వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రచారానికి తెలుగు పేరు[మార్చు]

మన ప్రచారానికి వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ కు బదులుగా వికీపీడియా పేజీలకు ఫొటోలు కావలెను అనే పేరుతో ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది ? Kasyap (చర్చ) 04:05, 18 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం Kasyap గారు, ఈ ఆలోచన బాగుంది, వచ్చే వారం ఒక అవగాహన సదస్సు నిర్వహించాదలిచాను, ఇక అన్ని చోట్ల ప్రచారానికి వికీపీడియా పేజీలకు ఫొటోలు కావలెను వాడటం సమంజసం అని బావిస్తున్నాను. మీ NskJnv 17:21, 3 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఈసరికే బొమ్మ ఉన్న పేజీల్లో..[మార్చు]

@Nskjnv గారూ, ఈసరికే బొమ్మ ఉన్న పేజీల్లో బొమ్మ చేర్చడం గమనించాను. అలాంటి పేజీలను పోటీకి పరిగణించమని స్పష్టంగా ప్రకటిస్తే బాగుంటుందేమో పరిశిలించండి. __ చదువరి (చర్చరచనలు) 08:26, 1 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు , మీ అభిప్రాయంతో నేను ఏకిభవిస్తున్నాను. ఈ నిర్ణయాన్ని అమలు పరుద్దాం. మీ NskJnv 10:29, 1 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

స్థానికంగా ఎక్కించిన "సముచిత వినియోగం" బొమ్మలు[మార్చు]

వాడుకరి:Nskjnv గారూ, వ్యాసాలకు సరిపడే బొమ్మలు కామన్సులో దొరక్కపోయే అవకాశం చాలా ఉంది. స్థానికంగా ఎక్కించిన "సముచిత వినియోగం" బొమ్మలను కూడా వాడవచ్చని కూడా నియమాల్లో ఉంటే బాగుంటుంది. అయితే స్థానికంగా బొమ్మలను ఎక్కించేటపుడు ఖచ్చితంగా సరైన లైసెన్సును పెట్టాలని చెప్పాలి. అలా లైసెన్సు వివరాల్లేని బొమ్మలు అనేక వేలను తొలగించి వికీని శుద్ధి చేస్తున్నారు. ఆ పని మళ్ళీ మొదటికి రాకూడదు గదా. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 08:34, 1 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

సరే నండి. NskJnv 17:21, 3 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వాడుకరులకు - పోటిలో పాల్గొనే అవకాశం[మార్చు]

యర్రా రామారావు, ఆదిత్య, చదువరి గార్లకు, నమస్కారం

అంతర్జాతీయంగా ఒక సంవత్సరం పూర్తీ చేసుకున్న వాడుకరులను మాత్రమె పోటి చేయవలసిందిగా చెప్పడం జరిగింది, కాని మన తెవికీలో కొత్త వాడుకరులను కూడా పరిగణించాలని భావిస్తున్నాను.

న్యాయ నిర్ణేతలు, ఇతర సముదాయ సభ్యులు ఇక్కడ మీ అభిప్రాయాలను ఇక్కడ తెలపండి.

మీNskJnv 04:59, 4 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

సుమారు వారం రోజులుగా వికీలో లేనందున దీనికి సమాధానం ఇవ్వడంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం పాల్గొంటున్నవారిలో ఎంత అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారో తెలియదు నా అభిప్రాయం ఇలా ఉంది:
  • కనీసం 1 సంవత్సరం అనేది తెవికీకి అనుకూలించదు అని నా ఉద్దేశం. కొత్తవాళ్లను కూడా పాల్గొననివ్వాలి. కొన్ని భాషల వికీల్లో, కేవలం పోటీ కోసమే ఖాతా సృష్టించుకుని బాట్లతో వేలకు వేలు దిద్దుబాట్లు చేసారు. అంచేత వాళ్ళు ఆ నియమం పెట్టుకున్నారు. మనకు ఉన్న వాడుకరులే తక్కువ కాబట్టి, ఆ నియమం మనకు వద్దు. అయితే కేవలం ఈ పోటీ కోసమే ఖాతా సృష్టించుకుని వచ్చిన వాళ్ళను - అంటే, పోటీని ప్రకటించాక సృష్టించుకున్న ఖాతాలను - పక్కన పెట్టవచ్చు. అలాగే భాట్లను కూడా పక్కన పెడదాం. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 09:57, 10 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
పైగా, ఇది పెద్ద నేర్పు అవసరనైన పని కూడా కాదు. చిటికెలో నేర్చేసుకోవచ్చు. __చదువరి (చర్చరచనలు) 10:14, 10 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారి అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 09:05, 16 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు, ఆదిత్య, చదువరి గార్లకు, నమస్కారం

చదువరి గారు అన్నట్లు పోటిలో పాల్గొనడానికి సంవత్సర కాలం అయి ఉండాలన్న నియమం అవసరం లేదనేది స్పష్టం, అయితే పోటి ప్రారంభినచిన తరువాత ఎప్పుడు చేరిన కూడా పరిగనిస్తేనే.. కొత్తగా చేరే వారిని నిలుపుకోగలం, కాకపోతే బహుమతులు అందిచడంలో WPWP నియమాలకి లోబడి బహుమతులు ఇస్తే మంచిదని నా అభిప్రాయం.

ఈ పోటి మొత్తం కాలంలో ప్రతి వారం నేను ఒక శిక్షణా శిబిరం నిర్వహించాదలిచాను. దాని ద్వారా కొంత మంది ఔత్సాహికులు వికిలో చేరే అవకాశం ఉంది. వారికి బహుమతులు అందించకున్న గుర్తింపు(ప్రశంసా పత్రం వంటివి) అందించగలిగితే బాగుంటుందని, నా అభిప్రాయం. పరిశీలించండి. ధన్యవాదాలు NskJnv 08:59, 16 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి పేజీల్లో మూస[మార్చు]

అభిలాష్ మ్యాడం, మమత, Divya4232, Thirumalgoud, Muralikrishna M, వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల, Ch Maheswara Raju☻, స్వరలాసిక, కె.వెంకటరమణ, యర్రా రామారావు, రమేష్‌బేతి, User:Pranayraj1985, MYADAM KARTHIK, కుమ్మరి నరేష్, Kishorahs, ప్రశాంతి, Anjali4969, Kasyap, ఆదిత్య పకిడే Adbh266, Shashi gara

గార్లకు నమస్కారం, ప్రాజెక్టులో పాల్గొంటున్నందుకు అభినందనలు.

మీ మీ వాడుకరి వేజిల్లో ఈ మూస ఉపయోగిచుకోవచ్చు, పరిశీలించండి.


ధన్యవాదాలు .

మీ NskJnv 06:18, 4 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా వ్యాసాల్లో ఫోటోలు ఎక్కించడం[మార్చు]

@Nskjnv గారూ, సినిమా వ్యాసాలలో ఏఏ ఫోటోలు పెట్టొచ్చో కూడా తెలియజేయండి. సినిమా వ్యాసాలలో నటీనటుల, సాంకేతిక నిపుణుల ఫోటోలు చేరుస్తున్నారు. అలా చేర్చవచ్చా తెలియజేయగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 05:04, 7 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా వ్యాసాల్లో సినిమాకు సంబంధించిన చిత్రాలు చేర్చడం సముచితం. కానీ ఒక వ్యాసంలో గీతరచయిత చిత్రాన్ని చేర్చడం గమనించాను. గతంలో కూడా ఇదే పోటీలో ఇటువంటి అంశాలు చోటుచేసుకున్నాయి. ఉదా: చంద్రమోహన్ నటించిన చిత్రాలన్నింటిలో చంద్రమోహన్ చిత్రాన్ని చేర్చడం కూడా జరిగింది. శుద్ధి కార్యక్రమాలలో అనేక చిత్రాలను తోలగించాను. సినిమాల పోస్టరు, సినిమాకు సంబంధించిన ఉత్సవాలకు సంబంధించిన చిత్రాలు సినిమా వ్యాసానికి సరిపోతాయి గానీ, అనేక సినిమాలలో బాలసుబ్రహ్మణ్యం గారు నేపథ్య గాయకుడు అని అతని చిత్రాన్ని సినిమాలన్నిటింటిలో చేర్చడం సరియైన విధానం కాదని నా అభిప్రాయం. కొన్ని వ్యాసాలలో అంతకు ముందు ఒక చిత్రం ఉన్నా చిత్రాలను చేర్చడం గమనించాను. ఉదా:కత్రినా కైఫ్ అలా చేర్చినవి కూడా పోటీకి అనర్హత చెందినవని నా అభిప్రాయం. ఈ పోటీ నిర్వాహకులు తగు సూచనలు చేయవలసినదిగా మనవి.➤ కె.వెంకటరమణచర్చ 14:43, 7 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం గురువుగారు.. కత్రినా కైఫ్ వ్యాసంలో గతంలో ఫొటో ఉన్నది వాస్తవమే. కానీ ఇన్ఫోబాక్స్ చేర్చి అందులో సముచిత ఫొటో చేర్చాను. ఇలా సముచిత చిత్రంతో వ్యాసాన్ని సవరించినందున #WPWPTE, #WPWP ట్యాగ్స్ చేర్చాను. ఇది పోటీకి అనర్హం అయితే, ఇకపై ఈ విధంగా సవరించిన వ్యాసాలకు ట్యాగ్స్ జతచేయను. ధన్యవాదాలు. Muralikrishna m (చర్చ) 06:34, 8 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం ప్రణయ్‌రాజ్ వంగరి గారు,

కె.వెంకటరమణ ] గారు సూచించినట్లుగా సినిమాల పోస్టరు, సినిమాకు సంబంధించిన ఉత్సవాలకు సంబంధించిన చిత్రాలు సినిమా వ్యాసాలలో చేర్చడం సబబు, ఈ పాటికే కాదు వికీలో ఏ సినెమా వ్యాసమైనా ఈ సూచనలకు లోబడి ఉండటమే సమంజసంగా ఉంటుంది.

