విచిత్ర వీణ
విచిత్ర వీణ హిందుస్తానీ అనబడే ఉత్తర భారత సంగీత సంప్రదాయానికి సంబంధించిన తత వాద్యము (తంత్ర వాద్యము/ తీగల వాద్యము). ఇది దక్షిణ భారత సాంప్రదాయమైన కర్ణాటక సంగీతానికి సంబంధించిన చిత్ర వీణకు దగ్గరగా ఉంటుంది.[1]
ఆకారం[మార్చు]
ఈ వీణ పురాతన ఏక తంత్ర వీణకు ఆధునిక రూపం. సాధారణ సరస్వతీ వీణలో రెండు అసమానమైన తంబురలు ఉంటాయి, వాయించేటప్పుడు కుడి చెయ్యికి ఉండే తంబుర పెద్దదిగా, పైవైపుకి ఉండే తంబుర చిన్నదిగా ఉంటాయి. కానీ విచిత్ర వీణలో ఇందుకు భిన్నంగా రెండు తంబురలు సరిసమానంగా ఉంటాయి. వీణ యొక్క రెండు కొనలు నెమలి ఆకృతిలో ఉంటాయి. పటారి మూడడుగుల పొడవు ఆరు అంగుళాల వెడల్పుగా ఉంటుంది.
తంత్రాలు/తీగలు[మార్చు]
మొత్తం 22 తంత్రాలు గల ఈ వాద్యంలో, 4 ముఖ్యమైన తంత్రాలు, వాటితో పాటు మరో 5 సహాయక తంత్రాలు, వీటి కింద దిగువన గల వరుసలో మరో 13 తంత్రాలు ఉంటాయి. కుడి చేతి చూపుడు, మధ్య వేళ్ళను ఉపయోగించి ముఖ్య తంత్రాలను వాయిస్తూ చిటికెని వేలుతో కింది వరుసన గల తంత్రాలను వాయిస్తారు. రాపిడిని అరికట్టడానికి కొబ్బరి నూనెను వాడతారు.
వీణలో రకాలు[మార్చు]
- రుద్ర వీణ
- చిత్ర వీణ
- విచిత్ర వీణ
- సరస్వతీ వీణ
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-09. Retrieved 2011-07-20.
- Vichitra vina page
- Online Music Education Articles on Vichitra Veena