విజయ్ టెండూల్కర్
విజయ్ టెండూల్కర్ | |
---|---|
జననం | విజయ్ ధోండోపాంట్ టెండూల్కర్ 1928 జనవరి 6 |
మరణం | 2008 మే 19 | (వయసు 80)
జాతీయత | భారతీయుడు |
పురస్కారాలు | పద్మ భూషణ్: 1984 సంగీత నాటక్ అకాడమీ ఫెలోషిప్: 1998 ఉత్తమ స్క్రీన్ ప్లే జాతీయ చలనచిత్ర పురస్కారం - మంథన్, 1977 |
విజయ్ ధోండోపాంట్ టెండూల్కర్ (6 జనవరి 1928 - 19 మే 2008), భారతీయ నాటక రచయిత, సినిమా, టివి రచయిత, వ్యాసకర్త, రాజకీయ పాత్రికేయుడు. శాంతాతా కోర్టు చాలూ ఆహే (1967), ఘాశీరాం కొత్వాల్ (1972), సఖారాం బైండర్ (1972) వంటి నాటకాలతో మంచి పేరు సంపాదించాడు. టెండూల్కర్ రాసిన అనేక నాటకాలు నిజ జీవిత సంఘటనలు లేదా సామాజిక తిరుగుబాట్ల నుండి ప్రేరణ పొందినయై, కఠినమైన వాస్తవాలపై స్పష్టమైన ధోరణిలో ఉంటాయి. అమెరికా విశ్వవిద్యాలయాలలో "నాటక రచన" కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఆయన మెళకువలను అందించాడు. టెండూల్కర్ మహారాష్ట్రలో ఐదు దశాబ్దాలపాటు అత్యంత ప్రభావవంతమైన నాటక రచయితగా వెలుగొందాడు.
తొలి జీవితం
[మార్చు]టెండూల్కర్ 1928, జనవరి 6న ముంబై గిర్గావ్ ప్రాంతంలోని గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[1][2] అతని తండ్రి క్లరికల్ ఉద్యోగం చేసేవాడు, చిన్న ప్రచురణ సంస్థను కూడా నడిపాడు. ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండడంవల్ల విజయ్ రచనకు దోహదపడింది. అతను ఆరేళ్ళ వయసులోనే తన మొదటి కథను రాశాడు.
పాశ్చాత్య నాటకాలను చూస్తూ పెరిగిన టెండూల్కర్ కు నాటకాలు రాయడానికి ప్రేరణ లభించింది. పదకొండేళ్ళ వయసులో తన మొదటి నాటకం రాసి, దర్శకత్వం వహించడంతోపాటు అందులో నటించాడు.[3] 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు 1942లో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు,[4] తన చదువును విడిచిపెట్టడంతో అతని కుటుంబం, స్నేహితుల నుండి అతన్ని దూరం చేసింది. అప్పుడు రచనను ప్రారంభించాడు. ఆ సమయంలో కమ్యూనిస్ట్ సమూహమైన నబాజిబాన్ సంఘటనా కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. కమ్యూనిస్టుల త్యాగం, క్రమశిక్షణ తనకు నచ్చిందని అన్నాడు.[5]
రచనా ప్రస్థానం
[మార్చు]టెండూల్కర్ వార్తాపత్రికలతో తన రచనను ప్రారంభించాడు. అతను అప్పటికే అమ్సివర్ కో ప్రి ప్రే కర్ (నన్ను ఎవరు ప్రేమించబోతున్నారు?) అనే నాటకాన్ని రాశాడు. తన 20వ ఏట గోహస్థ (ది హౌస్‌హోల్డర్) అనే నాటకాన్ని రాశాడు. ప్రేక్షకుల నుండి పెద్దగా గుర్తింపు పొందకపోవడంతో ఇంకెప్పుడు రచనలు చేయనని శపథం చేశాడు.[6] తన శపథాన్ని ఉల్లంఘిస్తూ, 1956లో శ్రీమంత్ రాశాడు, ఇది అతనికి మంచి రచయితగా గుర్తింపునిచ్చింది.
