వికీపీడియా చర్చ:తెలుగు ప్రముఖుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాబితా అవసరమా?[మార్చు]

వికీపీడియా జీవితచరిత్రల జాబితా అవసరమా? ఇప్పటికే వర్గాల వారీగా ఆయా వర్గాలలో ఈ సమాచారం అందుబాటులో ఉంది. ఒకవేళ ఇలా జాబితాగా చేయాలనుకున్ననూ బాటుద్వారా సునాయాసంగా చేయవచ్చు. అంతేకాక వ్యక్తులు వేరు జీవితచరిత్ర వేరు. జీవితచరిత్రల జాబితా అంటే వ్యక్తులకు సంబంధించిన జీవితచరిత్ర గ్రంథాల జాబితా అనే అర్థం వస్తుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:08, 15 ఏప్రిల్ 2013 (UTC)

ఇదివరకే ఉన్న జీవితచరిత్ర (?) వ్యాసాలకు సంబంధించి ప్రాజెక్టు పేజీని ప్రారంభించే అవసరం ఎందుకో తెలుసుకోదలిచాను. ప్రాజెక్టు పేజీలో ఆ ప్రాజెక్టు పనికి సంబంధించి చేయాల్సిన పద్దతులు పేర్కొంటే చాలు. ఉదా:కు చూడండి. వికీపీడియా:వ్యక్తుల పేర్లు సి. చంద్ర కాంత రావు- చర్చ 19:58, 15 ఏప్రిల్ 2013 (UTC)
చంద్రకాంత్ రావుగారూ ! ప్రముఖుల వ్యాసాలను ప్రణాళికగా అభివృద్ధి చేయాలని ఈ పేజీ సృష్టించబడింది. ఈ ఇప్పటికి ఉన్నవి కాక వ్రాయవలసిన కొత్తవ్యాసాల పేర్లను చేర్చాలి. వాటి నుండి ఆసక్తికరమైనవి ఎంచుకుని సభ్యులు వ్యాసాలు ప్రారంభిస్తారు.t.sujatha (చర్చ) 03:16, 16 ఏప్రిల్ 2013 (UTC)
ప్రాజెక్టుకు అనుబంధంగా ఉపయోగపడుతుందని ప్రారంభించాను. వివిధ రంగాలలో ప్రసిద్ధిచెందిన వ్యక్తుల జాబితాలు చాలా ఉన్నాయి. అన్నింటినీ కలిపడమే ఈ జాబితా ముఖ్య ఉద్దేశ్యము.Rajasekhar1961 (చర్చ) 11:38, 16 ఏప్రిల్ 2013 (UTC)
  • ఇంకా రాయవలసిన వాటిని గుర్తించడానికి జాబితాలు వుపయోగపడతాయి. ఇంగ్లీషు వికీలో ప్రధానపేరుబరిలోనే జాబితాలను వర్గాలకంటె భిన్నంగా వుండే మార్గదర్శకంగా వాడుతున్నారు. --అర్జున (చర్చ) 03:47, 19 ఏప్రిల్ 2013 (UTC)