Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/యూజర్‌గ్రూపు-గూగుల్ ఎడిటథాన్-2

వికీపీడియా నుండి
పురోగతి
తేదీ ఈ ప్రాజెక్టులో సృష్టించిన పేజీలు
ప్రాజెక్టు ముగిసాక
1,585

గూగుల్ సహకారంతో చేపట్టిన కంటెంటు విస్తరణ ప్రాజెక్టులో భాగంగా ఈ ఎడిటథాన్‌ను తలపెట్టాం. ఈ శ్రేణిలో ఇది రెండవ ఎడిటథాన్. కొత్త వ్యాసాలను సృష్టించడమే ఈ ఎడిటథాన్ లక్ష్యం.

పోటీ మెటా డేటా

[మార్చు]
  • ఉద్దేశం: కొత్త వ్యాసాలను సృష్టించడం
  • మొదలయ్యేది: 2026 జనవరి 1 ఉదయం 6:00
  • ముగిసేది: 2026 ఫిబ్రవరి 1 ఉదయం 6:00
  • హంగుల మూల్యాంకనం ఫలితాల ప్రచురణ: 2026 ఫిబ్రవరి 2
  • నాణ్యత పరిశీలన: 2026 ఫిబ్రవరి 7
  • తుది ఫలితాల ప్రచురణ: 2026 ఫిబ్రవరి 8

బహుమతులు

[మార్చు]

పోటీలో మొత్తం 6 స్లాబుల్లో బహుమతులు ఉన్నాయి. వివరాలు:

బహుమతులు - అర్హతలు
క్ర.సం స్లాబ్ బహుమతుల

సంఖ్య

అర్హత -

కనీస వ్యాసాలు

బహుమతి

రూపాయల్లో

1 మొదటి స్లాబ్ 1 350 10,000
2 రెండవ స్లాబ్ 1 250 7,000
3 మూడవ స్లాబ్ 1 150 5,000
4 నాలుగవ స్లాబ్ 2 100 2,500
5 ప్రోత్సాహక స్లాబ్ 3 50 వెయ్యి రూపాయల విలువైన

వికీమీడియా వస్తువులు

గమనికలు:

  • ఏ స్లాబ్ లోనైనా కనీస వ్యాసాలు రాసినవారు ఎవ్వరూ లేకపోతే ఆ విభాగానికి బహుమతి ఇవ్వబడదు.
  • ఏ స్లాబ్ లోనైనా కనీస వ్యాసాలు రాసినవారు ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే, మొదటి స్థానంలో ఉన్నవారికి ఆ విభాగపు బహుమతి ఇవ్వబడుతుంది. మిగిలినవారు దాని కింది విభాగాల్లో బహుమతులకు అర్హత పొందుతారు.

అర్హతలు

[మార్చు]

పాల్గొనేందుకు అర్హతలు

[మార్చు]

ఒకే ఒక్క అర్హత: 2026 జనవరి 1 నాటికి వికీమీడియా ప్రాజెక్టులన్నింటి లోనూ కలిపి, కనీసం 500 దిద్దుబాట్లు చేసి ఉండాలి. ఈ పోటీ నిర్వాహకులు, యూజర్‌గ్రూపు-గూగుల్ కార్యక్రమాల నిర్వాహకులు, పరిశీలక బృంద సభ్యులూ అందరూ ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులే. అయితే పోటీ నిర్వాహకులు బహుమతులు పొందేందుకు అనర్హులు.

వ్యాసార్హతలు

[మార్చు]

వ్యాసానికి కింది అర్హతలు ఉండాలి. ఈ కనీస స్థాయి అంశాలు లేనట్లైతే, ఆ వ్యాసాన్ని పోటీకి పరిగణించం.

  • సహజమైన భాష రాయాలి. యాంత్రికానువాదాలనూ, కృతకంగా ఉండే భాషనూ సవరించి మాత్రమే ప్రచురించాలి.
  • వ్యాసం పరిమాణం కనీసం 6000 బైట్లు ఉండాలి. వాడుకరులు తమ వ్యాసాల పరిమాణాన్ని పేజీ చరిత్రలో చూసుకోవచ్చు.
  • లోనికి వచ్చే లింకు (ఇన్ కమింగు లింకు) కనీసం 1 ఉండాలి
  • బయటికి పోయే లింకులు కనీసం 1 ఉండాలి
  • కనీసం ఒక వర్గం ఉండాలి.

బొమ్మ, సమాచారపెట్టె తప్పనిసరి కాదు. కానీ ఉంటే మంచిది. మూల్యాంకనంలో వాటికి పాయింట్లు లభిస్తాయి.

