వికీపీడియా చర్చ:వాడుకరి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

'13 గంట 26 నిమిషాల్లో షూట్‌చేసిన 100 ఎపిసోడ్‌(చిత్రా)లు''''

విజయవాడ కేంద్రీయ విద్యాయం- 2లో ఆర్టు టీచరుగా పనిచేస్తున్న ఆత్మకూరు రామకృష్ణ 11 సంవత్సరాల క్రితం(2010) బెంగళూరు కేంద్రీయ విద్యాలయలో ఫింగర్‌ పెయింటింగ్‌ మారథాన్‌ను నిర్వహించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. కుంచె వంటి ఉపకరణాలు లేకుండా కేవలం చేతివేళ్ళతో ఆయిల్‌ కలర్స్‌ని ఫింగర్‌ పెయింటింగ్స్‌గా వాడి 12 x 16 ఇంచెస్‌ స్ట్రెచ్డ్‌ క్యాన్‌వాసుపై 13:26 గంట(806 నిమిషా)ల్లో ‘100 చిత్రాలను వేసారు. ప్రత్యక్ష సాక్ష్యులుగా నిలిచిన ప్రముఖ చిత్రకారులు, ప్రేక్షకులు, మీడియా ప్రతినిధుల మధ్య చిత్రించిన ఆ వంద చిత్రాలను చిత్రించటం జరిగింది. నాటి ఆ సాహశాన్ని మెచ్చి ప్రపపంచ రికార్డు సంస్థలు రామకృష్ణకు ప్రశంసా పత్రాలను అందజేసి ప్రశంసించాయి.

కరోనా కష్టకాలం నేర్పిన పాఠాలతో యూట్యూబర్‌గా మారిన రామకృష్ణ ఓ చిత్రకారునిగా గతంలో తాను చిత్రించిన వందల చిత్రాలను వీడియోలుగా మలచి యూట్యూబు వేదికపై 14 వ్యక్తిగత చిత్రకళా ప్రదర్శనలిచ్చారు.

ఈ అనుభవంతో ప్రపంచ రికార్డు కొరకు 2010లో 100 చిత్రాలను 13.26 గంటల్లో చిత్రిస్తున్నప్పుడు తీసిన 13.26 గంటల నిడివిగల వీడియో ఫూటేజీ ఆధారంగా మరో సాహసానికి పూనుకున్నారు. ఈ సంవత్సరం జనవరి 1వ తేదీన మొదటి ఎపిసోడ్‌తో ప్రారంభించి రోజుకు ఒకటి చొప్పున విడుదల చేస్తున్నారు. 100వ ఎపిసోడ్‌ ఏప్రిల్‌ 10వ తేదీ నాటికి ముగిసింది. ఇది ఖచ్చితంగా నూతన ప్రపంచ రికార్డు. ప్రతి రోజు ఉదయాన్నే 5.30 గం॥కు (భారత కాలమానం ప్రకారం) ప్రపంచాన్ని పలకరిస్తూ యూట్యూబ్‌ ప్రపంచ వేదికపై 100 రోజులు కను విందు చేసి, కళాప్రియుల్ని అలరించింది.

ఓ ఫర్‌ఫార్మర్‌గా, ఓ ఎడిటర్‌గా, ఓ గ్రాఫిక్‌ డిజైనర్‌గా, ఓ ప్రొడ్యూసర్‌గా, ఓ డైరెక్టర్‌గా… అన్నీ తానై ఈ వీడియోను రూపొందించటం మరో విశేషం. ప్రతిరోజు ఒకే టైమ్‌కి ‘‘ఆత్మకూరు రామకృష్ణ ఆర్టిస్ట్‌’’అన్న స్వీయ యూట్యూబ్‌ ఛానల్లో ధారావాహికగా ప్రసారం అయ్యేట్లు ఏర్పాటు చేయటం గొప్ప క్రమశిక్షణ. ప్రపంచ రికార్డు సాధించిన ఫింగర్‌ పెయింటర్‌ గా ఆత్మకూరు రామకృష్ణ నేడు యూట్యూబర్‌గా మారి చూపిన విన్యాసమిది. ఫలించిన కృషి ప్రపంచ రికార్డుగా రికార్డు చేయబడిన 13 గంటల 26నిమిషాల వ్యవథిని క్షణం కూడా వదలక ప్రేక్షకులకు అందించిన 100 (3 నెలా 10)రోజుల యజ్ఞం ఇది.

