Jump to content

వికీపీడియా చర్చ:సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పాత చర్చ నకలు

[మార్చు]

వికీపీడియా సర్వసభ్య సమావేశం - ఒక ప్రతిపాదన

[మార్చు]

తెలుగు వికీపీడియా మరింతగా అభివృద్ధి చెందడానికి వీలుగా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తే బావుంటుందేమో అన్నది నా సూచన. ఈ సమావేశంలో తెవికీ రచనలు, రచనా వ్యాసాంగానికి సంబంధించి సమగ్ర చర్చతో బాటు, మెరుగైన సేవలందిస్తున్న వ్యాసకర్తలకు ఉత్సాహంగా ఉండేందుకు ప్రశంసా పత్రాలను (ప్రింటెడ్ సర్టిఫికెట్లు) అందిస్తే - కొత్త రచయితలు వికీకి చేరువ కాగలరన్నది నా సూచన. ఈ సమావేశం మన తెలుగువారి తొలి వెలుగైన ఉగాది రోజున తెలుగు రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో జరిపితే బావుంటుంది. నిర్వాహకులతో ముఖాముఖీగా జరిగే ఇష్టాగోష్టి చాలారకాల అపోహలను, ఆభిప్రాయ బేధాలను తొలగించి, వికీ నాణ్యతా ప్రమాణాల మెరుగుదలకు దోహదకారి కాగలదని నా ఆభిప్రాయం. పరిశీలించవలసిందిగా నా విన్నపం. ...Malladi kameswara rao (చర్చ) 15:40, 10 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మల్లాదిగారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నను. అయినా ఇది ఆచరణ సాధ్యమా అన్నది ఆలోచించతగిన విషయం. --t.sujatha (చర్చ) 03:05, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది చాలా మంచి ఆలోచన. మల్లాదివారు తలుచుకొంటే చేయగలరని నా నమ్మకం. ఇది వికీపీడియాలో కృషి చేస్తున్న సభ్యులకు వ్రాత పూర్వకంగా ఒక ప్రశంసా పత్రం ఇవ్వడం (ఇప్పుడు మనం ఇస్తున్న చక్రాల కన్నా) చాలా బాగుంటాయి. మీడియాలో అందర్నీ ఆహ్వానించి వికీపీడియాకి వారి అవసరాన్ని, వారికి మన అవసరాన్ని తెలియజేస్తే ఇద్దరికీ ఉపయోగం. వికీపీడియా స్థాపన నుండి విశేష కృషి చేసిన వైజాసత్య వంటి ములస్తంభాల వంటి వారిని సన్మానిస్తే, వారిని మనం గుర్తించినవారమౌతామనిపిస్తుంది. దీనికి భారతీయ వికీమీడియా (బెంగుళూరు) వారి నుండి అనుమతి తీస్కొని, అవసరమైన నిధుల్ని సమకూర్చమని కోరవచ్చును. ఈ కార్యక్రమాన్ని ఉగాదినాడు నిర్వహించితే తెలుగుతనం వస్తుంది.Rajasekhar1961 (చర్చ) 06:27, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]


