వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇదేంటిది?[మార్చు]

 • చర్చలో ప్రతిపాదన చేసినదేంటి? "ప్రస్తుత యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతాన్ని తొలగించాలి." అని. దాన్ని మాత్రమే చర్చకు పెట్టారు.
 • ఇక్కడ వోటింగుకు పెట్టిందేంటి? దాంతో పాటు, "కొత్త సభ్యులు నమోదై నెల రోజులు గడిచేవరకు మరియు 500 మార్పులు చేసేవరకు ప్రధానపేరుబరిలో ఉపకరణ అనువాద వ్యాసాలు ముద్రించకుండా దుశ్చర్యల వడపోత అమలు." అని కూడా చేర్చారు. దాన్ని చర్చకు పెట్టలేదు.

ఇదేం పద్ధతి అసలు? రెండు వేరువేరు అంశాలను వోటింగుకు పెట్టి ఒకే వోటు ఎలా వేస్తారు? చర్చలో దేన్ని ప్రతిపాదించారో దాన్ని మాత్రమే వోటింగుకు పెట్టాలి. చర్చకు పెట్టిన అంశాన్ని మారుస్తారా? చర్చలో మధ్యలో అంశాన్ని చేరిస్తే దానిపై మళ్ళీ చర్చకు పెట్టాలి కదా. అక్కడి చర్చ పేజీని అర్థం కాకుండా గందరగోళం చెయ్యడం, ఇక్కడేమో వోటింగులో రెండు వేరువేరు అంశాలను కలిపేసి అసలు ప్రతిపాదనను పలచన చెయ్యడం అంతా ఏదో గందరగోళంగా ఉంది. ఏమాత్రం పారదర్శకంగా లేదు. ఈ వోటింగు వ్యవహారాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. పై రెండు అంశాల్లో రెండోదాన్ని వోటింగుకు తీసుకోకూడదు. మొదటి దాన్ని మాత్రమే వోటింగుకు తీసుకోవాలి. __చదువరి (చర్చరచనలు) 01:54, 6 సెప్టెంబరు 2020 (UTC) Reply[ప్రత్యుత్తరం]

చదువరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రస్తుతం వాడుతున్న పద్ధతి మీరు చురుకుగా లేని కాలంలో సముదాయంతో చర్చల ఫలితంగా తయారైనది. దీనిని ఒక్క విధానం రూపొందించడానికే గతంలో వాడినప్పుడు కూడా మీరు చురుకుగా లేనందున పాల్గొనవీలుకాలేదు. ఆ తరువాత పద్ధతి గురించి చర్చలో పాల్గొన్నందున కొంతవరకు మీకు అవగాహన వచ్చినా, మీకు కొంత కొత్తగా అనిపించివుండవచ్చు. వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి#వోటింగు ప్రక్రియ పద్ధతి లో తొలి అంశం "చిత్తు ప్రతిపాదనపై చర్చలు జరిపి, వీలైనంత ఎక్కువ మందికి సమ్మతమైన రూపంలో మాత్రమే ప్రతిపాదనను వోటు ప్రక్రియలో పెట్టాలి. దీనికి కనీస కాలపరిమితి వారం రోజులు." అని వుంది. దాని ప్రకారమే చిత్తు ప్రతిపాదనలు, వాటికి సవరణలు గురించిన చర్చలు జరిగాయి. ప్రస్తుత ప్రతిపాదనలో రెండవ అంశం గురించిన చర్చ విభాగం 2020 ఆగస్టు 30 నాడు ప్రారంభమైంది. అయితే దానికి గాని, లేక అంతకుముందు పరస్పర విరుద్ధమైన అమలుచేయలేని అభిప్రాయాలు తెలిపిన సభ్యులను, వారి అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేసేవిధంగా, వున్న ప్రతిపాదనలు సవరించడానికి లేక కొత్త ప్రతిపాదనలు చేయమని కోరినా చాలామంది స్పందించలేదు. నిర్వహణ భారం గురించి సభ్యుల ఆందోళన చర్చలలో వ్యక్తమైంది, దీనిని తగ్గించడానికి సవరణ ఉపయోగపడుతుంది కావున దీనిని ప్రతిపాదనలో 2020 సెప్టెంబరు 1 నాడు చేర్చడమైనది. అసలు ఈ అంశం 2020 ఆగస్టు 22 నాడే తొలగింపులు తగ్గింపుకు చర్యలలో సూచించబడింది. ఆ విధంగా తొలి ప్రతిపాదన మెరుగుచేయడమైనది. కావున ఓటు ప్రక్రియలో ప్రవేశపెట్టబడినది.
"చర్చపేజీని గందరగోళం చెయ్యడం" అని వికీలో ఎంతో అనుభవమున్న మీరు ఎందుకంటున్నారో అర్ధం కావడంలేదు. సమస్య గురించి రచ్చబండలో తొలి చర్చ ప్రారంభించినపుడు మీ స్పందనలో "ఇప్పుడు మీరు ఆ నిబంధనలను ఎందుకు సడలించదలచుకున్నారో నాకు అర్థం కాలేదు. వివరంగా, వీలైతే ఒక్కొక్కటే బులెట్ పాయింట్లతో రాయగలరు. ఒకవేళ సడలిస్తే ఆ నిబంధనలను విధించడానికి దారితీసిన పరిస్థితులు తిరిగి తెలెత్తకుండా ఎలా నివారిస్తారో, తలెత్తితే ఎల ఎదుర్కొంటారో కూడా రాయండి" అని కోరారు. మీ కోరిక ప్రకారమే చర్చ అర్ధవంతంగా సాగటానికి విభాగాలుగా ప్రారంభించాను. సభ్యులు తమ వ్యాఖ్యలను ఆయా విభాగాలలో లేక కొత్త విభాగాలలో రాయమని కోరాను. కొంతమంది సభ్యులు పాటించగా మరికొంతమంది పాటించలేదు. వారిని మార్చమని కోరినా స్పందనలేదు. కావున స్పందనలను తగిన విభాగాలకు మార్చాను. ఇక సభ్యులు తొలిగా ప్రస్తుత విధాన సమీక్షలో తమ వ్యక్తిగత అభిప్రాయాలను ప్రస్తుత విధానానికి అనుకూలంగానో ప్రతికూలంగానో తటస్థంగానో రాస్తారనుకుంటే అవి సభ్యులు పాటించలేదు, కొంతమంది సభ్యులు అమలు చేయవీలుకాని పరస్పర విరుద్ధ అభిప్రాయాలు చర్చలలో వ్యక్తంచేశారు. అందువలన ఆ విభాగాల శీర్షికలను చర్చను అర్ధంచేసుకోవటానికి సహకరించుటలేదని తొలగించాను. సభ్యుల స్పందనలలో భాషా సవరణలు, సరియైన విభాగాలలో చేర్చటం తప్ప వారి వ్యాఖ్యలను పెడర్ధాలు వచ్చేటట్లుగా ఏమాత్రం చేయలేదు. చర్చలోని విషయసూచిక ద్వారా సభ్యులు తమ వ్యాఖ్యలున్న భాగాలకు చేరుకోవటానికి, అలాగే ఇతర సభ్యులు చర్చను అర్ధం చేసుకోవటానికి ఏమాత్రం ఇబ్బందిలేదు.
కావున మీరు, ఇతర సభ్యులందరూ ఓటు ప్రక్రియలో పాల్గొని అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలపవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 23:42, 7 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
"చిత్తు ప్రతిపాదనపై చర్చలు జరిపి" చర్చల దశలోనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఏకాభిప్రాయం వచ్చింది. అత్యధికులైన సభ్యులు ఆ చిత్తు ప్రతిపాదన ప్రాతిపదికతో సహా తిరస్కరించినప్పుడు మీరు ఆ ప్రాతిపదికకే విరుద్ధంగా (ఎలా విరుద్ధమో కింద వివరంగా రాశాను) రెండవ అంశం తెచ్చి పెట్టేశారు. దాదాపు 8 వేల పదాలు (ఖచ్చితంగా చెప్పాలంటే 7,934 పదాలు) ఉన్న చర్చా పేజీ, అది చదవాలంటేనే సాధారణమైన వేగం కలిగినవారికి అరగంట పడుతుంది. అందులో చర్చ దాదాపు ఏకాభిప్రాయానికి వస్తున్నప్పుడు హఠాత్తుగా రెండు లైన్ల మేరకు మార్పులు చేశారు మీరు. పాల్గొన్న సభ్యులెవరినైనా అడిగి చూడండి నాతో సహా, చాలామందికి అసలు మీరు ఆ వాక్యమే చేర్చారని తెలియదు. అలాంటి ఓ ప్రతిపాదన తెచ్చి, అంతకుముందే వీగిపోయిన మరో ప్రతిపాదన పట్టుకుని ఓటింగ్‌కి ఎలా వచ్చేస్తారు? చిత్తు ప్రతిపాదనల్లో ఒక ప్రతిపాదనపై చర్చలే జరగలేదని మీరే చెప్తున్నారు, రెండవ దానిని సభ్యులు తిరస్కరించారు. ఇప్పుడు ఈ ఓటింగ్‌ ఎందుకు? మీకు అంతగా ఆ చిత్తు ప్రతిపాదన చర్చించదగినది అనిపిస్తే అప్పటికే వేలాది పదాల పొడవు స్పందనలు చెప్పిన మమ్మల్ని ఎందుకు టాగ్ చేసి పిలవలేదు? అన్నిటికన్నా ముఖ్యంగా "ఎవరైనా పాల్గొనగలిగే వీలున్న నియమాన్ని" గౌరవించడం కోసమే ఈ ప్రతిపాదనలు చేసినట్టు చెప్పిన మీరు అందుకు భంగకరంగా ఉన్న రెండవ ప్రతిపాదన ఎవరి ప్రోద్బలమూ లేకుండా ఎందుకు చేశారు? అర్జున గారూ, ఇప్పటికైనా జరిగిన ప్రక్రియలో తప్పొప్పులు పరిశీలించుకుని తిరగదోడి, నిర్ణయాన్ని వేరే సభ్యులకు అప్పగించి గౌరవప్రదంగా ముగించే అవకాశం మనకు ఉంది. --పవన్ సంతోష్ (చర్చ) 01:48, 8 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు, వేరే విభాగంలో మీ వివరమైన వ్యాఖ్యకు నా స్పందన చూడండి. మీ వాదన అవగాహన లోపం వలనే అని నా కనిపిస్తున్నది. చర్చలలో మూడు ప్రతిపాదనలు వచ్చాయి. అప్పుడు ప్రతిపాదన 1 నే అందరూ వ్యతిరేకించినట్లు ఎలా అవుతుంది. ప్రతిపాదనలో రెండవ అంశం అని ఒకసారి అంటారు, రెండవ ప్రతిపాదన అని ఇంకొకసారి అంటారు. రెండవ అంశం ప్రతిపాదనకు సవరణ మాత్రమే, వేరే ప్రతిపాదన కాదు. చర్చలో నాణ్యతలేని వ్యాసాల వలన నిర్వహణభారం ఎక్కువవుతుందనే అభిప్రాయం, మీరు ఇతరులు వ్యక్తం చేశారు. కాని ఆ అభిప్రాయాలు సమర్ధవంతంగా నిర్వహించని గూగుల్ ప్రాజెక్టు లేక పోటీ ప్రాజెక్టులవలన ఏర్పడిందన్న విషయం తెలిపాను. పరస్పర విరుద్ధ అభిప్రాయాలు తెలిపిన వారిని సవరణ గురించి, వారి అభిప్రాయం స్పష్టంచేయమని స్పందన కోరినా, కొంతమంది స్పందించలేదు. కావున ఆ నిర్వహణభారం తగ్గించటానికి సవరణగా తొలిప్రతిపాదనలో తొలగింపులు తగ్గించడానికి చర్యలు అన్న విభాగంలో వున్నదానినే కొత్త వాడుకరులు ప్రధానపేరుబరిలో ముద్రించడాన్ని నిరోధించే వడపోత అమలుగా చేర్చాను. అనగా కొత్త వాడుకరులు అనువాద ఉపకరణం వాడవచ్చు, వారి వాడుకరిపేరుబరిలో ముద్రించుకోవచ్చు. కొత్త చర్చ ప్రారంభించినపుడు వ్యక్తులను టేగ్ చేయటం నాకు అలవాటే. చర్చలలో స్పందించినపుడు టేగ్ చేసినా కొంతమంది స్పందించనప్పుడు,ఈ సవరణ గురించి నా స్పందనలలో ప్రస్తావించినపుడు, మరల టేగ్ చేయవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 23:48, 14 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ప్రతిపాదనలో నైతికత అంటూ ఉంటే వోటేస్తాను. అనుకూలంగానో వ్యతిరేకంగానో వోటేస్తాను. కానీ అందులో అసలు నైతికతే లేదు, ఇది వికీ వ్యతిరేకం అని భావిస్తున్నపుడు అసలు వోటెలా వేస్తాను? కింద #మీ వాదన స్వీయవిరుద్ధం, మీ ప్రతిపాదన వికీవిరుద్ధం, మీ వోటింగు ధర్మవిరుద్ధం విభాగంలో నా అభిప్రాయం వివరంగా రాసాను, పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 07:27, 8 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ప్రాతిపదిక లేని ఈ ఓటింగుపై చర్య అవసరం[మార్చు]

చదువరి గారు చెప్పినట్టు ఓటింగ్ పెట్టడం అన్నది సరిగా లేదు.

 • ప్రతిపాదనకు ఒక ప్రాతిపదిక ఉంటుంది. అర్జున రావు గారు ప్రస్తుతం అనువాద ఉపకరణంలో చేసిన అనువాదాలకు కనీసం 30 శాతం మార్చిన పాఠ్యం ఉండాలి అన్న పరిమితిని తొలగించాలని లేదంటే సడలించాలని ప్రతిపాదన చేసినప్పుడు ఆయన ప్రధానంగా చెప్పిన ప్రాతిపదిక కొత్త సభ్యులు చేరడానికి ఇదొక అడ్డంకి అవుతోందని, అలాంటి అడ్డు లేకుండా ఉంటే కొత్తవారు తెవికీలో రావడానికి వీలు పెరుగుతుందని సముదాయమే వారికి నేర్పిస్తూ పోవచ్చనీ, వగైరాలన్నీ ఆ వాదనలో ఇమిడి ఉన్నాయి. "నా వంటి అనుభవజ్ఞుడికే ఈ అనువాద ఉపకరణంలో ఆ పరిమితులు వాడి ప్రచురించడం కుదరకపోతే" అన్నప్పుడు కూడా ఫోకస్ కొత్తవారిపైనే. అలాంటప్పుడు హఠాత్తుగా - కొత్త సభ్యులు నమోదై నెల రోజులు గడిచి, 500 మార్పులు చేసేదాకా అనువాద ఉపకరణంపై చేసిన పనులు ప్రచురించే వీలు లేకుండా చేద్దామన్న ప్రతిపాదనకు పై ప్రాతిపదికకు పొంతన ఏదీ? 70 శాతం అలానే ఉంచినా 30 శాతం మార్పులు చేసి కొత్తవారు ప్రచురించగల వీలు ఇప్పుడు ఉంది. వాళ్ళు 500 మార్పులు చేసేంతవరకూ అనువాద ఉపకరణం ప్రచురించనివ్వదు అన్న ఈ ప్రతిపాదనే కొత్తవారిని చేరనివ్వడానికి వీలు కల్పించనివ్వదు.
 • చర్చలో దాదాపుగా ఏకాభిప్రాయం వచ్చింది. ఒక్క అర్జున రావు గారు, దేవుడు గారు తప్ప వచ్చినవారందరూ దాదాపుగా కనీసం 30 శాతం మార్చిన పాఠ్యం ఉండాలన్న పరిమితిని తొలగించాలని/సడలించాలని తెచ్చిన ప్రతిపాదనను ఏదోక రూపేణా వ్యతిరేకించినవారే. 70% యాంత్రిక అనువాద విధాన సమీక్షలో సభ్యులు, కొత్త సభ్యుల యాంత్రిక అనువాదాలపై నియంత్రణ వుండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అని ఆ చర్చ ముగింపులో అర్జునరావుగారే పేర్కొన్నారు. అంటే అదే అందరి అభిప్రాయం. వెనువెంటనే ఎక్కడినుంచో కావున, ఆంగ్ల వికీపీడియాలో అమలు చేసినట్లు దుశ్చర్యల వడపోత ద్వారా కొత్త సభ్యులు నెల రోజులు, 500 మార్పులు చేసేవరకు ప్రధానపేరుబరిలో ఉపకరణ అనువాద వ్యాసాలు ముద్రించడాన్ని నిరోధించే పద్ధతి అమలు చేయాలి అని మరో కొత్త ప్రతిపాదన తెచ్చి ఈ ఓటింగ్ సముదాయంపై రుద్దుతున్నారు.

ఇంత విస్తృతంగా చర్చ జరిగి దాదాపు ఏకాభిప్రాయం వచ్చిన విధానాన్ని ఇప్పుడు మళ్ళీ ఓటింగ్‌ పెట్టి ఏం చేద్దామనుకుంటున్నారో నాకు తెలియాలి? ఐనా ప్రతిపాదకుడు చర్చను ముగించేప్పుడు ఎవరైనా అనుభవజ్ఞులైన నిర్వాహకులు వచ్చి సమీక్షించి ముగిస్తారేమోనన్న సంప్రదాయం కూడా పాటించకుండా, జరిగిన చర్చలో లేని తన ఆలోచనల్లో ఉన్న విషయాన్ని తెచ్చి ఎడాపెడా మళ్ళీ ఇలా ఓటింగ్‌కు పెట్టడాన్ని తిరస్కరిస్తున్నాను. పదిమంది వరకూ వివిధ అనుభవ స్థాయిలు ఉన్న వికీపీడియన్లు చర్చించిన ఆ చర్చను తుంగలో తొక్కారు. "తెలుగు వికీపీడియాలో విధానాలు మార్గదర్శకాలను నిర్ణయించడానికి ఏకాభిప్రాయం ప్రాతిపదిక ముఖ్యమైనది. ఏకాభిప్రాయం అంటే పూర్తి సమ్మతి కాదు. విధానాల నిర్ణయంలో ఏకాభిప్రాయానికి ప్రయత్నించటం, భిన్నాభిప్రాయాలు వున్నప్పుడు వోటు ప్రక్రియద్వారా వ్యతిరేకత ను అంచనావేసి అది తక్కువగా ఉన్నప్పుడు ప్రతిపాదన విజయవంతమైందని భావించి నిర్ణయం తీసుకోవటానికి ఈ విధానం కీలకం." అని ఆ వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి అన్న పేజీలోనే ఉంది. ఆ ప్రకారం ఆ చర్చను ముగించే అవకాశం ఉన్నా ఎందుకు ముగించకుండా ఈ ఓటింగ్ తెచ్చిపెట్టారన్నది సంతృప్తికరంగా వివరించలేని పక్షంలో ఈ ఓటింగ్ ప్రక్రియను ముగించి, ఆ చర్చను వేరెవరైనా సభ్యులు చూసి ముగించేలా తన మార్పులను ఎందుకు ఇతర నిర్వాహకులెవరైనా తిరగగొట్టకూడదో @Arjunaraoc: గారు తెలియజేయాలి. నా ఉద్దేశంలో ఇది మొత్తం ప్రక్రియను, సభ్యులు సంయమనాన్నీ పరీక్షించడమే అవుతోంది. --పవన్ సంతోష్ (చర్చ) 11:34, 6 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఇది గమనించి స్పందించాల్సిందిగా ఆ చర్చలో పాల్గొన్న నిర్వాహకులు వాడుకరి:Chaduvari, వాడుకరి:K.Venkataramana, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:Pranayraj1985, వాడుకరి:యర్రా రామారావు గార్లను ఆహ్వానిస్తున్నాను. అలానే ఆ పేజీ ఇప్పుడున్న స్థితి చూసేందుకు వీలుగా లింక్ ఇదిగో: వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ --పవన్ సంతోష్ (చర్చ) 13:49, 6 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రక్రియను బలహీనపరచేటట్లుగా వున్న మీ వ్యాఖ్యవెనుక కొంత అవగాహన లోపాలున్నందున, అవి తెలియజేయటం బాధ్యతగా భావించి ఈ స్పందన రాస్తున్నాను.
ఓటింగుకు పెట్టిన ప్రతిపాదన కొత్తవారు యాంత్రిక అనువాద ఉపకరణాన్ని వాడడం నిరోధించదు. కేవలం వారు ప్రధానపేరుబరిలో ముద్రించటం మాత్రమే నిరోధిస్తుంది. అంటే వారు అనువాదవ్యాసాలను వారి వాడుకరిపేరుబరిలో ముద్రించుకోవచ్చు. ఇతరులను సమీక్ష చేయమని కోరి, ఆ తరువాత అటువంటి వ్యాసాలకు సవరణలు చేసి ప్రధానపేరుబరికి తరలించనూవచ్చు.
సమీక్ష ప్రారంభంలోనే స్పందన అభ్యర్ధన అన్న పేరాలో వికీపీడియా:విధానాలు,_మార్గదర్శకాలకు_ఓటు_పద్ధతి వాడి నిర్ణయం చేయబడుతుందని స్పష్టంగా తెలపబడింది. ఆ పద్ధతిలో కేవలం పరిచయ వాక్యమే పై వ్యాఖ్యలో మీరు పేర్కొన్నారు. దానిలో  వోటింగు ప్రక్రియ పద్ధతి విభాగంలో సవివరంగా ఎలా అంచనా వేయాలో వివరించబడింది. ఆ ఓటు పద్ధతిలో ఆ విధంగానే ఓటింగ్ జరుగుతున్నది. కావున మీ అభ్యంతరాలకు ఆధారమేమి లేదు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 23:07, 14 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అర్జున రావు గారూ, ఇప్పటికే పలుమార్లు చెప్పాను, ఇంకోసారి కూడా చెప్తాను.

 1. మీ విధానం కొత్తవారు నేరుగా ప్రధాన పేరుబరిలో యాంత్రికానువాదం వాడి ప్రచురించడాన్ని అడ్డుకుంటుంది. నేను మీరు చేసిన పది పైచిలుకు అనువాద వ్యాసాలను గతంలో విశ్లేషించి తేల్చిందేమిటంటే - పదుల వేల మార్పులు చేసిన మీరు చేసిన వాటిలోనూ దారుణమైన అనువాద లోపాలు ఉంటాయని. మీరూ హుందాగా "మీరు ఆశించే నాణ్యత నా అనువాద వ్యాసాలలో కనబడకపోవటాన్ని నేను అంగీకరిస్తాను. నేను మరల పరిశీలించినపుడు నా అనువాదంలోగల సమస్యలు మరింతగా తెలిశాయి. వాటిని అనువాద సమస్యల పరిష్కరణ ఉపకరణం వాడి కొంతవరకు సవరించాను." అనీ అంగీకరించారు. అంటే - 500 మార్పులు కాదు సరికదా మీలా పదుల వేల సంఖ్యలో మార్పులు చేసినా అనువాదం చేయడంలో నైపుణ్యం వచ్చెయ్యదు. కాబట్టి, ప్రయత్నపూర్వకంగా "ముందు చేయబోయే అనువాదాలు మరింత నాణ్యతగా చేయదలుచుకున్నాను." అని మీరే అన్నట్టు, కృషిచేసి నాణ్యంగా చేయాలి. అలాగే, కొత్త సభ్యులు చెత్త అనువాదాలే చేస్తారనీ మీరేమీ నిరూపించలేరు. కాబట్టి, మీ అంత అనుభవం ఉన్న మీరు కూడా నియంత్రణ లేకపోతే, ఎత్తిచూపకపోతే నాణ్యమైన అనువాదాలు చేయలేరు, కొత్త సభ్యులు అనగానే వారేమీ అనువాదంలో తప్పులు చేస్తారన్న ఖచ్చితమైన సూచిక ఏమీ లేదు, అలాంటప్పుడు ముందు "అనువాద వ్యాసాలు సృష్టించే సభ్యులపై ప్రస్తుతం వున్న వివక్ష పోతుంది. కొత్త వ్యాసాలు సృష్టించే సభ్యులకు లభించే అనుభవమే వీరికి అందుతుంది." అంటూ నియంత్రణ తొలగించమని, ఆ ప్రాతిపదికకు మీరే దెబ్బకొడుతూ ఈ రెండవ సవరణ ఎందుకు తెచ్చిపెట్టారో ఇప్పటికీ సంతృప్తికరంగా చెప్పలేకపోయారు.
 2. మీరిప్పుడు చేసిన సవరణ ప్రకారం - అర్జున రావు గారనే మీరు 500 ఎడిట్లు పైచిలుకు మార్పులు చేసిన కారణంగా అసహజమైన వాక్యాలతో, అనువదించని ఇంగ్లీషు పదాలతో, మరీ నిర్లక్ష్యపూరితమైన ధోరణిలో 30 శాతం కూడా మార్పుచేర్పులు చేయకుండా అనువాద వ్యాసాన్ని అచ్చంగా మొదటి పేరుబరిలో ప్రచురించేయవచ్చు, అదే కొత్తగా బయట అనువాదాల్లో ఆరితేరి, ఇక్కడ చక్కగా నేర్చుకుని యాంత్రికానువాదాలు చేయబోయిన కొత్త సభ్యులు కేవలం మీకున్న 500 ఎడిట్లు లేవన్న కారణంగా తీసుకుపోయి సాండ్‌బాక్సులో పెట్టుకోవాలి. ఇది సహజ న్యాయ సూత్రానికే వ్యతిరేకం. మీరు చేసిన ఈ సవరణ నిజానికి సవరణ కాదు, మీరు మొదట తీసుకువచ్చిన ప్రాతిపదికకే విరుద్ధంగా ఉన్న కొత్త ప్రతిపాదన. ఈ విధంగా చూస్తే, ప్రాతిపదిక సరిపోనప్పుడు కొత్త పాయింట్ సవరణ కాబోదనీ, కొత్త ప్రతిపాదన అవుతుందని గ్రహించడానికి సుముఖంగా లేని మీదే అవగాహన లోపమైనా మరోటైనా!

చర్చలో నేను గమనించినంతవరకూ వాడుకరి:Chaduvari, వాడుకరి:K.Venkataramana, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:Pranayraj1985, వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గార్లు మీరు తీసుకువచ్చిన ప్రతిపాదన (భాష పరంగా యాంత్రిక అనువాద స్థాయి తొలగింపు) అన్నదాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. కాబట్టి, ఇందరి సమయాన్ని వెచ్చించి 8 వేల పదాల పైచిలుకు చర్చ జరిగి, ఆ చర్చలోనే వీగిపోయిన ప్రతిపాదనను తీసుకువచ్చి ఓటింగ్‌కు పెట్టడం, "పై చర్చలో నిలిచిన ప్రతిపాదన" అని ఈ వీగిపోయిన ప్రతిపాదనను మీరే నిర్ణయించేసెయ్యడం - మీ హక్కులను దుర్వినియోగం చేయడం, తోటి వాడుకరుల సమయంపై అగౌరవం చూపించడమే అవుతోంది. నేను ఇప్పుడే పై వాడుకరులను అడుగుతున్నాను, వారే చెప్తారు - చర్చలో మీరు తీసుకువచ్చిన ప్రతిపాదనను వారు ఆమోదించారో, తిరస్కరించారో --పవన్ సంతోష్ (చర్చ) 03:23, 16 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అర్జున గారి ప్రతిపాదన చర్చలో తిరస్కరించారా లేదా?[మార్చు]

వాడుకరి:Chaduvari, వాడుకరి:K.Venkataramana, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:Pranayraj1985, వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల ఇప్పటికే ఈ చర్చతో మీరందరూ విసిగిపోయారని నాకు తెలుసు, ఆమాటకు వస్తే ఏనాడో ముగించేయాల్సిన చర్చను ఈనాటికీ లాగుతూ విలువైన కాలాన్ని, ఏకాగ్రతను వ్యర్థం చేస్తూ సాగుతున్న ఈ చర్చతో నేను విసిగిపోయాను. కానీ, ఇక్కడ నిజానిజాలు నిగ్గుతేలాల్సిన సమయం వచ్చింది. అర్జున గారు "భాష పరంగా వున్న ప్రస్తుత యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతాన్ని తొలగించాలి. అనగా ఉపకరణంలో అప్రమేయంగా వున్న నాణ్యత పరిరక్షణ క్రియలు తెలుగు వికీకి సరిపోతాయి." అన్న తన ప్రతిపాదన, దానికి ఆయన చివర్లో హడావుడిగా చేర్చేసిన సవరణతో సహితంగా "చర్చలో నిలిచిన ప్రతిపాదన" అని ఆయనే నిర్ణయించేశారు. అందుకు భిన్నంగా లేదని నేను అభిప్రాయపడుతున్నాను. మీరు చర్చలో దీన్ని ఆమోదించారా (అర్జున గారు పదే పదే వెంటపడి ఇచ్చిన వివరణలతో కలిపి చూసి) లేదా అన్నది ఈ కింద తెలియజేయగలరు.మరోమారి ఇబ్బందిపెడుతున్నందుకు క్షమాపణలు, ఈ స్థితి తీసుకువచ్చింది నేను కాదని గ్రహించి మీ అభిప్రాయం చెప్పగలిగితే చెప్పగలరు:

 1. నేను నిర్ద్వంద్వంగా ఆయన ప్రతిపాదనను తిరస్కరించాను. ఇప్పటికీ నాది ఒకటే సూత్రం "అనువాద ఉపకరణం 90 శాతానికి పైగా మెరుగుపడిందని నిక్కచ్చిగా నిరూపించితే తప్ప, నిజంగా అనువాదం చేస్తే అందుకోగలిగే ఈ కాస్త నియంత్రణలూ (30 శాతం మార్చాలన్నది) తొలగించకూడదు" అలాగే, "అర్జున వంటి అనుభవజ్ఞులే ఇంగ్లీషు పదాలు, వాక్యాలు విడిచిపెట్టేసి అనువాదాలు ప్రచురించేస్తున్నప్పుడు, 500 మార్పులు చేసినవారు అనువాదాల్లో నిష్ణాతులని వారికి మినహాయింపు ఇవ్వడం, కొత్తగా వచ్చేవారు ఎంతటి పండితులో, ఎంత గట్టివారో తెలియకుండానే కొత్తవారు కాబట్టి నియంత్రించడం సరికాదు". చర్చలో కూడా నేను అర్జున గారి వాదన ఏకీభవించలేదు. --పవన్ సంతోష్ (చర్చ) 03:23, 16 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 2. నేను అర్జున గారి ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించాను. 30% మానవిక అనువాద పరిమితి ఉండాల్సిందేనని హేతువుతో సహా చెప్పాను. ఇది తెవికీ నాణ్యతను దిగజార్చే ప్రతిపాదన. అసలు ఈ వోటింగు అనేది వికీ విరుద్ధం. వికీలో అభిప్రాయాలే ముఖ్యం, వోట్లు కాదు. ప్రతిపాదనపై జరిగున చర్చలో మెజారిటీ సభ్యులు దీన్ని తిరస్కరించారు. __చదువరి (చర్చరచనలు) 04:15, 16 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 3. అనువాద ఉపకరణం ద్వారా వచ్చే పాఠ్యం నాణ్యత ప్రశ్నార్థకం. దాన్ని కనీసం 30% మానవికంగా మార్చనిదే ప్రచురించడం మంచిది కాదని నా అభిప్రాయం. కాబట్టి దీన్ని అంతకంటే తగ్గించే ప్రతిపాదనకు నేను వ్యతిరేకం. - #రవిచంద్ర (చర్చ) 04:56, 16 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 4. నేను అర్జునగారి ప్రతిపాదనను ఖచ్చితమైన అభిప్రాయంతో తిరస్కరించాను. తెవికీ నాణ్యత దృష్ట్యా 30% మానవిక అనువాద పరిమితి ఉండాల్సిందేనని తగిన కారణాలుతో వివరించాను.నాతో సహ ఇదే అభిప్రాయాలు చర్చలో పాల్గొన్న మెజారిటీ గౌరవ వికీపీడియన్లు ముక్తకంఠంతో నిర్ద్వంద్వంగా అర్జునగారి ప్రతిపాదనను తిరస్కరించారు.వికీలో ఓటింగుకన్నా, చర్చలో జరిగిన మెజారిటీ సభ్యుల అభిప్రాయాలే ముఖ్యం. ఇది తెవికీ నాణ్యతను దిగజార్చే ప్రతిపాదన. అసలు ఈ వోటింగు అనేది వికీ విరుద్ధం.--యర్రా రామారావు (చర్చ) 05:23, 16 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 5. అర్జున గారి ప్రతిపాదనను నేను కూడా తిరస్కరించాను, ఇప్పటికీ తిరస్కరిస్తూనే ఉన్నాను. తెవికీ నాణ్యతను దృష్టిలో ఉంచుకొని 30% మానవిక అనువాద పరిమితి ఉండడమే సరైనది. ఈ ప్రతిపాదనకు నేను వ్యతిరేకం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:37, 16 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 6. అర్జున గారి ప్రతిపాదనను నేను తిరస్కరిస్తున్నాను. యాంత్రికానువాదాలపై తమ అభిప్రాయాలు, అనుభవాలు చర్చించకుండా ఓటు వేసారనే ఒక్క కారణంతో అమలుచేసే ఈ విధానాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ వోటుంగు వికీ విరుద్ధం. తెవికీ నాణ్యతను దృష్టిలో ఉంచుకొని 30% మానవిక అనువాద పరిమితి ఉండడమే సరైనది. ఈ ప్రతిపాదనకు నేను వ్యతిరేకం.--కె.వెంకటరమణచర్చ 09:35, 16 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఓటింగ్ అనవసరం[మార్చు]

@Arjunaraoc: గారూ, తెలుగు వికీలో ఒక పక్క వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టులో సభ్యులు పాల్గొని వేల మొలక వ్యాసాలను విస్తరణ చేస్తున్న సమయంలో మీరు కూడా అందులో పాల్గొని కనీసం ఒక వ్యాసమైనా విస్తరణ చేయకుండా, మీకు మీరుగా వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి అనే మరో ప్రాజెక్టును ప్రారంభించి, సభ్యుల అభిప్రాయాలు కోరారు. సరే అనుకొని, ఆ ప్రాజెక్టును కొనసాగిస్తూనే మీరు ప్రతిపాదించిన ప్రాజెక్టులో సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేసి, కొత్త సభ్యుల యాంత్రిక అనువాదాలపై నియంత్రణ వుండాలని అన్నారు. కానీ, మీరు మళ్ళీ ఇప్పుడు ఓటింగ్ పద్ధతిని తీసుకొచ్చి, సభ్యులు తెలియజేసిన అభిప్రాయాలకు విలువ లేకుండా చేస్తున్నారు. అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి అని పేరు పెట్టి నాణ్యతలేని వ్యాసాలను తెవికీలో ఎక్కించడానికి చూస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు చర్చలో ఒక సభ్యుడు రాసిన అభిప్రాయాన్ని, మళ్ళీ మరోసారి చూద్దామంటే అది ఆ స్థానంలో ఉండడంలేదు. ప్రాజెక్టు పేజీని మీకు ఇష్టమున్నట్టుగా మారుస్తూ, సభ్యులు రాసిన అభిప్రాయాలను ఎక్కడెక్కడో తరలించి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇదంతా అవసరమా, మీకు అనువాద ఉపకరణంతో రాయడం ఇష్టంలేకపోతే రాయడం మానేయండి, అంతేకాని మీకు ఇష్టమున్నట్టుగా చేసి సభ్యుల సమయాన్ని వృధా చేయకండి.

అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి చర్చలో పాల్గొన్న సభ్యులలో అధికశాతం మంది అర్జున గారి ప్రతిపాదనను వ్యతిరేకించారు. కాబట్టి ఓటింగ్ పద్ధతి ఇక అనవసరం. ఈ ప్రతిపాదన చేసినవారు, ఈ చర్చలో పాల్గొన్నవారు కాకుండా వేరే నిర్వాహకులెవరైనా ముందుకువచ్చి చర్చలో పాల్గొన్న సభ్యుల అభిప్రాయాలను బట్టి నిర్ణయం చేసి, చర్చను ముగించాలి. లేకపోతే ఇది ఇలాగే కొనసాగి, వికీ ఇతర పనులకు ఆటంకంగా మారే అవకాశం ఉంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:30, 6 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నేను పవన్ సంతోష్, ప్రణయరాజ్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. వికీపీడియా నాణ్యతాభివృద్ధి కొరకు కృషిచేస్తూ ప్రాజెక్టులను చురుకుగా నిర్వహిస్తూ, నిరంతరం శుద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్న క్రియాశీల వాడుకరులెవరూ ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపలేదు. మీరు ఈ అనువాద పరికరంతో వ్యాసం అనువాదం చేసినపుడు అది 30% శుద్ధి చేయనిదే అడ్డుకుందని వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి పేజీ ప్రారంభించారా? లేక ఎవరైనా 30% న్ని తగ్గించమని ఎక్కడైనా కోరారా? క్రియాశీలక వాడుకరులెవరూ చర్చలో ఈ ప్రతిపాదనకు మద్దతునివ్వనప్పుడు ఓటింగ్ అవసరం లేదు. ఒక అంశంపై చర్చ జరిగి రెండు అంశాలను ఓటింగ్ లో ఎలా చేర్చారు? సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేసినా సభ్యులు తెలియజేసిన అభిప్రాయాలకు విలువ లేకుండా చేస్తున్నారు. దీనిపై చర్చలో పాల్గొనని నిర్వాహకుడైవరైనా చర్చను ముగిస్తే బాగుంటుంది. K.Venkataramana(talk) 02:30, 7 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్, ప్రణయ్ రాజ్, వెంకటరమణ గారల అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను.ఇది ఒటింగ్ పెట్టడం ఎలా ఉందంటే వెనకటికి ఒక ఆడపిల్లల తండ్రి "చస్తే మేనరికం ఇవ్వను, కాకపోతే సోలుపున బొందలన్నా పెడతానుకానీ" అన్నాడట.ఇది సామెత.ఎందుకు ఉదహరించానంటే అర్జునరావు గారు అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి చర్చను చాలా గంధరగోళంకల్పించే విధంగా శ్రమపడి ప్రవేశపెట్టబడిన చర్చపై అనువాదయంత్రం వాడిన వాడుకరులు, సుదీర్ఘ చర్చలో పాల్గొని వారి అభిప్రాయాలు వ్యక్తీకరించారు.ఆ చర్చలో పాల్గొన్న 10 మందిలో ఒకళ్లు ఇద్దరు తప్ప మెజారిటీ వాడుకరులు యాంత్రిక అనువాదం స్థాయి 70 శాతానికి మాత్రమే ఉండటానికి మద్దతు తెలుపుతూ, దీని మీద ఒక అభిప్రాయానికి వచ్చారు.అలాంటిదాన్ని వికీ సంప్రదాయం ప్రకారం, ఆ చర్చలో పాల్గొనని వాడుకరి ఎవరైనా నిర్ణయం ప్రకటించేంతవరకు వేచిచూడాలి. పోనీ నిర్ణయం ప్రకటించమని అర్దునగారు ఎవరినైనా అభ్యర్థించారా అంటే అదిలేదు.నాకు తెలిసినంతవరకు 2013లో మొలకల నియంత్రణ విధానానికి మాత్రమే ఓటింగు ప్రక్రియ జరిగింది.ఏడు సంవత్సరాల నుండి ఓటింగు ప్రక్రియ దేనికి జరుగకుండా, దీనిని మాత్రమే ఓటింగుకు ప్రవేశపెట్టటం అర్జున గారు దురభిప్రాయం ప్రస్పుటంగా అర్థమవుతుంది.లేచిందే లేడికి ప్రయాణం అన్న చందంగా ఓటింగుకు పెట్టారు.ఇది ఎలా ఉందంటే ఎన్నికల ప్రకటన లేకుండా, రేవు పోలింగు జరుగుతుంది.ఓటుహక్కు ఉపయోగించుకోండి అన్న చందంగా ఉంది.ఇంకొకటి బాటన (త్రోవన) ప్రయాణించినవారు ఎవరూ ఆబాట బాగాలేదని అనలేదు. బాటను అసలు ఉపయోగించనివారు అబ్బే ఆ బాట బాగలేదన్నట్లుగా ఉంది.అంటే యాంత్రిక అనువాద యంత్రం ఉపయోగించినవారు 70 అనువాద శాతానికి కుదించినదానిమీద ఎవ్వరూ అభ్యంతరం లేవనెత్తలేదు. యాంత్రిక అనువాదం మెరుగుపడాలంటే ఈ రకంగా కుదించుకుంటూ, దానిలో మానవీయశాతం పెరుగుదల పెరిగినప్పుడే, ఆ యంత్రం పూర్తిస్థాయిలో మెరుగవుతుంది.ఇది అందరికి తెలిసిన విషయమే.దానిలో మనం మార్పులు చేసేటప్పుడు క్షణ, క్షణానికి 'save' చేస్తుంది.ఆరకంగా అనువాద స్థాయి మెరుగవుతుంటుంది.అర్జున గారి ప్రతిపాదన ప్రకారం అయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్న చందంగా ఉండేమాట వాస్తవం.చర్చ జరిగింది ఒకదానికి, ఓటింగులో ఇంకొక పిల్ల సబ్జెక్టును ప్రవేశపెట్టారు.ఏ రకంగా చూసినా ఓటింగు ప్రక్రియ అంతా తప్పుడు ప్రక్రియలో ప్రవేశపెట్టబడింది.కావున ఓటింగు ప్రక్రియను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను.కాబట్టి ఓటింగ్ పద్ధతి ఇక అనవసరం. వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ ప్రతిపాదన చేసినవారు, చర్చలో పాల్గొన్నవారు కాకుండా, వేరే నిర్వాహకులెవరైనా ముందుకువచ్చి చర్చలో పాల్గొన్న సభ్యుల అభిప్రాయాలను బట్టి నిర్ణయం చేసి, చర్చను ముగించాలి.దీనిలో ఉపయోగించిన సామెతలు కేవలం భావన అర్థం కావటానికి ఉపయోగించాను.ఎవ్వరూ తప్పుగా అర్ధం చేసుకోవద్దు.--యర్రా రామారావు (చర్చ) 14:56, 7 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
User:Pranayraj1985,User:K.Venkataramana,యర్రా రామారావు గార్లకు, ప్రస్తుత విధానం సమీక్షలో మీ విలువైన సమయం వెచ్చించి పాల్గొన్నందులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాటివలన యాంత్రికఅనువాద ఉపకరణం వాడుక గురించి, సమస్యల గురించి మరింత అర్ధమైంది. తొలి ప్రతిపాదనను సవరణద్వారా మెరుగుచేయడానికి తోడ్పడింది. మీ అభ్యంతరాలు అవగాహన లోపంవలనే అని నేను భావిస్తున్నాను. మరిన్ని వివరాలకు నా స్పందన 1, స్పందన 2, స్పందన 3 లు చూడండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 00:00, 15 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అవునండీ అర్జున గారు, అవగాహన లోపం ఉన్నవాళ్ళమేమో వికీపీడియా వ్యాసాల నాణ్యత పెంచేందుకు కృషి చేస్తున్నాం, చాలా అవగాహన ఉన్నమీరేమో వికీపీడియా వ్యాసాల నాణ్యతను తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. ఇది మాత్రం స్పష్టం. ఇలా సభ్యుల సమయం వృధా చేయకుండా, వికీ నాణ్యతకు ఉపయోగపడేలా వేరే ఏదన్నా పనికొచ్చే పని చేయండి సార్.౼౼ ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 02:53, 15 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అవునండీ అర్జున గారు నిజమే మాకు అవగాహనలేదు.ఈ మాట చాలామంది అన్నారు.పైన మీరు రాసిన అభిప్రాయంలో ఈ వాక్యం చూడండి. "వాటివలన యాంత్రికఅనువాద ఉపకరణం వాడుక గురించి, సమస్యల గురించి మరింత అర్ధమైంది. తొలి ప్రతిపాదనను సవరణద్వారా మెరుగుచేయడానికి తోడ్పడింది. మీ అభ్యంతరాలు అవగాహన లోపంవలనే అని నేను భావిస్తున్నాను" అని అన్నారు.దీనిలోనే మీ అహగాహనలోపం ఎంతవరకు ఉందో అర్థమవుతుంది. నిశితంగా పరిశీలించండి.మీకే అర్థమవుతుంది.ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి.అందరికి అన్నీ తెలియవు.నాకు తెలిసినవి మీకు తెలియవు.మీకు తెలిసినవి నాకు తెలియవు.మా అహగాహన సంగతి మీరు చెప్పనవసరంలేదు.నావరకు నాకు నాఅవగాహన గురించి మీ దృవపత్రం అక్కరలేదు.నేనే చెప్పుకుంటాను,నాకు అవగాహనలేదని.ఇకముందు పదేపదే అలాంటి పదాలతో తోటి వికీపీడియన్లను చిన్నబుచ్చకండి.ప్రణయరాజ్ గారు చెప్పినట్లు మీరు వికీ నాణ్యతపట్ల, భాష పట్ల సరియైన శ్రద్దచూపండి.--యర్రా రామారావు (చర్చ) 03:57, 15 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
మేము అనేక వ్యాసాలను యాంత్రికానువాదాల ద్వారా మానవీయ మార్పులు అనేకం చేస్తూ నాణ్యమైన వ్యాసాలు తయారు చేస్తున్నాం. మేము అందులో గల లోపాలను తెలియజేస్తే వాటిని పరిగణించకుండా మాకు అవగాహన లేదని అంటారా? మీరు ఒక యాంత్రికానువాదం దోషాలు లేకుండా వికీ విధివిధానాల ప్రకారం రాయండి. ప్రయోగాత్మకంగా మీకు అందులో దోషాలు తెలుస్తాయి. ఆ పరికరం వాడని/తక్కువ వాడిన ఓటింగులో పాల్గొన్న వాడుకరులు, 70% తొలగించడం వల్ల వికీ నాణ్యతాభివృద్ధి ఎలా జరుగుతుందో, ప్రస్తుతం వారు అనువదిస్తున్న నాణ్యమైన వ్యాసాలకు ప్రస్తుత విధానం ఏ విధంగా నష్టం కలిగిస్తుందో వారి అభిప్రాయాలను తెలియజేయకుండా వారు ఓటు వేసారనే ఒకే కారణంతో, మీరు చాలా అనుభవమున్న తెవికీ అధికారిగా ఎలా ఆమోదిస్తారు? ఆ పరికరం వాడుతున్న, అందులోని లోపాలను తెలియజేసిన మా వంటి వాడుకరులను అవగాహన లేదని ఎలా అంటారు? మీరెన్ని అనువాదాలు చేసారు? వాటిలో నాణ్యత ఎంత? మీరు నాణ్యమైన అనువాదం గల వ్యాసాలు తెవికీలోకి రావాలన్న విషయంపై దృష్టి పెట్టడం లేదు. ఎలాగైనా మీ విధానం నెగ్గించుకుని విపరీతమైన వ్యాసాలు (నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నా సరే) పెంచడానికి ఒక అధికారిగా కృషి చేస్తున్నట్లుంది. ఒక సారి యాంత్రికానువాదం చేసే అనుభవజ్ఞులైన వాడుకరుల అబిప్రాయాలను పరిగణన లోకి తీసుకోండి. వికీ అభివృద్ధికి దోహదపడండి.--కె.వెంకటరమణచర్చ 05:28, 15 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మీ వాదన స్వీయవిరుద్ధం, మీ ప్రతిపాదన వికీవిరుద్ధం, మీ వోటింగు ధర్మవిరుద్ధం[మార్చు]

అర్జున గారూ, పైన నాకు మీరిచ్చిన ప్రత్యుత్తరంలో మిమ్మల్ని మీరే తప్పు పట్టుకున్నారు. మీరు ఒక ప్రతిపాదన పెట్టారు, దాన్ని మెజారిటీ సభ్యులు వ్యతురేకించారు. "చిత్తు ప్రతిపాదనపై చర్చలు జరిపి, వీలైనంత ఎక్కువ మందికి సమ్మతమైన రూపంలో మాత్రమే ప్రతిపాదనను వోటు ప్రక్రియలో పెట్టాలి. దీనికి కనీస కాలపరిమితి వారం రోజులు." నే మీరు చెప్పిన సూత్రం ప్రకారం అసలు వోటుంగుకే రాకూడదు. అయినా మీరు వోటింగు పెట్టారు. మీరు చెప్పిన పద్ధతిని మీరే అతిక్రమించారు. చర్చను కలగాపులగం చేసేసి, వాడుకరుల అభిప్రాయాలను చీలికలు పేలికలు చేసి ఆ గందరగోళంలో ప్రతిపాదనలోకి ఓ కొత్త ఎమెండుమెంటును చేర్చి ఆ రెంటినీ కలిపేసి వోటింగుకు పెట్టారు.