100 ఎపిసోడ్‌లను ఎడిట్‌చేసి యూట్యూబ్‌లో షేడ్యూలు ప్రకారం అప్‌లోడ్‌ చేసిన తరువాతే ప్రపంచ రికార్డుగా అటెమ్టు చేయగల సత్తావున్న ప్రక్రియగా భావించటం జరిగిందని, మరొకరికి అంత సులభ సాధ్యం కాని విషయం కనుకనే ఈ రికార్డును ప్రపంచ రికార్డుగా క్లైమ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం అటుంచితే…11 సంవత్సరాల క్రితం బెంగళూరు నగరంలో జరిగిన ఆ పూర్తి కార్యక్రమాన్ని 100 భాగాలుగా చక్కగా వీక్షించదలచిన వారికి వినోదాన్ని కలిగించేలా చక్కని సంగీతాన్ని జోడిరచి ఆహ్లాదాన్ని పంచారు.

ఈ వంద లఘచిత్రాలను రూపొందించడానికి ఆనాడు తైలవర్ణ చిత్రాలను వేయడానికి 13.26 గంటలు ఎలా శ్రమించానో అంతకు మించి ఎన్నో రెట్లు శ్రమ నేడు తీసుకున్నాను అంటారు.

ప్రతి వీడియో థంభ్‌ నైల్‌లో ఎన్నో పెయింటింగ్‌ వీక్షిసున్నది, ఆ చిత్రం ఏ క్షణంలో మొదుపెట్టి ఏ క్షణంలో ముగించటం జరిగింది వీక్షకులు తెలుసుకునేలా విజువలైజ్‌ చేయటం జరిగింది. 100 చిత్రాలను చిత్రిస్తున్నప్పుడు ఏవరుసలో అయితే చిత్రించటం జరిగిందో అదే వరుసలో ఎపిసోడ్‌ను రిలీజు చేయటం జరిగింది. విజువల్‌ ఆర్టు(దృశ్య కళ)ల్లో ఒకటైన చిత్రలేఖనాన్ని నాలుగు గోడల మధ్య కాక ఫర్‌ఫామింగ్‌ ఆర్టు(ప్రదర్శన కళ)గా మార్చి పేక్షకులముందు ప్రదర్శించటమేకాక, దానికి కొన సాగింపుగా మీడియా, కమ్మునికేషన్‌ రంగాల అంతర్భాగమైన ఇంటర్‌ నెట్‌, సోషల్‌ మీడియాను అందిపుచ్చు కోవటం వలన ఫింగర్‌ పెయింటింగును మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావటం జరిగింది.

కళకు, కళారూపాకు ఖర్చు లేని ప్రచార వేదిక యూట్యూబ్‌ కాగా, ఆ వేదికతో పంచుకున్న వరల్డ్‌ రికార్డు ఫీట్‌కు శాస్వతత్వం లభించింది. భవిష్యత్‌ తరాలకు ఈ వరల్డ్‌ రికార్డు విశేషాలను ఓపన్‌గా ఉంచటం, మరికొందరికి ఇన్సిపిరేషన్‌ ఇవ్వటంమేకాక; యూట్యూబ్‌ ద్వారా ఓ గొప్ప సాంస్కృతిక సంపదను భావితరాలకు అందించిన వాళ్ళమవుతాము.

