Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-ఆన్‌లైన్ శిక్షణా తరగతులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ శిక్షణ పట్ల నా అభిప్రాయాలు కొన్ని

[మార్చు]

జరుగుతున్నది ఆన్‌లైను శిక్షణ. కాబట్టి పాఠం తరగతిలో మాత్రమే చెప్పనక్కర్లేదు. ముందే పాఠ్యాంశానికి సంబంధించి చదూకోవాల్సిన పేజీలను విద్యార్థులకు ఇచ్చేస్తే వాళ్ళు చదూకుంటారు. తరగతి జరిగే నాటికి కొంతమేరకు సిద్ధంగా ఉంటారు. తరగతి గదిలో-

  • శిక్షకులు ఒకరి కంటే ఎక్కువమంది ఉండవచ్చు. ఉంటే బాగుంటుంది.
  • ఈ శిక్షకులంతా ముందే సర్వ సన్నద్ధంగా ఉండాలి. ఒకరు ప్రధాన శిక్షకుడు, మిగతా వారు సహాయకులు.

శిక్షణ కార్యక్రమం కింది విధంగా ఉంటే బాగుంటుంది.

  1. ఆన్‌లైను తరగతి రోజున ఏమేం నేర్పాలని/నేర్చుకోవాలని ఆశించారో వాటిని ముందే విద్యార్థులు చదువి వచ్చుంటారు. (శిక్షకులు ముందే లింకులు ఇవ్వాలి.)
  2. తరగతి రోజున -
    • శిక్షకుడు సోదాహరణంగా వీటి గురించి వివరించాలి. ఇది ముందే తయారు చేసుకున్న ప్రసంగమై ఉండాలి. తగు ఉదాహరణలు, తెరపట్టులు, వీడియోలు వగైరా హంగులతో ఉండాలి. ఈ ప్రసంగం/ప్రెజెంటేషను క్లుప్తంగా, పవర్‌ఫుల్‌గా, బలమైన ముద్ర వేసేలా ఉండాలి. (బహుశా ఒక పావుగంట.)
    • దీనిపై చర్చ జరగాలి. శిక్షణాంశాలకు అనుగుణంగానో, వ్యతిరేకంగానో ఉన్న వికీపీడియా పేజీలను విద్యార్థులు గమనించి ఉంటే, వాటిని లేవనెత్తి మిగతావారితో చర్చించాలి. శిక్షకులు కూడా పేజీలను ఉదహరించవచ్చు. విద్యార్థులు తమ సందేహాలను లేవనెత్తాలి. వాటిని విద్యార్థులే స్వయంగా తీర్చవచ్చు, లేదా శిక్షకులు తీర్చవచ్చు. (ఒక గంటా గంటన్నర)
    • ఆనాటి పాఠ్యాంశాలను స్పృశిస్తూ ఒక ప్రశ్నా పత్రాన్ని విద్యార్థులకు ఇచ్చి దానికి సమాధానాలు రాయమనాలి. వారికి ఏమాత్రం అర్థమైందో తెలుసుకునేందుకు ఇది కొలమానం. సమాధానాలు అప్పటికప్పుడు రాయకున్నా, తరువాతైనా రాసి పంపించవచ్చు. ఈ ప్రశ్నాపత్రాన్ని ముంందే తయారు చేసి పెట్టుకోవాలి. తరువాత, ఈ ప్రశ్నాపత్రాన్ని వికీలో కూడా పెడితే శిక్షణకు రానివారు కూడా తమను తాము పరిశీలించుకునేందుకు వీలుగా ఉంటుంది.

__చదువరి (చర్చరచనలు) 05:21, 3 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సూచనలు బావున్నాయి చదువరి గారూ, అనుసరిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 08:40, 4 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సమయంలో మార్పు

[మార్చు]

నాణ్యతాభివృద్ధి-ఆన్‌లైన్ శిక్షణా తరగతులు నిర్వహించడం మంచి కార్యక్రమమే. అయితే, సాయంత్రం 4 - 5.30 వరకు అనేది కాస్త సమస్యాత్మకమైన సమయం. ఆ సమయంలో వివిధ కార్యక్రమాలకోసం బయటికి వెళ్ళే పరిస్థితి రావచ్చు. కాబట్టి ఉదయం 10 - 12.30 అనేది సరైన సమయం అనేది నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 11:50, 4 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కార్యక్రమం మంచిదే. రాత్రిసమయంలో అయితే ఎక్కువమందికి అవకాశం ఉంటుందేమో పరిశీలించగలరు..B.K.Viswanadh (చర్చ) 16:15, 6 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మొత్తానికి ఆదివారం సాయంత్రం బాగా బిజీ అన్నది అర్థమవుతోంది నాకు కాబట్టి ప్రస్తుతానికి ఉదయం 10.30కి మార్చి చూస్తాను. ఈ సమావేశంలోనే రాత్రివేళలా, మధ్యాహ్నాలా అన్నది చర్చించి ఆపైన నిర్ణయించుకుందాం. పవన్ సంతోష్ (చర్చ) 16:14, 8 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి తరగతి

