వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021
ఈ వికీప్రాజెక్టు కాలం విజయవంతంగా ముగిసింది. |
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.
వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్‌లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఎలా పాల్గొనాలి?
[మార్చు]ఇందులో పాల్గొనే ముందు, కింద చూపిన సూచనలు, నియమాలను సంపూర్ణంగా చదవడం ముఖ్యం. ఈ నియమాలను పాటించకపోతే, మీ దిద్దుబాట్లు పోటీకి అనర్హమయ్యే అవకాశం ఉంది.
మీకు ఈసరికే ఏ వికీమీడియా ప్రాజెక్టులోనైనా ఖాతా ఉంటే అందులోకి లాగినవండి. ఖాతా లేకపోతే, వికీపీడియాలో ఖాతా తెరవండి (ఈ ఖాతాను తెలుగు వికీపీడియాలోనే తెరవాలని ఏమీ లేదు, ఏ భాషా వికీపీడియా లోనైనా తెరవవచ్చు). వికీపీడియా ఏయే భాషల్లో ఉందో ఇక్కడ చూడవచ్చు.
ఫొటో చేర్చాల్సిన అవసరమున్న వ్యాసం ఒకదాన్ని ఎంచుకోండి. ఇలాంటి వ్యాసాలను పట్టుకోవడానికి కింది వర్గాలను చూడవచ్చు. ఈ వర్గాలు ఎందులోనూ లేని వ్యాసాల్లో కూడా బొమ్మలు లేకుండా ఉండే అవకాశం ఉంది. అలాంటి వ్యాసాల్లో కూడా బొమ్మను చేర్చవచ్చు. అలాగే ఈ వర్గం లోని వ్యాసాల్లో కొన్నిటిలో బొమ్మ ఉండి ఉండవచ్చు కూడా. అలాంటి వ్యాసాలలో మరో బొమ్మను చేర్చకండి. చేర్చినా అవి పోటీ లోకి పరిగణించబడవు.
- వర్గం:బొమ్మలు కావలసిన గ్రామాల వ్యాసాలు (525 వ్యాసాలు)
- వర్గం:బొమ్మలు కావలసిన వ్యక్తుల వ్యాసాలు (2,114 వ్యాసాలు)
- వర్గం:బొమ్మలు కావలసిన సినిమా వ్యాసాలు (679 వ్యాసాలు)
- వర్గం:బొమ్మలు కావలసిన పుస్తకాల వ్యాసాలు (280 వ్యాసాలు)
- వర్గం:బొమ్మలు కావలసిన శాస్త్ర సాంకేతిక వ్యాసాలు (16 వ్యాసాలు)
- వర్గం:బొమ్మలు కావలసిన సంస్థల వ్యాసాలు (0 వ్యాసాలు)
- వర్గం:బొమ్మలు కావలసిన చరిత్ర వ్యాసాలు (0 వ్యాసాలు)
- వర్గం:బొమ్మలు కావలసిన వ్యాసాలు (308 వ్యాసాలు) - పై వర్గాలకు చెందని వ్యాసాలు ఈ వర్గంలో ఉంటాయి.
- గమనిక: పై వర్గాల్లో "చర్చ:" పేరుబరి లోని పేజీలుంటాయి. బొమ్మలను చేర్చవలసినది ఈ పేజీల్లో కాదు; వాటికి సంబంధించిన వ్యాసాల పేజీల్లో చేర్చాలి.
కామన్సులో సముచితమైన బొమ్మ ఒకదాన్ని ఎంచుకోండి. సరైన బొమ్మ పేరును గానీ, వర్గం పేరును గానీ వాడి బొమ్మ కోసం వెతకండి. వేతికేందుకు అనేక పద్ధతులున్నాయి. బొమ్మలను వాడడంలో సూచనల కోసం ఇది చూడండి. బొమ్మలను చేర్చడం లోని ఉద్దేశం, వ్యాసానికి సంబంధించిన వ్యక్తులు, వస్తువులు, కార్యకలాపాలు, భావనలకు సంబంధించిన బొమ్మలతో వ్యాస విషయం గురించి తెలుసుకోవడంలో పాఠకులకు మరింత సహాయపడడమే. బొమ్మకు వ్యాసానికి ఉన్న సంబంధ మేంటనేది స్పష్టంగా తెలిసిపోతూ ఉండాలి. బొమ్మలు ప్రధానంగా అలంకారం కోసం కాకుండా వ్యాసంలో సందర్భోచితంగా ఉండాలి.
