Jump to content

విజయకుమార్ వినాయక్ డోంగ్రే

వికీపీడియా నుండి


విజయకుమార్ వినాయక్ డోంగ్రే
2013లో న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అంతర్జాతీయ గాంధీ అవార్డును అందుకున్న డాక్టర్ విజయకుమార్ వినాయక్ డోంగ్రే
జననం1940
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తివైద్యుడు, సామాజిక కార్యకర్త
సంస్థది సొసైటీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ లెప్రసీ, ముంబై
ప్రసిద్ధిమహారాష్ట్రలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కుష్టు వ్యాధి నిర్మూలన
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం (2022)

డాక్టర్ విజయకుమార్ వినాయక్ డోంగ్రే (జననం: 1940) ముంబైకి చెందిన భారతీయ వైద్యుడు. ఆయన మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతాలతో సహా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కుష్టు వ్యాధి నిర్మూలన కోసం తన జీవితమంతా అంకితం చేశాడు. కొన్ని అంచనాల ప్రకారం, 1981లో దేశంలో సుమారు 40 లక్షల మంది కుష్టు రోగులు ఉన్నారు, కానీ విజయకుమార్ వినాయక్ డోంగ్రే, ఇతరుల ప్రయత్నాల తరువాత ఇది 83 వేలకు తగ్గింది.[1] ఆయన ముంబైలోని ది సొసైటీ ఫర్ ఎరడికేషన్ ఆఫ్ లెప్రసీకి గౌరవ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అలాగే, ఆయన అక్వర్త్ లెప్రసీ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ గా దాదాపు 35 సంవత్సరాలు, వార్ధాలోని గాంధీ మెమోరియల్ ఫౌండేషన్ లో దాదాపు 8 సంవత్సరాలు డైరెక్టర్ గా వ్యవహరించాడు.[2]

విద్యాభ్యాసం

[మార్చు]

ఆయన ఆయుర్వేద మెడిసిన్ ఫ్యాకల్టీ (జిఎఫ్ఎఎం) గ్రాడ్యుయేట్, ఎంబీబీఎస్ డిగ్రీ, పబ్లిక్ రిలేషన్స్ అండ్ అడ్వర్టైజింగ్ మేనేజ్మెంట్, మెడికో-లీగల్ సిస్టమ్స్ లో పోస్ట్-గ్రాడ్యుయేట్లు కలిగి ఉన్నాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]

కుష్టు వ్యాధి నిర్మూలన ప్రయత్నాలలో పాల్గొన్న వివిధ సంస్థలలో ఆయన అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. వీటిలో [3]

  • అధ్యక్షుడు, జాతీయ కుష్టు వ్యాధి సంస్థ (ఎన్ఎల్ఓ)
  • గౌరవ కార్యదర్శి, సొసైటీ ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ లెప్రసీ, బొంబాయి
  • సీనియర్ కన్సల్టెంట్, లీప్, అలెర్ట్-ఇండియా
  • అధ్యక్షుడు, వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ
  • అధ్యక్షుడు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లెప్రాలజిస్ట్స్ (మహారాష్ట్ర శాఖ)
  • గౌరవ కార్యదర్శి, అంతర్జాతీయ కుష్టు వ్యాధి సంఘం, పూణే
  • గౌరవ కార్యదర్శి, అక్వర్త్ లెప్రసీ హాస్పిటల్-సొసైటీ ఫర్ ఆర్ఆర్ఈ ఇన్ లెప్రసీ, ముంబై
  • గౌరవ కార్యదర్శి, హింద్ కుష్ట్ నివారణ్ సంఘ్, మహా బ్రాంచ్

ప్రచురణలు

[మార్చు]

కుష్టు వ్యాధి నిర్మూలనకు సంబంధించి ఆయన అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించాడు. తన సహచరులతో కలిసి రాసిన కొన్ని పరిశోధనా ప్రచురణలు గూగుల్ స్కాలర్ పోర్టల్లో ఉదహరించబడ్డాయి. కుష్టు వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి, ఆయన కుష్టు వ్యాధి మీద 52 బుక్లెట్లను వ్రాసి పంపిణీ చేసాడు.

అవార్డులు

[మార్చు]
  • 2022 సంవత్సరంలో, భారత ప్రభుత్వం వైద్య రంగంలో విశిష్ట సేవలకు గాను విజయ్కుమార్ వినాయక్ డోంగ్రేకు పద్మ శ్రేణిలో మూడవ అత్యున్నత పురస్కారం అయిన పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.[4] "వెటరన్ డెర్మటాలజిస్ట్ అండ్ సోషల్ వర్కర్" గా ఆయన చేసిన సేవకు ఈ అవార్డులబించింది.[5]
  • 2013 సంవత్సరానికి అంతర్జాతీయ గాంధీ అవార్డు
  • ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లెప్రాలజిస్ట్స్ (2021) ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు [6]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Prasanta Mazumdar Anuraag Singh and Harpreet Bajwa. "Padma awards: Centenarian social worker, leprosy doctor, child marriage activist among unsung heroes". The New Indian Express. Retrieved 1 March 2022.
  2. "16th February 2013: Leap team held their 100th CME seminar in the Conference Hall of the Rainbow Guesthouse". Ecumenical Sangam, Nagpur. Retrieved 2 March 2022.
  3. Indian Association of Leprologists: Seventh National CME cum Orientation Training Session 2015 (PDF). Mumbai: Indian Association of Leprologists. 2015. p. 5. Retrieved 2 March 2022.
  4. "Padma Awards 2022" (PDF). Padma Awards. Ministry of Home Affairs, Govt of India. Archived (PDF) from the original on 2022-01-25. Retrieved 11 February 2022.
  5. "Padma Awards 2022". Padma Awards. Ministry of Home Affairs, Govt of India. Archived from the original on 2022-01-29. Retrieved 11 February 2022.
  6. Souvenir of the 31 Biennial Conference of Indian Association of Leprologists, 16 -18 April, 2021 (PDF). Mumbai: Indian Association of Leprologists. p. 20. Retrieved 1 March 2022.