వికీపీడియా:వికీప్రాజెక్టు/సాహిత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా లో సాహిత్యానికి సంబంధించిన సమాచారం, మరీ ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి సంబంధించిన పనులకు మార్గదర్శక పేజీగా దీన్ని వాడదలిచాము. రచయితల వివరాలు, పుస్తకాల వివరాలు, సాహిత్యాంశాలు (విమర్శ ప్రమాణాలు తదితరాలు), యుగాల విభజన మొదలైన అన్ని విషయాలనూ సమగ్రం చేయడం ఈ ప్రాజెక్టు పరమ లక్ష్యం.

ప్రాజెక్టు లక్ష్యాలు[మార్చు]

సాహిత్యం ప్రాజెక్టు లక్ష్యాలు ప్రస్తుతానికి ఇవి:

  • తెలుగు సాహిత్యానికి సంబంధించి ఉన్న పేజీలను అభివృద్ధి చేయడం, ఇప్పటి దాకా లేని పేజీలను సృష్టించడం.
  • తెలుగు రచయితలు, సంపాదకులు, విమర్శకులు, కవుల పేజీలు సృష్టించడం, ఉన్న పేజీలను అభివృద్ధి చేయడం.
  • సాహిత్యంలో జ్ఞానపీఠ్, సాహిత్య అకాడెమీ(కేంద్ర, ఆం.ప్ర.), బుకర్, నోబెల్, వగైరా ప్రముఖ పురస్కారాలను గురించి ప్రామాణికంగా వ్యాసాలు ప్రామాణికంగా ఉండడం.
  • రచయితలకు అవార్డులు, సాహిత్య ప్రముఖుల మరణాలు వంటివి వీలున్నంత త్వరగా వ్యాసాలలో పొందుపరచడం.

ప్రాజెక్టు సభ్యులు[మార్చు]

సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న సభ్యులందరూ ఈ ప్రాజెక్టులో చేరి తమ కృషిని క్రమబద్ధీకరించి మరిన్ని సత్ఫలితాలు సాధించే ప్రయత్నం చేయండి. ఈ ప్రాజెక్టులో చేరాలంటే ఉదాహరణకు {{సభ్యుడు|శ్రీశ్రీ|పేరు}} అని చేరిస్తే మీరు ప్రాజెక్టులో చేరినట్టే. ఆపై లక్ష్యాలను గమనించి నేను సైతం సాహిత్య ప్రాజెక్టుకు సమాచారం అందజేస్తాను అన్నట్టుగా కృషి ప్రారంభించెయ్యండి.(షరా:మీరు సాహిత్యం సంబంధించిన వ్యాసాలను అభివృద్ధి చేసేందుకు, కొత్త పేజీలు చేర్చేందుకు ఈ ప్రాజెక్టులో సభ్యత్వం స్వీకరించాల్సిన పనేమీ లేదని గుర్తుపెట్టుకోండి)

సాహిత్యం ప్రాజెక్టు గమనిక === సాహిత్యానికి సంబందించిన అన్ని వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు సాహిత్యం}} అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాక సాహిత్య సంబంధిత వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు.

వికీప్రాజెక్టు సాహిత్యం ఈ వ్యాసం వికీప్రాజెక్టు సాహిత్యంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో సాహిత్యానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
హెచ్చరిక: ప్రస్తుతం ఈ మూసను ఒక చర్చాపేజీ కాని పేజీలో ఉంచారు. ఈ మూసను చర్చా పేజీలలో మాత్రమే ఉంచాలి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


సోపానాలు[మార్చు]

లక్ష్యాన్ని చిన్న చిన్న సోపానాలుగా విభజించుకుని ముందుకు సాగడం ద్వారా సాహిత్యానికి మన వంతు కృషి చేయవచ్చు. ప్రస్తుతం ఈ కింది సోపానాలను గమనించుకుని వీటిలో ఏదో ఒకటి గానీ, కొన్ని గానీ, అన్నీ గానీ ఎంచుకుని ముందుకు సాగండి.

