వికీపీడియా:శైలి/లింకులివ్వడం
| వికీపీడియా శైలి సహాయం |
|---|
|
శైలి |
| దిద్దుబాటు మార్గదర్శకాలు |
|
వర్గీకరణ |
| ఇతర మార్గదర్శకాలు |
|
పదకోశం |
| Linking and page manipulation |
|---|
హైపర్‌లింకుల ద్వారా లింకులివ్వడం వికీపీడియాలో ఒక ముఖ్యమైన అంశం. అంతర్గత లింకులు ప్రాజెక్టు మొత్తాన్నీ ఒక ఏకమొత్తంగా కలిపి ఉంచుతాయి. భాషాంతర లింకులు, ఇతర ప్రాజెక్టుల లింకులూ ప్రాజెక్టును ఇతరభాషల వికీపీడియాల తోను, వికీసోర్స్, విక్షనరీ వంటి ఇతర వికీమీడియా ప్రాజెక్టుల తోనూ, బయటి లింకులు వికీపీడియాను అంతర్జాలం తోనూ కలుపుతాయి.
సరైన లింకులు ప్రాజెక్ట్ లోపలా, వెలుపలా ఉన్న అంశాలకు దారిచూపుతాయి. పాఠకులు చదువుతున్న అంశంపై అవగాహనను పెంచడంలో దోహదపడతాయి. ఒక వ్యాసం రాసేటప్పుడు లేదా సవరించేటప్పుడు, వ్యాసంలో ఏమి ఉంచాలో మాత్రమే కాకుండా, పాఠకుడికి సంబంధిత సమాచారాన్ని కనుగొనడంలో సహాయపడటానికి ఏ లింకులను చేర్చాలో, ఏ ఇతర పేజీల నుండి ఈ వ్యాసాలకు లింకులుండాలో కూడా పరిగణించండి. తక్కువ లింకులివ్వడం, అతిగా లింకులు ఇవ్వడం రెండింటినీ నివారించండి.
లింకులు ఎప్పుడివాలి, ఎప్పుడివ్వకూడదు, లింకులను ఎలా ఇవ్వాలి అనే విషయాలను ఈ పేజీ వివరిస్తుంది. లింకుల సింటాక్సు గురించి సహాయం:లింకు చూడండి. అయోమయ నివృత్తి పేజీలకు లింకులు ఇవ్వడం గురించి వికీపీడియా:శైలి/అయోమయనివృత్తి పేజీలు చూడండి.
సూత్రాలు
[మార్చు]వికీపీడియా హైపర్‌టెక్స్ట్‌పై ఆధారపడి ఉంటుంది. పాఠకులు వికీపీడియాలో వివిధ పేజీల్లోని సంబంధిత సమాచారాన్ని సులభంగా చేరుకోడాన్ని సులభతరం చేసేందుకు గాను, "వెబ్‌ను నిర్మించడం" లక్ష్యంగా పెట్టుకుంది. హైపర్‌లింకు ఉండే పేజీని యాంకర్ పేజీ అంటారు. ఏ పేజీకైతే లింకు వెళ్తుందో ఆ పేజీని లక్ష్యం పేజీ అంటారు.
లింక్‌లను చేర్చడం లేదా తొలగించడం చేసే సందర్భంలో వ్యాసాన్ని, జ్ఞానవృక్షంలో ఒక భాగంగా పరిగణించండి. అంతర్గత లింకులు, వికీపీడియాలో సమన్వయానికీ, వికీపీడియా ప్రయోజనానికీ దోహదపడతాయి. ఒక వ్యాసం చదువుతున్న పాఠకులు సంబంధిత ఇతర వ్యాసాలకు కూడా వెళ్ళి, వ్యాస అంశంపై తమ అవగాహనను మరింతగా పెంచుకోవడానికి వీలు కల్పిస్తాయి. "పాఠకులు ఆ ఇతర వ్యాసాలను కూడా చదవాలనుకునే అవకాశం ఎంత?" అనేది లింకులివ్వడంలో కీలకమైన ప్రశ్న. లింకు ఎక్కడ ఉంటే పాఠకులు వాడే అవకాశం భావిస్తారో అక్కడే లింకులు ఇవ్వండి; ఉదాహరణకు, వ్యాసం ప్రవేశికలో, కొత్త విభాగాల ప్రారంభంలో, పట్టికల సెల్‌లలో, బొమ్మల వ్యాఖ్యలలో ఉండే లింకులను పాఠకులు నొక్కేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే, వ్యాస పాఠ్యంలో ఓ పదం మొట్టమొదటి సారి ఎక్కడ వస్తుందో అక్కడ మాత్రమే లింకు ఇవ్వాలి అనేది ఒక సాధారణ నియమం.
లింకులిచ్చే శైలికి సంబంధించి సాధారణ అంశాలు
[మార్చు]- సహాయం:లింకు § వికీలింకులు వద్ద మరింత వివరంగా చెప్పినట్లుగా, లింకులు నేరుగా ఇవ్వవచ్చు (
[[కావూరు (చెరుకుపల్లి మండలం)]]. ఇది ఇలా కనిపిస్తుంది: కావూరు (చెరుకుపల్లి మండలం)) లేదా పైపు లింకుగా ఇవ్వవచ్చు ([[కావూరు (చెరుకుపల్లి మండలం)|కావూరు]]అనేది కావూరు గా కనిపిస్తుంది. అయితే ఇది "కావూరు (చెరుకుపల్లి మండలం)" పేజీకే లింకవుతుంది. ఇలాంటి లింకులిచ్చేందుకు పైపు లింకు అనేది తేలికైన పద్ధతి). - విభాగాల శీర్షికలకు లింకులివ్వరాదు; దాని బదులు, శీర్షిక కింద {{main}} లేదా {{see also}} అనే మూసలను చేర్చాలి.
- వ్యాసం ప్రవేశిక లోని మొదటి వాక్యంలో లింకులు ఇవ్వరాదు.[a]
- కొటేషన్ల లోపల ఉండే పాఠ్యానికి లింకులు సాధ్యమైనంత వరకు ఇవ్వకండి; ఆ కొటేషను కర్త ఉద్దేశించిన అర్థానికి స్పష్టంగా సరిపోయే వ్యాసమైతేనే లింకు ఇవ్వండి. సాధ్యమైన చోట్లల్లా, లింకును కొటేషనుకు బైట ఉన్న పాఠ్యానికి - కొటేషనుకు ముందుగానీ, తరువాత గానీ - ఇవ్వండి.[b]
- సాధ్యమైనంత వరకు వాక్యంలో వరుసగా ఉన్న పదాలకు విడివిడిగా లింకులు ఇవ్వకండి. అలా చేస్తే ఇవన్నీ ఒకేలింకు అన్నట్లుగా కనిపిస్తాయి. ఉదా: కారకోరం కనుమ (
[[కారకోరం]] [[కనుమ]]) లేదా క్రికెట్ ప్రపంచ కప్ ([[క్రికెట్]] [[ప్రపంచ కప్]]). దాని బదులు, ఒకదాని లింకును తీసేసి రాయండి - (కారకోరం కనుమ). లేదా మరింత స్పష్టంగా ఉండే లింకును వాడండి - కారకోరం కనుమ ([[కారకోరం కనుమ]]). - భౌగోళిక ప్రాంతాన్ని సూచిస్తూ కామాలతో వేరుచేసిన ప్రాంతాలు/ప్రదేశాలు ఉన్నపుడు, అన్నిటికీ లింకు ఇవ్వకుండా, అతి చిన్న ప్రదేశానికి/ప్రాంతానికీ లింకు ఇవ్వండి. .
