాల్పుల దుర్ఘటన జరిగిందని తెలిసిన విద్యార్థులు ఆగ్రహోదగ్రులయ్యారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణరెడ్డి విద్యార్థులను సమావేశపరిచి ప్రసంగిస్తూ బొంబాయిలో జాతీయ నాయకులను అరెస్టుచేయడం, భీమవరంలో ప్రజలపై కాల్పులు జరపడం వంటివి చెప్పి ప్రభుత్వాస్తులు ధ్వంసం చేసి వారికి గుణపాఠం నేర్పాలని సూచించాడు. సత్యనారాయణరెడ్డి నాయకత్వంలో 300 మంది విద్యార్థులు ఊరేగింపుగా వెళ్ళి పీడబ్ల్యుడి ఆఫీసు మీద, పోస్టాఫీసు మీద దాడిచేశారు. తాళం వేసివున్న పోస్టాఫీసును బద్దలుకొట్టి లోపలి వస్తువులు నాశనం చేసి, రికార్డులు తగలబెట్టారు.ఆ సందర్బంగా 12 మంది యువకులను అరెస్టు చేశారు.ఆ ఉద్యమంలో కోర్టు 11 మంది విద్యార్థులుకు 25 కొరాడా దెబ్బలు, స్వాతంత్రసమరయోధుడు సత్యనారాయణరెడ్డికి 25 కొరాడా దెబ్బలుతోపాటు,జైలు శిక్ష,జరిమానా విధించి ఖరారు చేయగా అనుభవించారు.ఈ ఘటన ఆ గ్రామంలో జరిగింది.ఆ గ్రామానికి సంబందించిన ఘటన కాబట్టి పెంటపాడు గ్రామవ్యాసంలో తగిన మూలాలుతో ఒక్క పెంటపాడు గ్రామ వ్యాసంలోనే రాయబడింది.కనీసం ఆ మండలంలోని గామాల వ్యాసాలలోగానీ , పశ్చమ గోదావరి జిల్లా వ్యాసంలో గానీ రాయబడలేదు. మన దేశానికి స్వాతంత్ర్యం ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చింది.అలాగని ప్రతి రాష్ట్ర వ్యాసం పేజీలో గానీ, జిల్లా వ్యాసం పేజీలలోగానీ రాసామా? రాయలేదు. భారత స్వాతంత్ర్యోద్యమం, భారతదేశ చరిత్ర వ్యాసాలలో మాత్రమే రాయబడింది.ఇటువంటి విషయాలు మన గౌరవ వికీపీడియన్స్ ఎవరికివారు ఆలోచించగలరని భావిస్తున్నాను.గ్రామ మండల వ్యాసాల మార్గదర్శకాలులోని 21,22 నియమాలు కూడా అవే చెపుతున్నాయి.

పైవాటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఉద్యమం వ్యాసంలో కూర్పు అయినందున ప్రతి పూర్వపు మండలవ్యాసంలో ఉన్న ఆ వ్యాక్యాలు తొలగించటానికి సముదాయం నిర్ణయం కోసం రచ్చబండలో చర్చనిమిత్తం తీసుకురావడమైనది.దీనిపై గౌరవ వికీపీడియన్స్ వారి వారి అభిప్రాయాలుపై స్పందించవలసినదిగా కోరడమైనది.--యర్రా రామారావు (చర్చ) 02:38, 19 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ ఈ వాక్యాలు ఎవరో అనామక సభ్యులు, వికీ శైలి నిబంధనలు తెలియని వారు అత్యుత్సాహంతో చేర్చిన వాక్యాలు. ఇవి ప్రతి వ్యాసంలో ఉండదగినవి కావు. తెలంగాణా ఏర్పాటు తర్వాత కూడా ఈ చెరువుల పూడికతీతపై ఒకేరకమైన వాక్యాలు గంపగుత్త (బల్క్) గా వ్యాసాల్లో చేర్చడం చూశాను. నాకు సాధ్యమైనంతమేర తిప్పికొట్టాను. ఐపీ అడ్రసులను నిరోధించాను. కానీ కొన్ని చేయిదాటి పోయినాయి. మీరు గుర్తించిన మార్పులు కూడా ఇలాంటివే అని భావిస్తూ వాటిని తొలగించగలరు. రవిచంద్ర (చర్చ) 17:56, 19 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పుడు మండల వ్యాసాలలో ఉన్న సకల జనుల సమ్మె విభాగాన్ని సుమారు 4 సం.