Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/స్త్రీవాదము - జానపదము 2025

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: ఫలితాలు టాపిక్‌లో 1 నెల క్రితం. రాసినది: Saiphani02

@ అభిలాష్ గారికి నమస్కారం ,

అంతర్జాతీయ పోటీ దృష్ట్యా ప్రాజెక్టుకి పేజీ రూపొందించాను, నిర్వాహకులుగా ప్రాజెక్టుకి సంబంధించి ఇతరాత్ర అంశాలు అనగా , ప్రాజెక్టు పేజీలో మార్పులు, రచ్చబండలో ప్రకటన , క్రియాశీల వాడుకరులకు ఆహ్వానం, తెలుగు వికీ స్థానిక బహుమతులకి సంబంధించి చర్చ లాంటి వాటిని ముందుకు తీసుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. నేతి సాయి కిరణ్ (చర్చ) 15:07, 2 ఫిబ్రవరి 2025 (UTC)ప్రత్యుత్తరం

@Nskjnv గారూ.. తప్పకుండా ముందుకు తీసుకువెళ్తాం. ఈ ప్రాజెక్టు నిర్వహణలో నన్ను భాగస్వామ్యం చేస్తున్నందుకు ధన్యవాదాలు. --అభిలాష్ మ్యాడం (చర్చ) 12:44, 7 ఫిబ్రవరి 2025 (UTC)ప్రత్యుత్తరం

స్థానిక బహుమతులు

[మార్చు]

పోయిన సంవత్సరంలాగా మనకు మనం స్థానిక బహుమతులను ప్రకటించుకుంటే పాల్గొనే వాడుకరులకు కొంత ప్రోత్సాహకంగా ఉంటుందని నా అభిప్రాయం. సభ్యులు దీనిపై స్పందించగలరు. అభిలాష్ మ్యాడం (చర్చ) 14:31, 7 ఫిబ్రవరి 2025 (UTC)ప్రత్యుత్తరం

అభిలాష్ మ్యాడం గారు, గత ఏడాది లాగానే ఈ ప్రాజెక్టుకి నా వంతు సహకారంగా 5 వేయిల రూపాయలు అందజేయటానికి నేను సిద్ధం, ఇంకా ఇతరులు అందజేసే సహకారాన్ని బట్టి మనం తుది నిర్ణయం తీసుకుందాం. నేతి సాయి కిరణ్ (చర్చ) 11:46, 19 ఫిబ్రవరి 2025 (UTC)ప్రత్యుత్తరం

స్త్రీవాదము - జానపదము 2025లో గమనించిన లోపాలు

[మార్చు]

ముందుగా ఈ ప్రాజెక్టు నిర్వాహకులు మమత అభిలాష గార్కి, ఈ ప్రాజెక్టులో పాల్గొనుటకు ముందుకు వచ్చిన గౌరవ వికీపీడియనులకు ధన్యవాదాలు. నేను ఈ ప్రాజెక్టులో సృష్టిస్తున వ్యాసాలలో కొన్ని లోపాల గమనించుట జరిగింది.ప్రాజెక్టు నిర్వహణ నాణ్యతగా ఉండటానికి నేను గమనించిన లోపాలు వివరిస్తున్నాను.

  1. ప్రాజెక్టులో సృష్టించే వ్యాసాలకు వికీడేటా లింకు కలపటలేదు (భాషలకు జోడించని పేజీలు)
  2. వికీడేటాలో క్లుప్తవివరణ రాయటం లేదు.
  3. అనాథ పేజీలు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతున్నాయి.ఇంకో ముఖ్య విషయం.ఈ వ్యాసాలన్నీ ఒక అజ్ఞాత వాడుకరి గమనించి "({Orphan}}" మూస తగిలించటం ఒక విశేషం. ఆ వాడుకరిని ఒక నిర్వాహకునిగా అభినందిస్తున్నాను. ఉదా:డొమినిక్ లాంగెవిన్ వ్యాసం.
  4. ఎక్కువ ఆంగ్ల పదాలతో వ్యాసాలు ఉంటున్నవి. తెలుగు భాషకు దగ్గరగా ఉన్న పదాలు చాలా చాలా తక్కువుగా ఉన్నవి.కొన్ని వ్యాసాలు కృతక భాషలో ఉంటున్నవి.
  5. అగాథపేజీలు ఉంటున్నవి.ఉదా:లిజిల్జనా రాయ్చెవిక్, ఎల్లెన్ బెర్లినర్, నజ్మున్ ఆరా సుల్తానా
  6. కొన్ని వ్యాసాలకు మూలాలు లేవు. ఉదా:ఎల్లెన్ బెర్లినర్
  7. తెవికీ 21వ జన్మదినోత్సవం సందర్బంగా తిరుపతిలో ఫిబ్రవరి 14 నుండి 16 వరకు జరిగిన తెవికీ పండగ -2025లో, ముఖ్యంగా తెలుగు వికీపీడియాలోని వ్యాసాలు, నాణ్యతపై, అలాగే తెలుగు వికీపీడియాలో తెలుగు ఎంతవరకు ఉంటుందనే దానిమీద విస్తృతంగా చర్చసాగింది. దానిమీద పైన ఉదహరించిన లోటుపాట్లుపై ప్రజెంటేషను ఇవ్యటం జరిగింది.అలాగే తెలుగు వికీపీడియాలో తెలుగుకు దగ్గరగా ఉన్న వ్యాసాలు ఉంటున్నాయా అని చర్చచాలా సేపు జరిగింది. దీనిలో ప్రధానంగా వచ్చిన అంశాలు, 1. రెండు తెలుగుభాషకు దగ్గరగా ఉన్న వ్యాసాలు అంటే ప్రాముఖ్యత లేని ఇతరదేశాలకు చెందిన వ్యాసాలు కుప్పలు తెప్పలుగా కృతక భాషతో సృష్టింపు జరుగుతుందని, 2. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాసాలు సృష్టింపు చాలా తక్కువుగా ఉంటుందని, 3. ఇంకా భారతదేశానికి చెందిన వ్యాసాలు సృష్టింపు కూడా చాలా తక్కువుగా ఉంటుందనే అభిప్రాయాలు వెలుబుచ్చారు.