ఈ పోటిలో అయితే తప్పనిసరిగా సినిమా వ్యాసాలలో సినిమాల పోస్టరు, సినిమాకు సంబంధించిన ఉత్సవాలకు సంబందిచి ఉండాలి, అలా కాకుండా ఆ సినిమాలో నటించిన వారి చిత్రాలు ఈ పోటికి పరిగనించబడవు.

ఇకపోతే అంతకు ముందు ఒక చిత్రం ఉన్నా చిత్రాలను చేర్చడం విషయానికి వస్తే కొంత మంది వాడుకరులు ఈ చర్య చేయడం నేను గమనించాను వారికి వారి చర్చా పేజీల ద్వారా సూచనలు కూడా చేయడం జరిగింది.

పోటి నియమ నిబంధనలను పాటించని వాడుకరులను పోటి నుండి తొలగించడం కూడా జరుగుతుంది.(దీనికి సంబంధించి పోటి న్యాయ నిర్ణేతలతో చర్చ జరిపి సముదాయంలో చర్చకు పెడతాను)

ధన్యవాదాలు

మీ NskJnv 17:11, 7 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Nskjnv గారూ, ఈ పోటీలో భాగంగా కొంతమంది వాడుకరులు కాపీరైట్స్ ఉన్న ఫోటోలను వికీ కామన్స్ లోకి ఎక్కిస్తున్నారు. సరైన లైసెన్స్ వివరాలు కూడా చేర్చడంలేదు. వాడుకరి:Thirumalgoud కామన్స్ లో ఎక్కించిన నువ్వే నా శ్రీమతి సినిమా పోస్టర్ కు తొలగింపు మూస చేర్చబడింది. కాపీరైట్స్ ఉన్న ఫోటోలు వికీకామన్స్ నుండి తొలగించబడుతాయి. అప్పుడు వ్యాసాలలోని ఫోటో లింకు తెగిపోతుంది. ఎక్కించిన సముచిత వినియోగం బొమ్మలను కూడా ఉపయోగించవచ్చు, అయితే వాటిని ఖచ్చితంగా సరైన లైసెన్సుతో ఎక్కించాలి అని ఆయా పోటీదారులకు అర్థమయ్యేలా చెప్పండి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 09:08, 9 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
పోటీ యొక్క ముఖ్య లక్ష్యం చిత్రాలను వ్యాసాలలో చేర్చి నాణ్యమైన వ్యాసాలను చేర్చాలనేది. కానీ. వ్యాసానికి సంబంధం లేకపోయిన్నా ఎలాగోలా, ఏదో ఒక చిత్రాన్ని చేర్చే ఉద్దేశ్యంతో కొందరు వాడుకరులు, కామన్స్ లో కాపీహక్కులు గల చిత్రాలను చేర్చి వెంటనే తెలుగు వ్యాసాలలో చేర్చుతున్న వాడుకరులు ఈ పోటీలో ఉన్నారు. వారు చేర్చిన చిత్రాలు వెంటనే కామన్స్ లో తొలగించబడుతున్నాయి. ఆయా వాడుకరులకు అర్థమయ్యేరీతిలో చెప్పండి.➤ కె.వెంకటరమణచర్చ 10:40, 9 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
"పోటి నియమ నిబంధనలను పాటించని వాడుకరులను పోటి నుండి తొలగించడం కూడా జరుగుతుంది." అని పైన రాసారు. నా అభిప్రాయం ఇది: పోటీ నియమాలకు విరుద్ధంగా ఉన్న దిద్దుబాట్లు ఒక నిర్దుష్ట సంఖ్య వరకూ ఉంటే పరవాలేదు. అవి దాటితే ఇక ఆ వాడుకరి చేసిన దిద్దుబాట్లను పోటీకి పరిగణించము అని నిబంధన చేరిస్తే బాగుంటుంది. పోటీకి విరుద్ధంగా ఉన్నవి ఇవి:
  • ఒక ఫొటో ఉన్నప్పటికీ మరొక ఫొటోను చేర్చి ఆ పేజీని పోటీలోకి పెట్టడం. ఇలాంటి పొరపాట్లను 6 వరకూ అనుమతించవచ్చు. పేజీలో ఎక్కడున్నా బొమ్మ ఉన్నట్టే, సమాచారపెట్టెలో మాత్రమే ఉండాలనే నియమమేమీ లేదు. అయితే గతంలో ఉన్న బొమ్మ వ్యాస పాఠ్యానికి సంబంధం లేనిదని భావిస్తే దాన్ని పోటీ నిర్వాహకుని దృష్టికి తెచ్చి, ఆ తరవాత బొమ్మను చేర్చవచ్చు. పాత బొమ్మను తీసెయ్యరాదు.
  • ఒక చెల్లని ఫొటోను కామన్సు లోకి ఎక్కించి, దాని పేజీలో చేర్చడం, ఆనక ఆ బొమ్మను కామన్సు వారు తీసెయ్యడం. బొమ్మను ఎక్కించినదీ, చేర్చినదీ ఒకరే అయినప్పుడు. ఇలాంటి తప్పులు 2 వరకూ అనుమతించవచ్చు.
  • స్థానికంగా ఎక్కించిన బొమ్మకు సరైన లైసెన్సులు ఉంటే పరవాలేదు. కానీ సరైన లైసెన్సులు లేకుండా ఎక్కించి దాన్ని పేజీలో చేర్చి పోటీ కోసం వాడరాదు. బొమ్మను ఎక్కించినదీ, చేర్చినదీ ఒకరే అయినప్పుడు. ఆలాంటి తప్పులను 2 వరకు అనుమతించవచ్చు.
  • సంబంధం లేని బొమ్మను చేర్చిన సందర్భాలు - ఆ బొమ్మకూ వ్యాసానికీ సంబంధం లేదని వివాదాతీతంగా తేలినపుడు - 4 వరకూ అనుమతించవచ్చు. ఉదాహరణకు సినిమా పేజీలో నటుల సాంకేతిక నిపుణుల బొమ్మ చేర్చడం.
పరిశీలించి, తగు మార్పుచేర్పులు చేసి, పోటీ పేజీలో ప్రకటించి, పోటీదారులందరికీ పేరుపేరునా తెలియజేయండి. __చదువరి (చర్చరచనలు) 10:36, 10 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు NskJnv 01:23, 17 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం !

అభిలాష్ మ్యాడం, మమత, Divya4232, Thirumalgoud, Muralikrishna M, ప్రభాకర్ గౌడ్ నోముల, Ch Maheswara Raju☻, స్వరలాసిక, కె.వెంకటరమణ, యర్రా రామారావు, రమేష్‌బేతి, ప్రణయ్, MYADAM KARTHIK, కుమ్మరి నరేష్, Kishorahs, ప్రశాంతి, Anjali4969, Kasyap, ఆదిత్య పకిడే Adbh266, Shashi gara , Vinod chinna, Laya dappu, Prasanna murahari, బివిప్రసాద్ తెవికీ Bvprasadtewiki, Batthini Vinay Kumar Goud, ఊరే మనోజ్, Pravallika16, వి భవ్య గార్లకి ప్రాజెక్టులో కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు.

పోటిలో జరుగుతున్న కొన్ని మార్పుల మేరకు కింది నియమాలు అమలులోకి తేవడం జరిగింది. 

ఈ క్రింది నియమాలు పోటిలో జరుగుతన్న కొన్ని మార్పులకు అనుగుణంగా, న్యాయ నిర్ణేతల సూచన ద్వారా పొందుపరచబడ్డాయి. అయితే ఇలాంటి మార్పులు కింద సూచించిన ప్రామాణికాలను దాటితె సదరు వాడుకరి మొత్తం దిద్దుబాటులలో ఇటువంటి మార్పుల శాతం గుర్తించి బహుమతులకు అర్హత విషయమై న్యాయ నిర్ణేతలకు విన్నవించడం జరుగుతుంది.