వ్యాసంలో బొమ్మను ఎలా చేర్చాలో తెలుసుకునేందుకు సహాయం:విజువల్ ఎడిటరుతో బొమ్మల పరిచయం/3 పేజీ చూడండి. వ్యాసం పేజీలో ఏ విభాగంలో బొమ్మను చేర్చితే సముచితంగా ఉంటుందో, ఎక్కడ పెడితే పాఠకుడి అవగాహనకు దోహదపడుతుందో ఆ విభాగాన్ని ఎంచుకోండి. "సవరించు" నొక్కి బొమ్మను చొప్పించండి. బొమ్మ వ్యాసంలో దేన్ని వర్ణిస్తోందో చెబుతూ క్లుప్తంగా కొంత వివరణను చేర్చండి. అందుబాటులో ఉన్న అత్యుత్తమ నాణ్యత గల బొమ్మలను వాడండి. సరైన నాణ్యత లేని బొమ్మలను —మసకగా, అస్పష్టంగా ఉన్నవి; బొమ్మలో వస్తువు బాగా చిన్నవిగా ఉన్నవి, అనేక వస్తువుల మధ్య దాగి ఉన్నవి,సందిగ్ధంగా ఉన్నవి; వగైరా— కచ్చితంగా తప్పనిసరైతే తప్ప వాడరాదు. వ్యాస విషయాన్ని ఏ బొమ్మలు అత్యుత్తమంగా వర్ణిస్తాయో జాగ్రత్తగా ఆలోచించండి. మీరు చేసే దిద్దుబాటు లన్నిటికీ తప్పనిసరిగా దిద్దుబాటు సారాంశాన్ని ఇవ్వాలి. "మునుజూపు" చూసుకుని ఏమైనా మార్పులవసరమైతే చెయ్యండి. ఇలా బొమ్మలను చేర్చి మెరుగుపరచిన దిద్దుబాట్ల సారాంశాల్లో #WPWPTE,#WPWP అనే హ్యాష్‌ట్యాగులను చేర్చండి. అప్పుడు "మార్పులను ప్రచురించు" ను నొక్కండి. మరిన్ని వివరాలకు మెటా వికీమీడియా లో ఉన్న ఈ గైడు పేజీని చూడండి.
బొమ్మ సింటాక్సు ఎలా ఉండాలో చూసుకోండి! సమాచారపెట్టెల్లో బొమ్మలను చేరుస్తూంటే, దాని సింటాక్సు చాలా తేలిగ్గా ఉంటుంది — దస్త్రం పేరు ఇస్తే చాలు. అంటే [[File:Obamas at church on Inauguration Day 2013.jpg|thumb|వాషింగటన్ డిసి లోని ఆఫ్రికన్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిలో ప్రార్థన చేస్తున్న ఒబామా కుటుంబం. 2013 జనవరి]]
అని ఇచ్చే బదులు The Obamas at church on Inauguration Day 2013.jpg
అని టైపు చేస్తే సరిపోతుంది.
నియమాలు
[మార్చు]- వికీపీడియా వ్యాసాల్లో బొమ్మలను చేర్చడం 2021 జూలై 1 - ఆగస్టు 31 మధ్య జరగాలి.
- ఒక్కొక్కరు ఎన్ని ఫైళ్ళను వాడొచ్చు అనే దానికి పరిమితి ఏమీ లేదు. అయితే, బహుమతుల్లో వివిధ వర్గాలున్నాయి. అనేకమైన ఫొటోలను, సంబంధం లేని ఫొటోలను పెట్టేసి వ్యాసాలను వికారంగా చెయ్యకండి. అసలు ఒక్క ఫొటో కూడా లేని వ్యాసాల్లో మాత్రమే ఫొటో చేర్చండి.