- ఉదాహరణకు, కింది విధంగా లింకులు ఇవ్వకండి
తెలంగాణ, కరీంనగర్ ([[తెలంగాణ]], [[కరీంనగర్]])- లేదా
తెలంగాణ, హైదరాబాదు, కుషాయిగూడ ([[తెలంగాణ]], [[హైదరాబాదు]], [[కుషాయిగూడ]])
- వీటిని కిందివిధంగా ఇవ్వండి
తెలంగాణ, కరీంనగర్ (తెలంగాణ, [[కరీంనగర్]])- or
తెలంగాణ, హైదరాబాదు, కుషాయిగూడ (తెలంగాణ, హైదరాబాదు, [[కుషాయిగూడ]])
- ఓకవేళ వరసగా ఉన్న రెండు స్థలాలకూ లింకులివ్వాల్సిన ఆవశ్యకత ఉంటే వాటి మధ్య ఏదైనా సముచితమైన పాఠ్యం ఉండేలా చూడండీఉదా -
తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా లోని జమ్మికుంట
([[తెలంగాణ]] రాష్ట్రం, [[కరీంనగర్ జిల్లా]] లోని [[జమ్మికుంట]]).
- పదాలకు ముందూ, వెనకా ఉండే స్పేసును లింకు లోకి చేర్చకండి. ఈ స్పేసులు లింకుకు బైట ఉండాలి.
- సాంకేతిక విషయాలపై ఉన్న వ్యాసాలలో సాంకేతిక పదాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి సాధారణ నిఘంటువులలో సందర్భోచిత వివరణలు ఉండవు. అందుచేత, సాధారణంగా ఆసక్తి ఉండే వ్యాసాల కంటే, ఈ సాంకేతిక వ్యాసాల్లో ఎక్కువ లింకులు చేర్చడం అవసరం కావచ్చు.
- లింకు ఇవ్వదలచిన అంశం గురించి లక్ష్యిత వ్యాసంలో సరిపడా సమాచారం, సంబంధిత సమాచారం ఉందని ముందుగా నిర్ధారించుకున్నాకే లింకు ఇవ్వండి. ఉదాహరణకు, పర్వతాల్లో ఉండే కనుమల గురించి వివరించే వ్యాసానికి లింకు ఇచ్చేటపుడు కనుమకు ఇవ్వరాదు, అది కనుమ పండుగ పేజీకి పోతుంది. సరైన లింకు పర్వత కనుమ.
- వ్యాసాల నుండి వ్యాసేతర పేరుబరుల్లోని పేజీలకు లింకులు ఇవ్వకండి.
- చిన్నపాటి వివరణ అవసరమైన చోట్ల, అక్కడే వివరణ రాసెయ్యండి. ఆమాత్రానికే మరో పేజీకి లింకు ఇచ్చి, పేజీనుండి పేజీకి వెళ్ళేలా పాఠకులకు శ్రమ కలిగించకండి.
- అవసరమైన చోట్ల లింకులు ఇవ్వాల్సిందే, కానీ ఆ లింకుకు వెళ్తే తప్ప పాఠ్యం అర్థం కాని పరిస్థితి కల్పించవద్దు. లింకుకు వెళ్ళకుండానే ఇక్కడి వాక్యాలే వీలైనంతవరకు అర్థాన్ని వివరించేలా రాయండి. తెవికీ వ్యాసాన్ని ఆఫ్‌లైనులో చదివే పాఠకులు, ముద్రించుకుని చదివే పాఠకులూ కూడా ఉంటారు. వారికి కూడా కనీస స్థాయిలో విషయం అర్థం అయ్యేలా ఉండాలి.
- అందం కోసమో అలంకారం కోసమో పాఠ్యానికి లింకుల రంగులు ఇవ్వకండి. మామూలు పాఠ్యానికీ, లింకులకూ భేదాన్ని పాఠకులు అర్థం చేసుకోవడంలో తికమక పడకూడదు.
సాధారణంగా వేటికి లింకులివ్వాలంటే
[మార్చు]వ్యాసాన్ని అర్థం చేసుకోవడంలో సాయపడే పదాలకు తగు లింకులు లేనట్లైతే, ఆ వ్యాసంలో సరిపడా లింకులు లేవని (అండర్‌లింక్‌డ్) అని అంటారు. సాధారణంగా కింది సందర్భాల్లో లింకులు ఇవ్వాలి:
- వేరే వ్యాసానికి సంబంధించిన అంశాలకు లింకులిస్తే ఈ వ్యాసాన్ని మరింత బాగా అర్థం చేసుకోగలిగే సందర్భాల్లో (కింద ఇచ్చిన ఉదాహరణ చూడండి). వ్యక్తులు, ఘటనలు వగైరాలు ఈ అంశాల్లోకి వస్తాయి. అలాగే, స్వంతంగా పేజీ ఉన్న ఏ టాపిక్కులైనా సరే ఈ కోవ లోకి వస్తాయి. ఆ లింకు ప్రస్తుత వ్యాసానికి సంబంధించినదై ఉంటే చాలు.
- సంబంధిత సమాచారం ఉండే వ్యాసాలకు. ఉదాహరణకు: "దీని నేపథ్యం కోసం అట్లాంటిక్ విమానం కూల్చివేత ఘటన చూడండి"
- సాంకేతిక పదాలకు, పదబంధాలకు, పరిభాషకు అర్థాలను వివరించే వ్యాసాలకు. లింకు ఇవ్వకుండా ఆయా పదాలకు వ్యాసంలో అక్కడే వివరణ కూడా రాయవచ్చు, లేదా లింకుతో పాటు వివరణ కూడా ఇయ్యవచ్చు. వికీపీడియాలో సముచితమైన వ్యాసం లేనట్లైతే, విక్షనరీకి అంతర్వికీ లింకు ఇవ్వనూ వచ్చు.
- పాఠకులకు అంతగా పరిచయం ఉండని వ్యక్తుల పేర్లు
ఓ లింకు ప్రస్తుత వ్యాసానికి సంబంధించినదే గానీ, వ్యాసం లోని పాఠ్యంలో ఎక్కడా ఇచ్చే అవకాశం లేనట్లైతే, దాన్ని "ఇవి కూడా చూడండి" విభాగంలో పెట్టవచ్చు.
ప్రస్తుతం ఉనికిలో లేకపోయినా, భవిష్యత్తులో సృష్టించే అవకాశం ఉన్న వ్యాసాలకు లింకు ఇవ్వవచ్చు (§ ఎర్రలింకులు చూడండి). వేరే వికీపీడియాలో సంబంధిత వ్యాసం ఉండి, తెవికీలో ఇంకా లేనట్లైతే, తెవికీ వ్యాసానికి ఎర్రలింకు ఇస్తూనే వేరే భాష లోని వికీపీడియా వ్యాసానికి కూడ్ లింకు ఇవ్వవచ్చు (Help:అంతర్వికీ లింకులు § ఇన్‌లైన్ లింకులు చూడండి).
సాధారణంగా వేటికి లింకులు ఇవ్వకూడదంటే
[మార్చు]వ్యాసంలో లింకులు మరీ ఎక్కువగా ఉంటే, అతిగా లింకులు ఇచ్చారని అంటారు. దీనివల్ల పాఠకుడి అవగాహనకు సహాయపడే లింకులను గుర్తించడం కష్టమవుతుంది. వ్యాసంలో చాలా ఎక్కువగా లింకులు ఉండి, పాఠకులకు అవసరమయ్యే లింకులేవో గుర్తించడం కష్టమయ్యే పరిస్థితి ఉంటే లింకులు అతిగా ఉన్నాయి అంటారు.[1][c] లింకు ఇస్తున్న వ్యాసాన్ని చదవడం వల్ల ప్రస్తుత వ్యాసాన్ని అర్థం చేసుకోవడంలో పాఠకులకు దోహదపడుతుందా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మంచి పద్ధతి. ఏదైనా పదం వ్యాసంలోని సందర్భానికి నిర్దుధ్టంగా సంబంధించినది కానట్లైతే, చాలా మంది పాఠకులకు ఆ సందర్భంలో అర్థమయ్యే పదాలకు సాధారణంగా లింకు ఇవ్వకూడదు. కొన్ని పదాలు ఈ స్థాయి గుర్తింపును కలిగి ఉన్నాయో లేదో నిర్ణయించేటప్పుడు మీ వయస్సు వారికి, మీరు చేసే పనే చేసేవారికి, మీ ప్రాంతం వారికీ అర్థమయ్యే విషయాలు ఇతరులకు అంతగా అర్థం కాకపోవచ్చు. ఉదాహరణలు:
- రోజువారీ పదాలు (ఉదా. విద్య, హింస, విమానం, నది, యానిమేషన్)
- సాధారణ వృత్తులు (ఉదా. అకౌంటెంట్, రాజకీయ నాయకుడు, నటుడు)
- సాధారణ కొలమానాల్లోని యూనిట్లు - సమయం, ఉష్ణోగ్రత, పొడవు, ప్రాంతం, ఘనపరిమాణం వగైరాలకు సంబంధించినవి. 5 సెంటీమీటర్లు (2 అం.) లో ఉన్నట్లుగా, నాన్-మెట్రిక్, మెట్రిక్ సమానమైనవి రెండూ ఇవ్వబడితే, సాధారణంగా ఏ యూనిట్‌కూ లింకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపుగా పాఠకులందరికీ కనీసం ఒక యూనిట్ గురించైనా తెలుస్తుంది.