ఇది ఒకళ్ళిద్దరు కలసి చేసేది కాదు. మనం అందరం కలసి తప్పకుండా చేద్దాం. సభ్యుల పూర్తి సహాయ సహకారాలు, సూచనలు సలహాలు ఉన్నప్పుడే ఇది విజయవంతం కాగలదు. ఇకపోతే... ఈ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించనున్నాము కాబట్టి... ముందుగా హైదరాబాద్ లోని వికీపీడియన్లు కలసి కూర్చుని మాట్లాడితే బాగుంటుందని నా ఆలోచన. అందుకోసం సంప్రదిద్దామంటే మన సభ్యుల ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్ లు నాకు తెలియదు. కనుక నేను చేసుకోను విన్నపం ఏమిటంటే--- నా ఈ-మెయిల్ (malladikr@gmail.com)కు తెవికీలో తెలుగు వ్యాసాలు అందిస్తున్న పెద్దలు (ఒక్క హైదరాబాద్ లోనే మాత్రమే కాకుండా మన రాష్ట్రం లోనూ, దేశ విదేశాలలో ఉన్న తెవికీ సభ్యులు) తమ తమ మొబైల్ నంబర్లు, ఈ-మెయిల్ ఐ.డి.లు మెయిల్ చేసినట్లయితే అందరితో వ్యక్తిగతంగా సంప్రదించి, సూచనలు సలహాలు పొందవచ్చును. . కావున, గౌరవ సభ్యులు తమ తమ మొబైల్ నంబర్లు, ఈ-మెయిల్ ఐ.డి.లు ( పూర్తి చిరునామాతో సహా) మెయిల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం కలసి వికీపీడియా సర్వసభ్య సమావేశం విజయవంతంగా నిర్వహించి తెవికీని మరింత బలోపేతం చేద్దాము. పెద్దల, నిర్వాహకుల, సభ్యుల సహకారంతో వికీపీడియా సర్వసభ్య సమావేశ విజయానికి నా వంతు కృషి నేను చేయగలను. సదా తెవికీ సేవలో... .... Malladi kameswara rao (చర్చ) 13:12, 22 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే... గౌరవ సభ్యులు వికీపీడియా సర్వ సభ్య సమావేశ ప్రతిపాదనపై స్పందించి, తమ ఆలోచనలను, ఆకాంక్షలను తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.... ...Malladi kameswara rao (చర్చ) 13:20, 22 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఆలోచన ముందుకు పోతున్నందుకు ఉత్సాహంగా ఉన్నది. కొందరు సభ్యుల ఈ-మెయిల్ మరియు ఫోను నంబర్లు వారి సభ్య పేజీలో ఉంటాయి. లేనివారివి వ్యక్తిగతంగా తీసుకోవలసివుంటుంది. నా నంబరు: 9246376622; e-mail: nationalpathlab@yahoo.co.in. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 13:51, 22 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ముందుగా నా విజ్ఞాపనకు స్పందించిన సుజాతగారు, విశ్వనాథ్ గారు, రాజశేఖర్ గార్లకు ధన్యవాదాలు. అభ్యంతరం లేనివారు తమ తమ మొబైల్ నంబర్లు, ఈ-మెయిల్ ఐ.డి.లు ( పూర్తి చిరునామాతో సహా) వివరాలను ఈ రచ్చబండలోనే చేర్చవచ్చు. తమ ఫోను తదితర వివరాలు బహిర్గతం కావడం సమ్మతం లేనివారు దయచేసి తమ వివరాలు నాకు మెయిల్ చేయ ప్రార్థన. మార్చి మూడవతేదీ ఆదివారం రోజున హైదరాబాద్ తెవికీ మిత్రులు కలసి - సర్వసభ్య సమావేశ నిర్వహణ, ఏర్పాట్లు తదితర వివరాలు చర్చించుకుంటే కార్యక్రమం వేగవంతం కావడానికి అవకాశం వుంటుంది. సమయం తక్కువగా వున్నందున త్వరితగతిన స్పందించవలసినదిగా కోరుకొనుచున్నాను. ...Malladi kameswara rao (చర్చ) 06:31, 23 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రాంతీయ వికీ సమావేశాలను ప్రోత్సహించడం భారతీయ వికీ సంఘానికి ఒక ప్రాధాన్యతగా వుండేది. క్రిందటి సంవత్సరాలలో వికీ జన్మదినాన్ని జరుపుకొని, వికీలోకృషిచేసిన వారిని చిన్నస్థాయిలో గుర్తించడం జరిగింది. ప్రతిపాదన ఫలించాలని కోరుతున్నాను. వికీకి సంబంధించి సాధ్యమైనంతవరకు చర్చలు పారదర్శకంగా జరుగుతాయి కాబట్టి ఈ ప్రతిపాదనకి సంబంధించి పేజీని (ఉదా: వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం సృష్టించి చర్చలను ఆ పేజీలోనే కొనసాగించడం మంచిది --అర్జున (చర్చ) 09:56, 23 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అందరికి నమస్కారం. మల్లాదిగారు మంచి ప్రతిపాదన చేశారు. అర్జునగారు సూచించిన విధంగా భారతీయ వికీ సంఘానికి ఈ ప్రతిపాదన తెలియజేస్తే బాగుంటుంది. అలాగే Access to Knowledge-CIS, బెంగుళూరు నుండి మేము ఏ విధంగానైనా తోడ్పటానికి సిద్ధంగా వున్నాము. నా ఇ-మెయిల్ vishnu@cis-india.org, మొబైల్-+౯౧౯౮౪౫౨౦౭౩౦౮. విష్ణు (చర్చ)Vishnu 15:12, 26 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చాలామంచి ప్రయత్నం. నాకు వీలుకాదు. ఇంతకుముందెన్నడూ నేనిలాంటి కార్యక్రమాలు నిర్వహించనందున ఏ వ్యాఖ్యనం చెయ్యలేదు. ఇలాంటివి నిర్వహించటానికి అర్జునరావు గారే సాటి. ఆయన ఖచ్చితంగా వస్తానో రానో అనటం కొద్దిగా లోటైన విషయమే. ఇది వరకు చావాకిరణ్ గారూ, చదువరి గారూ, వీవెన్ గారూ. సి.బి.రావు గారు వికీకార్యక్రమాలు నిర్వహించారు. వారి సలహాలకు సంప్రదించండి. విశ్వనాథ్ గారన్నట్టు తెలుగు బ్లాగర్లను కదిలించండి. చాలా మంది క్రియాశీలకంగా తెవికీలో పనిచేయకపోయినా తెలుగు వికీ కార్యక్రమం అంటే ఉత్సాహంగా వస్తారు. శశిధర్ గారన్నట్టు వెబ్‌కాస్టింగ్ ఉంటే చూసి ఆనందిస్తాను. వీలవకపోతే యూట్యూబులో వీడియో ఎక్కించగలరు --వైజాసత్య (చర్చ) 21:52, 16 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • నేను కార్యక్రమానికి హాజరవుతున్నానని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. వైజాసత్య గారి సలహాలు చర్చించి సాధ్యమైనంతవరకు అమలుకు తప్పక ప్రయత్నిస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 23:24, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మన తెవికీసమావేశం - ఉద్దేశ్యము

[మార్చు]

మన తెలుగు వికీపీడియా మరింతగా అభివృద్ధి చెందడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బావుంటుంది అన్నది ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యము.

మంచి సూచన

[మార్చు]

మల్లాదిగారిది బహు మంచి సూచన. ఈ ఆలోచన కార్యరూపందాల్చి విజయవంతమైతే తెవికి అభివృద్దికి తిరుగులేదు. ఈ విషయంలో నాసూచనలు: ....