- బొమ్మ స్వేచ్ఛగా వాడుకునే లైసెన్సుకు లోబడి గానీ పబ్లిక్ డొమెయిన్ లో గానీ విడుదలై ఉండాలి. వాడదగ్గ లైసెన్సులు CC-BY-SA 4.0, CC-BY 4.0, CC0 1.0.
- పాల్గొనేవారు ఏదో ఒక వికీమీడియా ప్రాజెక్టులో సభ్యులై ఉండాలి. ఖాతా ఉంటే లాగినవండి. లేదంటే వికీపీడియాలో ఖాతాను సృష్టించుకోండి (ఏ భాషకు చెందిన వికీపీడియాలో నైనా ఖాతాను సృష్టించుకోవచ్చు. ఆ ఖాతాను ఏ వికీమీడియా ప్రాజెక్టులో నైనా వాడవచ్చు).
- తక్కువ నాణ్యత కలిగిన ఫొటోలు సాధారణంగా అనుమతింపబడవు.
- బొమ్మ కనీసం 200 పిక్సెళ్ళ పరిమాణం కలిగి ఉండాలి. దీనికన్న తక్కువ పరిమాణం కల బొమ్మలు సాధారణంగా పోటీకి పరిగణింపబడవు.
- బొమ్మకు చేర్చే వ్యాఖ్య, వివరణ స్పష్టంగా ఉండాలి, వ్యాసానికి సరిపోయేలా ఉండాలి.
- చేర్చే ప్రతీ బొమ్మకూ, అది దేనికి సంబధించినదో వివరించే వ్యాఖ్య తప్పనిసరిగా ఉండాలి.
- పేజీలో చేర్చే బొమ్మ వీలైనంత ఖచ్చితంగా ఆ పేజీకి సరిపోయేలా ఉండాలి. జనరిక్ బొమ్మలను, సముచితం కాని బొమ్మలను చేర్చరాదు.
- వ్యాసంలో సంబంధమున్న చోటనే బొమ్మను చేర్చాలి.
- మీకు భాష సరిగ్గా తెలియని వికీపీడియాలో బొమ్మలను చేర్చకండి. వ్యాఖ్యల్లేని బొమ్మలు, సంబంధం లేని బొమ్మలు వగైరాలను పదేపదే చేర్చే వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు.
- బొమ్మలను చేర్చాక, మార్పులను ప్రచురించేటపుడు రాసే దిద్దుబాటు సారాంశంలో సవివరమైన సారాంశంతో పాటు #WPWPTE, #WPWP అనే హ్యాష్‌ట్యాగులను తప్పనిసరిగా చేర్చాలి. ఉదాహరణకు, "సమాచారపెట్టెలో బొమ్మను చేర్చి మెరుగుపరచాను" #WPWPTE, #WPWP. ఈ హ్యాష్‌ట్యాగులను చేర్చకపోతే, ఆ వాసాలు పోటీ పరిగణన లోకి రావు. ఈ హ్యాష్‌ట్యాగులను (#WPWPTE), (#WPWP) వ్యాసం లోపల చేర్చకండి.
- పేజీలో బొమ్మను చేర్చి మెరుగు పరచాక, సంబంధిత చర్చ పేజీలో ఉన్న {{బొమ్మ అభ్యర్థన}} అనే మూసను తీసెయ్యాలి.
