వికీపీడియా:విభాగాల డైరెక్టరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డాక్టర్ బండి సత్యనారాయణ 'పునరపి జననం' దీర్ఘకావ్యం పై పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి "అభినందన"

         డాక్టర్ బండి సత్యనరాయణ గారి 'పునరపి జననం' వచన కావ్యం నాలుగైదు సార్లు చదివాను. ఈసుకున్న యితివృత్తం, కావాన్ని నడిపిన తీరు 

అద్భుతం. ఈ కావ్యం గురించి ముందుమాట వంటి నా అభిప్రాయం రాయమని డా. సత్యనారాయణ గారు కోరారు. చాలా రాయాలని కుతుహలం కలిగింది. తీరా రాద్దామని కూర్చుంటే ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ముగించాలో తెలియనంతగా ఆ కావ్యపుభావశబలత నన్ను కమ్మేసింది.

         ఆధునికాంధ్ర కవిశ్రేష్టుల్లో ఒకరైన స్వర్గీయ ఆలూరి భైరాగి  తన "నూతిలోని గొంతుకల" కావ్యం ముందు మాటలో రాసుకున్న 

వాక్యాలు నాకు గుర్తొచ్చాయి. ' ఏ కృతికి ఆ కృతే భాష్యం. కృతికర్త చెప్పలేని ఏ విషయాన్నీ భాష్యకారుడు కొత్తగా చెప్పలేడు. పైగా అందులోని మసృణత్వాన్ని చెరుస్తాడు.

         కచ్చితంగా బండి సత్యనారాయణ గారి 'పునరపి జననం' కావ్యానికి ముందుమాట రాసే ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు ఈ

పంక్తులే పదే పదే గుర్తుకొచ్చాయి.

         విశ్వాంతరాళం, భూమి, సముద్రం వంటి కాన్వాసును తీసుకొని మానవుడు భస్మాసురుడిలా తనను తాను ఎలా నాశనం

చేసుకున్నాడో వివరిస్తూ మానవుడిని మేల్కొలపడానికి డా. సత్యనారాయణ గారుచెసిన జాగృతిగానమే ఈ కావ్యం.

          బండి సత్యనరాయణ గారి ఈ కావ్యం చదువుతున్నంతసేపూ మహాకవి జయశంకర్ ప్రసాద్ సృష్టించిన మహొత్కృష్ణ కావ్యగ్రంధం

"కామయాని", స్వర్గీయ ఆలూరి భైరాగి ప్రణీతమైన "నూతిలో గొంతుకలు", పద్మభూషణ్ డా. సి. నారాయణ రెడ్డి గారి "విశ్వంభర" నాకు పదే పదే జ్ఞప్తికి వచ్చాయి.

       సత్యనారాయణ గారికి అభినందనలు. 

తేదీ: 26-06-2009 - ఆచ్యార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హైదరాబాదు