విపణీకరణ

వికీపీడియా నుండి
(విక్రయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
This article incorporates information from this version of the equivalent article on the English Wikipedia.
"విపణీకరణ" ఒక మహాసముద్రం వంటిది. "అమ్మకాలు" అందులో ఏర్పడిన మంచుముద్ద యొక్క మొన మాత్రమే!

—విపణీకరణకీ, అమ్మకాలకి మధ్య భేదాన్ని వివరించేందుకు డా. ఫిలిప్ కోట్లర్ ఎంచుకొన్న ఉపమానం

విపణీకరణ అనేది వ్యక్తులు మరియు సంఘములు, వాటి యొక్క ప్రస్తుత మరియు ఆవిష్కృత అవసరాలను మరియు కోరికలను తృప్తి పరచుకోగలిగే, ఇతరుల ఉత్పత్తి చేయబడే ఉత్పత్తులు మరియు అందించబడే సేవలను కనుగొనే సమీకృత సమాచార ఆధారిత పద్ధతి.

అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారి నిర్వచనం ప్రకారం విపణీకరణ అనునది వినియోగదారులకు, కక్షిదారులకు, భాగస్వాములకు చివరిగా సంఘమునకు ఉపయోగపడే సృజనాత్మక భావప్రసార పంపిణి మరియు వినిమయ సంబంధిత కృత్యముల, సంస్థల సముదాయము.[1] విపణీకరణ అనే పదం దాని సహజ అర్థము విపణిలో వస్తువులను లేదా సేవలను కొనడం లేదా అమ్మడం అనే ప్రక్రియ నుంచి ఆవిర్భవించింది.

ప్రపంచంలో విపణీకరణకి సంబంధించిన అతి పెద్ద సంస్థ అయిన ఛార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మార్కెటింగ్ వారి నిర్వచనంలో విపణీకరణ అనునది వినియోగదారుల అవసరాలను గుర్తించి, ఊహించి మరియు తృప్తి పరిచే లాభయుక్తమైన నిర్వహణా పద్ధతి.[2]

గతంలో విపణీకరణని ప్రకటనలు, పంపిణి మరియు అమ్మకములతో కూడిన ఒక సృజనాత్మక పరిశ్రమగా భావించేవారు. ప్రస్తుతం విపణీకరణలో సాంఘిక, సామాజిక, మనో వైజ్ఞానిక శాస్త్రం, ఆర్థిక మరియు గణిత శాస్త్రములను, న్యూరో సైన్సు లను విస్తృతముగా ఉపయోగిస్తున్నందువలన దానిని ఒక ప్రత్యేక శాస్త్రంగా గుర్తించి అనేక విశ్వవిద్యాలయాలు విపణీకరణలో స్నాతకోత్తర (మాస్టర్స్ స్థాయిలో ఉన్నత) పట్టాను అందచేస్తున్నాయి. ఈ ప్రక్రియ విపణీకరణ పరిశోధనతో మొదలై విపణి విభాగీకరణ, వ్యాపార ప్రణాళిక మరియు నిర్వహణల ద్వారా అమ్మకముల వృద్ధి చేసే ఆది మరియు అంత్య ప్రక్రియలతో అంతమవుతుంది. ఇది అనేక సృజనాత్మక కళలతో సంబంధం కలిగి ఉంది. అంతేకాక మారుతున్న కాలము మరియు సంస్కృతులకు అనుగుణంగా విపణీకరణ సాహిత్యం తనకు తాను నవీకరించుకొనుటలో ప్రసిద్ధి చెందింది.

ఒక వ్యవస్థ దృక్కోణంలో చూసినపుడుఅమ్మకపు ప్రక్రియ అనేది ఒకదానికొకటి అనుసంధానించబడి మరియు ఆధారపడి సాపేక్షంగా ఆధునిక దృక్పథంతో అభివృద్ధి పరచుకో గలిగిన వివిధ ప్రక్రియల[3] సముదాయం.