 1. మీరు పెట్టిన రెండు ప్రతిపాదనల్లో ఒకదానికి వ్యతిరేకంగా రెండో దానికి అనుకూలంగా ఉన్నవారు వోటు ఎలా వెయ్యాలి? రెండు ప్రతిపాదనలు పెట్టి ఒకే వోటు వెయ్యడమేంటసలు?
 2. వికీపీడియాలో అభిప్రాయాలు ప్రధానం, వోటింగు కాదు అనే మౌలిక సూత్రానికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్తున్నారు?
 3. మీ ప్రతిపాదనపై జరిగిన చర్చలో దాన్ని నిష్కర్షగా వ్యతిరేకించి, నిర్ద్వంద్వంగా తిరస్కరించిన వారు అనేకులు ఉన్నారు. ఇక్కడ ఈ చర్చ లోనూ వ్యతిరేకించారు. అసలు ఈ వోటింగుకు నైతికతే లేసు పొమ్మన్నారు. ఇప్పుడు వాళ్ళు వోటేస్తారని మీరు అనుకుంటున్నారా? మరప్పుడు, ఇక్కడ ఈ వోటింగుకు మద్దతుగా కొన్ని వోట్లు, వ్యతిరేకంగా అసలేమీ రాకపోతే, మీ ప్రతిపాదన నెగ్గినట్టా? అలా భావిస్తే అందులో నైతికత ఉందా?
 4. అలా భావించి దాన్ని తెవికీ సముదాయం అభిప్రాయంగా మీరు ప్రకటించగలరా?
 5. మా సముదాయం నిర్ణయం ఇదీ అని అనువాద పరికరం డెవలపరుకు చెప్పి మీరు చెయ్యదలచుకున్న మార్పులు వారి చేత చేయించగలరా?
 6. అంతెందుకు సార్.., మీ ప్రతిపాదనను వ్యతిరేకించేవాళ్లంతా ఇక్కడ ఈ చర్చా పేజీలో ఒక వోటింగు పెట్టి మీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ తీర్మానం చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి.

మీరు తలపెట్టిన ఈ ప్రతిపాదనలో మీ మోటివేంటో నాకు తెలవదు గానీ సహేతుకత మాత్రం లేదు అర్జున గారూ.

 1. మీరు చేసిన అనువాదాలు 11. నేను 200 పైచిలుకు అనువాదాలు చేసాను. అవి కాకుండా సుమారు 70 లక్షల బైట్లు అనువదించి కాపీ పేస్టించి ప్రచురించాను. అత్యధిక అనువాదాలు చేసిన తొలి నలుగురిలో ముగ్గురు మీ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అయినా మేమంతా పరికరంపై పరిమితి అలానే ఉంచాలని అన్నాం. అనుకూలంగా ఎవరూ మాట్టాడలేదు. ఇతర వాడుకరులు కూడా మీ ప్రతిపాదనను తిరస్కరించారు.
 2. మీరు అనువాదాల్లో వచ్చిన దోషాలను ఎన్నడూ సవరించింది లేదు. నేను అనేక వందల అనువాద దోషాలను సవరించాను, ఎత్తిచూపాను. దోషాల గురించి ఆయా వాడుకరులకు సూచనలిచ్చాను. సరిచేయించాను. అనేక మంది ఇతర వాడుకరులు కూడా ఈ పనులన్నీ చేసారు. మీరు ఇవేమీ చెయ్యలేదు. కానీ మీరు దోషాలకు అనుకూలంగా ప్రతిపాదన చేసారు, మేం వ్యతిరేకించాం. అయినా..
 3. కొన్ని పేజీల్లో అనువాదాలు దోషభూయిష్టంగా ఉన్నాయని, వాటి సరిచెయ్యలేమని, తొలగించాలనీ నేను చర్చకు పెట్టాను. అనేక మంది ఇతరులు కూడా తొలగింపు ప్రతిపాదనలు చేసారు. ఈ చర్చల్లో పాల్గొన్నాం. నిర్ణయాలు తిసుకుని కొన్నిటిని తొలగించాం. అలాంటి వాళ్ళం మేం మీ ప్రతిపాదనను వ్యతిరేకించాం. మీరు మాత్రం..
 4. 1700 పైచిలుకు యాంత్రికానువాదాలపై అనేక సంవత్సరాల పాటు చర్చలు జరిగాయి. తొలగించాలని అనేక మంది చెప్పారు, నిర్ణయించారు. చివరికి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తొలగించాం. ఆ చర్చల్లో నేనూ చురుగ్గా పాల్గొన్నాను. ఇతరులూ పాల్గొన్నారు. మీరు పాల్గొనలేదు. అయినా..
 5. అంతెందుకూ.., మీరు ఈ ప్రతిపాదన తెచ్చిన తరువాతనే అనేక మంది వాడుకరులు అనువాద పేజీలను సృష్టించారు. వాటిలో అనేక అనువాద దోషాలు ఉన్నాయి. ఒక్కటైనా మీరు సవరించారా? ఒక్కదాని గురించైనా చర్చకు పెట్టారా? వాళ్లకు సూచనలిచ్చారా? లేదు. మీ ప్రతిపాదన చర్చ పేజీలో ఇక్కడి దాన్ని అక్కడికీ అక్కడి దాన్ని ఇక్కడికీ మార్చుకుంటూ గందరగోళం చేస్తూ ఉండగా, మేం ఆయా పేజీల్లో దోషాలను సవరించడం, వాడుకరులకు సూచనలివ్వడం, తొలగింపుకు ప్రతిపాదించడం వంటివి చేస్తున్నాం.

ఇందరు వ్యతిరేకించినా, మీ ప్రతిపాదనను వోటింగుకు పెట్టారు. ఇది ధర్మవిరుద్ధం.

ఇక పోతే, నేను చురుగ్గా లేని రోజుల గురించి మీరు మాట్టాడారు. ఏం జరిగింది అనేది ముఖ్యం, అప్పుడు ఎవరున్నారు, ఎవర్లేరు అనేది అప్రస్తుతం. మీకు తెలీదేమో.. నేను చురుగ్గా లేని రోజుల్లో చాలానే జరిగాయి. నేను చురుగ్గా పనిచెయ్యడం మొదలయ్యాక వాటి గురించి నేను మాట్టాడాను కూడా. అప్పుడు జరిగిన గొప్ప సంగతుల గురించీ మాట్టాడాను, అప్పుడు జరిగిన తప్పుల గురించీ మాట్టాడాను. అవి జరిగిన రోజుల్లో నేను చురుగ్గా లేకపోయినా మీరు చురుగ్గానే ఉన్నారు. మీరు అప్పుడూ మాట్టాడలేదు, తరవాతా మాట్టాడలేదు. మనకు అనుకూలంగా లేకపోతే నోరు మెదపక పోవడం, అనుకూలంగా ఉంటే మాత్రం అనుభవం పేరుతో ఉచిత సలహాలు ఇవ్వడం.. ఇట్టాంటివి చెయ్యకూడదు. __చదువరి (చర్చరచనలు) 07:23, 8 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చదువరి గారు, ఎంతో అనుభవమున్న మీరు పై విధంగా వ్యాఖ్యలు చేయటం నాకు బాధ కలిగించింది. మీరు ప్రస్తావించిన కొన్ని అంశాలకు నా ఇటీవలి స్పందన 2, స్పందన 3 లు ఉపయోగపడవచ్చు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 00:13, 15 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, మీ బాధేంటో, ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇకపోతే అనుభవం అంటారా.. మీ అనుభవం ముందు నాదెంత లెండి. నేను చేసే అనువాదాల్లో ఇంకా అనేక దోషాలు దొర్లుతూనే ఉంటాయి. అనువాద పరికరంలో 30% మానవిక స్థాయి ఉండాల్సిందే అనేంత వెనకబడిన వాడుకరిని. __చదువరి (చర్చరచనలు) 00:26, 15 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఓటింగ్ అనేది నియమంలోనే ఉంది[మార్చు]

ఇక్కడ ఏమి జరుగుతోందన్నది సెలవులో ఉన్నందున నాకు పూర్తిగా తెలియదు కాని ఈ చర్చాపేజీని గమనిస్తే ఇదివరకే చర్చ జరిగిందనీ దాన్నే ఫలితంగా ప్రకటించాలనీ ప్రధాన అభ్యంతరం ఉన్నట్లుగా గమనించాను. సుమారు ఏడేళ్ళ క్రితం ఓటింగ్ మార్గదర్శకాలపై చర్చ జరిగి ఒక పద్దతి రూపుదిద్దుకుందనీ తత్ప్రకారంగా ముందుగా చర్చ జరిపి ఆ తర్వాత ఓటింగ్ చేపట్టవచ్చుననీ నియమం స్పష్టంగా చెబుతోంది. అమలులో ఉన్న నియమం ప్రకారమే అర్జునగారు చర్చ తర్వాతే ఓటింగ్ పెట్టారనీ తెలుస్తోంది. కాబట్టి ఆ చిత్తుచర్చను ఫలితంగా ప్రకటించే అవసరం ఉండదు. ఓటింగే ప్రధానం కాబట్టి నియమం ప్రకారం రెండు వారాలపాటు కొనసాగిన ఓటింగే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఓటింగును వ్యతిరేకించే అవసరం నాకైతేలేదు మరియు ఓటు వేయడానికి నాకు అభ్యంతరమూ లేదు. భాష పరంగా వున్న ప్రస్తుత యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతాన్ని తొలగించాలనే ప్రతిపాదన నాకు సమ్మతమే. నేను అనువాద వ్యాసాలేమీ చేయకున్ననూ యాంత్రిక అనువాదాల గురించి పూర్తిగా తెలుసు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:55, 9 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సభ్యుడు:C.Chandra Kanth Rao గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 22:00, 15 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, నాకు సమయం లభించనందున వివరంగా నా అభిప్రాయాలు వ్రాయలేకపోతున్నాను కాని ఈ ఓటింగ్ జర్పుటకు మరియు ఫలితం వెలిబుచ్చుటకు ఎలాంటి అభ్యతరం ఉండదు. అలాగే కొందరు అనుమానిస్తున్నట్లుగా నాణ్యతపై కూడా దీని ప్రభావమేమీ ఉండదు. ఎలా అన్నది త్వరలోనే పూర్తిగా తెల్పగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:34, 17 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఈ వోటింగులో నైతికత ఉందా..?[మార్చు]

ఈ వోటింగును వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి అనే విధానం ప్రకారం ఈ వోటింగు పెట్టారు. అందులో ఒకటి కంటే ఎక్కువ ప్రతిపాదనలను వోటింగుకు పెడితే ఏంచెయ్యాలి అనే సంగతిని ఆ విధానం చెప్పలేదు. ఏం చెయ్యాలో తెలియక ఆయన, అక్కడి చర్చలో అడిగారు గానీ ఎవరూ దానికి సమాధానం చెప్పకపోవడంతో అది విఫలమై పోయింది. ఆయనే దాన్ని విఫలం చేసారు. తనకే స్పష్టత లేని విషయాన్ని పట్టించుకోకుండా ఈ వోటింగును మాత్రం తీసుకువచ్చారు. __చదువరి (చర్చరచనలు) 04:28, 16 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చదువరి గారు, నా స్పందనను చూడండి.--అర్జున (చర్చ) 00:35, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, చెయ్యాల్సిన ఆలస్యం చేసేసాక, జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇప్పుడు తీరుబడిగా మీరిచ్చిన సమాధానం చూసాను. గురికి బారెడు దూరంగా ఉంది అది. ఏమీ ఉపయోగం లేదు దాని వల్ల. నా సమాధానం కూడా అక్కడ రాసాను, చూడండి. __చదువరి (చర్చరచనలు) 01:47, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఓటుకు అనుకూలమే[మార్చు]

అర్జున గారు, ఎందుకు అంత పట్టుపడుతున్నారు. అనేది అర్థం కాని విషయం పూర్తిగా వ్యతిరేకించాను. అయిన గురువు గారికి ఓటు అనుకూలమే, అందరూ వ్యతిరేకించిన అనుభవజ్ఞులు అంత పట్టుబట్టడం వెనక ఏదో ఉంది, ఓటింగ్ కు మందు విషయం చెప్పకపోయినా ఓటింగ్ గడువు తర్వాత వివరిస్తారా ఆశిస్తూ... ఓటింగ్ విఫలమైతే 70శాతం యధావిధి సఫలమైతే చూడాలి అక్షర కాలుష్యం ఆరంభమవుతుందా లేక మంచి వ్యాసాలు కొత్తగా తేవి లోనికి చేరుతాయా... కాలచక్రం నిర్ణయం చేస్తుంది. చదువరి, వెంకటరమణ,పవన్ సంతోష్, అర్జున, రామారావు, ప్రణయరాజ్, రవిచంద్ర, మీరంటే అంటే నాకు చాలా ఇష్టం... వికీలో మీ శ్రమ, మీ స్పీడు, మీ అంకితభావం...మీ సహనం సామాన్యమైనది కాదు. ఈ విషయంలో క్షమించండి. గురువుగారికి విధేయత చూపించవలసిన సమయం తరుణం ఇదే కావచ్చు...నా ఓటు అనుకూలమే. ప్రభాకర్ గౌడ్ నోముల 06:26, 16 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. అనువాద వ్యాసాల నాణ్యత ప్రాజెక్టు పేజీ తయారైన పిదప ప్రస్తుత విధానంపై సమీక్షను, కొత్త ప్రతిపాదనలను మూడువారాలపాటు చర్చించడం జరిగినది. చర్చను నిర్మాణాత్మకంగా జరపటంలో సహకరించని కొంతమంది సభ్యులు ఓటు ప్రక్రియను బలహీనపరచేవిధంగా ఓటు ప్రక్రియ కాలంలో వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఓటు ప్రక్రియ ముగిసిన తరువాత కూడా అభ్యంతరాలు తెలపవచ్చు. నా ఆసక్తి ప్రతిపాదన ఓడిందా, గెలిచిందా అన్నది కాదు. ఒకవేళ వోడితే 60 రోజుల తరువాత ఇంకొక కొత్త ప్రతిపాదన మొదలు పెట్టవచ్చు. గెలిచినా ప్రతికూలాలు ఎక్కువగా కనబడితే ప్రస్తుత విధానాన్నే మరల తేవాలని కొత్త ప్రతిపాదన చేయవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే వికీ చర్చలు, విధానాల నిర్ణయంలో ఎక్కువమంది సభ్యులు పాల్గొనేలా చేయడం, వికీచర్చలు సామరస్యంగా, అందరికీ అర్ధవంతమయ్యేలాగా జరపటం. వాటిలో ఎక్కువమంది సభ్యులు పాల్గొంటేనే వికీ ఎక్కువకాలం అభివృద్ధి దిశగా కొనసాగగలుగుతుంది. ఎంతో మంది వికీకృషిని ప్రభావితం చేసే విధానం, ఇతరుల అభిప్రాయాలకు విలువనివ్వని కొద్దిమంది తమ అభిప్రాయాల అధారంగా చేయాలనడానికి నేను విరుద్ధం. విస్తృత సముదాయ చర్చల ఫలితంగా ఏర్పడిన పద్ధతులను గౌరవించడం కూడా చాలా ముఖ్యం. --అర్జున (చర్చ) 00:21, 17 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వ్యాఖ్యలు నొప్పిస్తున్నాయి[మార్చు]

సర్, ఒక పక్క చర్చ ముగిసిపోయిన తరువాత, సదరు ప్రతిపాదనపై వోటింగ్ ప్రక్రియ కొనసాగుతూ వున్నప్పుడు ఓటింగులో పాల్గొన్న కొంతమందిని చిన్న చూపు చూడటం బాగోలేదు. రచ్చబండలో చేస్తున్న వ్యాఖ్యలు నొప్పిస్తున్నాయి. వోటింగ్ మధ్యలో వున్నప్పుడు ప్రతిపాదనకు మద్దతుగా నిలిచిన వారిని, ఓటువేసిన వారిని ఉద్దేశిస్తూ కేవలం 11 అనువాదాలు మాత్రమే చేసిన వ్యక్తులుగా...., అనువాద దోషాలను ఓరకంటా కూడా చూడని వ్యక్తులగా...., ఈగోతో హుంకరించే స్థాయి వ్యక్తులగా...... పరికరం వాడని/తక్కువ వాడిన ఓటింగులో పాల్గొన్న వాడుకరుల.....ఇలా నిర్వాహకులే ఒక ప్రతిపాదనకు మద్దతుగా ఓటు వేసినవారిని పేర్కొంటూ చులకన చేస్తే ఏలాగండి? పైగా నిర్వాహక స్థాయిలో వున్న అనుభవజ్ఞులు కనీసం వోటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకైనా రచ్చబండలో "వోటింగ్ లో పాల్గొన్న సభ్యుల"పై కామెంట్స్ పాస్ చేయకుండా, కాస్త సంయమనం పాటించండి. సభ్యులుగా కొన్ని నిర్దిష్ట అర్హతలున్నవారు ఓటింగులో పాల్గొనవచ్చు. అలా ఓటు వేసే అవకాశం ఉందనుకొనే వచ్చాం. తీరా ఓటింగులో పాల్గొనేసరికి ఒకసారి కూడా అనువాదం చేయనివారు, కొన్ని అనువాదాలు చేసినవారు అంటూ చిన్నబుచ్చినట్టు మాట్లాడడటం భావ్యం కాదు. మీరు 10 లక్షల బైట్లుకు పైగా అనువాదం చేసి ఉండవచ్చు. నిస్సందేహంగా గొప్ప అనుభవజ్ఞులు మీరు. తెలుగు వికీలో అందరూ గుర్తించే స్థాయి మీది. అంగీకరించాల్సిన విషయాన్ని అంగీకరిస్తున్నాం. కానీ అది చర్చలో అభిప్రాయాలు ఎక్స్చేంజి చేస్తున్నప్పుడు మాత్రమే పరిగణించండి. అక్కడ మమ్మలి కావచ్చు. మాబోటి తక్కువ అనుభవం వున్న వారిని కావచ్చు. చర్చలో భాగంగా చెప్పండి. ఒప్పుకుంటాం. కానీ చర్చ ముగిసిపోయి ఓటింగు క్యూ లో వున్నప్పుడు అందరూ సమాన ప్రతిపత్తులతో ఓటు వేస్తాము. అక్కడ అనుభవజ్ఞులకని 10 అదనపు ఓట్లు కానీ, అనుభవం లేని మా వంటివారికి ఒక ఓటు అని ఉండదు. నిర్దిష్ట అర్హత వున్న ప్రతీ సభ్యుడూ సమాన ప్రతిపత్తితో ఓటు హక్కు కలిగివుంటారు కాబట్టి ఈ టైం లో ఓటు వేసినవారిని అనుభవం లేనివారని, కొద్ది అనువాదాలు మాత్రమే చేసినవారని చులకనగా చూడవద్దు. ఒకవేళ అనువాదాలు గురించి మీకు మాత్రమే తెలుసు, మాకు తెలియవు కావున మావంటివారు వోటింగ్ ద్వారా అనువాద విధానాన్ని ప్రభావితం చేస్తున్నారు అనే అభిప్రాయాలు వంటివి ఏమైనా ఉంటే, మాబోటివారిని ముందుగానే వోటింగ్ అర్హతలు తొలగించండి. మీరు కోరుకున్న సంఖ్యలో అనువాదాలు చేసిన వారికి మాత్రమే, అనువాదంలో విశేష అనుభవం వున్న సభ్యులకే ఓటు హక్కు ఉండాలనే నియమం పెట్టండి. సలక్షణంగా తప్పుకొనిపోతాం సర్. ఇక్కడ సెకండ్ గ్రేడ్ ఓటర్ స్థాయిలో గుర్తిస్తున్నప్పుడు, ఓటు వేయడం మాకు నొప్పిస్తున్నది. కొద్దిగా గుర్తించండి. --Vmakumar (చర్చ) 01:24, 17 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మీరు ఏ వ్యాఖ్య గురించి ప్రస్తావిస్తున్నారు? ఓటింగ్ ప్రక్రియ సరిగా ప్రారంభం కాలేదని 8 వేల పదాల సుదీర్ఘ చర్చలో పాల్గొని సమయం వెచ్చించినవారిలో అత్యధికుల అభిప్రాయం. మిమ్మల్ని వ్యక్తిగతంగా నొప్పించిన వ్యాఖ్య ఏమిటో, ఎవరిదో సూటిగా చెప్పండి. --పవన్ సంతోష్ (చర్చ) 04:15, 17 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Vmakumar గారూ, మీరు పొరబడ్డారు. "ఓటువేసిన వారిని ఉద్దేశిస్తూ" నేనా మాటలు అనలేదు. అనలేదు. అనలేదు. వోటేసిన వాళ్ళపై అసలు నాకు అలాంటి ఉద్దేశమే లేదు. రచ్చబండలో నేను రాసిన మూడూ పాయింట్లనూ మళ్ళీ చదవండి. నేను రాసినది వోటర్లను అన్నట్టు ఎక్కడ అనిపించిందో చెప్పండి.
అలాగే మీరు ఈ వోటింగుకు మూలమైన చర్చను మళ్ళీ చదవండి. ఆ చర్చలో నేను రాసినది (చదువరి స్పందన) చదవండి.. 30% మంచిదే అనే నా వాదనను నేను చేసిన లక్షలాది బైట్ల అనువాదాల నేపథ్యంలో చెప్పాను. 30% మంచిది కాదని ప్రతిపాదకుడు ఏ అనుభవంతో చెబుతున్నారు అని అడిగాను. యాంత్రికానువాదాలు, కృత్రిమ అనువాదాల గురించి అనేక చర్చల్లో నేను పాల్గొన్నాను. అనేక పేజీల్లో సవరణలు చేసాను, సవరణలు సూచించాను. ఆ అనుభవ నేపథ్యంలో చెప్పాను 30% తగ్గిస్తే వికీకీ మేలు జరగదు అని. ఏ అనుభవంతో దాన్ని తగ్గిస్తే వికీకి మేలు జరుగుతుందని ఏ అనుభవంతో చెబుతున్నారు అని ప్రతిపాదకుణ్ణి అడిగాను నాకు సమాధానం రాలేదు. అనుభవం గల సభ్యుని నిర్ణయాన్ని పరికరం గౌరవించడం లేదు అని ప్రతిపాదకుడు అంటే అనుభవానికీ అనువాదానికీ సంబంధం లేదని ఆయన చేసిన అనువాదాల్లోనే తెలిసిపోయిందని చెప్పాను. ఈ చర్చనంతా పక్కన పెట్టేసి నేను రాసిన దాన్ని అపార్థం చేసుకుని, వక్రీకరిస్తున్నారు.
అనుభవజ్ఞుణ్ణని నేను ఎప్పుడూ చెప్పుకోలేదు. చెప్పుకోను కూడా. నాకు ఎవరూ మేకతోలు కప్పనక్కర్లేదు. ఆ భేషజాలు నాకక్కర్లేదు. పై మీ వ్యాఖ్య అంతా నాగురించి పొరబడి రాసినట్టుగా ఉంది.
ఒకసారి మీరు నా వ్యాఖ్యలు - రచ్చబండలోది, చర్చలో, ఇక్కడా - అన్నీ మళ్ళీ చదవండి. ఎక్కడా "వోటింగ్ లో పాల్గొన్న సభ్యుల"పై నేను ఏ వ్యాఖ్యలూ చెయ్యలేదు. ఒకవేళ నేను రాసిన మాటలు వోటేసిన వాళ్ళను అన్నట్టుగా అనిపిస్తే ఎక్కడ అలా అనిపించిందో చెప్పండి. మీకు అలా అనిపించకుండా ఉండేలా రాయలేకపోయినందుకు - నా ఉద్దేశం అది కాకపోయినా సరే - బేషరతుగా క్షమాపణ చెబుతాను.
ఇక మీ పై వ్యాఖ్యలో మీరు రాసిన మిగతాదంతా మీ పొరపాటుకు పొడిగింపే కాబట్టి దాన్ని నేను పట్టించుకోవడం లేదు. __చదువరి (చర్చరచనలు) 05:00, 17 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Vmakumar గారూ, ఈ గూగుల్ అనువాదాలను చేస్తున్నప్పుడు అది చేసిన దోషపు అనువాదాలను, వాటిని శుద్ధిచేసే క్రమంలో కలిగే యిబ్బందులను గూర్చి చర్చింది 30% మానవీయ అనువాదం చేస్తే మంచిదనే అభిప్రాయంతో ఒక విధానాన్ని ఇదివరకు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ విధానాన్ని మార్చాలంటే, మానవీయ అనువాదం 30% పరిమితి తొలగించాలంటే ఓటింగులో పాల్గొన్న వ్యక్తులలోని వారు గూగుల్ అనువాద పరికరాన్ని ఉపయోగించేటప్పుడు వారికి గల అసౌకర్యాలను, లోటుపాట్లను చర్చించాలనే ఉద్దేశ్యంతో వ్యాఖ్య చేసాను. నా వ్యాఖ్య మీకు నొప్పించి ఉంటే క్షమించగలరు.--కె.వెంకటరమణచర్చ 06:05, 17 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
నేను పైన రాసిన వ్యాఖ్యకు "తెలిసిపోయిందని చెప్పాను" అనే చోట చిన్న సవరణ చేసాను. గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 06:16, 17 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
K.Venkataramana గారు, మన మధ్య, ఆత్మీయుల మధ్య "క్షమిం ...." లాంటి పదాలు ఎంతమాత్రం అవసరం లేదు. చక్కని అంకితభావంతో పనిచేస్తున్న మీ వంటి సహృదయుల నోటి వెంట క్ష..వంటి పదాలు వస్తే అప్పుడు నిజంగానే ఫీల్ అవుతాను. చిన్న చిన్న తప్పులు మనం కావాలని చేయకపోయినా ఒకొక్కప్పుడు అనుకోకుండా అలా దొర్లిపోతాయి. ఇదీ అంతే. తప్పొప్పులు అందరం చేస్తాం. నేను కూడా చేస్తాను. సరిదిద్దుకొంటూ ఫీడ్ బ్యాక్ చేసుకొంటూ మరింత మెరుగుగా వెళ్లడానికి ప్రయత్నం చేద్దాం. అది చాలు. అంతే. నేను కూడా ఎక్కువ రియాక్ట్ అయినట్లు వున్నాను. నిజం చెప్పాలంటే నాకు తెలుగు వికీలో తొలి గురువు, మార్గదర్శకులు మీరే. అలాంటి మీ నుంచి ప్రోత్సాహక పదాలు కోరుకొంటానే గాని, క్ష ...లాంటి పదాలు ఎంతమాత్రం కాదు. మీవంటి బ్రాడ్ మైండెడ్ పర్సన్, ఆత్మీయునితో కలసి వికీలో పనిచేస్తున్నందుకు really I proud of you. కలసి ఆత్మీయంగా పనిలో తిరిగి నిమగ్నమవుదాం.
చదువరి గారు, పవన్ సంతోష్ గారు నా ఫీలింగ్స్ తో మిమ్మల్ని కూడా నొప్పించి ఉంటే క్షమించగలరు. దీనిని పాజిటివ్ గా తీసుకొంటే--- ఎన్నో కొన్ని అనువాద వ్యాసాలు నేను కూడా చేసివుండాల్సింది అనిపించింది. చిన్నప్పటినుంచి ఫస్ట్ బెంచ్ వాడిని. తెలుగువికీలో మాత్రం లాస్ట్ బెంచ్‌లో ఉంటున్నాను అని అర్ధమవుతుంది. నిజంగా స్పీడ్ అప్ చేసుకొంటాను. దీనికి చర్చ, చదువరి, పవన్ సంతోష్ తదితరుల సహకారం కావలిసి ఉంటుంది. ఇప్పటివరకూ 1,2 తప్ప చర్చలలో పాల్గొనలేదు. అది నా సబ్జక్ట్ కాదేమో అనిపించేది. అయితే మన డెసిషన్స్ మారినా, మారకపోయినా, డిబేట్ లలో మన ఒపినిఒన్స్ ఎక్స్చేంజి అవుతాయి. ఇక నుంచి ఎంతో కొంత వరకైనా చర్చలలో పాల్గొనే ప్రయత్నం చేస్తాను. అలాగే "చర్చలో పాల్గొనడంతోనో, వోటు వెయ్యడం తోనో, మన బాధ్యత తీరిపోదని మాత్రం మనందరం గుర్తించాలి." నిజంగా మంచి మాట చెప్పారు. అనువాదాలు, మొలకలు విస్తరణలలో నావరకూ నేను నాకున్న పరిధిలో ఎంతో కొంత అయినా ఇకనుంచి క్రియాశీలకంగా వుండాలని నిర్ణయం తీసుకొంటున్నాను.

--Vmakumar (చర్చ) 16:23, 17 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మహెష్ కుమార్ గారూ, మీరు క్రియాశీలకంగా వుండాలని నిర్ణయం తీసుకున్నందుకు సంతోషిస్తున్నాను. మీరు ఎక్కువగా చర్చలలో పాల్గొనలేరంటున్నారు కాని ఈ చర్చలో మీ అభిప్రాయాలు చూస్తే పూర్తి తెవికీ పరిపక్వత కలిగి హుందాతనంతో ఉన్నాయి. మీ రాకతో చర్చలలో ఇదివరకున్న ధోరణులు నశిస్తాయనీ, హుందాతనం పెరుగుతుందనీ ఆశిస్తున్నాను. ఈ చర్చలో మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలతో కూడా నేను ఏకీభవిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:28, 17 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
సి. చంద్ర కాంత రావు గారికి మీ అభిమానానికి కృతజ్ఞతలు. ప్రజాస్వామిక స్ఫూర్తితో మరింతగా కృషి చేస్తాను. --Vmakumar (చర్చ) 02:50, 18 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Vmakumar గారూ, మీరు నన్ను నొప్పించలేదు. నేను వోటేసిన వాళ్ళను ఏమీ అనలేదు అన్న సంగతి మీరు గ్రహిస్తే అది చాలు నాకు. కానీ గొప్పవిషయమేంటంటే సార్..
"ఎన్నో కొన్ని అనువాద వ్యాసాలు నేను కూడా చేసివుండాల్సింది అనిపించింది." అని అన్నారు చూసారూ.. అది చాలా ఆదర్శవంతమైన మాట. చప్పట్లు! అందరూ ఆచరించాల్సిన మాట అది. పరికరం చేసే అనువాదం ఎలా ఉంటుందో, అవి సరిచెయ్యకుండా ప్రచురించేస్తే ఎంత అపరిపక్వంగా ఉంటుందో ఆ పరికరాన్ని వాడితే బాగా తెలుస్తుంది. (మచ్చుకు ఇది చూడండి సార్. 1% మాత్రమే మానవికంగా చేసారు, మిగతా 99% యాంత్రికానువాదమే. ఇది 30% పరిమితి విధించడానికి ముందు చేసిన అనువాదం.) __చదువరి (చర్చరచనలు) 04:18, 18 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
@Vmakumar: గారూ, అనువాద ఉపకరణాన్ని వాడతానని మీరు ముందుకు రావడం, విషయాన్ని సరళంగా, అర్థం చేసుకోవడం చాలా చాలా బావుందండీ. ఇక్కడ నేను అనువాద ఉపకరణంతో వ్యాస రచన చేసేందుకు ఒక ఋతువు ప్రారంభించుకోవాలన్న ఆలోచన పంచుకున్నాను. మీరూ చూసి ఓ ముక్క రాస్తారని, భవిష్యత్తులో ఆ అనువాద ఉపకరణపు వ్యాస రచన ఋతువులో భుజం భుజం కలిపి చక్కని అనువాదాలు మనం చేస్తామని ఆశిస్తున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 04:22, 18 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
@Vmakumar: గారూ, ఎక్కడైనా ఏదేని విషయంలో ఇరుపక్షాల మధ్యన జరిగిన చర్చల్లో సయోధ్య కుదరకపోతే, ఇరువురికి సంబంధించిన మధ్యవర్తులు నిర్ణయం ప్రకటిస్తారన్న విషయం మనందరికీ తెలుసు. ఇక మీరు తెవికీ చర్చలను పార్లమెంట్ చర్చలతో పోల్చారు, బాగుంది. కానీ ఇక్కడ మీకో విషయం గుర్తు చేయదలచాను. పార్లమెంటులో ఇరు సభలకు సభాపతులు ఉంటారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత సభాపతి నిర్ణయం తీసుకుంటారు కానీ, ప్రతిపాదన చేసినవారే నిర్ణయం ప్రకటించి ఓటింగ్ కు వెళ్ళరు. కానీ ఇక్కడ ప్రతిపాదన చేసినవారే నిర్ణయం ప్రకటించి ఓటింగ్ కి వెళ్ళారు. మరి ఇదేం విధానమో మీరే చెప్పాలి. ఇదంతా తెలుసుకోకుండా సభ్యులు ఈ ఓటింగ్ లో పాల్గొనడం ఏంటి అనేదే మా వాదన. అంతేకానీ, ఓటింగ్ లో పాల్గొన్న సభ్యులను చిన్నచూపు చూడలన్నా ఉద్దేశ్యంకాదు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:23, 20 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చర్చలో పాల్గొనలేనపుడు తరువాత దశలో ఓటు వేయడాన్ని పాయింట్ అవుట్ చేయవచ్చా?[మార్చు]

చర్చలు ముగిసిపోయాయి. ఓటింగు ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. దీనిపై అప్పడు జరిగిన చర్చలో వీలుని బట్టి కొందరు సభ్యులు పాల్గొంటారు. కొందరు పాల్గొన లేకపోవచ్చు. చర్చలో పొల్గొనలేకపోవడానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయి కదా. దానిని పాయింట్ అవుట్ చేయడం భావ్యం కాదు. ఒక చర్చలో ఎవరెవరు ఏ, ఏ అభిప్రాయాలు వెలిబుచ్చారు. వాద ప్రతివాదనలను ఆ చర్చ ముగిసిన తరువాత అయినా సభ్యులు తెలుసుకొనే అవకాశం వుంది. ఓటింగు ప్రక్రియలో పాల్గొనే వారు ఆ విధంగా తెలుసుకొని కూడా ఓటింగ్ లో పాల్గొనవచ్చు. అయితే తీరా వోటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నప్పుడు, చర్చలో అప్పుడు వాళ్ళు participate చేయలేదు అనే పాయింట్ రాకూడదు. ఉదాహరణకు పార్లమెంట్ చర్చలు చూడండి. ఒక అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు, అనుభవజ్ఞులు, ఆ సబ్జెక్టు మీద కమాండ్ వున్న సభ్యులు మాత్రమే చర్చలో వాడి,వేడిగా పాల్గొనడం చూస్తాం. మిగిలిన సభ్యులు తమకు ఆశక్తి ఉన్నమేరకు మాత్రమే చర్చలో పాల్గొంటారు. లేదా సభకు గైరుహాజరు కూడా అవుతారు. అయితే చర్చానంతరం వోటింగ్ నిర్వహించినపుడు సభ్యులందరికి (చర్చలో పాల్గొన్న వారికి, పాల్గొనని వారికి కూడా) సమానస్థాయిలో వోటింగ్ హక్కు ఉంటుంది. చర్చలో పాల్గోలేదని, అనుభవం లేదని, కొద్ధి అనుభవం వున్న సభ్యులు కూడా ఓటింగులో పాల్గొన్నారని ... సంబంధిత టెక్నాలజీ పరికరం వాడని/తక్కువ వాడి ఓటింగులో పాల్గొన్న వారని ... ఇలా ఓటింగులో పాల్గొన్నందుకు తోటి సభ్యులను అనుభజ్ఞులైన నిర్వాహకులు చిన్న చూపుగా చూడటం.... ఇబందిగా వుంది.