- తేదీలు (క్రింద § కాలక్రమానుసార అంశాలను చూడండి)
- ఉద్దేశపూర్వకంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటే తప్ప, అయోమయ నివృత్తి పేజీలకు లింకు ఇవ్వకూడదు. సరైన వ్యాసానికి పైపు లింకు ఇవ్వండి. ఉదాహరణకు, తిరుపతి జిల్లా లోని పట్టణం కోసం, [[గూడూరు (తిరుపతి జిల్లా)|గూడూరు]] అని లింకు ఇవ్వండి. ఇది గూడూరుగా కనిపిస్తుంది, ఉద్దేశించిన పేజీకే దారితీస్తుంది. [[గూడూరు]] అనే లింకు కూడా చూడడానికి అలాగే కనిపిస్తుంది గానీ, ఇది గూడూరు అనే అయోమయ నివృత్తి పేజీకి దారితీస్తుంది.
వీటితో పాటు, కిందివాటికి చాలా సందర్భాల్లో లింకులు ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు
- దేశాలు (ఉదా: భారతదేశం/భారతీయులు, కెనడా/కండియన్లు, చైనా/చైనీయులు)
- భౌగోళిక అంశాలు (ఉదా., హిమాలయాలు, హిందూ మహాసముద్రం, ఆఫ్రికా)
- నివాస ప్రాంతాలు, పట్టణాలు (ఉదా., న్యూ ఢిల్లీ; హైదరాబాదు)
- భాషలు (e.g., తెలుగు, తమిళం, ఫ్రెంచి, బెంగాలీ)
- జాతీయత, తెగలు, జాతులు, ఉనికి (ఉదా., బ్రిటిషు, జపనీయులు, పాకిస్తానీలు, నైజీరియనులు)
- మతాలు (ఉదా., హిందూమతం, ఇస్లాము, బౌద్ధం)
లింకులు సమాచారంతో కూడుకుని ఉన్నప్పటికీ, అవి అతి అనిపించుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు, మొబైలు, ట్యాబు వంటి చిన్నపరికరాల్లో వ్యాసాన్ని చదివేటపుడు అవి సాపేక్షికంగా చిన్నవిగా ఉంటాయి కాబట్టి, పాఠ్యంలో దగ్గరదగ్గరగా అనేక లింకులు ఉంటే పాఠకులకు నావిగేషన్ మరింత కష్టమవుతుంది. ప్రత్యేకించి, చూపు, అర్థం చేసుకోగలిగే సామర్థ్యం, సమన్వయ స్థాయిలు తక్కువగా ఉన్న పాఠకులకు ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. దగ్గరదగ్గరగా అనేక లింకులను ఇచ్చేటప్పుడు, చదవడానికి వీలు, సమాచార లభ్యతలను సమతుల్యం చేసుకుంటూ ఇవ్వండి.
అదే పేజీకి తిరిగి దారిమార్పుచేసే పేజీలకు లింకు ఇవ్వకండి.
లింకులివ్వడంలో ఉద్దేశం మరింత వివరణ కోసం, సముచితమైన నేవిగేషను అందించడం కోసం గానీ, పదాలకు విశిష్టత ఇచ్చేందుకు కాదు. పదాల పైకో, వస్తువుల పైకో పాఠకుల దృష్టిని మళ్ళించేందుకు లింకులివ్వకండి. లేదా వ్యాసాలపై గౌరవ ప్రపత్తులను వ్యక్తపరచే ఉద్దేశంతో లింకులివ్వకండి.
వ్యాసం బాడీ లోపల, బయటి లింకులు ఇవ్వరాదు. (వికీపీడియా:బయటి లింకులు చూడండి).
లింకుల పునరుక్తి
[మార్చు]ఒక ప్రధాన విభాగంలో ఒకేసారి, మొదటిసారి కనబడేచోట లింకు ఇవ్వండి.[d]. మిగతా విభాగాల్లో, సందర్భంలో బాగా అవసరమైతే తప్ప అదే లింకు మళ్ళీ ఇవ్వకండి.
మూలాలు ఒక ప్రత్యేకమైన అంశం. ఒకే లింకును, ఒకే పేజీ లోని పలు మూలాల్లో ఇవ్వవచ్చు, అందులో దోషమేమీ లేదు. ఉదా:|work=[[ఈనాడు]].
వ్యాసాల నుండి ఏదైనా పదకోశానికి లింకు ఇచ్చేటపుడు, లింకును ఆ పేజీకి ఇవ్వకుండా ఆ పేజీ లోని సదరు పదానికే నేరుగా ఇవ్వాలి. ఒకటి కంటే ఎక్కువ పదాలకు లింకులు ఇచ్చే సండర్భంలో మళ్ళీ మళ్ళీ లింకులు ఇవ్వవచ్చు.
జాబితాలలోని అంశాలకు లింకులు ఇచ్చేటపుడు, అవసరమనుకుంటే ఇచ్చిన లింకులను పునరుక్తి చెయ్యవచ్చు. డూప్లికేటు లింకులను గుర్తించేందుకు ఎన్వికీలో duplinks-alt అనే యూజర్‌స్క్రిప్టు ఉంది. తగు మార్పులతో దాన్ని తెవికీలో వాడుకోవచ్చు
ప్రవేశిక
[మార్చు]ప్రవేశికలో మరీ ఎక్కువ లింకులిస్తే చదవను సౌకర్యంగా ఉండదు. కొత్త పదాలు ఎక్కువగా ఉండే సాంకేతిక వ్యాసాల్లో, ప్రవేశికలో మామూలు కంటే ఎక్కువ లింకులు ఉండాల్సిన అవసరం ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో, ప్రవేశికలో మరీ సాంకేతిక పదాలను చొప్పించకుండా, వీలైనంత వరకు మామూలు పదాలతో రాయాలి. సాంకేతిక పదాలను ప్రధాన భాగంలో రాయవచ్చు.
ఇంగ్లీషు వికీపీడియా లోని విశేషవ్యాసాలు చాలావాటిల్లో, ప్రవేశికలో 12 నుండి 25 వరకూ లింకులు ఉంటాయి. అంటే సుమారుగా ప్రతి 16 పదాలకు ఒక లింకు.[2]
లింకులో స్పష్టత
[మార్చు]ఏ వ్యాసానికి లింకు ఇస్తున్నామో, ఆ వ్యాసం లింకులో చూపిస్తున్న పదానికి, సందర్భోచితంగా, వీలైనంత దగ్గరగా ఉండాలి.