నిషాంత్ (1974), ఆక్రోష్ (ది క్రై) (1980), అర్ధ సత్య (ది హాఫ్-ట్రూత్) (1984) సినిమాలకు టెండూల్కర్ స్క్రీన్ ప్లేలు రాశాడు.[7] హిందీలో పదకొండు సినిమాలు, మరాఠీలో ఎనిమిది సినిమాలకు పనిచేశాడు. అందులో సుమన ("కాన్ఫ్రంటేషన్") (1975), సింహాసన్ ("సింహాసనం") (1979), ఉంబర్తా ("ది థ్రెషోల్డ్") (1981) ఉన్నాయి. ఉంబర్తా భారతదేశంలో మహిళల క్రియాశీలతపై వచ్చిన సంచలనాత్మక సినిమా. జబ్బర్ పటేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్ నటించారు.
కుటుంబం
[మార్చు]ప్రశంసలు అందుకున్న కార్టూనిస్ట్, హ్యూమరిస్ట్ మంగేష్ టెండూల్కర్ ఇతనికి సోదరుడు.
మరణం
[మార్చు]మస్తీనియా గ్రావిస్ అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి ప్రభావాలతో[8] బాధపడిన టెండూల్కర్ 2008, మే 19న[9] పూణేలో మరణించాడు.
2001లో టెండూల్కర్ భార్య నిర్మల, కుమారుడు రాజా మరణించారు. కుమార్తె ప్రియా టెండూల్కర్ రొమ్ము క్యాన్సర్‌తో సుదీర్ఘకాల పోరాటం చేసి 2002లో గుండెపోటుతో మరణించింది.
రాజకీయ అభిప్రాయాలు
[మార్చు]సమాజం, రాజకీయాల గురించి టెండూల్కర్ తన నాటకాల్లో చూపించేవాడు. వామపక్ష అభిప్రాయాలు ఉన్న టెండూల్కర్ హిందూ సామాజిక సమూహాలకు వ్యతిరేకంగా, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉన్నాడు, అతని చాలా నాటకాలు బ్రాహ్మణులను చెడుగా చూపిస్తాయి.[10]
వారసత్వం
[మార్చు]ఐదు దశాబ్దాలకు పైగా తన రచనా జీవితంలో 27 పూర్తి-నిడివి నాటకాలు, 25 వన్-యాక్ట్ నాటకాలు రాశాడు. అనేక నాటకాలు మరాఠీ థియేటర్ క్లాసిక్స్ అని కూడా నిరూపించబడ్డాయి.[11] అంతేకాకుండా చాలా నాటకాలు అనేక భారతీయ భాషలలో అనువదించబడ్డాయి, ప్రదర్శించబడ్డాయి.[12]
అవార్డులు
[మార్చు]1969, 1972లలో మహారాష్ట్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకుకోవడంతోపాటు 1999లో మహారాష్ట్ర గౌరవ్ పురస్కారం అందుకున్నాడు.[2] 1970లో సంగీత నాటక్ అకాడమీ అవార్డు, 1998లో అకాడమీ అత్యున్నత పురస్కారం "జీవితకాల సహకారం", సంగీత నాటక్ అకాడమీ ఫెలోషిప్ ("రత్న సదాస్య") తో సత్కరించారు.[13] 1984లో భారత ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ అవార్డును అందుకున్నాడు.[14]
1977లో శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన మంథన్ (1976) సినిమాకు స్క్రీన్ ప్లే అందించిన టెండూల్కర్ ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. నిశాంత్, ఆక్రోష్, అర్ధ సత్య వంటి అనేక ముఖ్యమైన ఆర్ట్ సినిమాలకు స్క్రీన్ ప్లే రాశాడు.
