వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 83

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 82 | పాత చర్చ 83 | పాత చర్చ 84

alt text=కేలండర్ రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2021-10-01 : 2021-11-30

వికీపీడియాపై కథ[మార్చు]

ఈమాట ఆన్‌లైన్ పత్రికలో పూర్ణిమ తమ్మిరెడ్డి అనే ఆవిడ "ఎడిట్ వార్స్" అనే కథ వ్రాసింది. ఆ కథను https://eemaata.com/em/issues/202110/26944.html అనే లింకులో చదవవచ్చు. బహుశా వికీపీడియా గురించి తెలుగులో వచ్చిన మొదటి కథ ఇదే కావచ్చు. కథ చదివితే రచయిత్రికి వికీపీడియా పట్ల కొంత అవగాహన ఉంది అని అర్థమౌతుంది. బహుశా ఆమెకు తెలుగు/ఇంగ్లీషు వికీలలో కొంత ఎడిట్‌లు చేసిన అనుభవం ఉండొచ్చు. ఐతే కథ నాకు పూర్తిగా అర్థం కాలేదు. కథలో రచయిత్రి ఊహించినట్లు వర్చువల్ రియాలిటీ వికీపీడియాలో సాధ్యమా? వ్యాసాలలో కొన్ని మూసలు ఉంటాయి గానీ మొత్తం వ్యాసమే ఒక మూసగా వికీపీడియాలో ఉంటుందా? ఈ కథ చదివిన పాఠకుడు వికీపీడియాపై ఎలాంటి నిర్ధారణకు వస్తాడు? ఈ కథ వికీపీడియాపై అపోహలను కలిగిస్తుందా? తొలగిస్తుందా? ఈ కథపై వాడుకరులు తమ తమ అభిప్రాయాలను చెప్పగలరు.--స్వరలాసిక (చర్చ) 02:53, 7 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

స్వరలాసిక గారూ ఆ కథ లింకు ఒకసారి పరీక్షంచండి.page not found అని చూపుతుంది.గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 03:26, 7 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
స్వరలాసిక గారు, ఈమాట ఆన్‌లైన్ పత్రిక వారు వికీపీడియన్ శ్రమను.. వికీలో రాసేందుకు ఎటువంటి పరిశోధన అవసరమో చాలా చక్కగా వివరించారు. బాగుందండి.. Nskjnv ☚╣✉╠☛ 07:06, 7 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
స్వరలాసిన గారూ, కథ చదివాను. వర్చువల్ రియాలిటీని వికీపీడియాతో లంకె వేయడం వైజ్ఞానిక కల్పనలో భాగం కావచ్చు కానీ, నాకు ఈ రెండు విషయాలనూ అంతగా ముడివేయలదనిపించింది. ఏదో గూఢార్థానికి ప్రతీకగా వాడి ఉండవచ్చు కూడా. అంటే వికీలో వ్యాసాన్ని ఇప్పుడు ఆడియో రూపంలో విన్నట్టే వికీ పాఠ్యాన్ని వర్చువల్ రియాలిటీలో దృశ్యీకరణ చేసి చూపగలిగే సౌలభ్యం భవిష్యత్తులో రావచ్చు అని ఆమె ఊహించి రాసి ఉండవచ్చు. మొత్తం వ్యాసమే ఒక మూసలో తయారు చెయ్యడం సైన్స్ ఫిక్షన్ కాదు. మనం ఇదివరకే చేసేశాం గ్రామ వ్యాసాల విషయాల్లో. టేబులర్ డేటాని తీసుకుని ఒక స్క్రిప్టు/బాటు ద్వారా వేల వ్యాసాలు సృష్టించి వాటిని గ్రామ వ్యాసాల్లో అతికించాం. ఇంకా ముందుకు వెళితే, అసలు ఈ డేటా సేకరించడం, దాన్ని వ్యాసాలుగా మార్చేలా స్క్రిప్టు తయారు చేయడం, ఆ స్క్రిప్టును నడిపించి వ్యాసాలు సృష్టించడం కూడా భవిష్యత్తులో ఆటోమేషన్ ద్వారా జరిగిపోవచ్చని ఆమె ఊహించారని అనుకుంటున్నాను.
ఇక మూలాల విషయానికొస్తే మన పత్రికల్లో (ప్రామాణిక పత్రికలతో సహా) వస్తున్నది అసలైన నిజమా కాదా అన్న విషయంపై తీవ్రంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ప్రతి పత్రిక ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుంది. కానీ వికీలో మనం మాత్రం వాటి ఆధారంగానే వ్యాసాలు రాస్తున్నాం. కాబట్టి అవి నిజం కాకపోతే వికీలో సమాచారానికి ప్రామాణికత ఎలా వస్తుంది? కానీ మనకు వేరే దారి లేదు. వ్యక్తిగతంగా ప్రచురించే సమాచారం కన్నా గుంపుగా ప్రచురించే సమాచారానికి విలువ ఎక్కువ అనే కారణంతో మనం వాటినే ఆధారాలుగా తీసుకోక తప్పదు. రాను రాను కూడా వార్తల విశ్వనీయత పెరుగుతుందని నేను ఆశించడం లేదు. ఇంకా దిగజారినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఆ కథలో చెప్పినట్లు ఇక్కడ నికార్సయిన నిజం ఎవరికీ అక్కరలేదు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత నిజాలనే కోరుకుంటున్నారు. సంస్థలు కూడా వాటిని సొమ్ము చేసుకుంటున్నాయి. - రవిచంద్ర (చర్చ) 13:33, 7 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ కథ రాసినప్పుడు రచయిత కథను చదవమని, అవసరమైన సూచనలు ఇవ్వమని నాకు పంపించారు. చదివి నాకు తోచిన సూచనలు చెప్పాను. అలానే, వికీపీడియా గురించి పలు వివరాలను కూడా నేను అందించాను. దానికోసం నేను ప్రత్యేకించి వికీపీడియా పాలసీలు, ఆంగ్ల వికీపీడియాలో వచ్చిన కొన్ని వివాదాలను మరొక్కసారి చదివాను.
ఇక కథలో ఉన్న వర్చువల్ రియాలిటీ కథ మొదలు నుంచి చివర వరకూ అలాగే కొనసాగింది కాబట్టి అది రచయిత సృష్టించిన కాల్పనికత అని పాఠకులు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. అలానే, మూస అంటే ఆవిడ ఉద్దేశం టెంప్లెట్ అని కాదనుకుంటా. ఒక వ్యాసాన్ని మనం రాయాలి అంటే ఒక వికీ శైలి కచ్చితంగా ఉంది కదా. దాన్నే ఆవిడ మూస అంటున్నారు. ఉదాహరణకు వ్యక్తి వ్యాసం మొదలుపెట్టినప్పుడు, తొలి వాక్యంలో వారి పేరు, పుట్టిన తేదీ, వారు ఏ విషయానికి ప్రసిద్ధులైతే అది ఉండి ప్రారంభం అవుతుంది కదా. అలా కాకుండా పత్రికల్లో రాసినట్టుగా, "ఆయన తెలుగు సినిమాలో మేరు పర్వతం, ఆయన పేరు వింటేనే ప్రేక్షకులు పరశులయ్యారు" వగైరా వాక్యాలతో సృజనాత్మకంగా, స్వేచ్ఛగా తోచింది రాయలేం కదా. ఆవిడ ఉద్దేశంలో అదే ఒక మూస. సమాచార మూస.
నా ఉద్దేశంలో తెర వెనుక వికీపీడియన్ల కష్టాన్ని, మన నిష్పాక్షికతను, దాని వల్ల కొండొకచో ఒక్కో వికీపీడియన్ ఎదుర్కొంటున్న కష్టసుఖాలను ఈవిడ చక్కగా ప్రతిబింబించారని అనుకుంటున్నాను. నిష్పాక్షికత సాధించడానికి వికీ ఎంత కష్టపడుతుందన్నది, స్వేచ్ఛగా సమాచారాన్ని పంచుకునే వీలును దెబ్బతీస్తే చేస్తే భవిష్యత్తు ఏమవుతుందన్నది రచయిత ముఖ్యమైన పాయింట్. ఇది రాయడం వెనుక ఆవిడకు నిజజీవితంలో వికీపీడియన్లు ఎదుర్కొన్న ఒక సంఘటన ఆధారంగా ఉంది.
ఇంకేమైనా ప్రత్యేక ప్రశ్నలు ఉంటే రాయండి. రచయిత దృష్టికి నేను తీసుకువెళ్తాను. ఆవిడ ఏమైనా స్పందిస్తే స్పందించవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 08:53, 9 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి నిర్వాహకత్వ సమీక్ష[మార్చు]

ఆర్నెల్లకోసారి నిర్వాహకుల కార్యకలాపాల సమీక్ష జరగాలని, ప్రమాణాలకు అనుగుణంగా లేని వారు స్వచ్ఛందంగా తప్పుకోవడం గాని, సముదాయం తప్పించడం గానీ జరగవచ్చని వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ మార్గదర్శకం చెబుతోంది. తదనుగుణంగా 2021 ఏప్రిల్ - సెప్టెంబరు మధ్య కాలంలో నే జేసిన నిర్వాహకత్వ కార్యకలాపాలపై స్వీయసమీక్ష చేసుకుని సముదాయం పరిశీలన కోసం పెట్టాను. పరిశీలించగలరు. నా గత ఆర్నెల్ల వారీ సమీక్షలను కూడా ఆ పేజీ నుండి చూడొచ్చు. __ చదువరి (చర్చరచనలు) 06:18, 18 ఏప్రిల్ 2021 (UTC) చదువరి (చర్చరచనలు) 23:11, 9 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మూవ్‌మెంట్‌ చార్టర్ ముసాయిదా కమిటీ సభ్యుల ఎన్నిక కోసం ఓటింగ్ ఇప్పుడు తెరవబడింది[మార్చు]

మూవ్‌మెంట్‌ చార్టర్ ముసాయిదా కమిటీ సభ్యుల ఎన్నిక కోసం ఓటింగ్ ఇప్పుడు తెరవబడింది. మొత్తంగా, ఈ ఎన్నికలలో ప్రపంచవ్యాప్తంగా 70 వికీమీడియన్లు 7 స్థానాలకు పోటీ పడుతున్నారు.

ఓటింగ్ అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 24, 2021 వరకు తెరవబడి ఉంటుంది (ప్రపంచంలో ఎక్కడైనా).

నవంబర్ 1, 2021 నాటికి కమిటీని సమీకరించాలనేది ప్రణాళిక.ఈ కమిటీలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు: ఆన్‌లైన్ కమ్యూనిటీలు 7 గురు సభ్యులకు ఓటు వేస్తాయి, 6 గురు సభ్యులను వికీమీడియా అనుబంధ సంస్థలు సమాంతర ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తాయి మరియు ఇద్దరు సభ్యులను వికీమీడియా ఫౌండేషన్ నియమిస్తుంది.

మీరు ఇష్టపడే భాషలో మీ ఓటును తెలియజేయడానికి ప్రతి అభ్యర్థి గురించి తెలుసుకోండి: <https://meta.wikimedia.org/wiki/Special:MyLanguage/Movement_Charter/Drafting_Committee/Candidates>

ముసాయిదా కమిటీ గురించి తెలుసుకోండి: <https://meta.wikimedia.org/wiki/Special:MyLanguage/Movement_Charter/Drafting_Committee>

మేము ఈ ఎన్నికల కోసం ఓటింగ్ సలహా దరఖాస్తును మార్గనిర్దేశం చేస్తున్నాము. మిమ్మల్ని మీరు సాధనం ద్వారా క్లిక్ చేయండి మరియు ఏ అభ్యర్థి మీకు దగ్గరగా ఉన్నారో మీరు చూస్తారు! <https://mcdc-election-compass.toolforge.org/> వద్ద తనిఖీ చేయండి

పూర్తి ప్రకటన చదవండి: <https://meta.wikimedia.org/wiki/Special:MyLanguage/Movement_Charter/Drafting_Committee/Elections>

సెక్యూర్‌పోల్‌లో ఓటు వేయండి: <https://meta.wikimedia.org/wiki/Special:MyLanguage/Movement_Charter/Drafting_Committee/Elections>

ఉత్తమ,

ఉద్యమ వ్యూహ మరియు పాలనా బృందం, వికీమీడియా ఫౌండేషన్


05:55, 13 అక్టోబరు 2021 (UTC)

తెలంగాణ జిల్లాల, మండలాలు పటాలు పునర్య్వస్థీకరణ ప్రకారం భౌగోళిక మార్పులుతో తాజాకరించవలసిన ఆవశ్యకత[మార్చు]

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత, 2016 లో ప్రభుత్వం మొదటిసారిగా నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణ చేపట్టింది. గతంలో ఉన్న 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా 9 జిల్లాలు 32 జిల్లాలుగాను, 439 మండలాలు 577 మండలాలుగా పునర్య్వస్థీకరించింది. ఇది జరిగి 5 సంవత్సరాల కాలం గడచినప్పటికీ ఇప్పటికీ పాత పటాలు మాత్రమే వ్యాస పేజీలలో దర్శనమిస్తున్నాయి.కావున పునర్య్వస్థీకరణ ప్రకారం కొత్త భౌగోళిక మార్పులుతో సవరించిన జిల్లాల, రెవెన్యూ డివిజన్ల, మండలాల పటాలు కొత్తగా తయారుచేసి లేదా సవరించి జిల్లాల, మండలాల, పేజీలు తాజాకరించవలసిన ఆవశ్యకతఉంది.అందులో ఇది ఎవరుబడితే వారు చేపట్టే పనికాదు. సాంకేతికంగా పటాలు తయారీ, లేదా తాజాకరణలో అనుభవంఉన్న వారి సారధ్యంలో ఇది ఒక పెద్ద ప్రాజెక్టుగా చేపట్టవలసి ఉంది.వారికి చురుకైన వాడుకరులందరూ సహకరించవలసి ఉంది. కావున దీని కార్యాచరణ ప్రణాళికకు అవసరమైన సూచనలు, సలహాలుపై స్పందించవలసినదిగా సముదాయ సభ్యులందరినీ కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 14:01, 27 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణ జిల్లాల-రెవెన్యూ డివిజన్ల-మండలాల పటాలు పునర్య్వస్థీకరణ ప్రకారం మార్చాలన్న ప్రతిపాదన చేసినందుకు ధన్యవాదాలు యర్రా రామారావు గారు. ఈ ప్రాజెక్టులో నేనుకూడా భాగస్వామ్యమవుతాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:45, 28 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారూ, చాలా ముఖ్యమైన పని. పెద్ద పని కూడా. పాత జిల్లాలు అన్నిటికీ రూపు మారిపోయింది. వాటికి మ్యాపులు తయారు చెయ్యాలి. మండలం పేజీలో చూపించిన మండలం మ్యాపులన్నీ జిల్లా మ్యాపులో భాగంగా చూపించారు కాబట్టి మండలం మ్యాపులన్నీ మళ్ళీ చెయ్యాలి. మొత్తమ్మీద 577 మ్యాపులు తయారు చెయ్యాలన్నమాట. అయితే ఈ మ్యాపులు అందరూ చెయ్యలేరు కాబట్టి నాదొక ప్రతిపాదన:
 1. ముందు 33 జిల్లాలకూ జిల్లా మ్యాపులు తయారు చెయ్యాలి. వాటిలో మండలాల సరిహద్దులను కూడా గుర్తించాలి. ఇది మ్యాపులు తయాఅరుచేసే కుశలత ఉన్నవారే చెయ్యాలి. నాకు ఆ కుశలత లేదు.
 2. పైన చెప్పిన 33 మ్యాపులు తయారైతే వాటినుండి ఒక్కో మండలాన్ని హైలైటు చేస్తూ మండలాల మ్యాపులను తయారు చెయ్యవచ్చు. ఉదహారణకు ఒక జిల్లాలో 10 మండలాలుంటే ఆ జిల్లా మ్యాపును 10 కాపీలు చేసుకుని ఒక్కో మ్యాపులో ఒక్కో మండలాన్ని హైలైటు చెయ్యాలి. ఈ పని చెయ్యడం తేలిక చాలామంది చెయ్యగలరు. నేనూ చెయ్యగలను.
ఈ విధంగా చేస్తే ఈ ఈ పనిని త్వరగా చెయగలం. మొదటి పనిని చెయ్యగలవారెవరైనా ఉంటే, ముందుకు వస్తే బాగుంటుంది. __ చదువరి (చర్చరచనలు) 09:20, 29 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మొదటి పని చేసేందుకు అవసరమైన ముడిసరుకు ఈ లింకులో దొరుకుతుంది. కాపీ హక్కుల సంగతి తెలియదు.__ చదువరి (చర్చరచనలు) 13:45, 29 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