ప్రధాన సమావేశానికి ముందు అందుబాటులో వున్న సభ్యులతొ ముందస్తు చిన్న సమావేశాలు జరిపి విదివిదానాలను చర్చిస్తే బాగుండును.
వికిపీడియ అంటే ఏమిటి? దానిలోకి ఎలా ప్రవేసించాలి, దాని ఉపయోగాలు మొదలగు విషయాలతో ఒక ఇరవై పుటల చిన్న పుస్తకాన్ని ప్రచురించి సభ్యులకు, సభ్యులు కాగోరు వారికి అందిస్తే దాని వలన కూడ చాల ఉపయోగముండొచ్చనిపిస్తుంది. ఆలోసించ గలరు.
ప్రతి రోజు ఎందరో కొందరు సభ్యులు కొత్తగా చేరుతున్నారు. కాని వారి రచనలు కనబడడము లేదు. వికిపీడియా పై ఎంతో కొంత అవగాహన వున్నవారె సభ్యులుగా చేరుతారు. వారిలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించ గలిగితే ఉపయోగముండొచ్చనిపిస్తుంది. కొత్త వారికన్న అందుబాటులొకి వచ్చిన ఇలాంటివారిని ఉత్సాహ పరచడము సులబం కదా.......

Bhaskaranaidu (చర్చ) 12:05, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చలలో నేను కూడా పాల్గొనాలని ఉంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:29, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చలకు వెబ్ చాట్ ప్రతిపాదన

[మార్చు]

అహ్వానం

[మార్చు]

సమావేశం రూపురేఖలపై చర్చను వేగవంతం చేయటానికి వెబ్ ఛాట్ వాడి దాని పాఠ్యప్రతిని ప్రాజెక్టుపేజీలో చేర్చితే బాగుంటుంది. --అర్జున (చర్చ) 04:50, 5 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యులకు నమస్కారము. సమావేశం విజయవంతం కావడం మనందరి కోరిక కనుక,
  • ఇప్పడు క్రియాశీలకంగా ఉన్న సభ్యులు తక్కువగా ఉండటం, హైదరాబాదులో వారు ఇంకా తక్కువ ఉండటం వలన సమావేశము విజయవంతం కావడానికి మరింతమందిని సమకూర్చవలసి ఉంటుంది. కనుక మొదటి పేజీలో దీనికి సంభందించిన వార్తను క్లుప్తంగా డిస్ల్పే చేయడం అవసరం అని నా అభిప్రాయం ( ఉదా-పలానా తేదీన జరుపు సమావెశమునకు అందరికీ ఆహ్వానము)
  • వీవెన్ గారి వంటి కొందరి సహాయంతో బ్లాగర్ల గుంపులలో వార్తకు ప్రచారం కల్పించడం ద్వారా మరింతమందిని అహ్వానించడం.
  • కరపత్రాల వంటివి ప్రచురించి వీలైతే కొన్ని కాలేజీలలో దీనిని గురించి వివరించడం వారిని ఆహ్వానించడం.
  • వీలైతే ఆ ముందు రోజు హైదరాబాద్ ఎడిషన్ లో ఈ వార్త వచ్చేట్టుగా చూడటం వంటివి..విశ్వనాధ్ (చర్చ) 08:39, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సలహాలు, సూచనలు

[మార్చు]

కార్యక్రమమునకు సంబంధించి నాకు తెలిసినంత వరకు సలహాలు, సూచనలు, తదితర తేలికపాటి పనులు చేయగలను. నాకు అందరితో తెలుగు "'వికీ"' గురించి మాట్లాడేందుకు అభ్యంతర సందేహము లేదు. నా ఫోను నంబరు.9246196226. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:19, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ ఉగాది

[మార్చు]

ప్రస్తుతము నేను బెంగుళూరులో ఉంటున్నాను. ఇటీవలె నా తల్లిదండ్రులు శాశ్వతంగా మా సొంతూరు (కర్నూలు) మారారు. నేను అమెరికా క్లైంటుకి పనిచేయుచున్నాను. కావున నాకు ఉగాది కి సెలవు ఉండదు. కానీ నా ప్రాజెక్టు దాదాపు ముగింపు దశలో ఉన్నది. అయితే నేను ఉగాదికి సెలవు పెట్టిననూ హైదరాబాదు రాలేను. నాకు వ్యక్తిగత ల్యాప్ టాప్ ఉన్నది. ఈ మీటింగుకి ఆన్-లైన్ లో కూడా హాజరు కావచ్చునా? ఒకవేళ అలా కుదరకపోతే మీటింగు విశేషాలు తర్వాత తెలుసుకొనే అవకాశం ఉన్నదా?శశి (చర్చ) 07:05, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

శశి గారూ సమావేశం గురించి తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి. --t.sujatha (చర్చ) 07:08, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నేను రాలేను ... గానీ,

[మార్చు]

వ్యక్తిగత కారణాల వల్ల నేను ఎటువంటి భౌతిక సమావేశాలకూ రాలేను గానీ, టీషర్టులు ప్లాన్ చేస్తే నాక్కూడా ఒకటి ఉంచండి :-) Chavakiran (చర్చ) 13:24, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చావ కిరణ్ గారు నమస్కారం. కొన్ని టీషర్టులు ముద్రించడానికి CIS-A2K నుండి ప్రయత్నిస్తున్నాము. మీకు ఏ సైజు కావాలో తెలపండి. విష్ణు (చర్చ) 18:33, 31 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కార్యక్రమ ప్రణాళిక పై స్పందన

[మార్చు]

