Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 26, 2007

వికీపీడియా నుండి
మీరు చేసిన దిద్దుబాటు గురించి క్లుప్తంగా దిద్దుబాటు సారాంశం పెట్టెలో రాయండి

మీరు చేసిన మార్పుల గురించి దిద్దుబాటు సారాంశంలో రాస్తే ఆ పేజీని గమనిస్తూ ఉన్న ఇతర సభ్యులకు, పేజీలో ఏమేం మార్పులు జరుగుతూ ఉన్నాయో సులభంగా తెలుస్తుంది. చిన్న మార్పులకు తప్పించి మిగతా అన్ని దిద్దుబాట్లకు ఈ సారాంశం రాయడమనేది వికీ సాంప్రదాయం. దిద్దుబాటు సారాంశాలు పేజీ చరితం లోను, వీక్షణ జాబితాలలోను, ఇటీవలి మార్పులు లోను కనిపిస్తాయి. వాటి ద్వారా ఓ పేజీలో ఏమేం దిద్దుబాట్లు జరుగుతోందనే విషయాన్ని సభ్యులు తెలిసికోగలుగుతారు. మీరు విభాగంలో దిద్దుబాటు చేస్తూ ఉంటే, సారాంశం పెట్టెలో ముందుగానే ఆ విభాగం పేరు కనిపిస్తుంది. దాని తరువాత మీ సారాంశం రాయాలి. సారాంశంలో వ్యాసాలకు లింకులు ఇవ్వవచ్చు. సారాంశం 200 కారెక్టర్ల లోపు ఉండాలి. ఇక్కడ అందరికీ అర్థమయ్యే రీతిలో పొడిపదాలను కూడా వాడవచ్చు.

మరిన్ని వివరాలకు దిద్దుబాటు సారాంశం చూడండి


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా