వికీపీడియా:సమస్యల ప్రశ్నలు

వికీపీడియా నుండి
(వికీపీడియా:Problems FAQ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ వ్యాసము తరచూ అడిగే ప్రశ్నలు
యొక్క భాగము
ప్రశ్నల పేజీలు...
చూడండి...

సభ్యులు వికీపీడియా ను వాడేటపుడు లేదా దిద్దుబాట్లు చేసేటపుడు ఎదుర్కొనే వివిధ ఇబ్బందులకు ఇక్కడ పరిష్కరాలు లభిస్తాయి.

గమనిక: మీరేదైనా ఒక సాంకేతిక సమస్యకు సంబంధించి సహాయం కొరకు చూస్తుంటే, ఇక్కడ సమాధానం దొరక్క పోతే, వికీపీడియా:Troubleshooting లేదా రచ్చబండ వద్ద చూడండి.

సరిగా పని చెయ్యని విషయాన్ని ఎలా నివేదించాలి?[మార్చు]

సాప్ఫ్ట్‌వేర్‌ లో సమస్య అని మీరు అనుకుంటే, డెవెలపర్లకు ఆ నివేదిక పంపండి. సూచనల కొరకు వికీపీడియా:Bug reports చూడండి. సమస్య మీ బ్రౌజరు ది కూడా అయి ఉండవచ్చు; తరువాతి ప్రశ్న చూడండి.

నా బ్రౌజరూ, వికీపీడియా తగవులాడుకుంటున్నాయి![మార్చు]

వికీపీడియా:Browser notes కు రిపోర్ట్‌ చెయ్యండి. సమస్యను వివరిస్తూ, మీ బ్రౌజరు పేరు, వెర్షను, operating system వివరాలు కూడా పంపండి.

సమస్య వికీపీడీయా దో, నా బ్రౌజరుదో ఎలా తెలుస్తుంది?[మార్చు]

మీకు ఇంకో బ్రౌజరు ఉంటే, దానిలో కూడా ఆ సమస్య వస్తుందేమో చూడండి. లేదా, సమస్యని రచ్చబండ వద్ద పెట్టి, ఇంకెవరికైనా అటువంటి ఇబ్బంది ఉందేమో తెలుసుకోండి. ఏవరికీ ఆ సమస్య లేకపోతే, బహుశా అది మీ బ్రౌజరు సెటప్‌ లో ఉండవచ్చు.

బొమ్మలు - అన్నీ కాదు, కొన్నే - కనపడవు. ఎందుకలా?[మార్చు]

సాధారణంగా ఇది అడ్‌-బ్లాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ల వలన జరుగుతుంది; అప్‌లోడు చేసిన బొమ్మల్లో ప్రతి 256 కి ఒకటి http://upload.wikimedia.org/wikipedia/en/a/ad/ అనే సబ్‌ దైరెక్టరీ లోకి చేరుతాయి. కొన్ని అడ్‌-బ్లాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రాక్సీలు ఈ దైరెక్టరీ లోని బొమ్మల్ని చూపించవు. ప్రాక్సీని తగు విధంగా మారిస్తే, అవి కనపడతాయి.

అసలు వికీపీడియా సిధ్ధాంతం పైనే నాకో లక్ష అభ్యంతరాలు ఉన్నాయి. మరి దీన్ని సీరియస్‌ గా ఎలా తీసుకోమంటారు?[మార్చు]

అటువంటి అభ్యంతరాలకు, వాటి సమాధానాలకు సాధారణ అభ్యంతరాలకు సమాధానాలు చూడండి.

వికీపీడియా లోని పేజీలన్నిటినీ ఎవడైనా దుష్టుడు తొలగించ గలిగే అవకశం ఉందా?[మార్చు]

లేదు. పేజీలు తొలగించాలంటే నిర్వాహకుడు అయి ఉండాలి. వేరే ఏ సభ్యుడైనా పేజీ లోని వ్యాసాన్ని తుడిచివేడం మాత్రమే చెయ్యగలరు, కానీ మరి ఏ సభ్యుడైనా దానిని పునస్థాపితం చెయ్యగలరు. ఎవరైనా పని గట్టుకుని దాడి జరిపితే నిర్వాహకులు ఆ సభ్యుని నిషేధించగలరు. అంతేకాక, మొత్తం సర్వరునే స్థిర వ్యవధిలో బాకప్‌ చేస్తూ ఉంటాము. మరింత సమాచారం కొరకు ఈ చర్చ చూడండి.

వికీపీడియా లో వ్యాపార ప్రకటనలు చేసే అవకాశం ఉందా?[మార్చు]

దురదృష్టవశాత్తూ, అడపా దడపా వికీపీడియా లో చెత్త వేస్తూనే ఉన్నారు. అదృష్టవశాత్తు, ఎవరైనా మళ్ళీ దాన్ని చెత్త లేని పూర్వపు కూర్పుకు తీసుకు పోగలరు -- అదెంత తేలిక అంటే, నిమిషాల్లో చేసెయ్యవచ్చు. మీరు అటువంటి చెత్త చూస్తే వికీపీడియా:How to revert a page to an earlier version చూడండి.

కాపీ కొట్టినట్లుగా (ప్లేగియారిజం)గమనిస్తే ఏమి చెయ్యాలి?[మార్చు]

వాటి వివరాలు ఆ వ్యాసపు చర్చా పేజీ లో రాయండి. తరువాత కాపిహక్కు సమస్యలు లో రాయండి.