నాలుగు "P" లు[మార్చు]

1960 ల ప్రథమ భాగంలో ప్రొఫెసర్ నీల్ బోర్డెన్, హార్వార్డ్ బిజినెస్ స్కూల్ వారు వినియోగదారుల వస్తు మరియు సేవల కొనుగోలును ప్రభావితం చేయగల సంస్థాగత చర్యలను గుర్తించారు. సంస్థాగత చర్యలన్నీ విపణీకరణ మిశ్రమాన్ని ప్రతిబింబించాయని బోర్డెన్ సూచించారు. అదే సంస్థకు చెందిన ప్రొఫెసర్ ఈ. జెరోమే మేక్ కాథి, కూడా విపణీకరణ మిశ్రమం నాలుగు అంశాలు కలిగి ఉంటుందని ప్రతిపాదించారు. అవి Product (ఉత్పాదన), Price (ధర), Place (స్థానము) మరియు Promotion (వృద్ధి).

 • ఉత్పత్తి: ఉత్పత్తి అనేది అసలు అందించవలసిన వస్తు, సేవల స్పష్టతను మరియు అవి అంతిమ వినియోగదారుల అవసరాలను, కోరికలను ఏ విధంగా తీరుస్తాయనేదే విపణీకరణ పరిగణించే ప్రాథమిక అంశం. ఉత్పత్తి పరిధిలో దానికి పరిపుష్టినిచ్చే గారంటీలు, వారంటీలు ఆధారభూతాలవుతాయి.
 • ధర: తగ్గింపులతో కలిపి ఒక వస్తువు యొక్క ధర నిర్ణయం దీని పరిధి లోకి వస్తుంది.ధర కేవలం ద్రవ్య రూపంలోనే ఉండనక్కరలేదు. అది వస్తు లేదా సేవల వినిమయముగా ఉండవచ్చు. ధర నిర్ణయ పద్ధతులు ధర నిర్ణాయక శాస్త్ర పరిధిలో నిర్ణయించబడతాయి.
 • స్థానం [లేదా పంపిణి]: ఉత్పత్తి వినియోగదారుని చేరడానికి సంబంధించిన అంశం. ఉదా: అమ్మకపు స్థానం లేదా చిల్లర వర్తకం. ఏ మాధ్యమం ద్వారా ఉత్పత్తి లేదా సేవ అమ్మబడుతుందో (ఆన్లైన్ లేదా రిటైల్ ), ఏ ప్రాంతం లేదా పరిశ్రమ , ఏ సమూహం (యువ వయస్కులు, కుటుంబాలు, వ్యాపార వర్గాలు) మొదలయినవి స్థానం . ఏ పరిసరాలలో ఉత్పత్తి అమ్మబడుతున్నది అన్నది కూడా అమ్మకాలను ప్రభావితం చేస్తుంది.
 • వృద్ధి : దీనిలో ప్రకటనలు, అమ్మకాల వృద్ధి ,ప్రచారం, అమ్మకాలు చేరి ఉంటాయి. ఉత్పత్తి, బ్రాండ్, కంపెనీల వృద్ధికి చెందిన వివిధ పద్ధతులను బ్రాండింగ్ అనవచ్చు.

ఈ నాలుగు అంశాలను కలిపి తరచువిపణీకరణ మిశ్రమంగా వ్యవహరిస్తారు[4]విక్రయ ప్రణాళికరచనకు విక్రేత దీనిని ఉపయోగించవచ్చు.

చౌక ధరల వినియోగ ఉత్పత్తులను విపణీకరణ చేయునపుడు ఈ నాలుగు Pల మోడల్ బాగా ఉపయోగ పడుతుంది. పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలు, ఖరీదైన వినియోగ ఉత్పత్తుల వంటి వాటిని విపణీకరణ చేయునపుడు ఈ నాలుగు P ల మోడల్ లో స్వల్ప మార్పులు అవసరమవుతాయి. సేవల ప్రత్యేక స్వభావానికి సేవల విపణీకరణ బాధ్యత వహిస్తుంది.