కార్యక్రమ ప్రణాళిక మొదటి రూపం చేర్చినందులకు ధన్యవాదాలు. కార్యక్రమ వుద్దేశ్యము వికీ సభ్యుల కలయికప రస్పర పరిచయాలు, మరియు మాధ్యమాలలో ప్రచారం లక్ష్యం ప్రధానంగా వున్నట్లుంది. అయితే పెద్ద కార్యక్రమం, ఖర్చుతో కూడుకున్నదైనందున దీని లక్ష్యాలు ఇంకొంచెం విస్తృతంగా వుంటే బాగుంటుది. ఉదాహరణకు ప్రతి జిల్లానుండి ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు తెవికీ గురించి శిక్షణ ఇ‌వ్వటం. ఉగాదిసమావేశానికి ముందు వీలైతే హైద్రాబాదు మరియు ఆంధ్రప్రదేశ్ నగరాలలో చిన్న చిన్న వికీ సమావేశాలు జరిపితే దీని ప్రచారానికి తోడ్పడుతుంది. వివిధ ప్రాంతాలనుండి ఆసక్తిగలవారిని ఎంపికచేయటానికి వీలవుతుంది. బయటనుండి వచ్చేవారికి ప్రయాణ,హోటల్ ఖర్చులు భరించితే బాగుంటుంది. మాధ్యమాలనుద్దేశించిందైతే మాధ్యమాలలో పనిచేసేవారినుండి రాష్ట్రవ్యాప్తంగా ఎంపికచేసి అవగాహన కార్యక్రమము చేయటం మంచిది. వికీ సభ్యులు కార్యక్రమాలు నిర్వహించుతుంటే మాధ్యమాలలో తెవికీ వార్తలు ఎటూవుంటాయి. పనికట్టుకొని మాధ్యమాలకొరకై సమావేశం సాధారణంగా వాణిజ్యపరసంస్థలు చేస్తుంటాయి. వికీ చేయకూడదనికాదుకాని. కార్యక్రమాన్ని నిర్వహించటానికి ముందుకు వచ్చిన కామేశ్వరరావు గారు దానికి తోడ్పడే ఇతరులు చిన్న కార్యనిర్వాహకవర్గంగా ఏర్పడితే బయటి ప్రపంచంతో సంప్రదింపులు చేయటానికి సులభమవుతుంది. అలాగే శిక్షణ ఇవ్వటానికి దాదాపు 40మందిపనిచేయటానికైనా వీలుండే కంప్యూటర్ లాబ్ వనరుని గుర్తించితే బాగుంటుంది. ఇంకా ఆలోచించవలసినవి ప్రభుత్వశాఖలు మరియు ఇతర భాషా సాంస్కృతిక సంస్థలతో సహకారం.--అర్జున చర్చ) 06:11, 14 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునగారు, మీలాంటి వారు, ఎందరో పాతవారు (అనుభవము గలవారు) అందరూ కలసి; కొత్తవారికి అన్నివిధాలా ముందుండి ఈ కార్యక్రమమును నడిపించి జయప్రదము చేయగలరని, ఈ సందర్భముగా మీకు, తోటి సభ్యులకు, వికీ అభివృద్ధిని కాంక్షించే ఆసక్తిపరులకు సవినయ ప్రార్ధన. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 08:01, 14 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఇతర సభ్యుల స్పందన

[మార్చు]
అర్జున రావు, రాజశేఖర్, మల్లాది కామేశ్వర రావు, వీవెన్ గార్లతో ఫోను ద్వారా వారితో మాట్లాడాను, అది ఒక అనిర్వచనీయమమైన ఒక అనుభూతి. నిన్న సాయంత్రము వీవెన్ గారిని వ్యక్తిగతముగా కలిసాము. ఎంతో ఆనందము, సంతోషము, మరచి పోలేని, మరపురాని ఒక మంచి సందర్భము ఈ కార్యక్రమ ప్రస్తావన విషయములో కలిగినందులకు అందరికి వందనములు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:02, 14 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరులకు విఙప్తి

[మార్చు]

వీలుచూసుకుని, వీలయినంతమంది వదలక వస్తేనే వ్యక్తీకరించిన "విషయములకు" వికీ విధముగా '"విందు వడ్డింపు వేడుక"' వచ్చినవారికి వెసలుబాటు వస్తుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:18, 15 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తమిళ వికీ, వాడుకరుల గురించి ప్రకటన

[మార్చు]

తమిళ వికీ మొదటి పేజీని చూడండి. వాడుకరుల చిత్రమాలిక తో బాటు దాని క్రింద నాంగళ్ తమిళ్ వికీపీడియావిల్ కట్టురైగళ్ ఎళుదిగిరోం. నీంగళుం ఎళుదలామే? (మేము తమిళ వికీపీడియాలో వ్యాసాలు వ్రాస్తున్నాము. మీరు కూడా వ్రాస్తారా?) అని వ్రాసి ఉన్నది. తెవికీని జనానికి చేరువ చేసే చర్చలు ఉగాది సదస్సులో జరుగబోతున్నాయి కావున దీనిని కూడా (దీనితో బాటు ఇటువంటివి ఇంకా ఏమైనా ఉంటే వాటిని కూడా) చర్చించ సాధ్యమవుతుందేమో చూడవలసినదిగా మనవి. వారిని అనుకరిస్తున్నామని కాదు గానీ, మంచి ఎక్కడ ఉన్నా గ్రహించాలి అని నా ఉద్దేశ్యం. - శశి (చర్చ) 23:34, 15 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

