వికీపీడియా:సమావేశం/తెవికీ మారథాన్ 1/సమీక్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కార్యకలాపాలు[మార్చు]

వర్గీకరించని వ్యాసాల వర్గీకరణ[మార్చు]

  • మారథాన్ ప్రారంభం కాక ముందు వర్గీకరించని వ్యాసాలు: 907
  • మారథాన్ ముగిసిన తర్వాత వర్గీకరించని వ్యాసాల సంఖ్య: 883

24 వ్యాసాలు <<...>> సమిష్ఠి కృషి వలన. ఇలాగే చేస్తూ వారం వారం సమీక్షిద్దాం. వచ్చే సమావేశానికి బహశా ఇంకొక విషయంపై సమిష్ఠి కృషి చేయొచ్చు.

పాఠాలు[మార్చు]

ఈ మారథాన్ నుండి ఏం నేర్చుకున్నాం.

  • దాదాపు పది మంది ఉదయం 12 గంటలవరకు ముఖాముఖి మరియు అంతర్జాల వేదిక గా కలుసుకోవటం సంతోషం. ఈ సంఖ్యను ప్రతి నెల కనీస 5 చొప్పున పెంచగలిగితే మన తెవికీ త్వరగా మెరుగవుతుంది.
    • మనం దీని గురించి ప్రచారం మరొక్క వారం ముందు మొదలుపెట్టి ఉంటే ఇంకా ఎక్కువ మంది పాల్గొనేవారని అనుకోలు.
  • సమిష్ఠి కృషి లో మనం చాలా వెనకపడిపోయాం. ఈ రోజు వర్గీకరణ సమిష్ఠికృషి నాందిగా మనం కలసి పని చేయటం వృద్ధి చేద్దాం.
    • అవును. ఈ విషయంలో అందరికీ ఆసక్తి ఉండే అందరూ సులువుగా చేయగలిగే అంశాలను ఎంచుకోవడంతోబాటు, ఇలాంటి వాటి నిర్వహణలోనూ నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
    • జనాలు పెరిగేకొద్దీ, చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి ఒక్కో బృందం ఒక్కో అంశాన్ని ఎంచుకొని పనిచే స్థితి వస్తుందని ఆశిద్దాం.