విజయవాడ రైల్వే డివిజను
విజయవాడ రైల్వే డివిజను | |
---|---|
రిపోర్టింగ్ మార్క్ | BZA |
లొకేల్ | Andhra Pradesh, India |
ఆపరేషన్ తేదీలు | 1956 | –
మునుపటిది | Southern Railways |
ట్రాక్ గేజ్ | బ్రాడ్ గేజ్ |
మునుపటి గేజ్ | Metre |
పొడవు | 958.926 కిలోమీటర్లు (595.849 మై.) |
ప్రధానకార్యాలయం | Vijayawada |
విజయవాడ రైల్వే డివిజను | |
---|---|
లొకేల్ | ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము |
ఆపరేషన్ తేదీలు | 1888– |
మునుపటిది | దక్షిణ రైల్వే |
ట్రాక్ గేజ్ | బ్రాడ్ |
మునుపటి గేజ్ | మీటర్ |
పొడవు | 958 కి.మీ. |
ప్రధానకార్యాలయం | విజయవాడ |
జాలగూడు (వెబ్సైట్) | official website |
విజయవాడ రైల్వే డివిజను భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే (ద.మ.రై) జోన్ లో గల ఆరు డివిజన్ల (విభాగాలు) లో ఇది ఒకటి. దక్షిణ మధ్య రైల్వే యొక్క అధికారిక ప్రధాన కార్యాలయము తెలంగాణ రాష్ట్రములోని సికింద్రాబాదులో ఉండటమే కాకుండా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రముల లోని దాదాపు మొత్తం భూభాగములో తన సేవలు అందిస్తోంది. 2003 లో విజయవాడ విభాగము విభజించబడి క్రొత్తగా గుంటూరు విభాగము ఏర్పరచబడింది.[1][2][3]
అధికార పరిధి
[మార్చు]- విజయవాడ రైల్వే డివిజను పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము పరిధిలో ఉండటమే కాకుండా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాల ప్రజలకు సేవలు అందిస్తోంది.
- ప్రతిరోజూ సుమారు 78 ఎక్స్ప్రెస్ రైళ్ళు, రోజువారీ కాని 35 ఎక్స్ప్రెస్ బండ్లు, 129 ప్యాసింజర్ రైళ్ళు, రోజువారీ కాని సగటున 15 ప్యాసింజర్ బండ్లు, రోజువారీగా 02 వర్క్మెన్ స్పెషల్ రైళ్ళు, 02 రైల్ బస్సులు, 155 సరుకు రవాణా రైలు బండ్లు ఈ రైల్వే డివిజను ద్వారా సేవలు పొందుతున్నాయి.
రైలు మార్గము
[మార్చు]- ఈ క్రింద విధముగా డివిజను పరిధిలోని వివిధ రైలు మార్గము సేవల వివరములు:
రైలు మార్గము | దూరము/కి.మీ. | డబుల్ లైన్/సింగిల్ లైన్ | విద్యుత్తు (ట్రాక్షన్) /డీజిల్ |
---|---|---|---|
విజయవాడ జంక్షన్ - గూడూరు | 294 | డబుల్ | విద్యుత్తు |
విజయవాడ జంక్షన్ - తాడి | 323 | డబుల్ | విద్యుత్తు |
విజయవాడ జంక్షన్ - కొండపల్లి | 62 | డబుల్ | విద్యుత్తు |
విజయవాడ జంక్షన్ వద్ద సరుకు రవాణాలు | 21 | సింగిల్ | విద్యుత్తు |
కాకినాడ - సామర్లకోట | 15 | డబుల్ | విద్యుత్తు |
కాకినాడ - కోటిపల్లి | 47 | సింగిల్ | డీజిల్ |
గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషను - నిడదవోలు | 111 | సింగిల్ | డీజిల్ |
గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషను - మచిలీపట్నం రైల్వే స్టేషను | 34 | సింగిల్ | డీజిల్ |
భీమవరం - నర్సాపూర్ | 32 | సింగిల్ | డీజిల్ |