- ఒకసారి బొమ్మ చేర్చాక సారంశంలో ట్యాగును (#WPWPTE, #WPWP) పెట్టి, దిద్దుబాటును సేవు చేస్తే మీ దిద్దుబాటు పోటీ లెక్కలోకి వచ్చేస్తుంది. ఒకవేళ, ఏదైనా సవరణ చెయ్యడం కోసం (బొమ్మను మార్చడానికో, బొమ్మ వ్యాఖ్యను మార్చడానికో లేదా మరేదైనా సవరణ కోసమో) అదే పేజీలో మళ్ళీ ఇంకో దిద్దుబాటు చేస్తే, దాని సారాంశంలో మళ్ళీ ఈ ట్యాగును చేర్చకండి. అలాచేస్తే ఆ దిద్దుబాటు పోటీ పరిగణన లోకి రాదు సరికదా, అలాంటి పొరపాట్లు మూడు కంటే ఎక్కువ జరిగితే దిద్దుబాట్ల లెక్కింపులో జరిమానా విధించే అవకాశం ఉంది.
- (#WPWPTE, #WPWP) ట్యాగులను బొమ్మలు చేర్చిన దిద్దుబాటు యొక్క సారాంశం లోనే చేర్చాలి. బొమ్మ చేర్చని దిద్దుబాట్లను సేవు చేసేటపుడు ఈ ట్యాగులను చేర్చకండి. అలా చేస్తే దిద్దుబాట్ల లెక్కింపులో జరిమానా విధించే అవకాశం ఉంది.
వ్యాసానికి సరిపోయే ఫొటోలను పట్టుకోవడంలో కొన్ని చిట్కాలు
[మార్చు]వ్యాసానికి సరిపోయే ఫొటోలను వెదకడంలో కింది చిట్కాలను పాటించవచ్చు.
- వ్యాసపు అంతర్వికీ లింకులను చూడండి (పేజీకి ఎడమవైపున పట్టీలో ఉంటాయి). ఆయా భాషల పేజీలకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఏ ఫొటోలను పెట్టారో చూడండి. వాటిలోవాగా సరిపోయే ఫొటోను మీరు ఇక్కడీ వ్యాసంలో చేర్చండి. అలాగే అంతర్వికీ లింకుల్లో "Wikimedia commons" అనే లింకు ఉంటే, నేరుగా ఆ లింకుకు వెళ్ళి అక్కడున్న బొమ్మల్లో ఒకదాన్ని ఎంచుకుని ఈ పేజీలో చేర్చవచ్చు.
- అంతర్వికీ లింకులు లేకపోతే, ఇప్పుడు చేర్చండి. దానితో మీ పని నెరవేరడమే కాదు, ఆ మేరకు తెవికీ మెరుగు పడుతుంది కూడాను. అంతర్వికీ లింకులు ఇవ్వడం ఎలాగో తెలుసుకోండి.
- ఒకవేళ మీరు ఎంచుకున్న ఫొటో కామన్సులో లేకపోతే, ఏ వికీలోనైతే ఆ ఫొటోను చూసారో, ఆ వికీ నుండి ఫొటోను దించుకుని, తెవికీ లోకి ఎక్కించండి. దాన్ని పేజీలో చేర్చండి.
- అసలు ఇతర భాషల్లో ఈ పేజీ లేకపోయినా, పేజీ ఉన్నా వాటిలో కూడా బొమ్మ ఏమీ లేకపోయినా పై చిట్కా ఫలించదు. అలాంటపుడు, కామన్సులో బొమ్మ కోసం వెతకండి. ఇంగ్లీషు పేరుతో వెతకండి. వ్యక్తుల పేర్లు, ప్రదేశాల పేర్లు అయితే ఆ పేరుతోటే వెతకాలి. ఇతర పేజీల కోసం వెతికేటపుడు ఏ పేరుతో వెతకాలో సందేహం వస్తే, అంతర్వికీ లింకుల్లో ఇంగ్లీషు వ్యాసం పేరుతో వెతకండి.
- ప్రత్యేక:వాడనిఫైళ్లు అనే ప్రత్యేక పేజీలో అసలు ఏ పేజీలోనూ వాడని బొమ్మలను చూడవచ్చు. తెలుగు వికీపీడియాలో అసలు ఎక్కడా వాడని బొమ్మలు దాదాపు 1,800 ఉన్నాయి. ఆ బొమ్మలకు సంబంధించిన వ్యాసం పేజీలను చూసి, వాటిలో బొమ్మలేమీ లేకపోతే, ఈ బొమ్మలను ఆ పేజీల్లో చేర్చవచ్చు.