[మార్చు]

ఈ రోజు నేను మొదటి నుండి చివరి వరకు పాల్గొన్నాను. నాకు చాలా బాగా నచ్చింది. పవన్ గారు బాగా విశ్లేషించి, విషయాలు వివరిందారు, వారికి ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 08:10, 10 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాల దిద్దుబాట్లు

[మార్చు]

పవన్ సంతోష్ గారు, సరిదిద్దవలసిన వ్యాసాలు సూచిస్తారా ? JVRKPRASAD (చర్చ) 14:38, 10 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

రెండవ తరగతి

[మార్చు]

ఈ రెండు ప్రమాణాలను బట్టి సభ్యుల్లో ఆసక్తిని అర్థంచేసుకుని, రెండవ తరగతికి కొందరిని స్వీకరించాం:

  1. మొదటి తరగతిలో పాల్గొన్నవారిలో క్లాసును తప్పుదోవ పట్టించకుండా, తోటి సభ్యుల గురించి వికీపీడియాలో జరిగిన అంశాలను తెచ్చి ఆరోపణలు చేయకుండా క్లాసును అనుసరించినవారిని.
  2. మొదటి తరగతిలో పాల్గొన్నవారిలోనూ, సంతకం చేసినవారిలోనూ ఎవరెవరైతే ఇచ్చిన వ్యాసాల్లో మార్పుచేర్పులు చేసినవారిని.

మిగిలినవారు ఏం చేయవచ్చు:

  1. మొదటి అసైన్మెంట్ పూర్తిచేసి, రెండవది కోరవచ్చు. తద్వారా చదవవలిసిన లంకెలు అందజేసి, రెండవ అసైన్మెంట్ కోసం వ్యాసాన్ని సూచిస్తాం.

క్లాసు ఉద్దేశం కేవలం ముందుగా నిర్ణయించుకున్న అంశాలను నేర్చుకోవడం మాత్రమే తప్ప మరేమీ కాదు. వికీపీడియాలో జరుగుతున్న మంచి-చెడులు అక్కడికి తీసుకువచ్చి, ఇతర సముదాయ సభ్యుల గురించిన వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం కానీ, క్లాసుల ద్వారా సముదాయానికి సందేశాన్ని పంపాలని ఉద్దేశించి మాట్లాడడం కానీ సరికాదు. అవి తరగతుల ఉద్దేశాన్ని తోటి సభ్యుల ఉత్సాహాన్ని దెబ్బతీస్తూండడం వల్ల వాటిని నివారించడం శిక్షకునికి అత్యంత ముఖ్యమైన సంగతి అని గుర్తించగలరు.

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 04:51, 24 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు, ఫోను చేస్తుంటే రిప్లై లేదు మీ దగ్గర నుంచి, ఈ రోజు క్లాసు ఉందో లేక లేదా అనేది చెప్పండి.