ప్రఖ్యాత సాహిత్య పురస్కారాల సమాచారం[మార్చు]

భారతదేశంలోనూ, ప్రపంచంలోనూ ప్రఖ్యాతి చెందిన పురస్కారాల వివరాలు సమగ్రం చేయడం. ఈ కృషిలో భాగంగా సభ్యులు ప్రస్తుతం సమగ్రం చేస్తున్న వ్యాసాలు, వాటికి సంబంధించి చేయాల్సిన కృషి క్రింద చూడండి,:

  1. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు: కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార వ్యాసంలోనే ఆ పురస్కారాల్లోని వివిధ విభాగాలైన యువ పురస్కారం, అనువాద పురస్కారం వంటి అంశాలను కలగాపులగం చేసేశారు. కనుక దాన్ని ముందుగా సవివరంగా వర్గీకరించాలి.
  2. జ్ఞానపీఠ్ అవార్డు: శీర్షికల విభజన, సమాచార వర్గీకరణలు సరిగా లేవు పరిశీలించి చర్చించి సమగ్రం చేయాలి. రచయితల ఫోటోలు కామంన్స్ లో అందుబాటులో వుంటే వెతికి రాయాలి.

కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీతలైన తెలుగు సాహిత్యవేత్తల వ్యాసాలు[మార్చు]

ప్రతిష్టాత్మక సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీతలైన తెలుగు సాహిత్యవేత్తల గురించిన వ్యాసాలను సృష్టించడం, ఉంటే విస్తరించడం చేయాలి. సాహిత్య అకాడెమీ పురస్కారంలో యువ, బాల సాహిత్య, అనువాద విభాగాలు ఉంటాయి. ప్రస్తుత సోపానంలో ప్రధాన పురస్కారం పొందిన వారి వ్యాసాలు విస్తరిస్తే మిగిలినవి తర్వాతి కాలంలో చేయవచ్చు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన తెలుగు సాహిత్యవేత్తల జాబితా ఇది:
సురవరం ప్రతాపరెడ్డి, పొనంగి సీతారామ అప్పారావు, బాలాంత్రపు రజనీకాంత రావు, విశ్వనాథ సత్యనారాయణ, త్రిపురనేని గోపీచంద్, గుర్రం జాషువా, రాయప్రోలు సుబ్బారావు, తుమ్మల సీతారామమూర్తి, దేవరకొండ బాలగంగాధర తిలక్, తాపీ ధర్మారావు నాయుడు, శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య, బోయి భీమన్న, కుందుర్తి ఆంజనేయులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, పి.నారాయణాచార్య, నార్ల వెంకటేశ్వరరావు, ఇల్లింద సరస్వతీ దేవి, రావూరి భరద్వాజ, ఆలూరి బైరాగి, పాలగుమ్మి పద్మరాజు, జి.వి.సుబ్రహ్మణ్యం, ఆరుద్ర, రాచమల్లు రామచంద్రారెడ్డి, ఎస్.వి.జోగారావు, కె.శివారెడ్డి, భమిడిపాటి రామగోపాలం, మాలతీ చందూర్, మధురాంతకం రాజారాం, గుంటూరు శేషేంద్ర శర్మ, కాళీపట్నం రామారావు, కేతు విశ్వనాథరెడ్డి, అజంతా, బలివాడ కాంతారావు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య,ఎన్. గోపి, తిరుమల రామచంద్ర, చేకూరి రామారావు, ఉత్పల సత్యనారాయణాచార్య, అంపశయ్య నవీన్, అబ్బూరి ఛాయాదేవి, మునిపల్లె రాజు, గడియారం రామకృష్ణ శర్మ, చిట్టిప్రోలు కృష్ణమూర్తి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సలీం, ఎం.భూపాల్ రెడ్డి, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కాత్యాయని విద్మహే
కొన్ని వ్యాసాలు బాగున్నాయి. కానీ చాలావరకూ వ్యాసాల్లో అరకొర సమాచారం కనిపిస్తోంది. వాటిని విస్తరించాలి. కొందరు రచయితల గురించి వ్యాసాలు అసలే లేవు. వాటిని ప్రారంభించి విస్తరించాలి. వీటన్నిటినీ విశేష స్థాయి వ్యాసాలుగా చేయడం పరమ లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ప్రతి ఏటా పురస్కార గ్రహీతలు కొత్తగా చేరే అవకాశం ఉంది కనుక చేరగానే వివిధ మాధ్యమాల్లో వచ్చే వార్తల ఆధారంగా ఆ సాహిత్యవేత్తల వ్యాసాలు విస్తరించాలనేది భవిష్యత్ మార్గనిర్దేశం.

జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతల వ్యాసాలు[మార్చు]

జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతలైన అన్ని భాషల సాహిత్యవేత్తలను గురించి తెవికీలో చక్కని వ్యాసాలు వ్రాయాలి. ఉన్న వ్యాసాలను మరింతగా విస్తరించాలి. జ్ఞానపీఠ్ పురస్కారాలు పొందిన సాహిత్యవేత్తల జాబితా ఇందులో పొందుపరుస్తున్నాను.

తెలుగు[మార్చు]

విశ్వనాథ సత్యనారాయణ, సి.నారాయణరెడ్డి, రావూరి భరద్వాజ

కన్నడ[మార్చు]

కువెంపు, దత్తాత్రేయ రామచంద్ర బెంద్రె, శివరామ కారంత్, మాస్తి వెంకటేశ అయ్యంగార్, గిరీష్ కర్నాడ్, వి.కె.గోకాక్, యు.ఆర్.అనంతమూర్తి, చంద్రశేఖర కంబార

మలయాళం[మార్చు]

జి. శంకర కురుప్, ఎస్.కె.పొట్టెక్కాట్, తకళి శివశంకర పిళ్ళై, ఎం.టి.వాసుదేవన్ నాయర్, ఒ.ఎన్.వి.కురుప్

తమిళం[మార్చు]

పి.వి.అఖిలన్, డి.జయకాంతన్

బెంగాలీ[మార్చు]

తారాశంకర్ బంధోపాద్యాయ, బిష్ణు డే, ఆశాపూర్ణ దేవి, సుభాశ్ ముఖోపాధ్యాయ్, మహాశ్వేతా దేవి

గుజరాతీ[మార్చు]

ఉమాశంకర్ జోషి, పన్నాలాల్ పటేల్, రాజేంద్ర షా

హిందీ[మార్చు]

సుమిత్రానందన్ పంత్, రాంధారీ సింగ్ దినకర్, సచ్చిదానంద వాత్సాయన్, మహాదేవీ వర్మ, నరేష్ మెహతా, నిర్మల్ వర్మ, కున్వర్ నారాయణ్, అమర్ కాంత్, శ్రీలాల్ శుక్లా

ఉర్దూ[మార్చు]

ఫిరాఖ్ గోరఖ్‌పురి, ఖుర్రతుల్ ఐన్ హైదర్, షహర్యార్

ఒరియా[మార్చు]

గోపీనాథ్ మొహంతీ, సచ్చిదానంద రౌత్రాయ్, సీతాకాంత్ మహాపాత్రో, ప్రతిభా రాయ్

మరాఠీ[మార్చు]

విష్ణు సఖారాం ఖాండెకర్, విష్ణు వామన్ శిర్వాద్కర్

అస్సామీ[మార్చు]

బీరేంద్ర కుమార్ భట్టాచార్య, ఇందిరా గోస్వామి

పంజాబీ[మార్చు]

అమృతా ప్రీతం, గురుదయాల్ సింగ్

ఇతర భాషలు[మార్చు]

రెహమాన్ రాహి(కశ్మీరీ), రవీంద్ర కేళేకర్(కొంకణి), సత్యవ్రత శాస్త్రి(సంస్కృతం)

ఉపప్రాజెక్టులు[మార్చు]

ఉపకరణాలు[మార్చు]

వికీపీడియా సాహిత్యం ప్రాజెక్టులో భాగంగా సృష్టించే పుస్తకాలు, అవార్డులు, రచయితలు, ప్రక్రియలు, యుగాల వ్యాసాలకు కింది సమాచారపెట్టెలు ఉపయోగపడతాయి:

బయటి లింకులు[మార్చు]