ల క్రితం నేనే AWB ఖాతా ద్వారా ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో చేర్చాను. ఒకే సమాచారం అన్ని మండలాలలో చేర్చడం అనేది పూర్తిగా సాధారణ సమాచారం క్రిందికే వస్తుంది. కాని అప్పటి పరిస్థితుల దృష్ట్యా వెంటనే తొలగించాలని చేర్చిన సమాచారం ఇప్పటివరకు కూడా కొనసాగడం బాధాకరమే. సమాచారం చేర్చిన తర్వాత అనివార్య పరిస్థితుల దృష్ట్యా నేను సెలవులోకి వెళ్ళిపోవడం, మిగితావారు కూడా ఈ అనవసర సమాచారం గురించి పట్టించుకోకపోవడంతో తెవికీలో అలాగే ఉండిపోయింది. 2015 ప్రథమార్థంలో చిన్నదిద్దుబాట్లు / సునాయాస దిద్దుబాట్లపై మరియు అనవసర సమాచారంపై చాలా చర్చ జరిగింది. ఈ విషయం అప్పటి సభ్యులకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు ఈ సమాచారం ఎవరైనా తొలగించవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:55, 19 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వందలాది వ్యాసాల్లో చేర్చిన చంద్రకాంత రావు గారు చర్చ ప్రారంభమైనాకా అయినా స్పందించారు. బావుంది. అలానే 2016లో వికీపీడియా:ఆటో వికీ బ్రౌజరుతో చేయదగ్గ మార్పులు ఏమిటన్నవి బహిరంగంగా నిర్ధారించి కానీ చేయరాదనీ, అలానే వాడుకరి:Pranayraj1985 ప్రారంభించిన సత్సంప్రదాయం బట్టి ఆటోవికీ బ్రౌజర్లకు వేరుగా ఖాతాలుండాలని వాటిపై నియమాలు ఏర్పడ్డాయి. అలానే 2018లో మీరు రూపొందించిన గ్రామ వ్యాసం మార్గదర్శకాల్లోనూ దీన్ని చేర్చారు. ఈ సూత్రాలు, పాలసీలు అన్నీ 2016 తర్వాత ఏర్పడడం, ఆ తర్వాత కూడా వాటి అమలు విషయంలో కొద్దిమంది ఆసక్తి కల వికీపీడియన్లే తాపత్రాయపడడం కారణంగా ఇంకా ఇటువంటివి మన వ్యాసాల్లో ఉన్నాయి. ఇకపై వేలాది వ్యాసాల్లో చేసే ప్రతీ మార్పునీ ముందుగా సముదాయం ముందుకు తీసుకురాకుండా చేయకూడదని నిబంధన పటిష్టంగా ఏర్పరుచుకోవాలని ఇలాంటివి మనకు చెప్తున్నాయి. అలాంటి మార్పులు చేసే ముందు సముదాయానికి చెప్పే ఒరవడి కొద్దిమందే పాటించడం వల్ల, స్వచ్ఛందంగా పాటించాల్సిన ఈ అంశం ఖచ్చితమైన నియమం కావాల్సిన అవసరం కనిపిస్తోంది. రామారావుగారి ఆసక్తికి, ప్రయత్నానికి అభినందనలతో --పవన్ సంతోష్ (చర్చ) 08:11, 20 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అలానే కాస్త విషయం పక్కకి మళ్ళినా ఒకటి చెప్పదలిచాను. వాడుకరి:యర్రా రామారావు గారు ప్రస్తావించిన పెంటపాడు గ్రామ వ్యాసంలో సదరు మార్పులు గాదం గోపాలస్వామి అనే ఓ చరిత్రకారుడు రాసిన "భారత స్వాతంత్ర్యోద్యమంలో పశ్చిమగోదావరి జిల్లా యోధులు" అన్న పుస్తకం ఆధారంగా చేశాను. ఇలాంటివే వివిధ జిల్లాలకు సంబంధించి చరిత్ర, వ్యక్తులు, విద్య, పుణ్యక్షేత్రాలు వగైరాల పరంగా వనరులు ఉన్నాయి. ఆసక్తిగల సభ్యులకు అందించగలను. ఆయా పుస్తకాల నుంచి సేకరించి గ్రామాల వ్యాసాల్లో చేర్చగలిగితే ఎన్నో వ్యాసాలు బాగుపడతాయి. ఆసక్తి గలవారు నా చర్చా పేజీలో సంప్రదించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 08:17, 20 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ , సి. చంద్ర కాంత రావు, గారూ పవన్ సంతోష్ గారూ మీ సానుకూల స్పందనలకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 11:11, 22 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