శిక్షణా శిబిరం[మార్చు]

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ప్రాజెక్టులో భాగంగా ఇదివరకే చాలా వ్యాసాలు సృష్టించబడ్డాయి, విస్తారంగా దిద్దుబాట్లు కూడా జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువ సంఖ్యలో ఈ ప్రాజెక్టులో వాడుకరులు పాల్గొనటం, తెలుగు వికీ అభివృద్ధికి కొత్త వాడుకరులను ప్రోత్సహించడం చాలా అవసరం, నిత్యం కొత్త వారు చేరుతూ వ్యాసాల్లో మార్పులు చేస్తూ ఉంటేనే మనం వికీని తరతరాలపాటు నిలపగలం. ఈ ప్రక్రియకు బలం చేకూర్చేలా, కొత్త వాడుకరులు వికీలో ఎటువంటి దిద్దుబాట్లు చేయవచ్చో నేర్పడానికి అభిలాష్ గారూ మరియు నేను కలిసి జూమ్ వేదికగా ఈ ఆదివారం (తేదీ:31 అక్టోబర్, 2021) ఉదయం 11 గంటలకు రెండు గంటల వికీపీడియా శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా వ్యాసంలో చిన్న చిన్న దిద్దుబాట్లు చేయడం,వ్యాసాలు సృష్టించడం, మూలాలు చేర్చడం, వర్గాలు చేర్చడం,బొమ్మలను చేర్చడం వంటి ప్రాథమిక విషయాలను పరిచయం చేస్తున్నాం. కాబట్టి వాడుకరులు మీకు తెలిసిన ఔత్సాహికులను ప్రోత్సహించి కార్యక్రమంలో పాలుపంచుకునేలా చేయగలరు. Nskjnv ☚╣✉╠☛ 08:28, 28 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు సాయి కిరణ్ గారు, సముదాయ సభ్యులందరు తమకు తెలిసిన వారిని ఈ శిబిరంలో పాల్గొనేలా ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము.-అభిలాష్ మ్యాడం 08:34, 28 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి కార్యక్రమం.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:47, 28 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Nskjnv గారూ, @MYADAM ABHILASH గారూ.. మంచి కార్యక్రమం చేపట్టారు. కానివ్వండి. __ చదువరి (చర్చరచనలు) 09:11, 29 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
యువత మంచికార్యక్రమం చేపట్టారు.అవకాశం ఉంటే రికార్డు చేసేపద్దతి చూడండి.మీ ఉత్సాహానికి, ఆలోచనలకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 09:25, 29 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కొత్త సభ్యులను ఆహ్వానించడం, నిలుపుకోవడంలో మనం వెనకబడి ఉన్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ నా అభినందనలు.- రవిచంద్ర (చర్చ) 09:59, 29 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Nskjnv, @MYADAM ABHILASH గార్లకు, గత ఆదివారం మీ కార్యక్రమ విశేషాల గురించి చెప్పండి. __ చదువరి (చర్చరచనలు) 01:50, 3 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరిగారూ, ఆదివారం నాడు శిక్షణా కార్యక్రమం బాగా జరిగింది. దాదాపు 50 మంది గూగుల్ ఫారంలో నమోదు చేసుకుంటే, 25 మంది వరకు కార్యక్రమంలో పాల్గొన్నారు. జూమ్ లో 40నిమిషాలకు డిస్కనెక్ట్ అవుతుంది కాబట్టి గూగుల్ మీట్ ద్వారా నిర్వహించాము. గూగుల్ మీట్ గురించి కొంత మందికి అవగాహన లేని కారణంగా కాస్త సంఖ్య తగ్గిందనుకుంటా. జూమ్ ద్వారా నిర్వహించి ఉంటే సంఖ్య పెరిగి ఉండేది. కార్యక్రమంలో వికీ విహారం, వికీలో ఖాతా తెరవడం అనే ప్రాథమిక అంశాల గురించి వివరించడం జరిగింది. వచ్చిన వారిలో కొందరు చాలా ఆసక్తి చూపారు కాబట్టి మళ్ళీ వారికి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అందుకే 'కొత్త వాడుకరుల నిలుపుదల' అనే చర్చను మీ ముందు ఉంచాము--అభిలాష్ మ్యాడం 02:38, 3 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@MYADAM ABHILASH గారూ అభినందనలందుకోండి. 25 మండి వచ్చారంటే కార్యక్రమం బాగా విజయవంతమైనట్టు. మొదలుపెట్టడమే పెద్ద విజయంతో మొదలుపెట్టారు. చప్పట్లు!
జూమ్‌లో నేను గమనించినదేంటంటే.. 40 నిమిషాలు అంటాడు గానీ, దాన్ని పెంచుతాడు. ఒకవేళ పెంచకపోయినా, మనం ముందే మూణ్ణాలుగు సెషన్లను నమోదు చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అన్నిటికీ ఒకే ప్రవేశ సంకేతపదం పెట్తుకుంటే సరిపోతుంది (ప్రైవేట్ పాస్‌వర్డనో ఏదో అంటాడు).
హాజరైన వాళ్ళను వెనకాడకుండా రాయడం మొదలు పెట్టమనండి. చిన్న చిన్న సవరణలు చేస్తూ వికీకి అలవాటు పడమనండి. వికీలో రాయడమంటే కొత్త వ్యాసం రాయడమే ననే అపోహ కొత్తవారికి ఉండే అవకాశముంది. ఉన్న వ్యాసాల్లో సవరనలు చాలా అవసరమౌతాయనీ వాటిని పరిశీలించి తగు సవరణలు చెయ్యమనీ చెప్పండి. నాలుగైదు మంచి వ్యాసాలను ఎంచి వాటిని చూడమనండి.
మరోసారి మీ ఇద్దరి కృషికీ అభినందనలు, ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 02:49, 3 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు చదువరి గారూ మున్ముందు కూడా ఇలాంటి శిబిరాలకు మీ సూచనలను తప్పక పాటిస్తాం.--అభిలాష్ మ్యాడం 04:42, 3 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, ధన్యవాదాలు. కార్యక్రమానికి మొదటిగా మేము కూడా ఒక 10 మంది వరకే వస్తారనుకున్నాము. వికీ పట్ల ఆసక్తిగల వారు చాలానే ఉన్నారు వారందరిని ఒకదాటిలోకి తేవాలి, మీరన్నట్లు వికీలో చిన్న చిన్న సవరణలు చేయడం నేర్పడమే మేము ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నాము(ముందు కొంచెం రుచి చూపాలిగా మరి).

ఈ శిబిరానికి హాజరైన Kasyap గారికి, ప్రణయరాజ్ గారికి, Ch Maheswara Raju గారికి, రమేష్‌ బేతి గారికి ధన్యవాదాలు.

యర్రా రామారావు గారూ, ఈ కార్యక్రమం తలపెడదామనుకున్న నుండి వారి సూచనలు అందిస్తూ ఉన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము చర్చించుకునేటప్పుడు వచ్చిన కొన్ని అంశాలు

 1. వికీలో ఉండే అతి తక్కువ మంది చురుకైన వాడుకరులు ఎన్నాళ్ళని రధాన్ని లాగగలరు, చురుకైన వాడుకరులు సంఖ్య పెంచాలి.
 2. నిత్యం కొత్తవారు వికీకి పరిచయమవ్వడం చాలా అవసరం.
 3. మేము నిర్వహిస్తున్న ఈ శిబిరాలతో కనీసం ఒక 100 చురుకైన తెవికి వాడుకరులను పరిచయం చేయాలని అని అనుకుంటున్నాను.
 4. వికీలో చాన్నాళ్ళనుండి సేవలందిస్తున్న వారు వ్యాస నిర్మాణం కంటే ఎక్కువగా వికీ నిర్వహణ, వ్యాస మెరుగుదల పై ద్రుష్టి సారిస్తూ కొత్త వారిని వ్యాస నిర్మాణంలో భాగం చేసే దిశలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నాం.

ఇక అభిలాష్ గారు ప్రస్తావించినట్టు, కొత్తగా నమోదు చేసుకుంటున్న వారిని ఈ కార్యక్రమానికి హాజరవ్వమని కోరవచ్చు. ఈ శిక్షణా శిబిరాలను మరింత తేజోవంతంగా ముందుకు నడపడానికి సముదాయ సభ్యుల సలహాలు, సూచనలు అలాగే వారి సహాయం కోరుతున్నాము. Nskjnv ☚╣✉╠☛ 14:37, 3 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వాడుకరుల నిలుపుదల[మార్చు]

ప్రతిరోజు చాలా ఎక్కువ సంఖ్యలో వాడుకరులు కొత్తగా వికీపీడియాలో ఖాతాను సృష్టించుకుంటున్నారు. ఎంతోకొంత ఆసక్తి ఉంటే తప్ప వాడుకరి ఖాతా సృష్టించుకోరు కాబట్టి ఇలా సృష్టించుకున్న వాడుకరులకు ఒక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుంది. ఒక వారంలో ఎంత మంది ఖాతా సృష్టించుకున్నారో అంతమందికీ మెయిల్ ద్వారా సమాచారం పంపి వారాంతంలో వారందరికీ కలిపి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిద్దామన్నది నా అభిప్రాయం. దీనికి సాయి కిరణ్ గారు, నేను శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీనిపై సముదాయ పందిరి సభ్యుల అభిప్రాయం తెలపగలరు.--అభిలాష్ మ్యాడం 11:47, 31 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@MYADAM ABHILASH గారూ, బాగుంది ఐడియా. నేరుగా ఖాతా సృష్టించిన వాళ్లనే ఈ శిక్షణ కోసం తీసుకోండి. "ఆటోమేటిగ్గా" ఖాతా సృష్టించిన వాళ్ళలో పేరును బట్టి తెలుగువాళ్ళై ఉండే అవకాశం బాగా ఉంది అనుకున్న వాళ్లను తప్ప మిగతా వాళ్ళను వదిలెయ్యడం మంచిది. వాళ్ళు తెలుగు వాళ్లు కాదు. కొత్తవాళ్ళు కూడా కాకపోవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 01:49, 3 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరిగారూ, అవును మీరు చెప్పింది సరైనదే నేరుగా ఖాతా సృష్టించిన వాళ్ళని శిక్షణకు తీసుకుంటే మంచిది. అలాగే ఆలోచిస్తాం--అభిలాష్ మ్యాడం 02:43, 3 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా వ్యాసాలలో అనుచిత మార్పులు[మార్చు]

గత కొన్ని రోజులుగా అనామక వాడుకరులు (ఐపీ అడ్రసులు ఎక్కువగా IPV6 ఫార్మాటులో కనిపిస్తున్నాయి) సినిమా వ్యాసాల్లోని తారాగణంలో తప్పు పేర్లని చేరుస్తున్నారు. అంటే ఆ సినిమాలో నటించని నటీనటుల పేర్లు చేరుస్తున్నారు. ఏదో ఒకటి అరా అని చూస్తే కాదు, సుమారు ఓ పది పైనే వ్యాసాల్లో ఇలాంటి మార్పులు గమనించి తిప్పికొట్టాను. ఈ రోజు కూడా ఒకటి కనిపించింది. ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా చేసినా చేస్తుండవచ్చు. అనామక వ్యక్తులు కాబట్టి వారితో చర్చించలేము. ఇంకొక విషయం ఏమిటంటే లాగిన్ అయిన ప్రతి సారి ఐపీ అడ్రసు మారుతోంది. కాబట్టి మార్పులు ఫలానా ఐపీ నుంచే వస్తున్నాయి అని ఖచ్చితంగా చెప్పలేమి. ఇటీవల మార్పులు పహారా కాసే సభ్యులు అప్పుడప్పుడూ ఇలాంటి మార్పులు గమనిస్తూ ఉండండి. - రవిచంద్ర (చర్చ) 12:56, 31 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ ఒక్క సినిమా వ్యాసాలలోనే జరుగుతుందని నేను అనుకోవటంలేదు.నేను సినిమా వ్యాసాలుకాని వ్యాసాలలో ఈ రోజు 5, 6 వ్యాసాలలో రద్దు చేసిన సందర్బాలు ఉన్నవి.అనుచిత మార్పులు చేసినవారిని నలుగురిని నిరోధించటం జరిగింది.నావరికి నేను వికీలో పనిచేసేటప్పుడు ఇటీవల మార్పులు ప్రతి 15 ని. కు ఒకసారి పరశీలిస్తుంటాను.ఉదాహరణకు గార్లపాడు (అయోమయనివృత్తి) వ్యాసంలో అజ్ఞాత వాడుకరి అనుచిత మార్పులు చూడండి.సినిమా వ్యాసాలు తప్ప నేను సాధ్యమైనంతవరకు మిగిలిన వ్యాసాలు పరిశీలన చేస్తూనే ఉంటాను,ఇందులో నా అభిప్రాయం ఏమంటే, ఈ విషయంలో సినిమా వ్యాసాలు రాసేవారికే అర్థమవుతుంది. నాలాంటివారికి అర్థం కాదు. ఆ నటీనటులు ఉన్నరేమో అనుకోటానికి అవకాశంఉంది. వ్యాసాలు రాయటం ఒక ఎత్తైతే, వాటిని అనుచిత మార్పులుచేసే అజ్ఞాత వాడుకరులు బారినుండి కాపాడుకోవటం ఒక ఎత్తు.మొదటిది ఎంత ముఖ్యమో, రెండవది అంతే ముఖ్యం.కనీసం రచ్చబండలో స్పందించకపోయినా, ఇక్కడ ఏమిరాసారో, ఏమి జరుగుతుందో చదువుతుంటే చాలు.ఈ విషయంలో సినిమా వ్యాసాల అభివృద్ధిపై, రాసే ఆసక్తి ఉన్న వాడుకరులు తరుచూ ఇటివల మార్పులు గమనించి తగిన చర్యలు తీసుకోపోతే వ్యాసాలు గందరగోళంగా మారే అవకాశం ఉంది.రాసేసాం మనపని అయిపోయింది అనే తరహాలో ఉండకూడదని నా మనవి. యర్రా రామారావు (చర్చ) 13:35, 31 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
దుశ్చర్యలను వెనక్కి తిప్పినందుకు రవిచంద్ర గారికి ధన్యవాదాలు. అనామక వాడుకరులు చేస్తున్న అకృత్యాలు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు. ఎప్పటి నుండో ఉన్నవే. అందరూ అప్రమత్తతతో ఉండి తగు చర్యలు తీసుకుంటూ ఉంటే వాటిని కొంతవరకైనా అరికట్టవచ్చు. అరికట్టలేకపోయినా ఎప్పటికప్పుడు దుశ్చర్యలను తొలగిస్తూ ఉండవచ్చు. రవిచంద్ర గారికో రామారావు గారికో మరొకరికో వచ్చిన సమస్యలే వాళ్ళే చూసుకుంటారులే అని వదిలేస్తే అవి పెచ్చరిల్లుతూనే ఉంటాయి. ఓ రెండు మూడు నెలల కిందట అజ్ఞాతలు పదేపదే దాడులు చేసినపుడు దానిపై చాలామంది నోరు విప్పలేదు. అనేక ఐపీ శ్రేణీ నిరోధాలు విధించాకనే అవి తగ్గాయి. ఆ నిరోధాలు విధించే అధికారం ఉన్న నిర్వాహకులు, అనుభవజ్ఞులూ ఎవరూ ఆ పని చేసిన దాఖలాలు నాకు కనబళ్ళేదు. బహుశా దుశ్చర్యను చూసి ఉండరులే అని నన్ను నేను సమాధానపరచుకున్నాను. కానీ అన్ని సార్లు దుశ్చర్య జరిగితే ఒక్కసారి కూడా కనబళ్ళేదా, ఒక్కరిక్కూడా కనబళ్ళేదా అని మాత్రం అనిపించేది. __చదువరి (చర్చరచనలు) 10:53, 1 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నూతన మూవ్‌మెంట్‌ ఛార్టర్‌ ముసాయిదా కమిటీ సభ్యులతో సమావేశమవండి[మార్చు]

More languagesPlease help translate to your language

మూవ్‌మెంట్‌ ఛార్టర్‌ ముసాయిదా కమిటీ ఎన్నికలు మరియు ఎపికల ప్రక్రియ పూర్తి అయింది.

