వికీపీడియా చర్చ:పేజీల గణాంకాలు/ఇతర భారతీయ భాషల్లో ఉండి తెలుగులో లేని పేజీలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సృష్టించేముందు పరిశీలించాలి[మార్చు]

ఈ జాబితాలోని కొన్ని ఆంగ్ల వ్యాసాలకు తెవికీలో వేరే వికీ డేటా ఐటం ఐడి తో పేజీలు ముందే ఉన్నవి.సృష్టించే ముందు తెవికీ శీర్షికతో పలురకాలుగా ఫరిశీలించి సృష్టించాలి.అలాంటి పేజీలు గమనించినప్పుడు వాటిని ఆంగ్ల వ్యాసం పేజీ వికీడేటా ఐటం ఐడితో మెర్జి చేసి, ప్రాజెక్టు పేజీలో తెవికీ వ్యాసం పేజీ నమోదు చేయగలరు.ఉదా:అగ్నిపర్వతం, ప్రేమికుల దినోత్సవం, పెట్రోలియం.--యర్రా రామారావు (చర్చ) 15:37, 5 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

రామారావు గారూ, నేను అదే పని చేస్తూ ఉన్నాను. ముందుగా ఆంగ్ల వికీ/వికీ డేటాతో జతపరచని వ్యాసం ఉందా లేదా చూసి, లేకపోతేనే కొత్త వ్యాసం సృష్టిస్తున్నాను. ఈ జాబితాలో నా సవరణలు చూస్తే కొత్త పేజీలు సృష్టించకుండానే లింకులిచ్చినవి కొన్ని, వ్యాసాలు సృష్టించి ఆ తర్వాత లింకులిచ్చినవి కొన్నీ ఉన్నాయి. కొత్తగా సృష్టించినవి కూడా కొన్ని మనం దోషభూయిష్టమైన అనువాద వ్యాసాల తొలగింపులో పోయినవి. ఉదాహరణకు రఘురాం రాజన్. ఈ వ్యాసాన్ని ఇంతకు మునుపు సరిగ్గా రాయలేదని 19 సార్లు తొలగించి ఉన్నాము. నేను మళ్ళీ తిరగరాశాను. రవిచంద్ర (చర్చ) 17:31, 5 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ గమనించాను.మీ స్పందనకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 05:16, 8 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పురోగతి[మార్చు]

మొత్తం 705 వ్యాసాలలో ఇప్పటి దాకా అన్నీ కలిపి 36 వ్యాసాలు తెవికీలో కూడా ఉన్నాయి. ఇంకా 669 వ్యాసాలు సృష్టించాలి మనం. - రవిచంద్ర (చర్చ) 14:08, 4 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]