ఉదాహరణకు, వివేకవర్థని వ్యాసానికి ఇచ్చే లింకు, అది కందుకూరి వీరేశలింగం పెట్టిన పత్రిక అనేది స్పష్టంగా తెలియాలి. లింకు లక్ష్యం, లింకు పాఠ్యం ఒకటే అయి ఉండాల్సిన అవసరం లేదు గానీ, లింకు మాత్రం భావస్ఫోరకంగా ఉండాలి.
| వ్యాస పాఠ్యం | వికీపాఠ్యం | గమనిక | |
|---|---|---|---|
| వీరేశలింగం తన మొదటి పత్రికను మొదలుపెట్టినపుడు | వీరేశలింగం [[వివేకవర్థని|తన మొదటి పత్రికను]] మొదలుపెట్టినపుడు |
"తన మొదటి" అనేదాన్ని కూడా చేరిస్తే స్ఫుటంగా ఉంటుంది | |
| వీరేశలింగం తన మొదటి పత్రికను మొదలుపెట్టినపుడు | వీరేశలింగం తన మొదటి [[వివేకవర్థని|పత్రికను]] మొదలుపెట్టినపుడు |
"పత్రికను" అనే పదం మాత్రమే | |
| వీరేశలింగం పెట్టిన తొలి పత్రికే రాజమండ్రిలో పెట్టిన తొలి పత్రిక | [[వివేకవర్థని|వీరేశలింగం పెట్టిన తొలి పత్రికే]] రాజమండ్రిలో పెట్టిన తొలి పత్రిక |
అది వీరేశలింగం పెట్టిన పత్రిక అని స్ఫుటంగా చెప్పడం | |
| వీరేశలింగం పెట్టిన తొలి పత్రికే రాజమండ్రిలో పెట్టిన తొలి పత్రిక | వీరేశలింగం పెట్టిన [[వివేకవర్థని|తొలి పత్రికే]] రాజమండ్రిలో పెట్టిన తొలి పత్రిక |
"తొలి పత్రికే" అనే పదాలకు మాత్రమే |
లింకు నిర్దుష్టంగా ఉండాలి
[మార్చు]సందర్భానికి తగినట్లుగా, లింకు పాఠ్యానికి అత్యంత దగ్గరగా ఉండే నిర్దుష్టమైన వ్యాసానికి లింకు ఇవ్వాలి: ఆ వ్యాసంలో మరింత సమాచారం ఉంటుంది, ఆ విషయానికి సంబంధించిన మరింత సాధారణమైన అశాలకు లింకులూ ఉంటాయి.
| ఇలా టైపు చేస్తే | ఇలా కనిపిస్తుంది | నిర్దుష్టత |
|---|---|---|
[[భారతదేశ భౌగోళికం]] | భారతదేశ భౌగోళికం | నిర్దుష్టంగా ఉంది (ఇలాగే ఉండాలి) |
[[భారతదేశ భౌగోళికం|భారతదేశ]] భౌగోళికం | భారతదేశ భౌగోళికం | సంబంధం ఉంది గానీ, తక్కువ నిర్దుష్టంగా ఉంది |
భారతదేశ [[భౌగోళికం]] | భారతదేశ భౌగోళికం | నిర్దుష్టంగా లేదు |
[[ఆంధ్రప్రదేశ్ చరిత్ర]] చూస్తే | ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే | నిర్దుష్టంగా ఉంది (ఇలాగే ఉండాలి) |
[[ఆంధ్రప్రదేశ్]] [[చరిత్ర]] చూస్తే | ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే | నిర్దుష్టంగా లేదు |
[[గూడూరు (నెల్లూరు)|గూడూరు]] | గూడూరు | నిర్దుష్టంగా ఉంది (ఇలాగే ఉండాలి) |
[[గూడూరు]]]] | గూడూరు | నిర్దుష్టంగా లేదు |
ఆ విషయంపై వ్యాసం లేనట్లైతే, కింది వాటిలో ఏదో ఒకటి చెయ్యవచ్చు:
- మీరే ఆ వ్యాసాన్ని సృష్టించండి.
- ఓ నిర్దుష్టమైన టాపిక్కు మీద ఇంకా వ్యాసం లేనట్లైతే, § దారిమార్పులు విభాగంలో చెప్పినట్లు, దానికంటే మరింత జనరల్ టాపిక్కుపై ఉండే వ్యాసానికి దారిమార్పు సృష్టించండి. ఉదాహరణకు, పోతన రాసిన శ్రీమదాంధ్ర భాగవతం లోని "ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు" పద్యానికి వ్యాసం లేనట్లైతే, ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు అనే పేరుతో ఓ పేజీని, శ్రీమదాంధ్ర భాగవతం పేజీకి దారిమార్పుగా సృష్టించండి.
- అలాంటి జనరల్ వ్యాసం కూడా లేనట్లైతే అపుడు ఒక ఎర్రలింకును సృష్టించండి. కానీ, దానికి ముందు § ఎర్రలింకులు విభాగం చూడండి.
దారిమార్పు, ఎర్రలింకు రెండూ సముచితంగా ఉన్నాయని అనిపించనపుడు, మరింత జనరల్‌గా ఉండే వ్యాసానికి లింకు ఇవ్వవచ్చేమో చూడండి.
ఉదాహరణకు,
19 వ శతాబ్దపు తెలుగు పత్రికలు (2025 నవంబరు నాటికి ఈ పేరు గల వ్యాసం అసలు ఉనికిలోనే లేదు),
అనే లింకు బదులు
19 వ శతాబ్దపు తెలుగు పత్రికలు అని రాయవచ్చు (ఇది 19 వ శతాబ్దానికి లింకు ఇస్తుంది),
19 వ శతాబ్దపు తెలుగు పత్రికలు అని రాయవచ్చు (ఇది తెలుగు పత్రికల గురించిన వ్యాసానికి లింకు ఇస్తుంది),
19 వ శతాబ్దపు తెలుగు పత్రికలు అని రాయవచ్చు (ఇది అసలు దేనికీ లింకు ఇవ్వదు. సందర్భాన్ని బట్టి ఇదే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం కావచ్చు),
లేదా
19 వ శతాబ్దం నాటి తెలుగు పత్రికలు అని రాయవచ్చు (ఆయా వ్యాసాలకు విడివిడిగా లింకులు ఇస్తుంది);
అయితే,
19 వ శతాబ్దపు తెలుగు పత్రికలు అని ఒకదాని పక్కన ఒకటి, గ్యాపు లేకుండా మాత్రం లింకులు ఇవ్వకండి. పక్కపక్కనే ఉండడం వలన ఆ రెండు లింకులూ ఒకే లింకుగా, ఒకే వ్యాసానికి వెళ్ళే లింకుగా పొరబడే అవకాశం ఉంది.
విభాగపు లింకులు
[మార్చు]ఏదైనా వ్యాసం లోని ఒక విభాగం ఒక నిర్దుష్ట విషయానికి సంబంధించినదైతే, ఆ విభాగానికి లింకు ఇస్తే, పాఠకులను నేరుగా సంబంధిత సమాచారానికి తీసుకువెళ్తుంది. విభాగానికి లింకు ఇవ్వడానికి పైపు లింకులు, దారిమార్పులు, {{Section link}} మూస (ఇది మూస:Char అనే క్యారెక్టరును కూడా చూపిస్తుంది) వంటి వివిధ పద్ధతులున్నాయి
తెగిపోయిన విభాగపు లింకులను నివారించడం
[మార్చు]విభాగపు పేరు మారిపోయిన సందర్భాల్లో, దానికి వస్తున్న లింకులు తెగిపోయి సమస్య ఏర్పడవచ్చు. (ఇలా జరిగితే, దానికి వచ్చే లింకులు పేజీ పైభాగం వద్ద ఆగిపోతాయి.) దీన్ని నివారించడానికి {{subst:Anchor}} మూసను, విభాగపు పూర్వపు పేరును చూపిస్తూ వాడాలి.
మరో పద్ధతిలో, ఒక దాచిన వ్యాక్యను రాయవచ్చు. ఉదాహరణకు, <!-- "క్వార్క్" నుండి ఇక్కడికి లింకు ఉంది-->{{efn|1=The hidden message (<!-- "ఫలానా వ్యాసం" నుండి ఇక్కడికి లింకు ఉంది-->) అనే ఒక దాచిన సందేశాన్ని లక్ష్యిత విభాగంలో చేర్చాలి. దీన్ని విభాగపు శీర్షిక కింద ఒక బ్రేకు ఇచ్చి (లేదంటే సమస్యలు వస్తాయి) రాయాలి. ఆ రెండు లైన్లను గమనించండి:
==లక్ష్యిత విభాగం==
<!-- "ఫలానా వ్యాసం" నుండి ఇక్కడికి లింకు ఉంది -->
తద్వారా, శీర్షిక పేరు మార్చేవారు దానికి వస్తున్న లింకులను సరిచేస్తారు. ఈ పద్ధతి అంత బలమైన పద్ధతేమీ కాదు; శీర్షిక పేరుమార్చాలనుకునే సంపాదకుడిపై అనవసరమైన భారం పడుతుంది.