* శశిగారూ ! మీ ఆలోచన బాగానే ఉంది కాని ముందు పేజీలో తమ తమ ఛాయాచిత్రాలను పెట్టడానికి అందరూ సభ్యులు ఇష్టపడక పోవచ్చు. ఈ విషయాన్ని చర్చలో పెట్టి సభ్యుల అభిప్రాయం కనుక్కుని తరవాత కార్యరూపంలోకి తీసుకురావచ్చు. --t.sujatha (చర్చ) 13:01, 16 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
* ఛాయా చిత్రమాలికకు నాకు అభ్యంతరము లేదు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 16:28, 22 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
* నాకూ అభ్యంతరము లేదు. ఇలా అభ్యంతరము లేని వారి చిత్రమాలికను ఉంచటం ద్వారా తెవికీ దానంతకు అదే ప్రచార సాధనంగా ఉపయోగపడుతుందనీ, వాడుకరులని ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తుందనీ (అధమ పక్షాన తెవికీ లో తాము కూడా వ్రాయవచ్చని చదివేవారికి తెలుస్తుందనీ) నా అభిప్రాయం. శశి (చర్చ) 14:58, 4 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సమావేశానికి పేరు

[మార్చు]

ఈ సమావేశానికి తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 అని వ్యవహరించాలని మనవి. రహ్మానుద్దీన్ (చర్చ) 11:49, 19 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బాగుంది. --అర్జున (చర్చ) 23:02, 28 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఆర్ధిక వనరులు

[మార్చు]

ఈ సమావేశానికి కావలసిన ఆర్ధిక వనరులు సమకూర్చే/సమకూర్చుకునే భాధ్యతను తీసుకున్న/తీసుకునే వారి వివరములు పొందు పరిచితే బావుంటుందని నా అభిప్రాయము. వనరుల పొందే విషయములో శంకలుంటే చర్చించటము మేలు. తెవికీసమావేశం మార్పులు, చేర్పులు అందుకు అనుగుణముగా చేసుకునేందుకు సమావేశము నిర్వహించే వారికి వెసలుబాటుగా ఉంటుంది. సమావేశ నిర్వాహకులకు, ఇది వరకు సమావేశములు నిర్వహించిన వారు సలహాలు, సూచనలు చేయగలరు. నా శంక మీ ముందుంచ్చాను తప్ప వేరే దురభిప్రాయము, వ్యతిరేక భావము లాంటివి లేనేలేవని సభ్యులు గ్రహించగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:38, 22 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారు నమస్కారం. 'తెలుగు వికీపీడియా మహోత్సవం' ఆహ్వాన కమిటీ సభ్యులు Access to Knowledge-CIS, బెంగుళూరు వారితో మరియు వికీపీడియా భారత చాప్టర్ వారితో ఆర్ధిక వనరుల గురించి చర్చించారు. Access to Knowledge-CIS, బెంగుళూరు నుండి ఈ సమావేశం కొరకై మేము కొన్ని ఆర్ధిక వనరులు కేటయించడానికి అంగీకరించాం మరియు గోల్డెన్ త్రెషోల్డ్, Abids, Hyderabad ని వేదికగా వాడుకోవడానికి University of Hyderabad వారినుండి సహకారం కోరుతున్నాం.విష్ణు (చర్చ)19:03, 31 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
విష్ణుగారికి నమస్కారము. ఈ సందర్భ విషయములో స్వయముగా మీరే స్పందించినందులకు మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:05, 1 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా అనుబంధ సంస్థలు - గుర్తింపు పత్రాలు

[మార్చు]

తెలుగు వికీపీడియాకు అనుబంధ సంస్థలలో పని చేసిన, చేస్తున్న వారికి కూడా గుర్తింపు పత్రాలు, మొమెంటోలు లాంటివి విడివిడిగా ఇస్తే బావుంటుంది. ఈ క్రమములో ఒకరికే (సభ్యుడు) ఒకటికి మించి పత్రాలు, మొమెంటోలు రావచ్చును. బాగానే ఉంటుంది కాని, అటువంటి ఏర్పాట్లు ప్రస్థుతానికి ఇప్పటి వరకు లేనట్లే. కనీసము గుర్తింపు పత్రాలు ఇచ్చేందుకు కావలసిన పైకము అందుబాటులో లేకపోవచ్చును. అంతా మన అందరి మంచికే, బాగానే చేయవచ్చును, కార్యక్రమము జరుగవచ్చును. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:19, 25 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

టీ షర్టులు సామాన్యంగా వికీ సమావేశాలకు మెమెంటోలుగా వాడబడుతున్నాయి. గుర్తింపు పత్రాలు సులభంగా ఏర్పాటుచేయవచ్చు.వికీలో ప్రముఖంగా పనిచేసిన వారిని రకరకాల విభాగాల్లో ఎంపికచేసే విధానం దానికి తగ్గట్టు మెమెంటో ఎంపిక కావాలి. --అర్జున (చర్చ) 23:05, 28 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునగారికి నమస్కారము. ఈ సందర్భ విషయములో మీరు స్పందించినందులకు మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:07, 1 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విజ్ఞప్తి

[మార్చు]

యాంకర్ గా తన సేవలు అందించేందుకు పున్నమరాజు ఉమామహేశ్వరరావుగారు చేసుకున్న ఈ విజ్ఞప్తిని ఇక్కడ చేరుస్తున్నాను. anchor - పున్నమరాజు ఉమామహేశ్వరరావు : 93973 93993 (నా సేవల కోసం సంప్రదించగలరు)Malladi kameswara rao (చర్చ) 12:14, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ సభ్యుల సమావేశం ప్రణాళిక

[మార్చు]

వికీ సభ్యుల సమావేశం 10 సాయంత్రం జరిపి, 11 ఉదయాన ఎడిటథాన్ నిర్వహించితే బాగుంటుందేమో పరిశీలించగలరు. అయితే అందరూ 10వతారీఖు హాజరు కావలసి వుంటుంది. అలాగే ఈ భాగం (ఇప్పటికే వ్యాసం లో వివరించినవాటికి తగ్గట్టుగా ) సమావేశ లక్ష్యాలు అనుకుంటే

  • సభ్యుల పరిచయాలు
  • సభ్యుల అనుభవాలు పంచుకొనుట
  • ప్రస్తుత వికీ సమస్యలకు ప్రాధాన్యతక్రమములో వుంచి అత్యధికప్రాధాన్యమున్న ఒకటి రెండు సమస్యలకు పరిష్కారం దిశగా ముఖాముఖి చర్చలు
  • సమిష్ఠిగా వికీ అభివృద్ధికి ఆలోచనలు
  • ఇతర విజ్ఞాన సంస్థల, వికీలో జరుగుతున్న నూతన పద్ధతుల గురించి తెలుసుకొనుట.