గమనికలు:

  • సముచితమైన వర్గం లేకపోతే, కొత్తగా ఒక వర్గాన్ని చేర్చవచ్చు. కానీ, ఆ వర్గాన్ని ఎర్రవర్గంగా వదిలెయ్యకూడదు. దాన్ని ఒక మాతృవర్గంలో చేర్చాలి. మాతృవర్గం కూడా సరైనది లేకపోతే, ఒక కొత్త మాతృవర్గాన్ని చేఋచవచ్చు. దాన్ని కూడా ఎర్రవర్గంగా వదిలెయ్యరాదు.
  • వ్యాసం పేజీలో ప్రాజెక్టు వర్గాలు విభాగంలో చూపిన ప్రాజెక్టు వర్గాలను చేర్చరాదు

నిబంధనలు

[మార్చు]
  • వ్యాసం, పోటీ మొదలయ్యాక సృష్టించినదై ఉండాలి
  • వ్యాసాల జాబితాలు విభాగంలో ఇచ్చిన జాబితాల్లో ఉన్న వ్యాసాలను మాత్రమే సృష్టించాలి
  • సృష్టించే ముందు ఆ జాబితాలో వ్యాసాన్ని ఎంచుకుని, దానికి ఎదురుగా సంతకం చెయ్యాలి. తద్వారా ఒకే వ్యాసంపై ఇద్దరు పనిచేసే ప్రమాదం తప్పుతుంది. అనువాద పరికరంలో అది చూపించే సూచనల్లోంచి వ్యాసాన్ని ఎంచుకునేపనైతే, ఇలా సంతకాలు చెయ్యాల్సిన అవసరం లేదు.
  • పోటీ గడువు ముగిసే లోపు వ్యాసాన్ని ఎప్పుడైనా సృష్టించవచ్చు, ఎన్నిసార్లైనా దాన్ని విస్తరించవచ్చు

ఎలా పనిచెయ్యాలి?

[మార్చు]

వ్యాసాలను రెండు విధాలుగా సృష్టించవచ్చు.

అనువాద పరికరం ద్వారా అనువదించి ప్రచురించడం

[మార్చు]

అనువాద పరికరంలో "సూచనలు" లింకుకు వెళ్ళినపుడు, ఆ పేజీలో "కొత్త పేజీలను సృష్టించండి" అనే శీర్షిక కింద మూడు పేజీల జాబితా కనిపిస్తుంది. వాటిలో దేన్నైనా ఎంచుకుని రాయవచ్చు. ఆ మూడూ వద్దనుకుంటే, ఆ సూచనలకు కింద ఉన్న "సూచనలను తాజాకరించు"ను నొక్కితే వేరే మూడు వ్యాసాలను చూపిస్తుంది. ఆ విధంగా ఆ మూడేసి వ్యాసాల జాబితాల్లోంచి మీకు నచ్చిన వాటిని ఎంచుకుని అనువదించి ప్రచురించవచ్చు.

గమనిక: సూచనలు పేజీలో "కొత్త విభాగాలతో విస్తరించండి" అనే విభాగం కింద చూపించే వ్యాసాలను పట్టించుకోకండి.

నేరుగా అనువదించి ప్రచురించడం

[మార్చు]
  1. కింద వ్యాసాల జాబితాలు విభాగంలో ఇచ్చిన లింకుల ద్వారా ఆయా పేజీలకు వెళ్ళి అక్కడ ఇచ్చిన జాబితాల్లోంచి పేజీలను ఎంచుకుని నేరుగా అనువదించి ప్రచురించవచ్చు.
  2. పై జాబితా పేజీల్లో మీరు ఎంచుకున్న వ్యాసాలకు ఎదురుగా సంతకం పెట్టి రిజర్వు చేసుకోండి. ఆ తర్వాతే వ్యాసాలు సృష్టించే పని మొదలుపెట్టండి. ఒక్కొక్క జాబితా లోంచి గరిష్ఠంగా 5 వ్యాసాలను ఎంచుకోండి. మరీ ఎక్కువ ఎంచుకోకండి. మీ ఇష్టమొచ్చిన జాబితాల్లోంచి పేజీలను ఎంచుకోండి. ప్రతి జాబితాలోనూ వ్యాసాలను ఎంచుకోవాలని నిబంధనేమీ లేదు.
  3. వ్యాసాన్ని ప్రచురించాక, దాని చరిత్ర పేజీకి వెళ్ళి, ఎన్ని బైట్లుందో చూడండి. అది కనీసం 6000 బైట్లు ఉండాలి. ఒకవేళ తక్కువ ఉంటే.. మరేం పర్లేదు, మరి కాస్త సమాచారం చేర్చి, దాన్ని విస్తరించండి. 6000 బైట్లు దాటించండి.
  4. ఆ తరువాత వ్యాసపు చర్చ పేజీలో {{వికీప్రాజెక్టు యూజర్‌గ్రూపు-గూగుల్ ఎడిటథాన్-2 లో భాగం}} అనే మూసను చేర్చండి. ఇక మీరు వ్యాసాన్ని పోటీకి సమర్పించినట్లే.
  5. పోటీకి సమర్పించిన వ్యాసాల్లో, గడువు ముగిసే లోపు ఎన్ని సార్లైనా ఎన్ని మార్పులైనా చేయవచ్చు, విస్తరించవచ్చు.

