వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అడ్డదారి:
WP:VPT
రచ్చబండ
వార్తలు | పాలసీలు | ప్రతిపాదనలు | సాంకేతికము | ఆలోచనలు | పత్రికా సంబంధాలు | ఇతరత్రా..

అధిక వీక్షణలు గల వ్యాసాలు[మార్చు]

ఇంగ్లీషు వికీకొరకు వాడుతున్న గణంకాల మాదిరిలో మన తెవికీ కి ఒక వారం లేక నెలలో అధిక వీక్షణలుగలు (25 లేక100 లేక500) వ్యాసాలు తయారుచేస్తే తెవికీఅభివృద్ధికి ప్రాధాన్యతలు తెలుస్తాయి. ఇప్పటికే వాడుతున్న హెన్రిక్స్ ఉపకరణం] క్రమపద్ధతిలో పనిచేయుటలేదు. మరియు దీనిలో దోషాలు వుండవచ్చని ఒక విశ్లేషణలో తేలింది. హెన్రిక్ టూల్ వాడే మూలపు దత్తాంశం తీసుకొని విశ్లేషిస్తే చాలు. ఇది ఎమ్,సి.ఎ లేక బి.టెక్ వారికి మంచి ప్రాజెక్టుగా వుపయోగపడుతుంది కూడా. --అర్జున (చర్చ) 05:16, 16 జూలై 2013 (UTC)

విరామ స్థానాల వాడుకలో దోషాలు[మార్చు]

తెలుగు వికీపిడీయా వ్యాసాలలో తరచుగా కనబడే దోషం: విరామ స్థానాల వాడుక. 1. కామా ముందు, ఫుల్‌ స్టాప్ ముందు ఖాళీ వదలకూడదు. 2. కామా తరువాత, ఫుల్‌ స్టాప్ తరువాత ఒక ఖాళీ వదలి తీరాలి. 3. ఒక మాట అంతానికి, తరువాత వచ్చే తెరుచుకున్న కుండలీకరణానికీ మధ్య ఒక ఖాళీ ఉండి తీరాలి. అదే విధంగా ఒక మూసుకున్న కుండలీకరణానికీ తరువాత వచ్చే మాటకీ మధ్య ఒక ఖాళీ ఉండి తీరాలి. ఇంకా చాల నియమాలు ఉన్నాయి కాని, ఈ కనీస నియమాలు గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని మనవి చేస్తున్నాను. 67.180.52.191 17:21, 25 ఆగష్టు 2015 (UTC)

మంచి సలహా ఇచ్చారు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 07:40, 11 ఏప్రిల్ 2016 (UTC)

టైపు చెయ్యడంలో ఇబ్బంది[మార్చు]

తెలుగు వికిలో విజ్ఞఆనం వంటి మాటలు టైపు చెయ్యడానికి బొత్తాలని ఏ క్రమంలో ఒత్తాలి? Vemurione (చర్చ) 13:56, 28 ఆగష్టు 2015 (UTC)

వికీపీడియా:టైపింగు_సహాయం#vignanamచూడండి. --అర్జున (చర్చ) 07:39, 11 ఏప్రిల్ 2016 (UTC)

గూగుల్ లో వెతుకుతూన్నప్పుడు తెలుగు వికీపీడియాలో ఉన్న సమాచారం కనిపించేటట్లు చెయ్యడం ఎలా?[మార్చు]

ఉదా. నేను తెలుగు వికీలో వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) అనే అంశాన్ని ఉంచాను. "ఇది తెలుగు వికీలో ఉంది" అని ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? అనగా, గూగుల్ వెతుకు పెట్టెలో ఇంగ్లీషు లిపిలో "English-Telugu Dictionary" అని ఎవ్వరైనా రాస్తే తెలుగు వికీలో ఉన్న అంశం దొరకాలి. అప్పుడు ఈ నిఘంటువు ఉపయోగం పెరగడమే కాకుండా తెలుగు వికీపీడియాని సందర్శించే వారి సంఖ్య కూడ పెరుగుతుంది. ధన్యవాదాలు Vemurione (చర్చ) 12:04, 8 సెప్టెంబరు 2015 (UTC)

Vemurione గారికి, మీ ప్రశ్నలకు ఇంతవరకు స్పందనలేకపోవడం విచారించదగినది. ఆ పేజీలో ఆ ఆంగ్ల పదాలు వాడండి సరిపోతుంది. లేకపోతే ఆంగ్ల పదాలతో దారిమార్పు చేసినా సరిపోతుంది. ఆయితే నిఘంటువు విక్షనరీకి సంబంధించినది కాబట్టి ప్రస్తుతానికి దారిమార్పు వద్దని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 04:33, 11 ఏప్రిల్ 2016 (UTC)

Dynamic page list స్థాపన[మార్చు]

YesY సహాయం అందించబడింది

సహకారం స్థితి లో వ్యాసం తో పాటు తేదీ కనబడేటట్లు చేయడానికి DPL extension స్థాపించాలి. ఇది ఇప్పటికే వికీసోర్స్ లో స్థాపించబడినది. అక్కడ s:వికీసోర్స్:రచ్చబండలో సహకారం స్థితి చూడండి. అలాగేఇక్కడ కూడా చేయడానికి సభ్యులు వారంలోగా అనగా 18ఏప్రిల్ 2016 లోగా స్పందించండి. --అర్జున (చర్చ) 04:39, 11 ఏప్రిల్ 2016 (UTC)

మద్దతు
 1. --Rajasekhar1961 (చర్చ) 05:07, 11 ఏప్రిల్ 2016 (UTC)
 2. --Viswanadh (చర్చ) 05:57, 11 ఏప్రిల్ 2016 (UTC)
 3. --[[భాస్కరనాయుడు (చర్చ) 06:02, 11 ఏప్రిల్ 2016 (UTC)]]
 4. --JVRKPRASAD (చర్చ) 07:25, 11 ఏప్రిల్ 2016 (UTC)
 5. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 01:47, 12 ఏప్రిల్ 2016 (UTC)
 6. <పై వరుసలో # చేర్చి వికీసంతకం చేయండి>
వ్యతిరేకత
 1. <పై వరుసలో # చేర్చి వికీసంతకం చేయండి>
తటస్థం
 1. <పై వరుసలో # చేర్చి వికీసంతకం చేయండి>
ఫలితం

స్పందించిన Rajasekhar1961 ,-Viswanadh,భాస్కరనాయుడు,JVRKPRASAD, కె.వెంకటరమణ సభ్యులకు ధన్యవాదాలు.

