వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013 తెలుగు వికీపీడియా ప్రణాళిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వినతి[మార్చు]

సమయాభావం వల్ల తెలుగులోకి అనువదించ లేకపోయాను. మన్నించాలి. సభ్యులు చొరవ తీసుకొని తర్జుమా చేయ ఆత్మీయ నివేదన. విష్ణు (చర్చ)09:06, 1 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అచ్చు తప్పు సరి చేయ ప్రార్థన[మార్చు]

శీర్షికలో అచ్చు తప్పు పడింది. *ప్రణాలిక* బదులు *ప్రణాళిక* అని రాయబోయాను. తొందరలో చూసుకోలేదు. అధికారులు ఎవరైనా ఈ తప్పును సరి చేయగలరని ప్రార్థన. విష్ణు (చర్చ)12:57, 1 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సరిచేయబడింది.--అర్జున (చర్చ) 04:07, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా అభివృద్ధి ఆలోచనలు[మార్చు]

ప్రణాళిక వ్యాసం సమగ్రంగా వుంది. రూపొందించిన A2K జట్టుకి నా అభివందనలు. నా దృష్టిలో ప్రాధాన్యతల గురించి చిన్న వ్యాఖ్య ద్వారా తెలియచేస్తున్నాను. వికీపీడియా అభివృద్ధి కావాలంటే వ్యక్తులు, సంస్థలు, మూలభూతసౌకర్యాలు,పద్ధతులు మఖ్యము. కొన్నేళ్లక్రిందటతో పోల్చి చూస్తే చాలావాటిలో అభివృద్ధి వున్నా వికీ అభివృద్దితగినంత మేరలేదు. దీనికి కారణం కొన్నిటిలో కీలకమైన లోపాలుండటమే. నేను ముఖ్యంగా మూలభూత సౌకర్యాలలో కంప్యూటర్, ఇంటర్నెట్, విద్యుత్ఛక్తి సౌకర్యం లాంటివి ప్రక్కనపెడ్తే అందరికి అందుబాటులో వుండే డిజటల్ రూపంలో లభ్యమయ్యే పుస్తకాలు లేక ఇతర వనరులు లోటు ప్రధానం. ఇంగ్లీషుని గమనించినట్లయితే చాలా వనరులు సంస్థాపరంగా అందుబాటులో వున్నాయి. పత్రికలు కూడా వార్తలను శాశ్వతప్రాతిపదికన నెట్ లో అందుబాటులో వుంచుతున్నాయి. తెలుగు లో అలాజరుగుట లేదు. ఉన్న కొన్ని డిజిటల్ వనరులను మనం సమర్థవంతంగా వినియోగించలేదు. ఉదాహరణకు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో 22000పైగా పుస్తకాలున్నా వాటి వివరాలుకూడా ఇంగ్లీషులో వుండడంతో తెలుగు నెట్ వినియోగదారులకు అందుబాటులోకి రావటంలేదు. వీటిపై దృష్టిపెట్టి ఇవన్నీ అందుబాటులోకి వచ్చేటట్లు, పుస్తకం రూపంలో దింపుకొనుటకు, చదువుకొనుటకు ఆర్కీవ్.ఆర్గ్ లో వున్నంత సులభంగా వుండేటట్లు చేయాలి. ఇక అంతర్జాల పత్రికలు, దినపత్రికలలో కొన్ని శీర్షికలునెట్లో శాశ్వత ప్రాతిపదికన దినపత్రికలయాజమాన్యాలు వుంచుతున్నా మనం వాటిని వాడుకోవటంలేదు. తెలుగు వార్తాపత్రికల చదువరులసంఖ్య గణనీయంగా పెరుగుతున్నా వికీపీడియా పేజీ వీక్షణలు పెరగకపోవటానికి మనము సమకాలీన అంశాలపై వికీపీడియా వ్యాసాలు అంతగా లేకపోవటమే. దానికి సమిష్ఠికృషి కావాలి. క్రియాశీలసభ్యులు తక్కువగా వున్నందున సమిష్ఠి కృషి బలహీనంగా వుంది. డిజిటల్ వనరులను అందుబాటులోకి తెచ్చుట, వికీపీడియా చైతన్యాన్ని పెంచే దిశగా అవగాహన సదస్సులు రాష్ట్రమంతటా నిర్వహించడం, నెలకో రెండునెలలకో ప్రాధాన్యత గల అంశం పై సమిష్ఠికృషి చేయడం నా దృష్టిలో చాలా ముఖ్యం.--అర్జున (చర్చ) 04:07, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారు చాలా అమూల్యమైన సలహా ఇచ్చారు. డిజటల్ రూపంలో లభ్యమయ్యే పుస్తకాలు లేక ఇతర పరిశోధన వనరుల లోటు చాలా కొట్టొచ్చినట్టు కానవస్తుంది. ఖచ్చితంగా మీరు ప్రతిపాదించిన సూచనను చర్చించి కార్యాచరణ కావిద్దాం. మీ ఈ సూచనను సెక్షన్ 3.3.2 'పబ్లిక్ డొమైన్‌లో తెలుగు విషయములను సులభతరం చేయడం మేకింగ్' లో ఉంచడం జరిగిందని గమనించ ప్రార్ధన. --విష్ణు (చర్చ)16:27, 6 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Isn't this page needs to be placed under వికీపీడియా namespace? It is in main namespace (article) now. Please check this--Shiju Alex (చర్చ) 15:45, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Thanks for alert.It is fixed.--అర్జున (చర్చ) 22:48, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
Apologies, was creating this in a rather hurry. Thank you for pointing it out Shiju. Thank you Arjuna garu for doing the needful.-- విష్ణు (చర్చ)04:49, 6 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రణాళిక సలహా సమీక్షా సమితి[మార్చు]