కావున పై అభిప్రాయాల గమనించి ప్రాజెక్టు నిర్వహణ సక్రమంగా జరగటానికి తోడ్పడవలసిందిగా , అలాగే ప్రాజెక్టు నిర్వాహకులు, పర్వేక్షకులు తగిన శ్రద్ధ తీసుకోవలిసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 08:42, 18 ఫిబ్రవరి 2025 (UTC)ప్రత్యుత్తరం

క్షమించండి యర్రా రామారావు గారు. నేను ఈ ప్రాజెక్టు నిర్వహకురాలిని కాదు. Tmamatha (చర్చ) 13:40, 19 ఫిబ్రవరి 2025 (UTC)ప్రత్యుత్తరం
@మమత గారూ క్షమించాలి.ఏదో పొరపాటు జరిగింది.అభిలాష గారిని రాయబోయి పొరపాటున మీ పేరు రాసాను.తెలిపినందుకు ధన్యవాదాలు.అభిలాష గారూ పై సూచనలను గమనించగలరు. ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 13:46, 19 ఫిబ్రవరి 2025 (UTC)ప్రత్యుత్తరం
ధన్యవాదాలు @యర్రా రామారావు గారు.. ఈ మీ సూచనలు పరిగణనలోకి తీసుకుని మరిన్ని నాణ్యమైన వ్యాసాలు పురుడు పోసుకునేలా ప్రయత్నం చేస్తాము -అభిలాష్ మ్యాడం (చర్చ) 07:56, 25 ఫిబ్రవరి 2025 (UTC)ప్రత్యుత్తరం

సూచనలు

[మార్చు]

నమస్కారం అభిలాష్ గారు,

స్త్రీవాదము - జానపదము 2025 నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు, అంతర్జాతీయ నిర్వాహకులు స్థానిక బహుమతులను గురించి సమాచారం అందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి :

స్థానిక బహుమతులు

[మార్చు]
  1. మొదటి బహుమతి - $25 USD
  2. రెండవ బహుమతి - $20 USD
  3. ఉన్నతమైన/చక్కటి వ్యాసం - $15 USD

ఈ బహుమతులు అందుకోవాలి అంటే పాల్గొనేవారు రాసిన వ్యాసాల్లో కనీసం 5 ఆమోదించబడి ఉండాలి. కనీసం 5 ఆమోదించబడిన వ్యాసాలు లేని యెడల వారు బహుమతులకి అనర్హులు.

అలాగే నా తరఫున ఇస్తా అన్న 5 వేల రూపాయలతో, ప్రాజెక్టులో చక్కటి మార్పులు చేసిన మొదటి పది మంది వాడుకరులకు టీ-షర్ట్స్ బహుకరిద్దామని అనుకుంటున్నాను.

నేతి సాయి కిరణ్ (చర్చ) 06:04, 25 ఫిబ్రవరి 2025 (UTC)ప్రత్యుత్తరం

@Nskjnv గారూ మీ సూచనలు బావున్నాయి. దీంతో మరింత ఉత్సాహంగా ప్రాజెక్టును ముందుకు నడిపించవచ్చు. ధన్యవాదాలు --అభిలాష్ మ్యాడం (చర్చ) 07:57, 25 ఫిబ్రవరి 2025 (UTC)ప్రత్యుత్తరం

వ్యాసాల నాణ్యత

[మార్చు]

ఈ ప్రాజెక్టులో భాగంగా రాసే ప్రతి వ్యాసం ప్రాజెక్టు నియమాలకు అనుగుణంగానే ఉండాలి. @యర్రా రామారావు గారు పైన తెలిపిన సూచనలను వ్యాసాలు రాసే ప్రతి వాడుకరి గమనించగలరు.-అభిలాష్ మ్యాడం (చర్చ) 08:08, 25 ఫిబ్రవరి 2025 (UTC)ప్రత్యుత్తరం

@ అభిలాష్ గారికి  నమస్కారం ,  

స్త్రీ వాదం జానపదం ప్రాజెక్ట్ లో వివిధ దేశాల స్త్రీల గురించి వ్యాసాలు రాయవచ్చా ?