నేను ఈ క్రింది ప్రణాళిక ప్రతిపాదిస్తున్నాను. రెండున్నర నుండి మూడు గంటల సేపు..

  • సభ్యుల పరిచయాలు. అందరు 20 నిముషాలు.
  • అనుభవాలు పంచుకొనుట,ప్రముఖంగా పనిచేసినవారు,ఆసక్తిగలవారు. 30నిముషాలు
  • వికీ కొత్త సాంకేతికాలు. హాట్ కేట్, ట్వింకిల్ ప్రదర్శన, వికీడాటా... 15నిముషాలు
  • ఇతర విజ్ఞాన సంస్థల అధికారులనుండి ఉపన్యాసాలు. (ఇండియా డవలప్మెంట్ గేట్ వే, మరియు ఆర్కీవ్.ఆర్గ్ లను సంప్రదించాము. భారత డిజిటల్ లైబ్రరీ తరపున సంబంధిత వ్యక్తులను సంప్రదించాలి).. 40నిముషాలు.
  • వికీ లో ప్రధాన సమస్య ల పరిష్కారానికి చర్చలు. 20ని
  • వికీ అభివృద్ధికి ప్రణాళిక చర్చ... 20ని

11 ఉదయం ఎడిటథాన్ లో వర్గీకరణ లేక శుద్ధి లేక ఇతరత్రా సమిష్ఠిగా చేయుట.

..పైదానిపై మీ స్పందనలను తెలపండి. --అర్జున (చర్చ) 12:16, 28 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునరావుగారూ ! ప్రణాళిక బాగుంది. మీరు వేసే ప్రణాళికకు సవరణ చేయవలసిన అవసరం అంతగా ఉండదు. --t.sujatha (చర్చ) 14:06, 28 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ వ్యాసాల స్థాయి, ప్రమాణాలు సభ్యులందరూ పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు ఒక బృందమును ఏర్పరిచితే బావుంటుంది. వికీపీడియా గురించి బయటి వారికి అంతగా తెలియనప్పుడు వాటి అనుబంధ సంస్థల జోలికి వెళ్ళనే వెళ్ళరు. బయటి వారు ఒకవేళ వికీపీడియా లోపలికి వచ్చినా వ్యాసాల ప్రమాణ స్థాయి చూసి, వారు వికీ అనుబంధ సంస్థల లోనికి వెళ్ళక పోవచ్చును. ఇది మన అందరం ఆలోచించ వలసిన విషయము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:39, 28 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • శైలి గురించిన పూర్వపు చర్చలు చూసాను. వికీ వ్యాసాలు చదివిన బయటి వారు రెండు విధాలుగా అనుకుంటారు. (1) వ్యాసకర్త(ల) స్థాయి ఇంతే అని. (2) వికీ విలువ ఇంతే అని. నేను చాలా మందితో ఇన్నాళ్ళూ అదే అనుభవాన్ని చవి చూస్తున్నాను. కనీసము మన వికీ సభ్యుల వారి యొక్క కుటుంబ, బంధువులను వారికిష్టమైన వ్యాసాలను చదవమని చెప్పితే, ఆ అనుభవము ఎలా ఉంటుందో వారు గమనించ వచ్చును. భవిష్యత్ తరాల వారికి ఒక మంచి శైలి గల తెలుగు విద్యను అందించాల్సిన బాధ్యత మనకు ఉందని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. రాబోవు తరాల వారిని బాగు చేయక పోయిన కనీసము చెడగొట్ట కూడదు కదా! దీనికి ఒకటే పరిష్కారము. అన్ని దిన, వార, మాస, ఇతర పత్రికలు, గ్రంథాలు, ఇతర పుస్తకాలు, పిల్లల పుస్తకాలు, తదితరమైన .........(అన్నీ) అచ్చువేసిన వాటిలో ఏ విధమయిన శైలి ఉన్నదో అదే శైలి, వికీ శైలిగా అందరూ అనుసరిస్తే, వికీ స్థాయి, ప్రమాణములు పెరిగి ఉన్నత స్థానములో ఉంచవచ్చు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:57, 29 ంటుందిబావుయుమార్చి 2013 (UTC)
  • పైవికీపీడియా(pywikipedia) వాడి ఎ‌వరైనా నడపగలిగే బాట్ గురించి ప్రదర్శన సమావేశంలో చేర్చవచ్చు. అలాగే చాలా మంది వికీపీడియన్లకు పత్రికావ్యవస్థ లేక ప్రసారమాధ్యమాల గురించి మరింత తెలుసుకొనటానికి, క్షేత్ర సందర్శనం ఏర్పాటు చేస్తే ఆటవిడుపుగాను, విజ్ఞానదాయకంగాను వుండవచ్చు.--అర్జున (చర్చ) 00:29, 29 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వాన కమిటీ

[మార్చు]

ప్రచారం

[మార్చు]

నా స్థాయిలో తెలుగు వికీ కోసం ప్రచారం ప్రారంభిచాను . నా బ్లాగ్ (http://rajachandraphotos.blogspot.in/) రహ్మానుద్దీన్ గారి సహాయం తో సమావేశపు బ్యానర్ ని ఉంచాను . నా పేస్ బుక్ , గూగుల్ లో కూడా అందర్కి షేర్ లు చేస్తూ తెలియచేస్తున్నాను . నేను హైదరాబాద్ సమావేశం లో అందర్నీకలుసుకోబోతున్నందుకు చాల ఆనందంగా ఉంది .