  • పేజీలో ఎక్కడున్నా బొమ్మ ఉన్నట్టే, సమాచారపెట్టెలో మాత్రమే ఉండాలనే నియమమేమీ లేదు. అయితే గతంలో ఉన్న బొమ్మ వ్యాస పాఠ్యానికి సంబంధం లేనిదని భావిస్తే దాన్ని పోటీ నిర్వాహకుని దృష్టికి తెచ్చి, ఆ తరవాత బొమ్మను చేర్చవచ్చు. పాత బొమ్మను తీసెయ్యరాదు.
  • ఒక ఫొటో ఉన్నప్పటికీ మరొక ఫొటోను చేర్చి ఆ పేజీని పోటీలోకి పెట్టడం. ఇలాంటి పొరపాట్లను 6 వరకూ అనుమతించబడతాయి.
  • ఒక చెల్లని ఫొటోను కామన్సు లోకి ఎక్కించి, దాని పేజీలో చేర్చడం, ఆనక ఆ బొమ్మను కామన్సు వారు తీసెయ్యడం. బొమ్మను ఎక్కించినదీ, చేర్చినదీ ఒకరే అయినప్పుడు. ఇలాంటి తప్పులు 2 వరకూ అనుమతించబడతాయి..
  • స్థానికంగా ఎక్కించిన బొమ్మకు సరైన లైసెన్సులు ఉంటే పరవాలేదు. కానీ సరైన లైసెన్సులు లేకుండా ఎక్కించి దాన్ని పేజీలో చేర్చి పోటీ కోసం వాడరాదు. బొమ్మను ఎక్కించినదీ, చేర్చినదీ ఒకరే అయినప్పుడు. ఆలాంటి తప్పులను 2 వరకు అనుమతించబడతాయి.
  • సంబంధం లేని బొమ్మను చేర్చిన సందర్భాలు - ఆ బొమ్మకూ వ్యాసానికీ సంబంధం లేదని వివాదాతీతంగా తేలినపుడు - 4 వరకూ అనుమతించబడతాయి.. ఉదాహరణకు సినిమా పేజీలో నటుల సాంకేతిక నిపుణుల బొమ్మ చేర్చడం.

వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022/నియమాలు పేజిలో పూర్తీ నియమాలు చూడండి.

మీ NskJnv 13:27, 17 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి శిక్షణా శిభిరం[మార్చు]

నమస్కారం !

అభిలాష్ మ్యాడం, మమత, Divya4232, Thirumalgoud, Muralikrishna M, ప్రభాకర్ గౌడ్ నోముల, Ch Maheswara Raju☻, స్వరలాసిక, కె.వెంకటరమణ, యర్రా రామారావు, రమేష్‌బేతి, ప్రణయ్, MYADAM KARTHIK, కుమ్మరి నరేష్, Kishorahs, ప్రశాంతి, Anjali4969, Kasyap, ఆదిత్య పకిడే Adbh266, Shashi gara , Vinod chinna, Laya dappu, Prasanna murahari, బివిప్రసాద్ తెవికీ Bvprasadtewiki గార్లకి ప్రాజెక్టులో కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు.

అయితే వాడుకరులకు ఒక అవగాహన సదస్సు నిర్వహించాదలిచాను! దీంతో సదరు సబ్యులకు పోటిలో ఎలా కృషి చేయాలో అలాగే వికీ కామన్స్ లో చిత్రాలు ఎక్కించడం గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. మీరందరూ తప్పక పాల్గొని, మీ అమూల్యమైన సూచనలను అందిస్తూ తెలియని విషయాలని నేర్చుకోవాలని మనవి!


*మొదటి శిక్షణా శిబిరం*

మీటింగ్ వివరాలు

తేది : 2022 జూలై 10

సమయం : ఉదయం 10:00 నుండి 11:00 గంటల వరకు

వేదిక: గూగుల్ మీట్

వీడియో కాల్ లంకె - [1]

పోటీకోసం వ్యాసాల్లో అనవసర చేర్పులు[మార్చు]

స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం అనే వ్యాసాన్ని 2021 జూలై 18న సృష్టించి, దానికి సంబంధించిన సమాచారపెట్టె కూడా చేర్చాను. అప్పుడు నేను వ్యాసంలో బొమ్మ చేర్చలేదు, కాబట్టి ఎవరైనా ఆ వ్యాసంలో బొమ్మలు చేర్చొచ్చు. ఒకసారి ఈ వ్యాసంలో జరిగిన మార్పును చూడండి. ఇక్కడ, వాడుకరి:మురళీకృష్ణ గారు స్టేడియం ఉన్న రేసపువానిపాలెం పేజీలోని ప్రాంతానికి సంబంధించిన సమాచారపెట్టెను కాపీచేసి స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం పేజీలో చేర్చారు. అది వ్యాసానికి ఎలాంటి సంబంధంలేని సమాచారపెట్టె. సదరు వాడుకరికి ఎన్నిసార్లు చెప్పినా ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు. ఇప్పటికే తెవికీలో ఉన్న పనులు చాలవన్నట్టు ఈ పోటీ వల్ల మరింత చెత్త చేరిపోతోంది. కొంతమంది చేస్తున్న ఇలాంటి చర్యల వల్ల ఈ పోటీకి చెడ్డపేరు రావడంతోపాటు, మున్ముందు ఇలాంటి పోటీలు నిర్వహించని పరిస్థితి వస్తుంది. ఈ వాడుకరిపై న్యాయ నిర్ణేతలు ఒక నిర్ణయం తీసుకోవలసిందిగా కోరుతున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 17:18, 10 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

సదరు వాడుకరికి వారి చర్చా పేజి ద్వారా పోటి నియమాలు తెలపడం జరిగింది. కాని వారు మరల అలాంటి తప్పులే చేయటం ప్రణయ్‌రాజ్ వంగరి, కె.వెంకటరమణ గారు గమనించడం జరిగింది. ఈ విషయం లో నేను ఒకటి అనుకుంటున్నాను, వాడుకరి:మురళీకృష్ణ గారు తెలియక చేసినదే తప్ప మరొక ఉద్దేశం లేదని అని విశ్వసిస్తూ. వారి చర్చా పేజి ద్వారా పూర్తీ నియమావళి మరల తెలిపి ఒక వ్యక్తిగత శిక్షణా శిబిరం నిర్వహిస్తాను. పోటిలో కృషి చేసే వారందరూ మనకి ముఖ్యమే..

మీ NskJnv 07:40, 11 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు పురోగతి[మార్చు]

గడచిన పది రోజులలో వాడుకరులు చక్కటి కృషి చేశారు, 500 పైగా మొత్తం దిద్దుబాట్లు జరిగాయి.

సదరు వాడుకరుల కృషి ఇలా ఉంది : Divya4232 - 160 వాడుకరి:మురళీకృష్ణ - 158 మమత - 143 స్వరలాసిక - 24 యర్రా రామారావు - 11 ప్రణయ్‌రాజ్ వంగరి - 10

ఇతరులు 21

మీ NskJnv 07:49, 11 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్నిపత్రికా వనరులు[మార్చు]

కొన్ని పత్రిక స్కాన్ కాపీలు ఆర్కైవ్ సైటు లో ఉన్నాయి ఉదా: జ్యోతి , యువ , ఆంధ్ర పత్రిక గృహలక్ష్మి , వీటిని పిడిఎఫ్ రూపంలో దింపుకొని ఆయా ఫోటోలు, సినిమా పోస్టర్ వంటివి స్రీన్ షాట్ తీసి ఆ ఫోటోను సంబంధిత వికీ సినిమా, వ్యక్తుల వంటి పేజీలో నేరుగా దస్త్రం ఎక్కించి, ఆ సంబంధిత వ్యాసంలో చేర్చవచ్చు అయితే ఇక్కడ కొన్నిటికి కాపీ రైట్ సమస్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి సరి అయిన లైసెన్సు సార్వజనికం/ ఫెయిర్ యూజ్ / క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-ఎలైక్ లైసెన్సు/, భారతీయ కాపీహక్కుల చట్టం ప్రకారం చేర్చవచ్చు.  : Kasyap (చర్చ) 11:37, 15 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు Kasyap గారు. NskJnv 01:26, 17 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు కావలసిన మరిన్ని పేజీలు[మార్చు]

బొమ్మలు కావలసిన పేజీలు వర్గం:బొమ్మలు కావలసిన వ్యాసాలు అనే వర్గంలో ఉన్నాయని పోటీదారులకు తెలుసే ఉంటుంది. అయితే, బొమ్మ లేనప్పటికీ, ఈ వర్గంలో చేరని పేజీలు మరికొన్ని ఉన్నాయి. అలాంటి వాటిని ఈ పేజీలో చూడవచ్చు. అయితే క్వెరీ రాయడంలో ఉన్న లోపాల కారణంగా కొన్నిటిలో బొమ్మలు ఉన్నప్పటికీ, లేనట్లు చూపించే అవకాశం లేకపోలేదు. కాబట్టి బొమ్మ చేర్చేముందు, పేజీలో లేదని నిర్థారించుకోవలసినది. __ చదువరి (చర్చరచనలు) 04:49, 18 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలను ఎక్కించడం లేదు[మార్చు]

ఈ పోటీ మొదలయ్యాక, దాదాపు 20 రోజుల్లో, వికీ లోకి ఎక్కించిన బొమ్మలు 15 మాత్రమే. గత వారం రోజుల్లో బొమ్మలు చేర్చిన పేజీలు (WPWPTE లు) 50 కూడా లేవు.