కమిటి తన పనిని ప్రారంభించడానికి త్వరలోనే సమావేశమవుతుంది. వైవిధ్యత మరియు నైపుణ్య అంతరాలను పూరించడానికి మరో ముగ్గురు సభ్యులను కమిటీ నియమించవచ్చును.

ముసాయిదా ప్రక్రియలో మూవ్‌మెంట్‌ ఛార్టర్ పాల్గొనాలనే ఆసక్తి మీకు ఉంటే, అప్‌డేట్స్‌ను అనుసరించండి Meta మరియు [టెలీగ్రామ్‌ గ్రూప్‌]లో చేరండి.

మూవ్‌మెంట్‌ వ్యూహం మరియు పరిపాలన బృందం నుంచి ధన్యవాదాలు తెలియచేస్తోంది
RamzyM (WMF) 02:35, 2 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

లైసెన్సు సమాచారం లేని దస్త్రాల తొలగింపు[మార్చు]

లైసెన్సు సమాచారం లేని దస్త్రాలకు సముచితమైన లైసెన్సు సమాచారాన్ని చేర్పించి ఒక దారికి తెచ్చే విషయమై MGA73 గారు కృషి చేస్తూ ఉన్న సంగతిని మీరు గమనించే ఉంటారు. అర్జున గారు దానిపై పనిచేస్తూ ఆయనకు తోడ్పాటు నిస్తున్నారు. ఇలా లైసెన్సు లేని వాటిలో (అలాంటివి సుమారు 1000 దస్త్రాలున్నాయి) దాదాపు 280 దస్త్రాలను ఎక్కడా వాడను కూడా లేదు. ఎక్కడా వాడని దస్త్రాలను తొలగించవచ్చు గదా అని అంటే అర్జున గారు తొలగించవచ్చు, తొలగించండి అని అన్నారు. ఆ చర్చను ఇక్కడ చూడవచ్చు.

దానికనుగుణంగా ఎక్కడా వాడని, లైసెన్సు సమాచారం లేని ఆ దస్త్రాలన్నిటినీ వర్గం:లైసెన్సు సమాచారం లేని, ఎక్కడా వాడని దస్త్రాలు అనే వర్గం లోకి చేర్చాను. లైసెన్సు లేని దస్త్రాలను తక్షణమే తొలగించాలని వికీ నియమం. 2021 నవంబరు 8 న ఈ దస్త్రాలను మూకుమ్మడిగా తొలగిస్తాను. ఈలోగా ఈ దస్త్రాల్లో ఎవరైనా సముచితమైన లైసెన్సు సమాచారాన్ని చేరిస్తే, చేర్చాక ఆ పేజీ నుండి ఈ వర్గాన్ని తీసెయ్యండి. లైసెన్సు సమాచారం ఎలా చేర్చాలనే విషయమై సందేహాలుంటే అర్జున గారిని సంప్రదించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 15:37, 3 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvari గారికి, ధన్యవాదాలు. వీలైతే ఈ చిత్రాలు ఎక్కించినవారికి ఒక ప్రత్యేక సందేశాన్ని వారి చర్చాపేజీలో చేర్చండి. అర్జున (చర్చ) 06:38, 4 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ నుండి వాళ్లకు అలర్టు వెళ్ళే ఉంటుంది కాబట్టి, వాళ్ళ పేజీల్లో పెట్టాల్సిన అవసరం లేదు లెండి. __ చదువరి (చర్చరచనలు) 08:19, 4 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
స్పందన లేకపోతే తొలగింపుకు గురిఅయ్యే బొమ్మలు ఎక్కించిన వారి పేరులు, వారి బొమ్మల సంఖ్య వివరాలు క్రిందచూడండి.
User:Achalla 1
User:Adinarayana.i 1
User:Ajaybanbi 9
User:Alakapudi 2
User:Ambatisreedhar 3
User:Avasarala Rajasekhar 1
User:Balaji b14 2
User:Bhaskaranaidu 65
User:Bhaskarasarma 1
User:Bitras 1
User:Bojja 12
User:Bollinamurali 1
User:Brotherramesh 3
User:Ch Maheswara Raju 1
User:Dollyrajupslp 1
User:DrHIV 1
User:Gandharva 6
User:Gangireddy 1
User:GANTLA MADHU 1
User:Gbullabbai 2
User:Haiprasad 1
User:Haritha 1
User:Hindustanilanguage 1
User:Jabalimuni 1
User:Jagadeeshbabu527 1
User:JVRKPRASAD 5
User:K.Venkataramana 1
User:K7kanth 2
User:Kameswar 1
User:KANALA SIVA SANKAR REDDY 1
User:Karriananth 1
User:KOMATI UMESH 2
User:Koneti Kumar 1
User:Kottodu 5
User:Kunapareddy 1
User:M srinivasaraju 2
User:Malyadri 2
User:Mojesh.bandi 2
User:Mudigonda senapati 1
User:Mukteshvari 1
User:N Ravi Kumar 1
User:Nagaraju raveender 1
User:Narenderpadimala 1
User:Narsampet506132 1
User:NDHARMATEJA 1
User:Nrahamthulla 8
User:Nrapaka 1
User:Palagiri 8
User:PAPA RAO KVSKS 1
User:Pedda 1
User:Perireddy 1
User:Pokiridebba468 1
User:Prashanth kumar marati 1
User:Preathem 2
User:Rajababu 1
User:Rajachandra~tewiki 2
User:Rajanptsk 1
User:Rajasekhar1961 1
User:Rajashekar.oddem 4
User:Ramireddy 3
User:Rammohan65 1
User:Ravi prakesh 2
User:Redaloes 2
User:Sailajachintala 1
User:Sampathg185 1
User:Santoshkumarkarri 2
User:Saraswathi Kumar 2
User:Sasi.saphr 2
User:Sivunnaidu yegireddi 1
User:Sridhar1000 4
User:Srigargeya 2
User:Srikanthsubburu 1
User:Subbarayudu 1
User:Subramanya sarma 1
User:Sudhakar12345 1
User:Sudhakardavuluri 1
User:Sudhe445 1
User:Sureshdaniel51 1
User:Surya 1
User:Svgvenuvu 1
User:Swathi.gadde 1
User:T.sujatha 2
User:Tennetis 1
User:Trailingaswami 1
User:VADDURIRAMAKRISHNA 4
User:Valluri harika 1
User:Vamsikanna2 1
User:Vamsikrish1331 1
User:Veera.sj 3
User:Vemurione 1
User:Venkat nan 1
User:Venkat.r0909 1
User:Venkat004 3
User:VIJAY PRAKASH KONDETI 4
User:Vu3ktb 2
User:Yergatla 1
User:YVSREDDY 8
User:కార్తీక రాజు 2
User:కాసుబాబు 1
User:కిరణ్మయి 5
User:గుర్రం సీతారాములు 3
User:రవిచంద్ర 1
User:రహ్మానుద్దీన్ 1
User:వైజాసత్య 2
User:సుద్దపల్లి 1
User:సూరి 9
మీరు తగిన లైసెన్స్, బొమ్మ సమాచారం చేర్చి, బొమ్మలను వ్యాసంలో వాడడం ద్వారా తొలగింపుకు గురికాకుండా కాపాడవచ్చు. మార్పులు చేయవలసిన బొమ్మల వివరాలకొరకు క్వారీ క్వెరీ ఫలితం చూడండి. అర్జున (చర్చ) 07:20, 4 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, ఎవరూ చర్యతీసుకున్నట్లు కనబడలేదు. బొమ్మలు తొలగించండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 05:34, 29 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, ట్వింకిల్‌లో మూకుమ్మడి తొలగింపు పనిచెయ్యడం లేదు. ప్రస్తుతం వీవెన్ గారు ట్వింకిల్‌ పాత కూర్పును తీసేసి కొత్త కూర్పు పెట్టే పని చేస్తున్నారు. అది అయ్యాక చేద్దామని ఆగాను. __ చదువరి (చర్చరచనలు) 04:12, 30 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, నేను Special:Massdelete వాడి తొలగించాను. అర్జున (చర్చ) 06:21, 30 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, ధన్యవాదాలు సార్.__ చదువరి (చర్చరచనలు) 06:43, 30 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ట్వింకిల్ పనిచేయుట లేదు[మార్చు]

ట్వింకిల్ లోని CSD ఆప్సన్ ద్వారా పేజీని తొలగించటానికి ప్రయత్నించగా, చర్యలు స్టెప్స్ ఉంటున్నవి, కానీ పేజీ తొలగించబడుటలేదు.నేను రాద్దామనుకుంటూనే మర్చిపోతూ, ఈరోజు పరిశీలించి రాస్తున్నాను.తరుచూ ఇది పనిచేయుటలేదు.పరిష్కరించగలరు.--యర్రా రామారావు (చర్చ) 13:08, 4 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఐపీ అడ్రసుల దుశ్చర్యలు - నిర్వాహకులు చేపట్టవలసిన చర్యలు[మార్చు]

ఐపీ అడ్రసులు పేజీల్లో దుశ్చర్యలు చేసినపుడు, ఆ దుశ్చర్యలను వెనక్కి తిప్పడంతో పాటు, నిర్వాహకులైనవారు ఆ అడ్రసులను నిరోధించాలి. ఆ అడ్రసు నుండి, ఆ అడ్రసుల శ్రేణి నుండి గతంలో జరిగిన దుశ్చర్యలేంటో చూసి అవసరమైతే శ్రేణి నిరోధం చెయ్యాలి. దుశ్చర్యలు చేసేందుకు అలవాటు పడినవాళ్ళను మరిన్ని దుశ్చర్యలు చెయ్యకుండా ఆ విధంగా నివారించవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 15:35, 4 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండి చదువరి గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 16:27, 4 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రేణి నిరోధం ఎందుకు చెయ్యాలి అనేదానికి ఇవ్వాళ 2001:1c04:431f:5600:7886:3fc6:61cb:5020 అనే ఐపీ అడ్రసు చేసిన దుశ్చర్య ఒక చక్కని ఉదాహరణ. గతంలో ‎2001:1c04:431f:5600:151b:906e:ae2c:b0e4, ‎2001:1c04:431f:5600:b1c1:299b:dc1f:2b38, ‎2001:1c04:431f:5600:e9a4:9f43:27de:e3c5, ‎2001:1c04:431f:5600:798a:c074:f259:f897, ‎2001:1c04:431f:5600:d0d9:5b85:4e5e:772, 2001:1C04:431F:5600:C595:EB6A:EF33:147F... ఇలా అనేక ఐపీల్లో వచ్చి అదే దుశ్చర్య పదేపదే అనేక పేజీల్లో చేసాడు. ఇవన్నీ ఒక్క ఐపీ శ్రేణి లోనివే! మనం ఆ దుశ్చర్యలను సవరించుకుంటూ పోయాం. పలు దుశ్చర్యలు ఒకే ధోరణిలో ఉన్నట్టు గమనించినపుడే శ్రేణి నిరోధం విధిస్తే మరిన్ని జరక్కుండా నివారించవచ్చు. ఇప్పుడు నేను శ్రేణి నిరోధం విధించాను. దాని వలన కనీసం ఈ శ్రేణి లోపలైతే దుశ్చర్యలు జరగవు. చురుగ్గా నిర్వహణ చేస్తున్న వెంకటరమణ, రవిచంద్ర, యర్రా రామారావు, ప్రణయ్ రాజ్ గార్లు గమనించవలసినది. __చదువరి (చర్చరచనలు) 02:30, 5 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అజ్ఞాత వాడుకరుల దుశ్చర్యలమీద అప్రమత్తంగా లేకపోతే, తెవికీలో కష్టపడి చేసిన శ్రమ అంతా వృధా ప్రయాస.ఇది కొంతమంది అజ్ఞాత వాడుకరులు కావాలని దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు ఈరోజు జరిగిన మార్పులద్వారా తెలుస్తుంది. దీనిమీద మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.అందరం తరుచూ పరశీలించి చర్యలు తీసుకుంటుంటేనే వారి దుశ్చర్యలను అరికట్టగలం.నేనూ ఇక్కడ నుండి అప్రమత్తంగా ఉంటాను.ఈ విషయంలో చదువరిగారు పడే ఆందోళనలో చురుకైన వాడుకరులు అందరూ భాగస్వామ్యం కావలసిందిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 03:06, 5 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, శ్రేణి నిరోధం విధించి మంచి పని చేశారు. నేను అంత జాగ్రత్తగా గమనించలేదు. మీరన్నట్లు పెద్ద ఎత్తున మార్పులు చేసేసిన తర్వాత తిరగ్గొట్టడం కష్టమైన పనే. నేను ఇకమీదట అలాగే చేస్తాను. - రవిచంద్ర (చర్చ) 06:05, 5 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా ఏషియన్ నెల 2021 (నవంబరు 15 నుండి డిసెంబరు 15 వరకు)[మార్చు]

వికీపీడియా ఏషియన్ నెల 2021 బహుభాషలలో నిర్వహిస్తున్న ఎడిటథాన్. ఆసియా దేశాల వివిధ సముదాయాల మధ్య అవగాహన పెంచడం కోసం ఇది నిర్వహించబడుతుంది. 2021 నవంబరు 15 నుండి డిసెంబరు 15 వరకు జరుగుతుంది. ఆసియా ఖండంలోని వివిధ దేశాలు, ప్రదేశాల గురించి వ్రాయవచ్చు లేదా ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

ఆసియా వికీమీడియా సముదాయాల మధ్య గల స్నేహాన్ని గుర్తిస్తూ,తెవికీలో కనీసం నాలుగు వ్యాసాలను వ్రాసిన వారికి పాల్గొన్న ఇతర దేశ సముదాయాలనుండి ఒక ప్రత్యేక వికీపీడియా పోస్టుకార్డు పంపబడుతుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న దేశాలు - చైనా, భారతదేశం, ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పైన్స్, తైవాన్, మరియు థాయ్లాండ్.