ఈరోజు క్లాసు 10.30 గం.లకు అయితే మీరు నియమాలు 10.21 కి పోస్టు పెట్టడమేమిటని సందేహం అడిగితే నేను వికీ ద్రోహిని అంటారు. ముందుగా తెలియజేస్తే జవాబు ఇవ్వడానికి, కేవలం క్లాసులో ఉదాహరణకు తెలియజెప్పడం జరిగింది కాని, నాకు ప్రతి క్లాసులో ఇదే పని కాదు. ఎవరి పద్ధతి వారిది చాలా కరక్టు అన్న ధోరణిలో ఉండి, నన్ను తప్పు పట్టకండి. ఇదేనా సామరస్య వాతావరణం అని ఆలోచించరు చాలామంది. నన్ను క్లాసుకు రాకూడదని నిర్ణయం చేసారని అర్థం అయ్యింది. నాకు మరణించిన వారి వ్యాసం ఇవ్వండి. మీలా నాది ఉద్యోగం కాదు కదండి. వికీని మాత్రం కొందరు వాళ్ళ స్వార్థం కోసం బాగా వాడుకుంటున్నారు అని చాలామందికి అనిపించాలి మరి. కారణం ఏమిటో ? నాకెందుకు ? మనసులో ద్వేషం పెట్టుకుని ఎవరైనా నాతో స్నేహం నటించడం మాత్రం ఎవరికీ శ్రేయస్కరం కాదు కదా ! శలవు.JVRKPRASAD (చర్చ) 05:21, 24 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పాల్గొనేవారి_నుంచి_ఆశించేవి, తరగతుల_నుంచి_ఆశించదగ్గవి అన్న విభాగాల్లో ఉన్నవాటికి మించి పైనేవీ లేవు. ఆ విభాగాలు గత రెండు వారాల నుంచి ఉన్నాయి. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 06:35, 24 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రధానంగా మొదటి నియమం విషయంలోనే సమస్య. ఉదాహరణ కోసం మాత్రమే కాకుండా ప్రత్యేకించి ఆన్ వికీలో జరిగిన చర్చలను ముందుకుతెచ్చి, ప్రత్యేకించి ఒక వాడుకరిపై (పేర్లు ప్రస్తావించం మరో వివాదానికి దారి తీస్తుంది కాబట్టి తీసుకురావడం లేదు) ఆరోపణలు చేస్తూ, దీన్ని వికీపీడియాలో ఇతర వాడుకరులతో ప్రస్తావించమని చెప్పారు. మరీ ముఖ్యంగా ట్రైనర్ గా నా బాధ్యతను అనుసరించి ఈ అంశాలు తరగతిని పక్కదోవ పట్టిస్తాయని, అసలు ఈ అంశాల కోసం తరగతులు కాదనీ చెప్తున్నా అవే అవే పాత వివాదాలు ప్రస్తావించడం చేశారు. పోనీ ఆసక్తి అయినా ఉందేమోనని భావించి చూస్తే, ఇతరేతర మార్పుచేర్పులు ఎన్నో చేస్తూ కూడా ఈ అంశాలపై మార్పులు చేయలేదు (ఇది చివరి అంశం), కనీసం ఈ ఉదయం లోపైనా ఫలానా కారణంతో చేయలేకపోతున్నానన్న అంశం ప్రస్తావిస్తారేమోనని వేచి చూశాను. అదీ లేకపోవడంతో ఆసక్తి లేదన్నది చేతలతో చెప్పినట్టు అయింది. కాబట్టి ఆసక్తి లేనివారిని కదిలించడం వారిని ఇబ్బందిపెట్టడడమేనని ఇక్కడ నోట్ పెట్టి విడిచిపెట్టాను. స్వస్తి. ఇక ఆ రెండు పాలసీలకు అనుగుణంగా మీకు నచ్చిన ఏ వ్యాసం మీదైనా మీకు ఆసక్తి ఉంటే, నచ్చితే పనిచేయండి. స్వస్తి. --పవన్ సంతోష్ (చర్చ) 06:58, 24 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
గత రెండు వారాల నుండి మీరు పోస్ట్లు ఉన్నాయని అన్నది అబద్ధం. ఈ క్రింద పోస్ట్లు నందు ఏమి వ్రాసారో చూడండి. దీనిలోని విషయం గురించి మాట్లాడండి. ఎదుటివాడిమీద నెపం ఎందుకు వేయడం ?
  • (ప్రస్తు | గత) 12:28, 24 ఫిబ్రవరి 2019‎ Pavan santhosh.s (చర్చ | రచనలు)‎ . . (16,933 బైట్లు) +2,793‎ . . (→‎రెండవ తరగతి) (దిద్దుబాటు రద్దుచెయ్యి | ధన్యవాదాలు)
  • (ప్రస్తు | గత) 12:05, 24 ఫిబ్రవరి 2019‎ Pavan santhosh.s (చర్చ | రచనలు)‎ . . (14,140 బైట్లు) +1,140‎ . . (→‎రెండవ తరగతి) (దిద్దుబాటు రద్దుచెయ్యి | ధన్యవాదాలు)
  • (ప్రస్తు | గత) 11:19, 24 ఫిబ్రవరి 2019‎ JVRKPRASAD (చర్చ | రచనలు)‎ చి . . (13,000 బైట్లు) -1‎ . . (→‎రెండవ తరగతి) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు | గత) 11:19, 24 ఫిబ్రవరి 2019‎ JVRKPRASAD (చర్చ | రచనలు)‎ చి . . (13,001 బైట్లు) +1,839‎ . . (→‎రెండవ తరగతి) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు | గత) 10:52, 24 ఫిబ్రవరి 2019‎ JVRKPRASAD (చర్చ | రచనలు)‎ చి . . (11,162 బైట్లు) +113‎ . . (→‎రెండవ తరగతి) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు | గత) 10:51, 24 ఫిబ్రవరి 2019‎ JVRKPRASAD (చర్చ | రచనలు)‎ చి . . (11,049 బైట్లు) +364‎ . . (→‎రెండవ తరగతి) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు | గత) 10:21, 24 ఫిబ్రవరి 2019‎ Pavan santhosh.s (చర్చ | రచనలు)‎ . . (10,685 బైట్లు) +2,854‎ . . (→‎వ్యాసాల దిద్దుబాట్లు) (దిద్దుబాటు