ప్రతిపాదన 5 గురుసభ్యులచే సర్వసమ్మతిచే ఆమోదించబడినది. (The proposal to install Dynamic page list is approved unanimously by members). --అర్జున (చర్చ) 11:53, 19 ఏప్రిల్ 2016 (UTC)

బగ్ నమోదు చేయబడింది.--అర్జున (చర్చ) 12:00, 19 ఏప్రిల్ 2016 (UTC)

భారతీయ రైల్వేలు[మార్చు]

YesY సహాయం అందించబడింది


నేను తెలుగు వికీలో భారతీయ రైల్వేలు అనే వర్గంలో అనేక వ్యాసాలు ఒక ప్రాజెక్టుగా చేర్చుతున్నాను. "ఇది తెలుగు వికీలో ఉంది" అని ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? అనగా, గూగుల్ వెతుకు పెట్టెలో ఇంగ్లీషు లిపిలో "Indian Railways" అని ఎవ్వరైనా రాస్తే తెలుగు వికీలో ఉన్న అంశం దొరకాలి. అప్పుడు ఈ ప్రాజెక్టు ఉపయోగం పెరగడమే కాకుండా తెలుగు వికీపీడియాని సందర్శించే వారి సంఖ్య కూడ పెరుగుతుంది. అలాగే వికీపీడియాలో ఒక మూల ఎక్కడైనా చిన్నదిగా "భారతీయ రైల్వేలు" అని నీలం అక్షరాలతో ఉండి అక్కడ నొక్కగానే భారతీయ రైల్వేలు వ్యాసాలలోనికి తెలిసిన వారు దయచేసి ఆ పనిచేయగలరు. JVRKPRASAD (చర్చ) 07:33, 11 ఏప్రిల్ 2016 (UTC)

@ JVRKPRASAD గారికి, స్మార్ట్ ఫోన్ విప్లవం ద్వారా తెలుగు చూపించగలిగిన , సులభంగా టైపు చేయగలగటం సర్వసాధారణమైంది. కాబట్టి మీరు ప్రత్యేకంగా చేయవలసినదేమిలేదు. కావాలంటే మీ సామాజిక మాధ్యమాలలోకొంత ప్రచారం కల్పించితే సరి. ఇక మీరు చేపట్టిన ప్రాజెక్టు పరిధి చాలా విస్తృతము, వికీపీడియా మూల సూత్రాలని(టెలిఫోన్ డైరెక్టరీ లా, రైల్వే డైరెక్టరీ కాదు) దాటిపోతున్నది. ఆంగ్ల వికీపీడియాలో రైల్వే వ్యాసాలు (ఉదాహరణ) ఎలా రాశారో చూసి ఆవిధంగా చేస్తే మీ కృషి పదికాలాలపాటు నిలవడము, మరింత ఉపయోగకరం అవుతుంది. --అర్జున (చర్చ) 01:09, 13 ఏప్రిల్ 2016 (UTC)
అర్జున గారు, నమస్కారము. ముందుగా మీ స్పందనకు ధన్యవాదములు. నేను అడిగినది గూగుల్ నందు :వర్గం:భారతీయ రైల్వేలు కూడా వచ్చే విధంగా ఎలా చేయాలో తెలుపగలరు. ఉదా: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు, అనువాద వ్యాసాలు, వంటివి విధంగా [1] వీలయితే చేయగలరు. తదుపరి మీరన్నట్లు టెలిఫోన్ డైరెక్టరీ లా, రైల్వే డైరెక్టరీగా కాకుండా మరికొంత సమాచారము చేర్చగలను. ఆంగ్ల వికీపీడియాలో రైల్వే వ్యాసాలు కృషి కూడా చాలా చేయవలసి ఉన్నది. నాకుగా నేను చేస్తున్న పని కాబట్టి ఇక్కడ చాలా కాలం తప్పకుండా పడుతుంది. వికీపీడియా మూల సూత్రాలని దాటిపోతున్నది అని మీ వ్యాఖ్యానము నాకు అర్థం కాలేదు, వివరించగలరు. వ్యాసాలు అనేవి మొలక స్థాయిని దాటి ఉంటే సరిపోతుందని చాలాకాలం నుండి చర్చల ద్వారా నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న వ్యాసాలలో అధిక భాగంలో మరింత సమాచారము తప్పకుండా చేర్చుతాను. మీరు మరికొంత కాలానికి తప్పకుండా అభివృద్ధిని ఈ వర్గంలో చూడగలరు. ఈ మధ్యనెలల కాలంలో ఇంట్లో అందరూ విదేశాల మరియు ఉత్తర భారతదేశ యాత్రలు, ఆనారోగ్యాలు, తదిరాల వ్యక్తిగత పనుల వలన నాకు సమయము పెద్దగా ఇక్కడ ఉండేందుకు దొరకలేదు. ప్రస్తుతము నేను మా కాలనీ సొసైటీ ఉచిత సేవా బాధ్యతా పనులలో కొంచం కూడా విరామము లేకుండా కాస్త ఎక్కువ పనులలో కాలం గడుపుతున్నాను. ఒకదారికి వచ్చిన పిదప ఏ మాత్రం కొద్దిపాటి సమయము దొరికిననూ ఇక్కడ మరికొంత అభివృద్ధి చేస్తాను. JVRKPRASAD (చర్చ) 02:10, 13 ఏప్రిల్ 2016 (UTC)
JVRKPRASAD గారికి, మీ ప్రశ్న వివరించినందులకు ధన్యవాదాలు. నెట్లో ఏ పేజీ యైనా గూగుల్ ఫలితాలలో మొదట స్థానాలలో కనిపించాలంటే ఆ పేజీకి వేరే పేజీలనుండి లింకులస్థాయి ఎక్కువవుండాలి. భారతీయ రైల్వేల వర్గం లింకులు, ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల వర్గం లింకులు కన్నా ఎక్కువే వున్నాయి. అయితే భారతీయ రైల్వేల గురించి జాలంలో ఇంకా బహుశా మెరుగైన పేజీలు వుండడం వలన లేక వర్గం కేవలం లింకులు కాబట్టి దాని ప్రాధాన్యతని గూగుల్ తగ్గించడం వలన ఈ వర్గం పేజీ స్థాయి గూగుల్ లో క్రిందికి చేరవచ్చు. అయితే భారతీయ రైల్వేలు వికీపీడియా వ్యాసం మొదటిదిగా కనబడుతుంది. ఆ తరువాత వీక్షకులు వర్గానికి చేరే అవకాశం వున్నందున మీరు ప్రత్యేకించి ఏమి చేయనవసరము లేదు. ఇక మీ ప్రాజెక్టు వికీమూలసూత్రాల పరిధి దాటిపోతుందనటానికి వివరణ, ప్రతి ప్యాసెంజరు రైలుకి ఒకపేజీ పెడితే అది విజ్ఞాన సర్వస్వ వ్యాసం అవదు. రైల్వే సమాచార మార్గదర్శిని అ‌వుతుంది. ప్రాధాన్యత వున్న రైళ్లకిఉదాహరణకి [[2]] లాంటివాటికి మాత్రమే చాలా పరిమితంగా వ్యాసాలు రాస్తే మంచిది.--అర్జున (చర్చ) 23:58, 13 ఏప్రిల్ 2016 (UTC)
అర్జున గారికి, నమస్కారము. మీ వివరణకు ధన్యవాదములు. ఆంధ్ర_ప్రదేశ్_జిల్లాలు, గ్రామాలు వాటిలో ప్రతిదానికి ఒక పేజీ ఉంది మరియు అధిక భాగం వాటికి ఏ మాత్రము చెప్పుకోదగ్గ సమాచారము కూడా లేదు. మరి ఈ వర్గం కూడా ఆంధ్ర_ప్రదేశ్ సమాచార మార్గదర్శిని అవుతుంది కదా ! మీరన్నట్లు, సూచించినట్లుగా ప్రాధాన్యత ఉన్న ఊర్లకు మాత్రమే పేజీలు ఉంటే సరిపోతుంది కదా ! సమాచారం ఉన్న వాటికి మాత్రమే ప్రతి వర్గంలో చాలా పరిమితంగా వ్యాసాలు రాస్తే మంచిది కదా ! ప్రతి గ్రామానికి, సినిమాకి, మనిషికి, ఒకపేజీ వ్యాసం పేరు పెడితే అది విజ్ఞాన సర్వస్వ ఎలా అవుతుందండీ ? పరిమితంగా వ్యాసాలు వ్రాయమనడం వికీ సూత్రాలకు విరుద్ధం కాదా ? మీరు సూచించినట్లు ఏదో ఒక రైలు గురించి వ్రాసి ఊరుకుంటే సరిపోతుందంటారా ? ఒక్కొక్క వికీలో లక్షల్లో వ్యాసాలు ఎలా పుట్టుకొచ్చాయంటారు ? మీ ఆలోచనా కోణం "సమాచార మార్గదర్శిని". నా దృష్టిలో "సమగ్ర వ్యాసదర్శిని". మరి మిగతా వర్గాలలో (ఉదా: సినిమాలు వర్గం, ప్రతి ప్రాజెక్టు కూడా ..) ఒకే విధంగా మీ విధానం పాటిస్తే మంచిది అని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 00:17, 14 ఏప్రిల్ 2016 (UTC)