వికీలో వ్యాసాలకు సరిపోయేట్లుగా స్వేచ్ఛగా, ఉచితంగా బొమ్మలు దొరకడం అంత తేలిక కాదు. చాలా పేజీల్లో బొమ్మలు చేర్చకపోవడానికి అలా ఉచితంగా దొరక్కపోవడమే కారణం. కొన్నిటికి బొమ్మలు ప్రస్తుతం దొరకవు, కొన్నిటికీ ఇక ఎప్పటికీ దొరకవు. ఉదాహరణకు మరణించిన వ్యక్తులకు సంబంధించిన తాజా బొమ్మలు ఇకపై దొరికే అవకాశమే లేదు కదా. అంటే ప్రస్తుతం ఉచితంగా దొరికే బొమ్మలు లేనట్లైతే, ఇకపై అవి దొరికే అవకాశం దాదాపుగా లేనట్లే -కాపీహక్కులు ఉన్నవాళ్ళు వాటిని వదులుకుంటే తప్ప! మరి ఈ ప్రాజెక్టు ముందుకు పోయేదెలా? -బొమ్మలు ఎక్కించాలి!

ఈ పోటీయే కాదు, వికీపీడియా ప్రాజెక్టు లోనే స్వేచ్ఛగా దొరకని బొమ్మలు చేర్చాలంటే ఉన్నది ఒకటే మార్గం.. సముచిత వినియోగానికి పనికొచ్చే బొమ్మలను ఎక్కించడం. తక్కువ రిజల్యూషనులో ఉండే బొమ్మలను, ప్రత్యేకించిన ఒక వ్యాసానికి మాత్రమే వాడేలా, ఎందుకు ఎలా, ఎక్కడ వాడబోతున్నారో వివరిస్తూ.. కాపీహక్కులున్న బొమ్మలను వికీలోకి ఎక్కించవచ్చు. బొమ్మను ఎక్కించేటపుడు వికీ మిమ్మల్ని నడిపిస్తుంది. దాన్ని అనుసరించండి, బొమ్మలను ఎక్కించండి. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 05:06, 18 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రోత్సాహకాలు[మార్చు]

నిరుడు జరిగిన పోటీలో నేను బహుమతిగా పొందిన మొత్తాన్ని ఇక్కడే, గ్రామాలకు చెందిన ఫొటోలను ఎక్కించే (అప్‌లోడు) పోటీ ఒకటి పెట్టి అందులో బహుమతుల కోసం వాడాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. అయితే ఆ పోటీ పెట్టడానికి నేనూ పూనుకోలేదు, వేరెవరూ పూనుకోలేదు. ఆ పోటీ కోసం నేను పెట్టాలనుకున్న మొత్తాన్ని ఈ పోటీలో పెట్టాలని నిశ్చయించుకున్నాను.

  1. ఈ పోటీలో 800 దిద్దుబాట్లు చేసినవారికి 3000 రూపాయల ప్రోత్సాహకం ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. ఒకరి కంటే ఎక్కువ మంది 800 కంటే ఎక్కువ దిద్దుబాట్లు చేస్తే, వారి దిద్దుబాట్ల నిష్పత్తి ప్రకారం 800 దాటిన వారికి పంచుతాం. ఉదాహరణకు వాడుకరి1 1000 దిద్దుబాట్లు, వాడుకరి2 800 చేసారనుకుందాం.. బహుమతి మొత్తంలో వాడుకరి1 కి 1,670 రూపాయలు, వాడుకరి2 కు 1,330 రూపాయలు వస్తాయి. 800 దిద్దుబాట్లు ఎవరూ చెయ్యకపోతే ఎవరికీ ఇవ్వం.
  2. 500 ఫొటోలను ఎక్కించిన (అప్‌లోడు చేసిన) వారికి 3000 రూపాయలు ప్రోత్సాహకం ఇవ్వాలని అనుకున్నాను. ఒకరి కంటే ఎక్కువమంది అది సాధిస్తే బహుమతిని పైవిధంగానే నిష్పత్తిలో పంచుతాం. ఎవరూ చెయ్యకపోతే ఆ మొత్తాన్ని భవిష్యత్తు కోసం వాడతాం.

పోటీలో పాల్గొనేవారు రెండు బహుమతులకూ అర్హులే. ఇతర నిబంధనలన్నీ ఈ పోటీలో ఎలా ఉంటే అలానే. __ చదువరి (చర్చరచనలు) 05:27, 20 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ విషయాన్నీ వాడుకరులకు ప్రాజెక్టు పేజి ద్వారా తెలియ పరుస్తున్నాను, మీ ఆలోచనకి జోహార్లు.

ధన్యవాదాలు చదువరి గారు NskJnv 05:42, 20 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియాలో అదీ గ్రామ వ్యాసాల అభివృద్దికి దోహదం కల్పించే పొటీకి, వ్యక్తులు ప్రొత్సాహకాలు ఇచ్చే ఏర్పాటు మొదటగా మొదలుపెట్టిన చదువరి గారికి, ఆ ప్రోత్సాహక బహుమతి సొమ్ము ఈ ప్రాజెక్టు ద్వారా ఉపయోగించుటకు అవకాశం కల్పించిన సాయికిరణ్ గారికి అభినందనలు యర్రా రామారావు (చర్చ) 06:07, 20 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పనిలో జరిగిన కృషి[మార్చు]

ఈ పోటీలో ఇప్పటి వరకు ఫొటోలను చేర్చే పనిలో జరిగిన కృషి ఇది:
Divya4232 Muralikrishna m Tmamatha స్వరలాసిక యర్రా రామారావు Pranayraj1985 MYADAM ABHILASH Thirumalgoud Vadanagiri bhaskar Nskjnv Ch Maheswara Raju
188 157 147 41 18 17 14 7 6 4 2

అవకాశం ఉంటే గ్రామ వ్యాసాలలో ఫొటోలు ఎక్కించిన కృషి విడిగా చూపించగలరు.--యర్రా రామారావు (చర్చ) 07:11, 20 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పోటీలో భాగంగా గ్రామాల పేజీల్లో జరిగిన కృషి ఇది:
Divya4232 Tmamatha యర్రా రామారావు Muralikrishna m Thirumalgoud Nskjnv Ch Maheswara Raju
142 94 13 3 1 1 1
__చదువరి (చర్చరచనలు) 08:40, 20 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

జూలై 26 ఉదయం 5 గంటల సమయానికి జరిగిన కృషి[మార్చు]

మొత్తం దిద్దుబాట్లు

Divya4232 Muralikrishna m Tmamatha స్వరలాసిక యర్రా రామారావు MYADAM ABHILASH Pranayraj1985 KINNERA ARAVIND Nskjnv Thirumalgoud Vadanagiri bhaskar Ch Maheswara Raju Mashkawat.ahsan
203 157 147 147 33 31 26 13 10 8 6 4 1

గ్రామాల పేజీల్లో దిద్దుబాట్లు

Divya4232 Tmamatha యర్రా రామారావు MYADAM ABHILASH Nskjnv Ch Maheswara Raju Muralikrishna m Thirumalgoud
143 94 15 15 6 3 3 1
వాడుకరి:Muralikrishna m, వాడుకరి:Tmamatha గార్లు వేగంగా మొదలుపెట్టి ప్రస్తుతం కొంత నిదానించారు. వారి కృషిని కొనసాగించాలని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 01:41, 26 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
క్షమించండి గురువుగారు. 2022 జులై 11నె నేను ఈ పోటీ నుంచి తప్పుకున్నాను. ధన్యవాదాలు. Muralikrishna m (చర్చ) 04:40, 26 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

2022 ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టులో జరిగిన కృషి.

పేరు దిద్దుబాట్ల సంఖ్య
Divya4232 645
స్వరలాసిక 373
MYADAM ABHILASH 286
Muralikrishna m 157
Tmamatha 154
యర్రా రామారావు 66
Pranayraj1985 47
Thirumalgoud 21
KINNERA ARAVIND 14
Nskjnv 12
Ramesh bethi 6
Vadanagiri bhaskar 6
Kasyap 5
Ch Maheswara Raju 4
Lokeshallada87 1
ప్రశాంతి 1
Mashkawat.ahsan 1
Akhil maulwar 1

NskJnv 07:51, 15 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

రెండవ శిక్షణా శిబిరం[మార్చు]

నమస్కారం !

అభిలాష్ మ్యాడం, మమత, Divya4232, Thirumalgoud, Muralikrishna M, ప్రభాకర్ గౌడ్ నోముల, Ch Maheswara Raju☻, స్వరలాసిక, కె.వెంకటరమణ, యర్రా రామారావు, రమేష్‌బేతి, ప్రణయ్, MYADAM KARTHIK, కుమ్మరి నరేష్, Kishorahs, ప్రశాంతి, Anjali4969, Kasyap, ఆదిత్య పకిడే Adbh266, Shashi gara , Vinod chinna, Laya dappu, Prasanna murahari, బివిప్రసాద్ తెవికీ Bvprasadtewiki, Batthini Vinay Kumar Goud, ఊరే మనోజ్, Pravallika16, వి భవ్య గార్లకి ప్రాజెక్టులో కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు.