ఇంగ్లీషు వికీలో తెగిపోయిన యాంకర్లను సరిచేసే బాట్లున్నాయి. అవి: cewbot, Dexbot, FrescoBot.
పద్ధతులు
[మార్చు]దారిమార్పులు
[మార్చు]కొండపల్లి రక్షిత అరణ్యం అనే పేజీకి లింకు ఇవ్వాలని అనుకుందాం. కానీ ఆ పేజీ ఇంకా లేదు. కొండపల్లి రక్షిత అరణ్యం అనే పేజీ నుండి విజయవాడ పేజీకి దారిమార్పు సృష్టించవచ్చు. ఇలా, మామూలుగానే లింకు ఇవ్వండి: [[కొండపల్లి రక్షిత అరణ్యం]] ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. . దీన్ని ప్రచురించినపుడు ఇలా ఉంటుంది: కొండపల్లి రక్షిత అరణ్యం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.. ఈ ఎర్రలింకును నొక్కితే, కొండపల్లి రక్షిత అరణ్యం అనే కొత్త పేజీని సృష్టించే పేజీకి వెళ్తుంది.; అక్కడ #REDIRECT [[విజయవాడ]], అని రాస్తే, కొండపల్లి రక్షిత అరణ్యం పేజీకి వెళ్ళదలచిన పాఠకులు విజయవాడ వ్యాసానికి వెళ్తారు.
ఈ సందర్భంలో [[విజయవాడ|కొండపల్లి రక్షిత అరణ్యం]] అనే సూటి లింకు కంటే ఇలా దారిమార్పు ఇవ్వడమే మెరుగు. ఎందుకంటే, కొండపల్లి రక్షిత అరణ్యం కు ప్రత్యేకించి ఒక వ్యాసం సృష్టించినపుడు (ఈ దారిమార్పు స్థానంలో), ఆ లింకు నొక్కిన పాఠకులు ఆటోమాటిగ్గా ఈ కొత్తపేజీకి వెళ్తారు. ఆ లింకు కొత్త పేజీకి వెళ్తుందా లేదా అని పరిశీలించడం, పరీక్షించడం చెయ్యాల్సిన అవసరం లేదు.
దారిమార్పు పేజీ గుండా వెళ్ళకుండా, నేరుగా గమ్యం పేజీకి వెళ్ళేందుకు, {{no redirect|కొండపల్లి రక్షిత అరణ్యం}} అని వాడండి. అదే పేజీకి ఇచ్చే దారిమార్పులు చెయ్యకండి.
పైపు లింకులు
[మార్చు]వికీలింకు, లక్ష్యిత పేజీ శీర్షికను చూపిస్తుంది. అయితే, ఆ పేజీకి లింకు ఇస్తూనే, పాఠకులకు కనబడేది మాత్రం వేరేది, మరింత సందర్భోచితంగా ఉండేలా, ఇవ్వవచ్చు. దీన్ని (|) పైపు క్యారెక్టరు ద్వారా సాధించవచ్చు. ఉదాహరణకు, [[శ్రీ కృష్ణదేవ రాయలు|కృష్ణదేవరాయల]] పాలనలో అనేది కృష్ణదేవరాయల పాలనలో అని కనిపిస్తుంది.
శైలి
[మార్చు]- బహువచనాలు, ఉద్భవ పదాలు. తెలుగులో "లు" అనే ప్రత్యయం చేరినపుడు ఏకవచనం బహువచనంగా మారుతుంది. చాలా సందర్భాల్లో మూలపదం మారిపోతుంది. కొన్ని అకారాంత, ఉకారాంత మూలపదాలు మార్పుచెందవు. ఉదాహరణకు కాలువ, కణుపు, పలుకు, చేర్పు వంటి ఏకవచన పదాలకు చివర "లు" చేరినపుడు పదంలో మార్పేమీ లేకుండా, కాలువలు, కణుపులు, పలుకులు, చేర్పులు రూపంలో బహువచనాలౌతాయి. కానీ చెవి, కాలు, దారి వంటి ఏకవచనాలు బహువచనాలుగా మారినపుడు రూపం కోల్పోతాయి.
[[కాలువ]]లుఅనేది కాలువలు లాగా చూపిస్తుంది. ఇది సింపులుగా ఉంటుంది. కానీ కాళ్ళు అనే పదానికి లింకు ఇవ్వాలంటే మాత్రం,[[కాలు|కాళ్ళు]]అని ఇవ్వాల్సి ఉంటుంది.
సద్యస్ఫురణం
[మార్చు]పైపు లింకులను వీలైనంత సద్యస్ఫోరకంగా (చూడగానే అర్థమయ్యేలా) ఉండేలా చూడండి. ఓ లింకును నొక్కినపుడు వచ్చే పేజీలో ఏముంటుందో పాఠకులు ఊహించేలా ఉండాలి, విస్మయం కలిగించకూడదు. పేజీ ఆకృతీ, లింకులూ అన్నీ కూడా ఒక అర్థవంతమైన పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి.
లింకు ద్వారా ఏ వ్యాసానికి లింకు ఇస్తున్నామో, లింకు పాఠ్యం ఆ పేజీ పేరుతో ఖచ్చితంగా సరిపోయి ఉండాల్సిన అవసరం లేదు. [[క్రికెట్ ప్రపంచ కప్ రికార్డుల జాబితా|రికార్డు నెలకొల్పాడు]] లాగా ఉండవచ్చు. అయితే, లింకు పాఠ్యంలో చూపించినదానికంటే, దాని లింకులో వివరమైన సమాచారం ఉండేలా లింకు ఇవ్వవద్దు. ఉదాహరణకు,
హైదరాబాదు రాజ్యంలో [[ఎకరార్ నామా|పత్రికలపై ఆంక్షలు]] ఉండేవి.
ఇక్కడ పాఠకులకు పత్రికలపై ఆంక్షలు అనే లింకు కనిపిస్తుంది గానీ, మరింత వివరమైన ఎకరార్ నామా అనే పేజీకి వెళ్తుందని ఆ లింకును నొక్కి ఆ పేజీకి వెళ్తే తప్ప తెలియదు. లేదా మౌసును ఆ లింకుపై ఉంచితే తెలుస్తుంది. వ్యాసాన్ని ముద్రించుకుని చూస్తే అసలు ఎకరార్ నామా ప్రస్తావనే కనిపించదు.
అలా కాకుండా, ఆ వ్యాసానికి ఫలానావ్యాసం కూడా చూడండి అని లింకు ఇవ్వవచ్చు. లేదా వాక్యాన్ని ఇలా -
హైదరాబాదు రాజ్యంలో [[ఎకరార్ నామా]] వంటి చట్టాలతో పత్రికలపై ఆంక్షలు విధించారు అని రాయవచ్చు.
లింకు లోకి మరిన్ని పదాలు
[మార్చు]కొన్నిసార్లు లింకు ఇచ్చిన పాఠ్యం లోకి మరిన్ని పదాలను చేరిస్తే, మరింత స్పష్టతను ఇవ్వవచ్చు.
ఉదాహరణకు, కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం అనే వ్యాసంలో:
టిబెట్ భూభాగాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పరిపాలించడాన్ని చట్టవిరుద్ధమైన [[టిబెట్‌పై చైనా దురాక్రమణ|సైనిక ఆక్రమణగా]] కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం భావిస్తుంది.
అనే వాక్యం ఇలా కనిపిస్తుంది:
టిబెట్ భూభాగాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పరిపాలించడాన్ని చట్టవిరుద్ధమైన సైనిక ఆక్రమణగా కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం భావిస్తుంది.
ఈ లింకు చూస్తే అది సైనిక ఆక్రమణ అనే సాధారణ అంశానికి ఇచ్చిన లింకుగా అనిపిస్తుంది.