అవార్డుల జాబితా:
- 1970: సంగీత నాటక అకాడమీ అవార్డు
- 1970: కమలాదేవి ఛటోపాధ్యాయ అవార్డు
- 1977: ఉత్తమ స్క్రీన్ ప్లే జాతీయ చలనచిత్ర పురస్కారం - మంథన్
- 1981: ఫిలింఫేర్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు - ఆక్రోష్
- 1981: ఫిల్మ్ఫేర్ ఉత్తమ కథ అవార్డు - ఆక్రోష్
- 1983: ఫిలింఫేర్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు - అర్ధ సత్య
- 1984: పద్మభూషణ్ పురస్కారం[15]
- 1993: సరస్వతి సమ్మాన్
- 1998: సంగీత నాటక్ అకాడమీ ఫెలోషిప్
- 1999: కాళిదాస్ సమ్మన్
- 2001: కథ చుడామణి అవార్డు
- 2006: ది లిటిల్ మ్యాగజైన్ సలాం అవార్డు[16]
రచనలు
[మార్చు]నవలలు
[మార్చు]- కదంబరి: ఏక్ (నవల: వన్) (1996)
- కదంబరి: డాన్ (నవల: రెండు) (2005)
చిన్న కథ సంకలనాలు
[మార్చు]- ద్వంద్వ (డ్యుయల్) (1961)
- ఫులాపాఖరే (సీతాకోకచిలుకలు) (1970)
నాటకాలు
[మార్చు]- గృహస్త (గృహస్తుడు) (1947)
- శ్రీమంత్ (ది రిచ్) (1956)
- మెనూస్ నోవాచే బెట్ ('మ్యాన్' అని పిలువబడే ఒక ద్వీపం) (1958)
- దొంగ! పోలీసు!
- బెలే మిల్టాట్ (1960)
- గిధోడే (ది రాబందులు) (1961)
- పాట్లాచీ పోరిచే లాగిన్ (విలేజ్ మేయర్ కుమార్తె వివాహం) (1965)
- శాంతతా! కోర్టు చాలు ఆహే (హిందీ: ఖోమోష్! అదాలత్ జారి హై) (నిశ్శబ్దం! కోర్టు సెషన్‌లో ఉంది) (1967)
- అజ్గర్ అని గాంధర్వా (ఎ బోయా కన్‌స్ట్రిక్టర్ అండ్ "గాంధర్వా")
- సఖారాం బైండర్ (సఖారామ్, బుక్-బైండర్) (1972)
- కమల ("కమల") (1981)
- మాడి (హిందీలో)
- కాన్యాడాన్ (గివింగ్ అవే ఎ డాటర్ ఇన్ మ్యారేజ్) (1983)
- అంజీ
- దంబాడ్విచ్ ముకబాలి (అంబుగ్లాండ్‌లో ఎన్కౌంటర్)
- ఆశి పఖారే శృతి (హిందీ: పంచి ఐస్ ఆట్ హై ) (ఈ విధంగా పక్షులను చేరుకోండి)
- కుట్టే
- సఫర్/సైకిల్‌వల్లా (ది సైక్లిస్ట్) (1991)
- ది మస్సీర్ (2001)
- పాహిజే జాటిచే (ఇది ఒకరి రక్తంలో ఉండాలి)
- జత్ హై పూచ్చో సాదుకీ (ఫకీర్ యొక్క వంశాన్ని అడగండి)
- మాజి బాహిన్ (నా సోదరి)
- ఝాల అనంత హనుమంత ("అనంతం" "హనుమంత" గా మారిపోయింది)
- ఫుట్‌పాయిరిచ్ సామ్రాట్ (కాలిబాట చక్రవర్తి)
- మిత్రాచి గోష్తా (ఎ ఫ్రెండ్స్ స్టోరీ) (2001)
- ఆనంద్ ఓవారీ (డిబి మోకాషి రాసిన నవల ఆధారంగా ఒక నాటకం)
- భు ముర్ర్రో
- భాలికా
- మీ జింకలో మీ హరలో (నేను గెలిచాను, నేను కోల్పోయాను)
- అతని ఐదవ మహిళ (ఆంగ్లం) (2004)
- బేబీ
- మితా కి కహానీ (మితా కథ)
నృత్య రూపకం
[మార్చు]- ఘాశీరాం కొత్వాల్ (ఘాశీరాం, కానిస్టేబుల్) (1972)
అనువాదాలు
[మార్చు]- మోహన్ రాకేశ్ రాసిన ఆధే అధురే (హిందీ మూలం)
- గిరీష్ కర్నాడ్ రాసిన తుగ్లక్ (కన్నడ మూలం ) పాపులర్ ప్రకాషన్ ప్రై. లిమిటెడ్.