గొలుసుకట్టు నిర్వహణతో కూడిన దీర్ఘకాలిక పంపిణీ గొలుసు ఒప్పందాలకు పారిశ్రామిక లేదా B2B విక్రయం బాధ్యత వహిస్తుంది. వ్యక్తిగత వ్యవహారాల పరిమితి కంటే దీర్ఘకాలిక సంబంధాల దృష్టిలో విపణీకరణ చేయుటకు సంబంధ విపణీకరణ ప్రయత్నిస్తుంది.

దీనికి విరుద్ధంగా Morgan, తన Riding the Waves of Change (Jossy-Bass,1988),లో నాలుగు P ల మోడల్ ముఖ్యమైన పరిమితిని ఈ విధంగా చెప్పారు. "విపణీకరణ యొక్క సారాంశము బాహ్య విధానము నుండి అంతర్గత విధానము (విపణి నుండి సంస్థ వైపు)గా కావలసి ఉండగా దీనికి విరుద్ధంగా అంతర్గత దృష్టి నుండి బాహ్య దృష్టిని (సంస్థ నుండి విపణి వైపుగా) ప్రతిపాదిస్తుంది.

ఉత్త్పత్తి[మార్చు]

బ్రాండింగ్[మార్చు]

ఒక ఉత్పత్తిని ఇతర పోటీ ఉత్పత్తుల నుండి స్పష్టంగా గుర్తించేటట్లు ఉండే ఒక పేరు లేదా పదము లేదా నమునా లేక గుర్తుని ముద్రానామం (Brand) అని చెప్పవచ్చు. ముద్రానామం అనేది ఒక సంస్థతో, ఉత్పత్తితో లేదా సేవతో వినియోగదారుని అనుభవానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ముద్రానామాన్ని కేవలం ఒక గుర్తు లేదా ఒక పేరు లేదా ఒక నమునాగా చెప్పలేము. ముద్రానామం ఒక సంస్థ యొక్క సంస్థాగత సంస్కృతి (Organisational Culture) అయిన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

క్రియాత్మకంగా కానీ, అచేతనంగా కానీ చేయబడి, ప్రామాణిక నిబద్ధ ఆధారిత వాగ్దానాలను గుర్తించగలిగే ఒక ఉనికిగా ముద్రానామాన్ని చెప్పవచ్చు.

మనసులో ఉన్న కొన్ని నిర్దిష్ట ఉత్పత్తుల వివరములను సృజింపచేసేదే ముద్రీకరణ (Branding).

సహ-ముద్రీకరణ అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉత్పత్తులతో కూడిన విపణీకరన ప్రక్రియ.

విపణీకరణ సమాచారము[మార్చు]

విపణీకరణ సమాచారము, విపణీకరణ సందేశాలతో కూడిన వ్యూహాలను ఛేదించి వాటి యొక్క లక్ష్యాల ఆధారంగా ప్రతి సందేశాన్ని విభజిస్తుంది. అపరిచిత వ్యక్తులను వినియోగదారులుగా మలచటంలో ఉపయోగించే సమాచార మాధ్యమంలో వివిధ దశలు ఉన్నాయి.

ప్రకటనలు[మార్చు]

 • భావ వృద్దికి మరియు ప్రజా సమర్పణకు చెల్లింపు పద్ధతి
 • సమూహాలను ఉద్దేశించినది
 • ప్రకటన ఏ విధంగా ఉండాలో తయారిదారుడే నిర్ణయించు కొనవచ్చు
 • అవ్యక్త పరివ్యాప్త మాధ్యమం

ప్రభావాత్మక ప్రకటనల యొక్క విధులు మరియు ఉపయోగాలు[మార్చు]