──────────────────────────────────────────────────────────────────────────────────────────────────── JVRKPRASAD గారికి, వికీపీడియన్లలో పరిమితంగా వ్యాసాలుండాలనే వారు, అపరిమితంగా వ్యాసం వుండవచ్చనే వారు వుంటారు. నా గత చర్చాపేజీల వ్యాఖ్యలు చూస్తే నేను మీకు మొదటి గుంపులోకి చేరినట్లు మీకు తెలుస్తుంది. అయితే ఈ వాదాలకి సందర్భాన్ని బట్టి సముదాయ నిర్ణయం జరుగుతుంది. ఇప్పటికే గ్రామాల గురించి చాలా చర్చలు జరిగి వాటి ప్రాధాన్యత దృష్ట్యా వ్యాసాలు వుండవచ్చనే నిర్ణయం తెలుగు వికీ విధానమైనదని గత చర్చలు చూస్తే తెలుస్తుంది. ఇక సినిమాల గురించి నేను అంతగా చర్చలలో పాల్గొనలేదు. వెతకలేదు. కాకపోతే ఆంగ్ల వికీపీడియా లాంటి ప్రముఖ వికీపీడియాలలో చాలా చర్చలనంతరం విధానాలు ఏర్పడతాయి కాబట్టి, ఆంగ్ల వికీపీడియాలోని విధానాలను, చిన్ని వికీపీడియాలైన తెలుగు లాంటివి స్వీకరించి పాటించడం మంచిది. సినిమాల వ్యాసాలు ఆ పద్ధతిలో తయారైనవి అని అనుకుంటాను. ఇక ప్రతిరైలుకు ఒక వ్యాసం వుండటం సరియా కాదా అనే దానిగురించి అటువంటి వ్యాసం నాణ్యమైన వ్యాసం కాగలదా అనే కోణంలా ఆలోచించితే సమాధానం దొరకవచ్చు. s:పుట:Welcome to Wikipedia brochure EN, for print.pdf/15 ప్రకారం ఒక మంచి వ్యాసానికి

 • వ్యాసం సంగ్రహరూపం
 • విషయం ప్రాధాన్యం తెలిపే కారణాలు
 • విషయానికి సంబంధించి ప్రామాణికమైన మూలాలు

కావాలి. ఉదాహరణగా కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (నేటి రూపం) తీసుకొని పై మార్గదర్శకాలను ఎంతవరకు పాటిస్తున్నదో పరిశీలిద్దాం. వ్యాసం సంగ్రహరూపం వ్యాసపేరుకి పెద్దతేడాలేదు. విషయం ప్రాధాన్యం తెలిపే కారణాలు ఏమి తెలియుటలేదు. ఇక మూలాలు చూస్తే ఒక గుర్తించబడని సముదాయం నడుపుతున్న వెబ్సైట్. దీనివలన ఆ మూలపు లింకులకి ప్రాధాన్యత, ఆ వెబ్సైట్ కి ప్రాచుర్యం కలగటం( ఇంకొక కోణంలో చూస్తే స్పాము లింకు) తప్ప చదువరికి ఏమంత విజ్ఞానం కలిగించేదిగా లేదు. వీటిని సమగ్ర వ్యాసంగా ఎలా చేయవచ్చో నాకైతే అర్ధంకావటంలేదు. మీరు ఇటువంటి దానిని నాణ్యమైన వ్యాసంగా వృద్ధిచేయగలిగితే మరల మనం ఇటువంటి వ్యాసాల గురించి చర్చించవచ్చు. ఇలా అభివృద్ధికి అవకాశం లేని వ్యాసాలను ప్రత్యేక వ్యాసంగా కాక, ఒక జాబితా పేజీలో చేర్చి వుంచితే వాటిలో నిజంగా ప్రాధాన్యతగల వ్యాసానికి ప్రత్యేకపేజీ రూపుదిద్దితే ఆ పని విజ్ఞానసర్వస్వ మూలసూత్రాలని పాటించినదవుతుందని నా అభిప్రాయం. మీరు వయస్సులోను, విజ్ఞానంలో నాలాంటి సభ్యులకంటే పెద్దవారు. కొత్త కొత్త వ్యాసాలను , ఉపకరణాలను వాడే ఉత్సుకత గలవారు. నేను అంతగా చదవలేదు కాని, మీరు కృషి చేసిన రైళ్లు పేరులు కాని వ్యాసాల మెరుగైన నాణ్యతకలిగినవిగా వుంటున్నాయనిపించింది. మీరు ఆంగ్ల వికీపీడియాలో కూడా మరింత కృషి చేసి లేక తెలుసుకొని, తద్వారా తెలుగు వికీపీడియా అభివృద్ధికి కొత్త చర్యలు చేపడితే బాగుంటుందని నా అభిప్రాయం. పై వ్యాఖ్యలు కొంత కరుకుగా వుంటే మన్నించండి. ఆంగ్లవికీలో ఇలాంటి వ్యాసాలే విరివిగా వున్నట్లైతే తెలియచేయండి. --అర్జున (చర్చ) 12:27, 19 ఏప్రిల్ 2016 (UTC)