చిత్రకళా రంగంలోను, యూట్యూబ్‌ చరిత్రలోను యునీక్‌ అచీవ్‌ మెంట్‌గా నిలిచే ఈ ఫీట్‌లో అంతర్లీనంగా దాగిన ఆలోచన ‘పర్యావరణం – పచ్చదనం’!!. ఇలా ప్రపంచ కళారంగంలో రామకృష్ణ పేరు మరోమారు వినిపించనున్నది. క్రింది లింక్ ద్వారా యూట్యూబ్‌లో వీడియోలను చూడవచ్చు… https://www.youtube.com/channel/UCg0-4FrqJMqUeFvcilgbJ4g

కవి-చిత్రకారుడు ఆత్మకూరు రామకృష్ణ[మార్చు]

ఆత్మకూరు రామకృష్ణ కవితాప్రస్థానం కళాకారుడనేవాడు ఏ మాధ్యంలోనైనా తన భావాలకు రూపం కల్పించవచ్చు. అక్షరాలను విత్తులుగా నాటి కవితాసేద్యం చేయచ్చు. రంగుల్ని మేళవించి చిత్రాల్ని గీయచ్చు. రాగాల్ని మీటి హృదయాలను రాగరంజితం చేయచ్చు. గజ్జె కట్టి హృదయాల్ని ఘల్లు ఘల్లుమని గంతులు వేయించొచ్చు. రాతిని చెక్కిచెక్కీ అందమైన నాతిగా శిల్పించొచ్చు. ఏం చేసినా, ఎవడైనా-వాడు కళాకారుడే!

సాహిత్యంలో నోబెల్ బహుమతినిసాధించి, అత్యున్నతంగా వెలుగొందుతున్న సమయంలో విశ్వకవి టాగోర్ తన ముదిమి వయసులో కుంచెను పట్టారు. గొప్ప చిత్రకారునిగా పేరు పొందారు. అడవి బాపిరాజు సంగీత సాహిత్య శిల్ప చిత్రలేఖనాల్లో ప్రతిభ కనబరచి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు. చిత్రకారునిగా ఉంటూ కవులైనవాళ్ళెందరో ఉన్నారు. డా. ఎస్వీ రామారావు, అంట్యాకుల పైడిరాజు, డా. కాపు రాజయ్య వంటి వారెందరో. ఇప్పుడీ జాబితాకి రామకృష్ణ తన పేరును కూడా జత చేస్తున్నారు.

చిత్రకారుడుగా రామకృష్ణ చేతి వేళ్ళను కుంచెలుగా చేసుకుని వందలాదిగా కాన్వాసుల్ని ప్రకృతి శోభతో వర్ణాంచితం చేసిన /చేస్తున్న ‘నేచర్ స్పెషలిస్ట్. పదమూడున్నర గంటల్లో వంద ప్రకృతి చిత్రాలను తన చేతి వేళ్ళ కుంచెలతో చిత్రించి ‘లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో తన పేరును నమోదు చేసుకున్న అపురూప కళాకారుడు.. కవిగా జీవితంలో ఒక్కోసంపుటి ఒక్కోమజిలీ దాటుకుంటూ సంపుటి నుండి సంపుటికి కవిత్వ రచనా పద్ధతిని, వస్తు శైలీ శిల్పాల నిర్వహణలో మార్పుల నేపథ్యమంతా రామకృష్ణగారి కవితాప్రస్థానంలో చూడగలం. ‘కలరవాలు’అనే తొలి కవితాసంపుటికి ‘వేకువ తొలి సవ్వడి’ అనే ట్యాగ్ లైనును ఉంచారు రామకృష్ణ కవిగా తన జన్మవేకువ సమయాన పక్షుల కిలకిలారావాల్లా ‘తొలి సవ్వడి’ చేస్తున్నానని చెప్పకనే చెప్పారు. కవిగా కూడా తనను తాను తెలుసు (పుకోవాలని ‘కల’గన్నారు, అందుకే తన కవితలను ‘కలరవాలు’ అన్నారు కాబోలు.

