వికీపీడియా:వికీప్రాజెక్టు/నిర్వహణ మూసలలో చెల్లని తేదీ పరామితి సవరణల ప్రాజెక్టు
ఇది నిర్వహణ మూసలలో చెల్లని తేదీ పరామితి సవరణల ప్రాజెక్టు పేజీ
ప్రాజెక్టు పరిచయం
[మార్చు]తెలుగు వికీపీడియా వ్యాసాల నిర్వహణ మూసలలో చెల్లని తేదీ పరామితుల సవరణ ప్రాజెక్టు అనేది వికీపీడియా కంటెంట్ నాణ్యతను మెరుగుపరచడానికి చేపట్టబడిన ఒక ముఖ్యమైన నిర్వహణ కార్యక్రమం. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియా వ్యాసాల నిర్వహణకు వాడిన Citation needed, Expand, Cleanup వివిధ నిర్వహణ మూసలలో ఉన్న తప్పు తేదీ పరామితుల గుర్తించి సరిదిద్దడం.
ప్రాజెక్టు లక్ష్యం, ప్రాధాన్యత
[మార్చు]ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం CS1 (Citation Style 1), CS2 (Citation Style 2) టెంప్లేట్లలో, అలాగే నిర్వహణ మూసలలో చెల్లని తేదీ ఫార్మాట్లను గుర్తించి సరిచేయడం. వికీపీడియాలో 2,795 వ్యాసాలు "Articles with invalid date parameter in template" వర్గంలో ఉన్నాయి.
వికీపీడియా వ్యాసాలలోని నిర్వహణ మూలాల మూసలలో తేదీ పరామితులు తప్పు ఫార్మాట్‌లో ఉంటే, సంబందిత వ్యాసాలు, సంబందిత ఉపవర్గాలలో చేరి, ఉప వర్గాలు అనే ప్రధాన వర్గంలో చేరతాయి. ఈ ప్రాజెక్టు పేజీ అలాంటి తప్పు ఫార్మెట్ తేదీలను గుర్తించి సవరించటానికి సృష్టించబడిన ప్రాజెక్టు పేజీ
సరైన ఫార్మెట్ వివరణ, ఉదాహరణ
[మార్చు]అంటే క్లుప్తంగా చెప్పాలంటే వర్గం:Articles with invalid date parameter in template అనే వర్గం వివరణ ప్రకారం, తేదీ పరామితిలో రోజు (day) ఉండకూడదు, కేవలం నెల పేరు (పూర్తిగా), సంవత్సరం మాత్రమే ఉండాలి. నిర్వహణ మూసల్లో Citation needed, Expand, Cleanup వంటి వాటిలో తేదీని కింది విధంగా ఇవ్వాలి. ఈ ఫార్మాట్‌లో రోజు (day) ఉండకూడదు.
ఉదాహరణ: మూసలో | పైపు తరువాత date=సెప్టెంబరు 2025 అని ఉండాలి
చెల్లని తేదీ పరామితికి ఉదాహరణలు
[మార్చు]ఈ క్రింది విధంగా తేదీని ఇస్తే అది చెల్లనిదిగా పరిగణించబడుతుంది. దాని కారణంగా వ్యాసం ఆ వర్గం:Articles with invalid date parameter in template వర్గంలో చేరుతుంది:
- date=28 సెప్టెంబరు 2025 లేదా date=06 అక్టోబరు 2025 - (తేదీని కలిపి ఇవ్వడం)
- date=సెప్టెం. 2025 - నెల పేరును పూర్తిగా ఇవ్వకపోవడం. (సంక్షిప్తంగా ఇవ్వడం)
- date=సెప్టెంబరు 25 - సంవత్సరాన్ని నాలుగు అంకెలు రూపంలో ఇవ్వకపోవడం (రెండు అంకెల్లో ఇవ్వటం)
- date=10-2025 - నెల సంఖ్యారూపంలో చూపి తరువాత హైపన్ లేదా డాష్ ఇవ్వడం
- date=అక్టోబరు, 2025 - నెల పూర్తి పేరు తరువాత కామా రాయడం
చెల్లని తేదీ సమస్య ఎందుకు ఏర్పడింది?
