వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (పుస్తకాలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏదైనా పుస్తకానికి పేజీ ఉండవచ్చునా లేదా అనేది నిర్ణయించుకునేందుకు అవసరమైన అదనపు హేతువులను ఈ మార్గదర్శకం సమకూరుస్తుంది. వీటికి అనుగుణంగా ఉంటే, సాధరణంగా ఆ పుస్తకానికి పేజీ ఉండవచ్చని అర్థం.

ఏ పుస్తకమైనా సాధారణ విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగాగానీ, లేదా ఇక్కడ గానీ మరే ఇతర విషయ సంబంధ ప్రాముఖ్యత మార్గదర్శకాలలో గానీ వివరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా గానీ ఉండి, ఏది వికీపీడియా కాదు విధానం ప్రకారం మినహాయించకుండా ఉంటే ఆ పుస్తకానికి పేజీ ఉండవచ్చు.

ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా లేనంత మాత్రాన అది సత్వర తొలగింపుకు అనుగుణంగా ఉన్నట్లు కాదు

ఇక్కడ చూపిన మార్గదార్శకాలు ఒక స్థూలమైన కొలత మాత్రమే. అంచేత, ఇక్కడ చూపని ఏదైనా హేతువు వల్ల ఓ పుస్తకానికి విషయ ప్రాముఖ్యత ఉండవచ్చు.

విషయ ప్రాముఖ్యత ఉంది అంటూ చేసే వాదనలు నిర్థారత్వ నియమాలకు లోబడి ఉండడం తప్పనిసరి. ఫలానా హేతువు ప్రకారం పుస్తకానికి ప్రముఖ్యత ఉన్నట్లే అని చెప్పినంత మాత్రాన సరిపోదు. అందుకు అవసరమైన, నిర్థారించదగిన విశ్వసనీయమైన వనరులు ఉండి తీరాలి.

"విషయ ప్రాముఖ్యత", పుస్తకపు గొప్పదనానికి సూచిక కాదు. పుస్తకం అద్భుతమైన శైలిలో, ఆకట్టుకునే విధంగా రచించబడిన ఉన్నా, ఆ పుస్తకం నిర్ధారించదగ్గ మూలాలు, వనరులతో సహా విజ్ఞానసర్వస్వంలో వ్యాసం వ్రాయటానికి తగ్గ విధంగా ప్రాచుర్యం పొంది ఉండకపోవచ్చు.

వర్తించే పరిధి గురించి సూచన[మార్చు]

"పుస్తకం" అన్న పదానికి చాలా విస్తృతమైన అర్ధం ఉన్నా, ఈ విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు ఈ దిగువన పేర్కొన్న ప్రచురణలకు నిర్ధిష్టంగా వర్తించవు: కామిక్సు పుస్తకాలు; చిత్రపు నవలలు (మాంగా ప్రచురణలకు మాత్రం వర్తిస్తుంది); మేగజిన్లు; డిక్షనరీలు, థిసారస్లు, విజ్ఞానసర్వస్వాలు, అట్లాసులు మరియు ఆల్మానాక్లు, పంచాంగాలు తదితర రెఫరెన్సు గ్రంథాలు; సూచనా పుస్తకాలు, నొటేషన్ పుస్తకాలు మరియు లిబ్రెట్టోలు మెదలైన సంగీతానికి సంబంధించిన ప్రచురణలు మరియు పరీక్షా శిక్షణ పుస్తకాలు. వీటికి వీటి అనుగుణమైన నిర్ధిష్ట మార్గదర్శకాలు భవిష్యత్తులో ఏర్పడే అవకాశం ఉన్నది. అప్పటి దాకా, ఈ మార్గదర్శకాలు సూచనప్రాయంగా అన్వయించుకోవచ్చు.

ఈ దిగువన ఇవ్వబడిన క్రైటీరియా ఎలక్ట్రానిక్ పుస్తకాలు లేదా ఈ-బుక్స్ కూడా వర్తిస్తాయి. అయితే ఈ-పుస్తకాల విషయప్రాధాన్యతను పుస్తకాల విషయప్రాధాన్యతా ప్రమాణాలతో పాటు అంతర్జాలపు సమాచారానికి సంబంధించిన ప్రమాణాలతో కూడా బేరీజు వెయ్యాలి. అంతే కాక ఈ పుస్తకం ప్రాజెక్టు గుటెన్‌బర్గ్ లేదా అటువంటి మరేదైనా ప్రాజెక్టులలో ఉన్నదా అని నిర్ధారించుకోవాలి.

ప్రమాణాలు[మార్చు]

ఏదైనా పుస్తకం, నిర్థారించదగ్గ విశ్వసనీయ మూలాల ద్వారా, కింది ప్రమాణాల్లో కనీసం ఒక్క దానికైనా అనుగుణంగా ఉంటే ఆ పుస్తకానికి ప్రాముఖ్యత ఉన్నట్లుగా భావిస్తారు:

 1. పుస్తకం గురించి అల్పమైనవి కాని, బహుళ, స్వతంత్ర ప్రచురణల్లో ప్రచురితమై ఉండాలి [2] [1] స్వతంత్ర అంటే సదరు ప్రచురణకూ పుస్తకానికీ ఏ విధంగానూ సంబంధం ఉండకూడదు.[6] వార్తా పత్రికలు, ఇతర పుస్తకాలు, టీవీ డాక్యుమెంటరీలు, సమీక్షలూ వీటిలో భాగాలే. ఈ ప్రచురణల్లో ఉండే సమాచారం సాయంతో వ్యాసాన్ని కేవలం ఒక కథా సంగ్రహం స్థాయిలో కాకుండా, దాని కంటే పెద్దదిగా విస్తరించగలిగే వీలు కలగాలి. పత్రికా ప్రకటనలు, ఫ్లాప్ కాపీలు, రచయితలు/ప్రచురణకర్తలు/వారి ఏజెంట్లూ చేసుకునే వ్యాపార ప్రకటనలూ/పుస్తక ప్రచారాలూ విషయ ప్రాముఖ్యతకు పనికిరావు [3]
 2. పుస్తకం ప్రముఖమైన సాహిత్య పురస్కారం పొంది ఉంటే.
 3. ఆ పుస్తకం, ప్రాముఖ్యత గల సినిమాకు గాని, ఇతర కళాకృతులకు గాని, ఏదైనా సంఘటనకు గాని, ఏదైన రాజకీయ/సామాజిక ఉద్యమానికి గానీ ఆధారభూతమై ఉంటే.
 4. ఆ పుస్తకం ఏ దేశంలోనైనా, పాఠశాలల్లో/ఉన్నత పాఠశాలల్లో/కళాశాలల్లో/విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశంగా ఉంటే.[4]
 5. పుస్తక కర్త ఎంతో ప్రసిద్ధుడై ఉండి, వారు రాసిన ఏ పుస్తకానికైనా ఆటోమాటిగ్గా ప్రాముఖ్యత లభించేదైతే. దీనర్థం, ఆ కర్త వికీపీడియా విషయ ప్రాముఖ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే చాలని కాదు; ఆ కర్తకు సమాజంలో ఎంతో ప్రాముఖ్యత ఉండి వారు రాసిన ఏ పుస్తకమైనా సాహిత్య చర్చల్లో, సాహితీ వర్గాల్లో చర్చనీయాంశమవ్వాలి.[5]

పై ప్రమాణాలు, కింద చూపిన కనీస ప్రమాణాల ప్రకారం పక్కన పెట్టబడ్డ పుస్తకాలకు వర్తించాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకా ప్రచురితం కాని పుస్తకాలకు ఈ ప్రమాణాలు వర్తించవు.

ఇతర విచారణలు[మార్చు]

కనీస ప్రమాణాలు[మార్చు]

ఒక పుస్తకానికి కనీస స్థాయిలో ఐ.ఎస్.బి.ఎన్ సంఖ్య ఉండాలి (1975 తర్వాత ప్రచురించిన పుస్తకాలైతే). ఆయా దేశపు జాతీయ గ్రంథాలయపు గ్రంథ సూచికలో స్థానం కలిగి ఉండాలి. ఉదాహరణకు, భారతదేశంలో నైతే భారత జాతీయ గ్రంథాలయం వారి కేటలాగులో నమోదై ఉండాలి. అమెరికాలో నైతే లైబ్రరీ ఆఫ్ కాంగ్రేసు వారి గ్రంథాలయ సూచికలోను, యునైటెడ్ కింగ్డమ్‌లో బ్రిటీషు లైబ్రరీ, ఆస్ట్రేలియాలో నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఆస్ట్రేలియా, కెనడాలో లైబ్రరీ అండ్ అర్కైవ్స్ ఆఫ్ కెనడా, ఫ్రాన్సులో బిబ్లియోథెక్ నేషనాల్ దే ఫ్రాన్స్, సింగపూర్లో నేషనల్ లైబ్రరీ బోర్డు, బ్రెజిల్లో ఫుండకావ్ బిబ్లియోతేకా నాషియోనాల్, అర్జెంటీనాలో బిబ్లియోతేకా నాషియోనాల్ దె లా రిపబ్లికా అర్జెంటీనా వారి కేటలాగుల్లోనూ నమోదై ఉండాలి. పూర్తి జాబితాకు జాతీయ గ్రంథాలయాల జాబితా చూడండి.