 • అమ్మకందారుని పనిని సులభతరం చేయటం
 • అమ్మకాలను గరిష్ఠంగా పెంచటం
 • ప్రచారం
 • ముద్రానామ నిర్మాణం
 • జాగరూకత కలిగించడం
 • వినియోగదారుని ఆమోదాన్ని పొందటం
 • నూతన ఉత్పత్తులను ప్రవేశ పెట్టడం
 • విపణి నాయకత్వానికి సానుకూల పరచడం
 • పోటీని ఎదుర్కోవడం
 • మార్పులను తెలియచేయడం
 • పోటీదారుల ప్రకటనలకు ప్రతిస్పందించడానికి
 • సౌహార్దాన్ని పెంచుకోవడానికి

ఉద్దేశ్యములు[మార్చు]

 • ప్రముఖ వస్తువుల గిరాకీని స్థిరీకరించడం
 • నూతన మరియు తెలియని వస్తువులను ప్రవేశ పెట్టడం
 • ప్రముఖ వస్తువుల/ఉత్పత్తుల/సేవల గిరాకీని పెంపొందించటం

మంచి ప్రకటన యొక్క అపేక్షితాలు[మార్చు]

AIDA సూత్రము ఏకాగ్రత (Attention), ఆసక్తి(interest), కోరిక (Desire), క్రియ (Action)

 • ఏకాగ్రతను ఆకట్టుకోవడం(జాగరూకత)
 • ఆసక్తిని రగిలించటం
 • కోరికను పాదుకొల్పడం
 • క్రియాశీలతను కలిగించటం (వస్తువు కొనుగోలుకు)

ప్రకటనోద్యమానికి ఎనిమిది సూత్రాలు[మార్చు]

 • విపణీకరణ పరిశోధన
 • లక్ష్యాలను నిర్దేశించుకోవటం
 • ఆర్ధిక ప్రణాళిక
 • మాధ్యమ ఎంపిక(టెలివిజన్, వార్తాపత్రికలు/వార పత్రికలు, రేడియో, వెబ్,అవుట్ డోర్)
 • నటుల మరియు క్రీడాకారుల ఎంపిక (నూతన పోకడ)
 • మాడల్ మరియు మాటల పొందిక
 • సమన్వయము
 • శోధన ఫలితాలు

వ్యక్తిగత అమ్మకాలు[మార్చు]

కొనుగోలు శక్తిగల వ్యక్తుల లేదా వినియోగదారుల సమూహాలను అమ్మకందారుడు కలసినపుడు ఇవ్వదగిన మౌఖిక ప్రదర్శన:

 • ఉత్సాహభరిత, పరస్పర సంబంధం
 • వ్యక్తిగత శ్రద్ధ
 • ఏకాగ్రత మరియు ప్రతి స్పందన
 • ఆసక్తికరమైన సమర్పణ
 • స్పష్టత మరియు పరిపూర్ణత

అమ్మకాల వృద్ధి[మార్చు]

ఉత్పత్తుల కొనుగోలు పెంచుటకు స్వల్పకాలిక ప్రేరణలు:

 • తక్షణ విజ్ఞాపన
 • అమ్మాలనే ఆత్రుత

ఒక సేల్ లేదా కూపన్లని ఉదాహరణగా చెప్పవచ్చు. ఇవి ప్రజలలో తక్షణ కొనుగోలుకు ప్రేరణ కలిగించవచ్చు. కానీ వినియోగదారుల విశ్వాసాన్ని, భవిష్యత్ లో మళ్ళీ కొనుగోలును ప్రోత్సహించలేవు. అమ్మకపు వృద్ధి లోని ఈ వ్యూహాలు పోటీదారులచే తేలికగా అనుకరింపబడటం ఒక పెద్ద లోపం. ఒక నిలకడ కలిగిన విభిన్నవ్యూహంగా దీనిని ఉపయోగించలేము.