[మార్చు]నిర్వహణ మూసలు (Maintenance Templates) Citation needed, Refimprove వంటివి వాడినప్పుడు, అందులో తేదీ ఇవ్వడం ముఖ్య ఉద్దేశం, వ్యాసంలో ఈ సమస్య ఎప్పుడు గుర్తించబడింది అని తెలుసుకోవడం (ట్రాకింగ్ (Tracking) కోసం ఇస్తారు. ఎక్కువ కాలం పరిష్కరించబడని పాత సమస్యలను మొదట పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుంది. సరైన తేదీని బట్టి, వికీపీడియా వాటిని వర్గం:Articles with unsourced statements from సెప్టెంబరు 2025 వంటి తేదీ ఆధారిత వర్గాలలో చేరుస్తుంది. మీరు తేదీని తప్పుగా ఇస్తే, ఆటోమేటిక్‌గా తేదీ ఆధారిత వర్గంలో చేరకుండా, కేవలం వర్గం:Articles with invalid date parameter in template అనే వర్గంలోకి మాత్రమే చేరుతుంది. అందుకే దీన్ని సరిచేయడం ముఖ్యం.
సరైన తేదీని ఎలా ఇవ్వాలి? (చిట్కా)
[మార్చు]ఒకవేళ మీరు తేదీని మాన్యువల్‌గా (చేత్తో) రాయడానికి బదులు, మూసను వాడినప్పుడు ఆటోమేటిక్‌గా తేదీ వచ్చేలా చేయాలనుకుంటే, సబ్‌స్టిట్యూషన్ (Substitution) అనే పద్ధతిని వాడవచ్చు. మీరు ఒక మూసను జతచేసేటప్పుడు, subst: అనే పదాన్ని వాడితే, ఆటోమేటిక్‌గా ఆ రోజు తేదీ సరైన ఫార్మాట్‌లో అక్కడ చేరిపోతుంది.
{{subst:Citation needed}} ఇలా వాడినప్పుడు, మీరు “సేవ్” చేసిన వెంటనే వికీ సిస్టమ్ ప్రస్తుత నెల, సంవత్సరంని ఆటోమేటిక్‌గా జోడిస్తుంది. ఉదాహరణకు, మీరు 2025 అక్టోబరు 14న వాడితే — సేవ్ చేసిన తర్వాత పేజీలో ఇది ఇలా రాసి ఉంటుంది.
ఉదాహరణ: {{Citation needed|date=2025 అక్టోబరు}}
అంటే subst: కారణంగా ఆ తేదీని మీరు టైప్ చేయనవసరం లేదు — వికీ స్వయంచాలకంగా దాన్ని చేర్చి వదిలేస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల, తప్పు ఫార్మాట్ ఇవ్వకుండా, ఆ వర్గంలోకి పేజీ చేరకుండా జాగ్రత్తపడవచ్చు.
ముఖ్యమైన నిర్వహణ మూసలు
[మార్చు]వికీపీడియాలో సాధారణంగా ఉపయోగించే ముఖ్యమైన నిర్వహణ మూసలు (Maintenance Templates), వాటి ఉద్దేశ్యాల పూర్తి జాబితా ఇక్కడ ఇవ్వబడింది. ఈ మూసలు వ్యాసంలో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయని సూచించడానికి వాడతారు.
| మూస | ఉద్దేశ్యం | date= ఉదాహరణ |
|---|---|---|
| మూస:Citation needed లేదా మూస:cn | ఒక నిర్దిష్ట వాక్యానికి లేదా వాదనకు మూలం (source) అవసరమని సూచించడానికి. | date=అక్టోబరు 2025 |
| మూస:Unreferenced | మొత్తం వ్యాసంలో ఎటువంటి మూలాలు ఇవ్వలేదని సూచించడానికి | date=అక్టోబరు 2025 |
| మూస:Refimprove | వ్యాసంలో మూలాలు ఉన్నప్పటికీ, అవి సరిపోవని లేదా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సూచించడానికి. | date=అక్టోబరు 2025 |
| మూస:Primary sources | వ్యాసంలో అధికంగా ప్రాథమిక మూలాలు మాత్రమే ఉపయోగించారని, తృతీయ మూలాల అవసరం ఉందని సూచించడానికి. | date=అక్టోబరు 2025 |
| మూస:More footnotes | మూలాలు ఉన్నప్పటికీ, వాటిని సరిగా పాదసూచికలుగా వాడలేదని సూచించడానికి. | date=అక్టోబరు 2025 |
నాణ్యత, ఫార్మాటింగ్ మూసలు
[మార్చు]ఈ మూసలు వ్యాసం నాణ్యత, కూర్పు లేదా ఫార్మాటింగ్‌లో లోపాలను సూచించడానికి వాడతారు.