అయితే, ఇవి తొలగింపు ప్రమాణాలే గానీ, చేర్పు ప్రమాణాలు కావు. అంటే ఈ కనీస ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నంత మాత్రాన పుస్తకానికి విషయ ప్రాముఖ్యత ఉన్నట్లు కాదు. కానీ ఈ కనిష్ట ప్రమాణాలను కూడా చేరుకోలేని పుస్తకాలు మాత్రం విషయ ప్రాముఖ్యతలేనివి అని నిర్ధారించవచ్చు. ఇందులోను వెసలుబాట్లు ఉంటాయి- కనీస ప్రమాణాలను తృప్తి పరచకపోయినా విషయప్రాధాన్యత కలవి- ఉండవచ్చు. కానీ అలాంటివి చాలా అరుదుగా తారసపడతాయి. అవి విషయప్రాధాన్యత కలవి అని నిర్ధారించడానికి గల హేతువులను స్పష్టంగా ఉదహరించాలి.

స్వీయ ప్రచురణలు[మార్చు]

ఈ విషయంలో, కేవలం స్వీయ ప్రచురణ లేదా రచయితలే డబ్బిచ్చి వేయించిన ప్రచురణ కావటం, ఆ పుస్తకానికి విషయప్రాముఖ్యత ఉండకపోవచ్చని సూచిస్తుంది కానీ ఖచ్చితంగా లేదని నిర్ధారించకూడదు. [7] మినహాయింపులు ఉంటాయి. అంటే స్వీయప్రచురణలైనా, బాగా చర్చించబడి, సమీక్షించబడినవి అనమాట. అవి ఎలాగూ మొదటి నియమం ప్రకారం అర్హత పొందుతాయి.

ఈ పైన ఉన్న కనీస ప్రమాణాల విభాగాన్ని దృష్టిలో పెట్టుకొని, అనేక వానిటీ ప్రెస్ ప్రచురణలకు ఐ.ఎస్.బి.ఎన్ సంఖ్యలు ఉంటాయి, జాతీయ గ్రంథాలయాలచే కేటాలగు చెయ్యబడి ఉండవచ్చు, గూగుల్ శోధనలో ఈ పుస్తక వివరాలు కనిపించవచ్చు, కేవలం ఇవన్నీ ఉన్నంత మాత్రం చేత ఒక పుస్తకం విషయప్రాధాన్యత కలదైనట్టిది కాదు అని గమనించాలి.

ఒక పుస్తకం యొక్క రచయిత కానీ, సంబంధిత పార్టీలు కానీ ఆ పుస్తకం యొక్క వికీపీడియా వ్యాసాన్ని సృష్టిస్తే, అది తప్పకుండా ఆ వ్యాసం వికీపీడియాలో చేర్చకూడదనే వాదానికి మరింత బలాన్నిచ్చినట్టు పరిగణించాలి. దీనిపై మరింత సమాచారానికి See వికీపీడియా:Conflict of interest and వికీపీడియా:Autobiography చూడండి.

అంతర్జాల పుస్తకవిక్రేతలు[మార్చు]

బార్న్స్ అండ్ నోబుల్.కామ్ మరియు అమెజాన్.కామ్ వంటి అంతర్జాల పుస్తక వికేత్రల సైట్లలో ఒక పుస్తకం అమ్మబడుతూ ఉండటాన్ని బట్టి ఆ పుస్తకం యొక్క విషయప్రాముఖ్యత నిర్ధారించలేము. ఎందుకంటే ఈ ఇరు వెబ్‌సైట్లు ఎటువంటి పుస్తకాలు అమ్మవచ్చు అనే విషయంపై చాలా వదులైన నియమాలున్నాయి. ఈ వెబ్‌సైట్లలోఅనేక వ్యానిటీ ప్రెస్ ప్రచురణలు కూడా లిస్టింగు చేయబడిఉన్నవి. అమెజాన్ అమ్మకాల ర్యాంకు (పుస్తకం యొక్క లిస్టింగులో ప్రోడక్ట్ డీటెయిల్స్ విభాగంలో ఈ సంఖ్య ఇవ్వబడి ఉంటుంది) ఒక పుస్తకం ఎంత ఉన్నతస్థాయికి ఎదిగితే ఆ పుస్తకానికి వ్యాసం ఉండవచ్చు అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు.