మూల్యాంకనం

[మార్చు]

పోటీ ముగిసాక మూల్యాంకనం చేస్తాం. ఇది రెండు విధాలుగా జరుగుతుంది - 1. హంగుల మూల్యాంకనం, 2. నాణ్యతా పరిశీలన

హంగుల మూల్యాంకనం

[మార్చు]

వ్యాసంలో ఉన్న వివిధ అంశాలను (మెటాడేటా వగైరా) బట్టి ఆ వ్యాసానికి పాయింట్లు లభిస్తాయి. వ్యాసం పరిమాణం, పదాల సంఖ్య, వ్యాసంలో ఉండాల్సిన హంగులూ మొదలైన లెక్కించదగ్గ అంశాలు ఇందులో భాగం. ఈ అంశాలు ఉన్న సంఖ్యను బట్టి వ్యాసానికి పాయింట్లు ఇస్తాం. మూల్యాంకన ఫలితాలను ఒక పేజీలో ప్రచురిస్తాం. ఎవరెవరికి ఎన్నేసి పాయింట్లు వచ్చాయో అందరూ చూసుకోవచ్చు.

పాయింట్ల లెక్కింపు

[మార్చు]
  • పరిగణన లోకి తీసుకున్న ప్రతి వ్యాసానికీ: 3 పాయింట్లు
  • ప్రతీ బైట్‌కు: 0.005 పాయింట్లు
  • ప్రతీ పదానికీ: 0.05 పాయింట్లు
  • ప్రతీ మూలానికీ: 2 పాయింట్లు. గరిష్ఠ పరిమితి 5 మూలాలు. అంటే 5 కంటే ఎక్కువ మూలాలు ఉన్నా వచ్చేది 10 పాయింట్లే. గరిష్ఠ పరిమితి లేదు. కానీ, ప్రతి వెయ్యి బైట్ల వ్యాస పరిమాణానికీ ఒక మూలాన్ని మాత్రమే పరిగణిస్తాం. ఉదాహరణకు, 21400 బైట్లు ఉన్న ఒక వ్యాసంలో 34 మూలాలు ఉన్నాయనుకోండి. వాటిలో 21 మూలాలను మాత్రమే లెక్కింపుకు పరిగణిస్తాం. అతి-ఉల్లేఖనను లెక్కించకుండా ఉండేందుకు ఈ పద్ధతిని పాటిస్తాం.
    • మళ్ళీ మళ్ళీ వాడిన మూలానికి: 1 పాయింటు.
  • ప్రతీ బొమ్మకు: 2 పాయింట్లు. గరిష్ఠ పరిమితి: 5. అంటే 5 కంటే ఎక్కువ బొమ్మలు పెట్టినా వచ్చేది 10 పాయింట్లే.
  • లోనికి వచ్చే ప్రతి లింకుకు: 3 పాయింట్లు. గరిష్ఠ పరిమితి 5. (కనీసం ఒక్క లింకైనా లేకపోతే పొటీకి పరిగణించం)
  • బయటికి పోయే ప్రతి లింకుకు: 1 పాయింట్లు. గరిష్ఠ పరిమితి 5. (కనీసం ఒక్క లింకైనా లేకపోతే పొటీకి పరిగణించం)
  • వర్గీకరణ: ప్రతి వర్గానికి 2 పాయింట్లు. గరిష్ఠ పరిమితి 5. సరైన వర్గం లేకపోతే కొత్త వర్గాన్ని సృష్టించవచ్చు. కానీ దాన్ని ఎర్రవర్గంగా వదిలెయ్యరాదు, తప్పనిసరిగా దాన్ని ఒక మాతృవర్గంలోకి వెయ్యాలి. ఆ మాతృవర్గాన్ని కూడా అవసరమైతే సృష్టించవచ్చు. దాన్ని కూడా ఒక మాతృవర్గం లోకి వెయ్యాలి (కొత్త వర్గాలను సృష్టించడంలో అవసరమైతే నిర్వాహకుల సహాయం తీసుకోవచ్చు).
  • సమాచారపెట్టె: పెట్టె ఉంటే 3 పాయింట్లు. లేకపోతే 0.

నాణ్యతా మూల్యాంకనం

[మార్చు]

వ్యాసాల్లో భాష, శైలి వంటి నాణ్యతాంశాలను ఒక పరిశీలక బృందం పరిశీలిస్తుంది. ఈ బృందంలో ముగ్గురు వరకూ సభ్యులుంటారు. ఒక్కో వాడుకరి పోటీకి సమర్పించిన వ్యాసాల్లోంచి మచ్చుకు కొన్ని తీసుకుని వాటి నాణ్యతను గణించి, ఆ వ్యాసాలకు వచ్చిన సగటు నాణ్యత స్కోరును (శాతంలో) తయారు చేస్తారు. ఈ స్కోరును ఆ వాడుకరి రాసిన అన్ని వ్యాసాలకూ వర్తింపజేస్తారు. ఉదాహరణకు,

  • ఒక వాడుకరి మొత్తం 300 వ్యాసాలను సమర్పించారు.
  • హంగుల మూల్యాంకనంలో 6000 పాయింట్లు వచ్చాయి.
  • పరిశీలక బృందం, వాటి లోంచి ఒక ఐదో పదో వ్యాసాలను పరిశీలించి వాటి నాణ్యతను 70% గా గణించింది.
  • ఈ 70 శాతాన్ని ఆ వాడుకరికి వచ్చిన మొత్తం పాయింట్లపై వర్తింప జేస్తే వారి మొత్తం పాయింట్లు 4200 (6000 X 70%) అవుతాయి.