అర్జున గారు, నేను ఆడిగిన సహాయం వేరు, మీరు చెబుతున్నది వేరు. ఆంగ్లము నుండి మక్కీకి మక్కీగా సలహాలు, సూచనలు, తదితర మైనవి లాంటివి తీసుకోవాలి అని మీ అభిప్రాయము కావచ్చును. మీలాంటి వాళ్ళు వ్యాసాలు వ్రాయటము గురించి చెబుతారు కానీ వ్రాయరు. వ్రాసే వాళ్ళని వ్రాయనివ్వరు ఎవో నియమాలు చెప్పి ఎత్తి చూపిస్తూ ఉంటారు. మీలాంటి వారి దాష్టీకానికి నేను తలవొగ్గను. నేను వ్రాసేది వ్రాస్తునే ఉంటాను. మీరెవరు వ్రాయవద్దు అని చెప్పటానికి ? ప్రతి వ్యాసం అభివృద్ధి చేయవచ్చును. జన్మకో శివరాత్రి అన్నట్లు ఎవరో ఎప్పుడో ఒకసారి వస్తారు, ఏదో రాస్తూ.... మా లాంటి వాళ్ళ బుర్రలు చెడగొడతారు. ఈ మధ్యన ఎప్పుడో వచ్చే (మీలాంటి) వారితో పనికిరాని చర్చల వలన నా పని పూర్తిగా ఆగిపోయింది. మీకు నచ్చినట్లుగా ఎవడూ ఇక్కడ వ్రాయడు. ఆంగ్ల వికీలో వ్యాసాలు ఏమంత గొప్పగా ఉన్నాయి అని మీరు మెచ్చుకుంటున్నారు ? అక్కడ చాలా చెత్త ఉంది. కొన్ని మూలాలు కూడా ఆంగ్ల వికీ చెత్తలోనిది అని గమనించండి. మీరు వ్రాసిన దాంట్లో ఉన్న వాక్యాలు మరియు అర్థాలు నాకు ఏమాత్రము అర్థం కాలేదు. అర్థమయిన వారు ఎవరైనా ఉంటే వారితో కూడా ఇక్కడ వివరంగా వ్రాయించండి. మీకు అమరావతిలో ఐమాక్స్ కావాలంటే అప్పుడే రాదు. నా వ్యాసాలకు కూడా చాలా కాలం పడుతుంది. ఇందులో జనాలకు వచ్చిన నొప్పి ఏమిటో నాకు అస్సలు అర్థం కావడము లేదు. మీకు చేతనయితే అక్కడ ఆంగ్ల వికీ వాళ్ళకి మీ సలహాలు ఇవ్వండి. ఇక్కడ చాలా చిన్న బుర్రలు ఉన్నవాళ్ళము పనిచేస్తున్నాము. మీ సాంకేతిక సలహాలు అర్థం చేసుకునే నైపుణ్యం నాకు మాత్రం లేదు. వ్యాసాలు అభివృద్ధి మీకు చేయటము చాతకాకపోతే ఎవరికీ చేతకాదు అని మీరు మాట్లాడము కేవలం మీ అవివేకం. ఒక వ్యాసాన్ని పైన ఉదా: గా చూపించారు, నేను ఇప్పుడు దానిని ఎలా అభివృద్ధి చేయవచ్చునో వ్రాసి మీకు చూపించమంటారా ? మూలాలు ఒక వ్యాసంలో సగం వరకు చేర్చమంటారా ? చాలా వ్యాసాలకు కేవలం నామకరణం చేశాను. వాటిని పట్టుకొని పీకితే ఏముంటుంది. నేను వ్రాసిన రైల్వేలలోని పెద్ద వ్యాసాలు చదవండి. నాకు ఎందుకండి ఇటువంటి పాఠాలు మీరు చెబుతారు ? చేతనయితే చేసే పనికి మాట సలహా సహాయం చేయండి. మన చర్చలు వేరు, వ్యక్తి గతం వేరు. మీ మీద నాకు మనసులో ఎటువంటి మానసికంగా వ్యతిరేక భావం లేదు, కేవలం గౌరవం మాత్రమే ఉంది. నా పని ఇంకా కేవలం మొలక దశలో (పునాది దశలో) మాత్రమే ఉంది. నా ఈ రైల్వే వ్యాసాలు మీరనుకున్నట్లుగా రూపాంతరము చెందాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు వ్రాస్తునే ఉంటాను. మీ మరియు నా జీవిత కాలంలో అవి ఒక దారికి వస్తే సంతోషిద్దాము. JVRKPRASAD (చర్చ) 12:54, 19 ఏప్రిల్ 2016 (UTC)
వికీ సముదాయంలో ఎవరు ఎవరినైనా ఎత్తి చూపవచ్చు. తప్పులేదు. కానీ అందుకు సమాధానంగా అర్థవంతమైన చర్చ జరగాలే గానీ వ్యక్తిగత దూషణలకు దిగరాదు. జన్మకో శివరాత్రి అన్నట్లు ఎవరో ఎప్పుడో ఒకసారి వస్తారు, ఏదో రాస్తూ.... మా లాంటి వాళ్ళ బుర్రలు చెడగొడతారు. ఇది కేవలం వ్యకిగత దూషణ. ఇది మంచి పద్ధతి కాదు. వికీలో ఎవరైనా ఎప్పుడైనా పనిచేసుకునే స్వేచ్ఛ ఉంది. పనికిరాని చర్చల వలన అంటున్నారంటే మీకు ఇతర సభ్యుల మీద గౌరవం లేదు అనిపిస్తుంది. --రవిచంద్ర (చర్చ) 02:40, 20 ఏప్రిల్ 2016 (UTC)
ఏమిటీ మీరు ఎత్తి చూపేది ? పిచ్చిరాతలు వ్రాసి వ్యక్తిగత దూషణ అంటే ఎలా ? అవును. జన్మకో శివరాత్రి అన్నట్లు ఎవరో ఎప్పుడో ఒకసారి వస్తారు, ఏదో రాస్తూ ఉంటే రోజూ గంటల తరబడి [3] పనిచేస్తున్న వారిని మానసిక ఇబ్బంది పెట్టడం మంచి పద్దతా ? నన్ను మరియు నా పనిని కెలికితే బూతులు తిడతాను. నా పద్దతి అంతే. నన్ను ఎందుకు కెలుక్కోవడం. అమాంబాపతు వాళ్ళకు మరీ అంత గౌరవం అవసరము లేదు. ఎవడి పద్దతి వాడిది. నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో ఒకరితో చెప్పించుకోనవసరము లేదు. ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళ గురించి ఏక వచనంలో వ్యాసాలు వ్రాస్తారు.. మనమెంత ? హద్దులు దాటి నాతో సొంత ఆలోచనా పిచ్చి చర్చలు చేస్తే సహించను, భరించను. ఎలాంటి వారి నయినా వెధవలుగానే చూస్తాను. నాతో వాదనలు ఎవరూ దిగవద్దు. మీ మీ గౌరవం, అభిమానాలు చెడగొట్టుకోవద్దు. రవిచంద్ర గారు, మీకు ఏమి తెలుసు అని ఇలా వ్రాసారు ? మీతో చెప్పించుకునే స్థితిలో, అటువంటి పరిస్థితులలో నేను లేను అని గమనించగలరు. ఇలాంటి వ్రాతలు నాకు వ్రాయవద్దు. ఎవరికైనా వ్రాసుకుంటే మంచిది. JVRKPRASAD (చర్చ) 03:47, 20 ఏప్రిల్ 2016 (UTC)
నేను మర్యాదగా మాట్లాడి నా గౌరవం కాపాడుకున్నాను. మీరే వెధవలు లాంటి పదాలు వాడి పలుచన అయ్యారు. బూతులు తిడతారని మీ ఒప్పుకున్నారు. మీ లాంటి వారితో చర్చ చెయ్యలేను. నా మానాన నన్ను వదిలెయ్యండి. --రవిచంద్ర (చర్చ) 04:45, 20 ఏప్రిల్ 2016 (UTC)
మర్యాదగా మాట్లాడితే మర్యాద ఉంటుంది. అవును మరి, ఏ వెధవలతో అయినా లేదా బూతులు మాట్లాడే వారితో అయినా సరే, అటువంటి వారితో వారి పద్ధతిలోనే నేను మాట్లాడతాను. మీలాంటి వారికి నేను పలుచన అయ్యాను అనిపిస్తుంది, నాకు చెత్త వెధవలతో ఏనాటి నుంచో మాట్లాడుతున్నాను. నాకు ప్రత్యేకంగా పోయింది లేదు, ఇప్పుడు ఈ చిన్న విషయానికి అంతకన్నా నా మర్యాద ఊడింది లేదు. అసలు విషయాలు ఏమీ తెలియకుండా ఏదో ఉద్దరించడానికి అంటూ చర్చలు వ్రాయడానికి చాలామంది బయలుదేరుతారు. పైన నేను అడిగింది ఏమిటి ? చేస్తున్న చర్చలు ఏమిటి ? JVRKPRASAD (చర్చ) 05:11, 20 ఏప్రిల్ 2016 (UTC)
అర్జున గారు, మీరు ఎత్తి చూపిన వ్యాసం అభివృద్ధి చేశాను. మీకు పైన సమాధానం వ్రాశాను. మీకు భజన చేసే ఆ కాలం నాటి మీ స్నేహితుడు నాకు ఏదో హితబోధ మొదలు పెట్టడం జరిగింది. వ్యాసం గురించి ఇప్పుడు మీ సమాధానం ఏమిటి ? JVRKPRASAD (చర్చ) 03:54, 20 ఏప్రిల్ 2016 (UTC)
చర్చ దారితప్పింది. మనం మనం దూషించుకొనే స్థాయికి వెళుతుంది. ప్రసాద్ గారు, మీరు ఇప్పుడు అభివృద్ధి చేసిన వ్యాసాలు లాంటికి రోజుకు ఒకటి అయినే తయారుచేయండి. వికీ సభ్యులందరూ సంతోషిస్తారు; చదివేవారికి కూడా ఉపయోగపడతాయి. మీరేమిటో, ఎలాంటి మంచిమంచి వ్యాసాలు తయారుచేయగలరో చూపించండి. మీరు తయారుచేస్తున్న చాలా వ్యాసాలు ప్రస్తుతం ఉన్న స్థితిలో అంత ఉపయోగపడేవి కావు. గమనించండి.--Rajasekhar1961 (చర్చ) 05:50, 20 ఏప్రిల్ 2016 (UTC)
Rajasekhar1961 గారు, నమస్కారము. మీరు చెప్పినది నిజం. చర్చ దారిలో లేదు. నేను అందరిలా కాకుండా నా ధోరణిలో నేను నా వ్యాసాలు అభివృద్ధి చేస్తున్నాను. అనవసరంగా ఏమీ తెలియకుండా నాకు అనవసర అడ్డంకులు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా వ్యాసాలు ఒక దారిన పడేవి, కాస్త కుంటు పడుతున్నాయి. కొంతమంది ఉత్సాహం కలిగించక పోగా నిరుత్సాహ ప్రోత్సాహంతో మనసు కకావికలం చేస్తున్నారు. నాకు వరుస పని తప్పిపోతే తిరిగి ఒక గాటన తెచ్చుకొని అన్నీ గుర్తుకు తెచ్చుకోవాలంటే కాస్త కష్టంగా ఉంటోంది. నాకు ఎవరినీ ఇబ్బంది పెట్టాలని ఉండదు. చర్చలు అర్థవంతముగా చేస్తూ మాట సహాయము చేస్తే చాలా సంతోషము కలుగుతుంది. కనీసం పదాల మాటలతో కాస్త కరుకుగా అయినా చెబితే అనవసర చర్చలు ఆగి, నా పని నేను చేసుకునేందుకు సమయ అవకాశము వస్తుందని అలా వ్రాస్తాను. నాకు ఎంతో పని ఉన్నది, చేయాలని ఉన్నది. అందుకు అన్నీ సహకరించాలి. ఏమాత్రం ఇబ్బంది కలిగినా కొంతకాలము నిరుత్సాహంతో స్తబ్దతగా ఉండిపోవాల్సి వస్తోంది. నేను మీ సలహా సూచనల ప్రకారం ప్రస్తుత ఉన్న స్థితి నుండి మరిన్ని వ్యాసాలు త్వరలో అభివృద్ధి చేస్తాను. దయచేసి నాకు ఎవరూ నిరుత్సాహ పరిచే అడ్డంకులు సృష్టించ వద్దని సూచిస్తూ తెలియజేయగలరు. మీ స్పందనలకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 06:24, 20 ఏప్రిల్ 2016 (UTC)

