వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు

[మార్చు]
పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
లక్కవర వేణుగోపాల శతకం [1] లక్కాకు వెంకట రత్నాఖ్యాదాస్ భక్తి పద్యాలు తెలుగు సాహిత్యంలో శతక వాజ్మయానికి చాలా ప్రాధాన్యం ఉంది. శతకాలలో చాలా రకాలు ఉన్నాయి. నీతి శతకాలు, భక్తి శతకాలు, భగవత్ నిందా స్తుతి శతకాలు. క్షేత్రాలలోని దేవీ, దేవతాపై శతకాలు దక్షిణ దేశాన ప్రసిద్ధం. ఆ కోవలోనికి చెందినవే శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాకుళాంధ్రదేవ శతకం, దాశరధీ శతకం. ప్రస్తుత పుస్తకం లక్కవరంలో వెలసిన వేణుగోపాలస్వామిపై శతకకర్త రాసిన భక్తి పద్యాల మాలిక. ఈ పుస్తకంలో ఈ క్షేత్ర మహత్యం, దేవాలయ వర్ణన కూడా ఉన్నాయి. 2020050016683 1937
లగన్ [2] మూలం: బృందావన్ లాల్ వర్మ, అనుసరణ: కలపాల దశరధరామయ్య నవల 2020010005922 1958
లఘుపీఠికా సముచ్చయము [3] కట్టమంచి రామలింగారెడ్డి సాహిత్య విమర్శ, పీఠికలు సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి (1880 - 1951) ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది.ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఇంతటి ప్రతిభా పాటవాలు ఒక వ్యక్తిలో కానరావడం అరుదు. ఆంధ్రభాషాభిరంజని సంఘంలో చురుకైన పాత్ర పోషించాడు. గైక్వాడ్‌ స్ఫూర్తితో అమెరికాలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడా కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌గా చేరాడు. 1909లో మైసూరులో విద్యాశాఖలో చేరి 1918 నుంచి 1921 వరకు విద్యాశాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా వ్యవహరించాడు. 1951లో అనారోగ్యంతో ఆయన మరణించాడు. ఇతడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా జీవించాడు. ఇది ఆయన రచించిన పీఠికల సంకలనం. 2030020024997 1928
లఘువీర గాథల్లో స్త్రీ విలువలు [4] పి.కోటేశ్వరమ్మ సాహిత్యం 2020120000766 1960
లఘు సిద్ధాంత కౌముదీ [5] ఆర్.శ్రీహరి సాహిత్యం 2020010012182 1193
లజ్జ(నవల) [6] మూలం:తస్లీమా నస్రీన్, అనువాదం:వల్లంపాటి వెంకటసుబ్బయ్య నవల 2020120034840 1996
లల్ల రామాయణం [7] లల్లాదేవి ఆధ్యాత్మికం 2990100028526 1997
లలిత [8] శ్రీరాముల సచ్చిదానందం నాటకం శ్రీరాముల సచ్చిదానందం 20వ శతాబ్ది తొలి అర్థభాగంలో ప్రముఖ నాటకకర్త. ఆయన ప్రముఖ శతావధాని, నాటకకర్త చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిని శిష్యసంపన్నునిగా నిలిపిన విద్వత్ సంపన్నులైన శిష్యుల్లో ఒకరు. ఇది ఆయన రచించిన నాటకం. 2030020024768 1950
లలిత కళా పదకోశం [9] సంపాదకులు: చీమకుర్తి శేషగిరిరావు, తిరుమల రామచంద్ర, వజ్ఝ శ్రీనివాసశర్మ సాహిత్యం 2990100051690 1991
లలిత కుమారి(నవల) [10] వంగూరి సుబ్బారవు నవల 2030020024589 1915