హంగుల మూల్యాంకనం, నాణ్యతా పరిశీలన రెండూ పూర్తయ్యాక వచ్చిన అంతిమ పాయింట్లను బట్టి పోటీ విజేతల జాబితా తయారౌతుంది.

వ్యాసాల జాబితాలు

[మార్చు]

కింది లింకుల ద్వారా వ్యాసాల జాబితాలను చూడవచ్చు. ఈ జాబితాల్లో ఇచ్చిన ఇంగ్లీషు వికీపీడియా వ్యాసాలను ఎంచుకుని, వాటికెదురుగా సంతకం చేసి, ఆపై వ్యాసాన్ని సృష్టించండి.

మొత్తం వ్యాసాలు: 9091 # తెలుగు టీవీ కార్యక్రమాలు - 98 వ్యాసాలు

  1. భారతదేశ విదేశీ సంబంధాలు - 173 వ్యాసాలు
  2. తెలంగాణ వ్యాసాలు - 153 వ్యాసాలు
  3. ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు - 129 వ్యాసాలు
  4. ఆంధ్రప్రదేశ్ భౌగోళికం, ఆర్థిక, పర్యావరణాంశాలు - 109 వ్యాసాలు
  5. వివిధ దేశాల జాతీయ క్రికెట్ జట్లు, సంఘాలు - 233 వ్యాసాలు (2026 లో జరగబోయే టి20 క్రికెట్ ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని క్రికెట్ వర్గపు విస్తరణ)
  6. క్రికెట్ టి20 ప్రపంచ కప్ ఆటగాళ్ళు - 297 పేజీలు (2026 ఫిబ్రవరిలో టి20 క్రికెట్ ప్రపంచ కప్ భారతదేసంలో జరగబోతోంది. అందులో ఆడబోయే ఆటగాళ్ళు ఈ జాబితాలో ఉంటారు)

# ఆంధ్రప్రదేశ్ ఇతరత్రా - 68 వ్యాసాలు

  1. జాతీయ పురస్కారం పొందిన సినిమాలు - 152 వ్యాసాలు
  2. జాతీయ పురస్కారం పొందిన సినిమా వ్యక్తులు - 51 వ్యాసాలు
  3. తెలుగు సినిమాలు - 114 వ్యాసాలు
  4. హిందూమతం-1 - 322 వ్యాసాలు
  5. హిందూ దేవాలయాలు-1 - 322 వ్యాసాలు
  6. హిందూ దేవాలయాలు-2 - 319 వ్యాసాలు
  7. గతకాలపు రాజ్యాలు-1 - 276 వ్యాసాలు
  8. గతకాలపు రాజ్యాలు-2 - 276 వ్యాసాలు
  9. గతకాలపు రాజ్యాలు-3 - 276 వ్యాసాలు
  10. గతకాలపు రాజ్యాలు-4 - 259 వ్యాసాలు
  11. వృక్ష శాస్త్రం - 260 వ్యాసాలు
  12. పర్యావరణం - 938 వ్యాసాలు
  13. భౌతిక శాస్త్రం - 205 పేజీలు
  14. జంతు శాస్త్రం1 - 270 వ్యాసాలు
  15. జంతు శాస్త్రం2 - 270 వ్యాసాలు
  16. జంతు శాస్త్రం3 - 282 వ్యాసాలు
  17. అర్థశాస్త్రం - 335 వ్యాసాలు
  18. పురాతత్వ శాస్త్రం-1 - 325 వ్యాసాలు
  19. పురాతత్వ శాస్త్రం-2 - 323 వ్యాసాలు
  20. రసాయన శాస్త్రం - 273 వ్యాసాలు
  21. భారతీయ మిలిటరీ - 255 వ్యాసాలు
  22. భారతీయ వాయుసేన - 161 వ్యాసాలు
  23. భారతీయ నావికాదళం - 230 వ్యాసాలు
  24. భారతీయ సైన్యం - 173 వ్యాసాలు
  25. పద్మ పురస్కార గ్రహీతలు-2 - 377 వ్యాసాలు
  26. పద్మ పురస్కార గ్రహీతలు-3 - 375 వ్యాసాలు
  27. ప్రధాన దేశాల టీ20 ఆటగాళ్ళు - 412 వ్యాసాలు

ప్రాజెక్టు వర్గాలు

[మార్చు]

ఉపయోగపడే పేజీలు

[మార్చు]

పాల్గొనే వాడుకరులు

[మార్చు]

ఈ ఎడిటథాన్‌లో పాల్గొనదలచిన వాడుకరులు ఇక్కడ సంతకం చెయ్యండి.