- టేనస్సీ విలియమ్స్ ఎ స్ట్రీట్ కార్ నేమ్డ్ డిజైర్ (ఆంగ్లం మూలం)
టెండూల్కర్ ఆంగ్ల రచనలు (అందుబాటులో ఉన్నవి)
[మార్చు]- నిశ్శబ్దం! కోర్ట్ సెషన్‌లో ఉంది (మూడు కిరీటాలు). ప్రియా అదార్కర్ (అనువాదకుడు), ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్, 1979 . ISBN 0-19-560313-3.
- ఘాశీరాం కొత్వాల్, సంగం బుక్స్, 1984.
- ది చర్నింగ్, సీగల్ బుక్స్, ఇండియా, 1985.
- ది త్రెషోల్డ్ : (ఉంబార్థ - స్క్రీన్ ప్లే), షాంపా బెనర్జీ (అనువాదకుడు), సంగం బుక్స్ లిమిటెడ్, 1985.
- ఫైవ్ ప్లేస్ (వివిధ అనువాదకులు), బొంబాయి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 1992.
- ది లాస్ట్ డేస్ ఆఫ్ సర్దార్ పటేల్ అండ్ ది మైమ్ ప్లేయర్స్: టూ స్క్రీన్ ప్లేస్ న్యూఢిల్లీ, పర్మనెంట్ బ్లాక్, 2001.
- మోడరన్ ఇండియన్ డ్రామా: యాన్ ఆంథాలజీ సాహిత్య అకాడమీ, ఇండియా, 2001.
- మిత్రాచి గోష్తా: ఎ ఫ్రెండ్స్ స్టోరీ: ఎ ప్లే ఇన్ త్రీ యాక్ట్స్ గౌరీ రామ్‌నారాయణ్ (అనువాదకుడు). న్యూఢిల్లీ, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్, 2001.
- కాన్యోడాన్, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్, ఇండియా, న్యూ ఎడ్ ఎడిషన్, 2002.
- కలెక్టెడ్ ప్లేస్ ఇన్ ట్రాన్స్లేషన్ న్యూఢిల్లీ, 2003, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్. ISBN 0-19-566209-1.
- ది సైక్లిస్ట్ అండ్ హిస్ ఐదవ మహిళ: విజయ్ టెండూల్కర్ బల్వంత్ భనేజా (అనువాదకుడు) రచించిన రెండు నాటకాలు, 2006 ఆక్స్ఫర్డ్ ఇండియా పేపర్ బ్యాక్స్.
- సఖారామ్ బైందర్: కుముద్ మెహతా, శాంత గోఖలే అనువదించారు.
సినిమాలు
[మార్చు]స్క్రీన్ ప్లేలు
[మార్చు]- శాంతాత! కోర్టు చాలు ఆహే (నిశ్శబ్దం! ది కోర్ట్ ఈజ్ ఇన్ సెషన్) (1972)
- నిశాంత్ (ఎండ్ ఆఫ్ నైట్) (1975)
- సామ్నా (ఘర్షణ) (1975)
- మంథన్ (చర్నింగ్) (1976)
- సింహాసన్ (సింహాసనం) (1979)
- గెహ్రాయీ (లోతు) (1980)
- ఆక్రోష్ (క్రై ఆఫ్ ది ఊండెడ్) (1980)
- అక్రిట్ (అనూహ్య) (1981)
- ఉంబర్తా (ది థ్రెషోల్డ్) (1981)
- అర్ధ్ సత్య (హాఫ్ ట్రూత్) (1983)
- కమల (కమల) (1984)
- సర్దార్ (1993)
- యే హై చక్కడ్ బక్కడ్ బంబే బో (2003)
- ఈశ్వర్ మైమ్ కో. (ది మైమ్ ప్లేయర్స్) (2005)
మాటలు
[మార్చు]- అరవింద్ దేశాయ్ కి అజీబ్ దస్తాన్ (1978)
- 22 జూన్ 1897
మూలాలు
[మార్చు]- ↑ Bhimrao, R.S., 2015. Reconstructing Dramatics Dramaturgy in Contemporary Experimental Plays of Vijay Tendulkar Satish Alekar and Mahesh Elkunchwar
- ↑ 2.0 2.1 "Marathi playwright Vijay Tendulkar dies". IBN Live. Archived from the original on 27 December 2013. Retrieved 19 May 2021.