అన్నిటికంటే ఎక్కువ నాణ్యమైన వ్యాసాలు వ్రాసిన వ్యక్తికి "వికీపీడియా ఏషియన్ అంబాసడర్" బిరుదు ఇవ్వబడుతుంది.

ఈ కార్యక్రమాన్ని ఆసియా వ్యాప్తంగా నవంబరు నెలలో జరుపుకుంటున్నారు, మన తెవికీకి తగినంత సమయం దొరకాలని నవంబరు 15 నుండి డిసెంబరు 15 వరకు జరుపుకుందామని కోరుతున్నాను. ఈ ప్రాజెక్టు నిర్వహించడానికి చదువరి,Kasyap, User:Pranayraj1985, యర్రా రామారావు, స్వరలాసిక , Batthini Vinay Kumar Goud , User: MYADAM ABHILASH, Ch Maheswara Raju గార్లు అలాగే ఇతర సముదాయ సబ్యుల సూచనలు చేయవలసిందిగా కోరుతున్నాను. Nskjnv ☚╣✉╠☛ 12:54, 9 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సాయికిరణ్ గారూ తప్పకుండా కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం.. కొత్త వాడుకరులతో కూడా వ్యాసాలను రాయిద్దాం.-అభిలాష్ మ్యాడం 09:56, 10 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పూనుకున్నందుకు అభినందనలు. నేను దీనిలో పాల్గొని వీలైనంతలో వ్యాసాలు రాసేందుకు ప్రయత్నిస్తాను. ఒక సలహా: ప్రమాణాల్లో రాసితో పాటు వాసిని కూడా చేర్చండి. వ్యాసం అనాథ కాకూడదు, అగాధ పేజీ కాకూడదు, కనీసం ఒక వర్గం ఉండాలి, అంతర్వికీ లింకులుండాలి, భాష కృతకంగా ఉండకూడదు, వ్యక్తుల/స్థలాల/సంస్థల.. వ్యాసాలకు సమాచారపెట్టె ఉండాలి.. వగైరా నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే ఆ వ్యాసాలను స్వీకరించాలి.__ చదువరి (చర్చరచనలు) 01:43, 13 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి కార్యక్రమం. నేను కూడా ఈ ఎడిటథాన్ లో పాల్గొని వ్యాసాలు రాయడానికి ప్రయత్నం చేస్తాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:34, 13 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అహ్వానం : వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్ Wikimedia Technology Summit 2021 (19- 20 November 2021)[మార్చు]

నమస్కారం, ఇండిక్ వికీ ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIIT-H) ఆధ్వర్యంలో, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ సహకారముతో, మీడియావికీ , తెలంగాణా ప్రభుత్వం,FICCI ILIA వారి భాగస్వామ్యంతో ఈ నవంబరు 19,20 వ తేదీలతో ఇంగ్లీషులో వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్ 2021 ను నిర్వహిస్తున్నాము. ఈ శిఖరాగ్ర సమావేశం యొక్క ఇతివృత్తం "కమ్యూనిటీ ఎన్సైక్లోపీడియాలలో టెక్నాలజీ పాత్ర", ఇందులో భాగంగా నవంబరు 20 వతేదీన భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు తెలుగు & ఇంగ్లీష్ భాషల్లో తెవికీ – తెలుగు వికీపీడియా అభివృద్ధి మరియు మెరుగుదల (TeWiki – Development and Enhancement of Telugu Wikipedia) మీద ప్రత్యేక సమావేశము నిర్వహిస్తున్నాము. ఇది పూర్తిగా ఆన్‌లైన్ జరిగే, ఉచితంగా హాజరయ్యే సమావేశం, పూర్తి వివరములకు, మీ పేరు నమోదు చేసుకోకునేందుకు దయచేసి ఇక్కడ చూడగలరు ధన్యవాదములు. : Kasyap (చర్చ) 07:44, 11 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ సమ్మిట్ కానీ, అందులో జరుగుతున్న ప్రత్యేక సమావేశం కానీ, అలానే వీటన్నిటినీ నిర్వహిస్తున్న ఇండిక్ వికీ ప్రాజెక్టు సాగుతున్న ధోరణి కానీ - వీటన్నిటిలోనూ చాలా సమస్యలు ఉన్నాయండీ.
 • "చరిత్రలో మనకొక పేజీ" పేరు మీదుగా ఈనాడు మెయిన్ పేజీలో మార్చి 2021న ఒక వార్త వచ్చింది. ప్రణయ్ రాజ్, ఆదిత్య పకిడె, యర్రా రామారావు గార్లతో పాటు నా పేరు, కృషి, ఫోటో వగైరా అందులో పడ్డాయి. అయితే ఆ వార్తలో మాత్రం తెలుగు వికీపీడియా యూఆర్‌ఎల్ బదులుగా ఇండిక్ వికీ వారి యూఆర్‌ఎల్ ఇచ్చారు. నిజానికి తెలుగు వికీపీడియన్లు దశాబ్దానికి పైగా చేసిన కృషే గనుక లేకపోతే ఈనాడు మెయిన్‌పేజీలో పడేంత కంటెంట్ కానీ, ప్రాధాన్యత కానీ ఉండదు. అలాంటిది కృషి వికీపీడియన్లది, యూఆర్‌ఎల్ ఇండిక్ వికీ వారిది. ఈ విషయమై నేను, ఇతర వికీపీడియన్లు ఈనాడు వారికి మెయిల్ చేశాం. స్పందన లేదు. అలానే, ఇండిక్ వికీకి బాధ్యునిగా ఉన్న కశ్యప్ గారు ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో చర్చ జరిగింది. ఆయన నుంచి కానీ, ఇతర బృందం నుంచి కానీ ఏ ప్రతిస్పందనా లేదు.
 • "తెవికీ – తెలుగు వికీపీడియా అభివృద్ధి మరియు మెరుగుదల" అన్నది ఈ కార్యక్రమంలో జరుగతున్న ప్రత్యేక సమావేశం పేరు. కానీ, తెలుగు వికీపీడియా రచ్చబండలో ముందుగా తెలియపరచడం కానీ, సముదాయాన్ని సమిష్టిగా సూచనల కోసం సంప్రదించడం కానీ జరగలేదు. గత ఏడాది జరిగిన "తెలుగు వికీపీడియా సదస్సు 2020" విషయంలోనూ ఇలానే ముందస్తుగా వికీపీడియాలో చర్చ లేకుండా ఉట్టిగా ఆహ్వానమే ప్రచురించారు. (తెలుగు వికీపీడియా పేరిట ఒక సదస్సు జరిగినప్పుడు - తెలుగు వికీపీడియాలో దాని రూపకల్పన గురించి చర్చించడం మానివేసి కేవలం ఆహ్వానాన్ని ప్రచురించడం, అందులోని వక్తల్లో తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులకు కనీసం ప్రాతినిధ్యం కూడా లేకపోవడం ఆ సదస్సు విశేషాలు.)
చాలాసార్లు ఈ ధోరణులు కనిపించినా అనేక సందర్భాల్లో నేను, ఇతర వికీపీడియన్లు ఇండిక్ వికీ వారికి సాయం చేస్తూనే వచ్చాము. వారికి తెలుగు వికీపీడియా పద్ధతులు అలవడలేదేమోనని సాధ్యమైనంతవరకూ సదుద్దేశాన్ని ఆపాదించుకుని సాయం చేశాము. 2020లోని సదస్సు తర్వాత అనేక రకాల సూచనలు చేశాము. నిజానికి వికీమీడియా ఫౌండేషన్‌కు చెందిన పలువురు ఉద్యోగస్తులతో కూడా ఇండిక్ వికీ వారికి పరిచయాన్ని చేశాను. ఇన్నీ చేసిన తర్వాత తెలుగు వికీపీడియా యూఆర్‌ఎల్ బదులు ఇండిక్ వికీ వారి యూఆర్‌ఎల్ వేయించుకుని, దానిపై ఏ స్పందనా లేకుండా ఊరుకోవడంతో హతాశుడినైపోయాను. అందువల్లనే ఈ కార్యక్రమంలో మాట్లాడమన్నా అంగీకరించలేదు.
ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కనుక ఇండిక్ వికీ వారికి (@Kasyap:, @Newwikiwave:) సూటి ప్రశ్నలు రెండు వేయదలిచాను:
 1. ఇండిక్ వికీ వారు ముందస్తుగా తెలుగు వికీపీడియా సముదాయానికి ఇటువంటి కార్యక్రమాల గురించి తెలియపరిచి, రూపకల్పన దశలోనే భాగస్వాములను చేయకపోవడానికి కారణం ఏమిటి? ఇంతకుముందు తెలుగు వికీపీడియన్లు పలువురు అలా చేయమని, అందుకోసం ప్రణాళికా దశలో ఉండగానే రచ్చబండలో తెలియపరిచమని సూచించారు (లేక సూచించాము) కదా? కానీ, ఇప్పుడు కూడా అలా జరగలేదు. దీని ప్రకారం తెలుగు వికీపీడియా సముదాయం అన్నది ఇండిక్ వికీ వారికి భాగస్వామి కాదని అన్నట్టుగా భావించవచ్చా? తెలుగు వికీపీడియా సముదాయం పట్ల ఈ ధోరణిని ఎలా తీసుకోవాలి?
 2. తెలుగు వికీపీడియా గురించి కథనం ప్రచురించి ఇండిక్ వికీ వారి యూఆర్‌ఎల్‌ను ఈనాడులో ప్రచురించడం అన్నది తెలుగు వికీపీడియా బ్రాండ్ ఇమేజ్‌కు పెద్ద నష్టం. ఇలాంటి ఒక చేటు తెలుగు వికీపీడియాకు జరిగినప్పుడు ఇండిక్ వికీ వారు ఏమాత్రం లక్ష్యపెట్టకపోవడాన్ని ఎలా స్వీకరించాలి?
ఇక @PDas (WMF): గారికి నా ప్రశ్న, తెలుగు వికీపీడియా గురించి ప్రచురణ చెందుతున్న వార్తల్లో తెలుగు వికీపీడియా యూఆర్‌ఎల్‌కు బదులుగా ఇండిక్ వికీ వారి యూఆర్‌ఎల్‌ ప్రచురితం అవుతోంది. ఆ తర్వాత అదే సంస్థతో వికీమీడియా ఫౌండేషన్ భాగస్వామ్యం చెందుతోంది. ఇట్లాంటి opportunity costని Partnerships విభాగం పట్టించుకోకుండానే ముందుకు సాగిపోతుందా? (ప్రవీణ్ దాస్ ఈ తెలుగు ప్రశ్నను ఆంగ్లంలోకి అనువదించుకుంటారని ఆశిస్తున్నాను.)
దయచేసి ఈ అంశానికి సాధ్యమైనంత త్వరలో స్పందిస్తారని ఆశిస్తున్నాము. --పవన్ సంతోష్ (చర్చ) 15:18, 14 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కశ్యప్ గారూ, పవన్ సంతోష్ గారు రాసిన దానిపై మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 04:01, 16 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

దయచేసి గమనించండి ఈనాడు కథనం ఇండిక్ వికీ ప్రాజెక్టు నుండి వచ్చింది కాదు, అంతే కాక యూఆర్‌ఎల్ విషయం లో తెలుగు వికీపీడియా అంటే tewiki . iiii . ac .in అనే ఎటువంటి అధికార ప్రకటన గానీ చేయలేదు, ఈనాడు వార్తలో వ్యాసాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ అని మాత్రమే ప్రస్తావించాము , వీలయితే ఒకసారి ఈనాడు వార్త చదవండి, అది మేము ఇచ్చే శిక్షణలో భాగంగా అందరికీ తెలియచేసున్నాము, ఇంకో విషయం కొత్త వారు పొరపాటు పడకుండా మొదటి పేజీలోనే ఎప్పటినుండో సూచన ఏర్పాటు చేశాము. మేము ఇచ్చిన ప్రతి సమావేశం శిక్షణా తరగతిలోనూ మా ప్రయోగశాల పరిమితులు, ఇందులో వ్యాసాలు రాయటం అలవాటు అయినతరువాత తెలుగు వికీపీడియాలో చేరే విధానం చెపుతాము ఈ విషయంలో గౌరవ సభ్యులు ఎవరితో నైనా తనిఖీ చేసుకోవచ్చు

తెలుగు వికీపీడియా గురించి అవగాహన పొందుటకు ఐఐఐటి హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రయోగశాల (SANDBOX)

నాకు తెలిసి మీరు చెప్పిన విధంగా తెలుగు వికీపీడియా యూఆర్‌ఎల్‌కు బదులుగా ఇండిక్ వికీ వారి యూఆర్‌ఎల్‌ గా ప్రాజెక్టు నుండి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు,చేయబోము  !