సర్ చర్చలో పాల్గొనడం వేరు. ఓటింగులో పాల్గొనడం వేరు. ఈ విషయం మీద నాకు తెలిసిన రెండు విషయాలు చెపుతాను. చర్చ (డిబేట్) అనేది ప్రాధమికంగా Exchange of different opinions. కానీ ఓటింగ్ అనేది choosing of a particular opinion. డిబేట్ లో అంతిమంగా వెలువడేది కేవలం ఒపీనియన్ మాత్రమే. ఏకాభిప్రాయం, మెజారిటీ అభిప్రాయం, భిన్నాభిప్రాయం ... ఇలా ఏదైనప్పటికీ, చర్చలో వెలువడేది అభిప్రాయం మాత్రమే. అభిప్రాయాలను ఎక్స్చేంజి మాత్రమే చేయగలం కానీ ఒక నిర్ణయంగా ప్రకటించలేము. డిబేట్ లో ఒక అభిప్రాయం కేవలం వోటింగ్ తోనే నిర్ణయంగా మారుతుంది. చట్టబద్దత అనేది నిర్ణయాలకు ఉంటుంది కానీ అభిప్రాయాలకు ఉండదు. అందుకే డిబేట్ లో అంతిమంగా వెలువడిన ఏ అభిప్రాయానికి అయినా చట్టబద్దత కలిగించడానికి, ఆ డిబేట్ చివరలో వోటింగ్ నిర్వహిస్తారు. ఒక చర్చలో మొత్తం సభ్యులందరు పాల్గొన్నప్పటికీ ఆ చర్చా ఫలితం మొత్తం సభ్యులందరికీ శిరోధార్యం కాబోదు ఎందుకంటే ఆ చర్చా ఫలితం ఏదో ఒక రూపంలో వున్న ఒపీనియన్ మాత్రమే. ఒక చర్చానంతరం ఓటింగులో కొద్దిమంది మాత్రమే (Quorum ఉండాలి) పాల్గొని ఓటు వేసినప్పటికీ ఆ ఓటింగ్ ఫలితాన్ని (ఓటు వేసిన, వేయని సభ్యులతో సహా) మొత్తం సభ్యులందరూ శిరసావహించాల్సిందే. ఎందుకంటే అది నిర్ణయం రూపంలోకి మారిపోయింది కాబట్టి. వికీపీడియాలోనే కాదు, ఎవరైనా సామరస్యంగా ఉంటుందని డిబేట్ వరకూ సూచిస్తారు. చర్చ వాడి, వేడిగా కొనసాగినపుడు మాత్రం వోటింగ్ ను సూచిస్తారు. అయితే law of natural justice ప్రకారం వోటింగ్ కు ముందు ఒక చర్చ జరగడం తప్పనిసరి చేస్తారు. వికీలో కూడా చర్చ జరిపి ఆ తర్వాత ఓటింగ్ చేపట్టవచ్చు అనే నియమం ఉందని పెద్దలు కూడా చెపుతున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న వోటింగ్ కు ముందుగా ఒక చర్చ జరిగింది. అయితే చర్చలో విస్తృతంగా పాల్గొన్న అనుభవజ్ఞలైన సభ్యులు ఇది చర్చతోనే ఆగిపోవాలని ఎందుకు అంతగా కోరుకుంటున్నారు? వోటింగ్ కు ఎందుకు కాదంటున్నారు. --Vmakumar (చర్చ) 01:42, 17 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Vmakumar గారూ, మీ అభిప్రాయంతో చాలావరకు ఏకీభవిస్తున్నాను. ఒకే ఒక్క విషయంలో మీ అభిప్రాయంతో విభేదిస్తాను. వికీపీడియా ఫక్తు ప్రజాస్వామ్యం కాదు.. పార్లమెంటులో జరిగే డిబేట్లు, వోట్లూ.. పద్ధతి ఇక్కడ అనువైనది కాదు. ఇక్కడ మనం వెలిబుచ్చే అభిప్రాయాలే ప్రధానం. అభిప్రాయంతో కూడిన వోటుకు ఎప్పుడూ విలువ ఎక్కువే. అభిప్రాయం లేని వోటు కంటే అభిప్రాయానికే విలువ ఎక్కువ. (నేను ఇక్కడ వోటేసిన వాళ్లను ఏమీ అనడంలేదు. నాకు వాళ్లపై దురభిప్రాయమేమీ లేదు) __చదువరి (చర్చరచనలు) 05:14, 17 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఒక మార్పు-సామరస్యంగా, పూర్తి ఆశావాదంతో పయనిద్దాం[మార్చు]

సర్, ఓటు హక్కు సభ్యులకు కల్పించబడినప్పుడు, మన అభిప్రాయాలు మనకు వున్నట్లే, ఇతర సభ్యులకి కూడా వాళ్ళ అభిప్రాయాలు వాళ్లకి ఉంటాయి. మన అభిప్రాయాన్ని మనం ఎంత విలువ ఇస్తున్నామో, ఎంత బలంగా నమ్ముతున్నామో, ఇతరులు కూడా తమ అభిప్రాయాలని అంతే బలంగా నమ్ముతారు. వారి వారి అభిప్రాయాలకి తగ్గట్లే ప్రతీ సభ్యుడు ఓటు వేస్తాడు. మెజారిటీ బట్టి గెలుపోటములు నిర్ణయమవుతాయి. డెమోక్రసీ లో ఇంత సింపుల్ గా ఉండాల్సిన విషయంలో చర్చ జరిగిపోయి వోటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు sarcastic comments దేనికి అనేదే నా బాధ? రచ్చబండలో ఇలాంటివి తప్పుగాకపోవచ్చు. సాధారణ సభ్యులు ఆవేదనతో ఆక్రోశంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఒకలా అర్ధం చేసుకోవచ్చు. అయితే మార్గదర్శకులుగా ఉండాల్సిన నిర్వాహకులు కూడా సంయమనం కోల్పోతున్నారు అన్నదే నా అభిప్రాయం. ఒకవైపు ప్రతిపాదకుడు నిదానంగా, హుందాగా తన పని చేసుకుపోతున్నారు. సందేహాలకు సమాధానాలిస్తూ వున్నారు. చర్చ ముగిసిన తరువాత ఎవరినీ నొప్పించే వ్యాఖ్యలు చేయలేదు. ఆవేశాలకు, భావోద్వేగాలకు అసలు లోను కాలేదు. తాను నమ్మిన ఒక విధానం తెలుగు వికీకి మంచి చేస్తుంది అనే అభిప్రాయంతో చర్చకు పెట్టారు. చర్చలో లేవనెత్తిన ఒకానొక అభ్యంతరాన్ని కూడా పరిగణించి, దానిని సవరణగా ప్రతిపాదనలో భాగంగా చేశారు. చర్చలో పాల్గొన్న 10 మంది సభ్యులలో అత్యధికం ఆయనకు మద్దతు పలకక పోవచ్చు. కానీ ఒక ప్రతిపాదకుడు తాను నమ్మిన ప్రతిపాదన తెలుగు వికీకి మంచి చేస్తుంది అని త్రికరణశుద్ధిగా నమ్మినపుడు, అతని ప్రతిపాదనకు చర్చలో మద్దతు దొరకనప్పుడు ప్రతిపాదకునిగా ఆయనకు వున్న ఆప్షన్ ఏమిటి? మరింత విస్తృత స్థాయిలో (ఓటింగు స్థాయిలో) మద్దతు కోరడం తప్ప. డెమోక్రాటిక్ వే లోనే వోటింగ్ లో పెట్టారు. అయితే అది టెక్నికల్ గా తప్పు అని కొందరికి అనిపించవచ్చు. కాదనలేము. ఎవరి అభిప్రాయం వారిది. అయితే ఇంతకూ ముందు చెప్పినట్లుగా "అభిప్రాయం" (opinion), "నిర్ణయం" రెండూ వేర్వేరు. నావరకూ "నిర్ణయమే" శిరోధార్యం. ఆ స్టేటస్ రావాలంటే చర్చ అనంతరం వోటింగ్ జరిగి తీరాలి. అయితే ప్రతిపాదకుడు natural justice పాటించారా లేదా అని చూసినపుడు అదీ పాటించారు. టెక్నికల్ aspects అనేవి మధ్యవర్తి, లేదా విశేష అనుభవజ్ఞులు తేల్చుకోవాలి. అది ఓటర్ల సమస్య కాదు. ఇద్దరూ (ప్రతిపాదకుడు, వ్యతిరేక అభిప్రాయకులు) నిర్వాక స్థాయిలో విశేషమైన అనుభవజ్ఞులే. ఒక rule position మీద వివాదం వచ్చినపుడు, తటస్థంగా వున్నవారు, ఆయా రూల్స్ గురించి ఎక్కువ అవగాహన వున్నవారు, ఒకప్పుడు నిర్వాహకులుగా వున్న అనుభవజ్ఞులు చెప్పినదే మిగిలిన సభ్యులకు, ముఖ్యంగా మాబోటివారికి ఆమోదయోగ్యంగా కనిపిస్తుంది. అనుభవజ్ఞులైన చంద్రకాంతరావుగారు ఓటింగుకు ముందు చర్చ జరపడం ముఖ్యం అని, చర్చ జరిపి ఆ తర్వాత ఓటింగ్ చేపట్టవచ్చుననీ నియమం స్పష్టంగా ఉందని చెప్పడం జరిగింది.

సర్, ప్రతీ ప్రతిపాదన తప్పనిసరిగా ఒక మార్పును కొనితెస్తుంది. అయితే భవిష్యత్తులో అది మంచికా చెడుకా ఎలా పరిణమిస్తుంది అనేది ముందుగా ఎవరూ చెప్పలేరు. పాత అనుభవం మీద అనుభవజ్ఞులు అది తప్పనిసరిగా చెడు చేస్తుందేమో అని ఆందోళన చెంది మద్దతు తెలపలేదు. కానీ ప్రతిపాదకునికి తన ప్రతిపాదన ఒక మంచి చేస్తుందని బలంగా నమ్ముతున్నారు. అటువంటప్పుడు తన ప్రతిపాదనను ఓటింగుకు ప్రవేశపెట్టడం ద్వారా మరింత విశాల పరిధి ముందుంచి తీర్పును కోరుతున్నారు అనిపిస్తుంది. అభిప్రాయాలూ అవతలివాళ్లకూ గట్టిగానే ఉండవచ్చు. అయితే ఎవరి ప్రతిపాదనకు ఎంత మద్దతు వుంది అన్నది వోటింగ్ లోనే కదా తేలుతుంది. ఈ రోజు వోటింగ్ ప్రక్రియ బట్టి ఒక ప్రతిపాదన గెలవవచ్చు లేదా వీగిపోవచ్చు. ఏది ఏమైనా దానివలన వికీలో ఎంతో కొంత మార్పు తప్పనిసరిగా వస్తుంది. అది వికీకి మున్ముందు లాభదాయకంగాను ఉండవచ్చు. లేదా నష్టదాయకంగాను ఉండవచ్చు. అయితే అలా సంభవించే మార్పు ఏ విధంగానూ తెలుగు వికీకి లాభదాయకంగా ఉండదు అని ముందుగానే అనుకొంటే ఎలా? అన్నదే నా ప్రశ్న వచ్చే కొత్త మార్పు వికీకి నష్టంగానే పరిణమిస్తుందేమో? నాణ్యత లేని వ్యాసాలూ అసాంఖ్యకంగా వెల్లువెత్తుతాయేమో? దాని నుంచి మనం ఇక కోలుకోలేం. ఇతర వాడుకరులు ఎవరూ మనకు సాయం రారు. దానికి పరిష్కారాలు వెతుక్కోవడంలోనే మా పుణ్యకాలం గడిచిపోతుంది. చురుగ్గా వున్న మాపైనే భారం పడుతుంది. ఎవరూ భారం వహించరు. వికీ వ్యాస నాణ్యతా భారం మేమే మోయాల్సి ఉంటుంది. మాకు పనిభారం పడుతుంది. ...... ఇలా పరిపరివిధాల ముందే భావించుకొని, ఆ మార్పుకి వ్యతిరేకంగా ఉన్నచోటనే కోట కట్టుకొని ఉండిపోతామంటే, అటువంటిది పిస్సిమిస్టిక్ ధోరణి అవుతుంది. నా వరకు నేను, అటువంటి ధోరణికి ఆమడదూరం వుంటాను. ఆ ధోరణిలో ఆలోచిస్తూ పొతే ఇక మనం సరిగ్గా ముందుకి అడుగులు వేయలేం. ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉంటాం. మహా కృషి చేస్తే బోదకాలుతో పరుగెడుతున్నట్లు, ఇసుకలో నడుస్తున్నట్లు తెలుగు వికీ పరుగు ఉంటుంది అన్నది నా నిశ్చితాభిప్రాయం. అంతే తప్ప ఎవరినీ ప్రత్యేకంగా నొప్పించాలని కాదు. ఎవరికీ మద్దతుగా కాదు. ఎవరినీ విమర్శిస్తూ కాదు.

The debate on the subject is already over. Therefore let the voters assess the situation with a free mind so that they arrive at the right decisions. Whatever may be the result, a good policy for the wiki will be adopted by voting in a democratic way.

The current proposal may or may not succeed. No one can predict the result but no need to worry about this result. The policy now decided by the majority can be reviewed at any time in the future depending upon the merits and demerits. There is always a chance to review a policy again and again in the future depending on its outcome. There is no hurdle for it. But ఐ personally request the Senior Wikipedians not to hurt those who stand in support of a particular proposal by passing sarcastic comments.

Finally, No one can predict the voting result. No one can predict whether the change comes or not. But if the change is inevitable and it is standing before us, everyone must have the mental maturity to welcome such change with an OPTIMISTIC approach. నమస్తే --Vmakumar (చర్చ) 03:01, 17 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఖచ్చితంగా Vmakumar గారూ, ఆశావాదంతో ముందుకు పోదాం. నేను నిరాశావాదిని కాను, ఆశావాదిని. వాస్తవిక వాదిని. చుట్టూ ఏం జరుగుతోందో చూసి వాటి వెనక ఏముందో, అది ఎందుకు జరుగుతోందో అవగాహన చేసుకోగలిగిన వాణ్ణి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించుకోవాలి - "మార్పు ఏ విధంగానూ తెలుగు వికీకి లాభదాయకంగా ఉండదు అని ముందుగానే అనుకొంటే ఎలా?" అనే మీ ప్రశ్నకు అసలు అస్కారమే లేదు. ఎందుకంటే, 30% పరిమితి తీసేస్తే అది వికీని ఎలా ప్రభావితం చేస్తుంంది అనేది ఊహించనక్కర్లేదు. మన ముందు ఉండగా ఊహించడమెందుకు?
 • మనం 30% పరిమితి విధించక ముందున్న పరిస్థితిని చూసాం. ఆ అనుభవం మీకు ఎలా ఉందో వెనక్కి తిరిగి చూసుకోండి. (మచ్చుకు కావాలంటే రచ్చబండలో నేను పెట్టిన జాబితాను పరిశీలించండి.)
 • 30% పరిమితి విధించాక ఉన్న పరిస్థితిని కూడా చూసాం. ఈ రెండో అనుభవం మీకు ఎలా ఉందో కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది. (మచ్చుకు కావాలంటే రచ్చబండలో నేను పెట్టిన జాబితాను పరిశీలించండి.)
ఈ రెంటినీ బేరీజు వేసుకోండి, చాలు. ఏదేమైనప్పటికీ, సముదాయ నిర్ణయం మనందరికీ శిరోధార్యం. ఆ నిర్ణయం ప్రతికూల ప్రభావం కలిగిస్తే ప్రతికూలతను తగ్గించుకుని దాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కోర్స్ కరెక్షను చేసుకుందాం (ఒకవేళ ఆ పరిమితిని ఇప్పుడు తొలగిస్తే, మళ్ళీ ఆ పరిమితిని విధించుకోవాలి అనేది నా ఉద్దేశం కానే కాదు. ఉన్న పరిస్థితిని మెరుగు పరచుకునే మార్గాలను చూసుకోవాలి.) ప్రతిపాదన పెట్టడం తోనో, దానిపై చర్చలో పాల్గొనడంతోనో, వోటు వెయ్యడం తోనో, మన బాధ్యత తీరిపోదని మాత్రం మనందరం గుర్తించాలి. __చదువరి (చర్చరచనలు) 05:47, 17 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఓటింగ్ పద్ధతి సరిగా లేదు, ఓటింగ్‌ కి పెట్టిన విషయమూ సరిగాలేదు[మార్చు]

నేను ఎన్నో అనువాదాలను ఈ ట్రాన్సలేషన్ టూల్ వాడి చేశాను. అనువాదం చేసేప్పుడు యాంత్రిక అనువాదం మీద ఆధారపడకూడదని చెప్పను కానీ వాక్యాలను చాలా వరకూ మార్చేయవలసి వస్తుంది. గూగుల్ అనువాదం ఎంత తప్పుల తడకతో ఉంటుందో గతంలో గూగుల్ అనువాద వ్యాసాల్లో చూడడమే కాదు ఈనాటికీ ఎవరైనా అనువాదం చేసుకుని గమనించవచ్చు. చదువరి గారు కనీసం 30 శాతం మార్చితే కానీ ఆ అనువాదాన్ని టూల్ నుంచి ప్రచురించలేమన్న నియమం పెట్టడం చాలా అనుభవంతో చేసిన సరైన పని అని నా అభిప్రాయం. అటువంటిది ఆ నిబంధన తొలగించాలనడం ఒక పొరబాటు, అది తీసేసి కొత్తగా వచ్చిన వాడుకరులకు మాత్రమే ట్రాన్సలేషన్‌ టూల్ తో చేసిన అనువాదాలు నేరుగా మొదటి పేరుబరిలో ప్రచురిచనివ్వకూడదనడం మరో పొరబాటు. ఎందుకంటే, నేను 2015లో ఇక్కడికి వచ్చాను. వచ్చేనాటికే నేను ఎంతో భాష నేర్చుకునే వచ్చాను. అదే 2020లో వస్తే ఈ నిబంధన ప్రకారం నాకు భాష రాదన్నట్టు, నేను నేరుగా ప్రచురించకూడదన్నట్టు అవుతుంది కదా. అలాగే ఎందరో అనుభవజ్ఞులు తప్పులు చేయవచ్చు. ఇక చర్చ ఆసాంతం చదివితే ఈ ప్రతిపాదనలు ఇప్పటికే తిరస్కరణ పొందాయని తెలుస్తోంది. అలాంటప్పుడు ఓటు ఎందుకు వేయాలంటూ ఓటింగ్ ప్రక్రియను తిరస్కరిస్తున్న సభ్యుల నిర్ణయం చాలా సముచితం, న్యాయం. కానీ, అలాగని ఊరుకుంటే ఈ ప్రతిపాదనలు గెలుస్తాయి. కాబట్టి, నేను ఈ ఓటింగ్ ని తిరస్కరిస్తూనే ప్రతిపాదనలో వ్యతిరేక ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను. ఆలస్యంగా ఈ చర్చ చూడడం చాలా పెద్ద పొరబాటయింది. కనీసం, ఇప్పటికైనా నా వ్యతిరేకతను నమోదు చేయగలగడం సంతోషంగా ఉంది. --Meena gayathri.s (చర్చ) 11:11, 20 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నేను, మా కళాశాలలోని కొంతమంది విద్యార్థులు క్రిందటి రెండు సంవత్సరాల నుండి తెలుగు వికీపీడియా లో అనువాదం చేస్తున్నాము. డిసెంబర్,2019 లో మేము ఒక తెలుగు వికీపీడియా కార్యక్రమం లో పాల్గొన్నాము. కానీ మాకు తెలుగు భాష లో అంత అవగాహన లేకపోవడం చేత కొన్ని తప్పులు జరిగాయి. అందుచేత మేము అనువాదం చేసిన వాక్యాలు తెలుగు వికీపీడియా లో నుంచి తొలగించబడ్డాయి. అదే ఆ సమయం లోనే ఈ 30 శాతం నిబంధనం ఉన్నట్లయితే మా వ్యాసాలు పూర్తి నాణ్యతతో ప్రసురించబడేయి. ఈ నిబంధన వాళ్ళ వ్యాసాల యొక్క నాణ్యత పెరగడం తో పాటు, కొత్తగా అనువాదం చేసేసవాళ్ళకి చాల ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కావున ఈ నిబంధన తొలగించేందుకు నేను వ్యతిరేకత తెలుపుతున్నాను. --Mekala Harika (చర్చ) 13:07, 20 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

గతంలో చేసిన గూగుల్ అనువాద వ్యాసాలను, ట్రాన్సలేషన్ టూల్ తో అనువాదం చేసిన వ్యాసాలను నేను కూడా చూశాను. అందులో భాష సరిగా లేదు. మరి అలాంటప్పుడు ప్రస్తుతం ట్రాన్సలేషన్ టూల్ లో ఉన్న 30 శాతంని తగ్గిస్తే అప్పుడు రాసే వ్యాసాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు. ఓటింగ్ పద్ధతిలో, ఓటింగ్‌ కి పెట్టిన విషయంలో Meena gayathri.s గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ట్రాన్సలేషన్ టూల్ అనుభవం ఉన్న వికీ సభ్యులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. అయినా ఓటింగ్ పెట్టారు. ఆ ప్రతిపాదనకు, ఈ ఓటింగ్ కు నేను కూడా వ్యతిరేకమే. కాబట్టి, ఈ ఓటింగ్ ని తిరస్కరిస్తూనే, ప్రతిపాదన గెలవకుండా వ్యతిరేక ఓటు వేయాలనుకుంటున్నాను.--Nagarani Bethi (చర్చ) 14:05, 20 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఓటు ఫలితం పై అభ్యంతరాలు[మార్చు]

క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి. ముగింపు అభిప్రాయాల సారాంశం(సందర్భాన్ని బట్టి), చర్చ ముగింపు కారణం క్రింద ఇవ్వబడింది..
అభ్యంతరాలపై చర్చ ముగిసింది. పాల్గొన్న అందరికి ధన్యవాదాలు. అభ్యంతరాలను పరిశీలించి ఫలితం సవరించబడింది అర్జున (చర్చ) 07:15, 29 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఓటు ప్రక్రియలో పాల్గొన్న సభ్యులందరికి ధన్యవాదాలు. ఓటు ప్రక్రియ ఫలితం పై అభ్యంతరాలున్నవారు మూడు రోజులలో అనగా 2020-09-24 లోపు తమ అభ్యంతరాలు తెలియచేయవలసినది. --అర్జున (చర్చ) 08:48, 21 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అనుకూలంగా వోటు వేసిన వారిలో వాడుకరి:Ramu ummadishetty, వాడుకరి:HarshithaNallani లు ఓటు చేయలేదు. అవి అనామక వాడుకరులు చేసిన దిద్దుబాట్లు అని గమనించగలరు. అనుకూలంగా 13 ఓట్లు వచ్చాయి.--కె.వెంకటరమణచర్చ 11:39, 21 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. దానికి అనుగుణంగా ఫలితం సవరించాను.--అర్జున (చర్చ) 22:54, 21 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అర్జున గారు,"ఇద్దరి (Naga sai sravanth, Vinny2020) ఓట్లు 2020-06-30 నాటికి 100 సవరణలు చేయని కారణంగా చెల్లవు" అని మీరు రాసారు. ఇందులో వాడుకరి:Naga sai sravanth 2019, డిసెంబరు 8 నాటికే 107 మార్పులు చేసి ఉన్నారు. మరీ, అతని పేరు 100 మార్పులు చేసిన వాడుకరులు జాబితాలోకి ఎందుకు చేరలేదో, ఆయన ఓటు వేసిన తరువాత అతని మార్పులు ఎన్ని ఉన్నాయో అని చూడకుండా అతని ఓటు చెల్లదు అని ఎలా ప్రకటించారు.
అలాగే, వాడుకరి:Ramu ummadishetty, వాడుకరి:HarshithaNallani ల సంతకాలు వారివారి ఖాతాలనుండి కాకుండా అనామకంగా పేర్లు, సమయం చేర్చారు. వికీ సభ్యులు కె.వెంకటరమణ గారు ఆ విషయం చెప్పేవరకు కూడా మీరు గ్రహించలేదు. ఇది పక్కన పెడితే, అసలు వాళ్లిద్దరూ వారివారి ఖాతాల నుండి కాకుండా అనామకంగా పేర్లు, సమయం ఎందుకు చేర్చాల్సివచ్చింది? ఆ పని వారే చేసారా, లేకా ఇంకెవరైనా చేసారా? ఇంకెవరైనా చేస్తే ఆ చేసినవారు ఎవరు, ఎందుకు చేశారు? లాంటివి మీరు ప్రస్తావించలేదు. అనామకంగా పేర్లు, సమయం చేర్చడమనేది వికీపీడియాను, వికీ సభ్యులును తప్పుతోవ పట్టించేందుకు చేసిన పనిగా నేను భావిస్తున్నాను. ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో మరలా పునరావృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, దీనికి బాధ్యులు ఎవరో కనిపెట్టి వారిమీద చర్య తీసుకోవాలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీటికి మీ స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అలానే, ఓట్లు వేసినవారి ఖాతాలను, వారివారి మార్పులను మరొక్కసారి పరిశీలించి తుది ఫలితాలను ప్రకటించాలని కూడా కోరుతున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:50, 22 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ప్రణయ్‌రాజ్ వంగరి గారూ, ఆయన చేసిన రచనలు 115 ఐనప్పటికీ, అందులో పదిహేనింటిని తొలగించారు. వోటింగు ముందు వరకు ఆయన చేసిన మొత్తం రచనలు 114. ఆ విధంగా ఆయన వోటింగులో పాల్గొనేందుకు అర్హుడే. కానీ 15 తొలగింపులు తీసేస్తే లైవు దిద్దుబాట్లు తొంభైతొమ్మిదే అవుతాయి. ఆవిధంగా వోటింగుకు అర్హుడు కాదు. మరి వోటింగు అర్హతల్లో లైవు దిద్దుబాట్లు అనే ముక్కైతే లేదు. అర్జున గారు ఏం చెబుతారో చూడాలి.
పోతే, అర్జున గారూ, కె.వెంకటరమణ గారు చూపినది చిన్న విషయం కాదు. అది ఇంపర్సనేషను. వోటింగు వెయ్యాల్సింది, సంతకం ద్వారా. కానీ ఇక్కడ ఒక అజ్ఞాత వ్యక్తి ఒక వాడుకరి పేరును సంతకం రూపంలో (సంతకం చేసినపుడు సాఫ్టువేరు వెయ్యాల్సిన టైం స్టాంపును కూడా వాళ్ళే వేసారు) రాసారు (ఫోర్జరీ చేసినట్లే). అది దుశ్చర్య. అది ఆయా వాడుకరులే చేసి ఉంటే వారిపై చర్య తీసుకోవాలి. మరెవరైనా చేసి ఉంటే వారిపై చర్య తీసుకోవాలి. మీరు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలను కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 09:14, 22 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
User:Pranayraj1985, చదువరి గారి వివరణే సరియైనది. గణించే తేది నాటికి వికీలో ప్రత్యక్షంగా వున్న వాడుకరి రచనలు అదేశంలో కనబడేయే స్క్రిప్ట్ ద్వారా కూడా లెక్కించడం జరిగింది. ఓటింగు ప్రక్రియ ప్రారంభంలోనే అర్హులైన వాడుకర్లను ప్రకటించడం జరిగింది. ఓటు ప్రక్రియ ముగింపుకు ముందు అభ్యంతరం రాలేదు కావున, ఇప్పుడు వేరేగా లెక్కించనవసరంలేదు. అయినా ఇంతమేరకు పద్ధతిలో స్పష్టం చేయాల్సిన అవసరం వుంది. దీనిని పద్ధతి చర్చాపేజీలో చేర్చాను. అక్కడ చర్చలో మీ అభిప్రాయాలు తెలిపి, పద్ధతి మెరుగుపరచడానికి సహాయం చేయండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 22:46, 22 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
User:Pranayraj1985 గారు, చదువరి గారు,కె.వెంకటరమణ గార్లకు కొంతమంది అనామకంగా వికీసంతకం రూపంలో చేర్చటం నేను గమనించక తొలిగా వారిని లెక్కించాను. ఓటు వేసిన వారు అర్హత వుందాలేదా అని ధ్యాస పెట్టాను కాని సరిగా వికీసంతకం చేశారా అని చూడలేదు. అది నా పొరబాటే. వెంకటరమణ గారు తెలిపిన తరువాత ఫలితాన్ని సవరించాను. ఇక మీరు అనుకున్నట్లుగా దొంగ వోటు వేసినట్లుగా నేను భావించడంలేదు. కనీస అర్హత 100 వోట్లుగా వున్నందున వికీసంతకం గురించి అవగాహన తక్కువగా వుండడం వలన కొంత మంది చర్చలలో పాల్గొనకపోవటం, లేక కొత్తగా ఓటు ప్రక్రియలో పాల్గొంటున్నందున, సాధారణంగా చర్చా పేజీలలో మాత్రమే వికీసంతకం చేయాలనే సూచనలున్నందున కూడా ఇలా జరిగి వుండవచ్చు. దీనిపై వివరణ ఇవ్వమని వాడుకరి:Ramu ummadishetty, వాడుకరి:HarshithaNallani గారిని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 23:29, 22 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, వోటెయ్యడానికి వికీవిజ్ఞత ఉండనక్కర్లేదన్నారు, అభిప్రాయం చెప్పనక్కర్లేదన్నారు. లాగినవకుండా సంతకాన్ని "రాసేసినా" తప్పుకాదని ఇప్పుడంటున్నారు. 389 దిద్దుబాట్లు చేసినవాళ్ళకు, 510 దిద్దుబాట్లు చేసినవాళ్ళకు లాగినవ్వాలని కూడా "తెలియదని" అనుకోవాలా? 100 వోట్ల కనీసార్హత ఎందుకు సార్? కనీసం ఇందులో దుశ్చర్య ఏమైనా ఉందేమోనని భావించరు కూడానా? బాగుంది ఈ వోటింగు, ఈ నిర్వహణ!__చదువరి (చర్చరచనలు) 01:10, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారు, అనామక వాడుకరుల ఓట్లను లెక్కించబడవని ఓటు ప్రక్రియ ప్రారంభంలోనే తెలపడం జరిగింది. అలానే ఫలితం పద్ధతి ప్రకారమే సవరించబడింది. కావున దుశ్చర్య జరిగినా ఖరారయ్యే ఫలితం ప్రభావితం కాదు. కొత్త పద్ధతి ఏర్పడడానికి నేపథ్యం, ఏర్పడిన తీరు, అమలు పరచిన తీరు మీరు పూర్తిగా అర్ధంచేసుకోలేకపోతున్నారనుకుంటున్నాను. పద్ధతి పరిపూర్ణం అని ఎక్కడ చెప్పలేదు. నిరంతరం మార్పులు జరిగే వికీలో ఏది పరిపూర్ణం కాదు. పద్ధతిగురించి గతంలో మీరు సందేహాలు లేవనెత్తారు. వాటికి చర్చించడం జరిగింది. అది సరికాదు అనుకుంటే దానిని వాడే రద్దుచేయటానికి నాకేమి అభ్యంతరం లేదని మీకు ఇతరులకు సూచించడం జరిగింది. పద్ధతి అమలులో వున్నప్పుడు సందేహాలుంటే పద్ధతి ఏర్పడడంలో, గతంలో అమలు చేయటంలో పాల్గొన్నవారిని అడిగి తెలుసుకోవాలి. లేక పద్ధతి అమలు జరిగిన తరువాత అభ్యంతరాలను పద్ధతిని మెరుగు చేయడం కొరకు చర్చించాలి. కావున మీ విలువైన అభిప్రాయాలను వికీపీడియా చర్చ:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి లో చర్చించండి . --అర్జున (చర్చ) 22:55, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వాడుకరి:Ramu ummadishetty, వాడుకరి:HarshithaNallani గారి చర్చా పేజీలలో వ్యాఖ్య చేర్చి స్పందించమని కోరాను.--అర్జున (చర్చ) 00:47, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, మరొక సంగతి.. వోటింగులో పాల్గొనమని అభ్యర్ధిస్తూ కొందరు వాడుకరులకు ఈమెయిళ్ళు వెళ్ళాయట. మీరు రాసారా? రాస్తే, వోటేసిన వాళ్లలో ఎవరెవరికి రాసారు, ఎవరికి రాయలేదు? ఈమెయిళ్ళు రాయడం, అందునా కొందరికి రాసి కొందరికి రాయకపోవడం, ప్రచారం కిందకి వస్తుంది. వికీలో కాన్వాసింగు నిషిద్ధం. __చదువరి (చర్చరచనలు) 18:01, 22 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారు, అనువాద వ్యాసాలపై కృషి చేసినవారికి, గత 30 రోజులలో చురుకుగా వున్నా చర్చలలో పాల్గొనని వారికి, వారికి ఈ మెయిల్ పంపించే అవకాశం వుంటే, ఓటు ప్రక్రియ గురించిన ఈమెయిల్ పంపించాను. అయితే ప్రక్రియ గడువు తేదీ తెలిపి, పాల్గొనమనే అభ్యర్ధించాను కాని అనుకూలంగానో, ప్రతికూలంగానో వేయమని కోరలేదు. ఓటు ప్రక్రియ ముగింపుకు నాలుగు రోజులముందు రచ్చబండలో కూడా ఓటుప్రక్రియలో ఇంకా పాల్గొనని వారిని పాల్గొనమని సూచించడం జరిగింది. వికీసభ్యుల కృషిని ప్రభావితం చేసే ఈ విధానంపై ఎంత ఎక్కువమంది పాల్గొంటే అంత మెరుగైన విధానం నిర్ణయం జరుగుతుంది. కావున దీనిని నేను తప్పుగా కాని కాన్వాసింగ్ గా కాని పరిగణించడంలేదు. --అర్జున (చర్చ) 23:40, 22 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, నేననుకున్నాను మీరు దాన్ని కాన్వాసింగుగా పరిగణించరని. అది కాన్వాసింగో కాదో వేరేచోట చర్చిద్దాం. ప్రస్తుతానికి మీరు ఇక్కడ వోటేసిన వారిలో ఎవరెవరికి ఈమెయిళ్ళు పంపారో రాయండి. __00:48, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నేను సందేశం పంపిన వారిలో కొంతమంది ఓటు ప్రక్రియలో పాల్గొన్నారు అనగా ఓటుకు అనుకూలంగాను, ప్రతికూలంగాను వేసినవారిలో వున్నారు. అంతకు మించి వివరణ ఏమిఅవసరంలేదు. మీకు అంతగా తెలుసుకోవాలంటే పాల్గొన్న ప్రతివారిని వారు ఏ విధంగా, ఎవరు చేత ప్రేరేపించబడి ఓటు వేశారో అడగండి. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 22:44, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సరే, అలాగేనండి. మీరు ఏ ప్రాతిపదికన ఈమెయిలు పంపానని చెబుతున్నారో ఆ కోవ లోకి రానివారిలో కూడా కొందరికీ ఈమెయిలు పంపారని తెలిసింది. అది నిజమా కాదా అనేది నిర్ధారించుకునేందుకు పేర్లు చెప్పమని అడిగాను. మీరే నిర్ధారిస్తే సరిపోతుంది, ఆ తరువాత ఈ అంశంపై చర్చను ముగించవచ్చు గదా అని అనుకున్నాను. కానీ మీరు ఆ పేర్లు చెప్పడానికి ఇచ్చగించడం లేదు. ఎందుకో అర్థం కాలేదు. సరే కానివ్వండి. __చదువరి (చర్చరచనలు) 01:59, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

<<<దేవుడు గారు వేరే విభాగంలో అడిగిన ప్రశ్నను ఇక్కడికి తెచ్చి నా సమాధానం రాస్తున్నాను -ఆ విభాగం చర్చ కోసం కాదు కాబట్టి>>> చదువరి గారు, 20 వ తేదీ సాయంత్రం 4:30 IST తర్వాత వ్యతిరేఖంగా ఉన్నపళంగా దాదాపు 21 ఓట్లు పడ్డాయి. ఇవి ఎలా వచ్చాయి ? వ్యతిరేఖించిన అనుభవజ్ఞులైన నిర్వాహకులు తమ ప్రోత్సాహంతో తెవికీ లో చేరిన వారిని లేదా తమకు వ్యక్తిగతంగా తెలిసిన వారిని వ్యతిరేఖంగా అత్యవసరంగా ఓటేయమని విద్యుల్లేఖలు, చరవాణి పిలుపులు ఏమైనా చేశారా ? ____దేవుడు (చర్చ) 03:57, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