అయితే:
టిబెట్ భూభాగాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పరిపాలించడాన్ని, [[టిబెట్‌పై చైనా దురాక్రమణ|టిబెట్‌పై చైనా చట్టవిరుద్ధంగా చేసిన సైనిక ఆక్రమణగా]] కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం భావిస్తుంది.
అనేది ఇలా కనిపిస్తుంది:
టిబెట్ భూభాగాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పరిపాలించడాన్ని, టిబెట్‌పై చైనా చట్టవిరుద్ధంగా చేసిన సైనిక ఆక్రమణగా కేంద్రీయ టిబెట్ ప్రభుత్వం భావిస్తుంది.
ఇది, టిబెట్‌పై చైనా దురాక్రమణ గురించిన లింకని చూడగానే తెలిసిపోతుంది.
పేర్ల లోపలి పేర్లకు
[మార్చు]ఒక పేరులో భాగంగా ఉన్న పేర్లకు లింకులు ఇవ్వవద్దు. అలా ఇచ్చిన సందర్భాలను పేర్కొంటూ, తెవికీలో జరిగిన ఒక చర్చలో వాడుకరి:K.Venkataramana, కింది పద్యం రాసారు:
| “ | అగ్గిపుల్ల నందు అగ్గి,పుల్లకు నిచ్చు చెరకు కిచ్చు వంటచెరకు నందు లింకులిచ్చువారి లీలలు చూడరా లుప్తమయ్యె పదము లింకులందు |
” |
—కె.వి.ఆర్ | ||
పై పద్యం, లింకులు ఎలా ఇవ్వకూడదో చెబుతుంది. అగ్గిపుల్ల అనే పదంలో అగ్గికి పుల్లకూ విడివిడిగా లింకులు ఇస్తే సందర్భోచితంగా ఉండదు, అలాగే వంటచెరకు అనే పదంలో కేవలం చెరకుకు మాత్రమే లింకు ఇవ్వకూడదు. అనే సంగతిని వివరిస్తుంది ఈ పద్యం. ఏ వ్యాసానికైతే లింకు ఇస్తున్నామో, ఆ వ్యాసం ప్రస్తుత వ్యాసం లోని సందర్భానికి సరిపోయేలా ఉండాలి.
| ఇలా రాయండి: | [[రామన్ ఎఫెక్ట్]] | → రామన్ ఎఫెక్ట్ |
|---|---|---|
| ఇలా రాయవద్దు: | [[చంద్రశేఖర వేంకట రామన్|రామన్]] ఎఫెక్ట్ | → రామన్ ఎఫెక్ట్ |
పూర్తి పేరుకు లింకు ఇస్తే అది ఎర్రలింకు అయ్యే సందర్భాల్లో కూడా ఇలాగే చెయ్యాలి; for example, even if there is no article titled Lafayette Avenue (Brooklyn):
| Do not write: | [[Gilbert du Motier, Marquis de Lafayette|Lafayette]] Avenue | → Lafayette Avenue |
|---|
See also § Link clarity.
పైపు లింకులూ దారిమార్పులూ
[మార్చు]దారిమార్పులు ఇవ్వదగ్గ చోట్ల పైపులింకు వాడవద్దు. ఉదాహరణకు, చిక్కం దోటి అనే పేజీ, వ్యవసాయ పరికరాలు అనే పేజీకి దారిమార్పు. వేరే ఏదైనా పేజీని దిద్దుబాటు చేసే సందర్భంలో అక్కడి నుండి చిక్కం దోటి అనే పదానికి లింకు ఇవ్వాల్సి వచ్చినపుడు, దారిమార్పు కాకుండా [[వ్యవసాయ పరికరాలు|చిక్కం దోటి]] అని పైపు లింకు ఇవ్వాలని అనిపించవచ్చు. కానీ, అలా చెయ్యవద్దు; సింపులుగా [[చిక్కం దోటి]] అని లింకు ఇచ్చేసి వదిలెయ్యండి. మిగతాది వికీపీడియా సాఫ్ట్‌వేరే చూసుకుంటుంది. దీనివలన రెండు ప్రయోజనాలున్నాయి: ఒకటి, భవిష్యత్తులో ఆ విషయం గురించి (చిక్కం దోటి మీద) ప్రత్యేకంగా వ్యాసాన్ని సృష్టించినపుడు, లింకును మార్చాల్సిన అవసరమేమీ ఉండదు. రెండవది, ఆ విషయం మీద వ్యాసం అవసరమని ఈ దారిమార్పు సూచిస్తుంది.
Piped links and redirects to sections of articles
[మార్చు]As explained above, links to sections can take the reader directly to relevant information.
పైపు లింకులు
[మార్చు]Using piped links to sections avoids the unsightly Article#Section name in the display text.
The format for a piped link is [[Article#Section|name of link]]. For example, to link to the "Culture" subsection of the article Oman, type:
[[Oman#Culture|culture of Oman]],
which displays as culture of Oman. The section name is case-sensitive, unlike article titles which are case insensitive.
Finally, consider adding a hidden comment to the target section so that future editors who edit the title of that section know they must search for and fix all incoming links, for example:
<!-- The article ArticleName links to this section. Should the section's title change, fix now mistargeted wikilinks, or use the {{subst:Anchor|}} template to create an anchor to keep the stability of external incoming links too. -->
A list of incoming wikilinks can be generated using the "What links here" feature. As a general rule, it is preferable, particularly in cases where a section has a large number of backlinks, to use {{subst:Anchor}} in the HTML element of the header.
To link to a section within the same article, one can simply prefix the name of the section header with the pound sign ("#") nested in square brackets, for example ("#"):
[[#Promotion to rook or bishop|§ promotion to a rook or bishop]].
Prefix the label of a wikilink that targets a section header with the section symbol ("§").
Redirects to sections which may become articles
[మార్చు]Many topics useful for linking may currently appear only as sections of other Wikipedia articles, but are potentially notable enough to become articles on their own. For example, the article Eastern Anyshire might have a small "History" section, but this does not prevent the article History of Eastern Anyshire being written eventually. A redirect page from such a sub-topic to a general topic may exist already; if not, a redirect can be created when the occasion arises. It is bad practice to create links in article text using the format [[Article#Section]]; navigation then becomes difficult if the section is expanded into a new article. Instead, link using a redirect to the main topic; it costs little and makes improvements easier. Thus:
- In a redirect page named "History of Topic", use
#REDIRECT [[Topic#History]]. - In another article, use
[[history of Topic]]. - Avoid:
[[Topic#History|history of Topic]].
Links to non-English language pages
[మార్చు]వికీపీడియా వర్గాలకు ఇచ్చే లింకులు
[మార్చు]Wikipedia has categories of articles; for example, "Phrases". Adding the wikitext [[Category:Phrases]] to an article will add that article to the category "Phrases". (This will not create any visible addition to the body text of the article.)
If you instead want to create a visible link to a category, add a colon in front of the word "Category". For example, [[:Category:Phrases]] creates the link Category:Phrases. As with other links, piping can be used: Phrases.
The {{See also cat}} template can be used instead:
{{See also cat|Phrases}} creates:
ఎర్రలింకులు
[మార్చు]Overlinking in general is a style issue partly because of the undesirable effect on readability. But if too many blue links are distracting, a red link is even more so. The unassuming coloration of the text (probably black) is the most productive.
In prose, if it seems that the level of red linking is overlinking, remember that red links have been found to be a driving force that encourages contributions,[e] and then use that fact to balance the perceived stylistic issues of "overlinking" the red links. (Legitimate red links are titles to unfulfilled coverage of topics that do not violate "What Wikipedia is not" policy.) Given a certain number of red links needed, if marking all of them could be overlinking, then just how many should be marked could be a style issue, and just which ones are priority is a helpful contribution.
In lists, overlinking red links can occur when every item on a list is a red link. If the list is uniform, where each item clearly qualifies for an article, a single red link (or blue link) could indicate that. If the list is not uniform, the research effort to mark all possible red links is a risky investment: while red means "approved" status, "black" remains ambiguous, even though it meant "disapproved" after research. Valid requests for the future creation of each title in a list, or in prose, may also be a risky investment when the number of red links could be perceived by other editors as overlinking, and then removed before the investment was fruitful. The removal of massive numbers of red links from an overlinked list is best handled by an editor skilled in the automation of text processing.