రెండవ విషయం ఈ సదస్సు ఇండిక్ వికీ ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIIT-H) ఆధ్వర్యంలో, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ సహకారముతో, మీడియావికీ , తెలంగాణా ప్రభుత్వం,FICCI ILIA వారి అధికారిక భాగస్వామ్యంతో కమ్యూనిటీ ఎన్సైక్లోపీడియాలలో టెక్నాలజీ పాత్ర అనే ఇతివృత్తం గా జరుగుతున్నది ఇందులో ముఖ్యంగా వికీ ఫౌండేషన్ , మీడియావికీ సాంకేతిక నిపుణులతో పాటు సాంకేతిక విషయాల మీద పనిచేస్తున్న కొద్ది మంది తెలుగు వికీపీడియన్ లలో చర్చించి వారిని ఆహ్వానించాము, ఇక శిక్షణ కు సంబంధించి వికీ ఎడ్యుకేషన్ వారినుండి కూడా సూచనలు తీసుకొన్నాము, ఇందులో భాగంగా జరిగే ప్రత్యేక సమావేశము గురించి రచ్చబండలో ప్రస్తావించాము, ఇక తెలుగు వికీపీడియా బ్రాండ్ ఇమేజ్‌ విషయంలో ఐఐఐటి ఇండిక్ పాజెక్టు వారి తెవికీ కార్యకమాల వలన జరిగిన ప్రభావము గురించి కూర్పుల గణాంకాలు,పేజి వీక్షణలు లో మార్పులు ఇక్కడ చూడవచ్చు  : Kasyap (చర్చ) 08:20, 16 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

  • ఈనాడు వారు ఇండిక్ వికీని ఆ కథనం విషయంలో సంప్రదించలేదా? సంప్రదించకుండానే ఈనాడు పత్రికకు ఇండిక్ వికీ వారి యూఆర్‌ఎల్ లభ్యమైందా? సరే సదుద్దేశంతో అలాగే ఎలాగో జరిగిందని భావిద్దాం. ఈ విషయంలో తెలుగు వికీపీడియన్లుగా మేము, మా పేర్లు ఫోటోలు ఈనాడు మొదటి పేజీలో వచ్చినా, తుదకు అందులో అతిముఖ్యమైన యూఆర్‌ఎల్ మాత్రం తెలుగు వికీపీడియా బదులు ఇండిక్‌ వికీది ప్రచురితమైందని బాధపడడం మీ దృష్టికి రాలేదా? మీరూ, ఇతర సంస్థ బాధ్యుల దృష్టికి అది వచ్చినా మీ వైపు నుంచి దీనిపై ఇప్పుడిలా అడిగేవరకూ నోరు మెదపకపోవడాన్ని ఏమనుకోవాలి?
  • <<ఇందులో భాగంగా జరిగే ప్రత్యేక సమావేశము గురించి రచ్చబండలో ప్రస్తావించాము>> అన్నారు."తెలుగు వికీపీడియా కాన్ఫరెన్సు 2020" తెలుగు వికీపీడియాలో రచ్చబండలో ముందస్తుగా చర్చ లేకుండా సమాచారం ఇచ్చి, మీ మాటల్లో చెప్పాలంటే రచ్చబండలో "ప్రస్తావనలు" మట్టుకు చేసి నిర్వహించారు. వేదిక మీద ఉన్న పెద్దలు చూస్తే - రాజకీయ నేతల నుంచి ప్రొఫెసర్ల వరకూ ఉన్నారు. ఒక్క వికీపీడియన్‌ని కూడా వేదిక మీదికి ఆహ్వానించకుండా నిర్వహించేశారు. (తెలుగు వికీపీడియన్లం ఆరోజున మాట్లాడింది కేవలం రౌండ్ టేబుల్ సమావేశంలో మాత్రమే) అది ఎంత ఆశ్చర్యకరం? ఈ ఏడాది చూస్తే కాస్త మెరుగ్గా వ్యక్తులుగా వికీపీడియన్లు కొంతమందిని ఆహ్వానించారు, కానీ మళ్ళీ పాత పద్ధతిలోనే ముందుగా చర్చకు పెట్టడం మానేసి "ప్రస్తావనలు" చేసి ఊరుకుంటున్నారు. పేరులో తెలుగు వికీపీడియా ఉన్నప్పుడు తెలుగు వికీపీడియాలో ముందస్తుగా చర్చ చేసి, సమిష్టిగా పనిచేసి రూపకల్పన చేయాలి అన్నది కనీసమాత్రపు సంగతి కాదా? ఈ సంగతి ఇప్పటికే పలుమార్లు చదువరి, వీవెన్, ప్రణయ్, నేను మీరు ఏర్పాటుచేసిన అధికారిక సమావేశాల్లోనే చెప్పాము. తిరిగి మీరు కొత్త కాన్ఫరెన్సు నిర్వహించేప్పుడు మళ్ళీ తెలుగు వికీపీడియా రచ్చబండలో చర్చ చేయడాన్ని విస్మరించడాన్ని ఎలా తీసుకోవాలి?
"తెవికీ – తెలుగు వికీపీడియా అభివృద్ధి మరియు మెరుగుదల" అన్న సమావేశం కావచ్చు, "తెలుగు వికీపీడియా సదస్సు 2020" కావచ్చు - రెండు కార్యక్రమాల రూపకల్పన దశలో తెలుగు వికీపీడియాకు ప్రమేయం లేకపోవడం సమస్య. తెలుగు వికీపీడియా గురించి అంత పెద్ద స్థాయిలో వార్త వచ్చి తెవికీ యూఆర్‌ఎల్ కాక ఇండిక్ వికీ యూఆర్‌ఎల్ ప్రచురితమైనప్పుడు మీ నుంచి కనీసం స్పందన లేకపోవడం సమస్య. ఇప్పుడు కూడా అదేమీ పెద్ద సమస్య కాదన్నట్టు మాట్లాడడం సమస్య. దయచేసి మరొక్కసారి పైన నేను వేసిన పరిప్రశ్నలను గమనించి రాయండి. మీ ముందు కానీ, మా ముందు కానీ రకరకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సముదాయం సంయమనంతో వ్యవహరిస్తున్నదని గమనించండి. సాధ్యమైనంతవరకూ న్యాయమైన పద్ధతిలో మీ ప్రతిస్పందన ఉంటుందనీ, తద్వారా మెరుగైన పరిష్కారాలకు వీలు చిక్కుతుందనీ ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 17:34, 16 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈనాడులో వచ్చిన వార్త ఇది వికీపీడియాలో వ్యాసరచనను గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ
ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో
వ్యాసాల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తోంది. ఇందుకు
ప్రత్యేకంగా ఆ grici. inta. to ' - వెబ్ సైట్ ను
అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు 10 వేల
వ్యాసాలతో శాండ్ బాక్సును తయారు చేసింది. రచయితల కోసం
ప్రత్యేకంగా ఇంటర్న్
షిప్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 'డిజిటల్
మాధ్యమంలో తెలుగు రాయడం, సాంకేతికతను నేర్పడం ద్వారా
ప్రత్యేకంగా ఉద్యోగాలు సాధించేందుకు ఇంటర్న్ షిప్ కార్యక్రమాలు
తీసుకువచ్చాం. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కృత్రిమ మేధను
ఉపయోగించి తెలుగులో రాయడం పై వేసవిలో ఇంటర్న్ షిప్
ఇవ్వనునున్నాం. ఇలా 50 మంది విద్యార్ధులను తీసుకుంటున్నాం',ఇది ఈనాడు వారు రాసిన వ్యాసం ఇందులో వికీపీడియన్ల అభిపాయాలు,ఫొటోలతో పాటు తెలుగు వికీ లోగో కూడా ప్రచురితం అయినది, నాకు తెలిసి ఆరోజు చదివినవారు వ్యాసాల సంఖ్య పెంచేందుకు పెంచేందుకు ప్రత్యేక వెబ్ సైట్ అనే అనుకొంటారు,అది ప్రచురితం అయిన తరువాతే మొదటి పేజీలో ఉన్నదని మా దృస్థికి వచ్చినది ఇది సత్యం అందులో ఉన్నది సరైన సమాచారమే,తరువాత ఈనాడు వారి వెబ్ పేజీలో కూడా సరైన లింకు అందుబాటులో లేదు అంతర్జాలంలో తెలుగు వికీపీడియా అని వెతికిన వారికి te.wikipedia.org మాత్రమే ముందు వరసలో ఉంటుంది, తెలుగు వికీపీడియా సదస్సు 2020, వేదిక మీద మాట్లాడేవారి గురించి 4 ఫిబ్రవరి 2020 రచ్చబండలో ప్రస్తావించాము, ఇది ప్రణాళిక సదస్సు కాబట్టి తరువాత తెలుగు వికీపీడియా సభ్యులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించాము వీటిని మీద రచ్చబండలో చర్చకూడా జరిగినది,తరువాత జరిగిన తెలంగాణా ప్రభుత్వ సహకారంతో జరిగిన పుస్తక ప్రదర్శన లో, కరపత్రం లో కూడా తెలుగు వికీపీడియాను మాత్రమే ప్రచారం చేసాము, 2019 నుండి జరిగిన అనేక సమావేశాలలో, శిక్షణా శిబిరాలలో చాలా మంది తెలుగు వికీపీడియన్ లు పాల్గొన్నారు కాబట్టి సముదాయం లేకుండా కార్యకమాలు చేస్తున్నారు అనటం సత్య దూరం, ఇండిక్ వికీ పాజెక్టులో తెలుగు మాత్రమే కాక అనేక భాషలో ముఖ్యంగా సాంకేతిక అంశాల మీద అనేక కార్యకమాలు జరుగుతుంటాయి తదనుగుణంగా ప్రాజెక్టు వారి కార్యాచరణ ఉంటుంది  : Kasyap (చర్చ) 04:26, 17 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
 • తెలుగు వికీపీడియా సదస్సు 2020 అన్నది ఫిబ్రవరి 8వ తేదీన జరిగింది. మీరు తెలుగు వికీపీడియా రచ్చబండలో 4వ తేదీన "తెలియపరిచారు". మీరు ఒక వారం రోజుల ముందు, నాలుగు రోజుల మందు వికీపీడియా సముదాయంలో తెలియపరుస్తున్నారు. వికీపీడియాలో ప్రణాళిక పెట్టి చర్చకు ఆహ్వానించడం లేదు. మీరు ఇచ్చిన లింకులో చూసినా 2020 ఫిబ్రవరి 9వ తేదీన ప్రణయ్ రాజ్ మీరు ఇచ్చిన లింకులోనే "ఐఐఐటీ ప్రాజెక్టులో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలకోసం తెవికీలో ఉన్న ఐఐఐటీ ప్రాజెక్టు పేజీకి ఉప పేజీలను పెట్టి అందులో ఆయా కార్యక్రమ ముందస్తు వివరాలు, కార్యక్రమం అయిపోయిన తరువాత ఫోటోలతో కార్యక్రమ నివేదికను రాయండి. ఇలా చేయడంవల్ల ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న కార్యక్రమాల విషయాలు ఇతర వికీపీడియన్లకు, మిగతా వారికి తెలుస్తాయి. ఈ విషయంలో మీకు సహకారం అందించడానికి తెవికీ సభ్యులు అందుబాటులో ఉంటారు." అని అక్కడే రాశారు. కనీసం అక్కడ ఏ ప్రతిస్పందన లేదు, మళ్ళీ అదే పద్ధతిలో ముందుకుపోతున్నారు. ఎందుకని ఇదంతా ఉపేక్షిస్తున్నారు. రెండు సంవత్సరాల నుంచి మేం ఒకటే చెప్తున్నాం - తెలుగు వికీపీడియన్లు ఒకరిద్దరం పాల్గొన్నంత మాత్రాన, సముదాయం అంతటికీ తెలిసేలా కనీసం ఒకటి, రెండు వారాల వ్యవధి ఇచ్చి వికీపీడియా రచ్చబండలో చర్చకు పెట్టకపోతే తెలుగు వికీపీడియా సముదాయం పాల్గొన్నట్టు కాదు. నేను అదే విషయం ఇప్పటికి రెండు సార్లు రాశాను పైన. మళ్ళీ మీరు "తెలియపరిచాము", "ప్రస్తావించాము" అంటున్నారు. --పవన్ సంతోష్ (చర్చ) 04:43, 17 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  సదస్సు నివేదిక ను ప్రాజెక్టు పేజీలో ప్రచురించాము ఇక్కడ చూడండి ఇక మీరు రచ్చబండలో చర్చకు పెట్టకపోతే తెలుగు వికీపీడియా సముదాయం పాల్గొన్నట్టు కాదు అని చెప్పారు,గతంలో చాలా కార్యక్రమాలు,శిక్షణా ప్రాజెక్టులు రచ్చబండలో చర్చలు లేకుండానే జరిగినవి అన్న విషయం కూడా గమనించగలరు, అయినా కూడా మేము నిర్వహించే స్వతంత్ర కార్యక్రమాల మీద రచ్చబండలో తెలియచేస్తూనే ఉన్నాం ఇందులో భాగంగా ఏదైనా ప్రత్యేక సహకారం కోసం సంబంధిత వికీ సభ్యులతో నేరుగా సంప్రదిస్తున్నాం. లోగోలు,పేర్లు,భాగస్వామ్యం ఇతర అంశాల మీద హక్కుదారులు అయిన వికీ ఫౌండేషన్ వారితో సంప్రదించాము, రాబోయే కార్యక్రమం వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్ 2021 కూడా మీడియావికీ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నాం. Kasyap (చర్చ) 05:37, 17 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
 • ఇండిక్ వికీ వారి అధికారిక స్టాండ్ ఏమిటన్నది, వారి ప్రతినిధిగా సూటిగా వివరించినందుకు ధన్యవాదాలు Kasyap గారూ. --పవన్ సంతోష్ (చర్చ) 12:20, 17 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  ధన్యవాదములు పవన్ సంతోష్ గారు, ఒక గమనిక మా ప్రాజెక్టులో ఇంటర్న్‌షిప్ అవకాశం @ తెలుగు వికీ ద్వారా ఇచ్చే శిక్షణ లో మొదట మా లాగిన్ పక్రియమీద, ఇంటర్న్‌షిప్ కాల వ్యవధిలో తెవికీ ( tewiki.iiit.ac.in) ప్రయోగశాలలో రాయమని ప్రోత్సహిస్తాము ఎందుకంటే అనుభవం లేని కొత్త వాడుకరులు వికీ నిర్వాహకులకు అదనపు శ్రమ పడకుండా, వ్యాసాలలో దుశ్యర్యలు చేయకుండా, మొదటి తరగతులలోనే తెలుగు వికీపీడియాలో చేరి వ్యాసాలు రాయమని సూచించము, వారికి వ్యాసాల రాయటానికి కావలిసిన సాంకేతిక నైపుణ్యత, అనుభవం వచ్చిన తరువాత వికీపీడియా లో రాయగలరు, అలా రాస్తున్నారు కూడా : Kasyap (చర్చ) 05:39, 18 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ చర్చపై నా అభిప్రాయం ఇది:
 • ఈనాడు వార్తలో వికీపీడియా గురించి రాయించి తెవికీ అడ్రసు కాకుండా ఐఐఐటీ వారి అడ్రసు వేయించుకోవడం అనేది సరికాదు. తెవికీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం అని చెబుతూ, తెవికీ పెరును తమ అభివృద్ధికి వాడుకుంటున్నారని చెప్పేందుకు ఇదొక దృష్టాంతం.
 • తెవికీ పేరు చెప్పి సదస్సులు నిర్వహిస్తున్నారు. కానీ ఈ విషయం గురించి సముదాయంతో చర్చించి, నిర్ణయించాల్సింది పోయి, దాని గురించి కేవలం ఇక్కడొక ప్రకటన మాత్రం చేసి చేతులు దులిపేసుకున్నారు. గతంలో ఈ విషయంపై ప్రణయ్ రాజ్ గారు ప్రత్యేకించి చెప్పాక కూడా ఇలా చెయ్యడం చూస్తే తెవికీ పట్ల ఆ సంస్థకు ఉన్న గౌరవం ఏంటో తెలుస్తోంది. అలా చర్చ చెయ్యాల్సిన అవసరం లేదని భావిస్తే తెవికీ పేరు పెట్టుకోకండి. ఇలా పేరు వాడుకోవడాన్ని వికీమీడియా ఫౌండేషను ఖండించాలని నా అభిప్రాయం.
@Pavan santhosh.s గారు తన చివరి వ్యాఖ్యలో "సూటిగా వివరించినందుకు" ధన్యవాదాలు చెప్పడం చూస్తే నాక్కొంత ఆశ్చర్యం కలిగించింది; ఆయన బహుశా వ్యంగ్యంగా అన్నారేమో తెలీదు. @Kasyap గారు ఇక్కడ స్పష్టంగా చెప్పినది ఏమీ లేదు. కానీ "ఐఐఐటీ, తాను చేపట్టిన కార్యక్రమానికి విలువ చేకూర్చుకోవడం కోసం, ఆ కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకునేందుకు తెవికీని వాడుకుంటుందే తప్ప తెవికీ అభివృద్ధి కోసం అదేమీ పాటుపడదు" అని మాత్రం అన్యాపదేశంగా చెప్పారని నాకు అనిపించింది.
రెండేళ్ళు దాటినట్టుంది, ఐఐఐటీ ఈ కార్యక్రమాన్ని మొదలెట్టి. లక్షల్లో వ్యాసాలు, వేలరెట్ల పెరుగుదల అంటూ లక్ష్యాలు పెట్టుకున్నారు. ఆ దిశగా తాము ఏమేం సాధించారో ఇంతవరకూ తెవికీలో చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళు ఏర్పాటు చేసుకున్న సమావేశానికి లక్ష్యంగా పెట్టుకోవాల్సింది - తమ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తిసుకుపోతామో చెప్పడం. అంతే తప్ప, తెవికీని ఎలా అభివృద్ధి చేస్తామని కాదు. ఎందుకంటే ఈ రెండూ వేరువేరుగా కనిపిస్తున్నై. __ చదువరి (చర్చరచనలు) 05:25, 18 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా గురించి రాయించి తెవికీ అడ్రసు కాకుండా ఐఐఐటీ వారి అడ్రసు వేయించుకోవడం అనే వాఖ్య సరి అయినది కాదు, ఈ వార్త ఇండిక్ వికీ పాజెక్టువారు ఇచ్చినది కాదు, అందులో ఉన్న వికీపీడియన్లు ఇండిక్ వికీ పాజెక్టు సభ్యులు కారు, ఆవార్త గురించి అందులో ఫోటోలు ఉన్న ఇతర వికీపీడియన్ లను,ఈనాడు వారిని సంప్రదించండి ఇందులో మేము ఇచ్చే శిక్షణ గురించి చెప్పాము, 2019 నుండి అనేక సందర్భాలలో తెలుగు వికీపీడియా సభ్యులతో చర్చించాము,చర్చిస్తున్నాము,ఇండిక్ వికీ ప్రాజెక్టు చేపట్టిన తరువాత జరిగిన తెలుగు వికీపీడియా అభివృద్ధి,వీక్షణల సంఖ్య గణాంకాల్లో చూడవచ్చు, ఇప్పటివరకు tewiki .iiit . ac . in లో జరిగిన సభ్యుల రచనా ప్రగతిని తెలుసుకొనుటకు మొదటి పేజీలోని Leaderboard వీక్షించండి,యాంత్రానువాదాల ప్రగతిని తెలుసుకొనుటకు Bot Leaderboard వీక్షించండి, ఇవి సరైన స్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత తెలుగు వికీపీడియా వాడుకరులుకు అందుబాటులో ఉంటాయి : Kasyap (చర్చ) 06:08, 18 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Kasyap గారూ, మీ ప్రాజెక్టు తెవికీ అభివృద్ధిని ఉద్దేశించినది. మేము మా ప్రాజెక్టు గురించి మాత్రమే చెప్పాం, తెవికీ గురించి చెప్పలేదు అని అనడం కరెక్టు కాదు. ఎందుకు చెప్పలేదు? మీది తెవికీ అభివృద్ధి కోసం పాటుబడే ప్రాజెక్టు గదా, మరి మీ అడ్రసును మాత్రమే చెప్పి, తెవికీ అడ్రసు చెప్పకపోవడం ఏంటి?
పోతే, మీ ప్రాజెక్టు సాధించిన దాని గురించి నేను అన్నదాన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి. నేను మాట్టాడింది ప్రాజెక్టు లక్ష్యాల గురించి, తత్సంబంధంగా అది సాధించిన అభివృద్ధి గురించి. మీ లక్ష్యాలు వీక్షణలు పెంచడమా? కాదే! ఇన్ని లక్షల పేజీలను చేరుస్తాం అని కదా చెప్పింది! మరి ఎన్ని లక్షల పేజీలను తెవికీలోకి దింపారు, తెవికీని ఎన్ని రెట్లు పెంచారు అని నేను అడిగానండి. ఎందుకంటే మీరు పెట్టుకున్న లక్ష్యాలు అవే కాబట్టి. ఇకపోతే, దయచేసి ఒక్క విషయాన్ని గమనించగలరు.. మీరు సాధించిన వాటి గురించి చెప్పాల్సింది తెవికీలో; మీ అడ్రసుకు వచ్చి చూసుకోమనడం కాదు. వాటిని ఇక్కడ చర్చకు పెట్టగలరు. __ చదువరి (చర్చరచనలు) 06:32, 18 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ఈసరికే ఈనాడు వార్త గురించి శిక్షణ కార్యకమాల్లో భాగంగా మా యుఆర్ఎల్ గురించి చెప్పాను,వార్తలో తెలుగు వికీపీడియా లోగో ఇతర విషయాలు, ఇతర వికీపీడియన్ స్పందనలు, ఫోటోలు కూడా ఉన్నాయి,ఇది ప్రచురణకు ముందు ప్రూఫ్ కోసం ఇండిక్ వికీ దృష్టికి ఈనాడు వారు తీసురాలేదు ఎందుకంటే అది ఈనాడు వారు ఇతర తెలుగు వికీపీడియన్ ల తోర్పాటుతో ఎంపిక చేసుకొన్న కధనం,ఇక పొతే వ్యాసాలు మేము పెట్టుకొన్న లక్ష్యాలు అనుగుణంగా ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి ఇవి పూర్తికాలేదు కాలేదు కాబట్టి సంఖ్య ఇక్కడ చెప్పలేదు, వాటిలో సహాయపడేందుకు కొద్దిమంది ఉద్యోగులను, స్వచ్ఛంద కార్యకర్తలు,సహాయకులు కలిసి ఈ వ్యాసాలు అభివృద్ధి చేసి అవి మేము నిర్దేశించు కొన్న కొన్ని ప్రమాణాలకు పూర్తి అయిన తరువాత తెవికీ-ఐఐఐటి ప్రాజెక్టు పేజీలో పంచుకొంటాం, అప్పుడు తెలుగు వికీపీడియా సముదాయం చర్చించి మా తెవికీ.ఐఐఐటీ లోని వ్యాసాలు తెలుగు వికీపీడియాలో చేర్చి,తదుపరి అభివృద్ధి చేసే నిర్ణయం చేయవచ్చు : Kasyap (చర్చ) 08:23, 18 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పై చర్చలలో నాకర్థమైంది తెవికి సముదాయంలోని అభిప్రాయాలు కశ్యప్ గారు ఇండిక్ వికీ ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, (IIIT-H) వారి దృష్టికి తీసుకు వెళ్లకుండా, ఇవన్నీ మామూలే అన్నట్లుగా తేలికగా తీసుకుని తనపరిధిలో ఉహించి చర్చలు జరుపుచున్నట్లు నాకనిపిస్తుంది.ఇండిక్ వికీ ప్రాజెక్ట్, (IIIT-H) వారి ప్రాజెక్టు, తెవికీని అడ్డం పెట్టుకుని దానికేదో మంచిచేస్తున్నామని ప్రచారం ద్వారా ఉనికిలోకి తీసుకువచ్చి, తెవికీకి పోటిగా నిలపాలనే ఉద్దేశ్యం ఉందని క్లియర్ గా అర్థమవుతుంది.ఆ ప్రణాళిక కోసం తెవికీని అడ్డం పెట్టుకోవటం ఎంత మాత్రం భావ్యంకాదు. ఇప్పటివరకు దీనిమీద జరిగిన చర్చలు సారాంశం, వార్తల ఘటనలు వివరాలు ఇప్పటికైనా తెవికీ సముదాయం చర్చించి, వికీ ఫౌండేషన్ వారి దృష్టికి తీసుకువెళ్లవలసిన బాధ్యత తెలుగు వికీపీడియా సముదాయంపై ఉందని నేను భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 14:35, 19 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ట్రిపుల్ ఐటీ వారు వ్యవహరిస్తున్న తీరు విషయంలో యర్రా రామారావు గారు వెల్లడించిన అభిప్రాయాలతో నేను ఏకిభవిస్తున్నాను. ఈ చర్చలో పైన చదువరి గారు ఒకచోట 'చర్చ చెయ్యాల్సిన అవసరం లేదని భావిస్తే తెవికీ పేరు పెట్టుకోకండి. ఇలా పేరు వాడుకోవడాన్ని వికీమీడియా ఫౌండేషను ఖండించాలని నా అభిప్రాయం' అని రాశారు. ఈ విషయం మీద నేను రెండు విషయాలు చెప్పదలచాను.
 1. ఇతర సంస్థలు నిర్వహిస్తోన్న సదస్సులు, సమావేశాలలో ట్రిపుల్ ఐటీ వారి ఇండిక్ వికీ ప్రాజెక్టు నుండి ప్రతినిధులుగా వెళ్ళి తెలుగు వికీపీడియా గురించి మాట్లాడుతుండడం వల్ల తెలుగు వికీపీడియా ప్రాతినిధ్యం లేకుండా పోతుంది.
 2. సోషల్ మీడియాలో `తెలుగు వికీ' పేరుతో అకౌంట్స్ క్రియేట్ చేసి పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు. ఉదాహరణకు: వికీమీడియా ఫౌండేషన్ వారి ఫేస్బుక్ పోస్టులో తెలుగు వికీ పేరిట రాసింది చూస్తే సముదాయం సమర్థిస్తున్న భావన కలుగుతుంది. అలా కలగజేసేలా వ్యవహరిస్తున్నారు. `తెలుగు వికీ' అని ఉపయోగించే విషయమై అడిగినపుడు 'పీడియా' అనే పదాన్ని ఉపయోగించలేదుకదా అని అన్నారు. కానీ, చాలామంది ఆయా అకౌంట్స్ తెలుగు వికీ సమాదాయానికి చెందినవే అన్నట్టుగా భావిస్తున్నారని నా దృష్టికి వచ్చింది.
పై రెండు చర్యల మూలంగా కూడా తెవికీ సముదాయానికి నష్టం వాటిల్లుతోందని నా అభిప్రాయం. కనుక ఈ విషయాలపై కూడా తెవికీ సముదాయం చర్చించి, వికీ ఫౌండేషన్ వారి దృష్టికి తీసుకువెళ్ళాల్సిన అవసరముంది.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:10, 20 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సముదాయం దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు @Pranayraj1985: గారూ. ఇప్పటికే చర్చ జరుగుతోంది కాబట్టి దీన్నే వికీమీడియా ఫౌండేషన్ దృష్టికి తీసుకువెళ్తే సరిపోతుంది. ప్రత్యేకించి మరో చర్చ అక్కరలేదు. --పవన్ సంతోష్ (చర్చ) 05:52, 21 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా జన్మదినోత్సవం - 2021[మార్చు]

