వికీపీడియా:సంబంధిత మార్పులు పేజీ ని ఉపయోగించడం ఎలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం సహాయం పేజీల లోని ఒక భాగం.


సంబంధిత మార్పులు కూడా చూడండి.

మీరు చూస్తున్న పేజీకి లింకులున్న పేజీలలో జరిగిన ఇటివలి మార్పులను చూపించేదే ఈ "సంబంధిత మార్పులు" అంశం. అయితే, మీరు చూసే పేజీ కూర్పు మీరు అభిరుచులలో నిశ్చయపరచిన సంఖ్య లోపే ఉండాలి. దాని శీర్షం ఇలా ఉంటుంది - "సంబంధిత మార్పులు" ఉపశీర్షం - "("xxx" తో లింకవుతున్న పేజీలకు)". ఈ పేజీకి అవి లింకయితే సరిపోదు, ఈ పేజీ కూడా వాటికి లింకయితేనే ఆ పేజీలు ఈ జాబితా లోకి వస్తాయి.


మీ అభిరుచుల్లో "చిన్న మార్పులు దాచు" అనే అంశం ఎంపిక అయి ఉంటే, మరియు ప్రస్తుతపు పేజీ కి లింకవుతున్న పేజీలో చివరికి జరిగిన మార్పు చిన్నది అయితే, అప్పుడు అదీ, దానికి ముందరి పెద్ద మార్పు కూడా కనపడవు. సభ్యుని అభిరుచులు సహాయం లో "చిన్న మార్పులు దాచు" కింద చూడండి.

దారి మార్పులకు సంబంధించి, దారిమార్పుకు సంబంధించిన మార్పులే కనిపిస్తాయి గాని, గమ్యం పేజీలోని మార్పులు ఈ జాబితాలోకి రావు. వీటికి సంబంధించి, దారిమార్పు పేజీలకు కాకుండా సరాసరి గమ్యం పేజీలకే లింకులు పెట్టుకుంటే సరిపోతుంది.

బొమ్మలు, ధ్వనులు, బొమ్మ వివరణ పేజీలలో జరిగిన మార్పులు ఈ "సంబంధిత మార్పులు" జాబితా లోకి రావు.

ఇంకా స్వయం లింకు చూడండి.