Red links can also be removed if they violate policy or the guideline for red links, but otherwise red links do not have an expiration date. If you remain convinced there is overlinking of red links, consider turning some of them blue. The methods to do so are by creating a simple stub, a redirect, or a disambiguation page. All of these require the certainty that the red link was legitimate in the first place, such as the conventions on article titles.
Colored links
[మార్చు]In prose refrain from implementing colored links, as these may impede users' ability to distinguish links from regular text. See the guides to editing articles for accessibility at contrast and navbox colors.
Checking links as they are created
[మార్చు]It's easy to create an erroneous link without realizing it. When adding a new link, it's a good idea to use the "Show preview" button and then (from the preview) open the link in a new browser tab to check that it goes where you intend.
By following naming conventions, an internal link is much more likely to lead to an existing article. When there is not yet an article about the subject, a good link makes it easier to create a correctly named article later.
నిర్దుష్టమైన కేసులు
[మార్చు]తేదీలకు, సంవత్సరాలకూ లింకు ఇవ్వడం
[మార్చు]నెల-రోజు వ్యాసాలకూ (ఉదా.. ఫిబ్రవరి 24, జూలై 10), సంవత్సరాల వ్యాసాలకూ (ఉదా. 1964, 1857, 2007) లింకులు ఇవ్వకూడదు. లింకు ఇస్తే తప్ప పాఠకులకు వ్యాసం అర్థం కాని అరుదైన, విశిష్టమైన సందర్భం ఉంటే తప్ప వీటికి లింకులు ఇవ్వనే కూడదు. ఉదాహరణకు:
- అట్లాంటిక్ విమానం కూల్చివేత ఘటన వ్యాసం లోని, "1999 ఆగస్టు 10 న 16 మంది ప్రయాణీకులతో కూడిన పాకిస్తాన్ వాయుసేనకు చెందిన బ్రెగెట్ అట్లాంటిక్ గస్తీ విమానం భారత గగనతలాన్ని అతిక్రమించగా, భారత వాయుసేనకు చెందిన మిగ్ 21 విమానాలు దాన్ని కూల్చివేసాయి." అనే వాక్యంలో తేదీకి, సంవత్సరానికీ లింకులు ఇవ్వకూడదు. ఈ వాక్యంతో సంబంధం ఉన్న సమాచారం 1999 పేజీలో గానీ, ఆగస్టు 10 పేజీలో గానీ ఏమీ లేదు.
- ద్వారం వెంకటస్వామి నాయుడు పేజీలో పుట్టిన, మరణించిన తేదీలకూ, సంవత్సరాలకూ లింకులు ఇవ్వకూడదు.
అయితే, ఈ తేదీలు, సంవత్సరాల వ్యాసాల్లో మాత్రం ఇతర తేదీలు, సంవత్సరాల వ్యాసాలకు లింకులు ఇవ్వవచ్చు.
స్మారక తేదీల వ్యాసాల (కార్గిల్ విజయ దినోత్సవం) లాంటివి తేదీ, సంవత్సరాల వ్యాసాల కోవ లోకి రావు.
Units of measurement that are not obscure
[మార్చు]Generally, a unit should be linked only if it is likely to be obscure to many readers or is itself being discussed. For example, the troy ounce, bushel, hand, candela, knot, mho, or millibarn might be considered obscure even if they are well-known within their field of use. Other units may be obscure in some countries even if well known in others.
External links section
[మార్చు]Wikipedia is not a link collection, and an article comprising only links is contrary to what the "what Wikipedia is not" policy dictates.
Syntax
[మార్చు]The syntax for referencing a web address is simple. Just enclose it in single brackets with a space between the URL and the text that is displayed when the page is previewed or saved:
[https://www.example.org Text to display]
The text appears as:
The URL must begin with either http:// or https:// (preferring https://, where available), or another common protocol, such as ftp:// or news://. If no protocol is used, the square brackets display normally – [like this] – and can be used in the standard way.
In addition, putting URLs in plain text with no markup automatically produces a link, for example https://www.example.org/ → https://www.example.org/. However, this feature may disappear in a future release. Therefore, in cases where you wish to display the URL because it is intrinsically valuable information, it is better to use the short form of the URL (domain name) as the optional text: [https://www.example.org/ example.org] produces example.org.
Citations templates such as {{cite web}} should not be used in the ==External links== section. External link templates such as {{official website}} are used instead of citation templates.
Link titles
[మార్చు]Embedded HTML links within an article are a now-deprecated way to supply a bare URL as a source within an article, by simply enclosing the URL in square brackets, like this: [https://www.guardian.co.uk/usa/story/0,12271,1650417,00.html] → . However, you should add a descriptive title when an external link is offered in the References, Further reading, or External links sections. This is done by supplying descriptive text after the URL, separated by a space and enclosing it all in square brackets.
For example, to add a title to a bare URL such as https://en.wikipedia.org/ (this is rendered as https://en.wikipedia.org/), use the following syntax: [https://en.wikipedia.org/ an open-content encyclopedia] (this is rendered as "an open-content encyclopedia").
Generally, URLs and domain names are ugly and uninformative; it is better for a meaningful title or description to be displayed rather than the URL or domain itself. For example, European Space Agency website is much more reader-friendly than http://www.esa.int/ESA. There may be exceptions where the domain name is well known or is also the company or publication name. When a URL or domain name is given, putting both a plain-English title or description and the URL is often more informative: for example, European Space Agency website, www.esa.int.
If the URL or domain name is displayed, make it as simple as possible; for example, if the index.html is superfluous, remove it (but be sure to check in preview mode first). Many but not all sites can be trimmed of a leading "www."; test it to be sure. Use camel case to make a displayed domain more readable, e.g. WashingtonPost.com versus washingtonpost.com.
The "printable version" of a Wikipedia article displays all URLs in full, including those given a title, so no information is lost.
URLs as embedded (numbered) links
[మార్చు]Without the optional text, external references appear as automatically numbered links: For example,
[https://en.wikipedia.org/]
is displayed like this:
Numbered links of this type used to be used after the punctuation, like this, with a full citation given in the References section. This style of referencing is now deprecated, because such links are susceptible to link rot. See Wikipedia:Citing sources and Wikipedia:Verifiability for more information.
Position in article
[మార్చు]
Embedded links that support information in an article are positioned in the same manner as any other reference in the article, following the usual standards about citation formatting and placement in relation to punctuation.
Links that are not used as sources can be listed in the External links section, like this:
==External links==* [https://...]* [http://...]
As with other top-level headings, two equal signs should be used to mark up the external links heading (see Wikipedia:Manual of Style/Layout § Headings). External links should always be the last section in an article. It precedes categories and some kinds of navigation templates.
If there is a dispute on the position of an embedded link, consider organizing alphabetically.
Non-English-language sites
[మార్చు]Webpages in English are highly preferred. Linking to non-English pages may still be useful for readers in the following cases:
- When the website is the subject of the article
- When linking to pages with maps, diagrams, photos, tables (explain the key terms with the link, so that people who do not know the language can interpret them)
- When the webpage contains information found on no English-language site of comparable quality, and is used as a citation (or when translations on English-language sites are not authoritative).
If the language is one that most readers could not be expected to recognize, or is for some other reason unclear from the name of the publication or the book or article or page title, consider indicating what language the site is in.
- Example: Koha Jonë, an Albanian-language newspaper from Tirana
- Example: El País, a Spanish-language newspaper from Madrid
You can also indicate the language by putting a language template after the link. This is done using Template:In lang by typing {{In lang|<language code>}}. For example, {{In lang|es}} displays as: (in Spanish). See list of ISO 639 codes.
When using one of the Citation Style 1 or Citation Style 2 templates, instead of the {{In lang}} template, use the |language= parameter. This parameter accepts language names or language codes; see this list of supported names and codes. (Use of language codes is to be preferred because cs1|2 automatically renders language names in the language of the local Wikipedia.)