──────────────────────────────────────────────────────────────────────────────────────────────────── JVRKPRASAD గారికి, మీ స్పందన నా మనస్సుని నొప్పించింది. విషయానికి నేను స్పందించాను. దానికి మీరు అంగీకరించాలనే వత్తిడి ఏమీలేదు. మీరే పొరబాటుగా అలా ఊహించుకొని స్పందించినట్లు వుంది. ఇంతకు ముందు కొన్ని చర్చలలో కూడా మీరు వాడే భాష ఇతరులను నొప్పించేదిగా వుండవచ్చని నేను ఇతర సభ్యులు తెలపటం జరిగింది. నిర్వాహకులుగా వున్న మిమ్ములను అందరు ఆదర్శంగా భావిస్తారు కాబట్టి, మీ స్పందనలలో సంయమనం పాటించమని కోరుతున్నాను. మరింత సమాచారానికి వికీపీడియా:వికీ సాంప్రదాయం చూడండి. నా సూచన మీకు అర్ధం కాలేదని తెలిపారు కాబట్టి మీరు అభివృద్ధి చేసిన వ్యాసంపై నేను స్పందించటం అంత ఉపయోగమని అనుకోవటంలేదు. చర్చలో పాల్గొన్న రవిచంద్ర, Rajasekhar1961 గార్లకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 05:14, 24 ఏప్రిల్ 2016 (UTC)

