విక్రమశిల విశ్వవిద్యాలయం
?విక్రమశిల Vikramaśīla బీహార్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 25°19′28″N 87°17′12″E / 25.3244°N 87.2867°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
సమీప నగరం | భగల్‌పూర్ |
కోడులు • ప్రాంతీయ ఫోన్ కోడ్ |
• +0641 |
బౌద్ధ |
పర్యాటక ప్రాంతాలు |
---|
ప్రముఖ బౌద్ధ స్థలాలు |
లలితగిరి
|
పాల సామ్రాజ్యకాలంలోని, రెండు ప్రముఖమైన బౌద్ధ అభ్యాసకేంద్రాలలో ఒకటి నలందా విశ్వవిద్యాలయం కాగా రెండవది ఈ విక్రమశిల విశ్వవిద్యాలయం. నలందా విశ్వవిద్యాలయంలోని పండితుల నాణ్యత పడిపోతూ ఉండుటవల్ల, పాలవంశపు రాజు ధర్మపాలుడు (783-820) విక్రమశిలని స్థాపించాడు. ఇక్కడి పండితులలో ముఖ్యమైనవాడు అతిషుడు.
ప్రస్తుత బీహార్ రాష్ట్రంలోని భగల్‌పూర్ 50 కి.మీ దూరంలో అంతిచక్ గ్రామం ఉన్న స్థలమే ఒకప్పటి విక్రమశిల విశ్వవిద్యాలయం.
చరిత్ర
[మార్చు]పాలవంశరాజుల కాలంలో ప్రాచీన వంగ, మగధ ప్రాంతాలలో ఎన్నో బౌద్ధ మఠాలు వెలిసాయి. టిబెట్‌వారి సమాచారం ప్రకారం, ఆ కాలంలో ఐదు మహావిహారాలుండేవి. మొదటిదైన విక్రమశిల ఆ కాలంనాటి అత్యున్నతమైనది కాగా, నాలందా పాతదైపోయినప్పటికీ వెలుగులీనుతూనే ఉంది. మిగిలినవి సోమపుర, ఓదంతపుర, జగ్గదల లు.
పాలవంశపు రాజు ధర్మపాలుడు (783-820) విక్రమశిలని స్థాపించినప్పటి నుండి 12వ శతాబ్దంలో భక్తియార్ ఖిల్జీ అనేక బౌద్ధ కేంద్రాలతో బాటు దీనిని కూడా ధ్వంసం చేసేవరకూ వెలుగొందింది. మనకు విక్రమశిల గురించిన సమాచారం కేవలం టిబెట్ వారి వద్దనే లభ్యమౌతోంది. అందులో ముఖ్యమైనవి క్రీ. శ 16-17 శతాబ్దాలనాటి తారనాథుడనే టిబెట్ సన్యాసి రచనలు.
100మందికి పైగా అచార్యులతోనూ, 1000కిపైగా విద్యార్థులతోనూ విక్రమశిల అతి పెద్ద బౌద్ధ విశ్వవిద్యాలయం. బౌద్ధ అభ్యాసం, సంస్కృతి, మతం ప్రచారం చేసేందుకు ఇక్కడి పండితులకు విదేశాలనుండి కూడా అహ్వానాలోస్తూ ఉండేవి.
సంస్థ
[మార్చు]విక్రమశిల తక్కిన విశ్వవిద్యాలయాకంటే స్పష్టమైన అధికార క్రమాన్ని కలిగి ఉండేదని, సుకుమార్ దత్త్ వంటివారి అభిప్రాయం.