లలిత భావ గీతాలు [11] వెల్లంకి ఉమాకాంత శాస్త్రి సాహిత్యం, గీతాలు 6020010000775 1997
లలిత త్రిశతి భాష్యమ్ [12] గరికపాటి కృష్ణమూర్తి ఆధ్యాత్మికం 2990100071402 1986
లలితా పట్టణపు రాణి [13] విశ్వనాథ సత్యనారాయణ నవల 2990100068568 1969
లవ్ కోడ్స్(పుస్తకం) [14] స్వప్న కంఠంనేని తలశిల సాహిత్యం 2020120000791 1999
లవ-కుశ నాటకము [15] కోలాచలం సుబ్రహ్మణ్యశాస్త్రి నాటకం 5010010033152 1924
లవకుశ(నాటకం) [16] చక్రావధానుల మాణిక్యశర్మ నాటకం 2020050016030 1937
లవంగ లత(నవల) [17] కోసూరి రంగయ్య నవల 2020010005947 1926
లక్షణ [18] భోగరాజు నారాయణమూర్తి నాటకం, సాంఘిక నాటకం భోగరాజు నారాయణమూర్తి రచించిన తొలి చారిత్రికేతర విషయమగు నాటకమిది. దీనిలోని ఇతివృత్తం సాంఘిక సమస్యలు, సంస్కరణల చుట్టూ తిరుగుతుంది. 2030020025193 1924
లక్షణ చంద్రిక [19] చిల్లరిగె యోగానందకవి సాహిత్యం 2020120000769 1914
లక్షణ శిరోమణి [20] రావూరి దొరస్వామిశర్మ సాహిత్యం 2040100047154 1979
లక్షణా పరిణయము [21] తిరుపతి వేంకటకవులు పద్యకావ్యం చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి ఇద్దరూ తిరుపతివేంకటకవులుగా ప్రసిద్ధులు. వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంథాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి. ఇది వీరు రచించిన పద్యకావ్యం. ఇందులో పాత్రానుగుణ్యంగానైనా తొలిసారిగా వ్యవహారికాన్ని కొంతవరకూ వారి గ్రంథాల్లో ప్రవేశపెట్టారు. 2030020024949 1907
లక్ష్మణరాయ వ్యాసావళి [22] కొమర్రాజు వెంకట లక్ష్మణరావు వ్యాసాలు తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత మరియు విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు - కొమర్రాజు వెంకట లక్ష్మణరావు . తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. కేవలం 46 సంవత్సరాల ప్రాయంలో మరణించినా, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు. ఆయన అకాల మరణం పొందాకా ఈ సంపుటం వెలుగుచూసింది. 2030020024543 1950
లక్ష్మణుడు [23] ఇరివెంటి కృష్ణమూర్తి సాహిత్యం 2040100047155 1985
లక్ష్మణుడు [24] కొడాలి సత్యనారాయణరావు సాహిత్యం 2020050016364 1932
లక్ష్మణ మూర్ఛ [25] సోమరాజు రామానుజరావు నాటకం, పౌరాణిక నాటకం రామాయణంలో లక్ష్మణస్వామి మూర్ఛపోతే ఆయన ప్రాణాలు దక్కించేందుకు హనుమంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చి వైద్యం చేయిస్తాడు. ఆ పనికి అమితాదరం పొందిన రాముడు హనుమను కౌగలించుకుంటాడు. అపురూపమైన ఈ ఘట్టాన్ని రాముడి వద్దకు హనుమంతుడు అంగుళీయకం ఇవ్వడం నుంచి మొదలుకొని ఐదు అంకాల నాటకంగా రచించారు కవి. 2030020025151 1933
లక్ష్యం ఒక్కటే [26] కొత్తమాను కూర్మారావు ఆధ్యాత్మిక సాహిత్యం, వ్యాస సంపుటి 2020010005938 1951