నేను చెబితే అది ఆవేశం, గొడవలు అంటూ ఏదో ఒకటి వ్రాయడం, బురద చల్లడం పరిపాటి. నాతో మాత్రం బాగా ఆలోచించి వాదన చేస్తే బావుంటుంది. నేను మంచితనంతో చెప్పినవి మీకు ఇష్టం లేదు కనుక నేను ఏది చెప్పినా మీకు తప్పుగా తోస్తుంది. ఇంక ముందు మీలా ఆలోచించే వారికి నేను చెప్పడం అనవసరం. నా మీద సదభిప్రాయం ప్రస్తుతం చాలా తక్కువగా ఉందని, నేను భయంగా, చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. నేను ఏ విషయాలు పక్కదోవ పట్టించాలని ప్రస్తావించలేదు. మీరు చేసినవి మాత్రం అన్నీ కరక్టు, నావే అన్నీ తప్పులు అనటం సవ్యంగా లేదు. నేను ఎందుకు చేయలేదో మీరెందుకు అడగలేదు అని నేను అడిగితే తప్పు. నాకు ఎక్కడ ఎలా అడగాలో తెలియదు కనుకే అడగలేదు అని ఎందుకు అనుకోరు. ఆసక్తి లేక కాదు, మీలాంటి వారు నా లాంటి వారితో మాట్లాడక పోవడమే ముఖ్య కారణం, నాకు అన్నీ భయం ఎన్నోసార్లు చెప్పాను. అర్థం ఎందుకు చేసుకోరో నాకు అర్థం కాదు. ఈ ఉదయం 10.21 కి మీ పాలసీ విషయాలు పెట్టాక, వెంటనే స్పందించాను. నాది తప్పు అని మాట్లాడటం సమంజసమా ? ఎందుకు ఈ అనవసర చర్చ, ఒక ఫోను చేసినా, మాట్లాడే వాడిని కదా ! నన్ను ఎందుకు ఇంకా మనోవ్యధకు గురి చేస్తారు ? మీలాంటి అన్నీ తెలిసిన గొప్ప వారు, మీరు ఊహించుకున్నట్లుగా మాలాంటి ఏమీ తెలియని వారికి సరి అయిన పద్ధతిలో అన్నీ ముందస్తుగా చిన్నపిల్లలకు చెప్పినట్లుగా నేర్పండి, చెప్పండి. స్వస్తి.JVRKPRASAD (చర్చ) 09:37, 24 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:JVRKPRASAD గారూ, నేను రెండు లింకులు ఇచ్చాను. అవి వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-ఆన్‌లైన్ శిక్షణా తరగతులు అన్న పేజీవి. మనం ఇప్పుడు చర్చలు చేస్తోంది దాని చర్చా పేజీలోనే కదా. దానిలో నేను చేసిన ఈ మార్పు గమనించండి. ఇది నేను ఫిబ్రవరి 10న చేశాను. అంటే సరిగ్గా రెండు వారాలు. ఆ ముక్కే పైనా చెప్పాను. ఇక పోతే నేనేమీ అభిప్రాయాల ఆధారంగానో, ఉద్దేశాల ఆధారంగానో పనిచేశాను అనుకోకండి. సూటిగా, స్వయంగా "నేను ఈ క్లాసుల ద్వారా వికీ పెద్దలకు కొన్ని విషయాలు తెలియజెప్పదలిచాను" అంటూ ఆ క్లాసుల్లో లేని వాడుకరి మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం, ఇందుకు ఈ తరగతులు వేదిక కాదు అంటున్నా నామాట ఖండించి "ఇలాంటి అవకాశం దొరకట్లేదు, దొరికినప్పుడు కూడా నేను పడిన ఇబ్బందులు చెప్పుకోనివ్వరేమిటి" అంటూ మీరు అదే కొనసాగించడం ఆ తరగతిలో ఇతరులు ఉండగానే జరిగాయి. నేనేమీ ఊహించుకుని నిర్ణయాలు తీసుకోవట్లేదు. మీరు మాట్లాడిన తీరును విన్నాకే తీసుకున్నాను. పోనీ ఆ నిర్ణయం కూడా ఏమీ మీ ఆన్ వికీ కార్యకలాపాలకు అడ్డుపడేదీ కాదు. మిమ్మల్ని చిన్నబుచ్చడం ఇష్టం లేక మీ పేరును కూడా పైన ప్రస్తావించలేదన్న విషయాన్ని, ఇంత జరిగిన మీరు ఏ వాడుకరి మీద ఆరోపణలు చేశారన్న అంశం రాయలేదన్న సంగతీ గమనించినవారికి ఎవరికైనా నేనెంత సున్నితంగా, సమతుల్యంతో వ్యవహరిస్తున్నానో అర్థమవుతుంది. కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడితో విడిచిపెట్టడం మేలని నా అభిప్రాయం. దిద్దుబాటు చేయాల్సిన వ్యాసాలను సూచిస్తారా అని మీరే పైన ఓ శీర్షిక పెట్టి చక్కగా అడిగారు. అంతేకాక మీకు నేను సూచిస్తూ వ్యాసం ఇచ్చినచోటే ఫలానా తేదీ వరకు చేయలేననీ చెప్పారు. మంచిదే. కానీ ఇన్నీ చక్కగా చేసిన మీరే "నాకు ఎక్కడ ఎలా అడగాలో తెలియదు కనుకే అడగలేదు అని ఎందుకు అనుకోరు. ఆసక్తి లేక కాదు, మీలాంటి వారు నా లాంటి వారితో మాట్లాడక పోవడమే ముఖ్య కారణం" అనీ అంటున్నారంటే ఏం అర్థం చేసుకోవాలి? --పవన్ సంతోష్ (చర్చ) 10:05, 24 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు, నేను అడిగేది పొద్దున్న మీరు మార్పులు కొత్తగా చేశారా లేదా ? వాటిలో విషయాలు చెప్పండి. తదుపరి, నేను ఎన్నో మార్పులు గతించిన వారంలో చేశాను అని నన్ను నిందా పూర్వకంగా ప్రస్తావించారు. నేను తోటి వాడుకరులు ఎంతో కాలంగా ఒక పద్దతిలో మార్పులు చేస్తున్నారు, తెవికీలో అదే పద్ధతిలోనే చేయాలేమోనని, ఎటువంటి సమస్యలు ఇతరులు నుండి నాకు రావని, అలాగే నేను కూడా చేశాను. నేను చేసే రైల్వే స్టేషన్లు జాబితాలో మార్పులు కూడా చేశాను. ఇవి చేయడానికి నాకు మెదడు పెద్దగా ఉపయోగించవలసిన అవసరం లేదు. కొత్తగా నేను వ్యాసాలు వ్రాయలేదు. కొద్దిగా మెదడు ఉపయోగించి, సురేఖ వ్యాసాన్ని తెవికీ పద్ధతిలో సరి చేయాలంటే నాకు అవసరం. మరొక విషయం, అప్పుడు నేను తెవికీలోనే ఉన్నాను అని, నాతో ఏమైనా చర్చ చేస్తారేమోననే భ్రమలో ఉండి, మీకు తెలియజెప్పడానికి తేలికగా ఉండే పని చేసాను. మీరు వాడుకరి పేరు ప్రస్తావన చేసినా, చేయక పోయినా నా గురించేనని అందరికీ తెలుస్తుంది. క్లాసులో ప్రస్తావన చేసిన విషయం గురించి నా దగ్గర నాకు అవసరమైన వారియొక్క పోను నంబరులు లేవు, వారితో చర్చ చేసి, చెప్పడానికి అవకాశం దొరకలేదు. తెవికీ క్లాసు అంటే అన్న మాట్లాడుకోవచ్చని అనుకున్నాను. నాకు ఇటువంటి క్లాసు మొదటిది, నియమాలు, తెలియవు, మీరు చెప్పలేదు. ఇంతటితో ఈ విషయాన్ని వదలివేయమని నేనే చెబుతామనుకున్నాను, అది మీ నుండే వచ్చింది, సంతోషం. ఒకవేళ మన ఇద్దరిలో ఈ సందర్భంలో (ఎవరి మనసులో నయినా చెడు అలోచనలు, అబద్దాలు, ఇలాంటివి ఉన్నా ) అందుకు తగ్గ శిక్ష నిజ జీవితం కుటుంబంలో త్వరలో అనుభవించడానికి సిద్ధంగా ఉందాం, నాకు ఇలాంటి చాలెంజ్ అనుభవించడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాను. మీ మనసు ప్రశాంతత కోసం, ముందు రోజులు తప్పక వేచి చూడాలి. తదుపరి, మీరు దిద్దుబాటు చేయాల్సిన వ్యాసాలు ఒక జాబితా చేయండి. అందులో నేను చేయాలనుకున్నవి చేస్తాను. నేను నాకుగా తెవికీ నుండి ఏరుకోవడం మాత్రం సమయం వృథా అవుతుంది. నాకు వ్యక్తిగత పనులు అనేకం ఉన్నాయి. అందువలన అంత శ్రద్ధగా ప్రతిదీ చూడటం జరగలేదు. మీరు ఒక ఫోను చేస్తే బావుండేది. నేను అందరినీ ఒకేలా, మనసులో ఏమీ లేకుండా అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఎవరి జీవితాలు వారివి, ఇక్కడ కేవలం కాసేపు సమయం గడిపి వెళ్ళిపోయే వాళ్ళము. ఈ చర్చ ఇంతటితో అపుదాము. ఒకరి గురించి ఆలోచించే సమయం ఎవరికీ ఉండదు. అందరినీ ఒకేలా చూడమని, చూడాలని నా అభిమతం. మీ స్పందనలకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 13:45, 24 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  • తరగతిలో ఒక