వికీలో మనం ఎప్పటికప్పుడు కృషి చేస్తూ, వికీ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న మనమంతా వ్యక్తిగతంగా ఎక్కువగా కలిసింది లేదు, అయితే ఈ శనివారం ఉదయం ఐఐఐటి హైదరబాద్ క్యాంపస్లో ఒక శిక్షాణా శిబిరం నిర్వహించ దలిచాము.

ఈ శిబిరం ద్వారా వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టులో కృషి చేయడానికి శిక్షణ అందించానున్నాము.

శిక్షణా శిబిరం వివరాలు:

  • తేది : 2022 జూలై 23 (శనివారం)
  • స్థలం : ఐఐఐటి హైదరబాద్, గచ్చిబౌలి
  • సమయం : ఉదయం 10 గంటల నుండి 11:30 గంటల వరకు

ఆసక్తి ఉన్నవారు అలాగే అనుభవం ఉన్న వారు పాల్గొని నేర్చుకుంటూ, మీ సూచనలు అందిస్తారని ఆశిస్తూ.

మీ NskJnv 15:23, 20 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Nskjnv గారూ, కాపీరైట్స్ ఉన్న సినిమా పోస్టర్ ఫోటోలను వాడుకరి:Divya4232 గారు వికీ కామన్స్ లోకి ఎక్కిస్తున్నారు. సరైన లైసెన్స్ వివరాలు చేర్చకపోవడం వల్ల వాటన్నింటికి తొలగింపు మూసను చేర్చారు. ఆ వాడుకరి కామన్స్ లో చేర్చిన ఫోటోలను ఇక్కడ చూడగలరు. ఈ పోటీలో పాల్గొంటున్న పోటీదారులకు ఫోటోల ఎక్కింపు గురించి మరోసారి అర్థమయ్యేలా చెప్పండి.----ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 12:03, 23 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల పేజీల్లో మ్యాపు దోషాలు - 680 పేజీల్లో బొమ్మలు చేర్చే అవకాశం.[మార్చు]

కొన్ని గ్రామాల పేజీల్లో, సమాచారపెట్టెలో ఉండే మ్యాపులో దోషాలున్నాయి. అలాంటి పేజీల జాబితాలను కింది లింకుల్లో చూడవచ్చు.

  1. ఆంధ్రప్రదేశ్ గ్రామాల పేజీలు - ఇవి 436 వరకు ఉన్నాయి.
  2. తెలంగాణ గ్రామాల పేజీలు - ఇవి 253 వరకు ఉన్నాయి.

మొత్తం సుమారు 680 పేజీలు. ఈ పేజీల్లో స్క్రిప్టు దోషాలున్నాయి. ఈ దోషాలకు ప్రధాన కారణం, మ్యాపుల నిర్దేశాంకాలను ఇవ్వడంలో ఉన్న లోపమే అయి ఉంటుందన్నది నా అనుకోలు. ఒక్కొక్క పేజీనే తెరిచి చూస్తే దోషమేంటో తెలుస్తుంది. దోషాలను సవరిస్తే ఆ పేజీలో మ్యాపు చేరుతుంది. ప్రయత్నించండి. __ చదువరి (చర్చరచనలు) 23:56, 25 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త బొమ్మల చేర్పు[మార్చు]

ఈ పోటీ సందర్భంగా కొత్త బొమ్మలను చేరుస్తున్నారు. తెవికీలో చేర్చే బొమ్మలు దాదాపుగా అన్నీ "సముచిత వినియోగం" కోవకు చెందినవే. ఈ బొమ్మలకు తగు లైసెన్సింగు సమాచారం ఉండాలి. లేదంటే ఆ బొమ్మలను తొలగించే అవకాశం ఉంది. దానివలన పోటీకి అర్హత కోల్పోయే ప్రమాదం ఉంది. బొమ్మలు ఎక్కించే వారందరూ ఈ విషయాన్ని పరిగణన లోకి తీసుకోవలసినది. లైసెన్సింగు సమాచారం గురించి అవగాహన లేనివారు ఆ విషయం తెలిసిన అనుభవజ్ఞులను సంప్రదించి తెలుసుకోవలసినది. Nskjnv గారు ఈ విషయమై తగు చర్యలు తీసుకోవలసినదిగా కోరుతున్నాను. బొమ్మల లైసెన్సింగు విషయమై విశేషమైన కృషిచేసిన అర్జున గారిని సంప్రదించండి. __ చదువరి (చర్చరచనలు) 01:22, 31 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా!, ఈ విషయాన్నీ ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. NskJnv 18:04, 3 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఆగస్టు 28 నాటికి ప్రాజెక్టులో జరిగిన పని[మార్చు]

పేరు దిద్దుబాట్ల సంఖ్య
Divya4232 719
స్వరలాసిక 547
MYADAM ABHILASH 297
Muralikrishna m 157
Tmamatha 154
యర్రా రామారావు 81
Pranayraj1985 53
Vadanagiri bhaskar 28
Thirumalgoud 23
KINNERA ARAVIND 14
Nskjnv 12
Ch Maheswara Raju 10
Ramesh bethi 6
Kasyap 6
Lokeshallada87 1
ప్రశాంతి 1
Mashkawat.ahsan 1
Akhil maulwar 1

ఆగస్టు 28 వరకు ప్రాజెక్టులో జరిగిన కృషి. ప్రాజెక్టులో భాగంగా వాడుకరులు వ్యాసాలలో ఆడియో, విడియోలు కూడా చేర్చవచ్చు, గమనించండి.

అభిలాష్ మ్యాడం, మమత, Divya4232, Thirumalgoud, Muralikrishna M, ప్రభాకర్ గౌడ్ నోముల, Ch Maheswara Raju☻, స్వరలాసిక, కె.వెంకటరమణ, యర్రా రామారావు, రమేష్‌బేతి, ప్రణయ్, MYADAM KARTHIK, కుమ్మరి నరేష్, Kishorahs, ప్రశాంతి, Anjali4969, Kasyap, ఆదిత్య పకిడే Adbh266, Shashi gara , Vinod chinna, Laya dappu, Prasanna murahari, బివిప్రసాద్ తెవికీ Bvprasadtewiki, Batthini Vinay Kumar Goud, ఊరే మనోజ్, Pravallika16, వి భవ్య గార్లకి ప్రాజెక్టులో కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు.

ప్రాజెక్టు కి కావల్సిన ప్రోత్సహకాలు అలాగే సమావేశాల కోసం వికీమీడియా వారికి అందించిన ప్రపోసల్ ఆమోదించబడింది, త్వరలో(2-4 వారాలలో) దానికి సంబందించిన రుసుము అందవచ్చు. కావున ప్రాజెక్టు గడువుని కొంత ముందుకు పొడిగించాలని అనుకుంటున్నాను. యర్రా రామారావు, ఆదిత్య, చదువరి గార్లు, ప్రాజెక్టు సభ్యులు అలాగే సముదాయ సభ్యులు తమ అభిప్రాయం తెలియజేయవలసిన్దిన్గా కోరుతున్నాను.

ప్రాజెక్టులో ఇప్పటి వరకు గొప్పగా కృషి చేసిన వారికి బహుమతులకంటే ముందే పని చేయడానికి కావలసిన ఇతర ప్రోత్సాహకాలు అందించాలని సంకల్పించాము, సిద్దంగా ఉండండి. NskJnv 12:53, 28 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

  • సాయి కిరణ్ గారు మిరన్నట్టుగా ప్రాజెక్టు గడువు పొడగించండి.. దీని వలన మరిన్ని ఫోటోలు, వీడియోలు, ఆడియోలు చేరే అవకాశం ఉంటుంది.౼అభిలాష్ మ్యాడం (చర్చ) 13:15, 1 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • ప్రాజెక్ట్ లో అత్యద్భుతంగా కృషి చేస్తున్న వాడుకరులు ధన్యవాదాలు. ఈ పోటీకి సంబంధించి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకూ మనకు గ్రాంట్ రావచ్చు.అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోటీలో మొదటి పది స్థానాల్లో మన తెవికీ వాడుకరులు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని సాయికిరణ్ గారు తెలియజేయాలి.ఒకవేళ ప్రాజెక్ట్ గడువును పెంచడం వల్ల ప్రపంచ వ్యాప్త పోటీ లో తెవికీ వాడుకరులు మొదటి స్థానాల్లో వచ్చే అవకాశం ఉంటే మనం నిరభ్యంతరంగా పోటీ గడువును సెప్టెంబర్ 30 వరకూ పెంచుకోవచ్చునని నా అభిప్రాయం.గడువును పొడిగించడం వల్ల మరిన్ని ఫోటోలు చేర్చడానికి వీలుగా ఉంటుంది ఈ ప్రతిపాదనపై సాయికిరణ్ గారు మీ స్పందన తెలియజేయగలరు. ఆదిత్య పకిడే Adbh266 (చర్చ) 03:45, 2 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఒక నిర్దుష్ట వ్యవధితో మొదలుపెట్టిన పోటీ ఇది. దీన్ని పొడిగించకూడదు, ఇంతటితో ముగించాలి.__చదువరి (చర్చరచనలు) 16:27, 3 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