ఇతర వికీ సభ్యులు కూడా అదేవిధంగా చేయగలిగితే తెలుగు వికీ చాలామందికి చేరువకగలదు అని నా అభిప్రాయం ---rajachandra(చర్చ)

  • rajachandra గారు బహు చక్కని ఆలోచన. ఆచరించి మరీ చూపించారు. తెవికీ మిత్రులు దీనిని గమనించి మన వికీ సమావేశం గురించి తమవంతు ప్రచారం చేయగలరని ప్రార్ధన. ప్రతి ఒక సభ్యుడు కనీసం ముగ్గురిని సమావేశానికి పంపినా 100-150 మంది అవుతారు కదా!! --విష్ణు (చర్చ)15:58, 1 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఫేస్ బుక్ అయితే మంచి పబ్లిసిటీ వస్తుంది. యువత ఎక్కువగా ఫాలో అవుతున్న మాధ్యమం కనుక అందులో ఎక్కువ ప్రచారం కల్పించాలి, బ్లాగుల్లో దీని గురించి పోస్ట్ పెట్టాలి. వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013, వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము రెండింటి లింకులు మెయిల్ ద్వారా తెలిసిన, తెలియకున్న అందరికీ పంపాలి...విశ్వనాధ్ (చర్చ) 05:50, 2 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

డైరెక్టుగా పై లింకులు పోస్ట్ అనే ప్లేసులో పేస్ట్ చేసేయండి. అదే తీసుకొంటుంది. ఇక్కడ చూడండి, మీ పేస్బుక్ పేజీలో Viswanath. Baysey కొట్టి చూడండి. నేను పెట్టాను..విశ్వనాధ్ (చర్చ) 06:36, 2 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తప్పకుండా చూస్తానండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:45, 3 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది చాలా త్వరగా అంతర్జాలం అంతా వ్యాపిస్తుంది. వికీపీడియాలోని సభ్యులందరూ తమకువున్న ఫేస్‌బుక్, ట్విట్టర్ లో ఈ విధంగా సమావేశం గురించి తమ నోటీస్ బోర్డులో పెట్ట్కుంటే వారి ద్వారా చాలా మందికి తెలుస్తుంది.Rajasekhar1961 (చర్చ) 15:13, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సమావేశ స్థలము

[మార్చు]

రావాలనుకునే రాబోవు సభ్యులకు ఇంకనూ, ఇప్పటికీ సమావేశ స్థలము ప్రస్తావించ పోతే, వారికి ఇంక సమయము సరిపడ లేదని "మనము" గ్రహించాలి. త్వరగా సమావేశ స్థలము పొందు పరిచితే మంచిది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:44, 3 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ, ఈ రోజు మన వ్యక్తిగత చర్చల ఫలితంగా వెను వెంటనే, అర్హులైన మీరు సమావేశ స్థలము పొందు పరిచినందులకు ధన్యవాదములు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:57, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రచార స్టిక్కర్లు

[మార్చు]

తెలుగు వికిపీడియా మరియు లోగోతో ఉన్న స్టిక్కర్లు (చిన్న, పెద్ద) ప్రచారమునకు సభ్యులకు, ఇతరులకు అందజేస్తే బహుళ ప్రచారము లభించ వచ్చును. స్పందించగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:43, 4 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వెన్న నాగార్జున గారి స్పందన

[మార్చు]

Nagarjuna Venna

Sujatha garu - just saw this email and I also saw that Arjun emailed me. I will try and coordinate with him.

Regards, Nagarjuna

శశి తరూర్ గారి తెలుగు వికీ మహోత్సవం గురించిన రీట్వీట్

[మార్చు]

శశి తరూర్ గారు తెలుగు వికీ మహోత్సవం గురించిన రీట్వీట్ ని ఈ లంకెలో https://twitter.com/vishnuvardhan_t/status/320437889718689793 చూడండి వాడుకరి:Visdaviva (చర్చ)13:40, 6 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కార్యక్రమ సూచిక

[మార్చు]

వివరణాత్మక కార్యక్రమ సూచికను చేర్చినందులకు అభివందనలు. మీడియా చర్చకు పేరును నేను చొరవతో జ్ఞానసమాజాభివృద్ధిలో వికీ,మీడియా పరస్పర సహకారం గా మార్చాను. ఇది ఇంతకు ముందు వాడిన పదం( సమాచార సేవలో )కన్నా మెరుగని భావిస్తాను ఎందుకంటే సమాచారం స్వల్పకాలిక విలువకలది. ఇక వికీ చైతన్యవేదికలో పాల్గొనేవారి వికీ వాడుక గురించిన అభిప్రాయాలకి సమయం కేటాయిస్తే బాగుంటుంది. వికీపీడియన్ల ప్రసంగాలు, అతిథుల ప్రసంగాలు కలగలుపు మెరుగుగావుండగలదు. --అర్జున (చర్చ) 01:02, 8 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కామన్స్ వద్ద చిత్రాలు

[మార్చు]