  1. కె.వెంకటరమణచర్చ 02:28, 1 జనవరి 2026 (UTC)[ప్రత్యుత్తరం]
  2. యర్రా రామారావు (చర్చ) 03:30, 1 జనవరి 2026 (UTC)[ప్రత్యుత్తరం]
  3. చదువరి (చర్చరచనలు) 03:40, 1 జనవరి 2026 (UTC)[ప్రత్యుత్తరం]
  4. బత్తిని వినయ్ కుమార్ గౌడ్ (చర్చ) 06:20, 1 జనవరి 2026 (UTC)[ప్రత్యుత్తరం]
  5. Muralikrishna m (చర్చ) 08:03, 1 జనవరి 2026 (UTC)[ప్రత్యుత్తరం]
  6. గౌరీపతి (చర్చ) 1 జనవరి 2026 09:47 (UTC)
  7. ఉదయ్ కిరణ్ (చర్చ) 03:30, 1 జనవరి 2026 (UTC)[ప్రత్యుత్తరం]
  8. V.J.Suseela (చర్చ) 13:10, 2 జనవరి 2026 (UTC)[ప్రత్యుత్తరం]
  9. --Rajasekhar1961 (చర్చ) 13:51, 2 జనవరి 2026 (UTC)[ప్రత్యుత్తరం]
  10. Kasyap (చర్చ) 07:56, 16 జనవరి 2026 (UTC)[ప్రత్యుత్తరం]
  11. 【🎤PBR✍】 10:33, 16 జనవరి 2026 (UTC)[ప్రత్యుత్తరం]
  12. Kalasagary (చర్చ) 13:26, 17 జనవరి 2026 (UTC)[ప్రత్యుత్తరం]
  13. Srinivasrjy (చర్చ) 07:01, 20 జనవరి 2026 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి పెట్టెలు, టాప్‌ఐకన్లు

[మార్చు]

ఈ వాడుకరి పెట్టెను గానీ, టాప్‌ఐకన్ను గానీ, రెంటినీ గానీ మీ వాడుకరి పేజీలో పెట్టుకోండి. మీరు "వర్గం:వికీప్రాజెక్టు యూజర్‌గ్రూపు-గూగుల్ ఎడిటథాన్-2 ప్రాజెక్టులో కృషి చేసిన వాడుకరులు" అనే వర్గం లోకి చేరుతారు.

నిర్వహణ

[మార్చు]

చదువరి

నివేదిక

[మార్చు]

ప్రాజెక్టు నివేదికను వికీపీడియా:వికీప్రాజెక్టు/యూజర్‌గ్రూపు-గూగుల్ ఎడిటథాన్-2/నివేదిక వద్ద చూడవచ్చు.

సాధించిన పాయింట్లు

[మార్చు]

గడువు ముగిసాక, హంగుల మూల్యాంకనం తరువాత పోటీదారులు సాధించిన పాయింట్లు:

గడువు ముగిసాక హంగుల మూల్యాంకనంలో వాడుకరులు సాధించిన పాయింట్లు మొత్తం
వాడుకరి వ్యాసాల సంఖ్య మూలాలు కొత్త వ్యాసం పరిమాణం (బైట్లు) బయటికి పోయే

లింకులు

లోనికి వచ్చే

లింకులు

వర్గాలు బొమ్మలు స.పెట్టె పదాలు
K.Venkataramana 463 11660 1389 45,962 2,315 3,441 3,858 3,950 1,365 13,868 87,808
యర్రా రామారావు 3 66 9 250 15 12 20 8 9 56 444
Chaduvari 220 7990 660 25,837 1,093 1,680 1,230 630 540 5,470 45,130
Batthini Vinay Kumar Goud 460 9388 1380 30,527 2,250 3,450 3,410 998 1,299 5,555 58,257
Muralikrishna m 126 2162 378 6,389 618 798 604 220 303 1,387 12,859
Vgouripathi 63 1564 189 5,379 312 354 196 356 168 1,271 9,789
ఉదయ్ కిరణ్ 101 1662 303 5,119 499 327 612 218 273 1,215 10,228
Vjsuseela 12 326 36 1,291 60 78 60 42 33 377 2,303
Rajasekhar1961 1 14 3 76 5 3 10 -   3 25 138
WikiPBR 5 122 15 558 25 27 12 28 12 49 848
Kasyap 34 510 102 1,586 165 108 160 64 90 444 3,229
Kalasagary 7 38 21 343 34 24 34 2 18 121 635
Srinivasrjy 51 818 153 3,403 255 198 338 94 138 826 6,222

కోల్పోయిన పాయింట్లు

[మార్చు]

వ్యాసానికి ఉండాళ్సిన కనీస అర్హతలు లేనందున 39 వ్యాసాలను పోటీకి స్వీకరించలేదు. వాడుకరి వారీగా ఎన్ని వ్యాసాలు, ఎన్ని పాయింట్లు కోల్పోయారో ఈ పట్టిక చూపిస్తుంది.