#WPWP కార్యక్రమ ఫలితాలు ప్రకటించగలరు[మార్చు]

నిర్వాహకులకు విన్నపం, వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 కార్యక్రమం లో భాగంగా ఫోటోలు చేర్చడం 2022 జూలై 1 - ఆగస్టు 31 మధ్య జరగినది, కావున గ్లోబల్ ఈవెంట్ తో పాటు ఈ కార్యక్రమము ముగించి ఫలితాలు ప్రకటించగలరు, ఇక నా అభిప్రాయం ప్రకారం ప్రాజెక్టు గడువు పెంచే బదులు, గ్రాంటు వచ్చిన తరువాత కొత్త నిబంధనలతో ఒక కొత్త కార్యక్రమము , తగిన ప్రచారం నిర్వహించుకొంటే బాగుంటుంది. : Kasyap (చర్చ) 06:22, 3 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పోటీ ముగింపు గురించి[మార్చు]

పోటీ ముగిసిందో పొడిగించారో ప్రకటిస్తే బాగుంటుంది. దాన్ని బట్టి తదుపరి పనులు చేసుకోవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 06:22, 18 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టుకి అదనపు జోడింపు కాలం (ఆక్టోబరు 6 నుండి 31 వరకు మైలేజ్ ఎడిటతాన్)[మార్చు]

నమస్కారం !

అభిలాష్ మ్యాడం, మమత, Divya4232, Thirumalgoud, Muralikrishna M, ప్రభాకర్ గౌడ్ నోముల, Ch Maheswara Raju☻, స్వరలాసిక, కె.వెంకటరమణ, యర్రా రామారావు, రమేష్‌బేతి, ప్రణయ్, MYADAM KARTHIK, కుమ్మరి నరేష్, Kishorahs, ప్రశాంతి, Anjali4969, Kasyap, ఆదిత్య పకిడే Adbh266, Shashi gara , Vinod chinna, Laya dappu, Prasanna murahari, బివిప్రసాద్ తెవికీ Bvprasadtewiki, Batthini Vinay Kumar Goud, ఊరే మనోజ్, Pravallika16, వి భవ్య గార్లకి ప్రాజెక్టులో కృషి చేసినందుకు ధన్యవాదాలు.


ప్రాజెక్టు అప్పుడే ముగిసింది అనుకుంటున్నారా!

లేదు ఇప్పుడే అసలైన ఘట్టం మొదలవుతుంది, మీరంతా గత రెండు నెలల్లో అందించిన కృషి అమోఘం. అయితే మనం ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం వికీమీడియా వారికి అభ్యర్థించిన గ్రాంటు ఆలస్యం అవ్వడంతో- ప్రాజెక్టుకి ఇంకో అదనపు జోడింపు చేరుస్తున్నాము.

అక్టోబరు 6 నుండి 31 వరకు ఈ ప్రాజెక్టులో మీరు ఇది వరకట్లాగానే పోటీ పడవచ్చు. ఇక పోటీలో ప్రత్యేక ప్రోత్సహకాలు, బహుమతులు అందిస్తున్నాం. గమనించారో లేదో !

ఇప్పుడే వాటిని తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి.

ఇది వరకు పోటీలో మంచి కృషి చేసిన మొదటి పది మంది వాడుకరులకు చిత్ర యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. వెంటనే మీ అభ్యర్థన తెలపండి. అక్టోబరు 8 లోగా తెలపాలి సుమీ! ఆలస్యం చేయకండి.

అలాగే 50 దిద్దుబాట్లు ఆపై చేసిన వారు రీఛార్జ్ సదుపాయం పొందవచ్చు. మీ మీ అభ్యర్థనలు తెలపండి మరి.

ఇకపోతే అనుభవం గల వాడుకరులు హైద్రాబాద్ మినహాయించి, మీ స్థానిక ప్రదేశాలలో కార్యశాలలు నిర్వహించవచ్చును, మీ ప్రతిపాదనలు తెలపండి.

రండి ఈ ప్రాజెక్టును మరింత ఎత్తులకు చేరుద్దాం, తెలుగు వికీ నిర్మాణంలో మరింత కీలక పాత్ర పోషిద్దాం!

ఇట్లు

ప్రాజెక్టు నిర్వాహకులు NskJnv 04:31, 4 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మైలేజ్ ఎడిటథాన్ ప్రారంభం[మార్చు]

గ్రాంటు వినియోగార్థం చర్చించిన విషయాల ప్రకారం ఈ రోజు నుండి 25 రోజులపాటు మైలేజ్ ఎడిటతాన్ ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసినదే... దీనికి సంబంధించిన ఒక బ్యానర్ వికీలో ప్రదర్శిస్తే బాగుంటుందని చదువరి గారిని అభ్యర్థిస్తున్నాను.--అభిలాష్ మ్యాడం (చర్చ) 07:19, 6 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

  • మొన్న జూలై ఆగస్టుల్లో పాల్గొన్నవారికే ఈ పోటీ పరిమితం కదా.. బ్యానరు వలన ప్రయోజనం ఏముంటుందబ్బా..? దానికంటే మొన్న పాల్గొన్నవారందరికీ మెయిళ్ళు పంపిస్తే సరిపోదా?సభ్యుల అభిప్రాయాలు చెప్పండి. __చదువరి (చర్చరచనలు) 09:09, 6 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
కొత్త వారు కూడా చేయవచ్చు. బ్యానర్ ఉంటే ఇతర సముదాయ సభ్యులు కూడా గమనిస్తారని నా అభిప్రాయం. NskJnv 11:24, 6 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
కొత్తవారికి అవకాశమున్నట్టు నాకు అనిపించలేదు. సరే.., అక్కడ పెట్టాల్సిన పాఠ్యాన్ని ఇక్కడ రాయండి. పెట్టేస్తాను. __ చదువరి (చర్చరచనలు) 02:13, 7 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం Nskjnv గారు, జులై, ఆగస్టు లో కొత్త వారికి అవకాశం లేదన్నారు. అందుకని నేను పోటీలో పాల్గొనలేదు. పోటీ పొడిగించిన తరువాత ఇక్కడ కొత్త వారు కూడా పాల్గొనవచ్చు అన్నారు కదా, అందుకని నేను పోటీలో పాల్గొన్నాను. కానీ ఫలితాలలో కొత్త వాడుకరి లకు అవకాశం లేదు అన్నారు ఎందుకో తెలుసుకోవచ్చా. V Bhavya (చర్చ) 09:28, 11 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం NskJnv గారు. నేను కొత్త వాడుకరిని. నేను వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ మొదటి పేజీలో నాల్గొవ పాయింట్ లో #WPWPTE,#WPWP ను వాడమని ఉంది. అందుకని నేను మొదట్లో #WPWPTE,#WPWPను వాడాను. కానీ "నియమాలు" "#" లో అక్టోబరు 6 నుండి 31 వరకు జరిగే దిద్దుబాట్లలో కేవలం #WPWPTE మాత్రమే వాడాలి ఉంది. అందుకని నేను పెట్టిన #WPWPTE,#WPWP కొన్నిటికి #WPWPTE మళ్ళీ వాడాను. తర్వాత #WPWPTE,#WPWP, #WPWPTE రెండింటిలో ఏది వాడిన పర్వాలేదు అని తెలిసి మళ్ళీ అటువంటి తప్పు చెయ్యలేదు. దీనిని పరిగణించగలరు. Pravallika16 (చర్చ) 10:09, 11 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు గణాంకాలు[మార్చు]

అక్టోబరు 20 నాటికి మన వాడుకరులు దిద్దుబాట్లు ఇలా ఉన్నాయి.

పేరు ఆగస్టు 28 వరకు దిద్దుబాట్ల సంఖ్య అక్టోబరు 20 వరకు జరిగిన దిద్దుబాట్ల సంఖ్య
Divya4232 719 1883
స్వరలాసిక 547 689
వెంకటరమణ 0 478
అభిలాష్ మ్యాడం 297 430
అరవింద్ 14 194
మురళీకృష్ణ 157 156
మమత 154 153
భవ్య 141
ప్రశాంతి 1 106
యర్రా రామారావు 81 89
ప్రణయరాజ్ 53 71
భాస్కర్ 28 29
తిరుమల్ 23 24
మహేశ్వర్ రాజు 10 23
సాయి కిరణ్ 12 13
కశ్యప్ 6 8
రమేష్ బేతి 6 7
Lokeshallada87 1 1
Mashkawat.ahsan 0 1
Akhil maulwar 1 1

ప్రాజెక్టులో కృషి చేస్తున్న సభ్యులందరికి అభినందనలు.

సూచనలు[మార్చు]

అయితే మీరంతా చాలా మంచి సేవ అందిస్తున్నారు, అలాగే కేవలం వ్యాసాల్లో చిత్రాలు చేర్చడమే కాకుండా. చాలా కాలంగా మార్పులు జరగని వ్యాసాల్లో తగు మార్పులు చేయడానికి ప్రయత్నించండి.