పని చేసే పద్ధతులు
[మార్చు]ఈ పోటీలో పని చేసే పద్ధతులను వివరించే పేజీని చూడండి. కొత్తవారికి ఈ పేజీ ఉపయోగంగా ఉంటుంది.
లక్ష్యం
[మార్చు]తెలుగు వికీపీడియాలో బొమ్మలు లేని వ్యాసాలు 11,000కు పైగా ఉన్నాయి. వాటిని బొమ్మలు కావలసిన వ్యాసాలు అనే వర్గంలో చూడవచ్చు. వాటిలో కనీసం 3000 పేజీలలో బొమ్మలు చేర్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
వనరులు
[మార్చు]ఫోటోగ్రఫీ పోటీలు
[మార్చు]- c:Category:Wiki Loves Africa 2014
- c:Category:Wiki Loves Africa 2015 - "Cultural Fashion and Adornment"
- c:Category:Wiki Loves Africa 2016 - "Music and Dance"
- c:Category:Wiki Loves Africa 2017 - "People at Work"
- c:Category:Wiki Loves Africa 2019 - "Play!"
- c:Category:Wiki Loves Africa 2020 - "Africa on the Move"
- c:Category:Wiki Loves Africa 2021 - "Health and wellness"
- c:Category:Wiki Loves Monuments 2021
- c:Category:Wiki Loves Monuments 2020
- c:Category:Wiki Loves Monuments 2019
- c:Category:Wiki Loves Monuments 2018
- c:Category:Wiki Loves Monuments 2017
- c:Category:Wiki Loves Monuments 2016
- c:Category:Wiki Loves Monuments 2015
- c:Category:Wiki Loves Monuments 2014
- c:Category:Wiki Loves Monuments 2013
- c:Category:Wiki Loves Monuments 2012
- c:Category:Wiki Loves Monuments 2011
- c:Category:Wiki Loves Monuments 2010
- c:Category:Wiki Loves Earth 2013
- c:Category:Wiki Loves Earth 2014
- c:Category:Wiki Loves Earth 2015
- c:Category:Wiki Loves Earth 2016
- c:Category:Wiki Loves Earth 2017
- c:Category:Wiki Loves Earth 2018
- c:Category:Wiki Loves Earth 2019
- c:Category:Wiki Loves Earth 2020
- c:Category:Wiki Loves Earth 2021
- c:Category:Wiki Loves Heritage Belgium in 2021
- c:Category:Wiki Loves Heritage Belgium in 2020
- c:Category:Wiki Loves Heritage Belgium in 2019
- c:Category:Wiki Loves Heritage Belgium in 2018
- c:Category:Wiki Loves Public Space 2017 in Belgium
- c:Category:Wiki Loves Art Belgium in 2016
- HELP campaign
- European Science Photo Competition 2015
- Wiki Science Competition 2017
- Wiki Science Competition 2019
ఫోటో వాక్స్
[మార్చు]కాలక్రమ వివరాలు
[మార్చు]ఈ WPWP పోటీ ఏటా జరుగుతుంది.