File type and size
[మార్చు]If the link is not to an HTML or PDF file (the latter is identified automatically by the software with an icon like this: ), identify the file type. Useful templates are available: {{DOClink}}, {{RTFlink}}. If a browser plugin is required to view the file, mention that as well. If a link is to a PDF file but doesn't end with .pdf, you can put a #.pdf at the end to flag it as a PDF.
If the link is to a very large page (considering all its elements, including images), a note about that is useful since someone with a slow or expensive connection may decide not to visit it.
అంతర్వికీ లింకులు
[మార్చు]లింకు ఇవ్వడం
[మార్చు]Using links to విక్షనరీ as an example, interwiki links can take the form of:
[[wikt:వ్యాసం]]which appears as: wikt:వ్యాసం
పైపు సింబలు ఆదిపదాన్ని కనబడకుండా చేస్తుంది:
[[wikt:వ్యాసం|]]→ వ్యాసం
పైపు తరువాత పాఠ్యం చేరిస్తే ఆదిపదం కనబడకుండా ఆ పాఠ్యం కనిపిస్తుంది. ఆ పాఠ్యం లింకు కంటే భిన్నంగా ఉండవచ్చు, లేదా అదే ఉండవచ్చు (ఆదిపదం లేకుండా):
పాఠకులకు తికమక కలగకుండా ఉండేందుకు గాను, భాషాంతర లింకు గానీ, అంతర్వికీ లింకు గానీ ఇన్‌లైన్లో ఇవ్వడం మంచిది కాదని తెవికీ చెబుతుంది. దీనికి మినహాయింపులు: విక్షనరీ, వికీసోర్సు లకు ఇన్‌లైన్లో లింకులు ఇవ్వవచ్చు (ఉదాహరణకు ఏదైనా అసాధారణమైన పదానికి). తెవికీలో ఎర్రలింకును చూపిస్తూ, దానితో పాటు భాషాంతర లింకును కూడా చూపించే {{Interlanguage link}} మూసను వాడవచ్చు.
Floating boxes
[మార్చు]Floating boxes for links to articles in other Wikimedia Foundation projects such as Wiktionary and Wikiquote can be added using interwiki link sidebar templates, for example {{Wikiquote|Jimmy Wales}}. These display as a shaded box with a logo.
(There is a related set of templates for some free content resources that are not run by the Wikimedia Foundation. Rather than creating a sidebar link, they create text suitable for using as a bulleted entry in an "External links" section. A list of such templates can be found at Wikipedia:List of templates linking to other free content projects.)
Link maintenance
[మార్చు]Linking and continual change are both central features of Wikipedia. However, continual change makes linking vulnerable to acquired technical faults, and to the later provision of different information from that which was originally intended. This is true of both "outgoing" links (from an article) and "incoming" links (to an article).
- Outgoing links: These should be checked from time to time for unintended changes that are undesirable. If the opportunity arises to improve their formatting, appropriateness, and focus, this should be done.
- Incoming links: Creating an article turns blue any existing red links to its title. Proper redlinks are created only in the hope that an article will eventually be written. Therefore, when creating an article, it is wise to check "What links here" to identify such redlinks, if any, and that they are appropriate.
బొత్తాలు
[మార్చు]వ్యాసాల్లో బొత్తాలు వాడరాదు. పాఠకులను వేరే పేజీకి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంటే లింకు వాడండి. బొత్తాలను వికీపీడియాలో, ఏదైనా "చర్య (యాక్షన్)" కోసం వాడతారు. ఉదాహరణకు లేదా లేదా లేదా .[3]
See also
[మార్చు]- Wikipedia:Linking dos and don'ts (information page summarizing the key points of this guideline)
- Help:Interwikimedia links
- Help:Menu/Links
- Template:Dead end
- Template:Dead link
- Template:Underlinked
- Wikipedia:Dead-end pages, pages without internal links
- Wikipedia:Integrate
- Wikipedia:Links to (disambiguation) pages
- Wikipedia:Orphan, pages without incoming links
- Wikipedia:Red link
- Wikipedia:Walled garden
- Wikipedia:What Wikipedia is not § Wikipedia is not an indiscriminate collection of information
- Wikipedia:Wikipedia doesn't use Allwiki, the idea that every single word should be a link
- Wikipedia:WikiProject Orphanage, editors dedicated to clearing up the immense backlog of orphaned articles
- User:Tony1/Build your linking skills, a tutorial on high-quality linking with practice questions
- User:Evad37/duplinks-alt, a script to highlight links occuring more than once in an article
Notes
[మార్చు]- ↑ చాలా వ్యాసాల్లో మొదటి వాక్యంలో వ్యాసం పేరు, బొద్దుగా వస్తుంది. వ్యాసం నుండి అదే వ్యాసానికి లింకు ఇస్తే ఆ లింకు బొద్దుగా కనిపిస్తుంది; ఈ పద్ధతి సరైనది కాదు; వ్యాసాన్ని దారిమార్పు చేసినపుడు, అనవసరమైన సర్క్యులర్ లింకులు ఏర్పడతాయి. బొద్దుగా చూపిన పాఠ్యంలో కొంతభాగానికి మాత్రమే లింకు ఇవ్వడం కూడా సరైన పద్ధతి కాదు; బొద్దు పాఠ్యం చూపించవలసిన ప్రత్యేకత పోతుంది. అసలు బొద్దు చేసిన ఫలమే లేకుండా పోవచ్చు.
- ↑ If quoting hypertext that includes a Wikipedia link particularly salient to the quote's use, a [link in original] editorial note may be added. [link added] notes should generally be avoided, because if the clarification is needed badly enough to justify disrupting the flow of text, the link is probably not conservative and should be omitted.
- ↑ A 2015 study of log data found that "in the English Wikipedia, of all the 800,000 links added ... in February 2015, the majority (66%) were not clicked even a single time in March 2015, and among the rest most links were clicked only very rarely", and that "simply adding more links does not increase the overall number of clicks taken from a page. Instead, links compete with each other for user attention." This was reported in: Paranjape, Ashwin; West, Bob; Leskovec, Jure; Zia, Leila (February 22–25, 2016). "Improving Website Hyperlink Structure Using Server Logs". WSDM'16: Proceedings of the Ninth ACM International Conference on Web Search and Data Mining (PDF). San Francisco: Association for Computing Machinery. doi:10.1145/2835776.2835832. ISBN 9781450337168.
- ↑ Major sections are generally detailed sections with a level-2 heading, but consensus at an article may determine a lower-level subsection is major, especially when a preceding subsection is especially long, when an article's structure puts most content under level-3 headings with level-2 ones primarily used for thematic grouping, or when a subsection is a link target at which many readers arrive directly.
- ↑ Academic research has suggested that red links may be a driving force in Wikipedia growth; see: Spinellis, Diomidis; Louridas, Panagiotis (2008). "The collaborative organization of knowledge". Communications of the ACM. 51 (8). Association for Computing Machinery: 68–73. doi:10.1145/1378704.1378720. S2CID 77400.
Most new articles are created shortly after a corresponding reference to them is entered into the system
See also Wikipedia:Inflationary hypothesis of Wikipedia growth.
References
[మార్చు]- ↑ Dvorak, John C. (April 16, 2002). "Missing Links". PC Magazine. Archived from the original on August 6, 2011. Retrieved August 16, 2021.
- ↑ "User:WhatamIdoing/Sandbox 3". Wikipedia (English ed.). January 30, 2023. Retrieved August 31, 2023.
- ↑ "Codex: Wikimedia Design System". Doc.Wikimedia.org. Wikimedia Foundation. 2024. "Components: Button" section.
External links
[మార్చు]- The Wikimedia Design Style Guide (Links)
- Silvers, V. L.; Kreiner, D. S. (1997). "The Effects of Pre-existing Inappropriate Highlighting on Reading Comprehension". Reading Research and Instruction. 36 (3): 217–223. doi:10.1080/19388079709558240. మూస:MASID.
- Internal link analyzer for automatic detection of redundant links in Wikipedia
-->