లక్ష్యము-కార్యము [27] మూలం: దత్తోపంత్ ఠేంగ్డే, అనువాదం: ఎం.జి.శ్రీనివాసమూర్తి సాహిత్యం 2020120020406 1988
లక్షాధికారి(నాటకం) [28] సీతంరాజు వెంకటేశ్వరరావు నాటకం 2020010005932 1959
లక్షింపతి గారి అమ్మాయిలు [29] రాంషా నవల 2020010005934 1950
లక్ష్మీనాథ బెజ్జరూవా [30] మూలం:హేమ్ బరూవా, అనువాదం:ఆర్.ఎస్.సుదర్శనం జీవితచరిత్ర, అనువాద సాహిత్యం 2990100061642 1972
లక్ష్మీనారాయణీయము [31] కొట్ర లక్ష్మీనారాయణశాస్త్రి సాహిత్యం 2020050005643 1906
లక్ష్మీ రఘురామ్(పుస్తకం) [32] టి.ఎస్.కృస్ణానందం జీవిత చరిత్ర 2990100061643 1976
లక్ష్మీ శారద గీతములు [33] గిడుగు లక్ష్మీకాంతమ్మ, జొన్నలగడ్డ శారదాంబ స్త్రీల పాటలు 2020010002814 1931
లక్ష్మీశారద శతకములు [34] లక్ష్మీశారదలు శతకం 2020050005712 1931
లక్ష్మీ సహస్ర కావ్యము [35] వేదుల సూర్యనారాయణ శర్మ కావ్యం 2020120000777 1972
లక్ష్మీ సూక్తము [36] అజ్ఞాత మహర్షి స్తోత్రం, ఆధ్యాత్మికం 2020120000773 2001
లక్ష్మీ శృంగార కుసుమ మంజరి [37] దుర్భా సుబ్రహ్మణ్య శర్మ సాహిత్యం 2020120000771 1916
లాయరు గిరీశిం-1,2భాగములు [38] దామరాజు వెంకటసుబ్బారావు కథా సాహిత్యం 2020010005987 1957
లాచిత్ బుడ్ ఫుకాన్ [39] మూలం:మధుకర్ లిమయే, అనువాదం:ఐతా చంద్రయ్య జీవిత చరిత్ర 2020120007311 1997
లిటిల్ మాస్టర్స్(అంకగణితం) [40] సి.ఎస్.ఆర్.సి.మూర్తి గణిత శాస్త్రం 2020120000783 1998
లిటిల్ మాస్టర్స్(డిక్షనరీ)ఇంగ్లీష్-తెలుగు [41] ఎస్.కె.వెంకటాచార్యులు నిఘంటువు 2020120020425 1992
లిటిల్ మాస్టర్స్(45రోజులలో హింది) [42] కిన్నెర రూబిన్ భాష 2020120020426 1999
లిటిల్ మాస్టర్స్(సులభ వ్యాకరణం) [43] షేక్ అలీ భాష 2020120000784 1998
లియోటాల్ స్టాయ్ [44] రామమోహన్ జీవితచరిత్ర 2020120000785 1928
లీలా కథామాలిక [45] పొన్నా లీలావతి కథా సాహిత్యం, కథల సంపుటి 6020010000779 1999
లీలా మాధవమ్ [46] జి.ఎల్.ఎన్.శాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120020416 1995
లీలావతి(నాటకం) [47] తెన్నేటి వేంకటదీక్షితులు నాటకం 2020050015260 1939
లీలావతి(పుస్తకం) [48] సూరాబత్తుల సూర్యనారాయణ నవల 2030020024790 1934
లీలావతి(గణితశాస్త్రం) [49] తడకమళ్ళ వేంకటకృష్ణారావు గణిత శాస్త్రం 5010010088598 1893
లీలావతి సులోచనలు [50] మూలం.పి.సంబంధము మొదిలియారు, పరిష్కర్త.శ్రీపాద కామేశ్వరరావు నాటకం, అనువాదం తమిళ భాషలో సంబంధం మొదిలియార్ రచించిన నాటకాలు ప్రాచుర్యం పొందినవి. వాటిలో కొన్ని తెలుగులోకి కూడా అనువాదమైనాయి. అదే క్రమంలో ఈ గ్రంథాన్ని తెనిగించి పరిష్కరించి ప్రచురించారు. 2030020024739 1927
లీషావ్-చీనా వేదిక [51] కేంద్ర కమిటీ రాజకీయం చైనా కమ్యూనిస్టు పార్టీ 8వ మహాసభకు కేంద్రకమిటీ సమర్పించిన నివేదిక ఈ పుస్తకం. 2020010005960 1956