- పోటీ ప్రారంభం: 2021 జూలై 1 00:01 (UTC)
- పోటీ చివరి తేదీ: 2021 ఆగస్టు 31 23:59 (UTC)
- ఫలితాల ప్రకటన: 2021 అక్టోబరు 1
అంతర్జాతీయ బహుమతుల వివరాలు
[మార్చు]ఫొటోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన మొదటి ముగ్గురు వాడుకరులకు బహుమతులు:
- మొదటి బహుమతి ― US $200 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
- రెండవ బహుమతి ― US $150 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
- మూడవ బహుమతి ― US $100 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
ఆడియోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన వాడుకరికి బహుమతి:
- US $100 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
వీడియోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన వాడుకరికి బహుమతి:
- US $100 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
ఫొటోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన కొత్త వాడుకరికి బహుమతి:
- US $100 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
తెలుగు వికీపీడియా స్థానిక బహుమతుల వివరాలు
[మార్చు]ఫొటోలను చేర్చి అత్యధిక తెలుగు వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన మొదటి ముగ్గురు వాడుకరులకు బహుమతులు:
- మొదటి బహుమతి ― ₹12000 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
- రెండవ బహుమతి ― ₹6000 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
- మూడవ బహుమతి ― ₹3000 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
- 7 ప్రోత్సాహక బహుమతులు - WPWP సావనీర్లు + సర్టిఫికెట్
- ఎక్కువ గ్రామ వ్యాసాలలో బొమ్మలు చేర్చిన వారికి ప్రత్యేక బహుమతి - ₹6000 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
న్యాయనిర్ణేతలు
[మార్చు]ఈ పోటీలకు వచ్చిన ఎంట్రీలను పరిశీలించి విజేతలను ఎంపిక చేయడానికి ఈ క్రింది 4గురు సభ్యులతో కూడిన న్యాయనిర్ణేత సంఘం ఏర్పాటు చేస్తున్నాము. న్యాయనిర్ణేతలు కూడా పోటీలో పాల్గొన వచ్చు. వారి ఎంట్రీలను ఇతర న్యాయనిర్ణేతలు పరిశీలిస్తారు.
పాల్గొనేవారు
[మార్చు]ప్రస్తుతం వికీలో చురుగ్గా రాస్తున్న వాడుకరులతో సహా పాత, కొత్త వాడుకరులు అందరూ ఈ ప్రాజెక్టులో పాల్గొని తెవికీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి.
పాల్గొనేవారు ఈ క్రింద సంతకం చేయండి.
- : Kasyap (చర్చ) 08:14, 18 జూన్ 2021 (UTC)
- Nskjnv (చర్చ) 10:21, 18 జూన్ 2021 (UTC)
- ➠ కె.వెంకటరమణ⇒చర్చ 12:52, 18 జూన్ 2021 (UTC)
- MYADAM ABHILASH (చర్చ) 14:37, 18 జూన్ 2021 (UTC)
- --Rajasekhar1961 (చర్చ) 15:14, 18 జూన్ 2021 (UTC)
- --యర్రా రామారావు (చర్చ) 15:22, 18 జూన్ 2021 (UTC)
- చదువరి (చర్చ • రచనలు)
- __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 08:41, 20 జూన్ 2021 (UTC)
- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 15:34, 24 జూన్ 2021 (UTC)
- --Srilakshmi1991 (చర్చ) 15:29, 26 జూన్ 2021 (UTC)
- Thirumalgoud (చర్చ) 05:57, 28 జూన్ 2021 (UTC)
- PARALA NAGARAJU (చర్చ) 06:04, 28 జూన్ 2021 (UTC)
- Ch Maheswara Raju (చర్చ) 11:15, 28 జూన్ 2021 (UTC)
- - B.K.Viswanadh (చర్చ) 10:44, 29 జూన్ 2021 (UTC)
- --Aloknandaprasad (చర్చ) 15:14, 1 జూలై 2021 (UTC)సంఖ్యా జాబితా అంశం
- Adbh266 (చర్చ) 14:59, 3 జూలై 2021 (UTC)]]
- ఊరే మనోజ్
- --KINNERA ARAVIND (చర్చ) 11:01, 4 జూలై 2021 (UTC)
- --వాడుకరి:bvprasadtewiki (చర్చ)
- Kalasagary (చర్చ) 07:04, 10 జూలై 2021 (UTC)
- మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 15:34, 15 జూలై 2021 (UTC)
- Tmamatha (చర్చ) 12:18, 22 జూలై 2021 (UTC)
- --Divya4232 (చర్చ) 12:20, 22 జూలై 2021 (UTC)
- Kodaliraghini (చర్చ) 08:37, 15 ఆగస్టు 2021 (UTC)
- Juice Bucket Jr (చర్చ) Juice Bucket Jr (చర్చ) 06:22, 26 ఆగస్టు 2021 (UTC)
గణాంకాలు
[మార్చు]ఈ పోటీకి సంబంధించిన స్థూల గణాంకాలను చూడటానికి ఇక్కడ నొక్కండి.