పౌర సంబంధాల విపణీకరణ (Marketing of Public Relations)[మార్చు]

 • అనుకూలమైన పత్రికా ప్రకటనల ద్వారా ఒక ఉత్పత్తి పట్ల గిరాకీ ఉద్దీపన
 • అత్యధిక విశ్వసనీయత
 • ప్రభావాత్మక వార్తలు
 • సంస్థ స్వరూపానికి సంపుష్టినిచ్చేది

వినియోగదారు కేంద్రీకృత విధానం[మార్చు]

అనేక కంపెనీలు నేడు వినియోగదారుని కేంద్రీకృతంగానో లేదా విపణి కేంద్రీకృతంగానో ఉన్నాయి. ఈ విధానంలో సంస్థ తన కార్యక్రమాలను మరియు ఉత్పత్తులను వినియోగదారుల గిరాకీలను బట్టి నిర్ణయిస్తుంది. సాధారణంగా దీనిని మూడు విధాలుగా చేయవచ్చు. వినియోగదారు నిర్ణాయక పద్ధతి, మార్కెట్ మార్పులు గుర్తించే స్పృహ మరియు నూతన ఉత్పత్తుల విధానం.

వినియోగదారు నిర్ణాయక పద్ధతిలో వినియోగదారుని కోరికలే విపణి వ్యూహాత్మక నిర్ణయాలను నడిపిస్తాయి. వినియోగదారుని పరిశోధనలో ఉత్తీర్ణత పొందనిదే ఏ వ్యూహము అనుసరింపబడదు. ప్రతి మార్కెట్ సమర్పణ, ఉత్పత్తి యొక్క స్వభావంతో సహా కనుగోలు శక్తిగల వినియోగదారుల అవసరాలచే నిర్ణయింప బడుతుంది. ఎల్లపుడు వినియోగదారుడు ఆరంభ బిందువై ఉంటాడు. ఈ విధానంలో ముఖ్య సూత్రం వినియోగదారు కొనుగోలు చేయని వస్తువులపై పరిశోధన మరియు అభివృద్ధిలో చేయు వ్యయాన్ని అరికట్టడం. సాంకేతికంగా అధ్భుతాలైన ఎన్నో ఉత్పత్తులు వ్యాపారాత్మకంగా విఫలమవటానికి చరిత్ర సాక్షీ భూతంగా నిలిచింది[5]

వినియోగదారు కేంద్రీకృత విక్రయంలో ఒక సాధారణ విధానాన్నిSIVA [6] గాపిలుస్తారు .[పరిష్కారం (Solution), సమాచారము(Information), విలువ (value), పరిచయం (access). వినియోగదారుని కేంద్రీకృతం చేయుటకు చెప్పబడిన ఈ పద్ధతి పైన తెలిపిన నాలుగు P ల విధానములో మాటలమార్పు మరియు పేరు మార్పు.

విపణీకరణ నిర్వహణ యొక్క చిరపరిచితమైన నాలుగు P ల పంపిణి ఆధార మోడల్ కు ప్రత్యామ్నాయంగా వినియోగదారు/డిమాండ్ కేంద్రీకృత విధానాన్ని SIVA మోడల్ అందిస్తుంది.

ఉత్పత్తి ఫలితం
వృద్ధి సమాచారం
ధర విలువ
స్థానం పరిచయం

SIVA మోడల్ లోని నాలుగు అంశములు ఈ విధంగా ఉన్నాయి:

 1. పరిష్కారం: వినియోగదారుని అవసరానికి లేదా సమస్యకు పరిష్కారం ఎంతవరకు ఉపయోగ పడగలదు?
 2. సమాచారము: వినియోగదారునికి పరిష్కారం గురించి తెలుసా? తెలిస్తే ఎవరిద్వారా లేదా ఎలా వారి కొనుగోలు నిర్ణయం ప్రభావితమైంది?
 3. విలువ: వినియోగదారునికి ఈ వ్యవహారం ఎంత విలువ కలది, దాని ధర, ఉపయోగాలు, వారు ఖర్చు చేయవలసిన విషయాలు, వారు పొందగలిగే ప్రయోజనం గురించి తెలుసా?
 4. పరిచయం: వినియోగదారుడు ఫలితాన్ని లేదా ఉత్పత్తిని ఎక్కడ పొందగలడు? ఎంత సులభంగా/స్థానికంగా/దూరంగా వస్తువును కొనగలరు మరియు పొందగలరు?