- ↑ "Vijay Tendulkar profile at indiaclub". Archived from the original on 2012-02-07. Retrieved 2021-05-19.
- ↑ The Frontline Archived 20 ఫిబ్రవరి 2012 at the Wayback Machine, Dec. 2005
- ↑ "Vijay Tendulkar: Indian theatre's only complete philosopher". India Today (in ఇంగ్లీష్). Retrieved 19 May 2021.
- ↑ The Hindu Archived 2009-08-25 at the Wayback Machine, 2 February 2003
- ↑ "Ashis Nandy on Violence in Vijay Tendulkar's works". Archived from the original on 2008-04-05. Retrieved 2021-05-19.
- ↑ "Vijay Tendulkar, voice of social stage, is dead". The Telegraph. 20 May 2008. Retrieved 24 May 2008.
- ↑ "Playwright Vijay Tendulkar passes away". NDTV.com. 19 May 2008. Retrieved 19 May 2021.[permanent dead link]
- ↑ "Treatment of Political Issues in The Plays of Vijay Tendulkar".
- ↑ "Profile at Oxford University Press". Archived from the original on 2012-03-01. Retrieved 2021-05-19.
- ↑ The Indian Express, 20 October 1999 Archived 1 డిసెంబరు 2008 at the Wayback Machine
- ↑ Sangeet Natak Akademi Award Archived 23 నవంబరు 2007 at the Wayback Machine
- ↑ "Padma Awards Directory (1954-2013)" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on 15 November 2014.
1984: 16: Shri Vijay Dhondopant Tendulkar
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved 19 May 2021.
- ↑ The Little Magazine - Salam and New Writing Awards
మరిన్ని
[మార్చు]- విజయ్ టెండూల్కర్. న్యూఢిల్లీ, కథ, 2001 . ISBN 81-87649-17-8
- విజయ్ టెండూల్కర్ ఘాశీరాం కొత్వాల్: రీడర్స్ కంపానియన్. ఎం. శరత్ బాబు, ఆసియా బుక్ క్లబ్, 2003. ISBN 81-7851-008-1
- విజయ్ టెండూల్కర్ ఘాశీరాం కొత్వాల్: క్రిటికల్ పెర్స్పెక్టివ్స్, వినోద్ బాల శర్మ, ఎం. శరత్ బాబు. 2005, ప్రెస్టీజ్ బుక్స్, న్యూఢిల్లీ. ISBN 81-7851-002-2
- విజయ్ టెండూల్కర్స్ ప్లేస్: యాన్ ఆంథాలజీ ఆఫ్ రీసెంట్ క్రిటిసిజం. వియం మాడ్జ్, 2007, పెన్క్రాఫ్ట్ ఇంటర్నేషనల్5. ISBN 81-85753-79-2
- విజయ్ టెండూల్కర్, ది ఇండియన్ ఎక్స్ప్రెస్, 20 అక్టోబర్ 1999 తో ఇంటర్వ్యూ
- మరణశిక్షపై విజయ్ టెండూల్కర్ వ్యాఖ్యలు, 2004 Archived 2007-10-20 at the Wayback Machine
- తన నాటకాలపై విజయ్ టెండూల్కర్ స్పందన Archived 2011-04-16 at the Wayback Machine
- విజయ్ టెండూల్కర్ నాటకాలపై జబ్బర్ పటేల్ స్పందన