లూయి పాశ్చర్(పుస్తకం) [52] వి.కోటేశ్వరమ్మ జీవిత చరిత్ర 2020120029291 1964
లెట్ మీ కంఫెస్(పుస్తకం) [53] పసుపులేటి పూర్ణచంద్రరావు కవితా సంకలనం 2020120000781 2002
లెట్స్ డూ ఏ ప్లే(పుస్తకం) [54] వివరాలు లేవు కథ 99999990175631 1972
లెనిన్ ఉపదేశాలు [55] మూలం:పామీదత్తు, అనువాదం:రామమోహన్ ఉపన్యాసాలు 2020120034852 1946
లెవియకాండమందలి అర్పణలు [56] ఎ.జి.ఫెయిర్ సాహిత్యం 2020010005965 1956
లేఖలు(పుస్తకం) [57] గురజాడ అప్పారావు, సంకలనంఅవసరాల సూర్యారావు సాహిత్యం వేర్వేరు ప్రముఖులకు వేర్వేరు సందర్భాలలో గురజాడ ఆప్పారావు రాసిన లేఖలను అవసరాల సూర్యారావు సంకలనం చేసి ఈ పుస్తక రూపంలో ప్రచురించారు. 2020010005952 1958
లేడీ డాక్టరు(నాటకం) [58] కాళ్ళకూరి హనుమంతరావు నాటకం 2030020025572 1935
లేత కథావళి [59] ఆదిరాజు వీరభద్రరావు కథా సంపుటి 2020010005939 1945
లేపాక్షి(నవల) [60] కొండూరు వీరరాఘవాచార్యులు నవల 2990100071404 1969
లేపాక్షి వాస్తు శిల్ప చిత్రలేఖనాలు [61] సి.పూర్ణచంద్ చిత్ర కళ, శిల్ప కళ లేపాక్షి గ్రామంలోని దేవాలయాలు చారిత్రికాంగా, పురావస్తుశాస్త్రపరంగానే కాక శిల్ప, చిత్రకళల పరంగా కూడా చాలా విలువైనది. ఆ ప్రాంతంలోని గొప్ప నంది విగ్రహం, వీరభద్రాలయంలోని వివిధ శిల్పాలు సౌందర్యానికి పెట్టింది పేరు. రచయిత వాస్తు పరిణామచరిత్ర, శిల్ప సాంకేతిక చరిత్ర పరంగా లేపాక్షి వీరభద్రాలయ శిల్పాలను, చిత్రాలను అధ్యయనం చేసి ఈ గ్రంథం రచించారు. 2040100028527 1985
లైంగిక విప్లవం [62] మల్లాది సుబ్బమ్మ వ్యాస సంపుటి 2020120000767 1989
లోక చంద్రిక(పుస్తకం) [63] వివరాలు లేవు సాహిత్యం 5010010088350 1920
లోక పావన శతకము [64] ఆదిపూడి సోమనాధరావు ఆధ్యాత్మిక సాహిత్యం, శతకం 2020050015085 1911
లోకమాన్య బాలగంగాధర తిలకు గారి ఉపన్యాసములు [65] అనువాదం:పెద్దిభొట్ల లక్ష్మీనరసింహం ఉపన్యాసాలు, అనువాద సాహిత్యం 2990120000787 1920
లోక శాంతి(పుస్తకం) [66] వడ్డాది బి.కూర్మనాధ్ నాటకం 2020010005977 1960
లోకక్షేమ గాధలు [67] బోధ చైతన్య కథల సంపుటి, కథా సాహిత్యం 2020120000788 1998
లోకము యొక్క ప్రస్తుత సందిగ్ధ స్థితి యొక్క ఫలితమేమి?(పుస్తకం) [68] పి.ఎం.సామ్యూలు సాహిత్యం 2020010005975 1957
లోకైక కళ్యాణ గృహస్థుడు(పుస్తకం) [69] జినపనీని సూర్యనారాయణరాజు సాహిత్యం 2020120000786 1955
లోకైక మతము-భగవన్మతము [70] జనపనీని సూర్యనారాయణరాజు ఆధ్యాత్మిక సాహిత్యం 5010010032624 1956
లోకోక్తి కథలు [71] చింతలపూడి శేషగిరిరావు కథల సంపుటి, కథా సాహిత్యం 2020050016365 1932
లోకోక్తి ముక్తావళి(తెలుగు సామెతలు) [72] పి.కృష్ణమూర్తి భాష, సాహిత్యం 2020120020435 1955
లోకోత్తరుడు(పుస్తకం) [73] దశిక సూర్యప్రకాశరావు కథ 2020010005982 1946
లోకోద్ధారకము(పుస్తకం) [74] మళయాళ స్వామి, సంపాదకుడు:దిగవల్లి శేషగిరిరావు సాహిత్యం 2040100047157 1945
లోకోభిన్నరుచిః [75] భమిడిపాటి కామేశ్వరరావు హాస్య రచన భమిడిపాటి కామేశ్వర రావు గారు ఎక్కువగా నాటికలు ముఖ్యంగా హాస్య ప్రధానమైనవి రచించారు. ఆయన నాటికలకు చాలాభాగం ప్రముఖ ఫ్రెంచి నాటక కర్త మోలియర్ వ్రాసిన నాటికలు ఆధారం. ఆయన అనేక విషయాల మీద వ్రాసిన వ్యాసాలు 20వ శతాబ్దపు మొదటి అర్ధ భాగములోని సామజిక పరిస్థితులను తెలియచేస్తాయి.ఆయన హాస్యం చదువరికి చురుక్కుమనినిపిస్తుంది.ఈయన వ్రాసిన వ్యాసాలన్నీ కూడా హాస్య ప్రధానమైనపట్టికీ, వాటిలో విషయ పటిమ దృఢంగా ఉండి, విషయాలను మూలాలనుండి చర్చిస్తాయి. ఇది ఆయన రచించిన హాస్యరచనల సంపుటి. 2030020025075 1948
లోకం(పుస్తకం) [76] బోయ జంగయ్య కథల సంపుటి, కథా సాహిత్యం 2020120029287 1973
లోకం కోసం(పుస్తకం) [77] రావూరి భరద్వాజ కథల సంపుటి, కథా సాహిత్యం 2020120029288 1956
లోకం చూశాక(పుస్తకం) [78] ముప్పిడి ప్రభాకరరావు కథల సంపుటి, కథా సాహిత్యం 2990100049418 1992
లోకం పోకడ(పుస్తకం) [79] కొర్రపాటి గంగాధరరావు నాటకం 2020010005981 1957
లోపలి మనిషి(పుస్తకం) [80] ఆంగ్ల మూలం:పివి.నరసింహారావు, అనువాదం:కల్లూరి భాస్కరం ఆత్మకథ, అనువాద సాహిత్యం 2990100067460 1998
లో వెలుగు(పుస్తకం) [81] కందుకూరి వీరేశలింగం, సంపాదకుడు:యాతగిరి శ్రీరామనరసింహారావు స్మారకోపన్యాసాలు ఈ పుస్తకంలో కందుకూరి వీరేశలింగం గురించి వివిధ రచయితలు రాషిన వ్యాసాలతో పాటు, వీరేశలింగం స్మారకోపన్యాసాలను ప్రచురించారు. 2990100067459 1986
లో వెలుగులు [82] ముట్నూరి కృష్ణారావు వ్యాస సంపుటి 2020120020428 1971
లో వెలుగులు(పుస్తకం) [83] గోపీచంద్ నాటకాల సంపుటి 2020010005984 1958
లంకా దహనము [84] నాటకకర్త.ద్రోణంరాజు సీతారామారావు, కీర్తనలు.అల్లక చంద్రశేఖరం నాటకం లంకాదహనం నాటక ఇతివృత్తం రామాయణంలోనిది. సీతాన్వేషణకు బయలుదేరిన హనుమంతుడు అడ్డంకులను దాటుకుని లంకలో ప్రవేశిస్తాడు. లంకాధిదేవతను ఓడించి లంకంతా రాత్రివేళ కలయజూచి చివరకు అశోక వృక్షం కింద సీతమ్మ వారిని కనుగొంటాడు. ఆమెను సమీపించి తన వివరం చెప్పి నమ్మించి సందేశాన్ని స్వీకరిస్తాడు. అశోక వనాన్ని నాశనం చేసి, రావణుడు పంపిన యోధులను చంపి, చివరకు బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణాసురుడిని తీవ్రంగా హెచ్చరిస్తాడు. ఆయన తోకకు నిప్పంటించగా లంకంతా దహనం చేస్తాడు. దీనంతటినీ సుప్రసిద్ధమైన రామాయణాంతర్గత సుందరకాండ నుంచి తీసుకున్నారు. 2030020025304 1922
లంకా పతనము [85] దౌల్తాబాదా గోపాలకృష్ణారావు నాటకం 2020050015233 1934
లంకా విజయము [86] పిండిప్రోలు లక్ష్మణకవి కావ్యం 2020120034848 1927
లంకెల బిందెలు [87] కొడాలి గోపాలరావు నాటకం 2020010002942 1960
లంచాల పిశాచం [88] పన్నాల రామశేషగిరి శాస్త్రి నాటకం 2020010005942 1951