ఈ మోడల్ చేకిటాన్ దేవ్ మరియు డాన్ షుల్త్జ్ లచే American Markఎting Association వారి మార్కెటింగ్ జర్నల్ లో ప్రతిపాదించబడి UKలో మార్కెటింగ్ సొసైటీకి చెందిన మార్కెట్ లీడర్ అనే సంచికలో ప్రచురించబడింది.

ఉత్పత్తి కేంద్రీకృతం[మార్చు]

నూతన ఉత్పత్తి విధానంలో సంస్థ ముందుగా నూతన ఉత్పత్తిని ఆవిష్కరించి, ఆ నూతన ఉత్పత్తి అభివృద్ధికి ప్రయత్నం చేస్తుంది. నూతన ఉత్పత్తి మరియు పరిశోధన ప్రాథమికంగా లాభదాయకమైన మార్కెట్ వర్గాల అస్తిత్వంతో నడిపింప బడుతుంది. వినియోగదారులకు భవిష్యత్ ఉపలబ్ధత గురించి తెలియదు కనుక వారు భవిష్యత్ లో ఏమి కొంటారనేది వారి వద్ద నుండి ఆశించలేము. కాని ఈ ప్రత్యేక మార్కెట్ వర్గాలు అతి మూలధనీకరణతో అణచివేత ధోరణిని అవలంబించే అవకాశం ఈ నూతన ఉత్పత్తి విధానంలో ఉంది. ఈ నూతన ఉత్పత్తి విధానాన్ని అనుసరించడంలో విక్రేతలు వివిధ రకాల మరియు బహుళ-అంచెల విధానమును అవలంబించవలసి ఉంటుంది. పరిశోధన మరియు అభివృద్ధి పై దృష్టిని కేంద్రీకరించే కంపెనీల వంటి అనేక సంస్థలు, నూతన ఉత్పత్తుల విధానాన్ని విజయవంతంగా అవలంబించగలవు. వినియోగదారుల అవసరాల పరిశోధనను దృష్టిలో పెట్టుకొని ఈ విపణి కేంద్రీకృత విధానం ఒక నిజమైన విపణీకరణ విధానమేనా అని కొందరు సాంప్రదాయవాదుల సంశయం.

ఇటీవల రోమ్ లో జరిగిన ఒక సమావేశంలో ఉన్నది లేనట్లుగా అనుసరించు మానవ ప్రవర్తన గురించి ది ఎకనోమిస్ట్ లో ఈ విధంగా ప్రచురించారు[7] ఇది ప్రజలు ప్రేరణాత్మక కొనుగోలు అధికం చేయుటకు "మంద స్వభావం ద్వార అధిక కొనుగోలు" గురించి చర్చించింది. ప్రజలు ప్రముఖంగా కనిపించే ఉత్పత్తులను ఎక్కువగా కొంటారనేది దీని ఆధార భావన మరియు అనేక పరిపుష్టి విధానాలుద్వార ఉత్పత్తుల ప్రాముఖ్యత సమాచారం వినియోగదారులకు అందించ బడుతుంది.దీనిలో స్మార్ట్-కార్ట్సాంకేతికత మరియు రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ టెక్నాలజీవాడబడుతున్నాయి. ప్రిన్స్టన్ పరిశోధకుని ద్వారా తెలియ చేయబడిన చీమ కదలిక నమూనా సూపర్ మర్ర్కెట్లకు అనుకూలంగా ఉంది.ఎందుకంటే "ప్రజలకు డిస్కౌంట్ ఇవ్వనవసరం లేద్కుండా అమ్మకాలు పెంచవచ్చు."పెద్ద స్థాయి చిల్లర వర్తకులైన యునైటెడ్ స్టేట్స్.కి చెందిన వాల్ల్మర్ట్-బ్రిటన్ కి చెందిన Tesco ఈవిధానాన్ని 2007 వసంత ఋతువు లో పరీక్షించుటకు ప్రణాళిక రచించాయి.