మన ఈ తెలుగు వికీపీడియా వార్షిక ప్రణాళికను సభ్యులందరు చర్చించి నిర్ధారించిన తరవాత, ఈ ప్రణాళిక అమలును సమీక్షిస్తూ తదనుగుణంగా సలహాలివ్వటానికి 3-5 మంది సభ్యుల సమితి ఉండటం శ్రేయస్కరమని CIS-A2K జట్టు తలుస్తున్నది. దీని అర్ధం మిగతా సభ్యుల నుండి విమర్శనాత్మక సలహాలు స్వీకరించమని కాదు. ఈ సమితి ఒక periodic and focused engagement కు తోడ్పడుతుందని ఆలోచన. ఆసక్తి ఉన్న సభ్యులు తమ అంగీకారాన్ని వెళిబుచ్చగలిగితే చాలా సంతోషం --విష్ణు (చర్చ)16:52, 6 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విష్ణు గారూ, సలహా బావుంది. మన సభ్యులకు (కొంతమందికి అర్థం కాక పోవచ్చును) సమీక్షా సలహాలు, విమర్శనాత్మక సలహాలు అంటే అర్థవంతముగా అర్థమయ్యే విధముగా ముందుగా ఇక్కడే పొందు పరిచితే బావుంటుందేమోనని నా సలహా. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:19, 7 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారు మీ సలహా నూటికి నూరు పాళ్ళు సరైన సలహా. చాలా ధన్యవాదాలు. ఖచ్చితంగా CIS-A2K జట్టుది ఇదే ఉద్దేశం. అందుకనే మన తెవికీ సభ్యులందరు ఈ మన ప్రణాళికను సమీక్షించి సలహా సూచనల ద్వారా బల పరచాలనే ఆలోచనతోనే ఈ పేజి సృష్టించడం జరిగింది. కావున మీరు ఇచ్చిన సలహాను మనం ఇప్పటికే అమలు చేసాం అని అనుకుంటున్నాను. కావున ప్రతి సభ్యుని సలహా సూచనలు మీరన్నట్టుగా ఇక్కడే పొందు పరుస్తున్నాము కదా. ఐతే నేను పైన పొందుపరచిన వివరణ స్పష్టంగా లేదని మీ సలహా ద్వారా తెలియవచ్చింది. దాసున్ని క్షమించాలి. ఈ ప్రణాళిక సలహా సమీక్షా సమితి సభ్యులందరు చర్చించి నిర్ధారించిన ప్రణాళికను వచ్చే సంవత్సర కాలంపాటు periodic గా (బహుశా ప్రతి రెండు నెలలకోసారి) ఒక Advisory Committee లా CIS-A2K జట్టు వారితో మన ప్రణాళిక ఆచరణను సమీక్షించి, సలహాలు సూచనల ద్వారా ప్రణాళిక సాక్షాత్కారానికి దోహదపడుతుందని మా ఆలోచన. అందరు సభ్యులు దీనికి సమయం కేటాయించటం కష్టం కావున మీలాంటి అభిరుచి ఉన్న సీనియర్ సభ్యులు ఈ సమితి లో ఉంటే చాలా శ్రేయస్కరం. నా ప్రార్ధనను మీరు మిగతా సభ్యులు ఆలకించి సహకరిస్తారని ఆశిస్తున్నాను. --విష్ణు (చర్చ)16:12, 7 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
విష్ణుగారికి, నాకు తెలిసినంత వరకు, చేతయినంతలో జట్టు సభ్యులకు భాషాపరంగా సదుద్దేశ్యంతో సహాయ సలహాలు, సూచించి సూత్రీకరించిన పై కార్యక్రమములో తప్పకుండా సహాయపడ గలనని అనుకుంటున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 16:37, 7 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సంస్థాగత భాగస్వామ్యం[మార్చు]

దీనిలో తెలుగు అకాడమీ ని కూడా చేర్చడం న్యాయం కంపశాస్త్రి 00:29, 7 ఏప్రిల్ 2013 (UTC)

కంపశాస్త్రి గారికి నమస్కారం. మీ సలహాకి ధన్యవాదాలు. సంస్థాగత భాగస్వామ్యాలు కొత్త సభ్యులను పెంపొందించడానికి ఎంచుకున్న కార్యక్రమం. తెలుగు అకాడమీ ముఖ్యంగా తెలుగు భాష పరిశోధన, ఆధునీకరణ మరియు ప్రచురణ లాంటి కీలక అంశాలపై పని చేస్తుంది. కావున ఇది అంతగా కొత్త సభ్యులను పెంపొందించడానికి ఉపకరించదని నా ఆలోచన. ఒక వేళ నా ఆలోచన తప్పైతే నన్ను సరిచేయ ప్రార్ధన. తెలుగు అకాడమీ విషయవ్యాప్తీకరణంలో (3.3 సెక్షను చూడ మనవి) చాలా దోహదపడుతుందని నా నమ్మకం. ఈ నమ్మకంతోనే నేను వారిని పోయిన నెలలో సంప్రదించ ప్రయత్నించాను కాకపోతే మంచి స్పందన సంపాదించలేకపోయాను. మీ సహాయ సహకారాలతో ఈ విషయలో మంచి ప్రతిఫలం లభించవచ్చుననిపిస్తుంది. మనం తెవికీ సమావేశంలో కలిసినప్పుడు మీరు దీని గురించి వివరించగలిగితే మన తెవికీ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. --విష్ణు (చర్చ)17:35, 7 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]