గడువు ముగిసాక వివిధ అంశాల్లో కోల్పోయిన పాయింట్లు మొత్తం
వాడుకరి వ్యాసాల సంఖ్య మూలాలు కొత్త వ్యాసం పరిమాణం (బైట్లు) బయటికి పోయే

లింకులు

లోనికి వచ్చే

లింకులు

వర్గాలు బొమ్మలు స.పెట్టె పదాలు
K.Venkataramana 1 30 3 70 5 3 0 2 0 13 126
యర్రా రామారావు 0 0 0 0 0 0 0 0 0 0 0
Chaduvari 3 96 9 262 15 0 12 6 9 72 481
Batthini Vinay Kumar Goud 1 26 3 62 5 0 10 2 3 11 122
Muralikrishna m 0 0 0 0 0 0 0 0 0 0 0
Vgouripathi 11 248 33 835 55 27 30 78 21 219 1,545
ఉదయ్ కిరణ్ 14 202 42 640 70 18 44 34 39 142 1,231
Vjsuseela 1 26 3 98 5 0 10 2 3 29 176
Rajasekhar1961 0 0 0 0 0 0 0 0 0 0 0
WikiPBR 3 32 9 199 15 9 0 2 9 40 315
Kasyap 1 20 3 45 5 0 8 6 3 7 97
Kalasagary 4 10 12 96 20 15 20 12 12 23 220
Srinivasrjy 0 0 0 0 0 0 0 0 0 0 0
మొత్తం 39 690 117 2,307 195 72 134 144 99 555 4,312

ఆ 39 ఏవంటే

[మార్చు]

పోటీకి స్వీకరించని ఆ 39 వ్యాసాలు, స్వీకరించకపోవడానికి కారణం కింది పట్టికలో చూడవచ్చు.

క్ర.సం వ్యాసం వాడుకరిపేరు పోటీకి స్వీకరించకపోవడానికి

కారణం

1 బెంగళూరులోని చోళ దేవాలయాల జాబితా K.Venkataramana వర్గాల్లేవు
2 అరిఫుల్ హక్ Batthini Vinay Kumar Goud లోనికి వచ్చే లింకుల్లేవు
3 ఇందిరా నాయుడు Chaduvari లోనికి వచ్చే లింకుల్లేవు
4 సుదీక్ష కోణంకి అదృశ్యం Chaduvari లోనికి వచ్చే లింకుల్లేవు
5 పి.సి.ఎస్.దేవర Chaduvari లోనికి వచ్చే లింకుల్లేవు
6 సింగంపల్లి సత్యనారాయణ Kalasagary పేజీ పరిమాణం తక్కువ
7 చెన్నాప్రగడ శర్మ Kalasagary పేజీ పరిమాణం తక్కువ
8 నాగిశెట్టి (కార్టూనిస్ట్) Kalasagary పేజీ పరిమాణం తక్కువ
9 రాబర్ట్ వుడ్రో విల్సన్ Kalasagary పేజీ పరిమాణం తక్కువ
10 అవతార్ సింగ్ చీమా Kasyap లోనికి వచ్చే లింకుల్లేవు
11 నం 222 స్క్వాడ్రన్ భారతీయ వాయు సేన Vgouripathi లోనికి వచ్చే లింకుల్లేవు
12 నెం.18 స్క్వాడ్రన్, భారతీయ వాయు సేన Vgouripathi లోనికి వచ్చే లింకుల్లేవు
13 No. 108 స్క్వాడ్రన్, ఐ ఏ యఫ్ Vgouripathi లోనికి వచ్చే లింకుల్లేవు
14 ఒంగోలు పశువులు Vgouripathi వర్గాల్లేవు
15 విజయవాడలో యాత్రికులను ఆకర్షించే స్థలాలు Vgouripathi వ్యాసం ఈసరికే ఉంది
16 ఆర్మీ కేడట్ కాలేజి Vgouripathi వర్గాల్లేవు
17 బాఘోర్ రాయి Vgouripathi లోనికి వచ్చే లింకుల్లేవు
18 డైరెక్టరేట్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఇండియా) Vgouripathi వర్గాల్లేవు
19 బెగ్రామ్ దంతకళలు Vgouripathi వర్గాల్లేవు
20 గాస్ అటవీ మ్యూజియం Vgouripathi లోనికి వచ్చే లింకుల్లేవు
21 రవి వడ్లమాని Vgouripathi లోనికి వచ్చే లింకుల్లేవు
22 లాండోల్ట్-బోర్న్ స్టెయిన్ పుస్తకాల శ్రేణి Vjsuseela లోనికి వచ్చే లింకుల్లేవు
23 సికింద్రాబాద్ - మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలు WikiPBR లోనికి వచ్చే లింకుల్లేవు
24 పంచతంత్రం (ధారావాహిక) WikiPBR లోనికి వచ్చే లింకుల్లేవు, వర్గాల్లేవు
25 కొంచెం టచ్ లో ఉంటె చెప్తా WikiPBR లోనికి వచ్చే లింకుల్లేవు
26 రామ కాంత్ శుక్లా ఉదయ్ కిరణ్ వ్యాసం ఈసరికే ఉంది
27 గోకులోత్సవ్జీ మహారాజ్ ఉదయ్ కిరణ్ వర్గాల్లేవు
28 చంద్రకాంత్ శేథ్ ఉదయ్ కిరణ్ వ్యాసం ఈసరికే ఉంది
29 ఆర్. ఎన్. జో డిక్రూజ్ ఉదయ్ కిరణ్ లోనికి వచ్చే లింకుల్లేవు
30 సచ్చిదానంద సహాయ్ ఉదయ్ కిరణ్ వర్గాల్లేవు
31 నాగనాథ్ నాయికవాడి ఉదయ్ కిరణ్ వ్యాసం ఈసరికే ఉంది
32 యెషి ధొండెన్ ఉదయ్ కిరణ్ వర్గాల్లేవు
33 శారయు దాఫ్తరీ ఉదయ్ కిరణ్ వ్యాసం ఈసరికే ఉంది
34 కె. ఎం. బినమోల్ ఉదయ్ కిరణ్ వర్గాల్లేవు
35 2015 ఆంధ్రప్రదేశ్ ఎన్ కౌంటర్ ఉదయ్ కిరణ్ లోనికి వచ్చే లింకుల్లేవు
36 ఆంధ్రప్రదేశ్ లోని పండుగల జాబితా ఉదయ్ కిరణ్ వర్గాల్లేవు
37 ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ఉదయ్ కిరణ్ వర్గాల్లేవు
38 గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఉదయ్ కిరణ్ వ్యాసం ఈసరికే ఉంది
39 బిల్లిపురం నాగరాజు హత్య ఉదయ్ కిరణ్ లోనికి వచ్చే లింకుల్లేవు, వర్గాల్లేవు