| మూస | ఉద్దేశ్యం | date= ఉదాహరణ |
|---|---|---|
| మూస:Cleanup | వ్యాసం సరైన శైలిలో లేదని, సరిదిద్దాల్సిన అవసరం ఉందని సూచించడానికి. | date=అక్టోబరు 2025 |
| మూస:Expand | వ్యాసం చాలా చిన్నదిగా ఉందని, విస్తరించాల్సిన అవసరం ఉందని సూచించడానికి. | date=అక్టోబరు 2025 |
| మూస:NPOV language | వ్యాసం తటస్థ దృక్పథంలో లేదని, పక్షపాతంతో రాశారని సూచించడానికి. | date=అక్టోబరు 2025 |
| మూస:Wikify | వ్యాసం వికీపీడియా ఫార్మాటింగ్‌కు అనుగుణంగా లేదని సూచించడానికి (ఉదా: లింకులు, శీర్షికలు సరిగా లేకపోవడం). | date=అక్టోబరు 2025 |
| మూస:Original research లేదా మూస:Or | వ్యాసంలో ప్రచురించబడని స్వంత పరిశోధన లేదా ఊహలు ఉన్నాయని సూచించడానికి. | date=అక్టోబరు 2025 |
విషయ పరిధి, విలీనం మూసలు
[మార్చు]ఈ మూసలు వ్యాసం పరిధి లేదా ఇతర వ్యాసాలతో దాని సంబంధాన్ని నిర్వహించడానికి వాడతారు.
| మూస | ఉద్దేశ్యం | date= ఉదాహరణ | |
|---|---|---|---|
| మూస:Merge | వ్యాసాన్ని మరో వ్యాసంలో విలీనం చేయాలని ప్రతిపాదించడానికి. | date=అక్టోబరు 2025 | |
| మూస:Split | వ్యాసాన్ని విభజించి కొత్త వ్యాసాలుగా చేయాలని ప్రతిపాదించడానికి. | date=అక్టోబరు 2025 | |
| మూస:Contradict | వ్యాసంలోని భాగాల్లో పరస్పర విరుద్ధమైన సమాచారం ఉందని సూచించడానికి. | date=అక్టోబరు 2025 | |
| మూస:Technical | వ్యాసం అధికంగా సాంకేతికంగా ఉందని, సాధారణ పాఠకులకు అర్థం కావడం కష్టమని సూచించడానికి. | date=అక్టోబరు 2025 | |
| గడి పాఠ్యం | గడి పాఠ్యం | గడి పాఠ్యం |
ముఖ్య గమనికలు
- ఈ జాబితాలో తెలుగు వికీపీడియాలో తరచుగా వాడే ముఖ్యమైన మూసలు మాత్రమే ఉన్నాయి. వికీపీడియాలో వందలాది నిర్వహణ మూసలు ఉన్నాయి, కానీ వాటిలో ఎక్కువ భాగం ఈ వర్గాల కిందకే వస్తాయి. మీరు ఏ మూస వాడినా, |date= పరామితిని నెల పేరు సంవత్సరం రూపంలో ఇవ్వడం గుర్తుంచుకోండి.
- ఇది ఒక నిర్వహణ వర్గం కాబట్టి, ఎప్పుడైతే లోపాలు సరిచేయబడతాయో, అప్పుడు ఈ జాబితాలోంచి ఆ వ్యాసాలు మాయమవుతాయి. కాబట్టి, ఈ వర్గం ఎప్పుడూ ఒకే విధంగా ఉండకపోవచ్చు.
ప్రాజెక్టు విర్వాహకులు
[మార్చు]యర్రా రామారావు (చర్చ) 11:47, 22 అక్టోబరు 2025 (UTC)
ప్రాజెక్టు కాలపరిమితి
[మార్చు]2025 అక్టోబరు 25 నుండి 2025 నవంబరు 30 వరకు
ప్రాజెక్టులో పాల్గొనువారు
[మార్చు]యర్రా రామారావు (చర్చ) 11:47, 22 అక్టోబరు 2025 (UTC)