దేవుడు గారు నేను మీరు చెప్పిన వేవీ చెయ్యలేదు. నాకు ఎవరూ పంపలేదు కూడా. స్పష్టంగా చెప్పేసాననుకుంటాను. మరి మీ సంగతి చెప్పండి- మీరు ఎవరినైనా సంప్రదించారా? మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా? అయితే ఎలా? ఏమని? పోతే.. ఇక్కడ మరో సంగతి చెప్పాలి:
ఇక్కడొక వోటింగు ప్రాసెస్ జరిగింది. అందులో జరిగిన ఒక పని గురించి మీరు చేసారా అని నిర్వాహకుణ్ణి అడిగాను. చేసాను, కానీ అది తప్పేమీ కాదు అని ఆయన చెప్పారు. మీరు ఆ ప్రశ్న వేసిన నన్ను ఎదురు ప్రశ్నించారే గానీ, అవును నేను అలా చేసాను అని అన్న వ్యక్తిని ఏమీ ప్రశ్నించలేదు. దాని లోని తప్పొప్పుల్ని తర్కించలేదు. (నా ఇష్టాన్ని అనుసరించి ఎవర్ని కాల్చాలో నిర్ణయించుకుంటాను, వాళ్ళకే గురిపెడతాను అని మీరు అనొచ్చులెండి. నేను కాదన్ను.)
కాన్వాసింగు గురించి వికీపీడియా ఏం చెబుతోందో చూడండి. మీకు వికీపీడియా నియమ నిబంధనల గురించి బాగానే తెలుసునని మీ గత చర్చలను బట్టి నేను అనుకున్నాను. కానీ ఎందుకైనా మంచిదని మీ దృష్టికి తెస్తున్నాను. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 05:53, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీరు చేశారో లేదో నాకు తెలియదు. కానీ ప్రతిపాదన వ్యతిరేఖవర్గం మొత్తం ఓటింగ్ పద్దతినే తప్పు పడుతోంది. ఈ చర్చల్లో పాల్గొన్న ఐదారుగురు సభ్యులు పదవుల్లో ఉండి వీరే మొత్తం తెలుగు వికీపీడియా సముదాయంగా పొరబడుతున్నారేమో అని భావిస్తున్నాను. తప్పు ఎవరు చేసినా తప్పే. ఒకరి ఓటు ఇంకొకరు వేస్తే ఖచ్చితంగా తప్పే, ఎందుకంటే ఇది సహజ ఓటింగ్ నియమాలకి విరుద్దం. నాకు చర్చల్లోనూ ఓటింగ్ లోనూ పాల్గొనాలని ఆహ్వానం అందింది. అయితే నాకు అనుకూలంగా వేయాలనో వ్యతిరేఖంగా వేయాలనో నాకు ఎవరూ చెప్పలేదు. చెప్పినా నాకు సరి అనిపించిందే చేస్తాను. నాకు ఇక్కడ ఎవరి మీద రాగ ద్వేషాలు లేవు. అలాగని నా సొంత ఆలోచన లేకుండా ఎవరికో భయపడో, వారికి అనుగుణంగా లేకపోతే తెవికీ లో నన్ను తొక్కేస్తారనో ఆలోచించి బలవంతులను, మంద బలం ఉన్నవారిని అనుసరిచడం నాకు చేత కాని పని. మంచి ఉండి తెలుగువికీపీడియా కి ఉపయోగపడేది దేనికైనా మద్దతు ఇస్తాను. అది మీరైన లేక ఇంకెవరైనా. 10 మంది నడిచేది తప్పు మార్గం అయితే నా దారిలో నేను నడవడానికి నాకు జంకు, బిడియం లేదు. నాకు తెలిసి తెవికీ లో ముగ్గురు అధికారులు ఉన్నారని అది మీరు, రాజశేఖర్ గారు, అర్జున గారు అని నాకు తెలుసు. మీకు, మీ సముదాయానికి, అర్జున రావు గారి సముదాయానికి ఏమి పగలు ఉన్నాయో, ఎందుకు అలా ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారో అర్థం కావడం లేదు. బహుశా తెవికీ పై ఆధిపత్య భావజాలలు అనుకుంటున్నాను. ఇక్కడ అధికారుల మధ్య ద్వేష భావాలు నాకు కనిపిస్తున్నాయి. చివరి గంటల్లో అన్నీ వోట్లు ఎలా పడ్డాయో నాకు చాలా అనుమానాలకు తావిస్తోంది. ఒక్క రవిచంద్ర గారు తప్ప ఇంక ఎవ్వరూ ముందు రోజుల్లో ఓట్ చేయలేదు. ఇక ఖచ్చితంగా మీరు వ్యతిరేఖం అయితే మీరు, అర్జున గారు మమ్మల్ని అనుమతించకుండా చర్చించుకుని ఓ నిర్ణయానికీ రండి. ఏకాభిప్రాయానికి రాలేకపోతే ఎన్నిక పెట్టండి. ఇక నా గురించి, నేను ఎవరి తరపున లేదా ఎవరికోసమో తెవికీ లో చేరలేదు. నాకు అవసరం లేదు. ధన్యవాదాలు ____దేవుడు (చర్చ) 06:32, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
దేవుడు గారూ, " మీరు చేశారో లేదో నాకు తెలియదు." అన్నారు. అంతకు ముందు, ఈ పని మీరు చేసారా అని మీరు నన్నొక ప్రశ్న అడిగారు దానికి నేను "లేదు, నేను చెయ్యలేదు" అని నిర్ద్వంద్వంగా చెప్పాను. మీరు నా సమాధానాన్ని ఎక్నాలెడ్జి చెయ్యాలంటే.. సరే అని అనాలి. లేదా మీరు చెప్పేది నేను నమ్మను అనాలి. ఒకవేళ నేను చెప్పేది నమ్మక మీరు "నాకు తెలియదు" అని అన్నారా?
వోటింగు పద్ధతిని ఎందుకు తప్పు పట్టానో బోల్డంత వివరణ రాస్తూ వచ్చాను. నేను రాసిన దానిలో ఎవరికైనా ఏదైన సందేహం ఉంటే నేను నివృత్తి చెయ్యడానికి సిద్ధం. కానీ చర్విత చర్వణం లాగా రాసిన దాన్నే మళ్ళీ మళ్ళీ రాయను.
ఇకపోతే, మీకు ఈమెయిలు అందింది అని చెప్పారు. ఫలానా వారికే ఓటెయ్యండి, ఫలానావారికి వెయ్యనక్కర్లేదు అని చెప్పనక్కర్లేదు - అసలు ఈమెయిలు రాయడమే తప్పు. అదే ప్రచారం. అందునా మీకు ఈమెయిలు రాసి కొందరికి రాయకపోతే అది మరీ తప్పు. గమనించండి. ఇంతకుముందు మీకు నేను రాసిన పేజీలో ఈమెయిలు ప్రచారం గురించి వివరంగా ఉంది.
నా సముదాయం అర్జున గారి సముదాయం అంటూ రాసుకుపోయారు. నాకు సముదాయం అంటూ ఏమీ లేదు. నేను ఎవరి సముదాయం లోనూ లేను. మీరు రాసారే "నా దారిలో నేను నడవడానికి నాకు జంకు, బిడియం లేదు." అని. అందరూ అలాగే ఉంటారని అనుకోకపోవడం తప్పౌతుంది. అర్జున గారికి కూడా అలాంటి సముదాయం ఉందని నేను అనుకోవడం లేదు.
ఇక పగలు ద్వేషాలు - మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారని నా ఉద్దేశం.
ఇక మీర్రాసిన మిగతా వాటి గురించి మాట్టాడ్డానికేమీ లేదు. __చదువరి (చర్చరచనలు) 07:08, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారు, ప్రతిపాదన చేసిన అర్జున గారు అనుకూల వర్గము నాయకుడిగాను గానూ, ఈ చర్చలో అధికంగా పాల్గొంటూ వ్యతిరేఖత తెలుపుతూ ఉన్న మిమ్మల్ని వ్యతిరేఖ సంఘ నాయకుడిగా నేను భావించాను. మీరు ఇరువురు ఇక్కడ అధ్యక్షులు. ఇక నా భావన లో తప్పేముంది ? మీ వ్యతిరేఖ వర్గం లో మీతోకూడా కలిపి ఎవరైనా అని మిమ్మల్ని ప్రస్తావించడంలో అర్థం. మీ ప్రతిపాదన వ్యతిరేఖ వర్గానికి మీరే ముఖ చిత్రంగా నేను భావించాను. అంతకు మించి అసలు వ్యక్తి మీరే అని మీరే తప్పు చేశారని నా ఉద్దేశం కాదు. మీరు మిమ్మల్ని అన్నట్టు తీసుకుని చర్చలో నేను చేసిన వాఖ్యలను దారి మళ్లిస్తున్నారేమో అనిపిస్తోంది. దేవుడు (చర్చ) 07:24, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
నా వరకు ఆహ్వానం తప్పు ఎలా అవుతుందో నాకు తెలియదు. ప్రలోభ పెట్టడం తప్పు అని నాకు తెలుసు. ఎవర్ని పిలిచారు, ఎవర్ని పిలువలేదు అనేది మీరు మీరు తేల్చుకోండి. మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు _____ దేవుడు (చర్చ) 07:36, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
దేవుడు గారూ, ఈమెయిలు రాయడం తప్పు ఎందుకౌతుందో నేను మీకిచ్చిన లింకులో ఉంది సార్. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 07:40, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీరు నాతో సంబంధిత లంకెను పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఈమెయిలు రాయడం తప్పు అని అక్కడ లేదు. ఇది స్టేల్త్ కాన్వాస్సింగ్ లో భాగంగా వివరించబడినది. మీకోసం అక్కడ ఏమి రాసి పెట్టబడి ఉందో వివరిస్తాను. ఏదో ప్రత్యేక కారణం ఉంటే తప్పించి, వాడుకరి చర్చ పుటలలో తప్ప వికీపీడియా బయట ఉమ్మడి ఈమెయిల్ ద్వారా సభ్యులకి నోటిఫై చేయడం పారదర్శకత కోసం ప్రోత్సహించడం లేదు. ఇది కొన్ని ప్రత్యేక పరిస్థితులలో దాదాపుగా మంచి పనిగా చూడబడదు. (Because it is less transparent than on-wiki notifications, the use of email or other off-wiki communication to notify editors is discouraged unless there is a significant reason for not using talk page notifications. Depending on the specific circumstances, sending a notification to a group of editors by email may be looked at more negatively than sending the same message to the same group of people on their talk pages.) ఇది తప్పు అని మీరు భావించాల్సిన పని ఏమి లేదు. ఎందుకంటే మీరైనా ఈమెయిల్ పంపవచ్చు. మీరు అదే విధంగా పంపినా నేను ఓ నోటిఫికేషన్ గా పరిగణించే వాడినే గాని మీరు నన్ను ప్రభావితం చేశారని కాదు. కానీ అది సదరు వాడుకరి నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా ఉండకూడదు అంతే. ఇక్కడ అది తప్పు వికీపీడియా లో నిషేదించబడిందనిగాని లేదా Emailing User Prohibited/Punishable offence అని గాని ఎక్కడా లేదు. But it's less encouraged due to Wiki transparancy. అంతే! ఈమెయిల్ అందుకున్న సదరు వాడుకరికి ఇది అభ్యంతరమైతే తప్పితే ఇది మిగతా వారికి అభ్యంతరకరం కాదు, కాకూడదు.____దేవుడు (చర్చ) 08:22, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారు, ప్రతిపాదకులు అర్జున గారు నాకు నా వాడుకరి చర్చ పుటలో జరుగుతున్న ప్రక్రియ గురించి నాకు తెలిపారు. నా అనుభవం మేర చర్చలోకి మరియు ఓటింగ్ కి ఆహ్వానించారు. నాకు ఈమెయిల్ notifications అందుబాటులో ఉన్నాయి. అలా నాకు ఈమెయిల్లు అందాయి. గ్రూప్ ఈమెయిల్ కొట్టడం వాడుకరులను అసౌకర్యానికి గురిచేస్తుందన్న ఉద్దేశం తో అలా అక్కడ రాశారు తప్పితే అక్కడ తప్పు అని రాయలేదు. భవిష్యత్తులో ఇటువంటి కార్యకలాపాలు ఉంటే నాకు చర్చలో రాయండి. ఈమెయిల్ వస్తుంది, ప్రత్యేకంగా నాకు ఈమెయిల్ ని కూడా నేను ఆహ్వానిస్తున్నాను అది ఎవరైనా!. ఇది కేవలం వాడుకరి ఐచ్చికమే!! ధన్యవాదాలు. దేవుడు (చర్చ) 08:35, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
దేవుడు గారూ, మన భాష్యాలను పక్కన పెడదాం. అక్కడున్న పట్టికను తెచ్చి ఇక్కడ పెట్టాను. ఇందులో ఏముందో చూడండి: మాస్ పోస్టింగైనా లేదా పక్షపాతయుత సందేశమైనా లేదా కొందరికి మాత్రమే పంపినా లేదా రహస్య సందేశమైనా అది అనుచితమే అని చెబుతోంది. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 08:40, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
  Scale   Message   Audience   Transparency
Appropriate Limited posting AND Neutral AND Nonpartisan AND Open
Inappropriate Mass posting OR Biased OR Partisan OR Secret
Term Excessive cross-posting ("spamming")   Campaigning   Votestacking   Stealth canvassing
చదువరి గారు, దీనిని బట్టి అర్జున గారు, తనకు సానుకూల మద్దతు వస్తుందనుకున్న వారికి ఈమెయిల్ పంపి ఉండవచ్చు. లేదా తటస్థ సభ్యులు అందరికీ పంపి ఉండవచ్చు. నాకైతే అనుకూలంగా వేయమని అర్జున గారు పంపలేదు, నా అభిప్రాయం కోరుతూ ఆహ్వానించారు అంతే. మీరు ఓటింగ్ నే ఇష్ట పడలేదు, కాబట్టి మీరు ఎవ్వరికీ పంపలేదు. కాబట్టి మీకు ఇది కూడా అభ్యంతర కరముగా తోయుచున్నది. కానీ మిగతా నిర్వాహకులు ఇది మరింతగా చేసి ఉంటారని భావిస్తున్నాను. కాబట్టే చివరి గడియాల్లో అనుమానాస్పదంగా ఎక్కువ పడ్డాయి. ఆవిధంగా విచారణ చేస్తే మేలు. లేదా ప్రతిపాదనలు ఎవరు చేయవచ్చు, వారి అర్హతలు, ఓ యంత్రాగం, అందరినీ నోటిఫై చేసే విధంగా ఓ పద్దతిని రూపొందించండి. ఈమెయిల్ చేయడం తప్పయితే కాదు. ధన్యవాదాలు ____ దేవుడు (చర్చ) 08:47, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
దేవుడు గారూ, అర్జున గారు, తనకు సానుకూల మద్దతు వస్తుందనుకున్న వారికి ఈమెయిల్ పంపి ఉండవచ్చు. లేదా తటస్థ సభ్యులు అందరికీ పంపి ఉండవచ్చు. అని మీరు అన్నారు. అదే అనుచితం అని నేను అంటున్నాను. ధన్యవాదాల్సార్. __చదువరి (చర్చరచనలు) 08:58, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారు, అర్జున గారికి నేను అనుకూలమా వ్యతిరేఖమా అతని ప్రతిపాదనకి మద్దతు ఇస్తున్నానా లేదా నేనెవరికి చెప్పలేదు. నేనెవరి కోసమో తెవికీలోకి రాలేదు. కాబట్టి ఈ ప్రతిపాదనకి ముందు నేను అతనికి తటస్థ వాడుకరిగానే తెలుసు. అతను నాకు చుట్టం కాదు. కానీ ఆహ్వానం తర్వాత తన నుండి నాకు ఎటువంటి అసౌకర్యానికి గురిచేసే విధంగా ఈమెయిల్ ఏమి రాలేదు. నోటిఫై చేయడం ఏ విధంగానూ తప్పు కాదు. నాకు ఈ విధంగా మీ నుండి అయినా నోటిఫికేషన్ వస్తే నాకు ఇంకా సంతోషం. అది ఎవరైనా నోటిఫై చేయవచ్చు. లేక పోతే తెవికీ సభ్యులకి ఎలా తెలుస్తుంది. ___దేవుడు (చర్చ) 09:03, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీరు నన్ను ఓ తప్పును కప్పి పుచ్చుతున్నాను అనుకుంటున్నారు. అటువంటిదేమీ లేదు. మీరు మొదట ఈమెయిల్ చేయడమే తప్పు అన్నారు. కానీ ఈమెయిల్ చేయడం ఆ వాడుకరికి అభ్యంతరం లేనంతవరకు తప్పు కాదు. మీరు ముందే ఓటింగ్కి అభ్యంతరం తెలిపారు మరియు బహిష్కరించారు కాబట్టి మీకు పంపి ఉండకపోవచ్చు. ఇంకొకటి దయచేసి మీరు నన్ను సర్ అని సంబోధించవద్దు. నేను అంత పెద్ద వాడిని కాదు. Inappropriate అర్థం తప్పు అని కాదు. సరికానిది,ఇంకొచెం మెరుగ్గా చేయవచ్చు, అననుగుణంగా ఉన్నది అని అంతే. ఇంకోటి ప్రతిపాదన రెండు అంశాలు వేరు వేరు గా ఎన్నిక ఉంటే బాగుండు అని నేను కూడా భావిస్తున్నాను. ధన్యవాదాలు ___దేవుడు (చర్చ) 09:18, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
దేవుడు గారూ, మీరేదో తప్పును కప్పిపుచ్చుతున్నారని నేను అస్సలు అనుకోనే లేదు. మీరు అలా భావించకండి. సర్ అని ఎవరినైనా నేను గౌరవ పురస్సరంగానే అంటాను గానీ మరోలా కాదు. మీరు వద్దంటే మానేస్తాన్లెండి :) Inappropriate అంటే "అనుచితం" అని అత్యంత దగ్గరగా ఉన్న అర్థం, ఏమంటారు? "ప్రతిపాదన రెండు అంశాలు వేరు వేరు గా ఎన్నిక ఉంటే బాగుండు అని నేను కూడా భావిస్తున్నాను." అని అన్నారు.. ధన్యవాదాలండి. మనలో మన మాట.. ఈ ప్రతిపాదనకు అనుకూలంగా వోటేసిన వాళ్ళు అలా ఎందుకు వేసారా అని ఉత్సుకత ఉంది నాకు (బాధ అని కూడా అనుకోవచ్చు మీరు). అంతరాంతరాల్లో వాళ్ళు దీనికి వ్యతిరేకంగా ఉంటే బాగుండుననే ఆశ కూడా ఉంది నాకు. అఫ్‌కోర్స్, ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు నా ఆశకు వ్యతిరేకమైన ఆశ పెట్టుకుని ఉండవచ్చనుకోండి. :) ఉంటానండి. _చదువరి (చర్చరచనలు) 09:34, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారు, అర్జున గారు ఈమెయిల్ లేదా వాడుకరి చర్చ పుటల ద్వారా జరిగే తంతు గురించి వాడుకరిని నోటిఫై చేయడం తప్పు కాదు. ఈ స్పష్టత నాకు ఉంది. మీరు ముందే అయిష్టత చూపారు కావున మీకు ఈమెయిల్ రాలేదేమో!! ఇది మీరు వారు తేల్చుకోండి. ఇక ఈ విషయం ఎందుకు చర్చాలలోనే తెగలేదో నేను చెబుతాను. నాణేనికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. రెండు వైపులా వాదాలు నేను చెబుతాను. సానుకూలతలు, ప్రతికూలతలు నేను చెబుతాను. ఎవరైనా వచ్చి నన్ను బూతులు తిట్టేసి నన్ను న్యూనతకు గురి చేసే ప్రయత్నం చేయాలనుకుంటే వారిష్టం.

ప్రతిపాదన అనుకూలం-వాదన: 1. నాణ్యతకు సహాయం చేస్తోందనడానికి ఎటువంటి శాస్త్రీయత లేదు. 2. అనువాదం సులభతరం చేయడం. 3. అనువాద యంత్రం బాగా క్లిష్టతరంగా ఉంది. సమస్యలు ఉన్నాయి. వాడుకరిని నిరుత్సాహ పరుస్తున్నాయి. 4. ఎత్తిపోతల పథకాలు, అవసరం లేకపోయినా వాఖ్య నిర్మాణం సరిగ్గా ఉన్నా నియంత్రణల కారణంగా హెచ్చరికలు, Errors చూపడం ఆపలేదు. 5. కాలయాపన జరుగుతోంది.

ప్రతిపాదన ప్రతికూలం-వాదన: 1. ఎక్కువ అనువాదాలు చేసింది, ఎక్కువ అనుభవం కలిగి ఉండేది మేమే. కాబట్టి 70%/30% ఉండాలన్న మా పంతమే నెగ్గాలి. 2. మాకు క్లిష్ట తరమైన వాడకం బాగా నచ్చింది. లేకపోతే మాకు శుద్ది పని ఎక్కువై పోతుంది. మేమే అంతా చేస్తున్నాము. కాబట్టి మిగతా వాడుకరుల నిర్ణయం అక్కరలేదు. 3. సులభతరం చేస్తే మాకు పని ఎక్కువై పోతుంది. 4. ఎటువంటి అనువాద కృషి చేయని వారు ప్రతిపాదనలు, చర్చలు చేయడం ఏమిటి ? 5. మా సముదాయనికి ఇష్టం లేదు. కాబట్టి మేము ఎన్నికకి కూడా వ్యతిరేఖం. 6. ఈ ప్రతిపాదన చేయడానికి వీల్లేదు. 7. ఇది అప్పట్లో చర్చ జరిగి మేము అనువాద నియంత్రణలు రూపొందించాము. ఇప్పుడు కూడా అప్పుడు మేము పెట్టిన నియంత్రణలే చెల్లుబాటు కావాలి. 8. చర్చలో పాల్గొన్న ఎక్కువమంది దీనిని వ్యతిరేఖం గా ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నిక జరగడానికి వీలు లేదు.

నా నుంచి ముగింపు జరిగిన తంతు మీద: 1. ఇరుపక్షాల నుండి ఏకాభిప్రాయనికి రావడానికి, సమస్య తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం జరగలేదు. ఎవరి వాదనలు వారే చేశారు. దుమ్మెత్తి పోశారు, పోసుకున్నారు. ఎవరికి వారే యమునకు నీరే! More judgements than meaningful discussions from Opposition to solve if problem exists. 2. ప్రతిపాదన ఎంత మాత్రం వాస్తవికత కు దగ్గరగా ఉంది? ఎటువంటి వివరణలు నాకు వ్యతిరేఖ వర్గం నుండి కనిపించలేదు. 3. 70% మించి సరిపోలే పదాలు ఉండి, వాఖ్య నిర్మాణం సరిగ్గా ఉన్నప్పుడు సరిపోలే పదాలు వెతుకోవాల్సి రావడంపై,ఇక్కడ జరిగే సమయాభావంపై వ్యతిరేఖ వర్గం నుండి నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ సమాధానం లేదు. కేవలం నాణ్యత తగ్గుతుందన్న భయాందోళనలు వ్యక్తం చేశారే గాని, అనువాదకుల అసౌకర్యం పై చింతించలేదు. 4. రెండు అంశాలు ఒకే ఓట్ ప్రక్రియలో విలీనం చేయడం కొంత అయోమయానికి కారణమైంది. విడివిడిగా పోల్ నిర్వహించి ఉంటే బాగుండేది. 5. అనువాద యంత్ర నియంత్రణా లోపాలపై ఎటువంటి వివరణా లేదు. 6. ఒక వేళ కొత్తవారే అధిక స్థాయిలో నాణ్యత లేని వ్యాసాలు రాస్తే కొత్త వారిని కొంత కాలం పాటు కొంత కృషి అనుభవం కలిగే వరకు ఎందుకు నియంత్రించకూడదు ? అలా చేస్తే నాణ్యత లేని వ్యాసాలు రావు కదా ? కొత్త వారిని ఆ స్థాయిలో భయపెట్టే అవసరం ఉండదు కదా ? 7. అనువాదం సులభతరం చేస్తే అనువాదం చేసే వాడుకరుల సంఖ్య పెరుగుతుంది కదా ? 8. కొత్త వాడుకారులను కొంత కాలం పాటు కొంత అనుభవం గడించినంత వరకు వారు ప్రచురించే వ్యాసాలు నిర్వాహకుల అనుమతించిన తరువాతనే ప్రచురించే విధానం చేయవచ్చు కదా! అప్పుడు నాణ్యత ఖచ్చితంగా పెరుగుతుంది. 9. కేవలం 70/30 నియంత్రణల వల్ల అసౌకర్యమే గాని నాణ్యత పెరిగిందన్నది నా వరకు అపోహ!

నేను ఎందుకు అనుకూలంగా ఓటు వేశాను అంటారా ? 1. అనువాదం సులభతరం చేయడం, సమస్యలు, ఇబ్బందులు తొలగించడం నాకు ఇష్టం 2. పైన పేర్కొన్న అంశాలతో బాటు నేను కూడా ఓ తెలుగులో ఉండి ఆంగ్లం లో లేని వ్యాసాన్ని అనువాదం చేయబోతే కొన్ని వందల edits ఆంగ్ల వికీపడియాలో చేసే వరకు ముద్రణ అనుమతించనని తెలిపింది. నాకు తెలిసి ఆంగ్ల వికీపీడియా కంటే తెలుగు వికీపడియా పెద్ద జంక్ చేరే ప్రదేశం కాదని ఆంగ్ల వికీపీడియా కంటే తెవికీ కి అధికంగా చదువరులు ఉండబోరని నా భావన. ఇదమితంగా పైన నేను చేసిన సూచనలు సరైనవని అనిపిస్తే చేయి కలిపి మీ శ్రమ తగ్గించుకోండి. లేదు, మేమే గతంలో అనువాదాలు చేశాం మాకే అనుభవం ఉంది ఈ కష్టం మాకిష్టం అనుకుంటే మీ ఇష్టం. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి.

మిగతా వారెందుకు అనుకూలంగా వేశారో వారినే అడగండి.

ధన్యవాదాలు :). ________దేవుడు (చర్చ) 11:01, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

దేవుడు గారూ, నేను ఈ ప్రతిపాదనను ఎందుకు వ్యతిరేకించానో మీకు ఒక్ఖ ముక్క కూడా అర్థం కాలేదు. మీకు ప్రతిపాదనలో నచ్చని భాగం ఏంటో నాకు అర్థమైంది. ఇక నేను తప్పుకుంటాను. __చదువరి (చర్చరచనలు) 11:10, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీరు చెప్పిందే నిజం అయ్యి ఉండవచ్చు. నేను అర్థం చేసుకోకపోయి ఉండవచ్చు. అందుకు నన్ను క్షమించగలరు. కొంచెం ముక్కు సూటి మనిషిని కాబట్టి నేను అనుకున్నవి చెప్పేసాను. సముదాయ నిర్ణయాన్ని నేను గౌరవిస్తానని మీకు కూడా తెలుసు. మరియుల ఏరివేత నేను వ్యక్తిగతంగా వ్యతిరేఖించినా సముదాయం నిర్ణయం ప్రకారం నేను ఏరివేతలో పాల్గొన్నాను. ఇలా చాలా ఉన్నాయని మీకు తెలుసు! ఏదైనా ఇబ్బంది కలిగించి ఉంటే మన్నించండి. జరగబోయే మరిన్ని చర్చలలో నాకు మీ నుండి ఆహ్వానం, ప్రోత్సాహం యధావిధిగా అందుతుందని మనం కలిసి ముందుకు సాగుతామని భావిస్తున్నాను. ____దేవుడు (చర్చ) 11:43, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చివరి రోజు సాయంత్రం 4:30 నుండి 21 ఓట్లు ఎలా పోలవుతాయి ? తప్పు మనం చేసి అవతలి వారి మీద నిందలు వేయడంలా అనిపించడం లేదా ? దేవుడు (చర్చ) 13:39, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారు, ఇంకొక మాట, మీరేందుకు వ్యతిరేఖం గా ఉన్నారో నాకు అర్థం కాకపోయినా పర్లేదు, మీకు అర్థం అయితే చాలు. అయితే మీతో చర్చలు జరిగిన పిదప నాకు అర్థమైన విషయం మీకే క్లారిటీ లేదు. కాన్వాస్సింగ్ జరిగినది 20 న సాయంత్రం 4:30 తర్వాత, ఈవిషయం తేదీ మరియు సమయం పరీశీలించిన ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుంది. కానీ నిందలు అర్జున గారి మీద వేస్తున్నారు. ఆహా, గొప్ప స్క్రిప్ట్ అండీ! దేవుడు (చర్చ) 14:00, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
దేవుడు గారూ.. ఎవరిది స్క్రిప్టో, ఎవరిది కాదో తరువాత తేలుద్దాం కాని, 100 సవరణలు చేసిన వారందరూ ఓటింగ్ కు అర్హులే అని ఒక ఓటరు జాబితా తయారుచేసి కొంతమందికే ఓటరు స్లిప్ ఇచ్చినట్టు ఆ కొంతమందికే ఎందకు మెయిల్స్ పంపించారు?, మిగతా వాళ్ళకు ఎందుకు పంపించలేదు?, మిగతావాళ్ళు చురుగ్గా లేరని, అనువాద ఉపకరణం వాడలేదని అనుకుంటే మరి వారిని ఓటరు జాబితాలో ఎందుకు పెట్టినట్టు? వీటికి సమాధానాలు చెప్పమనండి. మిగతావి తరువాత చూద్దాం. ఇక ఓటు వేసిన తేది, సమయం అంటారా..., మిగతా వాళ్ళకు మెయిల్ చేసినప్పుడే వీళ్ళకు కూడా మెయిల్ పంపించివుంటే, ఆరోజే ఓటు వేసేవాళ్ళేమో..?-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:17, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
దేవుడు గారూ, వోటింగు నిర్వాహకుడు తాను చేసానని ఒప్పుకున్న ఈమెయిలు ప్రచారాన్ని సమర్ధించేందుకు మీరు పడుతున్న తపన నాకు అర్థమైంది. ఏమాత్రం సమర్ధించలేని దాన్ని ఏదో రకంగా సమర్ధించడానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయమే అయినప్పటికీ అది నిరర్థకం, నిష్ఫలం. ఎందుకంటే, తనకనుకూలంగా వోటేస్తారనుకునేవారికి, తటస్థులకూ ఈమెయిలు పంపి ఉంటారని మీరు ఒప్పేసుకున్నారు. దాన్నుండి వెనక్కు పోయే దారి లేక ఎదటోడి మీద బురద జల్లేందుకు మీరు విశ్వప్రయత్నం స్తున్నారు. అయితే మీది వృథా ప్రయాస. ఈమెయిలు ప్రచారాన్ని వెనకేసుకు రావడం చాలా కష్టం.__చదువరి (చర్చరచనలు) 16:26, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పద్ధతి చర్చలో అంశం చేర్చాను. సభ్యులు అక్కడ చర్చలో పాల్గొని పద్ధతిని మెరుగు చేయడంలో సహకరించవలసిందిగా కోరుతున్నాను. --అర్జున (చర్చ) 00:05, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీరు ఏ ఆధార సహితంగా లేని పనిగట్టుకుని చేస్తున్న ఉద్దేశాల ఆపాదన మీకు అర్జున గారితో ఆధిపత్య ఘర్షణ లేదా పోరు రుజువు అవుతున్నది. ఇది తెలుగు వికీపీడియా కి ఏవిధముగాను మేలు చేయదు. కాబట్టి జరుగుతున్న తంతు గురించి నేనేది అతిగా ఊహించుకోలేదని మీరు నిరూపించారు మీరు కాదని చెప్పినప్పటికీ. ధన్యవాదాలు. దేవుడు (చర్చ) 03:04, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
దేవుడు గారు ఒక్క రవిచంద్ర గారు తప్ప ఇంక ఎవ్వరూ ముందు రోజుల్లో ఓట్ చేయలేదు, చివరి రోజు సాయంత్రం 4:30 నుండి 21 ఓట్లు ఎలా పోలవుతాయి ?. ఇవి మీ ప్రశ్నలు.. ఇక్కడ నా వైపు నుండి కూడా ఓటింగ్ ఆలస్యంగా జరిగింది. దీనికి నా వివరణలో మీకు జవాబులు దొరకొచ్చు.. నా వరకూ సమయాభావం, అంతర్జాల లభ్యత, ముబైల్లో టైప్ చేయడంలో ఉన్న ఇబ్బందులు. వీటి వలన కేవలం చర్చలను గమనిస్తూఉంటాను. అందరి అభిప్రాయాలను చదువుతాను. చర్చలమద్యలోనీ, కొంతవరకూ చూసో నిర్ణయం తెసుకోలేను. పరిణామాలు, అభిప్రాయాలు, చర్చలను చూసి దానిబట్టి చివర్లో మాత్రమే నిర్ణయం తీసుకుంటాను. బహుశా ఇదే చాలా మందిలో ఉండొచ్చు. ఇప్పుడూ ఇన్ని చర్చలు జరుగుతున్నా ఈ రకమైన జవాబు ఎవరినుండైనా వస్తుందేమో అని చూసి లేక ఇపుడు స్పందిస్తున్నాను. ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ) 06:13, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
నేను కూడా చర్చల మొదటి నుంచి ఉన్నాను. ఈ ఓటింగును వ్యతిరేకించాను. కానీ చివరికి ఈ ఓటింగులో ప్రతిపాదన నెగ్గి ఎక్కడ వికీలోకి అనువాద కాలుష్యం వస్తుందేమోనని చివరి రోజు వ్యతిరేకంగా ఓటు చేసాను. అలాగే ఇతర సభ్యులకు కూడా వారు ఓటు చేయడానికి ఏదేనీ కారణం ఉండవచ్చు కదా. కనుక చివరి రోజు అంత ఓటింగు ఎందుకు జరిగిందనేని మనం ప్రశ్చించలేం. గడువు తేదీ యిచ్చిన సమయంలోపల ఓటు జరిగిందో లేదో మాత్రమే చూడాలి. బయట సార్వత్రిక ఎన్నికలలో కూడా ఒక్కోసారి పోలింగు ముగిస్తున్న సందర్భంలొ కూడా వందల మంది ఓటర్లు వచ్చే సందర్భాలు నేను ఎన్నికల విధులు నిర్వహించేటపుడు అనేకం చూసాను. వారికి అప్పుడు ఓటు వేయడానికి సమయం కుదిరిందని అనుకోవాలి గానీ, ఎవరో ప్రభావం చూపారని ఎలా అనుకుంటారు? ఇక్కడ ఓటింగులో సమయంలోపల వేసారా లేదా అనే విషయం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ నోముల ప్రభాకర గౌడ్ ఈ ప్రతిపాదనకు వ్యతిరేకిస్తూనే అర్జున గురువుగారికి విధేయత చూపించవలసిన సమయం తరుణం ఇదే కావచ్చు అని అనుకూలంగా ఓటు చేసారు. ఓటు వేసేటప్పుడు అలా చెప్పక్కర్లేదనుకుంటాను. ఓటు స్వంత అభిప్రాయం మేరకు ఆ విధానం మంచిదా, లేదా అని తెలుసుకొని ఓటు చేయాలని నా అభిప్రాయం. ఇక్కడ మీనాగాయత్రి, నాగరాణి లు తెవికీలో విశేష కృషి చేస్తున్నారు. వారికి తెవికీ విధానాల పట్ల అవగాహన ఉంది. కనుక వారి ఓట్లు విజ్ఞత లేకుండా వేసారని అనడం సరైన విధానం కాదు. బంధుత్వాలు ఉన్నాయనే కారణం చూపడం సరైనది కాదు. హారిక గారికి ప్రొఫైల్ తప్ప వివారాలేవీ లేదనడం కారణంగా ఆమె విజ్ఞతని ప్రశ్నించడం సరైనది కాదు. ఏ ఆధారంతో మేకల హారిక గారి విజ్ఞత గురించి ప్రశ్నిస్తారు? ఆ మాటకొస్తే ఓటు వేసిన చాలా మందికి ప్రొఫైల్ లేదు. వికీలో ఎవరి వాడుకరి పేర్లు, వివరాలు నిజమో కాదో, ఎవరెవరికి బంధుత్వాలు ఉన్నాయో ఎవరికి తెలుసు. వారు వాడుకరి పేజీలో రాసిన దాని ఆధారంగా వారి ఐడెంటిటీని ఖచ్చితంగా ఎలా నిర్థారించగలం. మనకు కావలసినది ఆ వాడుకరి తెవికీకి చేసిన సేవలే కానీ వారి వ్యక్తిగత విషయాలు కాదని గమనించాలి. కనుక బంధుత్వాలతో ఆ మహిళా వాడుకరుల విజ్ఞతను ప్రశ్నించడాన్ని నేను ఖండిస్తున్నాను. దేవుడు గారూ, ఓటు ప్రక్రియలో భాగంగా ఎక్కువ మంది ఆమోదించిన ప్రతిపాదనకు ఓటింగు పెట్టాలనే నియమాన్ని కాలరాసి ఓటింగుకు ముందుకు వెళ్లడాన్ని ప్రశ్నించడం లేదు. కొంత మంది వాడుకరులకు ఈ మెయిల్ సందేశాలు పంపించడం వలన ఓటర్లు ప్రభావితం కావచ్చనే విషయాన్ని కూడా ప్రశ్చించడం లేదు. ఇద్దరు వాడుకరుల సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓటింగు చేయడాన్ని ప్రశ్నించడం లేదు. కానీ మహిళా వాడుకరుల విజ్ఞతను ప్రశ్నిస్తున్నారు. ఇది సరైనది కాదు. --కె.వెంకటరమణచర్చ 07:30, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఆలస్యంగా స్పందిస్తున్నందుకు, క్షమాపణలు, ఐఐఐటి పూర్వ విద్యార్థులు అయిన వాడుకరి:Ramu ummadishetty, వాడుకరి:HarshithaNallani ఇక్కడ స్పందించక పోవటం వలన , వారి సంతకాన్ని ఫోర్జరీ అని ఆరోపణల వలన నేను వివరణ ఇవ్వవలసిన నైతిక భాద్యత నాకు ఉన్నది , ఇవి ఫోర్జరీ కావు అని నా నమ్మకం , నేను వారికి బహుశా ఓటింగ్ పక్రియ మీద లాగిన్ అయి ఓటు చేయాలి అన్న విషయం మీద అవగాహన లేదేమో అని భావిస్తున్నాను,నిర్వాహకులు వీలయితే ఐపీ ప్రాతిపదిక మీద పరిశీలించుకోవచ్చు. ఈ విషయం మీద సదరు వ్యక్తులను స్పందించమని మరొక్క సారి సూచన చేసాను. Kasyap (చర్చ) 16:00, 26 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Kasyap గారు, మీ సహాయానికి, స్పందనకు ధన్యవాదాలు. వాడుకరి:Ramu ummadishetty గారు తన చర్చాపేజీలో వికీసంతకంపోలిన మార్పులు తనే చేశానని స్పందించారు. ఓటు ప్రక్రియలో అనామక ఓట్లు చెల్లవని స్పష్టంగా వుంది. అదే పాటిస్తున్నప్పుడు మరింతగా దర్యాప్తు చేయనవసరంలేదు. --అర్జున (చర్చ) 06:31, 29 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.

ప్రక్రియ నుండి సముదాయం నేర్చుకోదగినవి[మార్చు]

ఐదు వారాల సుదీర్ఘ ప్రయత్నం (మూడు వారాలు చర్చ, రెండు వారాలు ఓటు ప్రక్రియ) తరువాత ఫలితం వెలువడింది. దీనిపై సముదాయం నేర్చుకోదగినవాటి గురించి సహ సభ్యులు క్రింది విభాగాలలో బుల్లెట్ పాయింట్ల తీరులోఒక వారం అనగా 2020-09-28 లోగా స్పందించమని కోరుతున్నాను. వికీపీడియా:విధానాలు,_మార్గదర్శకాలకు_ఓటు_పద్ధతి రెండవ సారి వాడినందున దానిపై సందేహాలు, దానిని మెరుగు పరచటం గురించి చర్చించవలసినవి దాని చర్చాపేజీలో చేర్చవలసినది. మీ సహకారానికి ముందస్తు ధన్యవాదాలు. అర్జున (చర్చ) 09:13, 21 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

బాగా జరిగినవి[మార్చు]

 • అర్హులైన ఓటర్ల జాబితా ఓట్ ప్రక్రియ ప్రారంభంలోనే ప్రకటించడం జరిగింది. --అర్జున (చర్చ) 22:56, 21 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • 34 సభ్యులు (చెల్లినఓట్లు) ఓటు ప్రక్రియలో పాల్గొన్నారు. తెలుగు వికీలో విధాన నిర్ణయాలకు సంబంధించి ఇది ఒక రికార్డుగా భావిస్తున్నాను. --అర్జున (చర్చ) 23:20, 21 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • సభ్యులు ఇంత ఎక్కువగా పాల్గొని ఓటు వేయడం నిజంగా అపూర్వం.--Vmakumar (చర్చ) 02:11, 22 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • కొందరు సభ్యులు ఓటింగ్ జరపడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఓటింగు ప్రక్రియను నిరసించినా, చివరకు అత్యున్నత ప్రజాస్వామిక ప్రక్రియ (వోటింగ్)ను అనుసరించక తప్పలేదు. ఓటింగు ప్రక్రియ ద్వారా నిర్ణయం తీసుకోవాలా, నాన్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా నిర్ణయం తీసుకోవాలా అనే దానిపై ఘర్షణ వచ్చినపుడు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవడంకోసం ఓటింగు పట్ల అభ్యంతరాలు ప్రకటించినవారు కూడా ఓటింగు ప్రక్రియలోకి అనివార్యంగా ప్రవేశించవలసి వచ్చింది. The final outcome was decided by a broad-based vote rather than a majority opinion formed among a few individuals. Whatever the outcome, the spirit of democracy was upheld through voting. ఓటింగ్‌లో ప్రతిపాదన వీగిపోయి వుండవచ్చు. కానీ అసలు ఓటింగ్ జరపడమే అనవసరం, అన్యాయం అన్నవారిని సైతం తప్పనిసరిగా ఓటింగ్ క్యూలో నిలబెట్టడంలోనే అది మౌలికంగా ప్రజాస్వామిక విజయం సాధించింది. --Vmakumar (చర్చ) 02:26, 22 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • ఈ ఓటింగువల్ల ప్రతిపాదనకు మద్దతు తెలిపినవారిలో కూడా అసంతృప్తి కనిపించకపోవడానికి ఆస్కారం వుందని చెప్పవచ్చు. Law of Natural Justice ప్రకారం ప్రతీ సభ్యుడికీ (మద్దతుదారునితో పాటు వ్యతిరేకులకు కూడా) సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు కల్పించబడాలి. లేనట్లయితే అసమ్మతి తలెత్తడానికి ఆస్కారముంటుంది. చర్చా కన్నా ఓటింగు విశాల ప్రాతిపదిక కలది. కొద్దిమంది పాల్గొన్న చర్చా ప్రక్రియ (మొదటి అవకాశం) లో, తగిన మద్దతు లభించక పోయినప్పటికీ, ఒక మద్దతుదారుడు 'బయట విస్తృతంగా తనకు మద్దతు వుంటుందనే అభిప్రాయం కలిగి ఉండటం సహజం. ఓటింగు ప్రక్రియ వలన మద్దతుదారునికి మరో అవకాశం కూడా కల్పించబడినట్లవుతుంది. అయితే ఓటింగులో కూడా తగిన మద్దతు లభించనప్పుడు ఇక తప్పనిసరిగా అంగీకరిస్తాడు. అసంతృప్తికి గురికాడు. అసలు వోటింగ్ అవకాశాన్ని కల్పించకుండా, కేవలం చర్చలో పాల్గొనే అవకాశంతో ఆపేస్తే ఆ చర్చలో చేసిన నిర్ణయం పట్ల అతనికి ఎప్పటికీ అసంతృప్తిగానే ఉండవచ్చు. ఎందుకంటే మద్దతుదారుకి సహజ న్యాయ సూత్రం ప్రకారం సాధ్యమైనన్ని అవకాశాలు కల్పించడానికి నిరాకరించాం కనుక. ప్రస్తుతం జరిగిన ఓటింగు సహజ న్యాయనుసారం మద్దతుదార్లకు, వ్యతిరేకులకు సైతం Maximum (2) Opportunities ఇచ్చింది. అందువల్ల అసంతృప్తికి చోటుండకపోవచ్చు.--Vmakumar (చర్చ) 04:05, 22 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • ఈ వోటింగు వలన ఒక మేలు జరిగింది. (ఇది బాగా జరిగింది అని చెప్పే కోవ లోకి రాదు గానీ ఈ విభాగానికే దగ్గరగా ఉంటుంది. అందుకే ఇక్కడ రాస్తున్నాను) మీనాగాయత్రి గారు, మేకల హారిక గారు, నాగరాణి గారు - ఈ ముగ్గురు వాడుకరులూ చూపిన విజ్ఞత గురించి చెప్పుకోవాలి. "అలాగని ఊరుకుంటే ఈ ప్రతిపాదనలు గెలుస్తాయి. కాబట్టి, నేను ఈ ఓటింగ్ ని తిరస్కరిస్తూనే ప్రతిపాదనలో వ్యతిరేక ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను.", "అదే ఆ సమయం లోనే ఈ 30 శాతం నిబంధనం ఉన్నట్లయితే మా వ్యాసాలు పూర్తి నాణ్యతతో ప్రసురించబడేయి. ఈ నిబంధన వాళ్ళ వ్యాసాల యొక్క నాణ్యత పెరగడం తో పాటు, కొత్తగా అనువాదం చేసేసవాళ్ళకి చాల ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.", "మరి అలాంటప్పుడు ప్రస్తుతం ట్రాన్సలేషన్ టూల్ లో ఉన్న 30 శాతంని తగ్గిస్తే అప్పుడు రాసే వ్యాసాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు. ... ఈ ఓటింగ్ ని తిరస్కరిస్తూనే, ప్రతిపాదన గెలవకుండా వ్యతిరేక ఓటు వేయాలనుకుంటున్నాను." ఎందుకు వ్యతిరేకిస్తున్నమో, ఎందుకు వోటెయ్యాలో స్పష్టత ఉంది వాళ్ళకు. వాళ్లకు నా వందనం. వోట్లు కాదు, వాడుకరుల అభిప్రాయాలు అవసరమని తేల్చి చెబుతున్నాయి వారి వ్యాఖ్యలు. ఇంత సహేతుకంగా ఒక్ఖ కారణమైనా, కనీసం ఒక్కటైనా, ఈ ప్రతిపాదకుడు మానవిక అనువాద పరిమితి తగ్గింపుకు చూపి ఉంటే, బహుశా నేను ఈ ప్రతిపాదననూ ఈ వోటింగునూ ఇంత వ్యతిరేకించి ఉండేవాణ్ణి కాదేమో!__చదువరి (చర్చరచనలు) 09:01, 22 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • మరొక సంగతి చెప్పాలి - వాడుకరి:Vmakumar గారి గురించి. అనువాద పరికరాన్ని వాడి చూస్తే దాని పనితీరు గురించి, అది చేసే అనువాద దోషాల గురించీ మరింత తెలుస్తుందని తాను భావిస్తున్నట్టూ, వాడి చూస్తాననీ చెప్పారు. అది ఈ వోటింగు వ్యవహారం మొత్తమ్మీద నేను చూసిన మరొక బ్రైట్‌స్పాట్. __చదువరి (చర్చరచనలు) 09:27, 22 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

<<<గతంలో ఇక్కడ మీనాగాయత్రి, నాగరాణి బేతి, మేకల హారిక గార్ల విజ్ఞతను పరిగణించడంపై జరిగిన చర్చ ఈ విభాగంలో జరపడం సముచితం కానందువలన దాన్ని #మీనాగాయత్రి, నాగరాణి బేతి, మేకల హారిక గార్ల విజ్ఞతను పరిగణించడంపై చర్చ అనే కొత్త విభాగానికి ఉన్నదున్నట్టుగా తరలించాను. గమనించగలరు>>>

బాగా జరగవలసినవి[మార్చు]