వెంకటాచలం రైల్వే స్టేషను - కృష్ణపట్నం | 19 | సింగిల్ | డీజిల్ |
మెత్తము | 958 | 693 కి.మీ. డబుల్ లైన్ | 715 కి.మీ. విద్యుత్తు (ట్రాక్షన్) లైన్ |
స్టేషను వర్గం
[మార్చు]స్టేషను వర్గం | స్టేషన్లు నం. | స్టేషన్లు పేర్లు | |||
---|---|---|---|---|---|
A-1 వర్గం | 1 | విజయవాడ జంక్షన్ | |||
A వర్గం | 14 | అనకాపల్లి, భీమవరం టౌన్, చీరాల, ఏలూరు, గూడూరు, కాకినాడ పోర్ట్, కాకినాడ టౌన్, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సామర్లకోట, తాడేపల్లిగూడెం, తెనాలి , తుని. | |||
B వర్గం | 10 | అన్నవరం, బాపట్ల, భీమవరం జంక్షన్, గుడివాడ, కావలి, మచిలీపట్నం, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, తణుకు, . | D వర్గం | 13 | ఆకివీడు, అనపర్తి, ద్వారపూడి, ఎలమంచిలి, కైకలూరు, కొవ్వూరు, నర్సీపట్నం రోడ్, నిడుబ్రోలు, పెడన, పిఠాపురం, పవర్‌పేట, శింగరాయకొండ, వేదాయపాలెం. |
E వర్గం | 69 | - | |||
F వర్గం | 53 | - | |||
మొత్తం | 161 | - | |||
కోచింగ్ ట్రాఫిక్ నిర్వహించడానికి లేని స్టేషన్స్ | 5 | గుణదల, కృష్ణపట్నం, నిడిగుంటపాలెం, సర్పవరం, వెంకటాచలం రోడ్. |
అనుసంధానము
[మార్చు]విజయవాడ విభాగము, దక్షిణ మధ్య రైల్వేయందలి ఇతర విభాగములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.
- కృష్ణా కెనాల్ జంక్షన్ యొద్ద గుంటూరు విభాగముతో
- తెనాలి జంక్షన్ యొద్ద గుంటూరు విభాగముతో
- కొండపల్లి యొద్ద సికింద్రాబాద్ విభాగముతో
- గూడురు జంక్షన్ యొద్ద గుంతకల్లు విభాగముతో
విజయవాడ విభాగము, భారతీయ రైల్వేల ఇతర మండలములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.
- దువ్వాడ యొద్ద తూర్పు కోస్తా రైల్వే యొక్క వాల్తేరు విభాగముతో
- గూడూరు జంక్షన్ యొద్ద దక్షిణ రైల్వే యొక్క చెన్నై విభాగముతో
ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ( పిఆర్‌ఎస్ )
[మార్చు]విజయవాడ రైల్వే డివిజను పరిధిలో ప్రత్యేక కంప్యూటరీకరణ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ( పిఆర్‌ఎస్), పోస్టాఫీసుల్లో, e-సేవా కేంద్రములలోనే కాకుండా అదనపు ప్రాంతములలో కూడా ఈ సౌకర్యము కలిగి ఉంది.[4].
ఇవి కూడా చూడండి
[మార్చు]- అంతర్జాలంలో దక్షిణ మధ్య రైల్వే
- అంతర్జాలంలో విజయవాడ రైల్వే డివిజను
- గుంటూరు రైల్వే డివిజను
- నాందేడ్ రైల్వే డివిజను
- భారతీయ రైల్వేలు డివిజన్లు
- విజయవాడ
సూచనలు
[మార్చు]- ↑ "scrailway". Retrieved 2014-05-08.
- ↑ "Rich in resources yet backward". The Hindu. Chennai, India. Archived from the original on 2013-11-12. Retrieved 2015-11-22.
- ↑ "Divisional Railway Manager". Archived from the original on 2014-05-09. Retrieved 2014-05-08.
- ↑ (ప్రదేశాలు) స్థానాలు జాబితా ఇక్కడ చూడండి