ముఖ్యంగా గ్రామ వ్యాసాలలో చిత్రాలు చేర్చే వారు సమాచార పెట్టెలో చేర్చండి, అలా కుదరని పక్షాన ఏదో ఒక విభాగంలో చేర్చండి.

మీరంతా ప్రాజెక్టు పేజీ కూడా గమనిస్తున్నారని అనుకుంటున్నా, మీలో 50 దిద్దుబాట్లు దాటిన వారు రీఛార్జ్ సదుపాయం పొందగలరు, అలాగే ఆసక్తి గల వారు చిత్ర యాత్రల్లో పాల్గొనండి.

అనుభవం గల వాడుకరులు కార్యశాలలు కూడా నిర్వహించవచ్చు, పరిశీలించండి.

ధన్యవాదాలు

ఇట్లు - ప్రాజెక్టు నిర్వాహకులు

మీ NskJnv 07:49, 20 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఫోటోస్ ఎక్కింపులో గమనించిన లోపాలు[మార్చు]

ముందుగా ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్న అందరు వాడుకరులుకు ధన్యవాదాలు.ఈ ప్రాజెక్టు కింద ఫొటోలు ఎక్కించే కార్యక్రమంలో యాదృచ్ఛికంగా నేను కొన్ని లోపాలు గమనించాను.అవి!

  • బొమ్మ కనీసం 200 పిక్సెళ్ళ పరిమాణం కలిగి ఉండాలి. దీనికన్న తక్కువ పరిమాణం కల బొమ్మలు సాధారణంగా పోటీకి పరిగణింపబడవు.ఇది ఆచరించటలేదు.
  • భాష సరిగ్గా తెలియని వికీపీడియాలోని బొమ్మలను చేర్చకండి.ఇది ఆచరించటలేదు.
  • చిత్రాన్ని చేర్చే వ్యాసంలో ఇది వరకు ఏ బొమ్మ ఉండకుండా ఉండాలి (మ్యాపులకి మినహాయింపు కలదు).ఈ నియమం పాటించుటలేదు
ఉదా:1. సువర్ణభూమి విమానాశ్రయం
  • అలాగే ఆ వ్యాసం తప్పనిసరిగా మొలక స్థాయిని దాటి ఉండాలి.ఈ నియమం పాటించుటలేదు.
ఉదా:1. రియల్ స్టోరి, 2. రాగలీల
  • ఇంకొకఅడుగు ముందుకువేసి ఏకంగా ఫొటో ఎక్కింపు కొసం మొలక వ్యాసాలు సృష్టింపు జరుగుచున్నవి.
ఉదా:1. నా రూటే వేరు, 2. నా మొగుడు నా ఇష్టం
  • కొన్ని వ్యాసాలలో ఎక్కించే ఫొటోలు సమాచారపెట్టె ఫై భాగంలో ఎక్కించుట జరుగుతుంది.దానివలన సమాచారపెట్టె ప్రాధాన్యత కోల్పోతుంది.
  • కొన్ని వ్యాసాలలో ఎక్కించే ఫొటోలు సమాచారపెట్టెలో ఎక్కిస్తున్నారు.అంతవరకు బాగానే ఉంది.వీటివలన అంతకుముందు సమాచారపెట్టెలో ఉన్న మ్యాపు పరిమాణం కుచించుకు పోయి ఎబ్బెట్టుగా కనపడుతుంది.ఎక్కించిన తరువాత దానిని మునుజూపులో చూసుకుని మ్యాపు పరిమాణం దానికి తగినట్లుగా 250 లేదా 260 px పెంచాలి.అది పాటించుటలేదు.ఇది ముఖ్యంగా ఎక్కువుగా గ్రామవ్యాసాలలో జరుగుతుంది.
ఉదా:1. తీగరాజుపల్లి
  • కొన్ని వ్యాసాలలో ఎక్కించిన బొమ్మలు వ్యాసంలో కనపడుటలేదు.
ఉదా:1. మతిమరపు వ్యాధి , 2. చిలివేరు రామలింగం
  • అనుమతిలేని బొమ్మలను ఎక్కించుటజరుగుతుంది.
ఉదా:1. గుంజన్ సక్సేనా

పై లోపాలు పోరపాటు కావచ్చు, అవగాహన లేకపోవుట వలన కావచ్చు. కానీ పోటీలో పాల్గొంటున్న అభ్యర్ధులు ఇలాంటి వాటిమీద తగిన శ్రద్దను పాటించాలి అని తెలియజేయటానికి మాత్రమే కానీ, ఇందులో ఎవ్వరినీ వేలెత్తి చూపటానికి కాదని భావించగలరు. మరియొకసారి ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:31, 27 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఫోటోస్ ఎక్కింపులో లోపాల గురించి చర్చకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు యర్రా రామారావు గారు. ఈ ప్రాజెక్టులో వివిధ వాడుకరులు చేస్తున్న తప్పుల గురించి నేను ఎప్పటికప్పుడు ప్రాజెక్టు నిర్వాహకుడు సాయికిరణ్ కు తెలియపరుస్తూనే ఉన్నాను. నేను గమనించినవి:
  • పేరు సరిపోతుందికదా అని ఆ వ్యాసం వ్యక్తి అతనోకాదో సరిచూసుకోకుండా ఫోటోలను ఎక్కించారు. (పురాణం రమేష్, వావిలాల వాసుదేవశాస్త్రి)
  • ఫోటోలకు సోర్స్ గా తీసుకున్న వెబ్సైటు వివరాలు కాకుండా గూగుల్ ఇమేజెస్ లింకులు చేర్చారు.
వీటితోపాటు పైన రామారావు గారు ప్రస్తావించిన లోపాలను నేను కూడా గమనించాను. 5 వేలకు పైగా సినిమా మొలక వ్యాసాలు ఉంటే వాటి అభివృద్ధి కోసం ఒక 3 నెలలపాటు ఒక ప్రాజెక్టు రూపొందించుకొని వికీ సభ్యులు ఎంతో శ్రమకోర్చి దాదాపు 3 వేలకు పైగా వ్యాసాలు అభివృద్ధి మొలకస్థాయిని దాటించారు. మళ్ళీ ఇప్పుడు ఫొటో ఎక్కింపుల కొసం మొలక సినిమా వ్యాసాలు సృష్టించడం ఎంతవరకు కరెక్టు?. కొందరైతే ఫోటోలను ఎక్కించకుండా కౌంట్ కోసం #WPWPTE, #WPWP ట్యాగ్ లు చేరుస్తున్నారు. నాదొక సందేహం... #WPWPTE, #WPWP ల కౌంట్ ని బట్టి ఫలితాలను ప్రకటిస్తారా లేక ఎక్కించిన (చేర్చిన) ఫోటోలను సరిచూసి వాటిలో అమోదయోగ్యమైన వాటిని బట్టి ఫలితాలను ప్రకటిస్తారా..?--Pranayraj1985 (చర్చ) 09:00, 27 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]


నమస్కారం !

యర్రా రామారావు, Pranayraj1985 గార్లకి పై విషయాలు ప్రస్తావించినందుకు ధన్యవాదాలు.


అభిలాష్ మ్యాడం, మమత, Divya4232, Thirumalgoud, Muralikrishna M, ప్రభాకర్ గౌడ్ నోముల, Ch Maheswara Raju☻, స్వరలాసిక, కె.వెంకటరమణ, యర్రా రామారావు, రమేష్‌బేతి, ప్రణయ్, MYADAM KARTHIK, కుమ్మరి నరేష్, Kishorahs, ప్రశాంతి, Anjali4969, Kasyap, ఆదిత్య పకిడే Adbh266, Shashi gara , Vinod chinna, Laya dappu, Prasanna murahari, బివిప్రసాద్ తెవికీ Bvprasadtewiki, Batthini Vinay Kumar Goud, ఊరే మనోజ్, Pravallika16, వి భవ్య గార్లకి ప్రాజెక్టులో కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు.

పై విషయాలు మీరంతా గమనించగలరని మనవి.

ప్రాజెక్టు వ్యవధి పూర్తి అయ్యాక వాడుకరులు చేసిన దిద్దుబాట్ల ఆమోదయోగ్యత పరిశీలించబడుతుంది, తద్వారానే తుది ఫలితాలు వెలువడతాయి. ఇలా దొర్లిన తప్పులను ప్రాజెక్టు వ్యవధి కాలంలోనే సరి చేసుకున్నట్లయితే ఆయా దిద్దుబాట్లని పరిగణలోకి తీసుకుంటాము.