విక్రయం అనేది వ్యాపార ఉత్పత్తుల అభివృద్ధికి మరియు వ్యాపార అభివృద్ధికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

ఇటీవలి కాలంలో 'సామాజిక ప్రభావిత శక్తి ' అనే అంశంపై జరిగిన పరిశోధనలు ఈ విధంగా సూచిస్తున్నాయి. కృత్రిమ సంగీత ప్రపంచంలో సుమారు 14,000 మంది ప్రజలు వారు పూర్వం విననటువంటి పాటలను డౌన్ లోడ్ చేసుకున్నారు.( కొలంబియా విశ్వవిద్యాలయం, న్యూయార్క్);జపాన్కు చెందిన నిత్యావసర వస్తువుల దుకాణ శ్రేణి తన ఉత్పత్తులను "విభాగ స్టోర్ లు మరియు పరిశోధన కంపెనీల అమ్మకాల సంఖ్యపై ఆధార పది ఉత్పత్తి చేస్తుంది." మస్సుచుసేట్ట్స్కు చెందిన ఒక కంపెనీ తన అమ్మకాల వృద్దికి సోషల్ నెట్ వర్కింగ్ విజ్ఞానాన్ని ఉపయోగించుకొంటుంది. పెరుగుతున్నఆన్ లైన్ చిల్లర వర్తకులు సమాచారం అందించే వినియోగదారులుగా కూడా ఉన్నారు. వీరు "ఏ ఏ ఉత్పత్తులు ఒకే విధమైన ఆలోచనలు గల వినియోగదారులలో ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి" అనేది తెలియ చేస్తారు. ఉదా.అమెజాన్, ఈ బే

విక్రయంలో ప్రావీణ్యం పొందగలుగు రంగాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

సంబంధిత జాబితాలు[మార్చు]

విక్రయ వ్యాసాల విస్తృత జాబితాకొరకు విక్రయ విషయాల జాబితా చూడండి.

సూచనలు /రేఫెరెన్సెస్[మార్చు]

 1. అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్వారిచే అక్టోబర్ 2007 న అంగీకరింపబడిన విపణీకరణ నిర్వచనం: http://www.marketingpower.com/AboutAMA/Pages/DefinitionofMarketing.aspx. Archived 2010-12-27 at the Wayback Machine.
 2. Chartered Institute of Marketing, వారిచే ఇవ్వబడిన విక్రయం నిర్వచనము
 3. Paul H. Selden (1997). Sales Process Engineering: A Personal Workshop. Milwaukee, WI: ASQ Quality Press. p. 23.
 4. Advertising Research జర్నల్ వారు ప్రచురించిన "ది కాన్సెప్ట్ అఫ్ మార్కెటింగ్ మిక్స్", జూన్ 1964 PP-2-7
 5. "మార్కెటింగ్ మానేజేమంట్: వ్యూహాలు మరియు కార్యక్రమాలు", Guiltinan et al., McGraaw Hill/Irwin, 1966
 6. "In the Mix: 21 వ శతాబ్దం లో ప్రస్తుత మార్కెటింగ్ మిక్స్ లో అనుసరింపదగిన వినియోగదారు కేంద్రీకృత విధానం".Chekitan S. Dev and Don E. Schultz, మార్కెటింగ్ మానేజ్మెంట్ v.14 n.1 జనవరి/ఫిబ్రవరి 2005
 7. "Swarming the shelves: How shops can exploit people's herd mentality to increase sales?". The Economist. 2006-11-11. p. 90. Cite news requires |newspaper= (help); Check date values in: |date= (help)

బాహ్య లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=విపణీకరణ&oldid=2812811" నుండి వెలికితీశారు