 • ప్రస్తుత విధానం పై సమీక్ష, కొత్త ప్రతిపాదనల చర్చలు నిర్మాణాత్మకంగా, సామరస్యపూర్వకంగా, అర్ధవంతంగా, ఏకాభిప్రాయం దిశగా జరగలేదు. చర్చలో పదిమంది పాల్గొన్నా స్పందనలకు నిర్మాణాత్మకంగా ప్రతిస్పందించి చర్చను ఏకాభిప్రాయం దిశగా మరలించిన వారు చాలా తక్కువ. చాలా ఉపచర్చలు అసంపూర్ణంగానే వుండిపోయాయి. పాల్గొన్నవారిలో చాలామంది తమ వ్యక్తిగత అభిప్రాయలు తెలిపే విభాగాలలో తమ అభిప్రాయాలు తెలపటం చేశారే కాని, కొన్ని ఇతర విభాగాలలో స్పందించనేలేదు. ముందు చర్చలు మెరుగుగా జరగాలి. --అర్జున (చర్చ) 23:01, 21 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • ఓటు ప్రక్రియ ప్రారంభమైన తరువాత ప్రక్రియ గురించి సందేహాలుంటే వాటిని తీర్చుకోవటానికి బదులు, ప్రక్రియను బలహీనపరిచే విధంగా, ఓటు పద్ధతి ఏర్పడినప్పుడు, దానిని గతంలో వాడినప్పుడు పాల్గొననివారు, దానిపై అనుభవమున్నట్లు వ్యాఖ్యానించడం, సమాంతర ఓటు ప్రక్రియలు చర్చాపేజీలో నిర్వహించడం, ప్రతిపాదనపై అభిప్రాయ చర్చలను రచ్చబండలో, చర్చాపేజీలో కొనసాగించడం సరికాదు. ముందుకాలంలో ఇలా చేయకూడదు, అలా చేసేవారికి తగిన పర్యవసానాలుండేటట్లు చూడాలి.--అర్జున (చర్చ) 23:10, 21 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • వెలువడిన అభ్యంతరాల దృష్ట్యా, ఇప్పటివరకూ అనుసరించిన "విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి" లోని లోటుపాట్లును పునః సమీక్షించాల్సిన అవసరం గుర్తుచేసింది. As per the objections raised by the fellow members during the voting process, there is a clear need to review the concerned policies that the telugu wiki adopts till now. In fact, every policy should be reviewed within a certain time-bound. Accordingly, policies may also be amended if necessary by taking into account the present situation and discussing it with senior members. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు మరలా జరగకుండా చూడాలి. ముఖ్యంగా ఎన్నిక విధానంలో అవలంబిస్తున్న కొన్ని నిబంధనలు ambiguity కలిగి ఉండవచ్చు.
 • తరువాత జరగబోయే చర్చలైనా సంయమనం కోల్పోకుండా మరింత హుందాగా కొనసాగుతాయని కోరుకుందాం.--Vmakumar (చర్చ) 04:15, 22 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • చర్చలలో, పాటిస్తున్న విధానాలలో ప్రజాస్వామిక ధోరణి మరింతగా ప్రతిఫలించాలి. ప్రజాస్వామిక విధానాలపై కొత్త సభ్యుల కన్నా సీనియర్ సభ్యులకు మరింత ఎక్కువ అవగాహన, నమ్మకముండాలి. వారి ఆధ్వర్యంలో తెలుగు వికీ దానితోపాటే మనం కూడా నడుస్తాం.
 • మనం ప్రజాస్వామ్యంలో వున్నాం. ప్రజాస్వామిక వ్యవస్థలో భాగంగానే మనం ఇతర వ్యవస్థలలో కూడా పనిచేయవలసి వస్తుంది. ఇక్కడ పనిచేసే ఏ ఇతర వ్యవస్థ కూడా ఇక్కడి ప్రజాస్వామిక స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా స్వంత నిబంధనలను నిర్దేశించుకొని మనజాలలేదు. దేశంలో ఏ వ్యవస్థ కూడా దీనికి అతీతం కాదు. మనకే కాదు, మనలను నడిపించే వారికి కూడా ప్రజాస్వామిక విధానాలలో, ప్రజాస్వామిక ప్రక్రియలలో ఆచంచలమైన నమ్మకం ఉండాలి. ఆ నమ్మికతోనే వ్యవస్థలను నడిపించాలని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటింగులో పాల్గొన్న సభ్యులకు మనఃపూర్వక ధన్యవాదాలు.--Vmakumar (చర్చ) 04:21, 22 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • నా ఉద్దేశంలో ఈ వోటింగు ప్రక్రియలో జరిగిన లోపాలివి:
  • సముదాయపు అభీష్టాన్ని పట్టించుకోలేదు, ఒక వ్యక్తి కోరికే నెగ్గింది: ఈ వోటింగుకు మూలమంత్రం ఈ వోటింగు విధానం. అందులోని మొదటి వాక్యం ఇలా చెబుతోంది: "చిత్తు ప్రతిపాదనపై చర్చలు జరిపి, వీలైనంత ఎక్కువ మందికి సమ్మతమైన రూపంలో మాత్రమే ప్రతిపాదనను వోటు ప్రక్రియలో పెట్టాలి." మరి ఈ వోటింగుకు ముందు జరిగిన చర్చలో ఎక్కువమంది అడిగిన రూపం ఏంటి? 30% మానవిక అనువాదం అలాగే ఉండాలని, ప్రస్తుతం ఉన్న పద్ధతినే కొనసాగించాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు కదా. మరి వోటింగు ఎందుకు పెట్టారు? సరే పెడితే పెట్టారు.. ఏ అంశం మీద వోటింగు పెట్టాలి.. 30% పరిమితి అలాగే ఉండాలని మెజారిటీ భావిస్తున్నారు, ఇది మీకు సమ్మతమేనా అని అడగాలి. ఆ ప్రశ్న అడగలేదు సరికదా, ప్రశ్నకు కొత్త జోడింపు కూడా చేసారు. దాన్ని జోడించాలో లేదో చర్చలో చర్చించలేదు. అయినా ఇక్కడ దాన్ని తెచ్చి పెట్టారు.
  • వోటింగు పద్ధతిపై అవగాహన లేదు: ఒకేసారి రెండు అంశాలను కలిపేసి వోటింగుకు పెట్టినపుడు ఏ పద్ధతిని అనుసరించాలి అనే విషయమై ఈ వోటింగు నిర్వాహకుడికి అవగాహన లేదు. ఆ సంగతి తెలుసుకునేందుకు ఇక్కడ ఒక చర్చ పెట్టారు కూడాను. ఆ చర్చలో ఏమీ తేలకుండానే, ఇక్కడ వోటింగును మొదలుపెట్టేసారు. ఏం చెయ్యాలో అవగాహన లేనపుడు ఆ అవగాహన తెచ్చుకుని సముదాయం అంగీకారంతో కదా, చెయ్యాల్సింది! కానీ ఇక్కడ వోటింగు నిర్వాహకుడు దాన్ని పాటించలేదు.
  • వోటింగుపై ప్రచారం చేసారు: వోటింగులో పాల్గొనమంటూ ఎవరూ ఎవరికీ ఈమెయిళ్ళు పంపరాదు. అందునా అందరికీ పంపకుండా ఎంచుకున్న కొందరికి మాత్రమే పంపడం అసలే ఎయ్యకూడదు. అది కాన్వాసింగు కిందకు వస్తుంది. ఈ వోటింగులో ఈమెయిళ్ళు పంపినట్టు తెలుస్తోంది. అయితే వోటింగు నిర్వాహకుడు దాన్ని నిర్ధారించాలి. దానిపై వివరణ ఇవ్వాల్సి ఉంది. మెయిళ్ళు పంపారా, ఎవరెవరికి మెయిళ్ళు పంపారు, ఎవరెవరికి పంపలేదు (కనీసం ఈ వోట్లేసిన వాళ్లలో) చెప్పాలి.
  • వోటింగులో అక్రమాలు జరిగాయి: పైన వెంకటరమణ గారు ఎత్తి చూపిన రెండు విషయాలు సింపులుగా తేల్చేసేవి కాదు. లాగినవకుండా వోటు వెయ్యడం రిగ్గింగు అవుతుంది, దొంగవోటు వెయ్యడం అవుతుంది. దుశ్చర్య. స్వయంగా సదరు వాడుకరులు కూడా లాగినవకుండా వెయ్యకూడదు. అది దుశ్చర్య, శిక్షార్హం. ఆ పని చేసిన వారెవరో శోధించి వారిపై చర్య తీసుకోవాలి. ఇవేవీ చెయ్యకుండా వోటింగు నిర్వాహకుడు, లెక్క మార్చేసి, సింపులుగా తేల్చేసారు. ఇకనైనా దర్యాప్తు మొదలెట్టాలి.
  • వోటింగు ఫలితాన్ని సరిగ్గా లెక్కించలేదు: వోటింగు ఫలితాన్ని గణించాలంటే వోటేసిన వోటర్లంతా అర్హత గలవాళ్ళేనా అని చూసి, వోటింగులో అక్రమాలేమీ జరగలేదని నిర్ధారించుకుని, లెక్కింపు చేసి ఫలితం ప్రకటించాలి. ఇది సరిగ్గా చెయ్యలేదు. ఫలితాన్ని ఒకసారి సవరించాల్సి వచ్చింది. రెండు వోట్లు తీసెయ్యాల్సి వచ్చింది. వోట్ల మధ్య తేడా బాగా ఎక్కువగా ఉంది కాబట్టి సరిపోయింది. బాగా పోటాపోటీగా జరిగి ఉంటే ఈ తప్పు పర్యవసానం పెద్ద యెత్తున ఉండి ఉండేది. ఇలాంటి క్లరికల్ దోషాలు జరక్కుండా చూసుకోవాలి.
  • ఇకపోతే ఈ మొత్తం వ్యవహారంలో ప్రజాస్వామ్యం ఎలా పరిఢవిల్లిందో చూద్దాం. వోటింగు పద్ధతి మనకు ఎందుకు కావాలో ఆ పద్ధతి ప్రతిపాదకుడూ, ఈ వోటింగు నిర్వాహకుడూ ఇలా చెప్పారు: "ఎక్కువమంది ఎందుకు పాల్గొనటం లేదనేదానికి కారణాలు వెతికితే చాలావాడుకరులకు వికీవిజ్ఞత లేకపోవడం, చర్చలలో పాల్గొనే నైపుణ్యాలు తక్కువగా వుండడం లాంటివి వుంటాయి. కాని విధానాలు సభ్యులందరిని ప్రభావితం చేస్తాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం చాలా ముఖ్యం. వివరణ, ఓటు ఒకేసారి జరగటంతో విధానంపై స్పష్టత కూడా వుండదు. అందుకని విధానంపై స్పష్టత కొరకు వివరణ, ఖరారైన విధానం సమ్మతి ఆధిక్యత వుందో లేదో తెలియటానికి వోటు పద్ధతి ప్రవేశపెట్టడమైనది." వికీవిజ్ఞత లేనివాళ్ల కోసం వోటింగు పెట్టారట. వోటింగు గురించి ప్రచారం చేసుకున్నారు, వోట్లలో రిగ్గింగూ జరిగింది (ఎవరు చేసారో నిగ్గు తేల్చాల్సి ఉంది). భలే, ప్రజాస్వామ్యం తు.చ తప్పకుండా అమలైంది. (దీనికి కొసమెరుపు ఏంటంటే, ఇక ముందు నోరెత్తిన వాళ్ళపై "తగిన పర్యవసానాలుండేలా" చూస్తారంట. భేష్!) బహుశా అంచేతనే నేమో.. వోటింగు పద్ధతి గురించి వికీపీడియా ఇలా చెప్పింది: "వికీపీడియా ప్రజాస్వామ్యంలో ప్రయోగం లాంటిదేమీ కాదు. ఇక్కడ విస్తృతాభిప్రాయం సాధించే పద్ధతి -చర్చేగానీ, వోటింగు కాదు. అంటే, అధిక సంఖ్యాకుల అభిప్రాయమే నియమం కావాలనేమీ లేదు. నిర్ణయం తీసుకోవడంలో వోటింగు ఒక అంగం మా త్రమే. వోటింగుతోపాటు జరిగే చర్చ, విస్తృతాభిప్రాయం సాధించడంలో కీలకం. ఉదాహరణకు, వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో జరిగే చర్చ." ఈ వోటింగులో ప్రజాస్వామ్యం వర్ధిల్లిందనే స్టేట్మెంట్లు ఎంత తక్కువగా ఇస్తే అంత మంచిదని నాకు అనిపిస్తోంది.
మొత్తమ్మీద ఈ వోటింగు పద్ధతిలో ఆద్యంతం లోపాలున్నట్టుగా కనిపిస్తోంది. వోటింగు పెట్టాల్సిన అవసరమంటూ మళ్ళీ ఎప్పుడైనా వస్తే ఈ తప్పులేవీ చెయ్యకుండా నిర్వహిస్తే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 08:38, 22 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఏ విషయమై చర్చ లేదా ఓటింగు పెడుతున్నారో స్పష్టంగా సూటిగా పేర్కొనలేదు. ముఖ్యంగా ఈ చర్చ అనువాద యంత్రం గురించి కాబట్టి ఇందులో సాంకేతిక అంశాలను సరళంగా, స్పష్టంగా, సూటిగా ఉదాహరణలతో సహా చెప్పి ఉండాల్సింది. ఇందువల్ల అనవసర చర్చ తగ్గి ఉంటుంది. అనువాద పరికరం గురించి ఒక మోస్తరు అవగాహన ఉన్న నేను ఈ ప్రతిపాదనను అర్థం చేసుకోవడానికి పలు మార్లు చదవవలసి వచ్చింది. అనువాద పరికరంలో పరిమితిని 30% నుండి తగ్గించాలి అనే అంశంపై ఒకసారి చర్చకు పెట్టిన తర్వాత మెజారిటీ సభ్యులు దానివల్ల నాణ్యతాపరమైన సమస్యలు వస్తాయని వ్యతిరేకించారు. మళ్ళీ దాని మీద ఓటింగ్ ఎందుకో నాకు అర్థం కాలేదు. పైగా ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేసిన వారిలో చాలా మంది తమ అభిప్రాయాలు చెప్పకుండా ఓటు మాత్రం వేశారు. చివరగా నేను చెప్పేది ఈ ప్రక్రియ చాలా కాంప్లెక్స్ (గందరగోళం) అయిపోయింది. ఇక ముందు జరగబోయే చర్చలు సూటిగా, సరళంగా ఒక విషయం మీదనే జరుగుతాయని ఆశిస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 10:44, 22 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • కేవలం ఇద్దరు మాత్రమే పాల్గొన్న చర్చ ప్రకారం చేసిన విధాన నిర్ణయం వలన, సభ్యులపై ప్రతికూల ప్రభావం పడుతున్నా, వికీఅభివృద్ధికి నిరోధకంగా వున్నా దానిని మార్చటం ఎంత కష్టమో తెలిసివచ్చింది. కావున సాంప్రదాయ పద్ధతిలో విధాన నిర్ణయాలు చేయడం మానివేయడం మంచిది. --అర్జున (చర్చ) 00:09, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • రోజులు గడిచే కొద్దీ ఈ వోటింగును జరిపిన పద్ధతిలోని దోషాలు వెలుగులోకి వస్తున్నాయి. వోటింగు పద్ధతిలో దొర్లిన లోపాలు ఒక ఎత్తు కాగా, అసలు లోపాలున్నాయని భావించకపోవడం, ఆయా లోపాలను అసలు గుర్తించకనే పోవడం పెద్ద లోపమై కూచుంది. వోటింగు గురించి ఈమెయిళ్ళు రాయడం తప్పు, అందునా ఎంచుకున్న కొందరికి రాయడం మరీ తప్పు. ఈమెయిళ్ళు కొందరికే రాసానని వోటింగు నిర్వాహకుడు ఒప్పుకున్నారు. కానీ (వోటేసిన వాళ్ళలో) ఎవరెవరికి ఈమెయిలు రాసారో చెప్పమని అడిగినా చెప్పలేదు. ఆకాశంబున నుండి... పవనాంధోలోకాలకు చేరేట్టుగా కనబడుతోంది ఈ వోటింగు వ్యవహారమంతా. __చదువరి (చర్చరచనలు) 01:24, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • చదువరి గారు, 20 వ తేదీ సాయంత్రం 4:30 IST తర్వాత వ్యతిరేఖంగా ఉన్నపళంగా దాదాపు 21 ఓట్లు పడ్డాయి. ఇవి ఎలా వచ్చాయి ? వ్యతిరేఖించిన అనుభవజ్ఞులైన నిర్వాహకులు తమ ప్రోత్సాహంతో తెవికీ లో చేరిన వారిని లేదా తమకు వ్యక్తిగతంగా తెలిసిన వారిని వ్యతిరేఖంగా అత్యవసరంగా ఓటేయమని విద్యుల్లేఖలు, చరవాణి పిలుపులు ఏమైనా చేశారా ? ____దేవుడు (చర్చ) 03:57, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
  • <<<దేవుడు గారూ, ఈ విభాగం చర్చ కోసం కాదు కాబట్టి, మీ ప్రశ్నను ఉన్నదున్నట్టుగా పైనున్న "ఓటు ఫలితం పై అభ్యంతరాలు" అనే విభాగం లోకి మార్చి, అక్కడే నా సమాధానం రాసాను, పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 05:56, 23 సెప్టెంబరు 2020 (UTC)>>Reply[ప్రత్యుత్తరం]
 • నేను ఈ ఓటింగు విధానానికి వ్యతిరేకం అని ఇదివరకు తెలియజేసాను. ఈ వోటింగు విధానం లో చర్చలో వీలైనంత ఎక్కువ మందికి సమ్మతమైన రూపంలో ఉన్న అంశాన్ని ఓటింగులో పెట్టమని ఉంది. ఎక్కువ మంది ప్రస్తుత ప్రతిపాదనను తగిన కారణాలతో సహా వ్యతిరేకించారు. అందువలన ఈ ప్రతిపాదన ఓటింగులో పెట్టడానికి అర్హమైనది కాదు. కానీ అర్జున గారు వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2 లో "చర్చలో నిలిచిన ప్రతిపాదన" అని ఆ ప్రతిపాదనను ఓటింగుకు నిర్వహించడం సరైనది కాదు. రెండు వారాల వ్యవధిలో అనుకూలంగా 13 ఓట్లు వచ్చిన సమయంలో సెప్టెంబరు 20 నాటికి వ్యతిరేకంగా 12 ఓట్లు ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన నెగ్గి ఎక్కడ యాంత్రిక కాలుష్యం వికీలో చేరుతుందని నాకు ఓటింగు ఇష్టం లేకపోయినా వ్యతిరేకంగా ఓటు చేసాను. తరువాత వ్యతిరేకంగా ఓటింగు పెరిగే కొద్దీ అనుకూలంగా అనామక వాడుకరులు వారి దుశ్చర్యలతో రిగ్గింగ్ చేసారు. అది సామాన్యమైన విషయం కాదు. దానిపై విచారణ చేయాలి.ఓటింగు నిర్వహించిన వారు ఓటింగుకు అర్హులైన వారినే కాదు, రిగ్గింగ్ ఓట్లను కూడా చూసి ఫలితాన్ని ప్రకటించాలి. ఓటింగులో పాల్గొన్న వ్యక్తులలో ఒక్క అనువాదం కూడా చేయని వారు కూడా ఉన్నారు. యాంత్రికానువాదం చేసేవారు వారి అనుభవాలను చర్చలలో తెలియజేసారు. అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఓటు వేసే వారు వారి అభిప్రాయాలను కూడా చర్చలలో చెబితే బాగుంటుందని నా అభిప్రాయం.
 • ఓటింగు ప్రక్రియ అంతా పరిశీలిస్తూనే ఉన్నారు. వారికి మరల రచ్చబండలో ప్రచారం అనవసరమైన విషయం. అలాగే ఈ ప్రతిపాదన చేసే వ్యక్తిగా అర్హులైన వాడుకరులకు ఈ మెయిల్ సందేశాలను పెట్టడం సరైన విధానం కాదని నా అభిప్రాయం. ఆ మెయిల్ లో అనుకూలంగా/ వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పక పోయినా, ఓటింగులో పాల్గొనమని మాత్రమే చెప్పినా ఆ మెయిల్ అందుకున్న వాడుకరి స్పందించి అది పంపిన వాడుకరి ఎలా ఓటు వేసాడో గమనిస్తాడు. కనుక అతను కూడా అతని ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది. ఇది ఓటర్లను ప్రభావం చేసే అంశంగా నేను భావిస్తాను. ఇది ప్రచారం కిందికి వస్తుందని అనుకుంటున్నాను. ఎన్నికలలో ఒక వ్యక్తి పోటీ చేసి ఓటర్లకు ఓటింగుకు రమ్మని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తుంటే తనకే మద్దతు ఇమ్మని అర్థం కానీ, మీరు వచ్చి మీకు నచ్చినట్లు ఓటేయండి అని కాదు కదా. కనుక ఈ మెయిల్ సందేశాలకు నేను వ్యతిరేకం.

ఇక ముందు ఇటువంటి అంశాలపై చర్చలు జరిగేటప్పుడు "ఎక్కువ మందికి సమ్మతమైన ప్రతిపాదన" ను మాత్రమే ఓటింగులో పెట్టాలని నా అభిప్రాయం.--కె.వెంకటరమణచర్చ 08:16, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

< ప్రతి వ్యాఖ్యకు పై వరుసలో *తో చేర్చి వికీసంతకం చేయండి>

మీనాగాయత్రి, నాగరాణి బేతి, మేకల హారిక గార్ల విజ్ఞతను పరిగణించడంపై చర్చ[మార్చు]

<<<గతంలో ఈ చర్చంతా #బాగా జరిగినవి అనే విభాగంలో జరిగింది. కానీ ఆ విభాగంలో చర్చ జరపడం సముచితం కానందువలన దాన్ని ఈ కొత్త విభాగానికి ఉన్నదున్నట్టుగా తరలిస్తున్నాను>>>

చదువరి గారు, మీనాగాయత్రి గారు, మేకల హారిక గారు, నాగరాణి గారు - ఈ ముగ్గురు వాడుకరుల విజ్ఞత పరిగణనలోకి తీసుకోవడం సబబు కాదేమో! ఎందుకంటే వారి వాడుకరి పుటలను పరిశీలించిన పిదప నాకు అర్థమైన విషయం వారు ఈ ప్రతిపాదన చర్చలలో వ్యతిరేఖించిన నిర్వాహకుల వారికి బాగా వ్యక్తిగతంగా తెలిసిన వారు.

1.___మీనాగాయత్రి గారు--పవన్ సంతోష్ గారి ప్రోత్సాహం తో తెవికీ లో చేరారు. 2.___నాగరాణి గారు-- ప్రణయ్ రాజ్ వంగరి గారి సతీమణి. 3.___మేకల హారిక గారు-- వీరి ప్రొఫైల్ లో పేరు తప్ప ఏ వివరాలు లేవు కానీ నేను భావిస్తున్నా! _______దేవుడు (చర్చ) 04:37, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

దేవుడు గారూ, పోనీ ఎవరెవరి విజ్ఞతను పరిగణించమంటారో చెప్పండి. మీ విజ్ఞతను గణించమంటారా, అలాగే గణిస్తాను. పోనీ మీ చుట్టాలో, మిత్రులో ఎవరైనా ఉంటే, వాళ్ళ విజ్ఞతనూ గణించమంటే చెప్పండి, గణించేస్తా. నమస్కారం సార్.
దేవుడు గారు చెప్పిన పై ముగ్గురూ దేవుడు గారు చెప్పిన/భావిస్తున్న పై వారికి చుట్టాలే కావచ్చు. కానీ వారు ఆ చుట్టరికాన్ని వాడుకునే ఉంబే, ఈ వోటింగుకు ముందు జరిగిన చర్చలోనే వాళ్ల వ్యతిరేకతను రాసి ఉండేవారే కదా. ఈ కనీస మాత్రపు ఇంగితం నాకుంది. నేను ఆ చుట్టరికాన్ని ప్రస్తావించి, ఈ చుట్టరికాలు ఉన్నా కూడా వీళ్ళు చర్చలో పాల్గొనలేదు, ఎంత గొప్పవారో అని మరింత మంచిగా రాసేసి ఉండొచ్చు, ఆ అవకాశం ఉంది నాకు. కానీ, నేను అలా రాయలేదు, వాడుకరుల చుట్టరికాలను ప్రస్తావించడం పద్ధతి కాదనే మరో ఇంగిత జ్ఞానం కూడా నాకు ఉంది. అందుకే ప్రస్తావించలేదు. __చదువరి (చర్చరచనలు) 06:21, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారు, క్షమించండి. మీ నుంచి ఇటువంటి వాఖ్యల్ని నేను ఆశించలేదు. పైన వారు ప్రస్తావించిన వాఖ్యలనే మీరు ఉటంకించి వారి విజ్ఞత గురించి మీరు పైన చాలా గొప్పగా చెప్పారు. మీకు ఒక విషయం. పైన వారి వారి వాడుకరి పుటలలోని విషయమే నేను ప్రస్తావించాను తప్ప నా భాష,భావం కట్టు తప్పలేదు. ఎవరినీ వ్యక్తిగతంగా అనలేదు. నాకు సంబందించిన వారెవ్వరూ ఈ వికీపీడియాలో లేరు. భారత ఎన్నికల కమిషన్ లోని పై పదవుల్లో నా చుట్టాలు ఉండి, నేను అల్ టైమ్ రికార్డులో గెలిచి ఈ దేశానికి ప్రధాన మంత్రి అయితే ఎవరైనా అలాగే అంటారు, కానీ మనం మన విశ్వనీయత నిరూపించుకోవాలి. నా చూట్టాలలో,స్నేహితులలో తెలుగు మాట్లాడితేనే చులకనగా చూసే వారు ఉన్నారు. కాబట్టి నేను తెలుగుకు దూరం కాలేదు. నేను తెలుగుగా ఇప్పటికీ గర్వపడుతా. మీరు వాడిన భావార్ధాలకు బాధ పడుతున్నా. ధన్యవాదాలు. దేవుడు (చర్చ) 07:07, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
మీనాగాయత్రి గారు తెవికీలో అనువాద వ్యాసాలలో విశేష కృషి చేసారు. నాగరాణి గారు గత మూడున్నరేళ్ళుగా వికీలో తమ సేవలనందిస్తున్నారు. వారు యాంత్రికానువాదాలపై కృషి చేసారు కాబట్టి వారు అభిప్రాయం చెప్పడంలో తప్పు ఏముంది? వికీ విధానాలపై అవగాహన ఉన్న వారి విజ్ఞత పరిగణనలోకి తీసుకోవడం సబబే. వారు వికీ నిర్వాహకుల బంధువులు కావచ్చు. అది మనకనవసరం. వారి కృషినే పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ అర్జునగారు ప్రతిపాదించిన విషయానికి అనుకూలంగా ఓటు వేస్తే అతని వర్గం, వ్యతిరేకంగా ఓటువేస్తే వ్యతిరేక వర్గం అని ఉండదు. ఇక్కడ ఎవరికి ఎవరూ వ్యక్తిగతంగా స్నేహితులు కాదు, అందరూ వికీ మిత్రులు మాత్రమే.--కె.వెంకటరమణచర్చ 07:34, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
దేవుడు గారూ, చుట్టరికాలున్నందున వారి విజ్ఞతను పరిగణించకూడదనే మీ మాట ఉంది చూసారూ దానికి జవాబుగా రాసానంతే. హారిక గారి "ప్రొఫైల్ లో పేరు తప్ప ఏ వివరాలు లేవు కానీ నేను భావిస్తున్నా!" అని కూడా రాసారు. అన్యాయం కదూ ఆ మాట! నాకు కష్టం కలిగించాయి మీ మాటలు. మీ ఇంటికి మా ఇల్లెంత దూరమో మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరం అన్న సంగతిని గ్రహించాలి సార్. ఏదేమైనప్పటికీ, మీకు కష్టం కలిగేలా, మీరు బధ పడేలా జవాబిచ్చినందుకు నన్ను మన్నించండి.__చదువరి (చర్చరచనలు) 07:37, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
మీనాగాయత్రి గారు, నాగరాణి, మేకల హారిక గారు, ఈ ముగ్గురు వాడుకరులూ ఈ చర్చలలో వారి అబిప్రాయాలు వెల్లడించి, వారి అబిప్రాయాలతగ్గట్టుగా ఓటుప్రక్రియలో విజ్ఞతతో ఓటు వేయటం నిజంగా అభినందించతగ్గవిషయం.పని కట్టుకని ఆ ముగ్గురిపై మీనాగాయత్రి గారు, పవన్ సంతోష్ గారి ప్రోత్సాహంతో తెవికీ లో చేరారని, నాగరాణి గారు, ప్రణయ్ రాజ్ వంగరి గారి సతీమణిని, మేకల హారిక గారు-- వీరి ప్రొఫైల్ లో పేరు తప్ప ఏ వివరాలు లేవని, కానీ నేను భావిస్తున్నా! (ఈమె కూడా ఇలాంటి కోవకు చెందిఉండవచ్చు) అనేఅభిప్రాయం వచ్చేలాగున ఈ విభాగంలో వ్యాఖ్యలు చేయటం చాలా దురదృష్టకరం.భార్య కావటం, బంధువులు కావటం, ప్రొఫైల్ లో పేరు తప్ప ఏ వివరాలు లేక పోవటం తప్పు ఎలా అవుతుంది.విజ్ఞత ఉన్నవారు ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరు.వ్యక్తిగతంలోకి చర్చలను లాగటం ఎంత మాత్రం హర్షించతగ్గవిషయంకాదు.ఇక ముందు ఇలాంటివి జరుగకూడదని భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:52, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు, క్షమించండి, నేను పైన ముందు గానే నా దృక్కోణం చక్కగా వివరించాను. విజ్ఞత ఉన్నవారు మరొక్క సారి చదవగలరు. మీకు పెద్దవారు కానీ ప్రాపంచిక విధానాలు తెలియట్లేదు అని భావిస్తున్నాను. ఎందుకంటే 8 సంవత్సరాలపైన నా ఉద్యోగ పరంగా పలు బహుళ జాతి సంస్థలలో పని చేసి ఆ సంస్థల Code Of Ethics, Code of Conduct నెమరు వేసిన వాడిగా చెప్తున్నాను. నేను చేసిన వాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదు. మీలో ఎవరైనా సరే ఏ బహుళ జాతి సంస్థలో చేస్తే అక్కడి Code of Conduct and Code of Ethics చదివి ఉంటే నా వాఖ్య ఎలా విజ్ఞత లేనిదో తెలుపగలరు. మీరు పని చేసే ఆ సంస్థ ఏదో పేరు చెప్తే ఆ సంస్థ జాల స్థలములోకి వెళ్ళి వారి Code of Conduct and Code of Ethics చదివి తరిస్తాను. వికీపీడియా కూడా అంతర్జాతీయ సంస్థ కావున ఇక్కడ మనం కూడా ఓ లక్ష్యం తో పని చేస్తున్నాం కావున Code of Conduct and Code of Ethics ఎక్కడైనా అవే ఉంటాయి ప్రతి మనిషికి ప్రత్యేకంగా ఉండవు. ____దేవుడు (చర్చ) 09:35, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణగారు, ఎలా ఉన్నారు అండీ ? బాగున్నారనే భావిస్తాను. వారి కృషిని నేనేదో తక్కువ చేసినట్టు మాట్లాడొద్దు. నేను అది ఎప్పుడు చేయలేదు. మీరు చెప్పారు కాబట్టి ఇంకా వారి కృషికి అభినందనలు చెప్తున్నా. కానీ బౌగోళిక సంస్థాగత నియమావళి ప్రకారం వెళ్లాల్సిన విధానంలో కాకుండా ఇష్టప్రకారం వెళ్తే అది అవినీతి కిందకు వస్తుంది. ఆంగ్లంలో చెప్పాలంటే Corruption, Conflict of Interest అంటారు. దేవుడు (చర్చ) 12:07, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

దేవుడు గారూ, ఈ ఓటింగ్ పద్ధతిని నేను తిరస్కరించాను. 1) చర్చలో ఏకాభిప్రాయం ప్రతిపాదనకు వ్యతిరేకంగా వస్తే ఆ ప్రతిపాదన నిలబడిందంటూ అడ్డగోలుగా ప్రతిపాదకుడే ముగిస్తూ ఓటింగ్‌కు వెళ్ళడం తెవికీలో నభూతో నభవిష్యతి. 2) రెండు విషయాలను జమిలిగా ఓటింగ్ ఎప్పుడూ ఎక్కడా పెట్టరు. ఉదాహరణకు పార్లమెంటుకూ, అసెంబ్లీకి ఒకే ఓటు వెయ్యమని చెప్తే అది ప్రజాస్వామ్య ప్రక్రియనే అపహాస్యం చేయడం అవుతుంది. ఇలా రాస్తే వంద కారణాలు ఉన్నాయి. కాబట్టి, నేను ఈ ఓటింగ్ ప్రక్రియను తిరస్కరించాను. ఆనాడూ, ఈనాడూ అదే మాట మీద ఉన్నాను. అర్జున గారు కొద్దిమందినే ఎంచుకుని మెయిళ్ళు పంపారన్నా, కొంతమంది వాడుకరుల పేరుతో అజ్ఞాత వ్యక్తులు ఐపీ అడ్రస్ నుంచి సంతకాలు చేశారన్నా ఈ ఓటింగ్ ప్రక్రియ ఇలాంటిది కాబట్టి ఇంతకన్నా మంచిగా ఏమీ జరగదని పట్టించుకోలేదు. అలాంటిది, నా పేరును మీనాగాయత్రి పేరును ప్రస్తావించి మరీ నిరాధారమైన ఆరోపణ చేయడానికి ఎంత ధైర్యం మీకు? మీనా గాయత్రి కేవలం నేను ప్రోత్సహించి తీసుకువచ్చిన వ్యక్తి మాత్రమే కాదు, నా చెల్లెలు. నేను చేసినవి 100 అనువాదాలైతే, ఆమె చేసినవి 200 పైచిలుకు. ఆమెను పిలవదలుచుకుంటే నెలన్నర క్రితం జరిగిన చర్చలోకే ఆహ్వానించేవాడిని. అలా పిలిచేవాడిని కాదు కాబట్టే, నిత్యం ఆమెతో ఏవోక విషయాలు మాట్లాడుతూనే ఉన్నా ఈ విషయం మాట్లాడకుండా ఊరుకున్నాను. ఓటింగ్ ప్రక్రియకు నేను అన్ని విధాలా వ్యతిరేకం. నా స్టాండ్ ప్రకారం ఈ చర్చలో వ్యతిరేక ఓట్లు వేసినా, అనుకూల ఓట్లు వేసినా ప్రక్రియను సమర్థించినట్టే. అలాంటి నాస్టాండ్‌కీ, ఓటింగ్ ప్రక్రియను వ్యతిరేకిస్తూనే ఓటు వేసిన ఆమె స్టాండ్‌కీ ఏమిటి సంబంధం? ఈ ఓటింగ్ అన్నదొక అసంబద్ధమైన చర్య అన్న నా అభిప్రాయం వల్లనే దీనిపై నేను చెప్పాల్సింది చెప్పి తెవికీలో నేను చేయగల మిగతా పనులు ప్రశాంతంగా చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు పిలిచి మళ్లీ ఇందులోకి లాగారు. చాలా అయిష్టంగా దిగవలసి వస్తోంది. మనుషులకు నిబద్ధత అనేదొకటుంటుంది. కనీసం అవతలి వ్యక్తి గురించి మీకు తెలియనప్పుడు "సదుద్దేశం" ఆపాదించుకుని చూడాలి. ప్రణయ్ రాజ్ గారు, నాగరాణి గారి విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఆయన తలచుకుంటే ఏనాడో ఆవిడను చర్చలో రాయమని కోరేవాడే. మీకు తెలియని ఇంకొక విషయం చెప్తాను, తెలుసుకోండి. సుజాత గారు వచ్చి అనుకూలంగా ఓటు వేశారు కదా. ఆవిడ భర్త శ్రీరామమూర్తి గారు. ఆయనకు కూడా ఓటింగ్ అర్హత ఉంది. ఐనా ఆయనను ఓటేయమని ఆవిడ ఆహ్వానించనూ లేదు, ఆయనా ఓటు వేయలేదు. మీకు కోడ్ ఆఫ్‌ ఎథిక్స్ తెలుసన్నారు. తగిన సాక్ష్యాధారాలు లేకుండా, ఊహించుకుని అవతలి వ్యక్తి మీద తప్పులు ఆపాదించి అవమానించడాన్ని కార్పొరేట్ ప్రపంచంలో ఏమంటారు? నాకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ తెలుసు. ఇక్కడ అది ఎందుకు వచ్చింది? కరెప్షన్ అని ఏమీ నిరూపించకుండా ఊహించుకుంటూ ఎలా అంటున్నారు. ఇది నా డిగ్నిటీకి భంగం కాదా? --పవన్ సంతోష్ (చర్చ) 15:53, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఏమిటీ రభస? ఒక వ్యక్తి పేరు తీసి అడిగేప్పుడు పాటించాల్సిన కనీస మర్యాద అవతలివారు సమాధానమిచ్చేవరకూ అంచనాలకు వచ్చెయ్యకపోవడం. ఏకంగా కరెప్షన్లూ, కాన్ఫిక్ట్ ఆఫ్‌ ఇంటరెస్టులూ అనేయడమేంటి? వికీపీడియా:ఐదు మూలస్తంభాలు ఒకసారి చదువుకు రండి దేవుడు గారూ. అందులో నాలుగవ మూల స్తంభం చదివి మీ వివరణ చెప్పండి మీరన్న మాటలు ఆ గీటురాయి మీద నిలబడతాయో లేదో! --పవన్ సంతోష్ (చర్చ) 15:57, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ముగ్గురు వాడుకరుల విజ్ఞత పరిగణలోకి తీసుకోరా? అందులోనూ ముగ్గురూ మహిళలేనా? ఒకరు తెలుగు వికీపీడియాలో మరెవరూ చేయనన్ని అనువాదాలు చేసినామె, మరొకరు పొరబాటు అనువాదాలు చేసిన ఒక గ్రూపులోంచి వచ్చి మావి పొరబాట్లని చెప్పినామె, మూడవ ఆమె ఏకీభవించినామె. ఏమిటిదంతా? ఒక్కో ముక్కా చదివే కొద్దీ చాలా విసుగ్గా ఉందీ చర్చ. ఏమిటిదంతా? ఇందుకేనా ఈ చర్చలు ప్రారంభించింది? ఇక్కడ జరుగుతున్నదేమిటి వ్యక్తిత్వ హననాలా? విజ్ఞతా హననాలా? --పవన్ సంతోష్ (చర్చ) 16:03, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఈ విధమైన వివక్షను, నిరాధారమైన ఆరోపణలను ఏ సంస్థలో ఊరుకుంటారు? వికీలో కొన్ని నియమ నిబంధనలున్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనవి - ఐదు మూలస్తంభాలు. వాటిలోకెల్లా చర్చించేవారికి ప్రధానమైనది "వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి" అన్న మూల స్తంభం. "నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప." ఇక్కడ కొందరి విజ్ఞతను కొందరితో సంబంధ బాంధవ్యాలు ఉన్నదన్న ఒకే కారణంతో తిరస్కరించడం, దానికి తోడు అవినీతి వంటి తీవ్రపదజాలం వాడడం ఆ మూలస్తంభాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. నా దారిన నేను అభిప్రాయం చెప్పి, నా పని చేసుకుంటూ పోతూంటే ఇంత హద్దుమీరడమా? మొదటి నుంచీ మీమీద నేను ఒక విధమైన నమ్మకం పెట్టుకున్నాను. క్రమేపీ వికీపీడియా విధానాలు తెలుసుకుని మంచి కృషిచేస్తారని. ఆ విషయం పలు చర్చల్లో కూడా వెల్లడించాను. వ్యక్తిగతంగా మీమీద ఎన్నడూ దాడిచేయలేదు. అలాంటిది, అకారణంగా నామీద ఇంతలేసి నిరాధార ఆరోపణలు చేస్తారు? ఇదేనా మీ విజ్ఞత? --పవన్ సంతోష్ (చర్చ) 16:26, 23 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు, నేనెక్కడ మిమ్మలని అగౌరవపరిచాను. నేను ఒక్క మాట కూడా మిమ్మలని లేదా ఆ ముగ్గురిని అగౌరవ పరిచే విధంగా అనలేదు. నేను వారి కృషిని కించపరచలేదు. కానీ నేనేదో వారి కృషిని అవమానించినట్టు, అగౌరవ పరిచినట్టు, వారు మహిళలు కాబట్టి అన్నట్టు దయచేసి చిత్రీకరణ చేయడం ఆపండి. మీరన్న కూడా నాకు గౌరవం ఉంది. ఆ ముగ్గురు అన్నా కూడా గౌరవం ఉంది. మీకు విషయం అర్థం కాలేదని భావిస్తున్నాను.
 • నేను ఓ సంస్థలో మేనేజర్ అనుకుందాం, నా కుటుంబ సభ్యులు దాదాపు అందరికీ ఉద్యోగాలిచ్చి, నా శక్తియుక్తులతో వారిని సమావేశాల్లో పొగిడి, వారికే పదోన్నతులు కల్పించానంటే మిగతా ఉద్యోగులు ఏమంటారు ? ఓ ఉద్యోగి ఓ జెన్యూన్ proposal తో వస్తే నేను వ్యతిరేఖం అయితె వీరు ఎవరికి మద్దతు తెలుపుతారు ? ఇది ఏ కారణం గా మంచిది ?

