వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/నవంబర్ 15, 2015 సమావేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

వివరాలు[మార్చు]

ఈనెల అతిథి[మార్చు]

చర్చించాల్సిన అంశాలు[మార్చు]

 • గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
 • తెలుగు వికీపీడియన్ల అవసరాలపై చర్చ, తెవికీ అభివృద్ధికి సూచనలు
 • అందుబాటులో ఉన్న వనరులు, వ్యక్తుల వివరాల వెల్లడి - వాటి వినియోగంపై చర్చ
 • ప్రస్తుతం జరుగుతున్న వికీ ప్రాజెక్ట్ పై సమీక్ష
 • వికీ శిక్షణా శిబిరాల నిర్వాహణ పై చర్చ
 • భవిష్యత్ ప్రణాళిక
 • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు

సమావేశం నిర్వాహకులు[మార్చు]

 1. పవన్ సంతోష్

సమావేశానికి ముందస్తు నమోదు[మార్చు]

 1. --కశ్యప్ (చర్చ) 18:41, 8 నవంబర్ 2015 (UTC)
 2. --Pranayraj1985 (చర్చ) 19:20, 8 నవంబర్ 2015 (UTC)
 3. --Rajasekhar1961 (చర్చ) 06:39, 9 నవంబర్ 2015 (UTC)
 4. --స్వరలాసిక (చర్చ) 10:40, 9 నవంబర్ 2015 (UTC)
 5. --Viswanadh (చర్చ) 13:29, 9 నవంబర్ 2015 (UTC)

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


బహుశా పాల్గొనేవారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


పాల్గొనటానికి కుదరనివారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


స్పందనలు


 1. <పై వరసలో స్పందించండి>

నివేదిక[మార్చు]

చర్చించిన అంశాలు[మార్చు]

