Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/డూప్లికేట్ పరామితుల తొలగింపు

అక్షాంశ రేఖాంశాలు: 19°02′06″N 79°21′33″E / 19.0350°N 79.3592°E / 19.0350; 79.3592
వికీపీడియా నుండి

ఇది మూసలు నందు ఉన్న డూప్లికేట్ పరామితులు తొలగింపు ప్రాజెక్టు పేజీ

వికీపీడియా వ్యాసాలు సమాచారపెట్టెలు, సైటేషన్ టెంప్లేట్‌లు, నావ్‌బాక్స్ ఇలా అనేక రకాల టెంప్లేట్సుతో నిర్మితమవుతాయి. అయితే కొన్ని మూసలలో డూప్లికేట్ పరామితుల మానవ తప్పిదాలవల్ల, సాంకేతిక కారణాలవల్ల లేదా వాటికి సరియైన విలువలు ఇవ్వనివల్ల ఇవి ఏర్పడతాయి. ఇలాంటి వ్యాసలన్నీ స్యయంచాలకంగా వర్గం:మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు అనే ఒక దాచినవర్గంలో చేరతాయి. ఈ వర్గంలో ప్రస్తుతం ప్రాజెక్టు పేజీ తయారుచేసేనాటికి డూప్లికేట్ పరామితులు లోపాలు ఉన్న వ్యాసాలు:682, వాడుకరి పేజీలు:10, మూసలు:33 అన్నీ కలిపి 725 పేజీలు ఉన్నవి.

డూప్లికేట్ పరామితులు అంటే ఏమిటి

[మార్చు]

డూప్లికేట్ పరామితులు అంటే మూసలలో ఒకే పరామితి రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఉపయోగించినప్పుడు అందులో ఒకటికన్నా ఎక్కువ ఉన్నవాటిని డూప్లికేట్ పరామితులు అంటారు. ఇంకా సులభంగా చెప్పాలంటే, ఒకే సమాచారం కోసం విలువలు ఇవ్వని వేర్వేరు పరామితులకు బదులుగా, ఒకే పరామితిని పదే పదే ఉపయోగించడం. క్రమమైన విలువుల ఇవ్వని, లేదా ఖాళీ పరామితులు ఇవి (డూప్లికేట్ పరామితులు) వ్యాసాల నిర్వహణలో గందరగోళానికి దారితీస్తుంది.

డూప్లికేట్ పరామితుల ఉదాహరణ

[మార్చు]
డూప్లికేట్ పరామితుల మునుజూపు
డూప్లికేట్ పరామితుల మునుజూపు

పై ఇమేజ్ ఒకసారి పరిశీలించండి. ఇది తెలంగాణలోని దేవాపూర్ అనే జనగణన పట్టణ వ్యాసం. దీనిలో ఇమిడ్చిన సమాచారపెట్టెలో ఈ దిగువ వివరించిన నాలుగు పరామితులు రెండుసార్లు ఉన్నవి.

| pushpin_label_position = right

| pushpin_map_alt =

| pushpin_map_caption = Location in Telangana

| coordinates =

ఇవి పైన ఒకసారి వచ్చినవి, మరలా కొద్దిపాటి విలువల మార్పుతో మరలా వచ్చినవి.