1. ఇక్కడ ఓ బూటకపు ఉద్యోగ కల్పన జరిగింది!(Fictious Hiring & Corruption) 2. నా శక్తియుక్తులతో వారిని సమావేశాల్లో పొగడటం. (Conflict of Interest) 3. నాకున్న అధికారాలను వారి కోసం misuse చేయడం. (not adhering to the organisation policies and abusing of others rightful opinion) 4. వీరికి పదోన్నతులివ్వడం. (Promoting with self Interest/Conflict of Interest) 5. మన వృత్తి రహస్యాలు తెలియకూడనివి వీరికి తెలిసే అవకాశం ఉండటం. (Serious Offence) నిజానికి ఇక్కడ ముందే అయిష్టత తెలిపిన వారి విజ్ఞత గురించి పొగిడిన లేదా ఈ ముగ్గురు కాకుండా వ్యతిరేఖం తెలపిన ఏ వ్యక్తిని పొగిడినా అది conflict of Interest కిందికి రాదు. నేను వారికి విజ్ఞత లేదు అనలేదు. ఇక్కడ పరిగణన లోకి తీసుకోరాదు అని మాత్రమే అన్నాను. కానీ ఇక్కడ అలా జరుగలేదు. పైన నేను చెప్పిన ఉదాహరణ చక్కగా వర్తిస్తుంది. ఉదాహరణకు నేను కూడా నా కుటుంబ సభ్యులకు ఉద్యోగ అర్హత ఉందని, బాగా కృషి చేసి అనుభవం గడించారని వాదించవచ్చు. కానీ అందుకు ఎవ్వరూ ఒప్పుకోరు. ఏ సంస్థాగత నియమాలకైనా ఇది విరుద్దం. నాకు మీరు లేదా ఇతర సభ్యులను అగౌరవ పరిచే ఉద్దేశం ఏది లేదు. కాకపోతే మన భారతదేశం లో ఏ మేనేజర్ ఒడిపోడు,దాదాపుగా ఏ ఉద్యోగి మేనేజర్ తప్పు ఉన్నా కూడా గెలువలేడు. ఎందుకంటే ఈ మేనేజర్ కి పై స్థాయి వ్యక్తులతోను, మానవ వనరుల విభాగాలకి చెందిన వ్యక్తులతోనూ మంచి దగ్గరి సంబంధాలు ఉంటాయి. బంధుప్రీతి, సొంత ఆసక్తులే గెలుస్తాయి. పైగా మనదేశంలో చట్టాల ద్వారా ఉద్యోగుల హక్కుల రక్షణ ఏ మాత్రం లేదు. ఇది మీరు నేనేదో మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని అన్నట్టు ఊహించుకుంటే ఇక దానికి నేనేమీ చేయగలను. ఒక్క వివరించడం తప్ప. _______దేవుడు (చర్చ) 01:46, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నేను ఓటింగ్ తిరస్కరించాను, ఆవిడ అంతట ఆవిడ ఓటు వేసింది. నేను ఆవిడకు ఇలా చర్చ జరుగుతోందని కూడా చెప్పలేదు. అర్జునరావు గారు ఎప్పుడో గతంలోనే ఆమె చర్చాపేజీలో (ఓటింగ్ జరుగుతున్నప్పుడు పెట్టలేదు) నోటిఫై చేశారు. నేనింత వరకూ ఆమె ఇదీ అదీ అనలేదు. మిగిలిన సభ్యులు అభినందించారు. ఆమెకేమీ పదవిలేదు పాడు లేదు. ఆమె 200 పైచిలుకు నిలిచిన అనువాదాలు చేసిందని నేను పొగడనక్కరలేదు. అది వాస్తవం. లెక్క చూసుకుని మీరే అందులో అవాస్తవం ఉంటే నాకు చెప్పవచ్చు. పైపెచ్చు ఆ ముక్క ఆవిడతో ఏ పరిచయం లేని చాలామంది వికీపీడియన్లు చెప్తున్నారు. ఆవిడ భవిష్యత్తులో ఏం రాసినా విజ్ఞత పరిగణించబోరనేనా మీరు చెప్పేది? మీరన్న నాలుగు విషయాల్లో ఏవీ ఇక్కడ వర్తించట్లేదు. నేను కానీ, మీనాగాయత్రి కానీ ఇక్కడ వికీపీడియా విధానాలకు అనుగుణంగానే వ్యవహరించాం, నేనెప్పుడూ ఆమెకు ప్రత్యేకించి అవకాశాలు కల్పించలేదు, ఆవిడకేమీ ఇక్కడ లాభదాయకమైన పదవి లేదు, మన వృత్తిలో రహస్యాలు ఉండవు పైపెచ్చు ఈ ఓటింగ్‌కు ఆవిడను నేను పిలవలేదు. ఐనా, మీరు ఆరోపించి పారేస్తారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్‌ ఇంటరెస్ట్ అంటే ఏమిటో ఎవరికీ తెలియదన్నట్టు ఇక్కడ వర్తిస్తోందా లేదా చూడకుండా పాఠం చెప్తారు. ఈ లెక్కన భవిష్యత్తులో ఆవిడ వికీలో ఏ అభిప్రాయం చెప్పినా ఈ ఒక్క కారణంతో మీరు కొట్టివేస్తారు.
ఇక, మహిళలు పాయింట్ ఆఫ్‌ వ్యూ ఖచ్చితంగా ఉందిక్కడ. నేనిది ఎందుకు తీసుకువస్తున్నానంటే - మీరు మొదటి ఇద్దరు మహిళలకు మాతో బంధుత్వాలు ఉండబట్టి వాదనలోకి తెచ్చారు. మూడో అమ్మాయి పేరు ఎందుకు తీసుకువచ్చారు? మీకు ఆధారమేంటి? ఆమె వాడుకరి పేజీ తయారుచేసుకోలేదనా? ఈ ఓటింగ్‌లో పాల్గొన్న చాలామంది పేజీ తయారుచేసుకోలేదు. మరి వారెవ్వరి విషయంలోనూ రాని ప్రశ్న వీరి విషయంలోనే ఎందుకు వచ్చింది? (చర్చ పేజీలో వీరు ముగ్గురు రాశారనవద్దు, మీరు నమ్మే ఓటింగ్ ప్రక్రియ ప్రకారం ఓటు మాత్రమే పరిగణిస్తారు, చర్చలో ఏం రాశారన్నది లెక్కకు రాదు) అసలు మీ నిబద్ధతకు లిట్మస్ టెస్ట్ చెప్పనా? ఇద్దరు సభ్యులు ఐపీ అడ్రస్‌తో ఓటింగ్‌లో పాల్గొన్నారు, అది ఓటింగ్ మాల్‌ప్రాక్టీస్ అన్న మాటకు మీరింతవరకూ మద్దతునివ్వలేదు. ఎందుకు? ఈ ఒక్కటీ చెప్పండి. (ఇప్పటికే ఇతర సభ్యులు ఎత్తిచూపారు కాబట్టి అక్కరలేదనుకున్నాని అని మాత్రం తోసిపుచ్చవద్దు.) --పవన్ సంతోష్ (చర్చ) 03:00, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
మీ వాదన చాలా బలహీనంగా ఉంది. మీరు ఏదో లిట్మస్ టెస్ట్ అని ఏదేదో అన్నారు. ఒకసారి పైన నేను చేసిన చర్చలో నేను ముందుగానే ప్రస్తావించాను. ఇంకోసారి చదవండి. మీరు మహిళల దృక్కోణం అంటే అది అసలు సమస్యను పక్కదారి పట్టించడానికి మీరు చేస్తున్న ఉద్దేశాల ఆపాదన తప్ప ఇంకేమీ లేదు. నేను చెప్పాల్సింది సవివరముగా పైననే తెలిపాను. మిమ్మల్ని గురించి వాఖ్యనిస్తే అది పురుషుల పాయింట్ ఆఫ్ వ్యూ అంటారా ?. ఆహా! సరే పైన నేను అంత చక్కగా ఉదాహరణాలతో సహా వివరిస్తే ఇంకా అర్థం కాని వారి వలె నేనేదో కించపరిచినట్టు ఇంకా అదే మాట్లాడుతున్నారు. మన వృత్తిలో రహస్యాలు ఉండవు పైపెచ్చు ఈ ఓటింగ్‌కు ఆవిడను నేను పిలవలేదు.-- మిమ్మల్ని అనుసరించరని చెప్పగలరా, మీ ఉద్దేశాలు వారు ముందుగానే తెవికీ లోనె చదివి మీ బంధుత్వం వల్ల ప్రభావితం కారా ?, మీ చర్చల వలన వారు ప్రభావితం కారని చెప్పగలరా ?, వారికి ఏ వివక్ష లేదని మీరు నిరూపించగలరా ? బయటి వారు మిమ్మల్ని మీ వాదనను అభినందిస్తే నాకే కాదు ఎవరికి అభ్యంతరము లేదు. సరే నేనో నన్ను ఇష్టపడే ఓ మందను ఇక్కడ తయారు చేసుకుని అంతా నాకిష్టమైన వాదనలతో,judgement తో ఆ నా మంద పొగడ్తలతో నింపేస్తే మీకు అది సహేతుకమేనా ? కొంచెం నేను చెప్పింది చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆమె 200 పైచిలుకు నిలిచిన అనువాదాలు చేసిందని నేను పొగడనక్కరలేదు. అది వాస్తవం. లెక్క చూసుకుని మీరే అందులో అవాస్తవం ఉంటే నాకు చెప్పవచ్చు. --నేను కాదు అని ఎక్కడ అన్నానో మీరే చెప్పాలి!!. నేను చెప్పాల్సింది పైనే వివరించాను. ఐనా, మీరు ఆరోపించి పారేస్తారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్‌ ఇంటరెస్ట్ అంటే ఏమిటో ఎవరికీ తెలియదన్నట్టు ఇక్కడ వర్తిస్తోందా లేదా చూడకుండా పాఠం చెప్తారు. ఈ లెక్కన భవిష్యత్తులో ఆవిడ వికీలో ఏ అభిప్రాయం చెప్పినా ఈ ఒక్క కారణంతో మీరు కొట్టివేస్తారు.---మీకు ఇది చక్కగా పైనే వివరించాను. అందులోనే సమాధానం ఉంటుంది చూడండి. నేను చెప్పాల్సింది వివరించాను. నేను ఈ విషయంలో నాకు 100% క్లారిటీ ఉంది అని చెప్పగలను. మీ అభిప్రాయం మీఋ చెప్పారు. అది మీ ఇష్టం. నా అభిప్రాయం లోకూడా ఏ మార్పు లేదు అని మరలా తెలియచేస్తున్నాను._____ దేవుడు (చర్చ) 04:07, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఒక పక్కన ఓటింగ్‌లో కొంతమందికే నేను మెయిళ్ళు పంపానని ఆయన ఒప్పుకున్నారు. ఇద్దరు సభ్యులు ఐపీ అడ్రస్‌తో ఓటేశారు అందతా వదిలేసి నా స్టాండ్‌కి ఏ సంబంధం లేని స్టాండ్ (నేను ఇప్పటిదాకా కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనలేదు) తీసుకున్న మీనాగాయత్రి ఇక ఏ అభిప్రాయం వెలువరించినా నా ప్రభావమే అయివుంటుందని ఊహించేసుకుని తిరస్కరించడాన్ని ఏమనాలి? రెండు వందల అనువాదాలు చేసిన మనిషికి తనకంటూ ఒక అభిప్రాయం ఉండకపోవచ్చనీ, ఉన్నా దాన్ని మరొక కుటుంబ సభ్యుడు ప్రభావితం చేసేస్తాడనీ చేసే మీ అరోపణ చాలా దారుణం. బహుశా ఎంతటి ఆరోపణ చేసినా ఏమీ నిరూపించుకోకపోయినా నా అభిప్రాయం నాది అని తప్పుకోవచ్చన్న ధైర్యం కావచ్చు. అసలు ఇదంతా వదలెయ్యండి. ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి - ఏ ఆధారంతో మేకల హారిక గారి విజ్ఞత గురించి మాట్లాడారు మీరు? ఈ ఒక్క ప్రశ్నకు మాత్రమే కింద సమాధానం రాయండి. అది వదిలి దేనికీ రాసి తప్పించుకో చూడవద్దు. -పవన్ సంతోష్ (చర్చ) 04:36, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చాలా దురదృష్టకరమైన సంగతి ఇక్కడ చూస్తున్నాను. 270 పైచిలుకు వ్యాసాలను పరికరం ద్వారా అనువదించి తెవికీలో నంబర్ 1 స్థానంలో ఉన్న వ్యక్తి విజ్ఞతను పరిగణించకూడదన్నారు. ఆమె బంధుత్వాన్ని అడ్డంపెట్టి ఆమె అభిప్రాయాలను సందేహించారు. పవన్ సంతోష్ గారికి, నాకు, విజ్ఞత లేదని ఆరోపించే మహా విజ్ఞులకూ, ప్రాజ్ఞులకూ, పుంభావ సరస్వతులకూ అనువాద పరికరం గురించి పాఠాలు నేర్పగల స్థాయిలో మీనాగాయత్రి గారు ఉన్నారు. అలాగే నాగరాణి గారి విజ్ఞతనూ పరిగణించరాదని అన్నారు. మేకల హారిక గారు ఎవరికి బంధువో తెలియక పోయినా "ఊహించుకుని" మరీ ఆమె విజ్ఞతను కాలదన్నారు. వీరి పట్ల జరుగుతున్న ఈ వ్యకిత్వ హననాన్ని నేను ఖండిస్తున్నాను. వారి విజ్ఞతను గౌరవించి, వారిని అభినందించి కొందరి అసూయకు కారణమయ్యాన్నేను. చివరికి ఈ నిందలకూ పరోక్షంగా కారణమయ్యాను. అందుచేత నేను ఆ ముగ్గురికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. దీన్ని ఇక ఆపమని దేవుడు గారిని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 05:07, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఒకవాడుకరి విజ్ఞత గురించి చెప్పడానికి మనమెవరం. బంధువైనా, మిత్రులైనా, సన్నిహితులైనా కూడా ఎవరికి వారికి ఒక వ్యక్తిత్వం, ఆలొచన ఉంటుంది. వికీ వంటి ఒక సామాజిక వేదికలో రచనలు చేయగలిగిన తెలివి ఉన్నపుడు అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాకూడదు. ఒక వేళా అలాంటి ప్రశ్నే వచ్చినపుడు దానికి వివరణలూ, సవరణలూ ఇవ్వవలసిన వసరం ఉంటుందని కూడా నేను అనుకోను. ఇంత వరకూ జరిగిన చర్చల్లో అభిప్రాయాల్లో ఏ వర్గం నుండీ ప్రతికూల స్పందన కనిపించడం లేదు. ముందుకుపోయే కొద్దీ ఎవరి విషయంపై చర్చ జరుగుతున్నదో వారు నొచ్చుకొని చర్చల్లో ప్రవేశిస్తే చర్చలు అపహాస్యానికి గురయ్యే అవకాశం ఉంది. కనుక దయచేసి ఇక్కడితో ఈ అనవరసచర్చను నిలుపుదలచేయాలని విజ్ఞత కలిగిన మిత్రులకు మనవి చేస్తున్నాను. దీనిపై ఎవరైనామరింత చర్చించాలనుకున్నా, ప్రశ్నించాలని ఉన్నా ఆవేశపడినా కూడా ముగించడం ఉత్తమం. నా అభిప్రాయం నేను తెలియచేసాను. ..B.K.Viswanadh (చర్చ) 06:37, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
దేవుడు గారిని, కోరుతున్నాను, ఈ అనవరసచర్చను నిలుపుదలచేయాలని విజ్ఞత ముందుకుపోయే కొద్దీ ఎవరి విషయంపై చర్చ జరుగుతున్నదో...B.K.Viswanadh గారి, మాట నిజం... ఇప్పటికే పవన్ సంతోష్ గారిని, చదువరి గారిని, మరికొందరిని కూడా మనసు నొప్పించారు, కావాలని కాకపోవచ్చు కానీ చర్చ తీవ్రమయ్యేసరికి అక్కడకు దారి తీసింది ... వారిని చదువరి గారు కాదు. క్షమించమని కోరడం, దేవుడు గారు ఈ చర్చ ముగించాలి. నా అభిప్రాయం ఓటేసిన 23 లో వ్యతిరేకంగా, అనుకూలంగా 15 మందిలో అందరిని వదిలేసి ముగ్గురిని ప్రస్తావించడం చర్చకు పక్కదారి పట్టింది, గమనించగలరు. Prabhakargoudnomula 08:38, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఇక్కడ జరుగుతున్న ఒరిజినల్ ప్రతిపాదన చర్చను చూస్తునేవున్నాను. ఒకరోజు ప్రణయ్ గారు నన్ను మెయిల్ గురించి అడిగారు, రాలేదని చెప్పాను.
ఫలానా వాళ్లకు వచ్చింది కదా నీక్కూడా మెయిల్ రావాలి కదా అని అన్నాడు. అప్పుడు కొందరు సభ్యులను కనుక్కుంటే కొందరికి వచ్చిందని, కొందరికి రాలేదనీ తెలిసింది. అయినా, నాకు ఓటింగ్ కి అర్హత ఉంది కాబట్టి నేను నా అభిప్రాయం రాసి అక్కడ ఓటు వేసాను. దానికి, నన్ను మెచ్చుకుంటూ ఎవరో రాస్తే మరెవరో వచ్చి నా విజ్ఞతను పరిగణించకూడదంటూ రాయడమేంటో నాకు అర్థం కాలేదు. ఈ మాత్రపు మెప్పుకోలుకు అంత రాద్ధాంతమా?
కేవలం ఓ వికీ వాడుకరితో బంధుత్వం ఉన్న కారణంగా నా విజ్ఞతను సందేహించిన వారి విజ్ఞత గురించి నేను ప్రశ్నించను. అంత ఉన్నతమైన సంస్కారం నాకు లేదు. నన్ను మా అమ్మానాన్నా అలా పెంచలేదు. పెద్దలందరికీ నమస్కారం.--Nagarani Bethi (చర్చ) 09:48, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఇక్కడ నా ప్రొఫైల్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను స్పందించవలసి వచ్చింది. నాకు అర్జున్ రావు గారు నుంచి సెప్టెంబరు 12వ తారీఖున 12:15 PM కీ ఈ అంశం గురించి మెయిల్ వచ్చింది. అందువలన నేను ఈ అంశాన్ని పరిశీలించి నా అభిప్రాయం తెలిపాను. ఇందులో నా ప్రొఫైల్ గురించి ప్రస్తావించవలసిన అవసరం ఏమి లేదని భావిస్తున్నాను. ఒకవేళ నా ప్రొఫైల్ వోటింగ్ కి సరితూగనిది ఐతే, అప్పుడు వోటింగ్ కి అర్హులైనవాళ్లలో నా పేరు చేర్చకుండా ఉండాల్సింది. ఒకల్తో బంధుత్వం ఉన్నంతమాత్రాన ఎవరు వారి అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. తెవి లో ఒక అంశం చర్చకి వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు తెలిపే స్వతంత్రం ఉందని తలుస్తున్నాను. కావున బంధుత్వాలని పరిగణించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నా మీద ఇలాంటి మాటలు వచ్చినప్పుడు ఈమెయిల్ పంపిన అర్జున రావు గారు, నాకు తానే ఈమెయిలు పంపారు అని ప్రస్తావిస్తే బావుండేది. Mekala Harika (చర్చ) 15:22, 7 అక్టోబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

రవిచంద్ర అభిప్రాయం[మార్చు]

నా అభిప్రాయాలు ఏ విభాగంలో రాయాలో తెలియక ఇక్కడ రాస్తున్నాను. ముందుగా అనువాద ఉపకరణం గురించి నా అభిప్రాయం చెబుతాను. అనువాద పరికరం అంటే ఒక వికీ భాషలోని వ్యాసాన్ని మరో వికీ భాషలోకి యాంత్రికంగా అనువాదం చేసి నేరుగా వ్యాసం సృష్టించే పరికరం. ప్రస్తుత స్థితిలో ఇది చేసే తెలుగు అనువాదం నాకు పెద్దగా నచ్చలేదు. ఒక ఐటీ సాంకేతిక నిపుణుడిగా ఇలా చెప్పడం నాకు బాధగా ఉన్నా, తెలుగు భాష మీద నాకు ఉన్న అభిమానంతో చెప్పక తప్పడం లేదు. కొన్ని పదాలు మక్కీకి మక్కీ అనువాదం చేసి ఉంటాయి. అది అనువదించే కొన్ని పదాలు ఎక్కడా ప్రాచుర్యమై ఉండవు. వాటిని వాడటం కంటే ఆంగ్ల పదాలే వాడకం మేలనిపిస్తుంది, ఎందుకంటే తెవికీ విజ్ఞాన సర్వస్వం కాబట్టి భాష కంటే ముందు అసలు విషయం అర్థం కావటం ముఖ్యం అని నేను భావిస్తాను. అనువాద వాక్యాలు కొన్ని చాలా కృతకంగా అనిపిస్తాయి. ఆంగ్ల వాక్యాల్లో బాగా పొడుగ్గా ఉన్న వాక్యాలు యదాతథంగా తెలుగులోకి అనువదించేయడం వల్ల కొన్ని సార్లు వాటికి అర్థమే ఉండటం లేదు. ఇది కాక, కొంతకాలం క్రితం ఈ ఉపకరణం వాడి కొంతమంది కొత్త వాడుకరుల సృష్టించిన వ్యాసాల భీభత్సం అంతా ఇంతా కాదు. ఏం జరుగుతుందో తెలిసేలోపు కుప్పలు తెప్పలుగా అర్థం పర్థం లేని వేలకొద్దీ వ్యాసాలు సృష్టించి పడేసారు. కేవలం సంఖ్యకోసం తప్ప వాటివల్ల ఇంకేమీ ప్రయోజనం లేదని నా అభిప్రాయం. అది వాపే కానీ బలుపు కాదు. వాటిని శుద్ధి చేయడానికి ఎంతమంది సభ్యులు ఎంత కష్టపడ్డారో, ఎన్ని చర్చలు చేశారో అందులో పాల్గొన్నవారికి తెలుస్తుంది.

అలాంటి సమయంలో మనలో కొంతమంది దృష్టి ఈ ఉపకరణం మీద పడింది. దాన్ని సరిగ్గా వాడుకుంటే వ్యాసాలు వేగవంతంగా రాయగలమని నిరూపించారు వీరు. సరిగ్గా వాడుకోవడం అంటే ఉపకరణం ఇచ్చిన అనువాదాన్ని గుడ్డిగా ప్రచురించేయకుండా దాన్ని జాగ్రత్తగా పరిశీలించి, అందులో అర్థం కాని పాఠ్యాన్ని మానవికంగా మార్చి ప్రచురించడం. ఇందుకు తెలుగు కొంచెం తెలుగు భాష మీద పట్టు, ఓపిక, సమయం అవసరం. దీని ద్వారా నాకు తెలిసిన విషయం ఏమిటంటే అనువాద ఉపకరణం నేను అనుకున్నంత చెడ్డదేమీ కాదు. దానికున్నంత పరిజ్ఞానంలో అది అనువాదం చేస్తుంది. దాన్ని మనం వ్యాసానికి ఒక పునాదిగా తీసుకోవాలి తప్ప దాని మీదే పూర్తిగా ఆధారపడకూడదు. అసలు ఏ సహాయం లేకుండా ఒక వ్యాసాన్ని నేరుగా ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించడం కన్నా ఈ ఉపకరణం ఇచ్చిన అనువాదంతో మొదలు పెడితే పని తేలిక అవుతుంది. ఉదాహరణకు మనం నేరుగా అనువాదం చేయాలంటే ఆంగ్ల పాఠ్యాన్ని మొత్తం కాపీ చేసుకోవాలి, ఒక్కో వాక్యం అనువదించి టైపు చేయాలి, తెలియని పదాలకు నిఘంటు అర్థాలు వెతకాలి. ఇది బాగా ప్రయాసతో కూడిన పని. సరిగా ఇక్కడే అనువాద పరికరం మనకు మేలు చేస్తుంది. పదాలకు చాలావరకు నిఘంటు అర్థాలు సరిగ్గా ఇస్తుంది. సరిగా లేని పదాలకు మనం అర్థం మారిస్తే చాలు. అలాగే వాక్యాల్లో పదాలు అటూ ఇటూ మార్చి నిర్మాణం మారిస్తే చాలు. అలాగే ఈ ఉపకరణానికి ఇంకో మంచి లక్షణం కూడా ఉంది. అది తప్పుగా ఇచ్చిన అనువాదాన్ని మనం మానవికంగా సరిచేసినప్పుడల్లా అది తనను తాను మెరుగుపరుచుకుంటుంది. అది అనువాదం చేసిన వ్యాసాలు నాణ్యత లేకున్నా ప్రచురించేస్తే తాను చేసిందే బాగుందని పరికరం పొరబడే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని అనువాద పరికరం ఇచ్చిన వ్యాసాన్ని అట్టే ప్రచురించేయకుండా, కొద్ది శాతం మానవికంగా చేసి ప్రచురిస్తే బాగుటుందని సభ్యులు అభిప్రాయ పడ్డారు. నేను అనువాద వ్యాసాలు కొన్ని రాసినా అది అనువదించిన పాఠ్యాన్ని చాలా భాగం (సుమారు 50% పైగా) మార్చేసి ప్రచురించాను.

ఈ ఉపకరణాన్ని వాడి చాలా వ్యాసాలు అనువాదం చేసిన చదువరి గారు, అది చేసిన అనువాదం ఎంతమేరకు బాగుంది అని పరిశీలించారు. అది 100 కి 100 శాతం ఖచ్చితంగా లేకపోయినా కనీసం 70 శాతం సరిగా ఇస్తుందని ఒక అంచనాకు వచ్చారు. అంటే అనువాద ఉపకరణం ఇచ్చిన అనువాదాన్ని మనం కనీసం 30% మానవికంగా మార్పులు చేస్తే తప్ప అది అర్థవంతంగా ఉండదన్నమాట. అందుకనే ఒక చర్చను పెట్టి అందులో అభిప్రాయాలు అడిగారు. దురదృష్టవశాత్తూ ఆ చర్చలో సభ్యులు పెద్దగా పాల్గొనలేదు. అంతకుముందే అనువాద వ్యాసాల చెత్త గురించి విసిగిపోవడం వల్ల, ఆ సమయంలో అంత క్రియాశీలకంగా లేకపోవడం వల్ల నేను కూడా చర్చలో పాల్గొనలేదు. కానీ చదువరిగారు తాను చేస్తున్నది మంచి పని అని భావించి, అనువాద పరికరం నుంచి నేరుగా వ్యాసాన్ని సృష్టించాలంటే మానవికంగా కనీసం 30% మార్పులు చేయాలనే నియమం అమల్లోకి తీసుకువచ్చారు.

అయితే ఈ నియమం వల్ల అనువాద ఉపకరణం వాడి వ్యాసాలు రాసేవారు ఇబ్బంది పడుతున్నారని, 30% మానవికంగా మార్పులు చేయకపోయినా పర్వాలేదని దాన్ని ఇంకా తగ్గించాలని అర్జున గారు ప్రతిపాదన తెచ్చారు. ఇందులో ఒక మెలిక కూడా ఉంది. అది ఏమిటంటే మానవిక అనువాదం 30% శాతం నుంచి తగ్గించినా వ్యాసాలను నేరుగా ప్రధాన పేరుబరి (నేం స్పేసు)కు ప్రచురణకు అవకాశం ఉండదు కానీ సభ్యుల వాడుకరి పేజీల్లో/ప్రయోగశాలలో ప్రచురించడానికి అనుమతి ఉంటుంది. అయినా సరే ఈ ప్రతిపాదనకు నాతో సహా చెత్త అనువాదాల సమస్య ప్రత్యక్షంగా అనుభవించిన వారు వ్యతిరేకించారు. అలాగే కొంతమంది యాంత్రిక అనువాదం ద్వారా మనం వేగంగా వ్యాసాలు రాయవచ్చని, ఈ పరిమితినీ తగ్గించవచ్చనీ అభిప్రాయాలు వ్యక్తం కూడా చేశారు. అయితే మానవిక అనువాద పరిమితిని తగ్గింపజేసే ప్రతిపాదనకు బలం చేకూర్చడానికి అర్జున గారు ఒక పనిచేసి ఉండవచ్చు. అనువాద పరికరం వాడి కొన్ని వ్యాసాలు రాసి వాటిలో 30 శాతం మార్పులు లేకపోయినా వాటి నాణ్యత బాగుందని చూపించే ప్రయత్నం చేసి ఉండవచ్చు. కానీ అలాంటి ప్రయత్నం నాకంట పడలేదు. ఒకవేళ చేసిఉంటే నాదృష్టిలో పడకుంటా ఉండే మన్నించండి. మరో వైపు 30% మానవిక అనువాదం లేని వ్యాసాల నాణ్యత అంతంత మాత్రమే నని చదువరిగారు, పవన్ సంతోష్ గారు కొన్ని ఉదాహరణలిచ్చినట్లు గుర్తు. జాగ్రత్తగా గమనిస్తే ఈ చర్చలో అనుకూలంగానో, ప్రతికూలంగానో ఈ చర్చలో పాల్గొన్నవారంతా అనువాద ఉపకరణం వ్యాసాలు ప్రచురించడానికి అస్సలు వాడకూడదు అనే అభిప్రాయం ఎవరూ వ్యక్తం చేయలేదు. సమస్యల్లా అనువాద పరికరం ఎంతమేరకు వాడాలి అనే విషయం దగ్గరే వచ్చింది.

కొంతమంది సభ్యులు ఇంకా ముందుకు వెళ్ళి వికీ సభ్యుల మద్య పగ, వర్గ పోరు దాకా వెళ్ళిపోయారు. అర్జున గారైనా, చదువరి గారైనా ఎంతో కాలంగా తమదైన శైలిలో వికీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నవారు. వారి మధ్య అభిప్రాయ బేధాలుంటే అవి ఒక పని వాతావరణంలో సర్వసాధారణంగా తలెత్తే బేధాభిప్రాయాలే కానీ వ్యక్తిగత వివాదాలు కాదు. వాటిని పరిష్కరించుకునేందుకు చేసే చర్చలు, ఎక్కడో ఒకదగ్గర సంభాషణ శైలి శృతి మించినట్లు అనిపించవచ్చను గానీ అందరి లక్ష్యం వికీ అభివృద్ధి మాత్రమే. అది గమనించండి. స్థూల దృష్టితో చూస్తే ఇక్కడ రాశి (వ్యాసాల సంఖ్య) ఉండాలని కొంతమంది, రాశి కంటే వాసి ముఖ్యమని కొందరూ అభిప్రాయ పడ్డారు. రెండింటికి మధ్యే మార్గం కనిపెట్టడం మన లక్ష్యం కావాలి.

చివరగా నేను చెప్పొచ్చేదేమిటంటే ప్రతిపాదనలు తెచ్చేవారు, స్పష్టంగా సూటిగా ప్రతిపాదనలు తేవాలి. అలాగే చర్చించేవారు, ఓటు వేసేవారు అసలు ఏమి చర్చిస్తున్నారో, ఎందుకు ఓటు వేస్తున్నాతో అర్థం చేసుకోవాలి. గుడ్డిగా అనుకూలం అనో, వ్యతిరేకం అనో ఓటు వేసి సంతకం చేసేయకండి. ఇది వేరే వాళ్ళ కోసమే కాదు. నాతో సహా అందరికీ వర్తిస్తుంది. అర్థం కాకపోతే ప్రశ్నలు అడిగి తెలుసుకోండి. అప్పుడే చర్చలు సామరస్య వాతావరణంలో జరుగుతాయి. - రవిచంద్ర (చర్చ) 12:32, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

యాంత్రిక అనువాదాలపై చర్చలు, విభాగాలలో వివిధ అభిప్రాయాలు, ఒకరిపై ఒకరు ఆరోపణలు, అనవసర చర్చలు జరుగుతున్న తరుణంలో కొత్తగా వచ్చిన వాడుకరులకు ఈ ఓటింగు ఎందుకు పెట్టారో అర్థం కాని పరిస్థితిలో రవిచంద్ర గారు స్పష్టంగా మొత్తం విషయాన్ని సంగ్రహంగా అర్థమయ్యేటట్లు తెలియజేసినందుకు ధన్యవాదాలు. గుడ్దిగా ఈ విధానం గూర్చి తెలియకుండా అనుకూలం/ప్రతికూలం ఓటువేసిన వాడుకరులెవరైనా ఉంటే వారికి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుతుందని ఆశిస్తాను. వాడుకరులు ఈ విధానంపై తమ చర్చలు జరపాలి గానీ వ్యక్తిగత ఆరోపణలు, గ్రూపులు ఉన్నట్లు అనుమానాలు రేకెత్తించడం సరైన పద్దతి కాదు. ఇకనుండి ఇటువంటి ప్రతిపాదనలు చేసేటప్పుడు ఆ ప్రతిపాదనను అర్థం చేసుకుని చర్చించి ఓటు వేస్తే బాగుంటుంది.--కె.వెంకటరమణచర్చ 12:50, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారు,కె.వెంకటరమణ గారు మీ స్పందనలకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను పరిశీలించినపుడు పద్ధతి ఏర్పడడంలో, దానిని తొలిగా అమలు చేసినపుడు రమణ గారు పాల్గొన్నా, రవిచంద్ర గారు పాల్గొనకపోయినా, దాని వెనుక స్ఫూర్తి మీరు సరిగా అర్ధంచేసుకున్నట్లుగా లేదు ( సంబంధిత ఒక అంశంపై చర్చ, సంబంధిత ఇంకొక అంశం గురించి గత చర్చ). తొలిగా చేర్చిన ప్రతిపాదన ఒక వ్యక్తి చేర్చివుండవచ్చు. చర్చ ద్వారా మెరుగైన ప్రతిపాదన సముదాయ ప్రతిపాదన క్రిందకు వస్తుంది. ప్రస్తుత విధాన సమీక్షలో, ప్రతిపాదనల చర్చలో, పై చర్చలను పరిశీలిస్తే , గతంలో ఏర్పడిన నిర్ణయం పట్ల నిర్హేతుక పక్షపాత ధోరణే ( ఆంగ్ల వికీ వ్యాసం) ప్రధాన కారణం అని నాకనిపిస్తున్నది. ఇది ఒక సాధారణ మానవ లక్షణం. పద్ధతి ని మెరుగుపరచేదిశగా, లేక రద్దు చేసేదిశగా, పద్ధతి చర్చలలో పాల్గొనమని మనవి. --అర్జున (చర్చ) 22:39, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, "చిత్తు ప్రతిపాదనపై చర్చలు జరిపి, వీలైనంత ఎక్కువ మందికి సమ్మతమైన రూపంలో మాత్రమే ప్రతిపాదనను వోటు ప్రక్రియలో పెట్టాలి. " అనేది వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి మార్గదర్శకం లోని మూల మంత్రం. మొదటి సూత్రం. ఈ వోటింగుకు మూలమైన చర్చలో చివరికి తేలిందేంటంటే 30% మానవిక అనువాద శాతాన్ని అలాగే ఉంచాలి అని. కానీ మీరు దాన్ని వోటింగుకు పెట్టలేదు. అలాగే అక్కడ చర్చించని మరో అంశాన్ని వోటింగులో చేర్చారు. దాన్ని లేవనెత్తినందుకు రవిచంద్ర, కె.వెంకటరమణ గార్లకు అవగాహన లేదని అంటున్నారు. అసలు మీరు ప్రశ్నలకు సమాధానాలు ఎందుకు ఎగవేస్తున్నారు? మీ ప్రతిపాదనను వ్యతిరేకించిన వారికి నిర్హేతుక పక్షపాత వైఖరిని ఆపాదించడం సరైన ప్రవృత్తిగా అనిపించడం లేదు. ఎంతో అనుభవమున్న మీ నిర్ణయాన్ని గౌరవించ లేదని మీరు అనువాద పరికరం పట్ల నిర్హేతుకమైన పగ పెంచుకున్నారేమో నాకు తెలియదు గానీ.., ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని పరిశీలించుకుని చూడండి.
రవిచంద్ర గారూ, మీరు చాలా స్పష్టంగా రాసారు. ఏ విభాగంలోనూ పెట్టకుండా విడిగా రాసినందుకు ధన్యవాదాలు. విషయం గురించి ఇంకా తెలీని వాడుకరులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ వోట్లేసిన వారిలో కొంతమందికి అసలు విషయమేంటో తెలిసి ఉండకపోవచ్చునని నా అనుమానం. అలాంటి వారికి ఇదెంతో ఉపయోగం. అర్జున గారు అన్నదాన్ని పట్టించుకోకండి. ఈ వోటింగు చర్చలోను, దాని ముందరి చర్చలోనూ లేవనెత్తిన అంశాలకు ఆయన ఇంతవరకూ సూటిగా సమాధానాలు చెప్పలేదు. ఇకపై చెబుతారనే ఆశ కూడా నాకు సన్నగిల్లుతోంది. __చదువరి (చర్చరచనలు) 05:00, 25 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ మీ అభిప్రాయం బాగా సృష్టంగా తెలిపారు.అర్జున గారు ఇతరులు చెప్పిన వాటికి ఎప్పుడూ సానుకూల ధోరణి కనపర్చరులేండి.దీనిని వికీపీడియా:యాంత్రిక అనువాదం పని తీరుతెన్నులు-మెళుకువలు అనే చిట్కాపేజీ సృష్టించి, దానిని వికీపీడియా:వాడుకరులకు సూచనలు పేజీలో పెట్టవచ్చు.దీనివలన కొత్తవాడుకరులకు అది ఎలా వాడాలనో అందరికి తెలుస్తుంది.దాని మీద ఉన్న అపోహలు తొలగిపోవటానికి అవకాశం ఉంది.మీరు ఓపికతో ఇంత వివరంగా రాసినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 05:52, 25 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, చదువరి గారు ప్రతిపాదించిన మొదటి యాంత్రిక అనువాదాల నియంత్రణ నాకు ఎందుకు మంచిది అనిపించిందో కారణాలతో సహా వివరించాను. కానీ మీరు ఆ ప్రతిపాదన చర్చలో ఎక్కువమంది పాల్గొనలేదు కాబట్టి దాని మీద చర్చ లేవదీసారు. అందులో ఎక్కువమంది సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలు చెప్పి ఆ ప్రతిపాదనను సమర్ధించారు కదా. అలాగే నేను మీ ప్రతిపాదన ఎందుకు నచ్చలేదో కూడా చెప్పాను (నాణ్యతా సమస్యలు వస్తాయని). అలా వివరించినా మీకు నాది నిర్హేతుక పక్షపాత ధోరణి అని మీకు ఎందుకు అనిపించింది? చర్చలో మీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన అందరిదీ నిర్హేతుక పక్షపాత ధోరణే అంటారా? నేను ఇప్పటికీ ఓపెన్ మైండ్ తో ఉన్నాను. ఇప్పుడున్న 30% మానవిక అనువాదం ఎందుకు మంచిది కాదో కారణాలు చెప్పి నన్ను ఒప్పించండి. నాకు తెలిసినంతవరకు మీరు సరైన ఆధారాలతో మమ్మల్మ్ని ఒప్పించే ప్రయత్నం చేయడం లేదు. నేను డేటాను నమ్ముతాను. మీ బయాస్ ను పక్కన పెట్టి మరింత డేటా మా ముందుంచండి. అప్పుడు చర్చిద్దాం దాని మీద. - రవిచంద్ర (చర్చ) 06:37, 25 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారు, నేను ఈ ధోరణి గురించి అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టుపేజీ లో హెచ్చరించాను. దీనిని సమీక్ష చర్చలో లింకు చేశాను. అది ఎంతమంది చదివి, అర్ధం చేసుకున్నారో తెలియదు.