ఇంకా ప్రచురించబడని పుస్తకాలు[మార్చు]

వికీపీడియా భవిష్యత్తు చూసే మాయాదర్పణం కాదు. ప్రచురణలో ఉన్న పుస్తకాలు, లేదా ఇంకా ప్రచురించబడని పుస్తకాలపై వ్యాసాలు సృష్టించడాన్ని తీవ్రంగా నిరుత్సహపరుస్తుంది. అలాంటి వ్యాసాలకు ఈ మార్గదర్శకాలతో పాటు అదనంగా, ఆ పుస్తకాల యొక్క ప్రచురణ కొరకై వేచిచూస్తుండటం కూడా విషయప్రాధాన్యత సంతరించుకుంటేనే అలాంటి వ్యాసాన్ని ఉంచేందుకు సమ్మతించాలి. అలా వ్యాసం సృష్టించిన పక్షంలో, అనేక స్వతంత్ర మూలాలు ఈ పుస్తకం తప్పక ప్రచురించబడుతుందని గట్టి ఆధారాలు చూపాలి. ఈ మూలాలు పుస్తకం యొక్క పేరుతో పాటు, రమారమిగా పుస్తకం ప్రచురితమయ్యే తేదీని సూచిందాలి.

సమాకాలేతర పుస్తకాలు[మార్చు]

తొలగింపున కొరకై వ్యాసాలుచే ప్రతిపాదించబడి, విషయప్రాధాన్యత విషయంలో నిర్ణయం తీసుకోవలసిన అవసరం వచ్చే పుస్తకాల వ్యాసాలలో చాలమటుకు సమకాలీన ఆధునిక యుగంలో ప్రచురితమైన పుస్తకాలపై వ్రాసిన వ్యాసాలే ఉంటాయి. కానీ, అరుదుగా అంతకు చాలాముందు ప్రచురించిన పుస్తకాలపై వ్యాసాలు విషయప్రాధాన్యత వివాదాస్పదమై నిర్ధారణకు వస్తాయి. అయితే, ప్రముఖంగా ఆధునిక యుగానికి సూచించిన ఈ మార్గదర్శకంలోని నియమాలు అలాంటి పుస్తకాలకు సరిగా వర్తించకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఇంగిత జ్ఞానంపై మరింతగా ఆధారపడిన పద్ధతిలో ఆ పుస్తకం గురించి విస్తృతంగా వ్రాయబడిందా, ఇటీవలి కాలంలో పునర్ముద్రింపబడిందా, పూర్వం దీనికి చక్కని పేరుప్రతిష్టలు ఉండేవా?, సాహిత్యచరిత్రలో దీని స్థానం తదితర అంశాలు పరిగణలోకి తీసుకోవాలి.

ఎకడమిక్, సాంకేతిక పుస్తకాలు[మార్చు]

అకడామిక్ మరియు సాంకేతిక పుస్తకాల యొక్క ఉద్దేశము మరియు లక్ష్యము విభిన్నమైనది. అదే విధంగా, వీటి ప్రచురణ ప్రక్రియ మరియు పద్ధతులు కూడా సాధారణ ప్రజలకు ఉద్దేశించిన పుస్తకాల కంటే విభిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఇవి అత్యంత ప్రత్యేకితములై (స్పెషలైజ్డు), పరిమిత ప్రతులు ముద్రింపబడతాయి మరియు ప్రత్యేక గ్రంథాలయాల్లోనూ, ప్రత్యేక పుస్తకాల షాపుల్లోనే లభ్యమౌతాయి. ఈ కారణాల వళ్ల, ప్రధాన స్రవంతిలో ఉన్న పుస్తకాలకు వర్తించే చాలామటకు స్టాండర్డ్సు అకాడమిక్ పుస్తకాలకు వర్తించవు. ఇక్కడ కూడా ఇంగితము ఉపయోగించవలెను. అలాంటి సందర్భాలలో, విషయ ప్రాముఖ్యత నిర్ధారించడానికి, పుస్తకాన్ని అకాడమిక్ ప్రచురణాలయం ముద్రించినదా,[8] ఎంత విస్తృతంగా ఈ పుస్తకం ఇతర అకాడెమిక్ ప్రచురణలు లేదా మీడియాలో ఉదహరించబడింది,[9] ఈ పుస్తకం దాని పరిధిలోని స్పెషాలిటీలో లేదా అనుబంధ రంగాలలో ఎంత ప్రభావం కలది, మరియు ఆ పుస్తకం అనేక ప్రసిద్ధ విద్యా సంస్థలలో బోధనకు ఉపయోగించబడుతున్నదా, లేదా తప్పకుండా చదవవలసిన పాఠ్యంగా నిర్ణయించబడినదా అన్న సూచనలు సహకరిస్తాయి.