తెలుగు వికీపీడియా వార్షికోత్సవంగా ప్రతీ సంవత్సరం డిసెంబరు 10 నాడు లేదా ఆ తేదీకి సమీపంలోని ఆదివారం నాడు జరుపుకుంటున్నాం. 2019లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో డిసెంబరు 22న ఈ వేడుకలు ఆఫ్‌లైన్‌లో, 2020లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా డిసెంబరు 13వ తేదీన (10కి సమీపంలోని ఆదివారం) ఆన్‌లైన్‌లో తెలుగు వికీపీడియా జన్మదినోత్సవం జరుపుకున్నాం. తెలుగు వికీపీడియా జన్మదినం రాబోతున్న నేపథ్యంలో జన్మదిన వేడుకలు జరుపుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ విషయంపై ఆసక్తి గల సభ్యులు స్పందిస్తారని ఆశిస్తున్నాను. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 17:20, 11 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

బాగుంది. నేను పాల్గొంటాను.__ చదువరి (చర్చరచనలు) 01:29, 13 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నేనూ తప్పకుండా పాల్గొంటాను--అభిలాష్ మ్యాడం 07:20, 13 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సై Nskjnv ☚╣✉╠☛ 18:51, 13 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నేనూ పాల్గొంటాను,ఈసారి కూడా వీలయితే ఒక రోజు మొత్తం వేడుకలు జరుపుకొందాము,నిర్వాహణలో ఒక వృద్ద వికీపీడియన్ గా తోర్పడగలను :)  : Kasyap (చర్చ) 09:47, 17 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నేను తప్పకుండా పాల్గొంటాను.--~~ramesh bethi~~ (చర్చ) 11:36, 19 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు అభిప్రాయాలు.
తెలుగు వికీపీడియా జన్మదినోత్సవం - 2021 వేడుకలు గుర్తుపెట్టుకుని, చర్చకు తీసుకువచ్చిన ప్రణయ్ రాజ్ గార్కి ధన్యవాదాలు.కానీ కార్యక్రమం మీద నాకు ఉన్న కొన్ని సందేహాలు ఉన్నవి.అవి సముదాయ సభ్యులతో పంచుకుందామని వాటిని దృష్టికి తీసుకువస్తున్నాను.అవి;
 • వేడుకలు జరిపేది ఆఫ్‌లైన్‌లోనా లేదా ఆన్‌లైన్‌లోనా. ?
 • ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ రెండిటిలోనా.?
 • ఆఫ్‌లైన్‌లో జరిపితే ఎక్కడ జరపాలి.?
 • ఆఫ్‌లైన్‌లో జరిపినా రాలేని వారు ఉంటారు కాబట్టి, అదే కార్యక్రమంలో ఆన్‌లైన్‌ వారికి అవకాశం ఇవ్వటానికి అవకాశం ఉందా.?
 • తెవికీ వికీపీడియన్లు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా సాప్ట్వేరు ఉద్యాగాల రీత్యా బెంగుళూరు, ఇతరత్రా కారణాల వలన ఇతర ప్రదేశాలలో ఉన్నవారు ఉన్నారు.వారిలో ఔత్సాహికులు ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌ అంతటా ఒకేరోజు నిర్వహించటానికి అవకాశం ఉందా.?
 • అసలు ఈ వేడుకలలో చర్చించుకోవటానికి అజండా వివరాలు ఏమేమి ఉండాలి.?
 • దీనికి అయ్యేఖర్చును వికీమీడియా ఫౌండేషన్ భరించటానికి అవకాశం ఉందా.?
ఇలాంటి విషయాలపై చర్చించి, దానిలో వెల్లడించిన అందరి అభిప్రాయాలు ప్రకారం ఒక కార్యాచరణ ప్రణాళిక తయారుచేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.కావున చర్చను ప్రవేశపెట్టిన ప్రణయ్ రాజ్ గారు ఆన్‌లైన్‌లో ఒక సమావేశం వెంటనే నిర్వహిస్తే బాగుంటుదని నాఅభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 13:47, 19 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా జన్మదినోత్సవం - 2021 వేడుకలను అందరం కలసి, ప్రభుత్వ అనుమతి తో రవీంద్రభారతి పైడిరాజు ప్రివ్యూ థియేటర్‌ ఉన్న ప్రొజెక్టర్ నహాయంతో ఆఫ్‌లైన్‌లో,ఆన్ లైన్ లో ఒకేసారి జరపవచ్చు,ఈ కరోనా కాలంలో అందరూ పాల్గోనాలంటే ఇలాంటి విధానం ఉండాల్సినదే ! : Kasyap (చర్చ) 08:50, 22 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం యర్రా రామారావు గారు, మీరు ప్రస్తావించిన అంశాలు బాగున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలలో వీలుకుదిరిన వికీపీడియన్లతో ఆఫ్‌లైన్‌లో ఉదయం నుండి సాయంత్రం వరకు వేడుకలు నిర్వహించుకుంటూ, వీలుకుదరని వారితోపాటు వివిధ ప్రాంతాలలో ఆఫ్‌లైన్‌ వేడుకలు నిర్వహించుకుంటున్నవారితో (అందరూ హజరయ్యేలా) రెండు గంటలపాటు ఆన్‌లైన్‌ నిర్వహించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. కార్యక్రమ ఎజెండా, ఖర్చులు, కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చించడానికి తెవికీ జన్మదిన వేడుక 2021 పేజీని సృష్టించాను. ఆ చర్చలో సభ్యులు పాల్గొని తెవికీ జన్మదిన వేడుకలు జరపడానికి సహకరించాలని ఆహ్వానిస్తున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:50, 5 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కరోనా వల్ల గత రెండేళ్ళుగా తెవికీ ఆధ్వర్యంలో ఆఫ్‌లైన్‌ కార్యక్రమాలు (సమావేశాలు, శిక్షణా శిబిరాలు) జరగలేదు. అయితే, ఈ రెండేళ్ళకాలంలో కొంతమంది కొత్త వాడుకరులు తెవికీకి రావడమేకాకుండా తెవికీ అభివృద్ధిలో కృషి చేస్తున్నారు. కాబట్టి ఈసారి తెవికీ జన్మదిన వేడుకలను సముదాయ సభ్యులతో కొత్త వాడుకరుల పరిచయ వేదికగా, తెవికీ శిక్షణ కార్యక్రమంగా నిర్వహిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అందుకోసం వచ్చే ఆదివారం (డిసెంబరు 19న) రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ థియేటర్ లో ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడానికి వేదిక కోసం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారిని అనుమతికోరగా, వారు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అనుమతిని ఇచ్చారు. కాబట్టి డిసెంబరు 19 ఆదివారం రోజున ఉదయం గం. 10 నుండి సాయంత్రం గం. 5 వరకు తెవికీ జన్మదిన వేడుకలు (సముదాయ సభ్యులతో కొత్త వాడుకరుల పరిచయ వేదికగా, తెవికీ శిక్షణ కార్యక్రమం) జరుపబడుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పాల్గొనవీలుకాని వారికోసం ఆన్లైన్ వేదికగా కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. సముదాయ సభ్యులు విచ్చేసి వేడుకలలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వికీ రచనలోని వివిధ అంశాలలో శిక్షణ కావలసినవారు తెవికీ జన్మదిన వేడుక 2021 కార్యక్రమ చర్చాపేజీలోనూ, నిర్వహణ సమన్వయ జట్టులో (పనులు, బాధ్యతలు) ఆసక్తివున్నవారు సంబంధింత విభాగంలో తమ పేర్లను రాయగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 05:35, 16 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసాల కొరత[మార్చు]