 •  :అర్జున గారికి, మీ స్పందనకు కూడా నా మనసు బాధపడుతోంది.
 • నేను అడిగిన విషయానికి మీకు ధన్యవాదములు తెలియజేసాను.
 • అంగీకరించాలనే వత్తిడి గురించి కన్నా ఒక విషయము మరిచారు. మీరు ప్రతిసారి నాకు సరిఅయిన సలహాలు ఇవ్వక, నా పని విషయములలో లోపాలు ఏమీ లేకపాయినా సాంకేతికంగా ఎత్తి చూపుతున్నారు. ప్రతివారు కూడా అదే ధోరణికి అలవాటు చేసుకుంటున్నారు. నేను ఎవరినయినా కోరేది ప్రోత్సాహం మాత్రమే.
 • నేను పొరబాటుగా ఏమీ ఊహించుకోలేదు. నేను వ్రాసే వాక్యాలు అన్నీ మీ ఒక్కళ్ళకే చెందినవి అని మీరు ఎప్పుడూ ఊహించుకుంటూ ఉంటారు. నేను ఎవరికి ఏమి వ్రాశినా అందులో అందరికీ సంబంధించినవి కూడా ఉంటాయి. ఆ వాక్యాలు చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి.
 • సంయమనం పాటించమని మీరు చెప్పక పోయినా ఎప్పుడూ అలాగే ఉంటాను. కానీ సందర్భాన్ని బట్టి స్పందనలు ఉంటాయి. ఈ విషయం గత కొన్ని సంవత్సరాల కాలం నుండి ఎన్నో సందర్భాలలో చాలా సార్లు చాలా మందికి తెలియజేశాను.
 • నాకు సంప్రదాయము గురించి ఎందుకు ? తెలుగు సంప్రదాయములు విడిగా వ్రాసుకోవాలి.
 • సూచన అర్థం కాలేదని అడిగితే తెలియజెప్పకపోవడం ఇదేమి సంప్రదాయం. పైగా ఒక వ్యాసాన్ని ఎత్తి చూపితే, దాన్ని వెంటనే నేను వ్రాసి చూపితే ఇప్పుడు స్పందించటం అంత ఉపయోగమని అనుకోవటంలేదు అంటారా ? ఇది ఏం సంప్రదాయమండి ?
 • నిర్వాహకులు ఆందరూ మీలాగా ఉండాలంటారా ? ఎవరి పద్ధతి వారి కుంటుంది. నన్ను పిచ్చి రాతలతో, సలహాలతో, సూచనలు కాకుండా బొక్కలు వెతికడం, మానసిక హింస, కెలకడం ఇలాంటివి ఎవరైనా ఎందుకు అవతలి వారు చేస్తూ ఉంటారు ? నేను సముదాయముగా కఠిన మాటలు చొప్పిస్తేనే మీకు చాలా నొప్పి వచ్చింది కదండి ! మరి, అలాంటి నొప్పి నాకు ఉండ కూడ దంటారా ? నా మనస్థత్వం, వాడే భాష ఇతరులను నొప్పించేదిగా వుండవచ్చని ఇతర సభ్యులకు తెలుపుటకు మీరు ఎవరు ? మీ గురించి ఇంత వరకు సరిగానే చెప్పాను. మీ గురించి బాగా చాలా చండాలంగా ప్రచారం చేయగలను. ఒకరిని గురించి చెప్పేటప్పుడు కాస్త బుర్ర పెట్టి స్థిమితంగా ఆలోచించండి. నేను ఎవరితో చర్చలలో పరుషంగా మాట్లాడానో వాళ్ళు ఎవరో తెలిపితే వాళ్ళతో ఎందుకు మాట్లాడ వలసి వచ్చిందో చెప్తాను. మీ క్రింద పని చేసే నౌకరులా అనవసరముగా నాతో చర్చించకండి. పని చేయటం చేతకాని వాళ్ళు అందరూ ఎదుటి పడి ఏడుస్తూ ఉంటారు. ఆ జాబితాలోకి మీరు కూడా చేరకండి. మీ దగ్గర సమాధానము లేదు.
 • మీరు వికీపీడియా:వికీ సాంప్రదాయం కూడా తిరిగి చదవండి. మీకు చాలా విషయాలు వర్తిస్తాయి. మంచి వాళ్ళతో సంయమనము పాటించండి. చెడ్డ వాళ్ళని దూరంగా ఉంచండి.
 • మీరు నాకు మంచి సలహాలు, సూచనలు వంటివి ఇస్తే వింటాను.
 • మీరు అధికారులు అయి ఉండి మాకు ఏ విధంగా అందుబాటులో ఉపయోగంగా ఉన్నారో కాస్త తెలియజేయండి.
 • మీరు ఎక్కువ నేను తక్కువ అని దయచేసి భావించకండి. మీరు నాకు అర్థం కారు, నేను మీకు అర్థం కాను. ఇంక శెలవు. JVRKPRASAD (చర్చ) 08:13, 24 ఏప్రిల్ 2016 (UTC)
JVRKPRASAD గారు ఎవరైనా ఏదైనా చెపితే నాకెందుకు చెపుతున్నారు అని వాళ్ళకు బదులివ్వడంలో అసహనం వ్యక్తం చేయడం ఎందుకు. ఎందుకు చెపుతున్నారో ఒకసారి గ్రహించి వారి సలహాలు స్వీకరించడం వికీనియమం. దానిని వదిలి ఇక్కడ కాకపోతే మరోచోట అనుకోవడం అంత మంచిది కాదు. ఆ మరోచోటా ఇలానే ఉంటుంది. రాజీ ఎక్కడైనా అవసరమే. ఎవరు చెప్పినా వారి స్వార్ధం కోసమో స్వలాభం కోసమో కాదు. ఎవరూ ఇక్కడ రోజూ పనిచేస్తామని అగ్రిమెంట్ రాయలేదు. వాళ్ళిస్టం, ఎప్పుడైనా వస్తారు ఏదైనా రాస్తారు. ఇంతకాలం రాయలేదు కాబట్టీ నువ్వెవరు అనే అధికారం ఎవ్వరికీ లేదు,ఉండదు. మీరు పెద్దవారు అయినా లేదా వయసు బట్టి అయినా ఎక్కువగా రాస్తున్నారనో ఇక్కడ హెచ్చుతగ్గులు ఉండవు. ఒక్క మార్పు చేసిన వాళ్ళకూ లక్ష మార్పులు చేసినవాళ్ళకూ అదే అధికారం ఉంది. మీ రైల్వే మార్పుల వలన ఎందరో తీవ్ర అహనం వ్యక్తం చెస్తున్నారు. మీరే గనక వికీసోర్స్ మార్పులు చేయతలపెడితే అద్భుతంగా ఉంటుంది. దయచేసి గ్రహించండి. దీనిపై నేను చర్చలు చేయను. మీ విజ్నత, మీ వయసు బట్టి మీరే నిర్ణయిచుకోవాలి....--Viswanadh (చర్చ) 12:28, 24 ఏప్రిల్ 2016 (UTC)

