వికీపీడియా చర్చ:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాహిత్యం విషయంగా కూడా లేదే?[మార్చు]

ఈ ప్రయత్నం చాలా బాగుంది. ఇందులో చక్కని వ్యాసాలు పరిగణనలోకి వచ్చాయి. ఐతే సాహిత్యం కనీసం పరిగణనకు కూడా రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. విశేష వ్యాసాల స్థాయి పొందదగినవేమీ లేకపోతే కనీసం శీర్షిక పెట్టి ఖాళీగానైనా వదిలేసినా బావుంటుందని నా మనవి.--పవన్ సంతోష్ (చర్చ) 02:27, 3 ఆగష్టు 2014 (UTC)

పవన్ గారూ, తప్పకుండా ప్రతిపాదించవచ్చు. సభ్యునిగా మీకూ ఆస్వేచ్ఛ వుంది. దీన్ని ఒక పరంపరగా చూద్దాం. రాబోవు ఐదారు నెలలలో విశేష వ్యాసాలు మొత్తం 50 లేదా 60 వరకూ తీసుకెళ్ళే అవకాశం వుంది.అహ్మద్ నిసార్ (చర్చ) 05:51, 3 ఆగష్టు 2014 (UTC)
అహ్మద్ నిసార్ గారూ! సరేనండీ సాహిత్యమే కాక ఇతరాల్లో కూడా మీరు చెప్పిన సూచనలను అనుసరించి వెతుకుతాను. దొరికితే ఈ పేజీలో ప్రతిపాదిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 15:34, 3 ఆగష్టు 2014 (UTC)
కవులు, రచయితలు సాహిత్యం క్రిందకు వస్తారా? వ్యక్తులుగానే స్వీకరించాల్సి ఉంటుందా?--పవన్ సంతోష్ (చర్చ) 17:49, 3 ఆగష్టు 2014 (UTC)
పవన్ గారూ వికీపీడియా:విశేష వ్యాసాలు చూడండి. వీటిలో చందమామ వ్యాసమొక్కటే సాహిత్యానికి సంబంధించినది. అదియూ ఓ మాసపత్రికగా. కవితలు, రచనలు, సాహిత్యం క్రిందికి రావచ్చు. శ్రీశ్రీ ని రచయితగాను వ్యక్తిగాను , కన్యాశుల్కాన్ని రచనగాను సాహిత్యంగాను పరిగణించవచ్చు. అహ్మద్ నిసార్ (చర్చ) 18:42, 3 ఆగష్టు 2014 (UTC)
సందేహాన్ని నివృత్తి చేసినందుకు కృతజ్ఞతలు. --పవన్ సంతోష్ (చర్చ) 02:41, 4 ఆగష్టు 2014 (UTC)

వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ[మార్చు]

సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 19:33, 3 ఆగష్టు 2014 (UTC)

విశేష వ్యాసాలు[మార్చు]

లోహిత్ గారి సందేహాలు;

తెవికీలో చాలా వ్యాసాలు విస్తరింవబడినవి ఉన్నట్లున్నవి. ఉదాహరణకు పాలగిరి వ్రాసిన అనేక నూనెల వ్యాసాలు, రసాయన శాస్త్ర వ్యాసాలన్నీ పూర్తిగా విస్తరింపబడినవి ఉన్నవి. వాటిని విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చా? చంద్రకాంతరావు గారు విశేషంగా వ్రాసిన తెలంగాణ వ్యాసం వంటివాటిని విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చా? మీరు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 లో సూచించని అనేక విస్తరిత వ్యాసాలు తెవికీలో ఉన్నవి. వాటిని కూడా విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చా? వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 లో సూచించిన వ్యాసాలను విశేషంగా అభివృద్ధి చేసినయెడల వాటిని విశేష వ్యాసాల హోదాలు ఎలా యివ్వాలి. విశేష వ్యాసాల వర్గంలో చేర్చితే సరిపోతుందా? సందేహ నివృత్తి చేయగలరు.---- కె.వెంకటరమణ చర్చ 13:07, 4 ఆగష్టు 2014 (UTC)

విశేష వ్యాసాలు – ప్రతిపాదనలు – సందేహాలు – నివృత్తులు – మార్గదర్శకాలు[మార్చు]

వెంకటరమణ గారూ, మీరన్నట్టు, తెవికీలో చాలా వ్యాసాలు విస్తరింపబడి యున్నవి. అందుకొరకే విశేష వ్యాసాల పరిగణనా ప్రక్రియ. ఈ సంవత్సరాంతానికి ఓ వంద విశేష వ్యాసాలు చూడవచ్చనే ఆశ.
తెవికీలో 25 విశేష వ్యాసాలున్నాయి (మొత్తం వ్యాసాల సంఖ్య = 58,545 - ఆగస్టు 4, 2014 నాటికి)
ఇవికీలో 4,323 విశేష వ్యాసాలున్నాయి (మొత్తం వ్యాసాల సంఖ్య = 4,573,497)
తెవికీలో అనేక వ్యాసాలు విస్తరింపబడి యున్నవి, ప్రతిపాదనలలో వాటి పేర్లు ఉండవచ్చు, లేకపోవచ్చు.
ప్రతిపాదింపదలిస్తే;
విశేష వ్యాసాల కొరకు ఏ సభ్యులైనా ప్రతిపాదించవచ్చు.
ఎన్నైనా ప్రతిపాదించవచ్చు.
చంద్రకాంతరావు గారు వ్రాసిన తెలంగాణా వ్యాసమూ ప్రతిపాదించవచ్చు.
విశేష వ్యాసాల ప్రతిపాదన ఎన్నిక కొరకు ఈలింకులు చూడండి.
కేవలం విశేష వ్యాసం వర్గంలో ఉంచిన యెడల అది విశేష వ్యాసం కాదు. ఇవికీ నుండి తర్జుమా కొరకు విషయాన్ని ఇవికీనుండి కాపీ చేసి తెవికీలో వుంచినందువలన, ఆ వ్యాసం ఇవికీలో విశేష వ్యాసం అయివున్నందువలన, విశేష వ్యాసం వర్గంలో చేరి ఉండవచ్చు. అలా అయిన పక్షంలో, ఆవ్యాసం నుండి వర్గం:విశేష వ్యాసం తొలగించవచ్చు.

విశేష వ్యాసాల ఎన్నిక సభ్యుల అభిప్రాయాలతోనే జరుగుతుంది. ఈ ఎన్నిక ప్రక్రియ వలన లాభాలేమంటే, ప్రతిపాదించేవారు ఆయా వ్యాసాలను ఒక సారి పరికిస్తారు, వాటి నాణ్యతా విషయాలు గుర్తిస్తారు, ఇంకా ఇతర విషయాల దిద్దుబాట్లు చేస్తారు, ఆతరువాతే ప్రతిపాదిస్తారు. సరిగ్గా మనకు కావలసిందీ ఇదే.

విశేష వ్యాసాల కొరకు నిబంధనలు / మార్గదర్శకాలు ;
  • వ్యాసం పరిపూర్ణంగాను, ఖచ్చితత్వాన్ని కలిగి వుండాలి
  • నిష్పక్షపాతంగా వుండాలి
  • సమతౌల్యతలను పాటించి వుండాలి
  • మూలాలు కలిగి ఉండవలెను
  • అధిక లింకులు కలిగి ఉండవలెను
  • ఎర్రలింకులు లేకుండా ఉండవలెను.
  • సంబంధిత వ్యాసాలకు, వాటి విషయాలకు తగిన బొమ్మలు కలిగి వుండాలి
  • సభ్యుల ఆమోదాలతోను, నిర్ణయాలతో ఎన్నికై వుండాలి.
విశేష వ్యాసంగా ఎన్నికైన వ్యాసాన్ని,
  • {మూస:విశేష వ్యాసం /(ఎన్నికైన తేదీని గుర్తిస్తూ)}, మరియు [వర్గం:విశేష వ్యాసం] లో చేరుస్తారు.

ఇంకనూ చర్చించవలసిన విషయాలుంటే, సభ్యులు చర్చించవచ్చు. (ఈ విభాగాన్ని రచ్చబండలోనూ, విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 చర్చాపేజీలోనూ ఉంచుతున్నాను). అహ్మద్ నిసార్ (చర్చ) 14:47, 4 ఆగష్టు 2014 (UTC)