గత కొన్నాళ్ళుగా ఈ వారం వ్యాసం ఎంపిక చేస్తూ మనకు అందుబాటులో ఉన్న వ్యాసాలు తగ్గుతూ వస్తున్నాయని గమనించాను. మీరు రాసిన లేదా గమనించిన మంచి వ్యాసాలను ఈ వారం వ్యాసానికి ప్రతిపాదించిన వలసిందిగా కోరుతున్నాను. ప్రతిపాదించడానికి వ్యాసం చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అని ఒక మూసను చేర్చండి. అవి ఒక పరిశీలన జాబితాలో చేరతాయి. వాటిని పరిశీలించి అభివృద్ధి చేసి ఈ వారం వ్యాసాలుగా మారుద్దాం. - రవిచంద్ర (చర్చ) 17:28, 16 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ రవిచంద్ర గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:51, 17 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
గతంలో ఆ ఆలోచనలేదు.అలాగే రవిచంద్ర గారూ... యర్రా రామారావు (చర్చ) 04:58, 17 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే రవిచంద్ర గారూ, ధన్యవాదాలు--అభిలాష్ మ్యాడం 05:55, 17 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
తప్పకుండా సార్.. Nskjnv ☚╣✉╠☛ 12:41, 18 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Maryana’s Listening Tour ― South Asia[మార్చు]

Hello everyone,

As a part of the Wikimedia Foundation Chief Executive Officer Maryana’s Listening Tour, a meeting is scheduled for conversation with communities in South Asia. Maryana Iskander will be the guest of the session and she will interact with South Asian communities or Wikimedians. For more information please visit the event page here. The meet will be on Friday 26 November 2021 - 1:30 pm UTC [7:00 pm IST].

We invite you to join the meet. The session will be hosted on Zoom and will be recorded. Please fill this short form, if you are interested to attend the meet. Registration form link is here.

చర్చకు ఆహ్వానం: ఐఐఐటి తెవికీ ప్రాజెక్టు భాగస్వామ్యం[మార్చు]

అందరికి నమస్కారం! ఈ మధ్య రచ్చబండలో ఐఐఐటీ ఇండిక్ వికీ ప్రాజెక్ట్ ఉపభాగం అయిన తెవికీ ప్రాజెక్టు మీద జరిగిన చర్చ, అందులో వికీపీడియన్ లు వెలువరించిన అభిప్రాయాలు consider చేసి, కొంత మంది వికీపీడియాన్లు, వికీ ఫౌండేషన్ సభ్యులతో చర్చించిన తరువాత, ప్రాజెక్టు గురించి అవగాహనకు, అభివృద్ది మీద తెలుగు వికీపీడియా సభ్యుల సూచనలను, సలహాలు స్వీకరించటానికి, ఏమైనా సందేహాలు ఉంటే clarify చెయ్యటానికి వచ్చే నెల డిసెంబర్ 2021 మొదటి వారంలో ఒక on-line సమావేశం జరపాలని నిర్ణయించాము. ఈ కార్యక్రమం మీద ఏమైనా సూచనలు, discussion topics ఇక్కడ తెలుపగలరు. తేదీ నిర్ణయించిన తరువాత [ఐఐఐటి ప్రాజెక్టు] పేజీ లో ఒక ప్రత్యేక నమోదు పేజీ ద్వారా కార్యక్రమం కొనసాగిద్దాం. ధన్యవాదాలు. Radhika41 (చర్చ) 08:23, 25 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Radhika41: గారూ, మీరు రాసిన దాని ప్రకారం మీ వైపు నుంచి రెండు కారణాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలిచారు: 1) "సూచనలను, సలహాలు స్వీకరించటానికి,", 2) "ఏమైనా సందేహాలు ఉంటే clarify చెయ్యటానికి". అయితే, ఇప్పటికే లెక్కకు మిక్కలి సూచనలు, సలహాలు ఇచ్చాము, వాటిలో అత్యంత ప్రధానమైనవే అమలుకు నోచుకోలేదు. కాబట్టి, ఆ మొదటి కారణం వల్ల ప్రయోజనం సముదాయానికి లేదు. రెండు - నాతో సహా పలువురు వికీపీడియన్లు ప్రాజెక్టు గురించి వ్యక్తపరిచినవి "సందేహాలు" కాదు, తెలుగు వికీపీడియా సముదాయంగా ప్రాజెక్టు నడుస్తున్న తీరుతెన్నులతో మాకున్న సమస్యలు. కాబట్టి, ఈ రెండు ఎంటిటీల మధ్య (ఐఐఐటీ, తెలుగు వికీపీడియా సముదాయం) ఉన్నవి సమస్యలు (issues/problems) అని అంగీకరించి, వాటి గురించిన చర్చ, పరిష్కారం ప్రధానమైన అంశంగా ఈ సమావేశపు ఉద్దేశాన్ని పునర్ నిర్వచిస్తే తప్పించి దీనివల్ల ప్రయోజనం ఉండదు. డిస్కషన్ టాపిక్స్‌గా మేం చేర్చేవాటిలో ఒకటిగా ఇది ఉండడం కాదు మీరే దీన్ని అంగీకరించి ఇదే ముఖ్యోద్దేశం అన్నట్టైతేనే ఈ సమావేశం మీద సముదాయ సభ్యులుగా మేం కానీ, ప్రాజెక్టు సభ్యులుగా మీరు కానీ సమయాన్ని వెచ్చించినప్పుడు విలువ ఉంటుంది. దయచేసి క్లారిటీ ఇవ్వగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 16:56, 25 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
P.S.: ఒకవేళ మీరు సమావేశం ప్రధానోద్దేశంగా "సమస్యల గురించిన చర్చ, పరిష్కారం" పెట్టుకున్నట్టైతే, ఆనక కొన్ని అజెండా పాయింట్లుగా సూచనలు స్వీకరించడం కానీ, తెలుగు వికీపీడియా గురించి మీకు ఇంకా డౌట్లు ఉన్నట్టైటే మేమేమైనా క్లారిఫై చేయగలిగితే చేయడం కానీ - ఇలాంటివి పెట్టుకున్నా ఇబ్బంది ఉండదు. గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 17:01, 25 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Radhika41 గారూ, పవన్ గారు చెప్పిన అంశాలతో నేను ఏకీభవిస్తున్నాను. ఐఐఐటీ వారి కార్యక్రమంతో తెవికీకి ఉన్న సమస్య లేంటనేది పైన రాసాం. నేను చెప్పదలచిన మరో సంగతేంటంటే.. ఆ సమావేశం వికీ లోనే జరపాలి, ఆఫ్‌లైనులో కాదు. ఎందుకంటే ఈ సమస్య గురించి జరిగే చర్చ, దాని పరిష్కారం వికీలో అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ పాల్గొనేలా ఉండాలి. అందుచేత, వికీపీడియా పేరుబరిలో ఒక పేజీ పెట్టి సమస్యలను చర్చించి పరిష్కారాలేంటో చూద్దాం. __ చదువరి (చర్చరచనలు) 00:37, 26 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారూ, నిర్ణయాలు అన్నీ తెవికీలోనే తీసుకోవాలన్న మీ ఆలోచనకు పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అయితే, వీడియో కాల్ జరగకూడదనేమీ లేదు కదా. వీడియో కాల్‌లో జరిగే చర్చ ఫలితం కేవలం చిత్తు ప్రతిపాదనలే, నిర్ణయాలు కావని నిర్ణయించుకునే చేయవచ్చు కదా. ఆ చిత్తు ప్రతిపాదనలపై తుది చర్చ ఇక్కడే జరిగుతుంది. ఏ నిర్ణయాలైనా ఇరు పక్షాలూ వికీలోనే తీసుకుందాం. కాల్ ఉండడం వల్ల ప్రయోజనాలు ఇవి: 1) ఈ సమస్యపై చర్చలో తెలుగు వికీపీడియన్లు, ఐఐఐటీ వాళ్ళతో పాటు వికీమీడియా ఫౌండేషన్ వారు కూడా పాల్గోవలసి ఉంది. మూడు వైపుల వ్యక్తులూ ఈ అంశంపై చర్చించడానికి కాల్ ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. 2) ఆన్-వికీ ప్రాసెస్ బైపాస్ చేయకుండానే చర్చను వేగవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ కాల్ ఉపయోగపడుతుంది. 3) కాల్‌లో జరిగే చర్చను రికార్డ్ చేయడం ద్వారా కానీ, ఆసాంతం సవ్యమైన నోట్ కీపింగ్ ద్వారా కానీ రికార్డు చేసి ఆన్-వికీ అందించేలా చర్యలు తీసుకుందాం. ఏమంటారు?
@Radhika41 గారూ, మీరు పొరబాటున "ఇరు పక్షాల మధ్య ఉన్న సమస్యల గురించి" ఈ చర్చ అన్న ముఖ్యమైన అంశాన్ని మిస్ చేసి ఉంటారని భావిస్తున్నాను. ఒకవేళ "సమస్యలు చర్చించడానికి" అన్నదే మీ ఉద్దేశం అయివుంటే నిర్ధారించగలరు. పవన్ సంతోష్ (చర్చ) 16:19, 26 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Pavan santhosh.s గారూ. మీరు ఇది సమస్య అని అంటున్నారు, అమె సలహా సంప్రదింపు లంటున్నారు. అదే తేలలేదు అసలు. ఆఫ్ లైనులో చర్చించాలంటే ముందసలు ప్రాతిపదిక అంటూ ఒకటి కావాలి గదా. ఆ ప్రాతిపదికను వికీలోనే ఏర్పాటు చెయ్యాలి గదా. ఆ ప్రాతిపదికను ఏర్పాటు చేసే చర్చ అంటూ అసలు ఇక్కడ మొదలవకుండా, అసలు సమస్య ఏంటో నిర్వచనమే జరక్కుండా ఆఫ్ లైనులో చర్చకు వెళ్ళడం సరికాదు. అందుచేత వికీపీడియా పేరుబరిలో ఒక పేజీ పెట్టి అక్కడ సమస్య ఫలానా అని మీరిద్దరూ ఒప్పుకుంటే అప్పుడు ఆఫ్‌లైను చర్చకు వెళ్ళమని నా సలహా. __ చదువరి (చర్చరచనలు) 01:27, 27 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు మీ స్పందనకు కృతజ్ఞతలు, చదువరి గారు మీరు సూచించినట్లుగా, దయచేసి ఎజెండా పాయింట్లతో నేమ్ స్పేస్ పేజీని సృష్టించండి. సమావేశానికి సంబంధించిన మా ఎజెండా: రెండు పక్షాల మధ్య చర్చలు జరపడం, వివిధ అంశాల మీద సందేహ నివృత్తి, పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం. మిగిలిన వారు వారి ఎజెండా చేర్చిన తరువాత షెడ్యూల్ చేసిన తేదీలో (ఆఫ్‌లైన్/ఆన్‌లైన్) సమావేశంలో చర్చిద్దాం. Radhika41 (చర్చ) 15:10, 29 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Radhika41 గారూ, మీకు అర్థమయ్యేలా చెబుతాను..
 1. సలహాలో సమస్యా పరిష్కారమో మరోటో.. కావలన్నది మీరు. దాని కోసం బైట మీటింగు పెడతాం, అక్కడికి రండి అన్నది మీరు. అక్కడకాదు, ఇక్కడే పెట్టండి, అది వికీపద్ధతి అని చెప్పాన్నేను. ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఏంటంటే.. నిజంగానే సమస్యల పరిష్కారం కోరుకుంటే ఇక్కడే మీరే ఆ పేజీ ఏదో పెట్టి సమస్యలు చెప్పండి, సలహాలు అడగండి. ఇక్కడ పేజీ పెట్టడం, సమస్యలను చర్చించడం మీకు ఇష్టం లేదనుకోండి.. మానెయ్యండి, నన్ను పెట్టమని అడక్కండి. సలహాలు కావాల్సింది మీకు, నాక్కాదు.
 2. మరొక ముఖ్యమైన సంగతి ఏంటంటే.. వికీని అభివృద్ధి చేస్తామని మీరే ముందుకు వచ్చి ఒక ప్రాజెక్టును తీసుకున్నారు. దాని బాధ్యత మీదే. దానిలో మీకేదైనా సమస్యలొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సింది మీరే.. అది పేజీ పెట్టడం కావచ్చు, దానిలో ఎజెండా పెట్టడం కావచ్చు.., మరోటి కావచ్చు. కాబట్టి పేజీ మీరే పెట్టండి, నన్ను పెట్టమని అడక్కండి.
__ చదువరి (చర్చరచనలు) 04:09, 30 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు  మీ ప్రతిస్పందన చాలా అనుచితముగా ఉంది. మీరు మొదట ఇచ్చిన సూచనకు, ప్రతిగా నేను చేసిన అభ్యర్థనను  మీరు నిరాకరించవచ్చు. అంతేగాని అమర్యాదగా మీ స్పందన  ఉండాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం.

పేజి మేమే సృష్టించాలంటే మాకు "తెవికీ-ఐఐఐటి ప్రాజెక్టు" అనే ప్రాజెక్ట్ పేజీ ఉన్నందున, అక్కడ సృష్టించబడ్డ చర్చ పేజీలో ఈ టాపిక్ పై చర్చలు జరపమని నేను  అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ చర్చను ఇక్కడ ముగిస్తున్నాము. ధన్యవాదములు. Radhika41 (చర్చ) 13:26, 30 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Radhika41 గారూ, ఒకవేళ ఇది మీకు అనుచితంగా అనిపిస్తే, ఆ అనుచితత్వం "పేజీ మీరు సృష్టించండి" అంటూ నాకు చెప్పారు చూసారా.. అక్కడ మొదలైందది. మీరు దాని సంగతి పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. ఒక్కసారి మళ్ళీ చదవండి. __ చదువరి (చర్చరచనలు) 13:52, 30 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Radhika41 గారు "పేజి మేమే సృష్టించాలంటే మాకు "తెవికీ-ఐఐఐటి ప్రాజెక్టు" అనే ప్రాజెక్ట్ పేజీ ఉన్నందున, అక్కడ సృష్టించబడ్డ చర్చ పేజీలో ఈ టాపిక్ పై చర్చలు జరపమని నేను  అందరినీ ఆహ్వానిస్తున్నాను" అని అన్నారు.మరి ఆ పేజీ ఉండగా "చర్చకు ఆహ్వానం: ఐఐఐటి తెవికీ ప్రాజెక్టు భాగస్వామ్యం" అనే విభాగం రచ్చబండలో ఎందుకు ప్రవేశపెట్టారో మననం చేసుకోవాలి.వీటిన్నిటినిబట్టి తెవికీ మీద ఐఐఐటీ ఇండిక్ వికీ ప్రాజెక్ట్ వారి ధోరణి ఎందుకో సరిగాలేదనిపిస్తుంది.ఇంతవరకు వారు తెవికీకి మంచిచేయకపోగా, ఒకరకంగా లోగడ జరిగిన సంఘటనలుబట్టి నష్టం జరిగిందని అనుకోవాలి.ఇటువంటి విషయాలలో పూర్తిగా సంస్థతరుపున భాధ్యతగల ఒకే అధికారి లేదా ప్రతినిధి ద్వారా తెవికీలో చదువరి గారు సూచించినట్లు ప్రత్యేక పేజీ సృష్టించి, మీ తరుపున నుండి ఏక వాక్యంతో చర్చ ప్రారంభించకుండా మీరు తెవికీలో మీ పాత్ర ఏమిటి?, ఎలా ఉండబోతుంది?,ఇప్పటివరకు "తెవికీ-ఐఐఐటి ప్రాజెక్టు" నుండి తెవికీకి జరిగిన మంచి ఏమిటి?,ఎన్ని వ్యాసాలు "తెవికీ-ఐఐఐటి ప్రాజెక్టు" తరుపునుండి తెవికీలో ప్రవేశపెట్టారు?, ఇలాంటివాటిని వివరిస్తూ, మీ ప్రణాళికలు, మీ అభిప్రాయాలతో ప్రత్యేక పేజీ సృష్టించి,దానిని రచ్చబండలో సముదాయం దృష్టికి తీసుకువస్తే, దానిలో తెవికీ సభ్యుల సూచనలు, సలహాలు, ఏమైనా సందేహాలు, అభిప్రాయాలు తెలపటం సమంజసం. యర్రా రామారావు (చర్చ) 07:29, 1 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం[మార్చు]

చదువరి గారూ నమస్కారం, వాడుకరి చర్చ:2409:4070:4E16:FF11:2D5B:ABD0:6FAF:EAAA అనే ఐపీ అడ్రసు కు సంబంధించిన వాడుకరి వికీలో దిద్దుబాట్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. గతంలో తెలియక అజ్ఞాత వాడుకరిగానే మార్పుచేర్పులు దిద్దుబాట్లు చేస్తూ, దుశ్చర్యలకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇతడి ఈమెయిలు నుండి వికీలో ఖాతా తెరవడానికి రావడం లేదు.. ఖాతా నిరోధించినట్లు చూపిస్తోంది. చదువరి గారు కాని ఇతర సముదాయ సభ్యులు కానీ సహాయం చేయగలరు.-అభిలాష్ మ్యాడం 13:34, 28 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభిలాష్ గారూ, సదరు అనామక సభ్యులు దిద్దుబాట్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని మీకు ఎలా తెలియజేశారు? ప్రస్తుతానికి ఆ ఐపీ మీద నిరోధం తొలగించవచ్చు. అప్పుడు ఆ సభ్యులు వికీలో నమోదై మార్పులు చేయవచ్చు. కానీ ముందు చేసినట్లు దుశ్చర్యలు చేస్తే మళ్ళీ చర్యలు తీసుకుంటారు. - రవిచంద్ర (చర్చ) 06:03, 30 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@MYADAM ABHILASH గారూ ఆ ఐపీల నుండి చేసిన దుశ్చర్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. పేజీల్లో చేసే దుశ్చర్యలు మాత్రమే అయితే పర్లేదు. కానీ ఆ ఐపీల వారు, అవే కాకుండా వ్యక్తిగతంగా కొందరు సభ్యులను దూషించారు. వికీపీడియా చచ్చిపోయిందంటూ ఇతరులతో గొంతు కలిపారు. మనం దీన్ని కూడా పరిశీలించాలి. __ చదువరి (చర్చరచనలు) 06:42, 30 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, ఈ ఐపీ అడ్రసులు అప్పుడు వికీలో దుశ్చర్యలు చేసిన వాడుకరులవే అయ్యుండచ్చు. కానీ DHCP ప్రోటోకాల్ అదే ఐపీలను మళ్ళీ వేరే వాడుకరులకు కేటాయించి ఉండచ్చు కదా. కాబట్టి అభిలాష్ గారు పేర్కొన్న ఐపీ అడ్రసు మీద మాత్రం నిరోధం తీసివేసి చూడవచ్చు అనుకుంటున్నానండీ. నాకు ఎందుకో అది జెన్యూన్ కేస్ లాగా అనిపిస్తుంది. ఒకవేళ మళ్ళీ దుశ్చర్యలు చేస్తే ఖచ్చితంగా వాటిని నిరోదిద్దాం. ఏమంటారు? - రవిచంద్ర (చర్చ) 10:02, 30 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఐపీ అడ్రసు ఎలా సృష్టించబడుతుంది అన్న విషయము నాకు తెలియదు.. దానిపై నాకు పూర్తి అవగాహన నాకు లేదు అకౌంట్ల పై నిరోధాలు ఎలా విధిస్తారు, ఎప్పుడు విధిస్తారు అన్న విషయాలు కూడా నాకు తెలియదు. ఇలా తెలియకుండా ఈ విషయాన్ని చర్చకు తెచ్చినందుకు క్షమించండి... విషయమేమిటంటే నెలక్రితం నిర్వహించిన వికీపీడియా శిక్షణా శిబిరంలో చాలా మంది మా స్నేహితులు పాల్గొన్నారు. వారికి అసలు వికీలో దిద్దుబాట్లు ఎలా చేయాలి అన్న విషయం కూడా తెలియదు ఆరోజు అకౌంటు సృష్టించుకున్నారు కానీ లాగిన్ అయి దిద్దుబాట్లు చేయలేదు. ఇప్పడు వారు వాడుకరి పేరు, పాస్వర్డ్ మర్చిపోయారు కాబట్టి మళ్ళీ అకౌంట్ సృష్టిద్దామని అనుకుంటున్నారు కానీ సాధ్యపడట్లేదు. అంతే తప్ప వికీని దూషించినవారికి , నాకూ ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ అలా అనిపిస్తే తగిన సూచనలు సలహాలు ఇవ్వండి.-అభిలాష్ మ్యాడం 09:01, 30 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@MYADAM ABHILASH గారూ ఆ ఐపీ అడ్రసుల శ్రేణి నుండి జరిగిన దుశ్చర్యల గురించి నేను రాసాను. దానర్థం, ఒక్కరే అవన్నీ చేసారని కాదు. ఒకే వ్యక్తి అవన్నీ చేసారని చెప్పలేం. అలాగని చెయ్యలేదనీ చెప్పలేం. ఆ వ్యక్తి మిమ్మల్ని సహాయం కోసం అడిగారు కాబట్టి, ఆయన చేసిన దుశ్చర్యలేంటో వివరంగా తెలుసుకుని సముదాయానికి చెబితే, తద్వారా సముదాయానికి ఆ వ్యక్తి పట్ల ఒక అంచనా ఏర్పడుతుంది. తదనుగుణంగా సముదాయం నిర్ణయం తీసుకునే వీలు కలుగుతుంది అని నా అభిప్రాయమండి. అంతే తప్ప ఆ దుశ్చర్యకూ మీకూ ఏదో సంబంధముందనైతే నా ఉద్దేశం కాదు. __ చదువరి (చర్చరచనలు) 10:00, 30 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అభిలాష్ గారూ, నేనొక సలహా చెబుతాను. ఒకవేళ నిరోధించిన ఐపీ నుంచి సదరు వాడుకరి వికీపీడియాను తెరుస్తూ ఉంటే. ఒకటికి రెండు సార్లు ఇంటర్నెట్ నుంచి డిస్‌కనెక్టు అయ్యి మళ్ళీ కనెక్టు అవ్వమని చెప్పండి. అలా చేసినప్పుడు వేరే మంచి ఐపీ అడ్రసు అసైన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పదే పదే అదే ఐపీ అసైన్ అవుతుంటే అప్పుడు ఏం చేయాలో పరిశీలిద్దాం. - రవిచంద్ర (చర్చ) 10:05, 30 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@MYADAM ABHILASH గారు, ఈ లింకులో ఆ ఐపీ శ్రేణిలోని వారు చేసిన దిద్దుబాట్లన్నిటినీ చూడొచ్చు. వాటిలో ఎలాంటి దుశ్చర్యలున్నాయో చూడండి -ముఖ్యంగా 2021 జూన్‌ నెలలో. ఆ దుశ్చర్యల గురించి మనకు మరింత అవగాహన కలుగుతుంది.
ఇంకో సంగతి.. డైనమిక్ ఐపీ కనెక్టైన ప్రతిసారీ మారుతూంటుంది. ఒక ఐపీతో దుశ్చర్య చేసారని ఆ ఐపీని మాత్రమే నిరోధిస్తే, దుశ్చర్య మాత్రమే చెయ్యాలనుకునేవారు ఒకసారి నెట్ కట్ చేసి మళ్ళీ కనెక్టవుతారు. అపుడు కొత్త ఐపీ వచ్చేస్తుంది. కొత్త ఐపీతో మళ్ళీ దుశ్చర్య చెయ్యొచ్చు. దీన్ని నివారించేందుకే శ్రేణి నిరోధం పెట్టారు. అలా చేస్తే ఒక శ్రేణిలో వచ్చే అనేక ఐపీలను నిరోధిస్తుంది. దుశ్చర్యలు చేసేవారిని చాలావరకు నిరోధిస్తుంది. గమనించవలసిన సంగతేంటంటే.. శ్రేణి నిరోధం విధించాకనే తెవికీ చచ్చిపోయిందంటూ చేసిన దూషణలు, వ్యక్తిగత దూషణలూ ఆగిపోయాయి.
ఒక నిర్ణయం తీసుకునేముందు, అన్ని విషయాలనూ కూలంకషంగా పరిశీలిస్తే సరైన నిర్ణయం తీసుకోవచ్చని నా ఉద్దేశం. ఉదాహరణకు.. ఇలాంటి సమస్యే మొన్న అక్టోబరులో ఒకసారి వచ్చినపుడు ఒక నిరోధపు స్థాయిని తగ్గించాను. ఆ వెంటనే - బహుశా ఒకటి రెండు రోజుల్లోనే - "అధోముఖ వృక్షాసనం", "అధోముఖ స్వానాసనం" అనే రెండు పేజీలను సృష్టించారు. తరువాత ఆ పేజీలను నిర్వాహకులు తొలగించారు. నిరోధాన్ని తగ్గించకుండా ఉండి ఉంటే ఆ రెండు పేజీలూ వచ్చేవి కావు. అయితే నిరోధాలను శాశ్వతంగా ఉంచాలని నేను అనడం లేదు. అన్నీ కూలంకషంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని సముదాయానికి విజ్ఞప్తి.
@రవిచంద్ర గారూ నిరోధాలు అలాగే ఉంచాలి, తగ్గించకూడదు, తీసెయ్యకూడదు అని నా ఉద్దేశం కానేకాదు. అదే అయితే ఈ చర్చను ఇక్కడ రచ్చబండలో చెయ్యాలని అభిలషించేవాణ్ణే కాదు.
వాడుకరుల అభిప్రాయాల మేరకు సముదాయం తగు నిర్ణయం తీసుకోవాలని నా విజ్ఞప్తి. __ చదువరి (చర్చరచనలు) 14:45, 30 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ వికీని దూషించే వారికి ఇందులో దిద్దుబాట్లు చేయడానికి అర్హత లేదు. తప్పకుండా ఆ నిరోధాలను అలా ఉంచండి ఎందుకంటే కొత్త వాడుకరుల కోసం వాటిని ఎత్తి వేసినా వారు మళ్ళీ చొరబడి గతంలో లాగా దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. శిక్షణా శిబిరంలో ఆసక్తి చూపిన కొత్త వాడుకరుల కోసం రవిచంద్ర గారు చెప్పినట్లు ఇంకేదైనా మార్గం ఆలోచిస్తాను. ధన్యవాదాలు--అభిలాష్ మ్యాడం 15:08, 30 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభిలాష్ గారు పరిస్థితిని అవగాహన చేసుకున్నందుకు అభినందిస్తూ, వారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తూ, నిరోధాలు మరికొంతకాలం కొనసాగించాలి. యర్రా రామారావు (చర్చ) 04:50, 1 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@MYADAM ABHILASH గారు, సమస్య గలవారు వేరే కంప్యూటర్(ఇంటర్నెట్ సెంటర్ లేక ఆఫీసు లేక స్నేహితులది), మొబైల్(వేరే నెట్వర్క్ ఉపయోగించే వాడుకరి) ద్వారా ఖాతా తెరిచితే, తరువాత వారి స్వంత కంప్యూటర్, మొబైల్ ద్వారా ఇబ్బంది లేకుండా ప్రవేశించి మార్పులు చేయగల వీలుంది. గమనించగలరు. అర్జున (చర్చ) 04:56, 1 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ ధన్యవాదాలు. అర్జున గారూ మీ సలహాకు ధన్యవాదాలు. అలాగే చేస్తాను.--అభిలాష్ మ్యాడం 05:14, 1 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ సమస్యను నేను ఇదివరకు ఒకసారి చదువరి గారితో చర్చించాను, నా పాస్వర్డ్ మర్చిపోవడంతో నా ఐపి శ్రేణిపై నిరోధం ఎత్తివేయమని అడిగాను- కొత్త వాడుకరులకు కూడా ఖాతా సృష్టించుకోవడం కష్టమవుతుందని. కానీ నేను ఉద్దేశించిన మంచి జరగకపోగా, చాలా వ్యాసాల్లో లెక్కలేనన్ని చెత్త దిద్దుబాట్లు జరిగాయి యర్రా రామారావు గారూ వాటిని తిప్పికొట్టడంలో చాలా కృషి చేశారు కూడా.
రవిచంద్ర, చదువరి గార్ల అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను, ఆ ఐపి నిరోధం అలానే ఉంచడం చాలా అవసరం. Nskjnv ☚╣✉╠☛ 14:33, 2 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]