విక్రాల శేషాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విక్రాల శేషాచార్యులు విద్వత్కవిగా ప్రసిద్ధి చెందినవాడు. ఇతడు ప్రకాశం జిల్లా, సింగరాయకొండ సమీపంలోని కలికివాయ గ్రామంలో 1915, జూన్ 6న జన్మించాడు. ఇతనిది పండిత వంశము. ఇతని తాత కళాత్తూరు విక్రాల రాఘవాచార్యులు కాళహస్తి ఆస్థాన పండితుడు. ఎనిమిదేళ్ళ వయసులోనే తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసి శతకత్రయాన్ని రచించాడు. ఇతని తండ్రి విక్రాల రామచంద్రారావు ముత్యాలపాడు ఆస్థానవిద్వాంసుడు. ఇతని అన్న విక్రాల రాఘవాచార్యులు కూడా ప్రముఖ జ్యోతిశ్శాస్త్ర పరిశోధకుడు. ఇతడు తన తండ్రి, అన్నల వద్ద వేదాలను, ఉపనిషత్తులను నేర్చుకున్నాడు. తరువాత తన మాతామహుడైన పర్ణశాల రాఘవాచార్యుల వద్ద వ్యాకరణ సాహిత్యాలు చదువుకున్నాడు. ఇతడు చదువుకునే సమయంలోనే అమరకోశంలో వదిలి వేసిన పదాలను శ్లోకాలను రచించి దానికి శేషనిఘంటువు అనే పేరుపెట్టి తండ్రి, మాతామహుల అభినందనపాత్రుడైనాడు. ఇతని భార్య విక్రాల శ్రీదేవమ్మ ప్రముఖ కవయిత్రి[1].

రచనలు[మార్చు]

  1. శేష నిఘంటువు
  2. సంస్కృతాంధ్ర పదార్ణవము[2]
  3. శ్రీనివాస ప్రసాదము
  4. చిత్రబంధ శ్రీనివాసము
  5. భాగవత సంగ్రహము
  6. పురాణ నీతి
  7. శ్రీ లక్ష్మీనారాయణ సుప్రభాతము

మూలాలు[మార్చు]

  1. చిలకపాటి, విజయరాఘవాచార్య (13 May 1979). "విక్రాల వంశాబ్దిసుధానిధి విద్వత్కవివర్య శ్రీమాన్ శేషాచార్య". ఆంధ్రపత్రిక ఆదివారం అనుబంధం. No. సంపుటి 66, సంచిక 41. Archived from the original on 22 జనవరి 2021. Retrieved 18 December 2017.
  2. సంస్కృతాంధ్ర పదార్ణవము ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణ 1982