- అధ్యక్షుడు
- ద్వారపాలకుడు లేదా ద్వారపండితుడు (ద్వారాలు ఆరు. అవి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, మొదటి మద్యం, రెండవ మద్యం)
- మహాపండితుడు
- పండితుడు (సుమారుగా 108 మంది)
- ఉపాధ్యాయులు లేదా అచార్యులు (పండితులతో కలిపి 160మంది)
- భిక్షువులు (సుమారుగా 1000మంది)
ఇచ్చట విద్యాభ్యాసము ముగించినవారికి రాజులు 'పండిత ' అని బిరుదునిచ్చి గౌరవించుచుండిరి. రత్నవ్రజ, జేతారి, ద్వీపంకర, రత్నకీర్తి, జ్ఞానశ్రీమిత్ర, రత్నాకరశాంతి మున్నగువారీ పండితులలో అగ్రగణ్యులు. విక్రమశిలావిద్యాపీఠమున ఆరుద్వారములుండెడివి. వానివద్ద దిగ్దంతులగు పండితులుండెరి. వీరిలో ప్రజ్ఞాకరమతి అనునాతడు దక్షిణద్వారమున, రత్నాకరశాంతి ప్రాగ్ద్వారమును, వాగీశ్వరకీర్తి ఉతారద్వారమును నొకప్పుడు రక్షించుచుండెరని తారానాధుడనే చరిత్రకారుడు వ్రాసియున్నాడు. ఈ ఆరు ద్వారములకు ఎదురుగా ఆరు విశాలమగు కళాశాలలుండెడివి. ఒకో కళాశాలలో నూటయెన్మండు ఉపాధ్యాయులుండిరి. ఇదిగాక దీని అంతర్భాగమున ఒకేసారిగ యెనిమిదివేలమంది ఉపాసకులు నిల్చుటకు సరియగు స్థలము ఉండేడిదట. ఈ విద్యాపీఠము చుట్టునూ గల గోడపై సింహద్వారమునకు దక్షిణ పార్స్వమున నాగార్జునియొక్కయు, ఉత్తరపార్స్వంబున దతిశుని యొక్కయు చిత్రములు వ్రాయబడియున్నవి. ఈవిధముగ పండితశిఖామణులిచ్చట బహూకరింపబడుచుండెరి.
బౌద్ధ తంత్రమునకు ఈ విశ్వవిద్యాలయము విశేషవిఖ్యాతి వహించి యుండెను. సా.శ.5 వ శతాబ్దమున ఇంద్రజాలాదికములతో గూడిన తంత్ర శాస్త్రము బౌద్ధులలో ప్రబలి 8, 10 వ శతాబ్దములలో విశేషముగ అభివృద్ధి చెందినది. ఏకేశ్వరాత్మకమగు మహాయాన బౌద్ధమున ఈ శక్త్యారాధమగు ఈ తంత్ర విద్య చేర్చారు. వ్యాకరణ, వేదాంత, తర్కశాస్త్రమలు పిమ్మట పేర్కొన వలసిన విషయములు. నాలందా విద్యాపఠమునకు పిమ్మట విశేషఖ్యాతిని గాంచిన ఈ విద్యాపీఠము తుదకు భక్తయార్ ఖల్జీచే నాశనమొనర్పబడెను.[1]
వాస్తు, త్రవ్వకాలు
[మార్చు]విశ్వవిద్యాలయ శిథిలాలలో కొన్నిటిని మాత్రమే ఇప్పటివరకూ తవ్వకాలలో బయట పడ్డాయి.
స్థూపం
[మార్చు]చేరడం ఎలా..?
[మార్చు]దగ్గర్లోని పెద్ద పట్టణం కహాల్‌గావ్ 13కి.మీ దూరంలో ఉంది. భారతీయ రైల్వే ఢిల్లీ నుండి భగల్‌పూర్‌కి నెం2367/2368 విక్రమశిల ఎక్స్‌ప్రెస్ ని కూడా నడుపుతోంది.
విశేషాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- Vikramshila Mahotsav
- Bihar Government Tourism Department
- Vikramshila page Bhagalpuronline Archived 2011-09-10 at the Wayback Machine
- A visit to Vikramasila
- Vikramshila Guide
మూలాలు
[మార్చు]- ↑ Bharati [1933] samchika