వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీపీడియా బోధన, ప్రచార వీడియో వనరులు/వీడియో వనరుల తయారీ - 2017

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సోషల్ మీడియాలోనూ, పుస్తకాల పండుగల్లోనూ, ఇతరేతర ప్రయత్నాల ద్వారానూ విస్తృతంగా రీచ్ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రీచ్ కు అనుగుణంగా వెనుక తెలుగు వికీపీడియా గురించి తెలియజేసే పలు స్క్రీన్ కాప్చర్ వీడియోలు తయారుచేసి, తెలుగు వికీపీడియాలోని పలు అంశాల గురించి వివరించే వీడియోలు రూపొందించాలి. ఈ తరహా వీడియోలు రూపొందించేందుకు గాను రచ్చబండలో చర్చ జరిగింది.

వీడియో నిర్మాణానికి సూచనలు[మార్చు]

 1. ఒక వీడియోలో ఒక్క విషయం గురించి మాత్రమే చెప్పాలి
 2. వీడియోలు వీలైనంత తక్కువ నిడివితో ఉండాలి. 5 నిముషాలు ఎక్కువౌతుందేమో చూడండి. చెప్పాల్సిన విషయం ఎక్కువ ఉంటే, భాగాలుగా విడగొట్టవచ్చేమో చూడాలి.
 3. వికీపీడియా ఇంటర్‌ఫేసు కొత్త వాడుకరికి ఎలా కనిపిస్తుందో వీడియోలో కూడా అలాగే కనబడాలి. అంటే -
  1. వీలైనంతవరకు సాధారణ వాడుకరి లాగా లాగినై చెయ్యాలి.
  2. అభిరుచుల్లో అన్నీ డిఫాల్టు సెట్టింగులు పెట్టుకోవాలి.
 4. వీడియోలను రెండు స్థాయిలుగా చేద్దాం.
  1. ప్రాథమిక స్థాయి: ఈ వీడియోల్లో ఎలా చెయ్యాలో మాత్రమే చెబుదాం.
  2. ఉన్నత స్థాయి: వీటిలో ఎందుకు చెయ్యాలో చెబుదాం. తెరపట్టు వీడియోలు మాత్రమే కాక, వికీపీడియనుల చేత చెప్పించనూ వచ్చు.
 5. తెరపట్టు వీడియోలో కూడా ఆడియో ఉంటే బానే ఉంటుందని నా ఆలోచన.
 6. చెయ్యాల్సిన వీడియోల జాబితా, ఒక్కోదానికీ స్టోరీబోర్డూ తయారు చేసుకుని, పని మొదలుపెడదాం.
 7. వికీప్రాజెక్టు గొడుగు కింద ఈ పనులు చేద్దాం.
 8. పనులు ఎవరు చేసినా ఒకే సాఫ్టువేరును వాడదాం.
 9. కొన్ని వ్యాసాలను ఎంచుకుని వీడియోలన్నిటినీ వాటిలోనే చేద్దాం.
 10. వీడియో ఫైళ్ళకు ఒక క్రమపద్ధతిలో పేర్లు పెడదాం. ఓ కచ్చితమైన సంప్రదాయాన్ని పెట్టుకుని దాన్నే అనుసరిద్దాం.
 11. ఇక నేను చెయ్యగలిగే పని - మీరు ఏది చెబితే అది.

వీడియోలకు సూచనలు[మార్చు]

ఎలా

తెలుగు వికీపీడియాలో ఏయే అంశాలు ఎలా చేయాలన్న అంశం గురించి ఈ కింది వీడియోలు. ఈ కింది అంశాలను అటు విజువల్ ఎడిటర్ ద్వారా చేయడానికీ, మొబైల్ ఎడిటర్ ద్వారా చేయడానికీ, సోర్స్ ఎడిటింగ్ ద్వారా చేయడానికి వేర్వేరుగా వీడియోలు తీయాలి.

 1. ఫోటోలు ఎక్కించడం
 2. ఇన్ఫోబాక్సులు పెట్టడం, ఉన్నవాటిని సవరించడం(ఎటు సవరిస్తే సరైన మార్పో తెలీడం కష్టం)
 3. లింకులు, మూలాలు ఇవ్వడం(సైట్, బుక్ వంటి చాలా రకాలు సవివరంగా ఉండాలి లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ)
 4. పేరాగ్రాఫులు, శీర్షికలు, బిందుజాబితాలు ఎలా ఇవ్వాలి అనే దాని గురించి
 5. పట్టికలు తయారు చేయడం గురించి
 6. సైటేషన్లు ఎలా ఇవ్వాలన్నది
 7. ట్రాన్స్ లేషన్ టూల్ గురించి సవివరంగా ఒక వీడియో తప్పకుండా ఉండాలి. అందులో ఆ టూల్ లో ఎడిటింగ్ లో ప్రతీ చిన్న విషయం గురించీ వివరించాలి
ఎందుకు

ఏయే అంశాలను ఎందుకు రాయాలి, రాసేప్పుడు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. పాలసీలు, గైడ్లైన్లు ఏమిటి వంటి అంశాల్లోకి ఇవి వస్తాయి:

 1. అనాధ పేజీలు, అగాధ పేజీల గురించి సవివరమైన అవగాహన కల్పించాలి. మనం కొత్త వ్యాసం రాసేటప్పుడు ఏవి చేస్తే ఈ రెండు కేటగిరీల్లోకీ రాకుండా నాణ్యమైన వ్యాసం రాయొచ్చో వివరించాలి.
 2. అతి ముఖ్యంగా వికీ స్టైల్(వార్తాపత్రికలో ఉండే స్పెషల్ ఐటెం వ్యాసాలకూ, ఈ వ్యాసాలకూ తేడా తెలియాలి)
 3. రకరకాల మూలాలు, ఆకరాల గురించి వివరణ

పాల్గొనే సభ్యులు[మార్చు]

 1. --పవన్ సంతోష్ (చర్చ) 06:50, 25 జనవరి 2017 (UTC)
 2. చదువరి (చర్చరచనలు)

రూపుదిద్దుకున్న వీడియోలు[మార్చు]

నేర్చుకుంటున్నవారు, కొత్తవారి కోసం[మార్చు]

అనుభవజ్ఞులతో సహా అందరికీ[మార్చు]