పుస్తకాధారితమైన ఇతర వ్యాసాలు[మార్చు]

పుస్తకాలపై వ్యాసాలు, విభజించి, పునర్విభజించి, పుస్తకంలోని చిన్నచిన్న అంశాలపై విస్తారమైన వ్యాసాలు వ్రాయకూడదని వికిపీడీయాలో సాధారణ ఏకాభిప్రాయం. ప్రతి విభజనతోటి వ్యాసపు విషయప్రాధాన్యత స్థాయి తరుగుతూ ఉంటుంది. దీని అర్ధమేమిటంటే, ఒక పుస్తకం విషయప్రాధాన్యత కలదైనా, ఆ పుస్తకంలోని పాత్రలు కానీ మరో విషయంపై కానీ వ్యాసాలు సృష్టించడాన్ని సాధారణంగా నిరుత్సాహపరుస్తారు. చాలా సందర్భాలలో పుస్తకం ప్రత్యేక వ్యాసం సృష్టించేంత విషయప్రాధాన్యత కలదై ఉంటుంది కానీ, దీనికి సంబంధించిన ఉపవ్యాసాలు విషయప్రాధాన్యత కలిగి ఉండకపోవచ్చు. దీనికీ అక్కడక్కడ మినహాయింపులు తారసపడతాయి. ఉదాహరణకు కన్యాశుల్కం (నాటకం) లోని గిరీశం పాత్ర ప్రత్యేక వ్యాసం ఉండేంత విషయప్రాధాన్యత కలదని భావించవచ్చు. ఒక పుస్తకపు వ్యాసాన్ని విషయప్రాధాన్యత చూపించలేనంతగా చాలా చిన్న చిన్న ఖండాలుగా విభజించినప్పుడు, అందులోని విషయాలని తిరిగి పుస్తకపు వ్యాసంలో విలీనం చేయటం సబబైనది.

కొన్ని సందర్భాలలో పుస్తకం విషయప్రాధాన్యతా ప్రమాణాలను చేరుకోనప్పుడు, రచయితకు వికీపీడీయాలో వ్యాసం ఉంటే, పుస్తకానికి ప్రత్యేక వ్యాసం సృష్టించే బదులుగా, సమాచారాన్నిరచయిత వ్యాసంలో కలపటం సమంజసం.

వనరులు[మార్చు]

 • Clicking on any linked ISBN number on Wikipedia takes you to Special:Booksources where preformatted links for the specific book are provided, allowing access to multiple library catalogues, bookseller databases and other book resources.
This might be an issue as different formats of a book (i.e. ebook, audiobook, printed book) will have different ISBNs, and they will often not be sequential, especially for older books that were originally published before ebooks or audiobooks existed.
 • Library of Congress Online Catalog: A searchable database useful in identifying publisher, edition, etc.
 • The British Library's online catalogue.
 • The Literary Encyclopedia: 3300 profiles of authors, works and literary and historical topics and references of 18,000 works.
 • Norton anthology of world literature: Useful in the exploration of world literature.
 • Worldcat: search for a book in library catalogues. Contains 1.8 billion items in 18,000 libraries worldwide.
 • Questia Online Library , allows full-text search, and paid subscription reading access to 64,000+ books and 1,000,000+ journal, magazine, and newspaper articles in their collection. Their strength is full text of recent academic books by major publishers such as Oxford University Press, University of North Carolina Press, and Greenwood Press, along with thousands of older academic books that are available only in larger university libraries.