సముదాయం నిర్ణయం మేరకు, చంద్రకాంత రావు గారి సూచనమేరకు 443 మండలవ్యాసాల పేజీలలో ఉన్న సకలజనుల సమ్మె విభాగం తొలగించాను--యర్రా రామారావు (చర్చ) 12:56, 27 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K: 3 Work positions open[మార్చు]

Hello,
Greetings for CIS-A2K. We want to inform you that 3 new positions are open at this moment.

  • Communication officer: (staff position) The person will work on CIS-A2K's blogs, reports, newsletters, social media activities, and over-all CIS-A2K general communication. The last date of application is 4 June 2019.
  • Wikidata consultant: (consultant position), The person will work on CIS-A2K's Wikidata plan, and will support and strengthen Wikidata community in India. The last date of application is 31 May 2019
  • Project Tiger co-ordinatorː (consultant position) The person will support Project tiger related communication, documentation and coordination, Chromebook disbursal, internet support etc. The last date of application is 7 June 2019.

For details about these opportunities please see here. -- Tito (CIS-A2K), sent using MediaWiki message delivery (చర్చ) 10:02, 22 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వికీపీడియన్లు వచ్చాకా "నిలుపుకోవడం" (Retention)పై దృష్టిసారించే మిని టిటిటి కార్యక్రమం[మార్చు]

కొత్తవారికి సహాయం వంటి ప్రయత్నం - కొత్తగా వస్తున్నవారికి శిక్షణనిచ్చి, ఇక్కడ కాలునిలదొక్కుకుని, చక్కని సముదాయ సభ్యులుగా నిలుపుకోవడంలో ఆసక్తికల వికీపీడియన్లు పనిచేయాలన్న ఆలోచనతో మొదలైంది. కొందరు వికీపీడియన్లు ప్రయత్నించారు. అలానే సముదాయంలో ఉన్న చాలామందికి సముదాయాన్ని విస్తరించడంలో సహకరించడంపై ఆసక్తి ఉన్నదని మనకు గతంలో జరిగిన కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం చెప్తోంది. ఈ నేపథ్యంలో కొత్తవారిని నిలుపుకోవడానికి (Retention of Newbies) ఏర్పాటుచేసుకోవాల్సిన వనరులు, సంతరించుకోవాల్సిన నైపుణ్యాలను అందిస్తూ మిని ట్రైన్-ద-ట్రైనర్ కార్యక్రమాన్ని ఇప్పటికే ఉన్న సభ్యులకు చేయాలని సంకల్పం. జూన్ 15, 16 తేదీల్లో నిర్వహించాలన్నది ప్రతిపాదన. వికీపీడియా, వికీసోర్సు ప్రాజెక్టుల విషయంలో మనకు తెలిసిన అంశాలు మనకు వీలుచిక్కినంత సమయంలో మరో కొత్తవ్యక్తికి నేర్పి, మనకి ఇందులో పనిచేయడానికి కలిగే ఉత్సాహాన్ని వారికి కూడా ఏర్పరిచి సముదాయాన్ని విస్తరించాలని, అందుకోసం అవసరమైన నైపుణ్యాలు సంతరించుకోవాలని ఆసక్తి కలిగిన తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులు దీనిలో ఆహ్వానితులు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం. దీనిపై సముదాయం స్పందించాల్సిందిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 10:02, 23 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియాలో రాయడం విషయమై కొన్నిరోజులక్రితం నేను ఫేస్బుక్ లో ఒక పోస్టు పెట్టగా చాలామంది రాయడానికి ఆసక్తి ఉందంటూ స్పందించారు. వారికి నేను ఒక్కడినే నేర్పడం వీలు కుదరడంలేదు. ఈ విషయాన్ని పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె)కు చెప్పినప్పుడు తెలుగు సముదాయ సభ్యులకు మిని టిటిటి కార్యక్రమం చేసి, వారితో కొత్తవారికి శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందని చెప్పాడు. మనం తెవికీలో చేస్తున్నది, మనకు తెలిసింది మాత్రమే చెప్పడంకాకుండా కొత్తవారిని నిలుపుకోవడానికి ఏర్పాటుచేసుకోవాల్సిన వనరులు, సంతరించుకోవాల్సిన నైపుణ్యాల గురించి మరింత అవగాహన ఉంటే బాగుంటుందనిపించింది. కొత్తవారు వచ్చిపోవడంకాకుండా, నిలిచి తెవికీలో రాసేలా తగిన సహకారం అందించడానికి ఈ మిని టిటిటి కార్యక్రమం దోహదపడుతుందని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 19:10, 23 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
శుభం, కానివ్వండి.__చదువరి (చర్చరచనలు) 01:32, 24 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
స్పందించినందుకు ధన్యవాదాలు ప్రణయ్ రాజ్ గారూ, చదువరి గారూ. ప్రయోజనకరమని మీరు భావించిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. అయితే, పలు జాతీయ స్థాయి కార్యక్రమాలు కొన్ని వారాల అటూఇటూలో జరుగుతూ ఉండడం, వాటిలో తెలుగు వికీపీడియన్లు పాల్గొంటూ ఉండడం వంటి కారణాలతో దీన్ని జూలై తొలివారాలకు మార్చుకుందామని భావిస్తున్నాం. కొన్నిరోజుల్లో తేదీ, ప్రదేశం, వేదికల వివరాలు అందిస్తాం. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 07:00, 2 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  • చాలా ఉపయుక్తమైన కార్యక్రమం. ఈ సమావేశం ద్వారా మరికొంత మంది ఆసక్తిగల కొత్తవాడుకరులు మన తెలుగు వికీపీడియా కి వస్తారని పూర్తి నమ్మకం. ఈ సమావేశానికి నా వంతు సహాయం నేను చేస్తాను.--Ajaybanbi (చర్చ) 05:20, 30 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ ప్రాజెక్టు[మార్చు]

ఈ పేజీలో [1], [2], [3] అనే చర్చలు వ్యక్తుల పేజీల వర్గీకరణను క్రమబద్ధీకరించాలనే ఆవశ్యకత గురించి మనల్ని తట్టి లేపాయి. తదనుగుణంగా వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ అనే ప్రాజెక్టును మొదలుపెట్టాను. ప్రాజెక్టు పేజీ రూపకల్పన ఇంకా పూర్తి కాలేదు. ముందుగా ప్రాజెక్టు స్వరూప స్వభావాలను, చెయ్యాల్సిన పనులను, చెయ్యల్సిన విధానాలనూ రూపొందించుకుని, ఆ తరువాత పేజీల్లో చెయ్యాల్సిన మార్పులను చేద్దామని నా ఉద్దేశం. వాడుకరులు ఈ పేజీని చూసి, ఆ ప్రాజెక్టులో భాగం పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 10:48, 23 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]