వాడుకరిని నిందిస్తూ, అతనికి ఏవో ఉద్దేశాలు ఆరోపిస్తూ చేసిన వ్యాఖ్యలు తరగతి ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని నేను మీకు ముఖత: నేరుగా తరగతిలోనే చెప్తే ఏ మాత్రం పట్టించుకోకుండా కొనసాగారు. అసలు వ్యక్తిగత దూషణ చేయకూడదని చెప్పిన తరగతిలోనే వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారు. కనీసం తోటి సభ్యులు చెప్తున్నా ఆగలేదు. ఇవన్నీ నేను సుస్పష్టంగా విని అర్థం చేసుకున్నది. దీని వల్ల మీరు ఈ తరగతి వల్ల నేర్చుకునే ఉద్దేశం లేదు సరికదా, ఏవేవో సందర్భాలు తీసుకువచ్చి ఎవరెవరో వాడుకరుల మీద నిందారోపణలు చేసి తరగతిని దారితప్పించడం మినహా వేరే ప్రయోజనం మీరు దీన్నుంచి ఆశించలేదని నేను అవగాహన చేసుకున్నాను. ఇవన్నీ పరిశీలించిన మీదట తరగతులు దెబ్బతింటున్నప్పుడు ఉపేక్షించాల్సిన అవసరం లేదు కాబట్టి మిమ్మల్ని తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నాను. ఎదుటివాడు మర్యాదగా మాట్లాడుండడం మీకేమైనా బలహీనతగా కనిపిస్తుందో ఏమో కానీ ఏమాట పడితే అది అంటున్నారు. JVRKPRASAD గారూ, ఈ విషయంలో ఇంతకన్నా మీరు నాతో చర్చించాల్సిన అవసరం లేదు, నేనూ మీతో చర్చించను. --పవన్ సంతోష్ (చర్చ) 04:33, 25 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  • నేను శిక్షణలో పాల్గొనకపోయినా పై చర్చ వల్ల నాకొక విషయం తెలుస్తోంది. శిక్షణా తరగతులు కేవలం శిక్షణ కోసమే వాడండి. దాని పరిధిలో లేని అంశాలపై చర్చ చేయవద్దు. ఇలా చేస్తే కేవలం శిక్షణ కోసం సెలవు రోజు తమ సమయాన్ని వెచ్చించేవారిని అగౌరవ పరిచినట్లు అవుతుంది. ఈ నియమాన్ని ఉల్లంఘించేవారు నిరభ్యంతరంగా తరగతి బయటే ఉంచవచ్చు. రవిచంద్ర (చర్చ) 05:49, 25 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
నేను మొదటి తరగతికి హాజరు కాలేకపోయాను.రెండవ తరగతిలో నేను మొదటి నుండి చివరివరకు పాల్గొన్నాను. ఈ తరగతి ద్వారా నామనస్సులో ఉన్న కొన్ని సందేహాలకు సమాధానాలు తెలిసినవి.వాడకరుల సందేహాలకు తరగతి నిర్వాహాకులు పవన్ గారు ఓపిగ్గా నివృత్తి చేసారు.ఈ తరగతులను ఎక్కువమంది వాడుకరులు ఉపయోగించుకుంటే,వికీపీడియా నాణ్యత మరింత అభివృద్ధి కాగలదని భావిస్తున్నాను.గ్రూపుగా నివృత్తి చేసుకున్న సందేహాలు మన మనస్సు మీద చెరగని ముద్ర వేస్తాయనుటలో ఎటువంటి సందేహం లేదని భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 06:19, 25 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు, ఎందుకు అంతలా ఆబద్ధాలు వ్రాస్తున్నారు. మీకు ఇది బాగా అలవాటుగా ఉంది. తోటి సభ్యులు చెప్పారా ? నేను ఆగలేదా ? ఎందుకు ఇంత అబద్దపు దరిద్రం ? మీ దగ్గర రికార్డు ఉంటే అందరికీ చూపిస్తే నిజం తెలుస్తుంది. నేను తరగతిని దారి తప్పించడ మేమిటి ? అర్థం లేని ఆరోపణ. ఇలా అబద్ధపు చర్చలు చేస్తే మీ జీవితం నాతో చర్చలకు సరిపోదు. మీలాంటి వాళ్ళు నిందలు నేను క్లాసుకు వచ్చింది, నిందారోపణలు చేసి తరగతిని దారితప్పించడం మినహా వేరే ప్రయోజనం లేకుండా ఆశించనా ? ఈ రకంగా రాస్తే సర్వనాశనం జీవితం ఎవరికైనా (నాకైనా అబద్ధం ఆడితే మాత్రం) అవుతుందని గ్రహించండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఈ విధంగా నిందలు వేయడం, అబద్ధాలు వ్రాయడం లాంటివి ఇంతకాలం ఎందరితోనో చేసి ఉండవచ్చు, కానీ నాతో ఈరకంగా ప్రవర్తిస్తే మాత్రం దాని చెడు ఫలితం త్వరలోనే కాలం రూపంలో ఆ దైవం తప్పక భరించలేని శిక్ష మాత్రం వేస్తాడని నాకు బాగా నమ్మకం. నేను మీకు ఎలా కనిపిస్తున్నాను ? నన్ను తేలికగా చేస్తూ ఏదిపడితే అది మాట్లాడినా, వ్రాసినా జీవితకాలం మీలా ప్రవర్తించే వాళ్ళని ఊరుకోను, తెలుసుకుంటే మంచిది. నిజ జీవితంలో నాతో ఎవరూ అబద్ధాలు, అమర్యాద, అగౌరవంతో ఎవరూ మాట్లాడరు, సాహసించరు. తప్పులు చేసిన చాలామందికి వారివారి అనుభవాలు పాఠాన్ని నేర్పాయి. ఇక్కడ చాలామందికి తెలియదు, చెప్పినా అర్థం చేసుకోరు, మారరు. నేను మీతో గొడవగా, కోపంగా, మరే రకంగానైనా క్లాసులో మాటాడానా ? లేదు కదా ! నాతో మీకు ఇబ్బందిగా ఉంటే, అది నాతో చెబితే నేను మీ క్లాసులకు రాను కదా ! దీనికి ఇంత దరిద్రం చేసుకోవాలా ? నేను మాట అనను, ఎవరన్నా పడను. నా మీద అబద్ధాలు మాట్లాడితే అస్సలు ఊరుకోను. ఇలా అబద్ధాలు మాట్లాడి, క్లాసులోంచి తొలగించితే, మా సమయం వృధా కావడం లేదా ? క్లాసు 10.30 అయితే నియమాలు 10.21 కి పోస్టు చేసి చెబుతారా ? నా మీద గౌరవం, సదభిప్రాయం ప్రస్తుత సమూహంలో చాలామందికి లేదు. మీలాంటి వాళ్ళకు ఎంత మంచి చెప్పినా అది చెడుగానే కనిపిస్తుంది. నామీద అనవసర నిందలు వేసే వారు ఎవరైనా దాని చేదు చెడు ఫలితం త్వరలో అనుభవిస్తారనుటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చర్చలు చూసి నేనేదో గొడవలు చెసే వాడిలాగా, వికీ ద్రోహి లాగా నా మీద నిందలు వేసేస్తారు. ఎవరికోసం నేను ఇక్కడ పని చేయడం లేదు. మీలా ఒకసారి వికీపీడిన్ అని, సిఐఎస్ అనీ, మరొకసారి ట్రస్టు ఉద్యోగిలా మాట్లాడి ప్రవర్తించ వలసిన అవసరం మీలా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. వికీపీడియాను బాగా వాడుకోండి, కానీ నాలాంటి వికీపీడియన్లను మీకు తగ్గట్లుగా చెప్పుచేతల్లో ఉంచుకుని, వాడుకోవాలని చూడవద్దు. నా మీద ఏమాత్రం గౌరవం, మర్యాద లేని వారితో, నన్ను తప్పులు ఎంచే వారితో ఉండి, నేను ఏమిటో కనీసం తెలుసుకుంటారను కున్నాను, కానీ ప్రయోజనం, ఫలితం శూన్యం. ఇంక మీలాంటివారు ఎన్ని సంవత్సరాలు అయినా అర్థం చేసుకోరు, ఎదురు వ్యక్తిగతంగా దాడికి దిగుతారు. ఇంతలా అబద్ధాలు నామీద చెప్పే వారి క్లాసులకు నేను రాను. నాది చాలా చాలా సున్నిత మనస్థ్తత్వం. నేను ముందే అనుకున్నాను, ఏదో దరిద్రం నామీద రుద్దుతారని, అనుకున్నట్లుగా జరిగింది. నేను అందరితో దూరంగా ఉన్నాను. పెద్దగా వేటిలో పాల్గొనుట లేదు. కొత్తగా వివిధ రంగాలలోని వ్యాసాలు వ్రాయడం మానుకున్నాను. కేవలం జాబితా చేస్తున్నాను. నేను తెవికీకి కూడా సుదీర్ఘకాలం పాటు దూరంగా ఉంటే, మీ ప్రస్తుత సమూహం చాలా ప్రశాంతంగా ఉంటుందని అనిపిస్తున్నది. కాని ఒక జాబితా చేస్తున్నాను, దానికి సంబంధించిన వ్యాసాలు పూర్తి చేసి శలవు తీసుకుంటాను. ఇంతలా అభ్యంతరకర, అమర్యాదతతో, చాలామందిలో కొందరూ కుళ్ళబొడుస్తూ ఉంటూ నేను ఉచిత సేవలు చేయలేను. JVRKPRASAD (చర్చ) 07:35, 25 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నాలుగవ తరగతి వాయిదా

