విజయగౌరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయగౌరి
(1955 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.యోగానంద్
కథ ఏ.ఎస్.ఏ.స్వామి
తారాగణం ఎన్.టి.రామారావు,
పద్మిని,
లలిత,
రాగిణి,
సురభి కమలాభాయి,
రేలంగి,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం విశ్వనాథన్ - రామమూర్తి,
జి.రామనాథన్
నేపథ్య గానం వాణీ జయరాం
నిర్మాణ సంస్థ కృష్ణా పిక్చర్స్
విడుదల తేదీ జూన్ 30, 1955
భాష తెలుగు

విజయగౌరి 1955 లో వచ్చిన జానపద చిత్రం. కృష్ణ పిక్చర్స్ నిర్మించగా [1] డి. యోగానంద్ దర్శకత్వం వహించాడు.[2] ఇందులో ఎన్.టి.రామారావు, పద్మిని ప్రధాన పాత్రలలో నటించారు. జి. రామనాథన్, విశ్వనాథన్ - రామమూర్తి సంగీతం అందించారు.[3]

ఈ చిత్రం మణిపుర పరిధిలో ఉన్న ఒక చిన్న రాజ్యమైన మంగళపురిలో ప్రారంభమవుతుంది. మంగళపురి యువరాజు గుణసాగర, జనదాసు పేరుతో మారువేషంలో ఎప్పుడూ చక్రవర్తి దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతూంటాడు. ఆ ప్రక్రియలో, అతను పూటకూళ్ళ యజమాని కుమార్తె గౌరీ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ప్రస్తుతం, చక్రవర్తి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించాలని ఆదేశించగా, మంగళపురి రాజు తన కుమారుడు గుణసాగరను మధ్యవర్తిగా పంపిస్తాడు. అయితే, వారి దుస్థితిని చక్రవర్తి పెడచెవిని పెడతాడు. ఇక్కడ చక్రవర్తి కుమార్తె విజయ మొదటి చూపులోనే గుణసాగరను ప్రేమిస్తుంది. పన్నులు చెల్లించడంలో రహస్యంగా వారికి సహాయపడుతుంది. విజయ ప్రేమ గురించి తెలిసి ఉండటంతో చక్రవర్తి, గుణసాగరతో తన కుమార్తె పెళ్ళి సంబంధం మాట్లాడేందుకు సేనాధిపతి వీరసింహను రాయబారిగా పంపుతాడు. ఇంతలో, వీరసింహ గౌరీ వైపు ఆకర్షితుడవుతాడు. అతడు రాకుమారిని పట్టుకోడానికి ప్రయత్నించినపుడు గుణసాగర ఆమెను రక్షిస్తాడు. ఆ పోరాటంలో, గుణసాగర తీవ్రంగా గాయపడి జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. ప్రస్తుతం, వీరసింహ తాను విజయతో జతకట్టడానికి ఇది ఉత్తమ సమయం అని భావిస్తాడు. ఆ సమయంలో, గౌరీ గుణశేఖరను చూడటానికి జిప్సీగా వస్ర్తుంది. విజయ అసూయతో ఆమెను తన మార్గం నుండి తొలగించాలని చూస్తుంది. చివరికి ఏమి జరుగుతుందన్నది మిగతా కథ

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
సం. పాట పేరు గాయకులు పొడవు
1 "అందాల సందడిలో"
2 "ఉండటానికి ఇల్లులేక"
3 "సూడి"
4 "కొసరుచు నాలోనా"
5 "శివనామ రంజని"
6 "రాగాల వేళ"
7 "ఇల్లూవాకిలి నాది"
8 "యెన్నెన్నో రోజులుగా"
9 "ప్రేమంటే ప్రమాదమా"

మూలాలు

[మార్చు]
  1. "Vijaya Gauri (Banner)". Chitr.com.[permanent dead link]
  2. "Vijaya Gauri (Direction)". Filmiclub.
  3. "Vijaya Gauri (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-06-15. Retrieved 2020-08-29.
"https://te.wikipedia.org/w/index.php?title=విజయగౌరి&oldid=4207340" నుండి వెలికితీశారు