 1. అక్టోబర్ నెల తెలుగు వికీపీడియా నెలవారి సమావేశం జరగలేదని... దానికి కారణం ఏంటని... ఎవరూ వచ్చినా రాకపోయినా ప్రతినెల తెవికీ నెలవారి సమావేశాలు జరపాలని భాస్కరనాయుడు, ప్రణయ్‌రాజ్ వంగరి చర్చ పేజీలో ఇలా రాశారు. ఈ అంశం సమావేశంలో మొట్టమొదటగా చర్చకు వచ్చింది. గత నెల దసరా పండుగ కారంణంగా తను అందుబాటులో లేకపోవడం వల్ల అక్టోబర్ నెల సమావేశం నిర్వహించలేకపోయామని... ప్రతినెల మూడో ఆదివారం నాడు గోల్డెన్ త్రెషోల్డ్ లో వికీపీడియా నెలవారి సమావేశం జరపడానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. కాని, ఏదో ఒక నెల మూడో ఆదివారం ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి నేను అందుబాటులో ఉండకపోయే ఎలా అని ప్రణయ్‌రాజ్ వంగరి అన్నారు. అలాంటి పరిస్థితి వస్తే వేరే వేదికలో నిర్వహించడమో లేక అదే నెలలో మరో ఆదివారం నాడు సమావేశం జరుపుకుందాం అని పలు సూచనలు వచ్చాయి. అయితే పాల్గొన్న సభ్యులు అదే నెలలో మరో ఆదివారం నిర్వహించుకునేందుకు మొగ్గుచూపారు.
 2. ఈవారం బొమ్మ, ఈవారం వ్యాసం గురించి చర్చ జరిగింది. పవన్ సంతోష్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ గత నెలల్లో మొదటి పేజీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వెంకటరమణ గారు రచ్చబండలో వాపోయారు. మీకు తెలుసాలో చెప్పేందుకు చమత్కారమైన అంశాలు కూడా దొరకట్లేదని బాధపడ్డారు. ఆ విషయాన్ని గుర్తుకుతెచ్చి ప్రస్తుత సంవత్సరాంతానికి నెల ముందే దాదాపుగా మీకు తెలుసా భాండాగారం నిండిపోయిందనీ, మంచి విచిత్రమూ, విశేషమూ అయిన విషయాలు దొరుకుతున్నాయని తెవికీ ప్రగతిని ప్రశంసించారు.
 3. మీకు తెలుసాలో కొత్త వ్యాసాల నుంచే రాయాలా అన్న ప్రశ్నకు జవాబిస్తూ కొత్త వ్యాసాల నుంచైనా, పాత వ్యాసాల్లో కొత్తగా చేర్చిన విషయాల నుంచైనా ఏదోక ఆసక్తికరమైన తాజా విశేషాన్ని మీకు తెలుసాలో చేర్చవచ్చని వివరించారు. ఎవరు రాయవచ్చు, ఎలాంటివి రాస్తున్నారు వగైరా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మీకు తెలుసాలో పంచుకునేలాంటి ఆసక్తికరమైన అంశాలు రాద్దామన్న అంశంపై కూడా కొంత చర్చ సాగింది. ఇక విశ్వనాథ్ ఈ వారం బొమ్మ భాండాగారంలో చేర్చదగ్గ ఫోటోలు ఉన్నా చేర్చడం లేదని గుర్తించారు. ఆ వైపుగా దృష్టిపెడతానని అన్నారు.
 4. సినిమా ప్రాజెక్టుకు అనుబంధంగా 2015 ప్రణాళిక ఏర్పాటైన విషయాన్ని పవన్ సంతోష్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. ఆ ప్రాజెక్టులో మూలాలను ముగ్గురు సభ్యులు (పవన్ సంతోష్, సుల్తాన్ ఖాదర్, రాజశేఖర్ లు) పంచుకుని అభివృద్ధి చేస్తున్న తీరు, వికీపీడియాలో సినిమా వ్యాసాల ప్రామాణిక నిర్మాణం, శీర్షికలు ఉపశీర్షికల కింద సమాచారాన్ని విడదీయడం వంటి అనేకాంశాలు విపులంగా చర్చించారు. గుళ్ళపల్లి, భాస్కరనాయుడు పలు అంశాలపై పలు రకాలుగా ప్రశ్నించి చర్చ రేకెత్తించారు. అందుకు ఫలితంగా సినిమా వ్యాసాల నిర్మాణాన్ని ఆంగ్ల వికీపీడియాలోని సినీ వ్యాసాలు, తెలుగు సినిమా విమర్శల ఆధారంగా రూపొందించిన తీరును పవన్ సంతోష్ వివరించారు. ఆపైన విశ్వనాథ్ అంతర్జాలంలో దొరికే మూలాలతోనే ఈ వ్యాసాలను ఎలా అభివృద్ధి చేయవచ్చో వివరించారు. ఈ వ్యాసాల గురించి మరింత విపులంగా భవిష్యత్తులో చెప్పాల్సిందిగా గుళ్ళపల్లి, భాస్కరనాయుడు కోరారు.
 5. OCR, find and replace వంటి సాంకేతికాంశాలను వికీపీడియన్లకు విశ్వనాథ్, కశ్యప్ చూపించారు. గూగుల్ డాక్యుమెంట్లలో ఓసీఆర్ ఆపేసినట్టు అనుమానాన్ని సభ్యులు వ్యక్తం చేయగా లేదంటూ కశ్యప్ చూపి మరీ తెలిపారు. తాను గత వారాల్లో కలిసిన ప్రముఖులు, వికీపీడియా అభివృద్ధికి చేసిన ప్రయత్నాలు వంటివాటిని పవన్ సంతోష్ సభ్యులకు వివరించారు.

ఫలితాలు[మార్చు]

పాల్గొన్నవారు[మార్చు]

ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
 1. భాస్కరనాయుడు
 2. గుళ్ళపల్లి నాగేశ్వరరావు
 3. విశ్వనాధ్.బి.కె.
 4. కశ్యప్
 5. పవన్ సంతోష్
 6. ప్రణయ్‌రాజ్ వంగరి
Skype ద్వారా హాజరయినవారు

చిత్రమాలిక[మార్చు]