Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యత నియంత్రణ/తెలుగు రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాల నాణ్యతాభివృద్ధి

వికీపీడియా నుండి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల వ్యాసాలలో అభివృద్ధి, నాణ్యత నియంత్రణలో భాగంగా ఈ ప్రాజెక్టు పేజీ సృష్టించటమైనది. ప్రస్తుతం 2008 డిలిమిటేషన్ ప్రకారం తెలంగాణలో 119 శాసనసభ నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నవి.ఈ వ్యాస పేజీలు అన్నీ 2008 డీలిమిటేషన్ తర్వాత సృష్టించబడినవి. ఈ నియోజకవర్గాలలోని సమాచారం ఆంగ్లపదాలతో కొన్ని వ్యాసాలలో, ఒకే పదం ఆంగ్ల భాష, తెలుగు భాషలతో కొన్ని వ్యాసాలలో, కొన్నివ్యాసాలలో పట్టికలు కలర్ పార్మెటుతో, కొన్ని వ్యాసాలలో కలర్ ఫార్మెట్ లేకుండా ఒక పద్దతి అంటూ లేకుండా ఉన్నవి.అలాగే కొన్ని వ్యాసాలలో గెలిచిన అభ్యర్థుల సమాచారంతో ఉండగా, మరికొన్ని వ్యాసాలలో అసంపూర్తి సమాచారంతో ఉన్నవి. వీటిలో గమనించిన లోపాలు దిగువ పొందుపర్చటమైనది. వాటిన్నిటిని అధిగమించి ఆంగ్లవ్యాసాలతో దీటుగా తాజా సమాచారంతో ఏకరీతిలో ఉండటానికి ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.

రెండు రాష్ట్రాల నియోజకవర్గాల వ్యాసాలలో గమనించిన లోపాలు

[మార్చు]

ఇంకా

  • వికీడేటా అంశాలకు జోడించని వ్యాసాలు, భాషా లింకులు లేని వ్యాసాలు, వికీడేటా క్లుప్తవివరణ లేని వ్యాసాలు ఇలా ఉన్నవి.

పరిష్కారం

[మార్చు]

ఉన్నసమాచారంతో సవరించాలంటే ఏమేమి, ఎలా చేయాలి

[మార్చు]
  • పట్టికలలో, పాఠ్యంలో ఉన్న ఆంగ్లపదాలు పూర్తిగా తెలుగులోకి మార్చాలి.
  • పట్టికలలో ఉన్న బ్లూ కలర్ కోడ్ bgcolor="#87cefa" తొలగించాలి
  • ఒకటే సమాచారంతో రెండు పట్టికలు (ఆంగ్ల, తెలుగు) ఉంటే ఆంగ్ల పట్టికను తొలగించాలి.
  • ఒకటే సమాచారంతో రెండు ఆంగ్ల పట్టికలు ఉంటే పూర్తి సమాచారం ఉన్నదానిని ఉంచి, రెండవదానిని తొలగించాలి.
  • అలాగే ఒకటే సమాచారంతో రెండు తెలుగు పట్టికలు ఉంటే పూర్తి సమాచారం ఉన్నదానిని ఉంచి, రెండవదానిని తొలగించాలి
  • తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికలలో, అలాగే 2024 ఎన్నికలలో తాజాగా గెలిచిన శాసనసభ్యుల వివరాలు తగిన మూలాలతో పొందుపర్చాలి.
  • వ్యాసంలో ఆంగ్లవ్యాసం నుండి తాజా సమాచారపెట్టె కూర్పుచేసి అనువదించాలి.
  • నియోజకవర్గపరిధిలో ఉన్న మండలాల వివరాలు అంతకుముందు చేర్చి ఉండకపోతే చేర్చాలి.
  • ప్రవేశికలో ఆ శాసనసభ నియోజకవర్గం ఏ జిల్లాకు చెందినది, నియోజకవర్గం సంఖ్య, ఏర్పడిన సంవత్సరం, ఏ లోకసభ నియోజకవర్గం పరిధికి చెందుతుందో వివరించాలి. ఒకవేళ *అ నియోజకవర్గం రిజర్వేషను వర్గానికి చెందినదైతే ఆ వివరాలు తప్పనిసరిగా రాయాలి.
  • అవకాశం ఉన్నంతవరకు అందుబాటులో ఉన్న తాజా గణాంకాలు నియోజవర్గంలోని మొత్తం ఓటర్లు సంఖ్య, పోలింగ్ కేంద్రాల సంఖ్య వివరించాలి.
  • వికీడేటా అంశాలకు జోడించని వ్యాసాలు (ఆంగ్లంలో వ్యాసం లేకుండా తెలుగులో వ్యాసం ఉండి వికీడేటా అంశంలేని పేజీలు) కొత్తగా వికీడేటా అంశం కాత్తగా సృష్టించాలి.
  • భాషా లింకులు లేని వ్యాసాలు (ఆంగ్లంలో వ్యాసం పేజీ ఉండి, తెలుగులో ఉన్న వ్యాసం వికీడేటాకు కలపని, లేదా మరియెక వికీడేటా అంశంతో ఉన్న వ్యాసాలు) వికీడేటాకు కలపటం లేదా విలీనం చేయటం
  • వికీడేటా క్లుప్తవివరణ లేని వ్యాసాలకు వివరణ రాయాలి. (వ్యాసం పైన ఖాళీగా ఉన్న సన్నటి డైలాగ్ బాక్సులో వివరణ రాయని వ్యాసాలు)

ఇంకా సులభమైన మార్గం ఎలా

[మార్చు]

పై విధంగా సవరించాలంటే చాలా శ్రమ, ఓపికతో కూడిన పని. పైవాటిని అధిగమించి, తాజా వివరాలతో, నాణ్యతగా ఆంగ్లవ్యాసాలతో ధీటుగా ఉండాలంటే, పాతవ్యాసాలను సృష్టించిన వాడుకరికి, చరిత్రకు భంగం కలుగకుండా వాటిలోనే ఆంగ్లవ్యాసాలను అనువాద యంత్రంద్వారా సమాచారం సేకరించటం, ఇంకా ఇతర మార్గం ద్వారా సమాచారం సేకరించటం సులువైన మార్గంగా భావించి రెండు సవరించిన మాదిరి వ్యాసాలు ఉదహరించటమైనది.

ప్రాజెక్టు ఉనికి కాలపరిమితి

[మార్చు]

ప్రాజెక్టు ప్రారంభం:2025 మే 17 ప్రాజెక్టు ముగింపు: ప్రాజెక్టు ముగింపుకు కాలపరిమితి అంటూ ఏమీ లేదు. అన్ని నియోజకవర్గాలలో తాజా సమాచారంతో సవరణలు పూర్తిఅయిన రోజును ప్రాజెక్టు ముగింపు తేదీగా పరిగణనలోకి వస్తుంది

వనరులు, సూచనలు

[మార్చు]

నియోజకవర్గాలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్

[మార్చు]

తెలంగాణ

[మార్చు]

ప్రాజెక్టులో పాల్గొనేవారు

[మార్చు]
  1. యర్రా రామారావు (చర్చ) 02:54, 17 మే 2025 (UTC)[ప్రత్యుత్తరం]
  2. చదువరి (చర్చరచనలు)
  3. యశ్వంత్ గాడు (చర్చ)

గమనిక:సూచనలు, అభిప్రాయాలు ప్రాజెక్టు చర్చాపేజీలో తెలుపగలరు. ధన్యవాదాలు