[మార్చు]

మూడు తరగతులు విజయవంతంగా పూర్తయ్యాకా, నాలుగవ తరగతి విషయంలో సభ్యులందరూ వేర్వేరు కారణాలతో హాజరుకాలేని స్థితి. ఒక్క వాడుకరి:రవిచంద్ర మాత్రమే వస్తామన్నారు. ఈ సంగతి ఆయనతో చెప్పగా, వాయిదా వేస్తేనే మేలన్న అభిప్రాయం వెలువరించడంతో వాయిదా వేస్తున్నాం. చివరి క్లాసు కావడం, నాణ్యత మెరుగుదల విషయంలో మంచివ్యాసం, మెరుగైన వ్యాసం వంటి కీలకమైన చట్రాలను పరిచయం చేసే క్లాసు కావడం, రాగలిగిన ఒక్క సభ్యుడికీ ఈ రెండూ ముందే తెలిసివుండడంతో మిగతా సభ్యులకు, తెలుగు వికీపీడియాకు లాభించాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. అందరికీ తెలియపరచడం కూడా అయింది. (ఈ నోటీసు పాల్గొనేవారికి కాక సముదాయానికి తెలియపరచడానికేనన్న సంగతి గమనించగలరు) సమాచారాన్ని అందిస్తున్న షెడ్యూలు ప్రకారం వచ్చే ఆదివారం కాక ఆ పై వచ్చే ఆదివారం క్లాసు జరుగుతుంది. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 04:32, 24 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]