ప్రాతఃకాలంలో పిట్టలు చేసే వేకువ తొలి సవ్వడుల్లాంటి 64 కవితలను తొలి ప్రయత్నంలోనే మంచి కవిత్వం’ అనిపించుకొంది. ప్రకృతి వర్ణన నుంచి ప్రేమ సరాగాల మీదుగా, అక్కడక్కడ సమాజాన్ని స్పృశించుకుంటూ, జీవన గమనాన్ని జీవాత్మ, పరమాత్మల కలయిక దిశగా నడిపే పరమార్థంగా భావించే కవితల సమాహారం ఈ మొదటి సంపుటి. రెండవ సంపుటి వచ్చేసరికి, కవితానిర్వహణ పూర్తిగా మారిపోయింది. కవితాఖండికల స్థానే ఒక దీర్ఘ కవితగా వచ్చింది. వస్తువు ఒక తుఫాను రాత్రి ఎనిమిదేళ్ళ పిల్లాడి మనసులో రేపిన భయకంపిత కలవరం. కొండల్లో సన్నగా పుట్టి, నెమ్మదిగా ప్రవహించి పాదాన్ని చేరి, అక్కడినుంచి మైదానంలో విశాలంగా పరచుకునే ప్రవాహం లాంటిది దీర్ఘకవిత. చక్కని పదచిత్రాలతో, మంచి ఇమేజరీతో కట్టలు తెగిన ప్రవాహంలా పొంగులెత్తిందీ కవిత. నలభై అయిదేళ్ళ వయసులో తన “తుఫాను రాత్రి’ అనుభవాలను దీర్ఘకవితగా మలచి, తుఫానుల్లో చిక్కి అవస్థలు పడ్డ ప్రాణుల ‘ఆత్మ’లకు అంకితమిచ్చి తన ఆత్మగతమైన సహానుభూతిని ప్రకటించారు రామకృష్ణ.

‘తుఫాను రాత్రి’, ఆ రాత్రిని అనేక కోణాల్లో దీర్ఘంగా వర్ణించిన కవిత. అమ్మ, నాన్నల తోడు లేని సమయంలో తుఫాను రేపిన అలజడుల్లో పూర్తిగా తడిసి గడ్డ కట్టుకుపోయిన చిన్నతనపు చిరు జ్ఞాపకాల అనుభవాలను అక్షరాల వెల్లువగా కూర్చిన వాస్తవిక భయోత్పాతం. ఆ తుఫాను రాత్రి రామకృష్ణ గారి మనసులో ఎప్పటికీ చెరిగిపోని, చెదిరిపోని గాఢ ముద్రను వేసింది. అందుకే, ఈ దీర్ఘకవితలో తుఫాను రాత్రి అనుభవాలను, అనుభూతులను చిన్న చిన్న అంశాలతో సహా ఉత్ర్పేక్షించి, తదనుభవాలను, అనుభూతులను పాఠకుడి మనసుపై కూడా అదేవిధంగా ముద్రింపబడేట్లు ఒక ప్రవాహోద్వేగ శైలితో వివరించారు రామకృష్ణ.

“తుఫాను’ను వస్తువుగా చేసుకుని రాసిన ఈ దీర్ఘకవితలో, సందర్భవశంగా ఎన్నెన్నో విషయాలను ప్రస్తావిస్తూ, విశాలమైన ఒక కాన్వాసుపై, తన మౌలిక కళైన చిత్రరచనను అక్షరబద్దం చేసి చూపారు. ఈ కావ్యాన్ని శ్రీమతి లక్ష్మీకాంతం గారు ‘అంధ్రాత్’ పేరుతో హిందీలోకి అనువదించగా త్వరలో ఉత్తరభారత పాఠకులను అలరించనున్నది. కలరవం నుంచి కలవరంగా మారిన కవిత్వ వెల్లువ, అలానే కొనసాగుతూ మూడవ సంపుటి వచ్చేసరికి ‘వికల కూజితం’గా మారింది. కూజితమే కాని, అందులో వికలత్వం కలగలిసిన కవిత్వం. సకలం వికలం…సజలం కకావికలం! సమాజగతమైన ఆందోళనలను, అవసరాలను కలుపుకుంటూ చేదుబ్రతుకుల, అనాథల కష్టాల కాష్టాల కన్నీరు ఉప్పెనలను స్పృశించారు…

కలవని తీరాల మనుషుల ఒంటరి తనాన్ని, తేలిన గుండె జాడల్ని పసిగట్టి సమాజ నిజదర్శనం చేయించారు రామకృష్ణ, ఈయన కవిత్వ చిరునామా ‘కవినెరుగని కవిత్వం’ అనే కవిత. “నీటి చుక్కకై యుగాలుగా ఎదురు చూసే చూపులు ఆరి…నేలలా నెర్రులు బాసిన కళ్ళు నేడు వ్రాస్తున్నాయి కవిత్వం” అంటారు.