(1) మీ వాక్యం: ఎవరైనా ఏదైనా చెపితే నాకెందుకు చెపుతున్నారు అని వాళ్ళకు బదులివ్వడంలో అసహనం వ్యక్తం చేయడం ఎందుకు. ఎందుకు చెపుతున్నారో ఒకసారి గ్రహించి వారి సలహాలు స్వీకరించడం వికీనియమం.

  • జవాబు: నాకు అసహనం లేదు. ఎవరైనా ఏం సలహాలు, సూచనలు చేశారో సూటిగా మీకు అర్థమయినది చెప్పండి. ఎవరైనా పేరాలు పేరాలు వ్రాస్తారు, అందులో ఏముందో ఒకసారి చదివి మీరు నాకు ఎటువంటి సలహాలు ఇచ్చారో చెప్పండి ?

(2) మీ వాక్యం: ఇక్కడ కాకపోతే మరోచోట అనుకోవడం అంత మంచిది కాదు. ఆ మరోచోటా ఇలానే ఉంటుంది.

  • జవాబు: నాకు ఎక్కడా కూడా వ్యతిరేక ధోరణి లేదా ఇక్కడ వాళ్ళ కొందరిలా ఉపయోగపడని చర్చలు లేవు. మీరనుకున్నట్లు, ఊహించినట్లు అయితే నిజ జీవితంలో కూడా సమస్యలు సుడిగుండాలుండేవి. నాకు అటువంటివి లేవు. తదుపరి మీకు తెలుసో లేదో, ఒకనాడు అర్జున గారు, రాజశేఖర్ గారు, మరికొంత మంది కొత్త ఆలోచన మార్పులు చేపట్టేందుకు వికీలో వేలు పెట్టడానికి భయపడేవారనేది వాస్తవం. వ్యక్తిగతంగా రోజులు తరబడి చర్చలు చేసుకునే వాళ్ళము. ఆ నాడు మరి నేను మంచి పనులు కోసం మరింత ఉత్సాహం ఇచ్చి నేను ఉన్నాను అని అందరినీ ప్రోత్సహించే వాడిని. ఆ రోజులు మరచిపోతే ఏం చెప్తాం ? మరి ఆనాడు నేను నా పద్ధతి బావుండి ఇప్పుడు ఎందుకు బావుండ లేదు. కేవలం వ్యక్తిగత స్వార్థమా ?

(3) మీ వాక్యం: ఎవరు చెప్పినా వారి స్వార్ధం కోసమో స్వలాభం కోసమో కాదు. ఎవరూ ఇక్కడ రోజూ పనిచేస్తామని అగ్రిమెంట్ రాయలేదు. వాళ్ళిస్టం, ఎప్పుడైనా వస్తారు ఏదైనా రాస్తారు. ఇంతకాలం రాయలేదు కాబట్టీ నువ్వెవరు అనే అధికారం ఎవ్వరికీ లేదు,ఉండదు.

  • జవాబు: నేను పని చేసిది కూడా స్వార్ధం కోసమో స్వలాభం కోసమో కాదు అని చెప్పేవాళ్ళు గ్రహించాలి. మూలాలు సరిఅయినవి కావు. స్పాములు అని ఏవో సాంకేతికంగా నన్ను ఇబ్బంది పెట్టడము, నన్ను అన్నవి కాదా ? ఇక్కడ రోజూ పనిచేస్తామని అగ్రిమెంట్ ఎవరూ కూడా రాయలేదు. కానీ రోజులో ఎక్కువగా ఉన్న వాళ్ళకి, వికీతో మరియు వాడుకరులతో మార్పుల చేర్పుల అవగాహన ఉన్నవారికి వాస్తవ విషయాలు అర్థం అవుతాయి. ఎప్పుడైనా వస్తారు, ఏదైనా రాస్తారు, ఎవరు ఇష్టం వాళ్ళది అని అంటూనే నా దగ్గర వచ్చే సరికి ఈ సూత్రం వర్తించదా ? అధికారం ఎవ్వరికీ లేదు,ఉండదు అంటూనే నన్ను వ్రాయవద్దు అనే అధికారం నాకు సలహాలు ఇచ్చేవారికే ఉందా ? నేను ఎవరినీ నువ్వు ఎవరూ అని పాత వారిని సంబోధించలేదు. ఆ పదాన్ని వెనుకకు తీసుకోవటం మంచిది.

