విక్రం సిరికొండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విక్రం సిరికొండ
జననం (1977-07-20) 1977 జూలై 20 (వయసు 46)
జాతీయతభారతీయుడు
వృత్తిదర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత

విక్రం సిరికొండ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ దర్శకులు, స్క్రీన్ ప్లే రచయిత.

2014లో వ్చిన రేసుగుర్రం, 2011లో వచ్చిన మిరపకాయ్, 2009లో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు. తన మొదటి సినిమా కొంచెం ఇష్టం కొంచెం కష్టంకు 2009లో ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది అవార్డు అందుకున్నారు.

జీవిత సంగ్రహం

[మార్చు]

ఈయన తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్లో జన్మించారు. 1993లో తన కుటుంబంతో హైదరాబాద్కు వచ్చేశారు. విక్రానికి చిన్నతనం నుండే నటన, కథలు, మాటలు రాయడం వంటి వాటిల్లో నైపుణ్యం ఉంది. అనేక రంగస్థల నాటకాలు కూడా రాశారు. బెంగుళూర్ లోని బిఎంఎస్ కళాశాల నుండి ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించారు. ఢిల్లీ లోని ఆసియన్ అకాడమి ఆఫ్ ఫిల్మ్ అండ్ & టెలివిజన్ నుండి చిత్ర నిర్మాణంలో డిప్లొమా చేశారు.

సినీరంగ జీవితం

[మార్చు]

చదువు పూర్తయిన తర్వాత, వి. వి. వినాయక్ దర్శకత్వం వహించిన ఠాగూర్ సినిమాకు సహ దర్శకుడిగా చేరారు. సాంబ, బన్నీ సినిమాలకు సహ దర్శకుడిగా పనిచేసి, వివి వినాయక్ వద్ద సినిమా నిర్మాణంలో మెళకువలు తెలుసుకున్నారు. 2006లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన స్టైల్ సినిమాకు ప్రథమ సహాయ దర్శకుడిగా చేరారు.

2014లో వ్చిన రేసుగుర్రం, 2011లో వచ్చిన మిరపకాయ్, 2009లో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు. 2017లో రవితేజ హీరోగా టచ్ చేసి చూడు అనే సినిమాను దర్శకత్వం అహించబోతున్నారు.[1]

చిత్రసమహారం

[మార్చు]
సంవత్సరం చిత్రంపేరు నటీనటులు విభాగం
2003 ఠాగూర్ చిరంజీవి, శ్రేయ, జ్యోతిక అసోసియేట్ దర్శకులు
2004 సాంబ జూనియర్ ఎన్టీయార్, జెనీలియా, భూమిక అసోసియేట్ దర్శకులు
2005 బన్నీ అల్లు అర్జున్, గౌరీ ముంజల్, ప్రకాశ్ రాజ్ అసోసియేట్ దర్శకులు
2006 స్టైల్ రాఘవ లారెన్స్, ఛార్మీ కౌర్ ప్రథమ అసోసియేట్ దర్శకులు
2009 కొంచెం ఇష్టం కొంచెం కష్టం సిద్ధార్థ, తమన్నా స్క్రీన్ ప్లే రచయిత
2011 మిరపకాయ్ రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్ స్క్రీన్ ప్లే రచయిత
2014 రేసుగుర్రం అల్లు అర్జున్, శృతి హాసన్ స్క్రీన్ ప్లే రచయిత
2015 కేరింత సుమంత్ ఆశ్విన్, విశ్వంత్, పార్వతీశం, శ్రీదివ్య, సుక్రితి ప్రత్యేక కృతజ్ఞతలు
2017 టచ్ చేసి చూడు రవితేజ, లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నా దర్శకులు

అవార్డులు

[మార్చు]
  1. నంది అవార్డు - ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత -కొంచెం ఇష్టం కొంచెం కష్టం - 2009
  2. అక్కినేని కుటుంబం చిత్రం అవార్డు - ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత -కొంచెం ఇష్టం కొంచెం కష్టం - 2009

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ. "మరోసారి పోలీస్‌ ఆఫీసర్ గా రవితేజ !". Archived from the original on 6 అక్టోబరు 2016. Retrieved 9 February 2017.