ఓ యాభై చిత్రాలు కామన్స్ లో చేర్చాను http://commons.wikimedia.org/wiki/Category:Telugu_Wikipedia_Mahotsavam వద్ద లభ్యం. రహ్మానుద్దీన్ (చర్చ) 05:41, 13 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రహ్మానుద్దీన్ గారు చేర్చిన బొమ్మలు మన తెవికీలో సంబంధిత పేజీలో గ్యాలరీగా చేయకపోతే అవి ఉపయోగపడక తొలగిస్తారేమోనని అనుమానమున్నది. ఆ పని ఎవరైనా చేరిస్తే బాగుంటుంది--అర్జున (చర్చ) 06:43, 20 అక్టోబర్ 2013 (UTC)

సమావేశం నిర్వహణనుండి నేర్చుకోగల అంశాలు

[మార్చు]

తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 ఆలోచనని ప్రతిపాదించి సభ్యుల మద్దతు కూడగట్టిన మల్లాది కామేశ్వరరావు గారికి, దీనిని నిర్వహించడంలో ముఖ్యపాత్రవహించిన రాజశేఖర్, రహ్మనుద్దీన్, తదితర కార్యనిర్వాహక సభ్యులకు, వీడియో సందేశాలు పంపిన వెన్న నాగార్జున గారికి,సందేశాలు పంపించిన తోటి సభ్యులకు, సర్వసభ్యసమావేశంలో అమెరికానుండి వీడియా సమావేశం ద్వారా పాల్గొన్న రవి వైజాసత్యకు, పాల్గొన్న సభ్యులందరికి, సహకారం అందజేసిన సిఐఎస్-ఎ2కే , వికీమీడియా, ధియేటర్ ఔట్రీచ్ యూనిట్ అధికారి పెద్ది రామారావు వారి సిబ్బందికి, ఆహ్వానాన్ని మన్నించి సమావేశానికి హాజరైన ప్రముఖులందరికి, మీడియాకు , సమావేశం విజయవంతం చేసినందుకు తోడ్పడ్డ ప్రతివారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమ మనందరిలో వికీపీడియా స్ఫూర్తిని మరింత పెంచి, తెవికీ అభివృద్ధికి సహాయపడుతుందని నేను విశ్వసిస్తాను.

దీనినుండి మనం పూర్తి లాభం పొందడానికి చేయవలసిన కొన్ని పనులు ముచ్చటిస్తున్నాను.

1)నివేదిక పూర్తిచేయటం వికీపీడియా:తెలుగు వికీపీడియన్ల విజయనామ ఉగాది సమావేశం 2013

2)వికీమీడియా ఇండియా, సిఐఎస్ బ్లాగులలో ఇంగ్లీషులో బ్లాగు రాయటం

3)ఈ కార్యక్రమం నిర్వహణప్రక్రియలో మనకు లోటు పాట్లని విశ్లేషించి ముందు సంవత్సరం నిర్వహణకు ఉపయోగపడేవిధంగా సూచనల జాబితా తయారుచేయటం.

నా ఆలోచన ప్రకారం కార్యక్రమ విశ్లేషణ

ధనాత్మకమైనవి.(+)

1) ముందస్తు సమావేశాల ద్వారా కార్యక్రమ నిర్వహణ సమీక్ష బాగుంది

2) ఫోన్ సమావేశాలు, అంతర్జాల ఏర్పాట్లు, ఆహర ఏర్పాట్లు, మెమెంటోలు, టీ షర్టులు, బయటినుండి వచ్చినవారికి వసతి ఏర్పాట్లు బాగున్నాయి.

౩) కార్యక్రమ సమయపాలన బలహీనం. కొన్ని కార్యక్రమాలు కుదించడం లేక రద్దుచేయడం జరిగింది


ఋణాత్మకమైనవి(-)

1) ఉగాది రోజు సమా‌వేశం జరుపుట అంత మంచిది కాదు. మీడియా వాళ్లదృష్టి ఇతర వుగాది కార్యక్రామాలపైన వుంటుంది. ముందు రోజు ఆది వారం కాకపోతే దూరం నుండి వచ్చే వారు, ఆఫీసు పని వల్ల హజరు సంఖ్య తగ్గుతుంది.

2) ముఖ్య అతిథులను ఆలస్యంగా ఖరారు చేయటం.

3) ఇతర భాషా మరియు మీడియా సంస్థలతో భాగస్వామ్యం లేకపోవడం

4)భాషా సంబంధిత వస్తు సేవల ప్రదర్శన లేకపోవడం. --అర్జున (చర్చ) 06:53, 18 అక్టోబర్ 2013 (UTC)

తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 ఖర్చులు CIS-A2K గ్రాంటు నుండి

[మార్చు]

తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 కి గాను ఈ క్రింది విధంగా CIS-A2K గ్రాంటు నుండి ఖర్చులు జరుపబడ్డాయి.

Sl.No Budget Item Planned Actuals
1 Food (8th-13th April, 2013) 50,000/- 19,900/-
2 Travel and Stay (community members) 80,000/- 62,984/-
3 Event logistics 30,000/- 36,940/-
4 Printing & Stationary 40,000/- 7,140/-
5 T-Shirts - 79,800/-
6 Internet Wi-Fi at the event (2 days) - 18,654/-
Total support extended 200,000/- 225,418/-

--విష్ణు (చర్చ)14:17, 11 డిసెంబర్ 2013 (UTC)

మెటాలో కూడా ఈ వివరాలు చేర్చబడ్డాయి. ఇక్కడ చూడండి --విష్ణు (చర్చ)05:05, 12 డిసెంబర్ 2013 (UTC)