మౌలికంగా రామకృష్ణ ఒక కవిలపిట్ట. పిట్ట స్వభావం కూజితం. అది కలస్వనమైనా కావచ్చు, వికలస్వనమైనా కావచ్చు; అలాగే పిట్ట ఎప్పుడూ పూజితం. పచ్చగా, ఎర్రని ముక్కుతో ఉండేదైనా కావచ్చు, నల్లగా ఉండేదైనా కావచ్చు. 44 కవితల్ని కవిలెకట్టగా చేసి ముద్రించిన కవితాసంపుటి ఈ ‘వికల కూజితం’.

చిత్రకారుడు కూడా అయిన ఈ కవి మంచి భావుకుడు. మట్టి మనిషిగా రైతును సంభావిస్తూ –

“ఈ మట్టి పొరల్లోనే నేల నీళ్ళాడినప్పుడల్లా పచ్చందాలకు సీమంతాలు జరిపింది” అంటారు. గొప్ప భావుకత. ఇటువంటి భావుకతతో చెబుతున్న భావానికి సీమంతం జరుపుతారు రామకృష్ణ తన చిత్రకారిత్వాన్ని అక్షరాల్లో బొమ్మ కట్టి చూపించగల నేర్పరి. అలాగే ఈయనది కథన కవిత్వం. తన స్వీయానుభవాలను జోడించి వస్తువును కథనాత్మక రీతిలో కవిత్వం చేస్తారు. అపరిచితుణ్ణి’ అనే కవిత ఉదాహరణ. సొంతూరుకు వెళ్ళిన కవిని ఎవ్వరూ గుర్తు పట్టరు. సొంతూరు వచ్చిన అపరిచితుల్లా కవి, పరాయీకరణకు గురవుతారు. ఆ నేపథ్యంలో ఒక చిగురంత ఆశ“నన్ను గుర్తుపడితే… ఈ మట్టే గుర్తు పట్టాలి

నన్ను పలకరించినా ఈ మట్టే పలకరించాలి… ఇది నాతో ఆడిన నా చిన్ననాటి నేస్తం … … …. …..

ఇంతకన్నా ఎవరు కావాలి?

నన్నెరిగిన నా వారు ఈ ఊరిలో…”అని సంతృప్తి చెందుతారు. సామెతలను, జాతీయాలను అర్ధవంతంగా ఉపయోగించడం ద్వారా తన కవిత్వాన్ని భావపరంగా సంపద్వతం చేస్తారు రామకృష్ణ.

ఆత్మకూరు రామకృష్ణగారు ‘అవ్యక్తు’ పేర చనిపోయిన తన తండ్రిగారి జ్ఞాపకాలను “తిరిగిరాని బంధంకోసం…’ అంటూ దీర్ఘకవితగా పలవరించారు. స్మృతుల భారం తగ్గించుకుందుకు రాసిన ఎలిజీ. ఇది తన నాల్గవ కావ్యం.