ఫలితాలు
[మార్చు]వికీమీడియా వెలువరించిన తాజా గణాంకాల ప్రకారం ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- అంతర్జాతీయంగా ఎక్కించిన ఫోటోలు : 2, 78,598
- అంతర్జాతీయంగా ఈ పోటీలలో పాల్గొన్నవారు : 1009
- అంతర్జాతీయంగా పాల్గొన్న వికీపీడియా ప్రాజెక్టులు : 293
- తెలుగు వికీపీడియాలో ఎక్కించిన ఫోటోలు : 28,156
- అంతర్జాతీయంగా ఎక్కించిన ఫోటోలలో తెలుగు వికీపీడియా శాతం: 10.11
- తెలుగు వికీపీడియాలో పాల్గొన్న వారు: 32 (వీరిలో 3 అజ్ఞాత వాడుకరులు)
- అంతర్జాతీయంగా తెలుగు వికీపీడియా స్థానం: 3
ఇక మన వాడుకరులు చేసిన దిద్దుబాట్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
క్ర.సం | వాడుకరి | చేసిన దిద్దుబాట్ల సంఖ్య |
---|---|---|
1 | వాడుకరి:Nskjnv | 7501 |
2 | వాడుకరి:Chaduvari | 7230 |
3 | వాడుకరి:K.Venkataramana | 3990 |
4 | వాడుకరి:యర్రా రామారావు | 3258 |
5 | వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి | 1695 |
6 | వాడుకరి:Divya4232 | 1145 |
7 | వాడుకరి:MYADAM ABHILASH | 964 |
8 | వాడుకరి:స్వరలాసిక | 935 |
9 | వాడుకరి:Tmamatha | 739 |
10 | వాడుకరి:PARALA NAGARAJU | 120 |
11 | వాడుకరి:Thirumalgoud | 99 |
12 | వాడుకరి:Sirisipalli Veera Hymavathi | 64 |
13 | వాడుకరి:Dhurjati1 | 60 |
14 | వాడుకరి:Kasyap | 57 |
15 | వాడుకరి:Ramesh bethi | 57 |
16 | వాడుకరి:Pranayraj1985 | 47 |
17 | వాడుకరి:Kalasagary | 40 |
18 | వాడుకరి:ప్రశాంతి | 38 |
19 | వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల | 25 |
20 | వాడుకరి:Ch Maheswara Raju | 22 |
21 | వాడుకరి:KINNERA ARAVIND | 12 |
22 | వాడుకరి:Aloknandaprasad | 12 |
23 | వాడుకరి:Goutam1962 | 11 |
24 | వాడుకరి:IM3847 | 9 |
25 | వాడుకరి:UREMANOJ | 9 |
26 | వాడుకరి:Kishorahs | 6 |
27 | వాడుకరి:Bvprasadtewiki | 5 |
28 | వాడుకరి:Vadanagiri bhaskar | 2 |
29 | వాడుకరి:MYADAM KARTHIK | 1 |
30 | అజ్ఞత వాడుకరులు | 3 |
మొత్తం | 28,156 |
విజేతల పేర్లు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా చివరి పరిశీలన తరువాత త్వరలో ప్రకటించగలము.
పాల్గొన్నవారికి, ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన వారికి ధన్యవాదాలు.
విజేతలు
[మార్చు]ఈ పోటీలో క్రింద పేర్కొన్న వారు విజేతలుగా నిలిచారు.
- ప్రథమ బహుమతి: నేతి సాయికిరణ్ వీరికి ₹12,000 విలువ చేసే అమెజాన్ గిఫ్ట్ కూపన్లు పంపడమైనది.
- ద్వితీయ బహుమతి: తుమ్మల శిరీష్‌కుమార్ వీరికి ₹6,000 విలువ చేసే అమెజాన్ గిఫ్ట్ కూపన్లు పంపడమైనది.