ఇవి కూడా చూడండి[మార్చు]

 1. 1.0 1.1 వ్యక్తిగత వెబ్‌సైట్‌లు, బ్లాగులు, బులెటిన్ బోర్డ్‌లు, యూజ్‌నెట్ పోస్ట్‌లు, వికీలు, స్వయంగా అవే విశ్వసనీయం కాని కాని ఇతర మీడియాలూ "అల్పం కాని" సైట్ల జాబితా లోకి రావు. ప్రచురణలో ఆ వస్తువు గురించి చేసిన చర్చ, విశ్లేషణ కూడా కీలకమైనవే; ఉదాహరణకు యూట్యూబ్ విశ్వసనీయమైనదే, కానీ సభ్యులు ఆ సైటు లోకి ఎక్కించే వీడియోలకు ఆ విశ్వసనీయత ఆటోమాటిగ్గా చెందదు. ఒక విషయంపై పబ్లిక్ సభ్యులు ఆ సైట్‌కి చేసే పోస్టింగ్‌లు సైట్ యొక్క అసంబద్ధతను భాగస్వామ్యం చేయవు. ఆ పుస్తకపు రచయితకు గాని, ప్రచురణకర్తకు గాని, ఏజెంటు, విక్రేత మొదలైనవారికి గానీ థర్డ్ పార్టీ ప్రచురణలో ఎటువంటి అనుచితమైన ఆసక్తీ లేదని నిర్థారించుకోండి.
 2. 2.0 2.1 ప్రచురణలో "అంశం"గా ఉండడమంటే, ఏదో మాటవరసకో, సందర్భవశాత్తూ ప్రస్తావించడం కాదు. పుస్తకం, దాని రచయిత లేదా దాని ప్రచురణ, ధరవరల జాబితాలు తదితరాలు ఇలాంతి ప్రచురణల జాబితాలోకి రావు ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "subject" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 3. 3.0 3.1 స్వతంగా చేసుకునే ప్రచారాలు, అమ్మకపు వ్యూహాలూ విజ్ఞానసర్వస్వ వ్యాసపు హోదాను తీసుకురావు. ప్రచురించబడిన రచనలంటే.. ఇతరులు ఆ పుస్తకం గురించి రాసినవై ఉండాలి
 4. 4.0 4.1 ఈ నియమం ఆయా బోధనాంశాలను బోధించడానికి, అదే లక్ష్యంగా కూర్చిన పాఠ్యపుస్తకాలు లేదా రెఫెరెన్సు గ్రంథాలకు వర్తించదు. (ఉదాహరణకు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 10వ తరగతి తెలుగు వాచకానికి వ్యాసం సృష్టించకూడదు). ఈ నియమం కేవలం స్వతంత్ర కృతులు అవి ఎంత ఉత్కృష్టమైన వంటే వాటిపై అధ్యయనం చేయటానికి ఎంచుకొనే విధంగా ఉండాలి. అంటే అవి తత్త్వశాస్త్రంలో గానీ, సాహిత్యంలో లేదా విజ్ఞానశాస్త్రంలో ప్రసిద్ధమైన కృతులు ఈ నియమం క్రింద వస్తాయి.
 5. 5.0 5.1 For example, a person whose life or works is a subject of common classroom study.
 6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; independent అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 7. పబ్లిష్ అమెరికా వంటి కొన్ని ప్రింట్ ఆన్ డిమాండ్ ప్రచురణకర్తలు, తాము ఇతర సాంప్రదాయక అడ్వాన్సు ఇచ్చి, రాయల్టీని ముట్టజెప్పే ప్రచురణకర్తల వంటి ప్రచురణకర్తలమేనని చెప్పుకుంటాయి. తాము వానిటీ ప్రెస్సుగా అంగీకరించవు. నిర్వచనాల మల్లాగుల్లాలు పక్కనపెట్టి పబ్లిష్‌అమెరికా మరియు దానిని పోలిన ఇతర ప్రచురణా సంస్థలను, వాటిచే పుస్తకాలు ప్రచురింప జేసే విధానాన్ని బట్టి, విషయప్రాధాన్యత నిర్ధారించే విషయంలో మాత్రం వీటిని వానిటీ ప్రెస్సులుగానే భావించాలి.
 8. Publication by a prominent academic press should be accorded far more weight than the analogous benchmark defined for publication of mainstream book by well known commercial publishers, by virtue of the non-commercial nature of such presses, and the peer review process that some academic books must pass before publication is allowed to go forward. See university book publishers for a partial list of such presses. Note that because a large portion of (en.)Wikipedia articles are written by English speaking people from English speaking nations, this list currently has an English speaking bias.
 9. A book's subject may be so specialized, such as in the esoteric math or physics spheres, that only a few hundred (or fewer) people in the world are situated to understand and comment on the material.