(4) మీ వాక్యం: ఒక్క మార్పు చేసిన వాళ్ళకూ లక్ష మార్పులు చేసినవాళ్ళకూ అదే అధికారం ఉంది.

  • జవాబు: ఇల్లాంటి వాక్యాలు మీతో చెప్పించుకునే స్థితి పరిస్థితిలో నేను ఉన్నానా ? ఒకసారి ఆలోచించి చెబితే బావుంటుంది.

(5) మీ వాక్యం: మీ రైల్వే మార్పుల వలన ఎందరో తీవ్ర అహనం వ్యక్తం చెస్తున్నారు.

  • జవాబు: మీ వాక్యాల్లో ముఖ్యమైనది ఇది మాత్రమే. రైల్వే మార్పుల వలన ఎందరో తీవ్ర అహనం వ్యక్తం చేస్తున్నారు. చేతకాని వాళ్ళు ఎవరైనా ఉంటే అలా కూడా మాట్లాడతారు. దీని గురించి చర్చలు చేయండి. సలహాలు, సూచనలు సవ్యంగా ఇవ్వండి. నిజంగా ఆ అసహనాలు ఏమిటో త్వరలో ఇప్పుడే తెలిసిన వివరాలు వెంటనే తెలియజేయండి. వాటిని నివృత్తి చేస్తాను. చివరగా, కుదరకపోతే వ్యాసాలు అన్నీ నేనే తొలగిస్తాను. ఇంతకంటే ఏం చెప్పాలి ?

(5) మీ వాక్యం: దీనిపై నేను చర్చలు చేయను.

  • జవాబు: వ్రాసినదంతా వ్రాసి చర్చలు చేయను అని అంటే ఎలాగండీ ? ప్రతి వాళ్ళ జీవితం, వ్యక్తిత్వంలో మాటలతో మారిపోతుందని నేను అనుకోను. ఎవరి పద్దతి జీవితం వారిది. నేను ఎవరికీ భజనలు చేయను. అలాంటి అలవాటు నాకు ఎక్కడా లేదు. నాకు పని చేయడం, చేయించడం మాత్రమే తెలుసును. నేను మాత్రం మనిషి మనిషికి నా పద్దతి మార్చుకోను. చేతనయితే చర్చలు చేయండి. ఊహాగానాలు, భ్రమలు నాకు మాత్రము చెప్పకండి.
    • చివరగా: నాకు ఎవరు, ఎందుకు, ఎలా, ఏం చెబుతున్నారో అర్థం చేసుకోలేని అవివేక మానసిక స్థితితో అయోమయంగా జీవితాన్ని గడిపే రోజులతో అటువంటి పరిస్థితులలో నేను లేనని మాత్రం గ్రహించండి. మీ సలహాలు, సూచనలు, ఇంకా ఏమైనా ఉంటే అన్నింటికీ ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 13:11, 24 ఏప్రిల్ 2016 (UTC)

నా పోస్టింగులు ముద్రణ ఆపారు[మార్చు]

నాకు ఇక్కడ అతి తెలివి తేటలతో ఇబ్బందులు పెడితే మరొక చోటకు పోయి పని చేసుకుంటాను. నాకు వచ్చే నష్టం ఏమీ లేదు అని గ్రహించగలరు. JVRKPRASAD (చర్చ) 15:00, 19 ఏప్రిల్ 2016 (UTC)

మీరు వ్రాసే వ్యాసాలలో మొలకల గురించి అలా జరిగి ఉండవచ్చు బహుశా. వీలైతే ప్రయోగశాలలో పూర్తి పాఠం వ్రాసుకొని తరువాత వ్యాసంగా అంటించుట బావుంటుందేమో. ఒకపరి ఆలోచించగలరు.--Viswanadh (చర్చ) 05:33, 24 ఏప్రిల్ 2016 (UTC)

చీకటి మొలకలు[మార్చు]

నాలాంటి వారు వ్రాసే వ్రాసాలలో అనేక మొలకలు వస్తూ ఉండటం సహజం. ఈ మొలకలు చదువే వారికి కనిపించకుండా చీకటిలో (హైడ్ చేస్తే) ఉంచేస్తే మంచిదని నా భావన. ఆ మొలకలు వ్యాసాలుగా రూపాంతరము చెందితే వాటంతట అవే వెలుగులోకి వచ్చే విధంగా ఒక ప్రొగ్రాం రూపిందించితే చాలా సమస్యలు తీరగలవు. అటువంటి ప్రయత్నము ఏమైనా ఎవరైనా చేయగలిగితే మంచిది. చర్చలు చేయగలవారు చేయవచ్చును. JVRKPRASAD (చర్చ) 05:15, 20 ఏప్రిల్ 2016 (UTC)

The Wikimedia Developer Summit wants you[మార్చు]

The Wikimedia Developer Summit is the annual meeting to push the evolution of MediaWiki and other technologies supporting the Wikimedia movement. The next edition will be held in San Francisco on January 9–11, 2017.

We welcome all Wikimedia technical contributors, third party developers, and users of MediaWiki and the Wikimedia APIs. We specifically want to increase the participation of volunteer developers and other contributors dealing with extensions, apps, tools, bots, gadgets, and templates.

Important deadlines:

 • Monday, October 24: last day to request travel sponsorship. Applying takes less than five minutes.
 • Monday, October 31: last day to propose an activity. Bring the topics you care about!

More information: https://www.mediawiki.org/wiki/Wikimedia_Developer_Summit

Subscribe to weekly updates: https://www.mediawiki.org/wiki/Topic:Td5wfd70vptn8eu4

MKramer (WMF) (talk) 19:07, 14 అక్టోబరు 2016 (UTC)

మొదటి పేజి కి ఈ వారపు బొమ్మా ప్రతిపాదన[మార్చు]

ఆంగ్ల వికి లాగానే తెవికి కి ఈ వారపు బొమ్మా అనె భాగాన్ని చేరిస్తే ఎల ఉంటుంది?. తెవికి లొ మరుగున్న పడ్డ బొమ్మలకు గుర్తింపు మరియు కొత్త బొమ్మలను చేర్చడానికి వాడుకరులు ఉత్సాహం చుపుతారని నా అభిప్రాయం. ధన్యవాదాలు. KingDiggi (చర్చ) 04:27, 7 నవంబర్ 2016 (UTC)