చేర్చిన బైట్లు

[మార్చు]

ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్కో వాడుకరి తెవికీలో చేర్చిన బైట్లు కింది పట్టికలో చూడవచ్చు

వాడుకరి వ్యాసాల సంఖ్య బైట్లు మెగాబైట్లు
K.Venkataramana 464 92,06,433 8.78
Batthini Vinay Kumar Goud 461 61,17,696 5.83
Chaduvari 223 52,19,756 4.98
Muralikrishna m 126 12,77,771 1.22
ఉదయ్ కిరణ్ 115 11,51,954 1.10
Vgouripathi 74 12,42,701 1.19
Srinivasrjy 51 6,80,532 0.65
Kasyap 35 3,26,132 0.31
Vjsuseela 13 2,77,779 0.26
Kalasagary 11 87,819 0.08
WikiPBR 8 1,51,374 0.14
యర్రా రామారావు 3 49,911 0.05
Rajasekhar1961 1 15,143 0.01
Pravallika16 1 11,174 0.01
మొత్తం 1,586 2,58,16,175 24.62

తుది ఫలితాలు ప్రైజుల ప్రకటన

[మార్చు]

అనుకున్న సమయానికి తుది ఫలితాలు వచ్చేసాయి. వాటి వివరాలను కింది పట్టికలో చూడవచ్చు. ముందుగా నాణ్యతా మూల్యాంకనం, దాని పర్యవసానం ఎలా ఉందో చూద్దాం.

నాణ్యతా మూల్యాంకనం

[మార్చు]

వ్యాసంలో ఉండాల్సిన హంగులను మూల్యాంకనం చెయ్యడానికి యంత్రం చాలు. కానీ, భాష నాణ్యతనూ, శైలినీ లెక్కవెయ్యడం యంత్రాల వల్ల కాదు. దానికి మనుషులు కావాలి. మనకోసం పవన్ సంతోష్‌ గారు, విజె సుశీల గారు ఈ పని చేసిపెట్టేందుకు ముందుకొచ్చారు.

కింది పట్టికలో నాలుగవ కాలమ్‌లో చూపిన విధంగా మొత్తం 32 వ్యాసాలను ఇద్దరూ పరిశీలించారు (సుశిల గారు 30 మాత్రమే చూసారు. తాను రాసిన 2 వ్యాసాలను పక్కనపెట్టారు. ఆ రెంటినీ పవన్ గారు మాత్రమే పరిశీలించారు)

ఒక్కొక్క వ్యాసాన్నీ సూక్ష్మంగా పరిశీలించి వారిద్దరూ ఇచ్చిన నాణ్యత శాతాల నుంచి, వాడుకరి వారీగా సగటును కట్టాం. ఆ సగటే ఆ వాడుకరి నాణ్యత శాతం. ఈ నాణ్యత శాతంతో ఆ వాడుకరి సాధించిన పాయింట్లను హెచ్చవేసాం. అప్పుడు వచ్చిన పాయింట్లే తుది ర్యాంకు.

ప్రైజు గ్రహీతలు

[మార్చు]

ఇక ప్రైజు గ్రహీతలను ఎలా నిశ్చయించామంటే..