NskJnv 09:51, 27 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ప్రాజెక్టు సమయంలో నేను సృష్టించిన వ్యాసాల మొలక స్థాయిని దాటించే బాధ్యతను నేనే స్వీకరిస్తాను. కాకపోతే కాస్త తీరుబడిగా నవంబరు 1వ తేదీ తరువాత ఆ పనిని చేపట్టగలను. కావున ఎవరూ దిగులు చెందవలసిన పని లేదు. మొలక వ్యాసాలలో బొమ్మలను ఎక్కించడం లేదా బొమ్మలను ఎక్కించడానికి కొత్త వ్యాసాలను సృష్టించడం ఈ పోటీకి అనర్హతగా నిర్వాహకులు భావిస్తే నా కెట్టి అభ్యంతరమూ లేదు. --స్వరలాసిక (చర్చ) 10:17, 27 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం @Nskjnv గారు, నేను సినిమాలకు బొమ్మలను చేర్చాను, కానీ నేను పెట్టిన బొమ్మలను తీసి మళ్ళీ వినయ్ కుమార్ గౌడ్ గారు బొమ్మలను ఎక్కించి పెడుతున్నారు. నేను వినయ్ కుమార్ గౌడ్ గారి చర్చ పేజీ లో అడిగాను నాకు ఎటువంటి సమాధానం రాలేదు ఇది గమనించగలరు. Divya4232 (చర్చ) 05:34, 29 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

చిత్ర యాత్రలు[మార్చు]

నమస్కారం !

చిత్ర యాత్రల్లో పాల్గొన్న అభిలాష్ మ్యాడం, రమేష్‌బేతి, ప్రశాంతి, కిన్నెర అరవింద్, భాస్కర్ గార్లకి, మీరు చిత్ర యాత్రల ద్వారా సేకరించిన చిత్రాలని తెలుగు వికీ పేజీల్లో చేర్చారని భావిస్తున్నాను. లేని పక్షాన ఈ రోజు పూర్తీ చేసుకోండి. తద్వారా మీ దిద్దుబాట్ల సంఖ్యలో వాటిని పరిగనించటానికి వీలు పడుతుంది.

అలాగే సముదాయం నుండి చిత్ర యాత్రలో పాల్గొన్న ఆదిత్య పకిడే Adbh266 గారికి, అనుకున్నట్లుగా కార్యశాలలలో ఉపయోగించుకోలేకపోయినందుకుగాను -మీరు చిత్ర యాత్ర ద్వారా సేకరించిన చిత్రాలు వికీలో ఎవరైనా చేర్చడానికి అనుమతి కల్పించ వలసిందిగా కోరుతున్నాను.

NskJnv 11:07, 31 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం సాయి కిరణ్ గారు

సమదాయం నుంచి చిత్ర యాత్ర చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. చిత్ర యాత్ర నేను కొంత ఆలస్యంగా ప్రారంభించిన కారణంగా మరొకటి లేదా రెండు రోజుల్లో చిత్రయాత్ర చేసినటువంటి ఫోటోలను ఎక్కిస్తాను. అలాగే ఎక్కించిన చిత్రాలను సముదాయ సభ్యులు ఎవరైనా వాటి పేజీల్లో చేర్చవచ్చు. ఆదిత్య పకిడే Adbh266 (చర్చ) 06:16, 3 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

దిద్దుబాట్ల సమీక్ష సమావేశం[మార్చు]

యర్రా రామారావు, ఆదిత్య, చదువరి గార్లకి నమస్కారం!

దాదాపుగా 5000 లకు పైగా దిద్దుబాట్లతో ప్రాజెక్టు ద్వారా ఆయా పేజీలలో చిత్రాలు చేర్చడం జరిగింది. ఈ ప్రాజెక్టులో జరిగిన దిద్దుబాట్ల లెక్కలు పరిశీలించి పోటీ తుది ఫలితాలు వెలువడించాలి. దీనికోసం మనమంతా శుక్రవారం సాయంత్రం 6 గంటలకి గూగుల్ మీట్లో సమావేశమవుదాం. మీ వీలును తెలపగలరు.

NskJnv 15:32, 2 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Nskjnv గారూ, నాకు వీలయ్యేట్లుగా లేదు. అంచేత నాకోసం చూడకుండా మీరు కానిచ్చెయ్యండి. వీలైతే మాత్రం చేరతాను.__ చదువరి (చర్చరచనలు) 04:34, 3 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
సరే చదువరి గారు.

నేను పాల్గొంటాను సాయి కిరణ్ గారు.తెలియజేసినందుకు ధన్యవాదాలు.ఆదిత్య పకిడే Adbh266 (చర్చ) 06:05, 3 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ముగింపు సమావేశం[మార్చు]

Nskjnv గారూ, 12వ తేదీన జరగబోయే ముగింపు సమావేశానికి వాడుకరులందరికీ ట్రావెలెంగ్ అలవెన్స్ కల్పిస్తే మరింత సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్న. దీని గురించి తగిన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్న--అభిలాష్ మ్యాడం (చర్చ) 06:01, 6 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ఆలోచన తప్పకుండా చేద్దాం. NskJnv 06:45, 6 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు[మార్చు]

  1. వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 విజయవంతం చేసిన ప్రాజెక్టు నిర్వాహకులు, న్యాయ నిర్ణేతలు, విజేతలు.. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. నన్ను వ్యక్తిగతంగా కలిసి బహుమతి అందించిన నేతి సాయి కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. --Muralikrishna m (చర్చ) 11:28, 13 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  2. నేతి సాయి కిరణ్ గారూ, మీరు పంపిన టీషర్టు, కప్పు అందాయి. సంచీ కూడా అందంగా ఉంది. ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 22:32, 13 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  3. నేతి సాయి కిరణ్ గారూ, టీషర్టు, కప్పు, సంచీ, బహుమతిగా పంపిన ₹7,500 విలువ గల అమెజాన్ గిఫ్ట్ వోచర్ అన్నీ అందినాయి. చాలా సంతోషం. ఈ ప్రాజెక్టును దిగ్విజయంగా నిర్వహించినందుకు అభినందనలు. --స్వరలాసిక (చర్చ) 11:50, 15 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ప్రాజెక్టు మొదలు నుండి చివరి వరకు నిరంతరం అహర్నిశలు శ్రమించిన ప్రాజెక్టు నిర్వాహకులు నేతి సాయి కిరణ్ గారు అధిక దిద్దుబాట్లు చేసిన కొత్త వాడుకరిగా నన్ను గుర్తించి, 5000 రూపాయల గిఫ్ట్ వోచర్ పంపినందుకు ధన్యవాదాలు. ఆలాగే ఈ బహుమతి అందడానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన చదువరి, ఆదిత్య, యర్రా రామారావు గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు.-అభిలాష్ మ్యాడం (చర్చ) 14:11, 15 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  5. వికీపీడియా పేజెస్ వాంటింగ్ ఫొటోస్ 2022 ప్రాజెక్ట్ ని విజయవంతంగా పూర్తి చేసిన నిర్వాహకులు నేతి సాయి కిరణ్ గారికి అభినందనలు.ఈ ప్రాజెక్టులో ఉన్న ముగ్గురు న్యాయనిర్ణేతలలోఒకరిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.మీరు పంపిన 2500/ అమెజాన్ గిఫ్ట్ కూపన్ అందినది.విజేతలకు ,పాల్గొన్న వారికి శుభాకాంక్షలుఆదిత్య పకిడే Adbh266 (చర్చ) 05:20, 16 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  6. నేతి సాయి కిరణ్ గారూ, మీరు పంపిన టీషర్టు, కప్పు అందాయి. విజేతలకు , పాల్గొన్న వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు. KINNERA ARAVIND (చర్చ) 06:35, 16 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  7. నేతి సాయి కిరణ్ గారూ, మీరు పంపిన రూ 2,500 ల విలువైన గిఫ్టు కూపను అందింది. ధన్యవాదాలు__చదువరి (చర్చరచనలు) 09:20, 16 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  8. నేతి సాయి కిరణ్ గారూ, మీరు పంపిన ₹15,000, ₹5,000 విలువైన అమెజాన్ గిఫ్ట్ వోచర్స్ అందినాయి, ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు. ఆలాగే ఈ బహుమతి అందడానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన చదువరి, ఆదిత్య, యర్రా రామారావు గార్లకు ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు మొదలు నుండి చివరి వరకు నేను చేసిన దిద్దుబాటులను గమనిస్తూ, తప్పులను చెపుతూ ప్రోత్సహించిన వారి అందరికి, మరీ ముఖ్యంగా ప్రణయరాజ్, నేతి సాయి కిరణ్, చదువరి, యర్రా రామారావు, కశ్యప్ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు. దివ్య (చర్చ) 15:33, 16 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  9. నేతి సాయి కిరణ్ గారూ, టీషర్టు, కప్పు, సంచీ, రూ 2,500 ల విలువైన గిఫ్టు కూపను అందినవి. ధన్యవాదాలు--యర్రా రామారావు (చర్చ) 16:18, 16 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  10. నేతి సాయి కిరణ్ గారూ, టీషర్టు, కప్పు, సంచీ, బహుమతిగా పంపిన ₹5,000 విలువ గల అమెజాన్ గిఫ్ట్ వోచర్ అన్నీ అందినాయి. చాలా సంతోషం. ఈ ప్రాజెక్టును దిగ్విజయంగా నిర్వహించినందుకు అభినందనలు.➤ కె.వెంకటరమణచర్చ 15:40, 18 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]