విజయ్ దేశ్‌ముఖ్
| విజయ్ దేశ్‌ముఖ్ | |||
| పదవీ కాలం 2019 జూలై 8 – 2019 నవంబర్ 8 | |||
| పదవీ కాలం 2014 డిసెంబర్ 5 – 2016 జూలై 8 | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2004 | |||
| ముందు | విశ్వనాథ్ చకోటే | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | షోలాపూర్ సిటీ నార్త్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1956 అక్టోబరు 21 షోలాపూర్, మహారాష్ట్ర, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | సిద్ధరామప్ప దేశ్ముఖ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
విజయ్ సిద్ధరామప్ప దేశ్‌ముఖ్ (జననం 1956 అక్టోబరు 21) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన షోలాపూర్ సిటీ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో ప్రజారోగ్య, రవాణా, కార్మిక, జౌళి & ఎక్సైజ్ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]విజయ్ దేశ్‌ముఖ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షోలాపూర్ సిటీ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి చాకోటే విశ్వనాథ్ బాబూరావుపై 7,273 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2009 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి కోతే మహేశ్ విష్ణుపంత్‌పై 10,090 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
విజయ్ దేశ్‌ముఖ్ 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షోలాపూర్ సిటీ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్సీపీ అభ్యర్థి మహేష్ చంద్రకాంత్ గడేకర్‌పై 68,878 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వంచిత్ బహుజన్ అఘాడి అభ్యర్థి ఆనంద్ బాబూరావు చందన్‌శివేపై 73,068 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[5] దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో ప్రజారోగ్య, రవాణా, కార్మిక, జౌళి & ఎక్సైజ్ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.
విజయ్ దేశ్‌ముఖ్ 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షోలాపూర్ సిటీ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్సీపీ - ఎస్పీ అభ్యర్థి మహేష్ విష్ణుపంత్ కోతేపై 54,583 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. the original (PDF) నుండి 22 November 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 February 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). the original నుండి 20 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 November 2022.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Solapur City North" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. the original నుండి 14 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 January 2025.
- ↑ "Solapur City North Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. the original నుండి 14 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 January 2025.