పైన చూపినట్లు స్లాబుల వారీగా ఎవరెవరు ఏ స్లాబులో ఉన్నారో చూసాం. అది ఇలా ఉంది

  • మొదటి స్లాబులో (350+) ఇద్దరు - వెంకటరమణ (68,490), వినయ్ కుమార్ (48,237) - ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎక్కువ పాయింట్లు వచ్చిన వెంకటరమణకు మొదటి ప్రైజు లభించింది.
  • రెండవ స్లాబులో (250+) ఎవరూ లేరు. అయితే, పై స్లాబులో రెండవ స్థానంలో నిలిచిన వినయ్ కుమార్‌కు ఈ ప్రైజు ఆటోమాటిగ్గా లభించింది.
  • మూడవ స్లాబులో (150+) కూడా ఎవరూ లేరు. దీనికి పైనున్న రెండు స్లాబుల్లో కూడా ప్రైజు లభించనివారు ఎవరూ లేరు. అంచేత ఈ ప్రైజు ఎవరికీ చెందలేదు.
  • నాలుగవ స్లాబులో (100+) ఇద్దరు - మురళీకృష్ణ (10,651), ఉదయ్ కిరణ్ (7,382) ఉన్నారు. నాలుగవ స్లాబులో రెండు ప్రైజులున్నాయి. ఆ రెండూ వీరిద్ద్రికీ లభించాయి.
  • ఐదవ స్లాబులో మూడు ప్రైజులున్నాయి. కానీ, అర్హత మాత్రం ఇద్దరే సాధించారు. ఆ ఇద్దరు - గౌరీపతి (7,733), శ్రీనివాస్ (5,216) లకు ప్రైజులు లభించాయి.
వాడుకరిపేరు సృష్టించిన

వ్యాసాలు

సాధించిన

పాయింట్లు

నాణ్యత కోసం

పరిశీలించిన వ్యాసాల సంఖ్య

నాణ్యత శాతం నాణ్యత శాతాన్ని

వర్తింప జేసాక

వచ్చిన పాయింట్లు

ఫైనల్

పాయింట్ల ప్రకారం ర్యాంకు

వ్యాసాల సంఖ్యను

బట్టి ఏ స్లాబులో ఉన్నారు

అంతిమంగా

అర్హత పొందిన ప్రైజు

వాడుకరి:K.Venkataramana 463 87,808 5 78.00% 68,490 1 1 1
వాడుకరి:Batthini Vinay Kumar Goud 460 58,257 5 82.80% 48,237 2 1 2
వాడుకరి:Muralikrishna m 126 12,859 3 82.83% 10,651 3 4 4
వాడుకరి:ఉదయ్ కిరణ్ 101 10,228 3 72.17% 7,382 5 4 4
వాడుకరి:Vgouripathi 63 9,789 3 79.00% 7,733 4 5 5
వాడుకరి:Srinivasrjy 51 6,222 3 83.83% 5,216 6 5 5
వాడుకరి:Kasyap 34 3,229 2 78.50% 2,535 7
వాడుకరి:Vjsuseela 12 2,303 2 87.50% 2,015 8
వాడుకరి:Kalasagary 7 635 2 77.75% 494 10
వాడుకరి:WikiPBR 5 848 2 75.75% 642 9
వాడుకరి:యర్రా రామారావు 3 444 1 85.00% 378 11
వాడుకరి:Rajasekhar1961 1 138 1 78.50% 109 12

పోటీలో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు. బహుమతులు సాధించిన వారందరికీ అభినందనలు. మిగిలినవారికి ధన్యవాదాలు, అభినందనలు.

దీనితో ఈ ఎడిటథాన్-2 ముగిసింది. ఇక ప్రైజుల వితరణ అంకాన్ని ప్రాజెక్టు పెద్దలు నడిపిస్తారు. అందరికీ నమస్కారం.

ఎడిటతాన్ 2-ముగింపు

[మార్చు]

ఎడిటతాన్ 2 ముగిసింది. అధిక వ్యాసాలు వచ్చేటట్లుగా నిర్వహించిన చదువరిగారికి ధన్యవాదాలు. మొత్తం 1586 వ్యాసాలు వచ్చాయి. పోటీలో మొత్తం 14 మంది పాల్గొన్నారు. అందరికి ధన్యవాదాలు. విజేతలందరికి అభినందనలు.

ఎడిటతాన్-2 బహుమతికి అర్హులైన విజేతల పేర్లు క్రింద ఇస్తున్నాను.

  1. K.Venkataramana
  2. Batthini Vinay Kumar Goud
  3. Muralikrishna m
  4. ఉదయ్ కిరణ్
  5. Vgouripathi
  6. Srinivasrjy

విజేతలందరు తమ పూర్తి పేరు, వాడుకరి నామం, మొబైల్ నంబరు, మెయిల్ అడ్రస్ వివరాలు మెయిల్ చేయండి.

Email Address=contact@tewikipedia.org.

ఈ వివరాలు బహుమతులు అందచేయడానికి వీలుగా బాలర్క్ ఫౌండేషన్ కు పంపవలసి ఉంటుంది.

ధన్యవాదాలు V.J.Suseela (చర్చ) 05:03, 8 ఫిబ్రవరి 2026 (UTC)[ప్రత్యుత్తరం]

వివరాలు బాలర్క్ ఫౌండేషన్ కు పంపడం జరిగింది.వారు 6 గురి విజేతలకు బహుమతుల వోచర్లు పంపారు. అందరు అందుకున్నామని తెలియచేసారు.V.J.Suseela (చర్చ) 16:30, 9 మార్చి 2026 (UTC)[ప్రత్యుత్తరం]