- తృతీయ బహుమతి: కె.వెంకటరమణ వీరికి ₹3,000 విలువ చేసే అమెజాన్ గిఫ్ట్ కూపన్ పంపడమైనది.
- గ్రామ వ్యాసాలలో ఎక్కువ బొమ్మలను చేర్చినందుకు ప్రత్యేక బహుమతి: నేతి సాయికిరణ్ వీరికి ₹6,000 విలువ చేసే అమెజాన్ గిఫ్ట్ కూపన్లు పంపడమైనది.
విజేతలకు అభినందనలు.
- విజేతలకు అభినందనలు. మీ కృషి అమోఘం, అద్వితీయం.--Rajasekhar1961 (చర్చ) 12:36, 19 సెప్టెంబరు 2021 (UTC)
- నేతి సాయికిరణ్, తుమ్మల శిరీష్‌కుమార్, కె.వెంకటరమణ గార్లకు ప్రత్యేక అభినందనలు.--అభిలాష్ మ్యాడం 13:08, 19 సెప్టెంబరు 2021 (UTC)
- అవిరామకృషితో ప్రాజెక్టును దిగ్విజయంగా నడిపినందుకు స్వరలాసిక గార్కి, వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ కాంపిటేషన్ విజేతలకు అభినందనలు. మీ కృషి వికీపీడియాలో ఒక మైలు రాయి. యర్రా రామారావు (చర్చ) 13:09, 19 సెప్టెంబరు 2021 (UTC)
- ఈ పోటీని విజయవంతం చేసిన సభ్యులందరికి పేరు పేరున అభినందనలు. మీ అభినందనలకు ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 06:00, 22 సెప్టెంబరు 2021 (UTC)
- స్వరలాసిక గారూ, ప్రకటించిన బహుమతితో పాటు, సర్టిఫికెట్, టీషర్టు నాకు నిన్న అందాయి సార్. ధన్యవాదాలు. ఈ పోటీని విజయవతంగా నిర్వహించినందుకు మరోసారి అభినందనలు. __చదువరి (చర్చ • రచనలు) 01:01, 23 సెప్టెంబరు 2021 (UTC)
- స్వరలాసిక గారూ, ప్రకటించిన బహుమతితో పాటు, సర్టిఫికెట్, టీషర్టు నాకు ఈరోజు అందాయి. వికీలో నా తోలి అడుగులలో ఇలాంటి పోటీలో పాల్గొనడం నా ప్రయాణానికి సోపానంగా నిలిచింది, మీరు నిర్వహించిన ఈ పోటీ తెలుగు వికీ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం లిఖించింది. ధన్యవాదాలు సార్. Nskjnv ☚╣✉╠☛ 16:17, 24 సెప్టెంబరు 2021 (UTC)
- పోటీని దిగ్విజయం చేసినందుకూ, తెలుగు వికీపీడియాను ప్రపంచస్థాయిలో నిలబెట్టినందుకూ పోటీనిర్వాహకులైన స్వరలాసిక గారికి, పోటీలో విజేతలుగా నిలిచిన నేతి సాయికిరణ్, తుమ్మల శిరీష్‌కుమార్, కె.వెంకటరమణ గార్లకు, పోటీలో పాల్గొన్నవారికి అభినందనలు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 06:15, 28 సెప్టెంబరు 2021 (UTC)
- స్వరలాసిక గారూ, ప్రకటించిన బహుమతితో పాటు, సర్టిఫికెట్, టీషర్టు నాకు ఈరోజు అందాయి. వికీలో నా తోలి అడుగులలో ఇలాంటి పోటీలో పాల్గొనడం నా ప్రయాణానికి సోపానంగా నిలిచింది, మీరు నిర్వహించిన ఈ పోటీ తెలుగు వికీ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం లిఖించింది. ధన్యవాదాలు సార్. Nskjnv ☚╣✉╠☛ 16:17, 24 సెప్టెంబరు 2021 (UTC)