వికీపీడియా:వికీప్రాజెక్టు/అనాథాశ్రమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Wiki letter w.svg వికీప్రాజెక్టు అనాథాశ్రమంకు స్వాగతం!

వికీప్రాజెక్టు అనాథాశ్రమం అనాథ పేజీలను తగ్గించేందుకు అంకితమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు విలువను, ప్రయోజనాన్నీ తక్కువగా అంచనా వెయ్యలేం. ఇది వికీపీడియా నుండి సమాచారాన్ని త్వరగా వెలికితీయడంలో సాయపడుతుంది. కొత్తవారికి వికీ గురించి తెలుసుకోవడంలో అనాథలను తొలగించే పని ఎంతో ఉపయోగపడుతుంది. వికీపీడియాలో నేవిగేషను, లింకులివ్వడం, వగైరాలు త్వరగా నేర్చుకోవచ్చు. అంతేకాదు, వికీపీడియా:నోటబిలిటీ గురించి, తొలగింపుల గురించీ త్వరితంగా అవగాహన వస్తుంది.

లక్ష్యాలు[మార్చు]

అనాథల పేజీలను గుర్తించి, వాటికి తగిన లింకులను ఇచ్చి, వాటిని అనాథల జాబితా నుండి తొలగించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

అనాథ సంస్కరణ సులువైన పనేమీ కాదు. ఎన్ని పేజీలను సంస్కరించామనేది ఎంత ముఖ్యమో, ఆయా పేజీలను ఎలా సంస్కరించామో, ఎలాంటి నాణ్యమైన లింకులను ఇచ్చామో అంతకంటే ముఖ్యం. ఈ ప్రాజెక్టు వ్యాసాలపై మాత్రమే దృష్టి పెడుతుంది., బొమ్మలపై కాదు.

అనాథ పేజీలను సంస్కరించడం ఎలా అనే విషయమై ఈ ప్రాజెక్టు వాడుకరులకు సాయపడూతుంది కూడా.

అనాథలను తొలగించడం ఎలా -సోదాహరణంగా[మార్చు]

అనాథ పేజీలను అనాథల జాబితా నుండి తీసెయ్యడం ఎలానో కింది పద్ధతి వివరిస్తుంది.

 1. ముందు, వర్గం:అన్ని_అనాథ_పేజీలు పేజీకి వెళ్ళండి. అక్కడున్న ఏదో ఒక అనాథ వ్యాసాన్ని తీసుకోండి.
 2. ఉదాహరణకు అంకుల్ టామ్స్ క్యాబిన్ తీసుకోండి. ఆ పేజీని తెరవండి. ఇదొక అనాథ పేజీ. మనం దీనికి సంబంధం ఉండే మరేదైనా పేజీని తెరిచి, ఆ పేజీలో ఇక్కడికి ఒక లింకు ఇస్తే దీన్ని అనాథల జాబితా నుండి తీసెయ్యొచ్చు.
 3. దీనికి సంబంధం ఉండే పేజీలను ఎలా కనుగొనాలి?
  1. ఈ పేజీ పేరుతో వికీపీడియాలో వెతకడం
  2. ఈ పేజీ ఏ వర్గాల్లోనైతే ఉందో అదే వర్గాల్లోని ఉన్న ఇతర పేజీలను గమనించడం
  3. ఈ పేజీ విషయానికి సంబంధించిన ఇతర పేజీలు ఏమేమున్నాయో చూడడం. ఉదాహరణకు సినిమాఅ ఆయితే, నటుల పేజీల కోసం, పుస్తకం అయితే రచయిత లేదా ప్రచురణ కర్త పేజీ కోసం, యుద్ధం అయితే సంబంధిత వైరి పక్షాల కోసమూ.. ఈ విధంగా చూడవచ్చు.
  4. ఇంకా పద్ధతులునా
 4. ఇప్పుడు అంకుల్ టామ్స్ క్యాబిన్ కోసం వికీపీడియాలో వెతకండి.
  1. ఇలా వెతికేటపుడు అక్షర క్రమాన్ని మార్చి మార్చి వెతకడం కూడా చెయ్యాలి. అంటే "అంకుల్ టామ్స్ క్యాబిన్", "అంకుల్ టామ్స్ క్యాబిను", "అంకుల్ టామ్ క్యాబిన్", "అంకుల్ టామ్ క్యాబిను", "అంకుల్ టామ్" వగైరాల కోసం కూడా వెతకాలి, మనకు ఫలితాలు దొరికేదాకా. దొరుకుతాయ్, ఎక్క డో చోట దీనికి సంబంధించిన లింకులు దొరికే అవకాశాలు బానే ఉంటాయ్. ("ఎ శివతాను పిళ్ళై" అనే పేజీకి లింకు ఇద్దామని వెతికితే Sivathanu Pillai అనే పదం దొరికింది. దాఅనికి లింకిచ్చి, పనిలో పనిగా దాన్ని తెలుగులోకి లిప్యంతరీకరణం కూడా చేసాను.)
 5. దొరికేసాయ్! బానిసత్వం, ఏడు తరాలు అనే రెండు పేజీల్లో అంకుల్ టామ్స్ క్యాబిన్ ప్రస్తావన ఉంది.
 6. వీటిలో ఏదో ఒక పేజీ తెరవండి.
 7. "సవరించు" ట్యాబుకు వెళ్ళండి.
 8. "అంకుల్ టామ్స్ క్యాబిన్" అనే పద బంధం ఎక్కడుందో పట్టుకుని, దానికి అంకుల్ టామ్స్ క్యాబిన్ లింకు తగిలించెయ్యండి. అంతే!
 9. ఇప్పుడు తిరిగి అంకుల్ టామ్స్ క్యాబిన్ పేజీకి వెళ్ళి, "సవరించు" నొక్కి, అందులోని అనాథ మూసను తీసేసి, సేవు చెయ్యండి. దాని పని అయిపోయినట్లే, అది ఇక అనాథ కాదు.

పాల్గొంటున్నవారు[మార్చు]

మీరు కూడా అనాథ పేజీల సంస్కరణలో పాలుపంచుకోండి. మీ పేరును కూడా ఈ జాబితాలో చేర్చండి:

పేరు స్థితి
స్వరలాసిక చురుగ్గా ఉన్నారు
చదువరి చురుగ్గా ఉన్నారు
--కె.వెంకటరమణచర్చ 07:24, 2 జూన్ 2018 (UTC)

మూసలు[మార్చు]

 • {{Orphan}} – పేజీకి అస్సలు లింకులేమీ లేకపోతే ఆ పేజీలో ఈ మూసను ఉంచాలి.
 • {{User Wikipedia Orphan}} – ఈ ప్రాజెక్టు వాడుకరి పెట్టె.
 • {{subst:Welcome de-orphaner}} – కొత్తగా ప్రాజెక్టులో చేరినవారికి ఆహ్వానం.
 • {{subst:Welcome de-orphaner2}} – ప్రాజెక్టులో చేరకుండానే అనాథ వ్యాసాలను సంస్కరిస్తున్నవారిని ప్రాజెక్టులో చేరమంటూ ఆహ్వానించడం.
 • {{WikiProject cleanup group|Orphaned articles|WikiProject name}} - add link to orphaned articles by subject.

వర్గాలు[మార్చు]

కింద ఉన్న "►" ను నొక్కితే అందులోని ఉపవర్గాలను చూడవచ్చు:

ఉపపేజీలు[మార్చు]