| pushpin_label_position = right

| pushpin_map_alt =

| pushpin_map_caption = భారతదేశంలో తెలంగాణలో స్థానం

| coordinates = 19°02′06″N 79°21′33″E / 19.0350°N 79.3592°E / 19.0350; 79.3592

డూప్లికేట్ పరామితుల ఫైండర్ గాడ్జెట్ మొదటిదాని తరువాత మరలా ఎన్నిసార్లు వచ్చిననూ వాటిని డూప్లికేట్ పరామితులుగా పరిగణిస్తుంది. అయితే ఇక్కడ గమనించాలిసిన ఇంకొక విషయం కూడా ఉంది. మూస సాధారణ లక్షణం చివరిసారిగా వ్యాల్యూ ఇచ్చిన పరామితులను మాత్రమే పరగణనలోకి తీసుకుంటుంది. అందుకే మనం వీటిని తొలగించేముందు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాలి.మూస సాధారణ లక్షణం మరొకటి ఉంది. వ్యాసంలో ఎన్ని డూప్లికేట్ పరామితులు ఉన్ననూ ఒకదానిని మాత్రమే వ్యాసం మునుజూపులో ఉదహరిస్తుంది. అంటే దానిని తొలగించిన తరువాత మరొకటి డూప్లికేట్ పరామితిని చూపిస్తుంది. గాడ్జట్ లక్షణం వ్యాసంలో ఉన్న అన్ని డూప్లికేట్ పరామితుల జాబితా సంఖ్యాపరంగా చూపిస్తుంది. పై రెండు బొమ్మలు పరిశీలిస్తే ఆ విషయం మీకు అర్థం అవుతుంది.

తొలగించటానికి మార్గదర్శకాలు

[మార్చు]
  • రెండు ఖాళీ ఫీల్డ్స్ లేదా అంతకన్నా ఎక్కువ పరామితులు ఉన్నప్పుడు వాటిలో ఏది తొలగించినా లేదా అన్నీ తొలగించినా పర్వాలేదు.
  • రెండు ఫీల్డ్స్ లేదా పరామితులలో పై దానికి వ్యాల్యూ ఇచ్చి, దిగువన ఉన్న మిగతా వాటికి వ్యాల్యూస్ యివ్వకుండా ఖాళీగా ఉన్నప్పుడు పరిశీలించి వాటికి అవసరమైన వ్యాల్యూస్ ఇవ్వవచ్చు, లేదా తొలగించినా పర్వాలేదు.
  • రెండు ఫీల్డ్స్ లేదా పరామితులలో పైన ఉన్నది ఖాళీగా ఉండి, దిగువన ఉన్న పరామితులకు వ్యాల్యూస్ ఉన్నప్పుడు పైన ఉన్న ఖాళీగా ఉన్నది తొలగించాలి, లేదా అది అవసరమనుకుంటే దానికి తగిన వ్యాల్యూ ఇవ్వాలి.
  • పైన ఉన్న వాటికి , దిగువున ఉన్నవాటికి ఒకే వ్యాల్యూస్ ఇచ్చిఉంటే వాటిలో ఏది తొలగించినా పర్వాలేదు.

గమనిక:ఏది ఏమైనా తొలగించే ముందు పరిశీలన ముఖ్యం

డూప్లికేట్ పరామితులు ఎక్కడ ఉన్నవి

[మార్చు]

డూప్లికేట్ పరామితుల లోపం ఉన్న అన్ని వికీపీడియా , ప్రధాన పేరుబరి వ్యాసాలు, అన్ని రకాల మూసలు, స్వయంచాలకంగా వర్గం:మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు అనే వర్గంలో చేరతాయి. ప్రస్తుతం ఈ వర్గంలో డూప్లికేట్ పరామితుల లోపం ఉన్న పేజీలు ఈ దిగువ విధంగా ఉన్నవి.

పేరుబరి సంఖ్య
వికీపీడియా పేరుబరి 9
ప్రధాన పేరుబరి 680
వాడుకరి పేజీలు 8
అన్ని రకాల మూసలు 31
మొత్తం 728

ప్రాజెక్టు కాలపరిమితి

[మార్చు]

2025 సెప్టెంబరు 10 నుండి 2025 సెప్టెంబరు 30 వరకు

ప్రాజెక్టులో పాల్గొనువారు

[మార్చు]

సందేహాలు , అభిప్రాయాలు

[మార్చు]

యర్రా రామారావు అభిప్రాయం

ఈ ప్రాజెక్టులో వ్యక్తిగత JS స్క్రిప్టు కోడ్ సహాయం ద్వారా గుర్తించి తొలగించటం అవసరమైన చోట తగిన విలువులు ఇచ్చి సవరించబడినవి.యర్రా రామారావు (చర్చ) 17:23, 15 అక్టోబరు 2025 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు పురోగతి

[మార్చు]

ప్రాజెక్టు కాలపరిమితి ముగింపు 2025 సెప్టెంబరు 30 నాటికి 95% పూర్తైయింది