Jump to content

విక్రమ్‌సిన్హ్ బాలాసాహెబ్ సావంత్

వికీపీడియా నుండి
విక్రమ్‌సిన్హ్ బాలాసాహెబ్ సావంత్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - 2024
తరువాత గోపీచంద్ పదాల్కర్
నియోజకవర్గం షహదా

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

విక్రమ్‌సిన్హ్ బాలాసాహెబ్ సావంత్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జాట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

విక్రమ్‌సిన్హ్ సావంత్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జాట్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి విలాస్‌రావ్ నారాయణ్ జగ్తాప్ చేతిలో 17,698 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2019 మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి విలాస్‌రావ్ నారాయణ్ జగ్తాప్ పై 34,379 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

విక్రమ్‌సిన్హ్ సావంత్ 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోపీచంద్ పదాల్కర్ చేతిలో 38,240 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  2. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in English). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  4. Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Jat". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.