“…జీవన సేద్యంలో ఇన్నాళ్ళు తోడుగా నిలిచిన నాన్న, ఇక లేడన్న దుఃఖంతో విరిగిన కవి హృదయం వర్షించిన తండ్రి జ్ఞాపకాలే” ఈ అవ్యక్తం దీర్ఘకవితగా రూపొందించి, ఆ తండ్రి స్మృతికే ‘అంకితం ఇచ్చారు. నాన్నను కోల్పోయిన బాధ అవ్యక్తమనో, నాన్న స్మృతులు అవ్యక్తమనో-ఒక భావం మనసులో కదలాడగా ఈ దీర్ఘకవితకి ‘అవ్యక్తం’ అన్న పేరుంచారు రామకృష్ణ కానీ అత్యద్భుతంగా తన స్మృతులను, స్మృతుల నేపథ్యాలనూ సువ్యక్తం చేశారు. అదనంగా ఈ దీర్ఘకవితలో చెప్పుకోవలసిన అంశం ఒకటుంది. మొత్తం కవితని పది అంకాలుగా విభజించారు. వాటిలో చివరి మూడంకాలలోను ప్రత్యేకించి మరణవైరాగ్యాన్ని పలవరించారు. కాలానికి, చరిత్రకీ, దైవానికీ మరణంతో ఉన్న బంధాన్ని, జీవాత్మకు పరమాత్మతో ఉన్న అనుబంధాన్ని ఒక హేతుపూర్వకమైన తర్కంతో విశ్లేషించారు. ఈ విశ్లేషణలో ఒక ఉపనిషత్కారుని జిజ్ఞాసను మనం అనుభూతిస్తాం. జీవన్మరణాల పొలిమేరల్లో నిలచిన తాత్త్వికుడే అవుతారు కవి.

రామకృష్ణ కవితలు చిన్న చిన్న మాటల్లో తేలిక భావంతో తేలిపోయే కవితలనిపిస్తాయి అలవోకగా చదివితే. కానీ తరచి చూస్తే, ఆ చిన్న చిన్న మాటలే ప్రతీకలై, ఒక గుహనమైన భావాన్ని అందిస్తాయి. నిజానికిది మంచి కవిత్వం యొక్క ఒక లక్షణం. ఈ లక్షణాన్ని ఆత్మకూరు కవితల్లో చూడగలం.

ఐదవపుస్తకంగా చక్కని చేతివ్రాత నేర్వడానికి మెళకువల సర్వస్వంగా ‘హస్తలేఖనం ఓ కళఅన్న పుస్తకాన్ని సచిత్రంగా రూపొందించారు. ఇది గతంలో 64 కళలు.కామ్ అంతర్జాల పత్రికలో ధారావాహికగా సంవత్సరంపాటు వెలువడి వ్యాసాలు. అక్షరాలను అందంగా రాయడం ఒక రకంగా చిత్రలేఖనమే. అసలు చిత్రాల్లోంచి పరిణామక్రమంలో ఏర్పడ్డవే అక్షరాలు. దస్తూరి అనేది చిత్రాక్షరి. ఈ మాత్రం చెప్పి ఊరుకుంటే ఈనాటి సందర్భానికి అది సరిపోదు. అందుకే, ‘కలము వెర్సస్ కీ బోర్డు’ అన్న భావనను కూడ రామకృష్ణ ప్రత్యేకించి వివరించాల్సి వచ్చింది. “బుక్ కల్చర్’ పోయి ‘లుక్ కల్చర్’ వచ్చినట్లుగా, చేతిరాత చెరిగిపోయి ముద్రాక్షరాల రాత చోటు తీసుకుంటోంది.

నిరంతర చైతన్య చలితమైన చేతిని సక్రమంగా చలింపజేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. వయసుతో పాటు మారే కలంపట్లు వివరించి, కలానికి కుడి ఎడమైతే, రాత “తారుమారు’ అవుతుందంటారు. మంచి చేతి రాతకు మార్గాలు సూచిస్తూ, కూర్చొనే భంగిమనుంచి రాత పరికరాలు, మంచిరాతలో సిరాలు, పాళీల ప్రభావం వంటి ఎన్నో విషయాలను కూలంకషంగా చర్చించారు రామకృష్ణ

మన అక్షరాన్ని చక్కదిద్దే కళ హస్తలేఖనం. దాన్నే ‘లిపికర్మ కళ” అంటూ, చేతివ్రాలులో అక్షరాల వాలు గురించి పదాక్షర ఒద్దిక గురించి చర్చిస్తారు. కవి-చిత్రకారుడైన రామకృష్ణ కలం, కుంచెల నుండి వీలైనన్ని సృజనలు సమాజహితాన్ని, పాఠక-ప్రేక్షక అభిమతాన్ని చూరగొనేవిలా ఆవిష్కరింపబడాలని ఆకాంక్షిస్తూ…

– మాకినీడి సూర్య భాస్కర్