ప్రతిపాదన సమీక్ష చర్చలో మీరు చేసిన వ్యాఖ్యకి నేను స్పందన రాశాను. దానికి మీరు ప్రతిస్పందించారా లేదు. అలాగే చర్చలో పాల్గొన్న చాలామంది స్పందించలేదు. అంటే చర్చ సంపూర్ణమైనట్లా. ఒకవేళ ఓటు ప్రక్రియ చేపట్టకుండా నిర్ణయం చేస్తే, మీరు అనుకూలంగా వుండాలని లేదా ప్రతికూలంగా వున్నారని నిర్ణయం చేసేవారు ఎలా చేయగలరు? 70% కన్నా తక్కువ యాంత్రిక అనువాదం వుండాలన్న నిర్ణయం (మీ వ్యాఖ్యలలో 30%) ఒక అనుభవమున్న వ్యక్తి సూచించగా, ఇంకొకరు అనుకూలంగా స్పందించగా, వికీమీడియా ఫౌండేషన్ సవరించగా ఏర్పడినదని తెలిపాను. దానివలన ఇతర సభ్యుల ఏ విధంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, గణాంకాల పై ప్రభావం ఎలా వుందో తెలిపాను. అప్పుడు దానికి గట్టి ప్రాతిపదిక ఎక్కడ వున్నట్లు? పవన్ సంతోష్ గారు నా వ్యాసాలపై విశ్లేషణ తెలిపినపుడు, దానికి నేను సామరస్య ధోరణిలో స్పందించి ప్రతిపాదనకి సవరణలు లేక కొత్త ప్రతిపాదనలు చేయమని కోరాను. దానికి వారు స్పందించారా?లేదు. చదువరి గారి తన స్పందనలో 85% దిశగా మారుస్తున్నాని అభిప్రాయపడ్డారు. నేను అలా అనుకున్నానని కొత్త ప్రతిపాదన చేరిస్తే నేను అపార్ధం చేసుకున్నానని ఆ ప్రతిపాదనను, ఆయన వ్యాఖ్యలను తొలగించారు. ఏకాభిప్రాయం దిశగా చర్చ సాగితే పరిమితి తొలగించాలన్న ప్రతిపాదన, లేక పరిమితి సడలించి ఇంకో సంఖ్య 85 లేక 90 వుండాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చేది. వాటిని ఓటు పెట్టినప్పుడు, సభ్యులు ఏ ప్రతిపాదన గెలిచేదో నిర్ణయించేవారు. కాని చర్చలలో రెండో పక్షం వారి వాదనను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించి స్పందించనపుడు చర్చలో పాల్గొన్నవారు, ఓటు చేసినవారిలో చాలామంది గతంలో ఏర్పడిన నిర్ణయం పట్ల నిర్హేతుక పక్షపాత ధోరణికి లోనయ్యారని నాకనిపిస్తుంది. వికీపీడియాలో విధాన నిర్ణయాలకు ఎవరో ఒకరిని వప్పించితే సరిపోదు. ఏదో సామెత చెప్పినట్లు గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్లవచ్చు. అది నీరు తాగనంటే ఏమి చేయలేము. అలాగా ముందుగానే విధానాన్ని వ్యతిరేకించాలనే ధోరణితో జరిగిన చర్చలు సరిగావు. ఇక ముందైనా చర్చలు మంచిగా జరిగితే ఈ ప్రయత్నం వలన మేలు జరిగినట్లు భావిస్తాను.--అర్జున (చర్చ) 22:03, 25 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు నా వ్యాసాలపై విశ్లేషణ తెలిపినపుడు, దానికి నేను సామరస్య ధోరణిలో స్పందించి ప్రతిపాదనకి సవరణలు లేక కొత్త ప్రతిపాదనలు చేయమని కోరాను. దానికి వారు స్పందించారా?లేదు. - @Arjunaraoc: గారూ, నేను అనుకుంటూనే ఉన్నాను, మీరు ఈ ధోరణిలో పోతారని. ఐతే, నేను ఒకట్రెండు ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతాను నాకు సూటిగా సమాధానం చెప్పండి.
 • "దీన్ని తొలగించాలంటే ప్రతిపాదకులు "యాంత్రికానువాద ఉపకరణం (కనీసం గూగుల్) 90 శాతం వరకూ సరైన పాఠ్యాన్ని అందిస్తోంది" అన్న విషయాన్ని కనీసం 20 (వివిధ వర్గాలకు చెందిన) వ్యాసాలను స్వీకరించి పరిశీలించి నిరూపించాలి. కేవలం అనక్‌డోటల్ రిఫరెన్సులు, ఇతరేతర కారణాలు (భాషానైపుణ్యం లేనివారు అనువాదకులు కాలేకపోతున్నారు, వికీపీడియన్ల స్వతంత్ర నిర్ణయాలకు ఆస్కారం లేదు, వంటివి) ఈ ప్రతిపాదన చేయడానికే బలం సరిపోదని. కాస్త సడలింపు చేయదలిచినా అనుభవజ్ఞులు అంటే వికీలో ఇతరేతర పనులు చేసినవారు కాదనీ, అనువాదాల్లో పనిచేసిన అనుభవం మాత్రమే ప్రాతిపదికగా స్వీకరించాలని అభిప్రాయపడుతున్నాను." అని నేనొక బలమైన అభిప్రాయం నా స్పందనలో ఆఖరు మాటగా 2020 ఆగస్టు 17న చెప్పాను. ఈనాటికీ మీ నుంచి సమాధానం రాలేదు. అంటే మీ దగ్గర సమాధానం లేనట్టా? మీ వాదన వీగిపోయినట్టా?
 • "మీరు ప్రస్తావించిన "పై వివరాలు పరిశీలించితే అర్జున వ్యాసాలు ప్రస్తుత 70% పరిమితితో 40 శాతం అనగా 13 లో 5 మాత్రమే ముద్రణకు అనుమతించబడతాయి." అని ఈ విశ్లేషణలో (బహుశా) వాపోయారు. కానీ, 70 శాతం పరిమితి వల్ల ఈ 13 వ్యాసాల్లో 5 మాత్రమే ప్రచురణ అవుతాయనీ, మిగిలినవాటిపై అనువాదకుడు మార్పుచేర్పులు చేయవలసి వస్తుందనీ అంటే ఈ పరిమితి చాలా బావున్నట్టు. కనీసం ఆ ఐదు వ్యాసాలన్నా ఇంకొంత మెరుగుపడతాయి. ఆ విధంగా ఆయనే తన అనువాదాల ద్వారానూ, పై వాక్యాలతోనూ పరోక్షంగా 70 శాతం పరిమితిని సమర్థిస్తున్నట్టు అవుతోంది." - నేను చేసిన అధ్యయనం ద్వారా తేల్చిన ముఖ్యమైన పాయింట్ ఇది. దీనిని నేను ప్రముఖంగా ప్రచురించాను. మీరు రాసిన నాలుగు పేరాల సమాధానంలో మీరు ఒక్కచోట కూడా నా ఈ కంక్లూజన్‌ తిరస్కరించగల పాయింట్ చెప్పలేదు. మీరు తిరస్కరించగల పాయింట్ చెప్తే నేను ప్రతివాదం చేసేవాడిని లేకపోతే నాకెందుకండీ చెప్పిందే చెప్పే ఊకదంపుడు పని.
మీరు రాసిన చర్చా పేజీ మొత్తం వెతుక్కోండి (కొత్తగా ఇప్పుడు వీటికి మీ సమాధానాలు చెప్పవద్దు, అది కాదు నేనడిగేది) ఎక్కడైనా నేను అడిగిన ఈ ముఖ్యమైన ప్రశ్నలను, అభిప్రాయాలను కనీసం మీరు అడ్రస్ చేసిన వాక్యాలైనా ఉంటే తెచ్చి ఇక్కడ పెట్టండి. మీ స్పందనకల్లా ప్రతిస్పందన రాస్తానని నేనేమీ కూచోలేదు. మీరు నేను చెప్పిన పాయింట్ మీద సూటిగా సమాధానం చెప్పివుంటే మాత్రం మీ వాదనలో లోపం ఉంటే ఇదీ లోపం అని చెప్పేవాడిని లేదూ మీరన్నది కరెక్ట్ అనుకుని ఉంటే అదే ఒప్పుకునేవాడిని. అంత ఆయాసపడి నేను రాసినవాటికి మీ నుంచి సూటి సమాధానమే లేనప్పుడు నేను ఏమని స్పందించాలి? ప్రతిపాదనకి సవరణలు లేక కొత్త ప్రతిపాదనలు చేయమని కోరాను. నాకు ఇప్పుడున్న విధానమే వందశాతం కరెక్ట్ అన్న అభిప్రాయం అనుభవపూర్వకంగా, అధ్యయనబలంతో ఉంది. కాబట్టి, మీ ప్రతిపాదన పూర్తిగా తిరస్కరించాను. తిరస్కరిస్తూ ఎందుకు తిరస్కరిస్తున్నానో, భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు (అనువాద ఉపకరణం మెరుగుదల) వస్తే ఆమోదించగలనో చెప్పేశాను. ఉన్న విధానమే బావుందన్న నేను కొత్త ప్రతిపాదనకు సవరణలు చేయడం, కొత్తగా వేరేదో ప్రతిపాదనలు చేయడం చెల్లదు. తోటి సముదాయ సభ్యులందరికీ కూడా చూపిస్తున్నాను. ఇదిగో ఇక్కడ నా స్పందనలో నేను రాసి ఆఖరుమాటలకు అర్జున గారు సూటిగా ఇప్పటిదాకా స్పందన ఇచ్చినట్టు మీకు అనిపించిందా? దయచేసి ఇప్పటికైనా విషయాన్ని విషయంగా చర్చిద్దాం అర్జున గారూ. అలాగే, ఇప్పుడు ఈ స్పందనలో నేనన్న ప్రతీ మాటలోనూ ఏదోకటి పట్టుకని ముందుకు పోవద్దండీ. మళ్ళీ అదే అడుగుతున్నాను - ప్రతిపాదకులుగా "నా స్పందనలో ఆఖరు మాటగా" చెప్పినదానికి మీ నుంచి ఏ స్పందనా ఈనాటికీ రాలేదు. నాకు సమాధానమే చెప్పలేనప్పుడు మీ ప్రతిపాదన నిలబడిందని ఎలా అనుకుంటున్నారు? --పవన్ సంతోష్ (చర్చ)
పవన్ సంతోష్ గారు, అవునండీ మీ చివరి స్పందనకు నేను ప్రతిస్పందన ఇవ్వలేదు. ఎందుకంటే వివిధరకాల అంశాలున్న చర్చని విభాగాలుగా విభజించితే చర్చకు అనుకూలమవుతుందని కోరాను. దానికి మీరు ఎలా చేయాలో తెలియలేదన్నారు. నేను చర్చలను అర్ధవంతం చేయటానికి స్వల్పంగా శీర్షికలు సవరించితేనే చర్చను గందరగోళం చేశాననే విమర్శలు చాలా మంది నుండి ఎదుర్కొన్నాను. ఇక మీ అభిప్రాయాలను నేను విభాగాలుగా చేస్తే ఆటలో ప్రత్యర్ధి పక్షం కూడా నేనే వహించినట్లు అయిందనేదానికి బలమైన కారణానికి అవకాశం కల్పించినట్లు వుంటుంది. అందుకని స్పందించలేదు. అలాగే మీలాగా విభాగాలుగా చేర్చని స్పందనలకు కూడా స్పందించలేదు. చర్చలోపాల్గొన్న విభాగాలుగా రాసిన అందరి అభిప్రాయాలకు స్పందన ఇచ్చిన నేను మీ వాదనలకు బలమైన అధారం లేక స్పందన ఇవ్వలేదని అనుకోకండి. ప్రతిస్పందనకు సంబంధించిన అంశాలు ఇతర స్పందనలలో, ప్రాజెక్టు పేజీలో, ప్రతిపాదనల విభాగంలో, సమీక్ష విభాగంలో వున్నాయి. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 23:37, 26 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అయ్యా అర్జునరావు గారూ!
 • సో, మీరు నా సూటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడానికి కారణాలు ఉండవచ్చు. నేను మీ ప్రతిపాదన తిరస్కరించి వుండీ, దానిపై బోలెడు రాసివుండీ కూడా మీరు సవరణలు లేక కొత్త ప్రతిపాదనలు చేయమని కోరినప్పుడు స్పందించకపోతే మీరు చెరువు దాకా తీసుకువెళ్ళినా నీరు తాగననే గుర్రాన్నీ, అలాగా ముందుగానే విధానాన్ని వ్యతిరేకించాలనే ధోరణితో చర్చించినవాళ్ళలో ఒకడిని అవుతాను. అంతే తప్ప, పవన్ సంతోష్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ కొన్ని గట్టి అభిప్రాయాలు చెప్పాడు, కొన్ని అధ్యయనాలు చూపించాడు, వాటికి మనం ఏవో కారణాలతో సమాధానం ఇయ్యలేదు, అలాంటప్పుడు ఇప్పుడున్న ప్రతిపాదనే బావుందన్న గట్టి అభిప్రాయం వెల్లడించినవాడు ఎందుకు కొత్త ప్రతిపాదనలు, తాను తిరస్కరించిన ప్రతిపాదనకు కొత్త సవరణలూ చేస్తాడు? అని మీరు సమ్యక్ దృష్టితో సానుకూలంగా తీసుకోరు. చాలాబావుంది మీ ధోరణి.
 • ఇక మీ వాదనలో మరో సమస్య. వికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ#విధానంలోని_లోపాలను_నిస్సంశయంగా_నిరూపించే_ఒక_విశ్లేషణ అని నేను చేసిన విశ్లేషణకు ఒక ప్రతిస్పందన మీ నుంచి వచ్చింది. దాని గురించి పైన ప్రస్తావించారు కూడా. మరి నేను చెప్పిన ""పై వివరాలు పరిశీలించితే అర్జున వ్యాసాలు ప్రస్తుత 70% పరిమితితో 40 శాతం అనగా 13 లో 5 మాత్రమే ముద్రణకు అనుమతించబడతాయి." అని ఈ విశ్లేషణలో (బహుశా) వాపోయారు. కానీ, 70 శాతం పరిమితి వల్ల ఈ 13 వ్యాసాల్లో 5 మాత్రమే ప్రచురణ అవుతాయనీ, మిగిలినవాటిపై అనువాదకుడు మార్పుచేర్పులు చేయవలసి వస్తుందనీ అంటే ఈ పరిమితి చాలా బావున్నట్టు. కనీసం ఆ ఐదు వ్యాసాలన్నా ఇంకొంత మెరుగుపడతాయి. ఆ విధంగా ఆయనే తన అనువాదాల ద్వారానూ, పై వాక్యాలతోనూ పరోక్షంగా 70 శాతం పరిమితిని సమర్థిస్తున్నట్టు అవుతోంది." అన్న సూటి సమర్థన ఉంది. మరి మీరే కితాబిచ్చుకున్న సామరస్యపూర్వకమైన స్పందనలో ఈ మాటలకు స్పందన ఎందుకు లేదు? అది సరైన విభాగంలో, సరిగానే ఉంది కదా. పైపెచ్చు మీరు ఏదోక స్పందన రాశారు. అలాంటప్పుడు ఆ వాక్యాలకు స్పందన రాయకుండా విడిచిపెట్టేశారు ఎందుకు? మీలాగా నేను నా వాదన మీరు అంగీకరించెయ్యాలనో లేకపోతే పక్షపాత ధోరణితో ఉన్నారనో అనట్లేదు. కనీసం స్పందన రాసేప్పుడు ఒక బలమైన పాయింట్‌కు మీ వద్ద సమాధానం ఉంటే రాయాలి, లేకపోతే అక్నాలెడ్జ్ చేయాలి. కాదా? మేం స్పందించకపోతేనే పక్షపాత ధోరణి, నీళ్ళదగ్గరకు తీసుకువెళ్ళినా తాగని గుర్రాలం (మీ మాటలే సార్) అయిపోతాం. మీరు నేను రాసిన ఓ అధ్యయనంలో మీరు కొన్నిటికి స్పందించి బలమైన పాయింట్లకు స్పందించకపోతే మీ ఇష్టం, మీ స్వేచ్ఛ. ఈ లెక్కన మనం ఇద్దరం సమాన స్థాయి ఉన్న సభ్యులం కాదా?
మేం నానా బుర్రలూ చించుకుని ఒక వాదన చెప్తాం. మీరు దానికి సమాధానం రాయకుండా ఉండేలా ముందుకుపోతారు. పోనీ మా వాదన ఆమోదించినట్టు కూడా ఒప్పుకోరు. అలా ముందుకుపోయి ఊరుకుంటారా? చర్చలో వచ్చిన అభిప్రాయాలు పట్టించుకోకుండా ప్రతిపాదకులూ, చివరిదాకా ప్రతిపాదనకు బలమైన సమర్థకులూ అయిన మీరే ప్రతిపాదన నిలబడిందనేసి ఓ తీర్పు ఇచ్చేస్తారు. ఇలా చర్చలో మీరే ఒక ముందుగా తెచ్చిపెట్టుకున్న ధోరణితో వ్యవహరించారు. కాదంటే, పై రెండూ ఎందుకు జరిగాయో చెప్పండి. --పవన్ సంతోష్ (చర్చ) 06:07, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు, మీ రెండు అంశాలకు స్పందన ఇదే. గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టులో ఉద్యోగులుగా పనిచేసిన వారి చర్యలను మరియు పోటీ ప్రాజెక్టులతో పని చేసే సభ్యులను, సేవాభావంతో కృషి చేసే వికీపీడియన్ల చర్యలను ఒకే విధంగా పరిగణించటం తగదని స్పందనలో వుందండి. దానికన్నా మించిన స్పందన అవసరంలేదు. విభాగాలుగా వుంటే ప్రతి విభాగంలో స్పందన ఇవ్వటానికి అవకాశం వుంటుంది కనుక మీరు దయచేసి ముందు చర్చలలో విభాగాలుగా మీ వ్యాఖ్యలను చేయవలసిందిగా కోరుతున్నాను. నేను సామెతగా అన్న విషయాలను విషయం అర్ధం చేసుకోవటానికే, దానిని బొద్దు అక్షరాలతో ఉటంకించి, వక్రీకరించే దిశగా చర్చలు చేయనవసరం లేదు. విధానానికి సవరణ చర్చ ప్రారంభించిన వ్యక్తిగా, పద్ధతి నిర్వహించవలసిన వ్యక్తిగా నాకు కొన్ని బాధ్యతలు వున్నాయి. అవి మీకు మరింతగా తెలియాలంటే మీరు కూడా ఒక విధానాన్ని ఈ పద్ధతిలో నిర్ణయం చేయడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 23:54, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
1. //గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టులో ఉద్యోగులుగా పనిచేసిన వారి చర్యలను మరియు పోటీ ప్రాజెక్టులతో పని చేసే సభ్యులను, సేవాభావంతో కృషి చేసే వికీపీడియన్ల చర్యలను ఒకే విధంగా పరిగణించటం తగదని స్పందనలో వుందండి.// లేదండి. నాకు మొత్తం పేజీలో ఉద్యోగులు అన్న పదం కూడా ఎక్కడా కనిపించలేదు. అలాగే, నేను రాసినదానిలో ఉద్యోగులతో పోలిక లేదు. నేను పైనవికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ#విధానంలోని_లోపాలను_నిస్సంశయంగా_నిరూపించే_ఒక_విశ్లేషణ అని పెట్టినదానికి మీరు ప్రతిస్పందన చేస్తూ ఎక్కడా కూడా అదే విభాగంలో నేను చేసిన ముఖ్యమైన వ్యాఖ్యలకు సమాధానాలు ఇవ్వలేదు.
2. నేనేమీ వక్రీకరించట్లేదు, నన్ను పిలిచి పవన్ సంతోష్ నేను పిలిచినా కూడా విధానానికి మార్పులు సూచించడమో, కొత్త ప్రతిపాదన చేయడమో చేయలేదు అని ఈ చర్చలో పైన అనకపోతే నేను ఇంతలా కలగజేసుకునేవాడిని కాను. ఆ సామెతలో ఉన్న ముక్కలు తీసేసి తిరిగి అడుగుతున్నాను అప్పుడైనా చెప్పండి. "మేం స్పందించకపోతేనే పక్షపాత ధోరణి. మీరు నేను రాసిన ఓ అధ్యయనంలో మీరు కొన్నిటికి స్పందించి బలమైన పాయింట్లకు స్పందించకపోతే మీ ఇష్టం, మీ స్వేచ్ఛ. ఈ లెక్కన మనం ఇద్దరం సమాన స్థాయి ఉన్న సభ్యులం కాదా?" --పవన్ సంతోష్ (చర్చ) 11:39, 29 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు, ప్రస్తుత విధానం చేయటానికి ప్రధాన ఆధారం గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు, లేక పోటీ ప్రాజెక్టు ద్వారా తయారైన వ్యాసాల తొలగింపులు అన్నదానితో మీరుకూడా ఏకీభవిస్తారనుకుంటాను. ఆ చర్చ స్పందనలో 'అనువాదం ముద్రించిన తరువాత కూడా నా సవరణలు వ్యాస చరిత్రలో మీకు కనబడతాయి. అంటే అనువాదాన్ని ముద్రించి వదలివేసే సభ్యుడిని కాను.' అన్న నా మాటలలో అర్ధం ఇదే.

ఇక స్పందన ప్రతిస్పందనల గురించి ఇప్పటికే వివరించాను. చర్చలో పాల్గొనే ప్రతివారు సమాన స్థాయితో పాల్గొనే వారిగానే పరిగణించాను. స్పందించకపోవటం చర్చలకు సహకరించనట్లవుతుంది. అది పక్షపాత ధోరణా కాదా అన్నది అలాచేసినవారు ఆత్మవిమర్శ చేసుకుంటే తెలియవచ్చు. ఇది నాతోపాటు అందరికీ వర్తించేదే. అన్నట్లు మీ విభాగాలుగా చేయని తొలివ్యాఖ్యలకు ఒక స్పందన తరువాత ఎందుకు స్పందించలేదో ఇప్పటికే తెలిపాను. ఆ తరువాత ప్రతిపాదిత విధానంపై విభాగాలుగా చేయకున్నా మీరు నాకు ఒకే అంశంపై అనగా అర్జున అనువాదాలలోని లోపాల గురించి రాసినట్లు అనిపించినందున, దానికి స్పందించాను. ఆ స్పందనకు మీరు ప్రతిస్పందించలేదు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 00:10, 1 అక్టోబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కాస్త మర్యాదగా మాట్లాడండి[మార్చు]

@Arjunaraoc: గారూ, మేమందరం మా మా అనుభవ రీత్యా (అది చాలా విలువైనదని స్వోత్కర్షకు పదే పదే పాల్పడడం విసుగ్గా ఉంది) సాధికారికంగా రాసి మరీ మీ ప్రతిపాదన తిరస్కరించారు. పైన నేను ఇచ్చిన లింకుల్లో మీ నుంచి నాకు కనీస సమాధానం కూడా రాలేదని కూడా చూపించాను. అలాంటప్పుడు ఇంకోసారి గనుక మీరు "నిర్హేతుక పక్షపాత ధోరణి" (కాగ్నిటివ్ బయాస్ అంటే ఏంటో నాకూ తెలుసు, ఇది అది కాదు. మీరు కూడా మీకు ఎటువంటి డెసిషన్ మేకింగ్ సమస్యలు ఉన్నాయో చూసుకుని పరిశీలించుకుంటే మెరుగు) అన్న పదం నిరూపణ లేకుండా వాడారంటే మీరు మాపై వాడారంటే మీరు "ఆధారం లేకుండా మా నిబద్ధతను ప్రశ్నిస్తున్నారని" భావించాల్సి వస్తుంది. గ్రహించండి. ఇందుకు మరో ముఖ్యమైన ఆధారం ఏమిటంటే- పైన కేవలం మీమీద గౌరవంతో, గురుభక్తి నిరూపించుకోవడానికి ఓటేస్తున్నానని ఈ ప్రక్రియలో ఉన్న డొల్లతనాన్ని చూపించిన వాడుకరిని మీరేమీ అనలేదు ఈనాటికీ. కాబట్టి, ఇక మీరు ఈ విషయంలో మాపై ఆ పదాన్ని వాడడం తక్షణమే ఆపండి. --పవన్ సంతోష్ (చర్చ) 11:10, 26 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ముఖ్యమైన సంగతి మరచిపోయాను. ఆ విభాగంలో మీరు ఆయనకు ఆయన ధోరణిని వ్యతిరేకించక, అనుకూలంగా అటెస్ట్ చేసినట్టు రాశారు. కాబట్టి, మీరు ఇన్ని రోజులుగా ఏం చేశారన్నది చదివి చూసుకునేందుకు ఇప్పుడైనా సమయం వచ్చింది. లేదంటే "ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును సముదాయముండెడున్"--పవన్ సంతోష్ (చర్చ) 11:21, 26 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు, మీ సూచనకు ధన్యవాదాలు. కాగ్నిటివ్ బయాస్ అనేది మీకు వర్తించకపోవచ్చు. సామాన్యమానవ లక్షణం అయిన దీనిగురించి మిగతా వారికి తెలిస్తే ముందు జరిగే చర్చలలో సభ్యులు మెరుగుగా స్పందిస్తారనే ఆశతోనే ప్రస్తావించడం జరిగింది. నేను మీ మర్యాదకు భంగం కలిగించేలాగా మాట్లాడానని మీరు అనుకున్నందున, అలా అనుకున్న అందరికి నా క్షమాపణలు.
రెండవ అంశంలో లింకు ఇవ్వనందున మరియు మీవ్యాఖ్య సాధారణ తెలుగులో లేకపోయినందున పూర్తిగా అర్ధం చేసుకోలేకపోయాను.అయినా అర్ధం చేసుకున్న మేరకు స్పందిస్తున్నాను. నేను ప్రతిపాదించిన లేక నిర్వహించే విధాన నిర్ణయ చర్చలలో అవసరమైన చోట్ల తప్పించి, వికీపీడియాలో ప్రతిదానికి స్పందించాల్సిన బాధ్యత నాకు ఎవరూ ఇవ్వలేదండి. నేను స్పందించకపోయినా, ఇతరులు స్పందించారు. అది ఆయన గ్రహిస్తారు అనుకుంటాను. --అర్జున (చర్చ) 23:44, 26 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
@Arjunaraoc: గారూ! ఇదిగోండి లింకు. నేను ప్రతిపాదించిన లేక నిర్వహించే విధాన నిర్ణయ చర్చలలో అవసరమైన చోట్ల తప్పించి, వికీపీడియాలో ప్రతిదానికి స్పందించాల్సిన బాధ్యత నాకు ఎవరూ ఇవ్వలేదండి. అన్నారు. ఈమాత్రం నాకూ తెలుసు. మీరు అక్కడ స్పందించారు. ఆ స్పందన కూడా వికీ స్ఫూర్తినీ, ఎన్నికల ప్రక్రియనూ దెబ్బ తీస్తూ "గురువుగారికి విధేయత చూపించవలసిన సమయం తరుణం ఇదే కావచ్చు...నా ఓటు అనుకూలమే." అంటూ మీమీద విధేయతతోనే అనుకూలంగా ఓటేస్తున్నానని రాసిన సభ్యుని రాతలకు వ్యతిరేకంగా కానీ, ఈ విధంగా ఓటు వేయడం తగదని కానీ లేకపోవడం చూసి కొంత ఆశ్చర్యం, మీరు నిర్వాహకులై ఉండడం గుర్తుకువచ్చి బాధ కలిగాయి. కాకపోతే, మీరు ఎన్నికలు ప్రక్రియనే చర్చలోని ఏకాభిప్రాయం లెక్కించకుండా తీవ్రమైన అనుకూల అభిప్రాయం కలిగివుండీ తోచినట్టుగా ప్రారంభించేయడం గుర్తుచేసుకుని ఇది సహజమేనని అనుకున్నాను. ఇప్పుడు మరీ ఎదురొచ్చేసి మామీద ఏవేవో బయాస్‌లు అంటగడుతుంటే ఊరుకోలేక అడిగాను. సమాధానం లేకపోతే వదిలెయ్యవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 06:29, 27 సెప్టెంబరు 2020 (UTC) --పవన్ సంతోష్ (చర్చ) 06:29, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు, అదే ఏమిటి గురువా... నా పేరు(తో)న ఉన్న లైసెన్స్ తుపాకీతో అర్జునగారి(మనస్సు)ని గాయపరుస్తున్నారు. ఒక గ్రామం వారం కాదు పండు ఫలము ఇవ్వడానికి వారు ఏదో ఆశిస్తున్నారు అందుకు అనుకూలంగా ఓటు వేశాను, అంతేగాని వారు అందులో ఏ విశేషం లేదు. దేవుడు గారు అన్నట్లు అన్ని రోజులు వేయని వాడుకరులు ఓట్లు 50 గంటల్లో రెండు రోజులో వేయడం నాకు అనుమానం, తెరవెనక ఏదో మతలబు జరిగిందని, అని మాటల కురుక్షేత్రసంగ్రామం లో ఆ మాట అంటే తేనె తుట్టెను కదిలించింది నట్టు అవుతుందని తెలుసు కాబట్టి అనలేదు. అర్జున గారు కూడా ఈ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వ్యతిరేకించిన వారిపట్ల ఇప్పటికీ సానుకూలంగానే ఉన్నారు. నేను కూడా మీ పట్ల విధేయత తోనే (ఏం అనక)ఉన్నాం. ధన్యవాదాలు Prabhakargoudnomula 16:40, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
మొట్టమొదట చెప్పాల్సిందేమంటే - మీరు నిజాయితీగా మీరెందుకు ఓటేస్తున్నారో చెప్పి మరీ వేశారు. కాబట్టి, మీపైన నాకు ఎటువంటి వ్యతిరేకతా లేదు. పైపెచ్చు మీరు పోను పోను ఈ వికీ యాత్రలో మెరుగైన వాడుకరిగా అవుతూనే ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఐతే, అభిమానం దారి అభిమానానిదే, అభిప్రాయం దారి అభిప్రాయానిదే అన్న విషయంలో తికమక పడో, ఇబ్బంది పడో ఎందుకో మీరు ఈ ఓటు ఈ పద్ధతిలో వేసి, నిజాయితీగా మీరు ఎందుకు అలా ఓటు వేస్తున్నారో చెప్పారు. సాక్షాత్తూ మహాత్మా గాంధీ తన ప్రియతమ శిష్యుడైన వల్లభ్‌ భాయ్ పటేల్‌తో ఒకసారి (1942 ప్రాంతంలో అనుకుంటాను) "నీకూ స్వంతంగా రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి. నాతో నీకున్న అనుబంధం పక్కన పెట్టి, నీకు సరి అనిపించిందే చెయ్యి. నా అభిప్రాయం నీకు నచ్చకపోతే ప్రకటించి దేశానికి మంచి అని తోచింది చేయాల్సిన హక్కు, అలా చేయాల్సిన బాధ్యత నీకు ఉన్నాయి" అని ప్రబోధించాడు. నేనూ గతంలో నన్ను వికీపీడియాలోకి తీసుకువచ్చినవారి అభిప్రాయాలను, విధానాలను వ్యతిరేకించాల్సి వచ్చింది. వ్యతిరేకించాను. అర్జున గారూ, నేనూ కూడా గతంలో ఎన్నో విషయాల్లో కలిసి పనిచేశాం. భవిష్యత్తులోనూ చేస్తాం. ఐతే, ఇప్పుడు విధాన పరంగా ఒకరినొకరం వ్యతిరేకించుకోవడం సహజం. నన్ను ఎంతగానో అభిమానించి, ఆదరించి నాకు తెవికీలో ఒక స్థానం వచ్చేవరకూ చేయిపట్టి నడిపిన రాజశేఖర్ గారి వ్యాసానికి ఒక తొలగింపు నోటీసు పెట్టడం, ఆయనే స్వయానా ఆ వ్యాసాన్ని తొలగించడం ఈరోజునే జరిగింది. ఈ పద్ధతులన్నీ అర్జున రావు గారికి తెలుసు. పైపెచ్చు ఆయనే స్వయంగా నిర్ణయాలు తీసుకోవడంలో మనుషులను ఎలాంటి బయాస్‌లు అడ్డుకుని తప్పుడు నిర్ణయాలు వైపు తీసుకుపోతాయో, ఎలాంటి పక్షపాతాలు ఉంటాయో తెలుసునని అంటూ ఈ పేజీలోనే వాటిని నాలుగైదు సార్లు ప్రస్తావించారు. అలాంటప్పుడు, అదే మనిషి మీకు - "ఈ విధంగా ఒక వ్యక్తిపై గురుభావాన్ని ప్రదర్శించడానికి ఓట్లు వేయకూడదు, ఇది విధాన నిర్ణయం. వికీపీడియాను అంతా ప్రభావితం చేస్తుంది. మీరు స్వతంత్రులు. మీరు చర్చలో పాల్గొన్నారు, ఇతరుల అభిప్రాయాలూ చదివారు. నాపై వ్యక్తిగతమైన గౌరవమో గురుభావమో పక్కన పెట్టి మీ అభిప్రాయం ఎలా ఉందో అలా చేయండి" అని చెప్పనక్కర లేదంటారా? ఇదే అడుగుతున్నాను. ఇందులో బుజాలపై తుపాకులు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సూటిగానే అడుగుతున్నాను. మిమ్మల్ని అడగట్లేదు. పైనే చెప్పాను, మీరు చాలా నిజాయితీగా మీ ఉద్దేశం చెప్పారు, అర్జున గారే సమాధానం చెప్పాల్సి ఉంది. మీరు మీ నిజాయితీని, మీ కృషిని, మీ నేర్చుకునే తృష్ణనీ ఇలాగే కొనసాగించగలరని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 17:22, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ సార్ మీరే నా తొలి గురువుగారు, నాచర్చ్ పేజీ (ఇక్కడ[1]) మీరేనండి. ఇక పైన చదివాక నేను ఓటు అంతఃకరణ శుద్ధి తో వేయలేదు అని అర్థమైంది. వికీనియమాల కు ఇది విరుద్ధం అని ఇప్పుడే తెలిసింది. ఇందుకు మనస్ఫూర్తిగా క్షమించమని మీ అందరిని అడుగుతున్నాను. ఇందులో అర్జునరావు గారి ప్రమేయం కూడా ఏమీ లేదు, నాదే తప్పు ధన్యవాదాలు. Prabhakargoudnomula 19:01, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కనుక, ఈ విషయమై అర్జున గారి ఉద్దేశం ఏమిటన్నది ఆయన్నే చెప్పనిద్దాం. నేను సూటిగా అడిగి అర్జున రావు గారికి మేలు చేస్తున్నాను. అడగకుండా ఎందరో ఆ విభాగంలో ఆయన మాటలు చదివి మనసులో ఆయన చేసిన పని గురించి ఒక అభిప్రాయానికి వచ్చి వుంటారు. కనుక, మీ గురువుగారు, నా సన్నిహితులు అయిన అర్జున గారి ఉద్దేశం ఏమిటన్నది ఆయన్నే చెప్పనిద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 17:26, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Prabhakargoudnomula గారు, మీరు వ్యక్తంచేసిన అభిప్రాయంలోని మాటలు కొందరికి అనుమానాన్ని కలిగించవచ్చు కాని మీరు అంతఃకరణ శుద్ధితో వేయలేదు అని నేను అనుకోవటం లేదు. మీరు చర్చలో సమర్ధతతో పాల్గొన్నారు. మీరు మీకున్న అనుభవంతో చర్చలో ఒక ప్రతిపాదన చేశారు. దాని గురించి చర్చించారు. అనువాద పరికరం simple english వికీనుండి కూడా వాడారు. సవరణ ప్రతిపాదించారు. అమలు చేయటంలో వున్న ఇబ్బందిని అర్ధం చేసుకున్నారు. ఆ తరువాత మీరు ఓటు చేశారు. ఎంతో మంది అనుభవమున్న వాళ్లు కూడా ఆ విధంగా చర్చలను సమర్ధవంతంగా చేయలేదు. మీ మాటల తీరులో విధేయత అనే మాట వలన మీ చర్యలను ఇతరులు తప్పు పట్టడం సరికాదండి. ఎంతోమంది ఆ మాట అనకుండా విధేయతను ప్రదర్శించారు అని నాకు అనిపిస్తుంది. --అర్జున (చర్చ) 22:59, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు, లింకు ఇచ్చినందులకు ధన్యవాదాలు. Prabhakargoudnomula గారి చర్చలో అర్జున గారు, ఎందుకు అంత పట్టుపడుతున్నారు. అనేది అర్థం కాని విషయం అనే దానిపై స్పందించాను. పద్ధతి ప్రకారం, ఓటుపై అభిప్రాయ వ్యాఖ్యలు చేయకూడదు. ఓటు ప్రక్రియ కాలంలో ఆయన వ్యక్తం చేసిన ఓటు అభిప్రాయ వ్యాఖ్యలు కాని ఇతరుల ఓటు అభిప్రాయ వ్యాఖ్యలపై గాని స్పందించలేదు. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 23:11, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
బావుంది . @Arjunaraoc: గారూ!
1. ఒకే అభిప్రాయ వ్యాఖ్యలో ఆయన "నేను ఫలానా అర్జున మీద గురుభావంతో, అభిమానంతో ఓటేస్తున్నాను" అని కంఠోక్తిగా చెప్పారు. అదే చోట "అర్జున గారు, ఎందుకు అంత పట్టుపడుతున్నారు. అనేది అర్థం కాని విషయం" అని కూడా అన్నారు. "ఓటు ప్రక్రియ కాలంలో ఆయన వ్యక్తం చేసిన ఓటు అభిప్రాయ వ్యాఖ్యలు కాని ఇతరుల ఓటు అభిప్రాయ వ్యాఖ్యలపై గాని స్పందించలేదు." అని మీరు ఇప్పుడు అన్నది నిజమే అనుకుందాం (ఈ నిబంధన ఎంత డొల్లదో ఇప్పుడు మాట్లాడుకోవద్దు). అలాంటప్పుడు అదే అభిప్రాయంలో ఒకదానిపై మీరు స్పందించడానికి, రెండోదానిపై, ఏదీ అసలు ఓటు చెల్లుబాటునే ప్రశ్నార్థకం చేసే ముఖ్యమైనదానిపై, స్పందించకపోవడానికి ఏమిటి కారణం?
2. ఓటు వేసేనాటికి కూడా మీరు ఆ ప్రతిపాదనపై ఎందుకు పట్టుబడుతున్నారో వాడుకరికి అర్థం కాలేదన్నది ఆయన సుస్పష్టంగా రాశారు. "అందరూ వ్యతిరేకించిన అనుభవజ్ఞులు అంత పట్టుబట్టడం వెనక ఏదో ఉంది, ఓటింగ్ కు మందు విషయం చెప్పకపోయినా ఓటింగ్ గడువు తర్వాత వివరిస్తారా ఆశిస్తూ" (అంటే ఓటు వేసి వచ్చాకా కూడా తెలియదు) "గురువుగారికి విధేయత చూపించవలసిన సమయం తరుణం ఇదే కావచ్చు...నా ఓటు అనుకూలమే." అని ఓటు వేసినప్పుడు - ఈ మొత్తం పేరాలో ఒక వ్యక్తి తనకు అనుకూలంగా ఓటు వేయడానికి కారణం లేకుండా, గురువు గారు పట్టుపడుతున్నారు కదా "ఏదో ఉండి ఉంటుంది" అని నమ్మి, విధేయత చూపించడానికి ఓటు వేస్తూంటే - ఆ అమాయకునికి వివరించాల్సిన బాధ్యత ఉండి విస్మరించారు సరే. ఇప్పుడు మీరు ఈ విధంగా ఓటు వేయడాన్ని సమర్థిస్తున్నారా?
రెండు అంశాలకు వేర్వేరుగా సూటిగా చెప్పండి.--పవన్ సంతోష్ (చర్చ) 03:34, 28 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు, పై రెండు అంశాలకు నా ఒకటే స్పందన: Prabhakargoudnomula గారు చర్చలో సమర్ధవంతంగా పాల్గొన్నారు అని ఇంతకు ముందే తెలిపాను. వారి వ్యాఖ్య అర్ధం చేసుకోవటంలో కూడా సందేహమొచ్చింది. కాని నేను ఏదైనా వివరించాల్సి వుంటే ఓటు తరువాత వివరించితే ఉపయోగంకన్నా, ఓటు కాలంలో వివరించటమే మంచిదనిపించిది. అందుకని వివరించాను. ఓటుకు సంబంధించిన అభిప్రాయం వారి మాట తీరుగానే భావించాను. నేను ఇంతకు ముందే చెప్పినట్లు ఓటు అభిప్రాయ వ్యాఖ్యలపై స్పందించలేదు. అన్నట్లు మీరు చాలా చర్చలలో సూటిగా చెప్పండి అనే పదం వాడుతుంటారు. అది అంత మంచి పదం కాదని నేను భావిస్తాను. ఎందుకంటే ఈ చర్చలు చదివేవారు, అర్జునకు సూటిగా స్పందించడం తెలియదు అని భావించే అవకాశముంది. దయచేసి చర్చలలో ఆ పదం వాడవద్దని విజ్ఞప్తి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 06:23, 29 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
@ప్రభాకర్ గౌడ్ నోముల: గారూ, మీకు నా మీదా గురుభావం ఉందన్నారు. మీరు నన్నిలా మన్నించడం మీ ఘనతనే పట్టిచూపుతోంది. సాధారణమైన వ్యక్తులకు వినయం అలవడదు. అనుభవంలోనూ, విజ్ఞానంలోనూ, అన్నిటికీ మించి సహృదయతలోనూ పెద్దవారైతే తప్ప వినయంగా ఉండలేరు. ఆ వినయానికి నా వందనం. ఐతే, మీకు నేనొక నిర్దిష్టమైన సూచన చేయదలిచాను.
 • నేను కూడా మీ పట్ల విధేయత తోనే (ఏం అనక)ఉన్నాం. - అలా ఉండవద్దండీ. గౌరవం (మీరు దానికి విధేయత అన్న పేరు పెట్టినా నేనేమీ కాదనను) అన్నది ఒకరి పట్ల ఒకరికి ఉండాలి. ఐతే, ఆ గౌరవం అన్నది మీ విధానాలను నేను, నా విధానాలను మీరు సరికాదనిపిస్తే విమర్శించడంలోనూ, తప్పు ఎత్తిచూపడంలోనూ అడ్డుపడకూడదు.
 • ఎప్పుడైనా వికీలో నేను రాసిన వ్యాసాల్లో సమస్యలు కనిపిస్తే నోటీసులు పెట్టండి, తొలగించాల్సినవి అనిపిస్తే తొలగింపు చర్చలు ప్రారంభించండి. నేను ప్రతిపాదించిన విధానాల్లో లోటుపాట్లు కనిపిస్తే ఎత్తిచూపండి. నేను చేస్తున్న పనుల్లో చెడ్డ ఉంటే నాకు సూటిగా చెప్పండి. నేను మీ పట్లా, నేను ఇక్కడ గౌరవించేవారందరి పట్ల కూడా ఇదే చేస్తున్నాను. ఇలా చేస్తేనే మీరు నాకు మేలు చేసినవారు అవుతారు.
 • నేను ప్రతిపాదించిన విషయాలను, ఆ ప్రతిపాదించిన విషయం బలంతో సమర్థించినా, అందులోని లోటుపాట్లు చూపి వ్యతిరేకించినా, మీరు నన్నూ, నా ప్రతిపాదననూ గౌరవించినట్లు. అలాకాక ఆ ప్రతిపాదించిన విషయం నచ్చకున్నా నా ముఖం చూసి సమర్థించడమో, పైన పేర్కొన్నట్టు ఏం అనకపోవడమో చేస్తే నా ప్రతిపాదనకు అది తీరని అవమానం. నేనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తప్పనిసరిగా అటువంటి స్పందనలను లెక్క నుంచి తీసే లెక్కిస్తాను. కాబట్టి, ఆ విధంగా చేయవద్దని సవినయంగా మనవి చేస్తున్నాను.
ఇదంతా ఇప్పటిదాకా మీరు రాసినవాటిని ఉద్దేశించి అంటున్నానని చిన్నబుచ్చుకోవద్దు. ఎందుకంటే నేను ముందే మీ విషయంలో నాస్టాండ్ చెప్పాను. మీకు అవగాహన లేక చేసివుంటారని, పైపెచ్చు మీరు ఎంతో నిజాయితీగా మీ స్టాండ్ చెప్తున్నారనీ - తద్వారా నా మనస్సులో చాలా గౌరవపూర్వకమైన స్థానాన్ని పొందారనీ - చెప్తున్నాను. భవిష్యత్తులో మీకు నా వైపు నుంచి ఈ సలహాలు రావాల్సి ఉంది కాబట్టి నా బాధ్యతగా చెప్తున్నాను. మీ సహృదయతకు, విద్యాభూషణమైన మీ గొప్ప వినయానికి నమస్కరిస్తూ --పవన్ సంతోష్ (చర్చ) 04:33, 28 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సమస్య - సలహా[మార్చు]

నిజానికి ఇక్కడ సమస్య ఇద్దరు అధికారుల మధ్యగా నేను భావిస్తున్నాను. కాబట్టి మిగతా సభ్యులందరూ నిర్వహకులతో కలిపి స్పందించడం-వాదించడం-ఎదురు దాడులు-వ్యక్తిత్వ హనానాలు-దురుద్దేశ ఆపాదనలు ఆపితే బాగుంటుంది(నాక్కూడా ఇదే వర్తిస్తుంది). దయచేసి ఇద్దరు అధికారులు చదువరి గారు మరియు అర్జున గారు ఈ చర్చలలోను మరియు ఓటింగ్ లోనూ పాల్గొనని, ఈ ప్రతిపాదనతో ఏ సంబంధం లేని ఈ ఇద్దరు విశ్వసించే ఓ అనుభవం కలిగిన వ్యక్తికి/వ్యక్తులకు వాదనలు తెలియజేస్తారు. ఓ మూడు స్థాయిల్లో ఈ వాదనలు జరుగుతాయి. చివరి స్థాయిలో నిర్ణయానికి ఇరువురు కట్టుబడాలి. ఈ ఇద్దరి పై స్థాయిన ఉన్న ఇంకెవరైనా ఉంటే వారు చేయి వేస్తే బాగుంటుంది. సమస్యకు సంబంధం లేని పర భాశీయులైన ఇంకా మంచిది. చర్చ బాగా హద్దులు దాటుతున్నట్టు అనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ ఆ వ్యక్తి తీర్పును గౌరవించి ఆ నిర్ణయాన్ని గౌరవించడం మేలు అనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ ఈ చర్చను ఆపమని అభ్యర్ధిస్తున్నాను. ఏకాభిప్రాయనికి రాలేని భవిష్య వివాదాల్లోనూ ఈ పద్ధతే అమలు కావాలి. ఇక్కడ నా నైతికత కూడా ప్రశ్నించారు కాబట్టి అత్యంత తెవికీ అనుభవం కలిగిన ఆ సదరు వ్యక్తి తేలిస్తే నేను కూడా ఇందుకు బాధ్యత వహిస్తాను అని మాట ఇస్తున్నాను. ధన్యవాదాలు. __________దేవుడు (చర్చ) 13:34, 26 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మీ హద్దులు దాటుతున్నట్టు అనిపిస్తోంది[మార్చు]