మూలాలు

[మార్చు]

నమస్కారం,

ఉన్న మూలాలు తీయుట, వ్యాసములో ఆధారాలు ఎంతో అవసరం. Pravallika16, Divya4232 వ్యాసాలలో ఉన్న మూలాలు తీసివేయడం చేస్తున్నారు, ఉన్న ఆధారాలు తీస్తే ఆ వ్యాసం అసంపూర్ణం ఇది గమనించగలరు.

మరొక విషయం అఙ్ఞాత వాడుకరిగా నేను చేసిన పనిని మూస తీయకుండా అనాథ మూస తీసివేయడం చేయకూడదు అది ఒక అనాథ పేజీ అయినది, అనాథ పేజీ అని పేరు పేటరు అలా పెట్టిన దానిని లింకులు ఇవకుండానే తీసివేయడం చేస్తున్నారు--Karthikeya012 (చర్చ) 03:31, 2 ఏప్రిల్ 2025 (UTC)ప్రత్యుత్తరం

Karthikeya012 గారు, నేను మూలాలు తీయలేదండి, ఇది గమనించగలరు. సరిగ్గా చూడగలరు. Divya4232 (చర్చ) 05:05, 2 ఏప్రిల్ 2025 (UTC)ప్రత్యుత్తరం

వర్గాలు

[మార్చు]

Pravallika16 గారు వర్గాలు ఇలా వర్గం:CS1 హిందీ-language sources (hi) లాంగ్వేజ్ సోర్సెస్ అని ఆంగ్లం లో వర్గాలు ఒకటి కాదు రెండు కాదు చాలా సృష్టింస్తున్నారు. గమనించగలరు అభిలాష్ గారు ఇది వికీపీడియా నిబంధనలకు నిరోధం--Karthikeya012 (చర్చ) 03:58, 2 ఏప్రిల్ 2025 (UTC)ప్రత్యుత్తరం

నియమాలు

[మార్చు]

@ అభిలాష్ గారికి నమస్కారం, స్త్రీవాదం జానపదం 2025 ప్రాజెక్టులో నియమాల గురించి కొన్ని సందేహాలు. అంతర్జాతీయ పోటీకి మన తెలుగు పోటీకి నియమ నిబంధనలో కొన్ని వ్యత్యాసాలను నేను గమనించాను.

ప్రాజెక్టు నిర్వహకులు అభిలాష్ గారు ఒకసారి సరి చూసి ... మా వ్యాసాల మూల్యాంకనం పై దృష్టి సారించాలని కోరుకుంటున్నాను...

ధన్యవాదాలు --Divya4232 (చర్చ) 11:28, 1 ఏప్రిల్ 2025 (UTC)ప్రత్యుత్తరం

దివ్య గారితో నేను ఏకీభవిస్తున్నాను. Tmamatha (చర్చ) 11:48, 1 ఏప్రిల్ 2025 (UTC)ప్రత్యుత్తరం
దివ్య గారితో నేను ఏకీభవిస్తున్నాను.
V Bhavya (చర్చ) 11:51, 1 ఏప్రిల్ 2025 (UTC)ప్రత్యుత్తరం

@Divya4232, Tmamatha, V Bhavya గార్లకి నమస్కారం, మీ సూచనలకు ధన్యవాదాలు.

అంతర్జాతీయ పోటీ పేజీ నియమాల ప్రకారం:

  1. 3000 బైట్లు లేదంటే 300 పదాల నిడివి
  2. యాంత్రికానువాదం లేని భాష
  3. ఫిబ్రవరి 1 నుండి మార్చి 31 మధ్యలో రాసింది/విస్తరించి ఉండాలి.
  4. ప్రాజెక్టు అంశాలకు తగినట్టు స్త్రీవాదం , జానపదం వాటికి సంబంధించిన అంశాలపై రాసి ఉండాలి .
  5. అనాధ వ్యాసం అయి ఉండకూడదు
  6. అంతర లింకులు , వర్గాలు , మూలాలు కనీసం ఉండాలి. కాపీహక్కులు ఉల్లఘించకూడదు.

పై నియమాలకు అనుగుణంగా పోటీలో వ్యాసాలను పరిగణించడం జరుగుతుంది. నేతి సాయి కిరణ్ (చర్చ) 06:26, 9 జూన్ 2025 (UTC)ప్రత్యుత్తరం

ఫలితాలు

[మార్చు]

ఫలితాలు రచ్చబండలో ప్రకటించినట్లు గుర్తు, ప్రాజెక్టు పేజీలో కూడా చేర్చాలి. Saiphani02 (చర్చ) 10:51, 16 డిసెంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం