వికీపీడియా చర్చ:2012 లక్ష్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2012 లక్ష్యాలపై చర్చ, మరింత సమాచారం.

తెలుగు టైపింగ్ పద్ధతుల స్థిరీకరణ (అన్ని వికీ ప్రాజెక్టులలో)[మార్చు]

వివిధ వికీ ప్రాజెక్టులలో ఉపయోగించే వేర్వేరు జావాస్క్రిప్టు టైపింగు పద్ధతులను తీసివేసి వికీమీడియా ప్రాజెక్టులన్నింటిలోనూ ఒకేలా నిలకడగా పనిచేసే టైపింగు పద్ధతి ఉండాలన్నది వికీమీడియా స్థానికీకరణ కమిటీ యొక్క యోచన. ఇందుకు గానూ నరయం అనే పొడగింతను అభివృద్ధి చేస్తున్నారు. తెవికీలో ఉన్న ప్రస్తుత పద్ధతిని తీసివేసి ఈ నరయం పొడగింతను స్థాపించాలని ప్రణాళిక. నరయంలో ప్రస్తుతం రెండు రకాల తెలుగు టైపింగ్ పద్ధతులు ఉన్నాయి. అవి (1) లిప్యంతరీకరణ, (2) ఇన్‌స్క్రిప్ట్. వీటిని తెవికీ మరియు ఇతర వికీ ప్రాజెక్టులలో అమలుచేయాడానికి, మీ అందరి సహకారం కావాలి.

సహాయం కావాలి![మార్చు]

ఈ టైపింగ్ పద్ధతులు ఇప్పుడు ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్ సైటులో పరీక్షించడానికి అందుబాటులో ఉన్నాయి. మీరు చెయ్యవలసిందల్లా…

  1. పరీక్షా పేజీకి వెళ్ళండి.
  2. వ్యాసం రాసే పెట్టెలో తెలుగులో టైపు చెయ్యండి. (ఎడిట్ పెట్టెలో తెలుగు రాకపోతే, పేజీలో కుడివైపు పైన ఉన్న Input Methods అన్న లంకెపై నొక్కి మీ అభిమత పద్ధతిని ఎంచుకోండి.)
  3. క్లిష్టమైన పదాలను టైపు చేసి చూడండి. టైపు చెయ్యగలుగుతున్నారా? టైపు చెయ్యడంలో ఏమైనా ఇబ్బందులూ, సమస్యలు ఉన్నా లేదా మీకు సందేహాలు ఉన్నా నా చర్చాపేజీలో అడగండి.

వీవెన్ 02:50, 4 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

నా గూగుల్+ పేజీలో దీనిపై నా అభ్యర్థనకు కొంత స్పందన వచ్చింది. ధ, ఢ, ఠ అక్షరాలను టైపు చెయ్యలేకపోతున్నాం. వీటిని నా వద్ద ఉన్న స్క్రిప్టులో సరిచేసాను. మరేమైనా లోపాలు ఉంటే తెలియజేయగలరు. —వీవెన్ 15:23, 11 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్లేషణ[మార్చు]

అర్జునరావు గారు మీ 2012 విశ్లేషణ బాగున్నది. అన్ని విషయాలు క్లుప్తంగా పేర్కొన్నారు.Rajasekhar1961 (చర్చ) 07:50, 24 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]