దేవుడు గారు, దయచేసి ఇద్దరు అధికారుల మద్య మీరు దూరం పెంచవద్దు. చదువరి గారు మరియు అర్జున గారు, ఈ చర్చలలోను చదువరి గారు, చాలా స్పష్టంగా చెప్పారు. విధానపరమైన విభేదాలే తప్ప వ్యక్తిగత కక్షలు మాకు లేవు అని అయినా మీ హద్దు దాటి వారి మధ్య వివాదాలు ఉన్నాయి అని అనడం ఏమాత్రం సరికాదు. అంశాలవారీగా విభేదాలు తప్పకుండా ఉంటాయి. దాన్ని వారి వ్యక్తిగత వివాదాలుగా మీరు ఎలా వివరిస్తారు. ఈ విషయంలో మీ పద్ధతి సరైంది కాదు. మీ వాదనకు ఎలాంటి ఆధారం లేదు. దశాబ్దం పైగా వారు కలసి వికీలో ఎంతో సేవ చేస్తున్నారు. కావాలంటే పైన చదువరి గారి అభిప్రాయం ఉంది చదవండి. మీ సొంత అభిప్రాయంతో ఇతరులను ఎప్పటికీ వేధిస్తూ ఉంటారా, మొన్న ఒకటి మళ్లీ ఇప్పుడు మరో వివాదానికి తెర తీస్తున్నారు. కొన్ని రోజులు కలసి ఉన్న ఎవరైనా వ్యక్తుల మధ్య కొన్ని అంశాలు కొందరికి సరి అయినవి అనిపించక అంశాల వారీగా అభిప్రాయభేదాలు ఉంటాయి. అంత మాత్రన వాదనలను దురుద్దేశ ఆపాదనలు అని ఎలా అంటారు. వారి మధ్య చాలా ఉన్నాయి కాబట్టి ఇతర వాడుకరులు కలిగే చేసుకోలే వద్దు అని ఎలా అలా నిర్ణయం చేయడానికి సరి అయిన పద్ధతి నా... ఈ విషయంలో మీ వాదన ను ఖండిస్తున్నా ... Prabhakargoudnomula 17:49, 26 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

దేవుడు గారు, వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు, బరిలో నిలిచిన ప్రతిపాదనపై ఓటు ప్రక్రియ ముగిసింది. రెండు రోజులలో ఖరారైన నిర్ణయం వెలువడుతుంది. నా అభిప్రాయాలతో అందరూ ఏకీభవించాలనే కోరిక నాకు లేదు. చదువరి గారితో గతకాలపు చర్చలలో విబేధించినా, వారికృషిపై ఆపార గౌరవముంది. వికీపీడియా నాణ్యత, అభివృద్ధికి గత నిర్ణయం ఆటకం కలిగిస్తున్నదనే చర్చను ప్రారంభించాను. ఈ చర్చగాని, ఇతర చర్చలు గాని ఎవరిపైనా వ్యక్తిగత కారణాలతో చేయలేదు, చేయుట్లేదు, ఇకముందు కూడా చేయను. ఓటు ప్రక్రియ అనంతరం జరుగుతున్న ప్రస్తుత చర్చలు ముందు కాలంలో వికీపీడియా అభివృద్ధికి దోహదం చేస్తాయి అని విశ్వసిస్తాను. ఈ చర్చలలో అందరూ పాల్గొనవచ్చు. కేవలం సామరస్యంగా చర్చలు జరిగితే చాలు. ఇక్కడ ఎవరూ మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరంలేదు. ఏమైనా అవసరముందంటే, ఈ చర్చలలో పాల్గొనని నిర్వాహకులు చర్చ గడువు ముగిసిన తర్వాత సముదాయం నేర్చుకోదగినవి అన్న విభాగ సారాంశాన్ని {{Discussion top}} తో చర్చ పై భాగంలో, {{Discussion bottom}} క్రింది భాగంలో చేర్చితే ముందు కాలంలో ఈ చర్చలు చదివేవారికి ఉపయోగంగా వుంటుంది. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 23:56, 26 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు, మీ ఆలోచనలతో నేను ఏ మాత్రం ఏకీభవించలేను. వారిరువురి మధ్య దూరం పెంచడం నా ఉద్దేశం కాదు. ఈ ఇరువురి పై నాకు గౌరవమున్నది. వారి గౌరవాన్ని మరియు తెవికీ గౌరవాన్ని పెంచడానికే ఈ సూచన. పైన చర్చలు గమనిస్తే నాకు అనిపించింది సూచించాను. పైన నేను సూచించింది నా సొంత ఆలోచన కూడా కాదు. Dispute Resolution అని ఆంగ్ల వికీపీడియా లోని పద్ధతే. మీకు ఓపిక, ఆసక్తి ఉంటే వెళ్ళి చదువుకోండి. చదువరి గారు మరియు అర్జున గారు మీ ఖండనలతో ఏకీభవిస్తే నేను తెవికీ నుండి తప్పుకుని మీకు మనశ్శాంతిని కలిగిస్తాను అని మాట ఇస్తున్నాను. _____దేవుడు (చర్చ) 00:44, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గారితో ఏకీభవిస్తున్నాను. తెవికీలో నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేసే అంశంపై జరుగుతున్న చర్చను, ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న స్పర్థగా దేవుడు గారు వర్ణించడం ఈ అంశపు ప్రాముఖ్యతను తగ్గించేదిగా ఉంది. ఈ అంశంపై చర్చలో పాల్గొని తమ విలువైన అభిప్రాయాలు చెప్పిన వాళ్లందరినీ, వోటింగులో పాల్గొని వోటేసిన వాళ్ళందరినీ ఒక్కుమ్మడిగా అవమానించడమే ఇది. ఆ ఇద్దరికీ మధ్య తగువును తీర్చడానికి ఓ మూడో వ్యక్తి దగ్గర వాదనలు చెయ్యాలని అనడం, ఆ మూడో వ్యక్తి నిర్ణయం చెప్పాలని అనడం.. చర్చలోను, వోటింగు లోనూ సముదాయం చెప్పే తీర్పుకు విలువ లేదన్నట్టుగా ఉంది ఇదంతా. కలిసి పనిచేసే వాళ్ళ మధ్య అంశాల వారీగా అభిప్రాయభేదాలు ఉంటాయని ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్య చాలా విజ్ఞతతో కూడుకున్నది. అలాంటి విజ్ఞత అందరూ ప్రదర్శించాలని నేను కోరుకుంటున్నాను. ఆయనేదో అన్నారని వెళ్ళిపోతానని అనడం చాలా సిల్లీగా చిన్నపిల్లల తగువు లాగా ఉంది. పరిణతితో చేసే ఆలోచన లాగా అనిపించడం లేదు.
మళ్ళీ చెబుతున్నాను.., కేవలం అంశంపై మాత్రమే నేను చర్చిస్తున్నాను, నా అభిప్రాయాలు వినిపిస్తున్నాను. అర్జున గారితో నాకు వ్యక్తిగత వైరమేమీ లేదు. ఒకవేళ అలాంటిదేమైనా ఉన్నా, దానికి హద్దు ఎక్కడ గీయాలో, దాన్ని ఎలా సరిచేసుకోవాలో నాకు తెలుసు. అర్జున గారికీ తెలుసు. ఎవ్వరి సలహాలూ అక్కర్లేదు. __చదువరి (చర్చరచనలు) 19:33, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

దేవుడు గారు, గత చర్చలు చదివినవారికి, మా ఇరువురి మధ్య వివాదాలు వ్యక్తిగతంగా మారాయనే అనుమానం కలిగే అవకాశం వుంది. అలా అనుకొని మీరు చక్కటి పరిష్కారం సూచించారు. ధన్యవాదాలు. మేము ఇరువురం స్పష్టత ఇచ్చిన తరువాత ఇక దానిపై చర్చ అవసరంలేదు. వికీలలో చర్చల ద్వారానే అవగాహన పెరుగుతుంది. ఒక్కోసారి సామరస్యపూర్వక చర్చలకు సహకరించని కొన్ని పదాలు అందరం వాడతాము. ఇది కేవలం వికీలో చర్చలద్వారా సహకరించుకునే పద్ధతిలో చాలా సహజం. నేను ఇతరులు వాడితే పట్టించుకోను. నేను వాడినట్లు ఇతరులు చెపితే, వీలైతే వివరణ ఇచ్చి వారికి క్షమాపణలు తెలియచేస్తాను. కావున ఈ చర్చతో సహా ఇతర చర్చలలో అలా జరిగినప్పుడు ఆ విధంగానే తేలికగా తీసుకోమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 22:32, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఇప్పటిదాకా ఈ చర్చను పరిశీలించి, పాల్గొన్న నేను చెప్పగలిగేది ఒకటే. ఇంతవరకూ @Arjunaraoc: గారు ఈ విషయాన్ని విషయం స్థాయి నుంచి వ్యక్తిగత స్థాయికి దించి చర్చ విలువను దెబ్బతియ్యలేదు, అలానే @Chaduvari: గారు కూడా అటువంటి పని చేయలేదు. (విధానపరమైన, ప్రక్రియాపరమైన అంశాల్లో పొరబాట్లు, తప్పిదాలు. వాటిపై విభేదాలు, వివాదాలు వేరు) అలా వ్యక్తిగత స్థాయిలో జరగని చర్చని జరిగిందని చూపించడం ఈ చర్చను అవమానించడమే. ఇప్పటికే పైన ముగ్గురు వాడుకరుల పేర్లు విడిగా తీసి వారిలో ఒకరి విషయంలో కనీసం ఆధారం ఏమిటో కూడా చెప్పకుండా జరిపిన గగ్గోలులో మొట్టమొదటిసారిగా ఈ చర్చ విధాన స్థాయి నుంచి వ్యక్తిగత స్థాయికి దిగజారింది. గమనించాల్సింది ఏమంటే ఆ పని అర్జున గారు, చదువరి గారూ చేయలేదు, ఆ పనిచేసినవారిని ఇప్పటిదాకా ఆయన సమర్థించలేదు, చదువరి ఖండించారు. ఇది వారి వ్యక్తిత్వాలకు మచ్చుతునక. ఈలాటి వారి మీద వ్యక్తిగత స్థాయి ఆరోపణలు చేయడమూ, వాటిని వాళ్ళు పరిష్కరించుకోవడానికి ఎవడో మధ్యవర్తి వద్దకు వెళ్ళాలనడమూ అర్థరహితం. @ప్రభాకర్ గౌడ్ నోముల: గారు ప్రదర్శించిన విజ్ఞతను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 03:45, 28 సెప్టెంబరు 2020 (UTC)C)Reply[ప్రత్యుత్తరం]

తెవికీ కి మంచి జరగాలి. ఇక సెలవు[మార్చు]

తెలుగు వికీపీడియా సభ్యులు అందరికీ నమస్కారం. జరిగిన అనవసర చర్చకు, రాద్ధాంతలకు నేను కారణంగా భావిస్తూ నైతిక భాధ్యత వహిస్తూ తెలుగు వికీపీడియా నుండి స్వచ్చందంగా తప్పుకుంటున్నాను. ఇది నేనేదో భావోద్వేగానికి గురి అయ్యి తీసుకున్న నిర్ణయం కాదు. నేను నమ్మే సిద్ధాంతాలకు ఇక్కడ నా మీద వస్తున్న ఆరోపణలకు నాకు సరి పోవడం లేదు అని భావిస్తున్నాను. నేను ఇక్కడ సభ్యుల భావాలకు నాకు 95% సరిపోవడం లేదు అనుకుంటున్నాను. ఈ వాదోపవాదాల వల్ల నాకు వ్యక్తిగతంగా కాలయాపన జరుగుతోంది. మీ సమయాన్ని వృధా చేస్తున్నాను. నేను ఆలోచించే విధంగా ఏ ఒక్కరూ కనీస ఆలోచన చేయడం లేదని అర్థం అయ్యింది. ఇక్కడ ఉండి ఇంత మందిని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం కంటే తప్పుకుని నా పని నేను చూసుకోవడం సరి అనిపిస్తోంది. నేను ఇక్కడ ప్రయాణం ఆరంభించిన నాటి నుంచి నాకు ఇంత వరకు సహాయసహకారాలు అందించిన సభ్యులకి, నిర్వాహకులకి, అధికారులకి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నా వల్ల నొచ్చుకున్న అందరికీ నా క్షమాపణలు. నేను ఇది ఎవరి మీదో నిరసనగానో చేయడం లేదు. తెవికీ లో మీ అందరి కృషికి మనస్పూర్తిగా అభినందనలు. తెలుగు భాష పై అభిమానంతో మీరు ఇలాగే కొనసాగాలని, తెలుగు భాషకు మరిన్ని సేవలు మీ నుండి అందాలని భావిస్తున్నాను. మీరు నన్ను మనస్పూర్తిగా క్షమిస్థారని భావిస్తూ, మీకు అంతా మంచే జరగాలని భావిస్తున్నాను. సెలవు. ఇక తిరిగి చూడను. _____దేవుడు (చర్చ) 01:34, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

దేవుడు గారు, దయచేసి అలా తొందరపడకండి మీరు వారి మధ్య దూరం పెంచకూడదు అని నా వాగ్వాదం దానికి మీరు కారణం కాకూడదని అలా నా తపన మొదటి నుండి మీ చర్చలు చూస్తూ ఉంటాను. చాలా అనుభవంతో చెప్పే పదాలు చాలా బాగుంటాయి. ఈ చిన్న వివాదానికి విక్కీ వైపు చూడని అనడం సరి అయినది కాదు, దానికి నన్ను బాధిస్తూ బాధిస్తూ వెళ్తా అనడం భావ్యం కాదు. ఈ మధ్య ఇలాంటి వాదనలతో దూరమైన అందర్నీ నేను వికీ లోకి ఆహ్వానిస్తున్నాను. అలాంటిది తిరిగి రావాలని వారిని కోరుతుంన్న, మీరు వెళ్తాను అనడం ఇబ్బందిగా ఉంది. మీకు సమయం లేకపోతే వికీలో కి రాకపోతే వేరు కానీ ఇలాంటి చిన్న ఈ వాదనలకు దూరం అవుతాను అనడం, తిరిగి చూడను అనడం భావ్యం కాదు. వికీ లో ఇలాంటివి సహజం అంతమాత్రాన నావల్ల నచ్చకుంటే నన్ను క్షమించండి. కానీ యధావిధిగా సమయం ఉన్నప్పుడు తప్పకుండా కొనసాగండి .... Prabhakargoudnomula 05:37, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
నా స్పందన చూడండి. ఒకవేళ అవసరమైతే కాస్త విరామం తీసుకొనియైనా మీరు వికీ కృషి కొనసాగించాలని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 22:39, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పునరాలోచించండి[మార్చు]

తెలుగు వికీ చర్చలలో చక్కని వాదనా పటిమ గల వ్యక్తిని మనం కోల్పోకూడదు. దేవుడు నిజంగా అద్భుతమైన వాదనా పటిమ గల వ్యక్తి. హిపోక్రసీ లేకుండా ఆయన చేసే తర్కబద్ధమైన వాదన వికీ చర్చలలో చాలా మంది సీనియర్ సభ్యులకు మింగుడు పడలేకపోయింది. ఇంత సూటిగా కుండబద్దలు కొట్టే హేతుబద్దంగా, తర్కబద్ధంగా వాదనలు చేయడం నేను గత వృత్తి అనుభవంలోనూ, ఇక్కడి గత 3 సంవత్సరాల కాలంలోనూ ఎక్కడా చూడలేదు. హిపోక్రసితో మునిగిపోయి వున్నవారికి నచ్చకపోవచ్చు. ఆయన మాటల సూటిదనం, నిక్కచ్చితనం వికీ చర్చల వెనుక వున్న కొద్దీ సభ్యుల రహస్య ఎజెండాలు, వ్యక్తుల ఇంటరెస్ట్ లు బయటపెడతాయి. ఇప్పుడున్న పరిస్థితులలో వికీ చర్చలకు ఆయన అవసరం చాలా వుంది. ఆయన లాజిక్ లోని హేతుబద్ధత సూటిగా అర్ధమైన వారు వున్నారు. హర్షించేవారు కూడా ఉన్నారు. భయపడేవారూ వున్నారు. సరైన సమయంలో సరైన వ్యక్తిని మనం కోల్పోకూడదు. ప్రస్తుత, భవిష్యత్ చర్చలలో దాగివున్న హిపోక్రటిక్ వ్యూస్ పటాపంచలు చేయగల సామర్ధ్యం దేవుడు గారికి వుందని గాఢంగా నమ్ముతున్నాను. అది gods gift. దేవుడు గారు పునరాలోచించండి. The lion must come back again. Think again --Vmakumar (చర్చ) 06:10, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అర్జున గారు ఈ ప్రతిపాదన ఎందుకు చేసారంటే[మార్చు]

అసలు పరిమితి ఎందుకు తీసెయ్యాలో చెపమని అర్జున గారిని నాతో సహా, అనేక మంది అనేక సార్లు అడిగారు. ఆయన ఇంతవరకూ సూటిగా సమాధానం చెప్పలేదు. మీకు అవగాహన లేదన్నారు, మీకు పక్షపాత ధోరణి ఉందన్నారు. ప్రశ్నించినవారిని చిన్నబుచ్చారే తప్ప కారణాలేంటో చెప్పనే లేదు. ఎందుకంటే ఆయన దగ్గర చెప్పడానికి సహేతుకమైన కారణం ఒక్కటీ లేదు. ఇక అర్జున గారు ఆ కారణాలను చెప్పరని నేను నిశ్చయానికి వచ్చేసాను. అందుచేత సముదాయానికి తెలియడం కోసం ఆయన చెప్పిన కారణాలను ఇక్కడ ఒక పట్టికలో ఇస్తున్నాను. పక్కనే ఆయా కారణాలు ఎందుకు సమర్ధనీయం కాదో కూడా వివరించాను. అర్జున గారూ, నేను సాధ్యమైనంత వరకూ మీరు రాసినదాన్ని ఉన్నదున్నట్టుగా రాసాను. నేను రాసిన కారణాలు తప్పైతే, వాటికి సవరణలు రాయండి. ఇవి కాక మీరు ఇంకేమైనా కారణాలు చెప్పి ఉంటే అవి కూడా రాయండి. __చదువరి (చర్చరచనలు) 19:03, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పరిమితి ఎందుకు తీసెయ్యాలో అర్జున గారు చెప్పిన కారణాలు ఆ కారణం ఎంత ఎందుకు పనికిరానిదంటే..
2020 తొలి రెండు మాసాలలో అనువాదాలు ముద్రించి గలిగిన వారు 10 మంది కాగా, 2020 మూడు, నాలుగు నెలలలో అనువాదాలు ముద్రించగలిగినవారు 8 మంది మాత్రమే. ఇది పెద్ద తేడా కాకపోయినా,.. "ఇది పెద్ద తేడా కాకపోయినా,.." అని వాడారు. అంటే ఈ కారణం ఈ ప్రతిపాదనను సమర్ధించడం లేదు. ఆ అంకెలపై ఆయనకే నమ్మకం ఉన్నట్టు లేదు. మరి పెద్ద తేడా కానపుడు అసలు ఆ అంకెలను ఎందుకు చూపించారు? ఈయనేదో పరిశోధన చేసినట్టే ఉన్నాడు అని జనం అనుకోడానికా? లేక చాలా కారణాలు చూపెట్టారని అనుకోడానికా?
2."70% పరిమితి లేకముందు చిత్తు అనువాదాలు రెండు నెలలలో 55 పెరగగా, పరిమితి విధించిన తరువాత రెండు నెలలలో 67 పెరిగాయి. మే, జూన్ మాసాలలో 47 పెరిగాయి. సభ్యులు ప్రస్తుత విధానం వలన అనువాద వ్యాసాలపై ఆసక్తి తగ్గించుకోవటంగా దీనిని అనుకోవచ్చు " - ఇది ఆయన రాసినదే. పరిమితికి ముందు రెండు నెలలలో చిత్తు అనువాదాల పెరుగుదల 55 కాదు, 45 మాత్రమే (122 నుండి 167కు పెరిగాయి) పరిమితి విధించాక రెండు నెలల్లో 67 పెరిగాయి. అంటే పరిమితి తరువాత 22 ఎక్కువ పెరిగాయి. ఈ లెక్కల ప్రకారం చూస్తే పరిమితి వలన అనువాదాలు తగ్గలేదు సరికదా, పెరిగాయి అని తెలుస్తోంది. ఇది అర్జున గారు వాదనకు, ప్రతిపాదనకూ వ్యతిరేకం.


దీన్నిబట్టి ఆయన వాదనలో పస లేదని అంటారని తరువాతి రెండు నెలల అంకెలను (మే, జూన్) కూడా గణన లోకి తెచ్చారు. ఈ రెండు నెలల్లో తగ్గాయి కాబట్టి, మానవిక అనువాద శాతాన్ని తగ్గించాలని ఆయన వాదించారు.. మరి, మొదటి రెండు నెలల్లో పెరిగాయి కదా..దాని ప్రకారం పరిమితి సత్ఫలితాలను ఇచ్చినట్టే కదా అని ఆయన్ను అడిగి చూడండి.. [మీకు అవగాహన లేదు అని అంటారు. లేదా మీది నిర్హేతుక పక్షపాత ధోరణి అనో మరొకటో అంటారు]

3. 2019 లో కొత్తగా సృష్టించిన అనువాద వ్యాసాలలో సుమారు 20 శాతం తొలగింపుకు గురయ్యాయి, సాధారణ కొత్త వ్యాసాలు 15% తొలగింపుకు గురయ్యాయి. 5 శాతం పెద్ద తేడా కాదు.. అంటే పరిమితి విధించడానికి పూర్వం, మామూలు వ్యాసాల కంటే అనువాద వ్యాసాలు పెద్ద సంఖ్యలో తొలగింపుకు గురయ్యాయి అని తెలుస్తోంది. ఇది ఆయన ప్రతిపాదనను వ్యతిరేకించే అంశం. దాన్ని ఆఫ్‌సెట్ చేసుకునేందుకు గాను కొత్త వాడుకరులు, ఎడిటథాన్ లో ప్రచురించిన పేజీలే పెద్ద సంఖ్యలో తొలగింపులకు కారణం అని తేల్చారు. అంటే పరిమితి లేకపోతే ఆ పరికరం నాణ్యత లేని వ్యాసాలను ప్రచురించడానికి వీలు కలిగిస్తుందనే కదా దాని అర్థం. అంటే పరినితి అవసరమేనని కదా దానర్థం!

(సరే.. అప్పట్లో ఆ వ్యాసాలు రాసిన వాడుకరుల్లో ఒకరైన మేకల హారిక గారు ఏమన్నారో చూసారా.. మేం ఎడిటథాన్ పెట్టుకున్న సమయం లోనే ఈ 30 శాతం నిబంధనం ఉన్నట్లయితే బాగుండేది కదా, మా వ్యాసాలు మరింత నాణ్యతతో ప్రచురించేవాళ్లం, వాటిని తొలగించకూండానూ ఉండేవాళ్ళు అని ఆమె రాసారు. అర్జున గారి ప్రతిపాదనకు వ్యతిరేకిస్తూ వోటూ వేసారు.)

4. కొంత అనుభవం గల సభ్యుని నిర్ణయాన్ని గౌరవించాలి. ఇలా చేయటం అప్రమేయ ఉపకరణ నాణ్యత సంరక్షణ క్రియలలో భాగం. ఈ విధానం వలన ఆ నియమం రద్దయింది. అనుభవజ్ఞులైన సభ్యుల నిర్ణయాన్ని పరికరం గౌరవించడం లేదు అనేది ఈ పరిమితిని తీసెయ్యడానికి ఆయన చూపిన మరో కారణం. పన్నెండేళ్ళు + అనుభవం ఉన్న వారి అనువాదాలను పరిశీలించి చూస్తే అనుభవం, అనువాద నాణ్యత ఈ రెండూ అనులోమానుపాతంలో ఉండవని తేలిపోయింది. ఆ ముక్క ఆ చర్చలో రాసారు కూడాను.
5. ఇలా పరిమితి విధించి నాణ్యత లేని అనువాదాలను ప్రచురించకుండా నిరోధిస్తే, వాడుకరులు ఇతర పద్ధతుల ద్వారా (కాపీ పేస్టింగు, నేరు అనువాదాలు, ఐఐఐటి అనువాదాలు వగైరాలు). నాణ్యత లేని వ్యాసాలను ప్రచురిస్తారు. అందువలన ఈ పరిమితి విధించడం వలన ప్రయోజనమేమీ ఉండదు. దొంగనే వాడు తాళాం పగల గొట్టైనా, తలుపు పగలగొట్టైనా దొంగతనం చేస్తాడు కాబట్టి, అసలు గుమ్మాలకు తలుపులు పెట్టడమే మానేద్దాం అని అంటున్నారు అర్జున గారు. అది తెలివైన ఆలోచనో కాదో తర్కించి, చర్చించి సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం.
చదువరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. నా స్పందనవలన ప్రస్తుతం ఏవిధమైన ఉపయోగముండదు కావున నేను ఇంతకంటే స్పందించుటలేదు. ముందుకాలంలో ఈ విధానం సవరణపై మరల చర్చకు వస్తే అప్పటి చర్చలో పాల్గొంటాను. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 23:16, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, నిజమే ఇప్పుడు స్పందిస్తే "మీకు" ఏ ఉపయోగమూ లేదు. సముదాయానికి మాత్రం ఉపయోగమే.. ప్రతిపాదన లోని మంచి చెడులు తెలిసిపోతాయి. అయితే సముదాయానికి ఉపయోగం కలిగే పని మీరు చెయ్యాలని రూలేమీ లేదులెండి, అది కేవలం స్వీయ నిర్ణయం. నమస్కారం.__చదువరి (చర్చరచనలు) 01:38, 28 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఈ వోటింగు ఓటమికేనని చర్చలనాడే తేలిపోయింది[మార్చు]

అర్జున గారి ప్రతిపాదన తెవికీలో నాణ్యతపై వేయబోయిన గొడ్డలివేటు. అది వికీకి ఏవిధంగా నష్టమో ఎన్నో రకాలుగా ఇక్కడ, గత చర్చలో, రచ్చబండలోనూ వాడుకరులు చెప్పారు, నేనూ చెప్పాను. వీళ్ళంతా ఇలా ఇక్కడా, రచ్చబండ లోనూ అసలు రాయడమే తప్పు అలాంటి వారిని నిషేధించాలని అర్జున గారు తన కసిని వెళ్ళగక్కారే గానీ తన ప్రతిపాదన లోని మంచేంటో చెప్పలేదు, ఇతవాడుకరుల వ్యతిరేకత లోని చెడేంటో చెప్పలేదు. ప్రతిపాదనను వ్యతిరేకించిన వాళ్ళం మాత్రం స్పష్టంగా ఆధారాలతో సహా అది ఎందుకు తప్పో చెప్పాం.

అసలు ఈ వోటింగును ఓడించడానికి ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన ఎనిమిదిమందిమి (వెంకటరమణ, రవిచంద్ర, పవన్ సంతోష్, యర్రా రామారావు, ప్రణయ్ రాజ్, IM3847, ప్రభాకర్ గౌడ్ నోముల, నేను) చాలు. తోడుగా బి.కె.విశ్వనాథ్ గారు కూడా ప్రతిపాదనకు వ్యతిరేకంగా వోటేస్తారని నేను భావించాను. పరిమితి విధించాలన్న ఒరిజినల్ తీర్మానంలో ఆయనకు సగం పాత్ర ఉంది కాబట్టి నేను అలా అనుకున్నాను. మేం తొమ్మిదిమందిమి దీనికి వ్యతిరేకంగా ఎప్పుడు వోటేస్తే అప్పుడే ఈ వోటింగు గెలుపుపై ఆశలు వదిలేసుకోవాలి. వోట్లెయ్యమని ఈ తొమ్మిది మంది ఎవరికీ చెప్పనక్కర్లేదు, ప్రచారాలు చేసుకోనూ అక్కర్లేదు. (చివరి రోజున అన్ని వోట్లెలా పడ్డాయి అంటూ డికెష్టివు పని చెయ్యబోయిన, లాపాయింటు లాగబోయిన పెద్దమనుషులెవ్వరికీ ఈ సంగతులేమీ తెలవదు. తెలిసినవాళ్ళు ఎవ్వరూ దీని గురించి మాట్టాడలేదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు.. మాట్టాడితే తెలివి తక్కువ తనాలు బయటపడినట్టే నని.) ఆ సంగతి నాకు తెలుసు, ప్రతిపాదకుడికీ తెలుసు. మరికొంతమందికి కూడా బహుశా తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే 36 అనుకూలమైన వోట్లు తాను తేలేనని ప్రతిపాదకుడికి తెలిసే ఉంటుంది. ఈమెయిళ్ళు రాసినా రావు, ఫోన్లు చేసినా రావు. అది సాధ్యమయ్యే పని కాదు. (అయితే అర్జున గారు ఈమెయిళ్ళు రాయడం చాలా నిరాశ కలిగించింది నాకు. అసలు ఆ పని చేస్తారని ఊహించనే లేదు నేను).

వెంకటరమణ గారి వోటుతో 12 వోట్లు ఐనై. ఇక ఆ ప్రతిపాదన నెగ్గాలంటే ఇంకో 35 అనుకూల వోట్లు కావాలి. అది జరిగే పని కానే కాదు. అంచేత మా వోట్ల అవసరమే లేదు. అందుకే నేను వోటెయ్యలేదు. లేదంటే నేనూ వెంకటరమణ గారి వెనకే నడిచి వోటేసేవాణ్ణి. నాణ్యతకు గొడ్డలిపెట్టైన ఈ ప్రతిపాదన వీగిపోవడమే నాకు కావాల్సింది. దాని ముందు, పద్ధతుల పట్ల నా పంతం అసలు లెక్కలోదే కాదు.

ప్రభాకర్ గౌడ్ గారి విషయంలో నా అంచనా తప్పింది. ఆయన వోటు అలా వేస్తారని నేను అస్సలు ఊహించనే లేదు. అయితే, ఎవరి వోటు వాళ్ళిష్టం. ఎవర్నీ తప్పుపట్టడానికి లేదు. కాకపోతే.., వోటుతో పాటు అభిప్రాయం కూడా ఎందుకుండాలో చెప్పేందుకు అదొక ఉదాహరణ అవుతుంది. బి.కె.విశ్వనాథ్ గారు ఖచ్చితంగా నేను ఊహించినట్టుగానే వోటేసారు. చివరిదాకా ఎందుకాగారో కూడా ఆయన స్పష్టంగా చెప్పేసారు.

అర్జున గారు కొందరికి ఈమెయిళ్ళు రాయడం కొందరికి రాయకపోవడం వల్ల వారు ఒకరినొకరు సంప్రదించుకున్నట్టుగా నాగరాణి గారు చెప్పినదాన్ని బట్టి తెలిసిపోతోంది. మేకల హారిక గారు తనకు ఈమెయిలు వచ్చాక తన క్లాస్‌మేట్లు, కాలేజి మేట్లతో మాట్టాడారు. వాళ్లలో కొందరికి ఈమెయిలు వచ్చింది కొందరికి రాలేదు. అర్జున గారి ఈమెయిలు, వారందరికీ మేలుకొలుపు పాడినట్టైంది. విషయం ఏంటో అర్థమైంది. వచ్చి వోటేసారు. హారిక గారు ఎందుకు వోటేసానో కూడా చెప్పారు. మీనాగాయత్రి గారు, నాగరాణి గారు, మేకల హారిక గారు కూడా ఎందుకేస్తున్నామో చెప్పి వేసారు.

పరిమితి తీసెయ్యాలన్న ప్రతిపాదనను నిలువునా కోసి కారం పెట్టిన రెండు వాక్యాలు చెప్పండి అని ఎవరైనా అడిగితే మేకల హారిక గారు రాసిన కింది రెండు వాక్యాలు చూపిస్తే చాలు.

ఆ సమయం లోనే ఈ 30 శాతం నిబంధనం ఉన్నట్లయితే మా వ్యాసాలు పూర్తి నాణ్యతతో ప్రసురించబడేయి. ఈ నిబంధన వాళ్ళ వ్యాసాల యొక్క నాణ్యత పెరగడం తో పాటు, కొత్తగా అనువాదం చేసేసవాళ్ళకి చాల ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.

ముగించే ముందు ఒక మాట:

 • అనుకూలమో వ్యతిరేకమో.. తమ అభిప్రాయం చెప్పినవారు
 • అభిప్రాయం చెప్పి వోటూ వేసినవారు
 • అభిప్రాయం చెప్పి వోటు వెయ్యకుండా ఉన్నవారు
 • అభిప్రాయం చెప్పకపోయినా వోటేసినవారు
 • అభిప్రాయం ఒక రకంగా చెప్పి వేరేరకంగా వోటేసినవారూ

వీరంతా వికీ పురోగతికి సహకరించినట్లే. ఒక వివాదాంశం అంటూ ఉన్నాక, పరస్పర వ్యతిరేక ఆలోచనలుంటాయి, అభిప్రాయాలుంటాయి, వాదనలుంటై, చర్చలుంటై. ఆరోపణలుంటై, వివరణలుంటై. విశ్లేషణలు విచారణలూ ఉంటాయి. ఒప్పులుంటాయి, తప్పులూ ఉంటాయి. ఈ చర్చలోను, వోటింగులోనూ పాల్గొన్న వాడుకరులందరికీ నా నమస్కారం.

అసలు ఈ చర్చలోను, వోటింగు లోనూ పాల్గొనని వారికి కూడా నా నమస్కారం. __చదువరి (చర్చరచనలు) 19:08, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ముగింపు ఇలాగే ఉంటుంది[మార్చు]

చదువరి గారు ఈ చర్చకు ముగింపు ఇలాగే ఉంటుంది. చర్చా సరళి బట్టే ముగింపు ఆధారపడుతుంది. నిజానికి చర్చ (డిబేట్ ) అనేది ప్రాధమికంగా Exchange of different opinions. ఓటింగ్ అనేది choosing of a particular opinion. అనేవి ప్రాధమిక సూత్రాలు. దీనిని విస్మరించి చర్చలో భాగంగా విశ్లేషణలతో పాటు విచారణ చేస్తున్నప్పుడే ముగింపు ఇలాగే ఉంటుంది మాకు అర్థమైంది. దేవుడు గారికీ ఇంకా స్పష్టంగా అర్ధమైంది. మీమీ విశ్లేషణలు ఆరోపణలు స్థాయిని దాటి విచారణ స్థాయిలోకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు గారు స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాబట్టి ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఓపెన్ మైండ్ తోనే Redressal Mechanism గుర్తుచేసారు.

చదువరి గారు మీ అభిప్రాయాలతో నేను కొన్ని సార్లు విభేదించినప్పటికీ అర్జున గారు అన్నా, మీరన్నా నాకు గౌరవమే. నాకున్న ప్రిన్సిపుల్స్ ప్రకారమే అర్జున గారి ప్రతిపాదన వికీకి మేలు చేస్తుంది అనేది నా నమ్మకం. నా నమ్మకాన్ని వోట్ ద్వారా మద్దతు తెలిపాను. జనరల్ గా మన ప్రిన్సిపుల్స్, మన చర్యలు -ఈ రెంటి మధ్య contradiction రానంతవరకూ చర్చలో జరిగే అభిప్రాయాల మార్పిడి (Exchange of Opinions) మనలను ప్రభావితం చేయలేవు. అయితే చదువరి గారు, ఈ మొత్తం చర్చలో ఒక చిన్న బాధ. ఈ చర్చను ఓ వారానికో, నెలకో మర్చిపోతాం. కానీ దేవుడు గారిని కొన్ని సంవత్సరాల వరకూ మర్చిపోలేను. అతి కొద్ధి సమయంలో హిపోక్రసీ లేని వాదనతో బలంగా impress చేయగలిగాడు. తన పట్ల తనకి మంచి క్లారిటీ వున్న వ్యక్తి. అతను మనతో చర్చలో పాల్గొన్నప్పుడు, అతని వాదనను సమర్ధిస్తూ కనీసం ఒక్క రెండు మాటలైనా మాట్లాడలేకపోయానేమిటి అన్న బాధ అలాగే ఉండిపోయింది. మీరు అంగీకరించవచ్చు. లేకపోవచ్చు. అది వేరే సంగతి.

సర్, చదువరి గారు మొత్తంమీద ఈ చర్చను చూస్తే మూడు విషయాలు మీకు అభ్యంతరంగా తోచాయి. 1. ప్రతిపాదన లోని విషయం 2. ఓటింగు నిర్వహించడం . 3. ఓటింగు ప్రక్రియలో అనుసరించిన వివిధ పద్ధతులు మీద అభ్యంతరం.
ఓటింగు లో ప్రతిపాదన వీగిపోయింది. కనుక అనువాద యాంత్రిక పరిమితులు ప్రస్తుత యథాతథ స్థితిలోనే వస్తాయి. ఓటింగులో నిర్ణయమైపోయిన విషయం ఇక గ్రూప్ కి శిరోధార్యం. కనుక మొదటి అభ్యంతరం పూర్తిగా పరిష్కారమయ్యింది కాబట్టి ఆ విషయంపై మీరు సీరియస్ గా చేస్తున్న చర్చలో (నా దృష్టిలో అది నిర్ణయం తేలిపోయిన విషయం. గతం గతః ) నేను పాల్గొన లేదు. అందుకే ఇప్పటివరకూ మీరు, పవన్ సంతోష్ గారు అర్జున గారితో సీరియస్ గా చర్చిస్తూ పోతున్నప్పుడు మధ్యలో కల్పించుకోవడం బాగుండకపోవచ్చనే అభిప్రాయంతో అడగలేకపోయాను. ఇక రెండవ అంశం ఓటింగు మీద. మూడవ అంశం ఓటింగు అనుసరించడంలో చేపట్టిన పద్దతుల గురించి.

అయితే భవిష్యత్తులో ఎప్పుడైనా అనివార్యంగా జరిగే ఓటింగు ప్రక్రియల్లో A ) ఓటర్లుగా మేము పాటించాల్సిన పద్దతులు ఏమిటి?
B ) నిర్వాహకులుగా మీరు అనుసరించాల్సిన పద్దతులు ఏమిటి?
C ) పద్ధతులు పాటించడంలో ఎవరి పాత్ర ఎంతవరకు వుంది?

లాంటి విషయాలు తరువాత అయినా స్పష్టం చేయవలసిందిగా అభ్యర్ధిస్తున్నాను. ఎందుకంటే రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని ప్రశ్నించిన విధంగా గజిబిజిగా తయారైంది మొత్తం ఈ చర్చ. నిజంగా ఇలాగే వుంది చదువరి గారు. మీరు, పవన్ సంతోష్ ఒకరి తరువాత చేస్తున్న చర్చలు, చర్చను చర్చలా కాకుండా ట్రయిల్ (trial) లా సాగాయి. వెంకటరమణ విజ్ఞతతో ఈ చర్చ పేరుతొ జరిగిన ట్రయల్ కి కొద్దిగా దూరం జరిగారు. అసలు చర్చను ట్రయల్ తీరులో తీసుకుపోతుండడంతో మీకు అర్జునరావు గారితో ఏవైనా disputes ఉన్నాయా అనుకోవడానికే పూర్తి ఆస్కారం వుంది. మరోలా భావించవద్దు చదువరి గారు ఒక చర్చ ఈ ట్రయిల్ రీతిలో వుండకూడదు. అది ఏమాత్రం హుందాగా ఉండదు. మీకు తప్పుగా అనిపించినా (ప్రతిపాదన వీగిపోయినప్పటికీ) అర్జున గారు అనుసరించిన విధానంకు 13 మంది సభ్యుల మద్దతుఉంది. అది మర్చిపోయారు. మీరు సాధారణ సభ్యులు కూడా కాదు. ఆయన కూడా మీ సాటి అధికారి. ఆ విషయం కూడా మర్చిపోయారు. మనం ఒక గ్రూప్ కి మార్గదర్శకులుగా వున్నప్పుడు వేరే ఎవరైనా సభ్యుడు చర్చను వేరే విధంగా నడిపిస్తే వారిస్తాం కదా!. అయితే ఎందుకనో ఈ చర్చలో అలా వారించబడటం మొదటినుంచీ జరగలేదు. చివరకి మీ అనుభవంతో మీరు కూడా ఓ లాజికల్ conclusion కి వచ్చారు. చర్చను ఎక్స్చేంజి అఫ్ డిఫరెంట్ ఒపినిఒన్స్ భిన్నాభిప్రాయాలని ఇచ్చి పుచ్చుకొని విధానం) లోనే ఇకనుంచి మనందరం వాడుదాం. (అది ట్రయల్ కాదు చర్చే అని చెప్పదలుచుకొంటే మళ్ళీ ఓ చర్చ ప్రారంభమవుతుందేమో.)

ఈ చర్చలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఎవరి దృక్పధాలకు తగ్గట్లుగా వారు అనుకూలమైన రీతిలో వ్యాఖ్యానించారు. మొత్తం ప్రక్రియలో తప్పుగా కనిపిస్తున్న అంశాలు ఏమిటి? తప్పైతే rectification ఎలా ఉండాలి అనే విషయంలో రెండు మూడు సందేహాలున్నాయి. మీవంటి వారి వద్ద వీటిని నివృత్తి చేసుకోవలసి వుంది. నా వరకూ ఇవి చాలా ముఖ్యమైనవే. ఒక అనుభవజ్ఞుడైన నిర్వాహకునిగా మీ ఒపీనియన్స్ భవిష్యత్ చర్చలలో నాకు, ఇతర సభ్యులకు కూడా మార్గదర్శకంగా ఉండవచ్చు. ముఖ్యంగా విధాన ప్రక్రియలలో వికీలో అనుసరించాల్సిన పద్దతులపై కొంత మేరకు అవగాహన కలిగే అవకాశం వుంది. చర్చ వారాల తరబడి వేడిగా సాగింది. ఈ టాపిక్ పై చర్చ ఇక ముగిస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఇంకా సాగితే నా చిన్న సందేహాలు నివృత్తికి మళ్ళీ ఇక్కడే కలుస్తాను. --Vmakumar (చర్చ) 03:53, 28 సెప్టెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అసహజ మానవీయ అనువాద స్థాయి పరిమితిని అధిగమించడానికి చిట్కా[మార్చు]

రచ్చబండలో చర్చ చూడండి. --అర్జున (చర్చ) 00:48, 31 జనవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]